ఝార్‌గ్రామ్ నుంచి పోటీ చేస్తున్న సోనామణి
బెంగాల్–జార్ఖండ్ సరిహద్దుల్లోని గిరిజన గ్రామాలు. అక్షరాస్యత అంతంతే. మహిళల రుతు సమస్యలపై చర్చ కూడా నిషిద్ధమే. దాన్ని బ్రేక్ చేశారామె. సమస్యపై మహిళలకు అవగాహన కల్పించడమే గాక శానిటరీ న్యాప్‌కిన్ల వాడకం నేర్పించారు. జార్ఖండ్–బెంగాల్ సరిహద్దుల్లో ప్యాడ్ ఉమన్‌గా పేరొందారు. పశ్చిమ బెంగాల్లో శనివారం పోలింగ్ జరగనున్న ఝార్‌గ్రామ్ లోక్‌సభ స్థానం నుంచి సీపీఎం అభ్యరి్థగా పోటీ చేస్తున్నారు. ఆమే జార్ఖండ్ మట్టి బిడ్డ, బెంగాల్ కోడలు సోనామణి ముర్ము...
సోనామణి జార్ఖండ్‌లోని తూర్పు సింగ్‌భూమ్ జిల్లా కొడియాలో జని్మంచారు. జంషెడ్‌పూర్‌లో సైకాలజీలో పీజీ చేశారు. నిరక్షరాస్యతకు అమాయకత్వం తోడవటంతో స్థానిక మహిళల్లో అనేక ఆరోగ్య సమస్యలు. టీనేజ్ అమ్మాయిలతో మొదలు పెట్టిన మహిళలందరికీ రుతుక్రమ సమస్యలపై అవగాహన కలి్పంచారు. పెళ్లికి ముందు స్థానిక పంచాయతీ ఎన్నికల్లో గెలిచి ప్రధాన్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2016లో బెంగాల్‌లోని బంద్వాన్ నివాసి మనీష్ తుడును పెళ్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో సీపీఎం అభ్యరి్థగా విజయం సాధించారు. ఇప్పుడు ఏకంగా లోక్‌సభ బరిలో నిలిచారు.
దీదీ, మోదీలతో విసిగిపోయారు..
ఝార్‌గ్రామ్ ఒకప్పుడు సీపీఎం కంచుకోట. జంగల్‌మహల్‌లో మావోయిస్టుల హింస తరువాత తృణమూల్ అధికారంలోకి వచి్చంది. ఎర్రకోట పచ్చగా మారింది. సీపీఎం కార్యకర్తలు ఇళ్లు వీడాల్సి వచి్చంది. గత లోక్‌సభలో అక్కడ బీజేపీ గెలిచింది. ఈసారి మాత్రం లాల్ జెండా ఎగరడం ఖాయమంటున్నారు గిరిజన బిడ్డ సోనామణి. ‘‘దీదీ, మోదీ చిత్రహింసలతో జనం విసిగిపోయారు. అందుకే ఎర్రజెండాను కోరుతున్నారు. ఝార్‌గ్రామ్‌లో పేదరికం ఎక్కువ. రెండు పూటలా కడుపునిండా తిండి దొరకని స్థితి. ఉపాధి లేదు. ఉపాధి హామీ పనులూ లేవు. సాగుపైనే ఆధారపడే అటవీ ప్రాంతాల ప్రజలకు ఎరువులు, విత్తనాల ధరలు అందుబాటులో లేవు. పాఠశాలల పరిస్థితి అధ్వానం. చదువుకున్నవారికి ఉద్యోగాలు లేవు. ఈ పరిస్థితిని మారుస్తా’’ అంటూ ఇంటింటికీ ప్రచారం చేసి ఆకట్టుకున్నారామె.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment