SP Gopinath Jetty
-
హోంగార్డుల సంక్షేమానికి కృషి
కర్నూలు : హోంగార్డుల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు ఎస్పీ గోపీనాథ్ జట్టి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం హోంగార్డుల సంక్షేమానికి చేపట్టిన సంక్షేమ పథకాల పత్రాలను శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోంగార్డుల సమస్యల పరిష్కారానికి తన వంతు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. హోంగార్డుల సంక్షేమ పథకాల పత్రాన్ని ప్యాకెట్ డైరీగా ఉంచుకోవాలని, ప్రభుత్వ పథకాల గురించి తమ కుటుంబాలకు కూడా తెలియజేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన, చంద్రన్న బీమా పథకం, వ్యక్తిగత ప్రమాద బీమా, మెడి క్లెయిమ్ పాలసీ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన తదితర పథకాల గురించి వివరించారు. హోంగార్డులు తమ పిల్లలను బాగా చదివించాలని సూచించారు. కార్యక్రమంలో సదరన్ రీజియన్ హోంగార్డ్స్ కమాండెంట్ ఎన్.చంద్రమౌళి, డీఎస్పీలు బాబుప్రసాద్, సి.ఎం.గంగయ్య, లక్ష్మినారాయణరెడ్డి, సీఐ పవన్‌కిషోర్, ఈ–కాప్స్ ఇన్చార్జ్ రాఘవరెడ్డి పాల్గొన్నారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం.. కర్నూలు హోంగార్డు యూనిట్లో పనిచేస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డు యల్లప్ప కుటుంబానికి వెల్ఫేర్ ఫండ్ చెక్కును ఎస్పీ అందజేశారు. యల్లప్ప భార్య శకుంతలను శనివారం ఎస్పీ తన కార్యాలయానికి పిలిపించి రూ.10 వేల చెక్కు ఇచ్చారు. వారి కుటుంబంలో ఒకరికి త్వరలో ఉద్యోగ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో హోంగార్డ్స్ కమాండెంట్ చంద్రమౌళి, హోంగార్డు డీఎస్పీ లక్ష్మీనారాయణరెడ్డి పాల్గొన్నారు. -
శాంతి భద్రతలపై కఠినంగా వ్యవహరించండి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ గోపీనాథ్‌జట్టీ పోలీసులకు సూచించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయం నంచి అన్ని సబ్ డివిజన్ల పరిధిలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమస్యలు ఉన్నచోట 30 పోలీసు యాక్టు, 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. ప్రతి సబ్ డివిజన్ పరిధిలో ఎలక్షన్ సెల్ ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలన్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో నేరస్తులు చెలరేగిపోయే అవకాశం ఉందన్నారు. అలాంటి వారిని ఉక్కుపాదంతో అణచివేయాలన్నారు. ఇంటర్ పరీక్షా కేంద్రాల దగ్గర ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలన్నారు. మహిళలు, చిన్నపిల్లలపై నేరాలు జరగకుండా చూడాలన్నారు. బాల నేరస్తులైన వారి ఆలోచన విధానాలను మార్చేలా చూడాలన్నారు. ఈ చలనాలో రెండు సార్లు పట్టుబడిన వారు జిల్లాలో 650 మంది ఉన్నారని, వారి డ్రైవింగ్ లైసెన్సును రద్దు చేయాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లలో పట్టుబడిన వారిలో మార్పు వచ్చేలా చూడాలన్నారు. జాతీయ రహదారులకు అనుకొని ఉన్న పోలీసు స్టేషన్ల పరిధిలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పట్టణాలు, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు పి.షేక్షావలి, ఐ.వెంకటేష్, ఓఎస్డీ రవిప్రకాష్, డీఎస్పీలు ఖాదర్‌బాషా, వెంకటాద్రి, హుస్సేన్ పీరా, నజీముద్దీన్, సీఐలు దివాకర్‌రెడ్డి, షరీఫ్ ఉద్దీన్ పాల్గొన్నారు. -
నంద్యాల, ఆదోనిలో మహిళా పోలీస్స్టేషన్లు
– జిల్లాలో 4600 కేసులు పెండింగ్ – చోరీ కేసుల రికవరీకి ప్రత్యేక బృందాలు – సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి – జిల్లా ఎస్పీ గోపినాథ్ జట్టి వెల్లడి కోవెలకుంట్ల: జిల్లాలోని నంద్యాల, ఆదోని పట్టణాల్లో మహిళా పోలీస్స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపనున్నట్లు జిల్లా ఎస్పీ గోపినాథ్ జట్టి చెప్పారు. సోమవారం సాయంత్రం స్థానిక సర్కిల్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ స్టేషన్లకు వచ్చే మహిళా కేసుల ఆధారంగా మహిళా పోలీస్స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 4600 కేసుల పెండింగ్‌లో ఉండగా వీటిలో 300 మిస్సింగ్ కేసులు ఉన్నాయన్నారు. మూడు నెలల వ్యవధిలో ఈ కేసులను పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించనున్నట్లు వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న చోరీ కేసుల్లో పురోగతి సాధించేందుకు సబ్ డివిజన్ స్థాయిలో ప్రత్యేక బృందాలుఏర్పాటు చేస్తామన్నారు. ఇటీవల కాలంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, వీటిలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారు ప్రమాదాలకు గురి అవుతున్నారన్నారు. అవగాహన కల్పించడంతో పాటు విస్తృత తనిఖీలు నిర్వహించి మద్యం సేవించి వాహనాలు నడిపే వ్యక్తులపట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మండల స్థాయిలో ఒక్కో ఎస్ఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలను దాతల సహకారంతో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. రాత్రి బసలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఆళ్లగడ్డ డీఎస్పీ ఈశ్వరరెడ్డి, కోవెలకుంట్ల సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ శ్రీధర్ పాల్గొన్నారు. -
ఉప ఎన్నిక బందోబస్తుపై ఎస్పీ సమీక్ష
నంద్యాల: ఉప ఎన్నిక నిర్వహణలో బందోబస్తుపై ఎస్పీ గోపినాథ్‌జట్టి మంగళవారం పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలోని పరిస్థితులు, రౌడీషీటర్ల కదలికలపై అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించి నంద్యాల డీఎస్పీ హరినాథరెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశానికి మీడియాను అనుమతించలేదు. ఆళ్లగడ్డ డీఎస్పీ, సీఐలు గుణశేఖర్‌బాబు, మురళీధర్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్, ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
లెక్చరర్‌పై యాసిడ్ దాడి కేసులో..
తిరుపతి క్రైం : కాలూరు క్రాస్ వద్ద గత నెల 15న పీలేరులోని ప్రభుత్వ కళాశాలలో హిందీ లెక్చరర్‌గా పని చేస్తున్న ఎస్.జరీనాబేగంపై యాసిడ్ దాడికి పాల్పడిన ఆమె మాజీ భర్త, అతని స్నేహితున్ని శుక్రవారం ఎంఆర్ పల్లి పోలీసులు ఆర్టీసీ బస్టాండులో అదుపులోకి తీసుకున్నారు. అర్బన్ జిల్లా ఎస్పీ గోపినాథ్‌జెట్టి ఎదుట నిందితుల్ని హాజరు పర్చారు. అర్బన్ ఎస్పీ వివరాలు వెల్లడించారు. 