డమ్ డమ్ లోక్‌సభ స్థానం. పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్‌తో కలిసి లెఫ్ట్ విజయం సాధించగలిగే సీట్లలో ఒకటి. ఒకప్పుడు సీపీఎం కంచుకోట. దాన్ని తిరిగి చేజిక్కించుకోవాలని సీపీఎం పోరాడుతోంది. ఇది తృణమూల్ సిట్టింగ్ స్థానం. ఇక్కడ తమ ఓటు బ్యాంకుకు గండి పడకుండా కాపాడుకోవడానికి టీఎంసీ తిప్పలు పడుతోంది. ఒకసారి గెలుపొందిన ఈ స్థానంలో మళ్లీ పాగా వేయాలని బీజేపీ ప్రయతి్నస్తోంది. దాంతో డమ్ డమ్‌లో త్రిముఖ పోటీ నెలకొంది...
కోల్‌కతా సమీపంలో ఉండే డమ్ డమ్ లోక్‌సభ స్థానానికి పశి్చమ బెంగాల్‌లో చారిత్రక ప్రాధాన్యముంది. 1783లో బ్రిటిష్ ప్రభుత్వం ఇక్కడ సైనిక కంటోన్మెంట్, మిలిటరీ బ్యారక్‌లు నిర్మించింది. 1846లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ స్థాపించింది. 1857 సిపాయిల తిరుగుబాటు సందర్భంగా బ్రిటిష్ సైన్యంపై తిరుగుబాటు చేసిన మంగళ్ పాండేకు మరణశిక్ష విధించింది కూడా డమ్ డమ్ కంటోన్మెంట్‌లోనే. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని డమ్ డమ్ బంగ్లాదేశ్‌కు దగ్గరగా ఉంటుంది. స్వాతంత్య్రం వచ్చినప్పుడు, బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో హిందూ శరణార్థులు ఇక్కడ భారీగా స్థిరపడ్డారు.
పట్టణ జనాభా అధికం...
డమ్ డమ్ లోక్‌సభ స్థానానికి 1977లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. 20 ఏళ్ల పాటు ఈ స్థానం సీపీఎం గుప్పెట్లోనే కొనసాగింది. 1998లో తొలిసారిగా బీజేపీకి చెందిన తపన్ సిక్దర్ విజయం సాధించారు. 1999లో ఈ స్థానాన్ని నిలుపుకున్నారు. అనంతరం మూడుసార్లు టీఎంసీ నుంచి సౌగతా రాయ్ విజయం సాధించారు. డమ్ డమ్ లోక్‌సభ నియోజకవర్గం మొత్తం జనాభా 21,84,460. ఇందులో 98.43 శాతం పట్టణ జనాభాయే. దీని పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలూ టీఎంసీ ఖాతాలోనే ఉండటం ఆ పారీ్టకి కలిసొచ్చే అంశం.
ప్రతి ఐదు ఓట్లలో ఒకటి...
డమ్ డమ్‌లో తృణమూల్ నుంచి సిట్టింగ్ ఎంపీ సౌగతా రాయ్, సీపీఎం నుంచి సుజన్ చక్రవర్తి, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే శిల్పద్రా దత్తా బరిలో ఉన్నారు. శిల్పద్రా 2020లో తృణమూల్‌కు రాజీనామా చేసి కాషాయ పారీ్టలో చేరారు. మమతా వ్యతిరేక ఓటర్లు వామపక్షాల వైపు మొగ్గితే కాంగ్రెస్ మద్దతుతో సుజన్ గెలవడం సాధ్యమని విశ్లేషకులు అంటున్నారు. అయితే సీపీఎం కేవలం బీజేపీకి ఓట్లను ఆకర్షించగలదే తప్ప తమనేమీ
చేయలేదని టీఎంసీ ధీమాతో ఉంది. సీపీఎం ఓట్లు గతం కంటే పెరిగే అవకాశముందని, ఇది బీజేపీ అవకాశాలను దెబ్బతీస్తుందని రాజకీయ విశ్లేషకులు
చెబుతున్నారు.
‘వలస’ ఓట్లపై సీఏఏ ప్రభావం...
బంగ్లాదేశ్ నుంచి వలస వచి్చన వారు డమ్ డమ్‌లో అధిక సంఖ్యలో ఉంటున్నారు. పౌరసత్వ (సవరణ) చట్టం అమలు వివాదం వారిపై ప్రభావం చూపేలా ఉంది. ‘‘దీంతోపాటు అయోధ్య రామమందిర నిర్మాణం కూడా హిందూ ఓట్లను ఏకీకృతం చేస్తుంది. కనుక బీజేపీ గెలుపు ఖాయం’’ అని శిల్పద్రా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రంలో ప్రధానంగా కని్పంచే డమ్ డమ్ ఇప్పుడు ఆ ప్రత్యేకతను కోల్పోయిందని స్థానికులు వాపోతున్నారు. తాగునీటి సంక్షోభం అధికార తృణమూల్‌కు నష్టం చేయడం ఖాయమని చెబుతున్నారు. ఇక్కడ జూన్ 1న ఏడో విడతలో పోలింగ్ జరగనుంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment