ఉప ఎన్నిక బందోబస్తుపై ఎస్పీ సమీక్ష
Published Tue, Jul 4 2017 10:45 PM | Last Updated on Tue, Aug 14 2018 2:50 PM
నంద్యాల: ఉప ఎన్నిక నిర్వహణలో బందోబస్తుపై ఎస్పీ గోపినాథ్‌జట్టి మంగళవారం పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలోని పరిస్థితులు, రౌడీషీటర్ల కదలికలపై అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించి నంద్యాల డీఎస్పీ హరినాథరెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశానికి మీడియాను అనుమతించలేదు. ఆళ్లగడ్డ డీఎస్పీ, సీఐలు గుణశేఖర్‌బాబు, మురళీధర్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్, ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
Advertisement
Advertisement