2011లో జరీనాబేగం, తాటి తోపు సమీపంలో నివాసముంటున్న ఖాజా హుస్సేన్‌కు వివాహమైంది. వీరి మధ్య నిత్యం గొడవలు జరుగుతుండటంతో 2014లో విడాకులు(తలాక్) తీసుకున్నారు. అప్పటి నుం చి వేర్వేరుగా ఉంటున్నారు. అయితే మాజీ భర్త అయిన ఖాజా హుస్సేన్ ఈమెపై హత్యానికి పాల్పడుతూ లైంగికంగా వేధించేవాడు. దీంతో అతనిపై పీలేరులో 3, చంద్రగిరి ఈస్టు, వెస్టు పోలీసు స్టేషన్లలో ఒక్కో కేసు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె పై పగ పెంచుకున్న అతను, తన స్నేహితుడు రియాజ్‌తో కలిసి గత నెల 15న బైక్‌పై కాలూరు క్రాస్ వద్ద మాటువేసి, విధులు ముగించుకుని వస్తూ బస్సు దిగిన జరీనాబేగంపై యాసిడ్ దాడి చేసి పారిపోయారు. తీవ్ర గాయాలు పాలైన ఆమెకు ఓ కన్ను చూపు కోల్పోయిందని, ఇలాంటి దాడులకు ఎవరైనా పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని ఎస్పీ అన్నారు. మహిళలు ఈ విధమైన సమస్యలు ఎదుర్కొంటుంటే వెంటనే తమ దృష్టికి తీసుకు రావాలని, వాటిని అరికడతామని సూచించారు. నిందితులపై హత్యాయత్నం, మహిళా రక్షణ చట్టాలకు సంబంధించిన కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుల్ని పట్టుకున్న డీఎస్సీ శ్రీనివాసులు, సీఐ మధు, ఎస్ఐ ఆదినారాయణను ఎస్పీ అభినందించారు. -
పోలీస్ వలయంలో తిరుపతి నగరం
ఉప ఎన్నికల పోలింగ్‌కు పోలీసులు సిద్ధం సమస్యాత్మక ప్రాంతాలపై ఎస్పీ దృష్టి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే చర్యలే చెక్‌పోస్ట్‌ల్లో తనిఖీలు 1,800 మందితో బందోబస్తు తిరుపతి క్రైం: తిరుపతి ఉపఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అర్బన్ జిల్లా ఎస్పీ గోపీనాథ్ జెట్టీ ఆధ్వర్యంలో పోలింగ్‌కు పోలీసులు సిద్ధమయ్యారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడమే లక్ష్యంగా సాగుతున్నారు. 9 చెక్‌పోస్టులను ఏర్పాటుచేశారు. ఈ చెక్‌పోస్టుల్లో గురువారం తనిఖీలు నిర్వహించారు. అటువైపుగా వెళ్లే వాహనాలను అనుమానం ఉన్న వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఓ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటుచేశారు. ఎవ్వరైనా ఎక్కడైనా రిగ్గింగ్‌కు పాల్పడినా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు ఎదురైనా 0877-2289043 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. 103 ముఖ్యమైన ప్రాంతాలు తిరుపతి నియోజకవర్గంలో 103 ము ఖ్యమైన ప్రాంతాలను గుర్తించారు. ఇందులో 43 అతి సమస్యాత్మక ప్రాం తాలు, 28 సమస్యాత్మక ప్రాంతాలు, 34 సాధారణ ప్రాంతాలుగా గుర్తించామన్నారు. వీటికి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. గురువారం ఈ ప్రాంతాల్లో ఉన్న పోలింగ్ బూత్‌లను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి ముం దస్తు చర్యలు చేపట్టారు. భారీ భద్రత 256 పోలింగ్ కేంద్రాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్సీసీ టీమ్‌లు, స్ట్రైకింగ్ ఫోర్స్, 5పారామిలటరీ దళాలు, 34 పోలీస్ పికెట్లు, 32 రూట్ మొబైల్స్‌ను ఏర్పాటుచేశారు. తిరుపతి నగరం మొత్తం పోలీస్ వలయంలోకి తీసుకున్నారు. జిల్లాలో ఇప్పటికే మద్యం దుకాణాలు, బార్లు అన్నీ మూతపడ్డాయి. ఎవ్వరైనా మద్యం బాటిళ్లతో కనిపిస్తే ఎక్సైజ్‌శాఖ కేసులు నమోదుచేసి అదుపులోకి తీసుకుంటోంది.