సాక్షి, కర్నూలు : జిల్లాలో జరగనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై మాజీ ఎమ్మెల్సీ, వైసీపీ నేత శిల్పా చక్రపాణి రెడ్డి స్పందించారు. రాజకీయాల్లో విలువల కోసం తమ నాయకుడు వైఎస్ జగన్ ఆదేశానుసారం తాను తెలుగుదేశం పార్టీ సభ్యత్వంతోపాటు ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేశానని అన్నారు. తాను వద్దని వదిలేసిన స్థానం కోసం టీడీపీ నేతలు పోటీపడి ఏరుకుంటున్నారని చక్రపాణి రెడ్డి వ్యాఖ్యానించారు. తాను నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేశానని, రాజీనామా చేసిన పదవి కోసం మళ్లీ యుద్ధం చేయాల్సిన అవసరం లేదని అన్నారు. అందుకే స్థానిక సంస్థల ఉప ఎన్నికలో వైసీపీ పోటీ చేయడం లేదని శిల్పా స్పష్టం చేశారు.
నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయన టీడీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఈ స్థానానికి తాజాగా ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. జనవరి 21న ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్‌ను పార్టీ అభ్యర్ధిగా ప్రకటించారు. అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికపై వైఎస్‌ఆర్‌సీపీ నేతలు స్పందించారు. ప్రజాస్వామ్యం మరోమారు అపహాస్యం కావడం ఇష్టం లేని కారణంగా ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేట్లేదని తెలిపారు. విలువల కోసం తృణప్రాయంగా ఎమ్మెల్సీ పదవిని త్యజించిన తాము.. తిరిగి ఆ పదవి కోసం పోటీ చేయదలుచుకోలేదని పార్టీ నాయకులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment