silpa chakrapani reddy
-
టీడీపీ ఈవీఎం ట్యాంపరింగ్ పై శిల్పా చక్రపాణి రెడ్డి కామెంట్స్
-
పవన్ పొత్తులపై ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి కౌంటర్..
-
నీళ్లకు ఇబ్బందిగా ఉంది ఎమ్మెల్యే సార్ వెంటనే పరిష్కారం ఇచ్చిన ఎమ్మెల్యే
-
ఆత్మకూరులో గడప గడపకు మన ప్రభుత్వం
-
‘వారికి అటవీ హక్కులు కల్పించాలి’
సాక్షి, అమరావతి: చెంచు జాతిని కాపాడాలని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కోరారు. మంగళవారం శాసన సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన చెంచుల స్థితిగతులపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. శ్రీశైలం అడవుల్లో చెంచులు ఎక్కువగా నివసిస్తున్నారని తెలిపారు. వారికి అటవీ హక్కులు కల్పించి జీవనోపాధిని పెంచాలని కోరారు. జనాభా ప్రతిపాదికన చూస్తే.. చెంచు జాతి రోజు రోజుకు అంతరించిపోతోందన్నారు. వారి జీవన స్థితిగతులు మారాలంటే విద్య ఎంతో అవసరమన్నారు. అటవీప్రాంతంలో రోడ్లు, బోరు వేయాలన్నా అనుమతులు అవసరమవుతున్నాయన్నారు. ఏ పని చేయాలన్నా అటవీ అధికారులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. చెంచుల సమస్యలు పరిష్కరిస్తాం.. చెంచుల సమస్యలను పరిష్కరిస్తామని డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్ప శ్రీవాణి తెలిపారు. శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. అటవీ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఐదు అటవీ ఫలాలకు కేంద్రం మద్దతు ధర ప్రకటించిందని, మరిన్ని అటవీ ఫలాలకు మద్దతు ధర కల్పించాలని కోరామన్నారు. గిరిజనాభివృద్ధికి చెందిన భూములు ఆక్రమణకు గురికాలేదని పేర్కొన్నారు. గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ఆస్తుల వివరాలను పుష్పశ్రీవాణి వెల్లడించారు. -
కర్నూలు జిల్లా నుంచి తొలిసారి... అధ్యక్షా
సాక్షి, కర్నూలు: ఇటీవలి ఎన్నికల్లో జిల్లాలో విజయకేతనం ఎగురవేసిన 14 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నికైన తర్వాత మొదటిసారిగా నేడు అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకరు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. జిల్లా నుంచి ఎన్నికైన 14 మంది ఎమ్మెల్యేల్లో ఏకంగా ఆరుగురు మొదటిసారి సభలో అడుగుపెడుతున్నారు. గతంలో ఎమ్మెల్సీగా ఉన్న శిల్పా చక్రపాణిరెడ్డి ఎమ్మెల్యే హోదాలో మొదటిసారే అసెంబ్లీలో అడుగుపెడుతుండడం గమనార్హం. ఇక కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఏకంగా ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించి సభకు వెళుతున్నారు. మంత్రులుగా నియమితులైన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు గుమ్మనూరు జయరాం ఇద్దరూ రెండోసారి సభలో అడుగుపెడుతుండటం గమనార్హం. ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ముచ్చటగా మూడోసారి అసెంబ్లీలో గళం వినిపించనున్నారు. బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి రెండోసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జిల్లాలోని మొత్తం 14 అసెంబ్లీ సీట్లనూ గెలుచుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్‌స్వీప్ చేసింది. అసెంబ్లీలో నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న జిల్లా ఎమ్మెల్యేలంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే కావడం చరిత్రలోనే ప్రథమం. నూతన ఎమ్మెల్యేలు జిల్లా అభివృద్ధి కోసం గళం వినిపించాలని ప్రజలు కోరుతున్నారు. మొదటిసారి వీరే... జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో కొత్తగా ఎమ్మెల్యేగా (గతంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన శిల్పా చక్రపాణిరెడ్డిని కలుపుకుని) ఏకంగా ఏడుగురు ఎన్నికయ్యారు. అంటే సగం మంది మొదటిసారిగా శాసనసభలో తమ గళాన్ని వినిపించనున్నారన్నమాట. శ్రీశైలం నియోజకవర్గం నుంచి శిల్పా చక్రపాణిరెడ్డి ఎమ్మెల్యేగా మొదటిసారి ఎన్నికైనప్పటికీ గతంలో ఈయన రెండు దఫాలు ఎమ్మెల్సీగా చేశారు. ఎమ్మెల్సీ కావడంతో కేవలం శాసనమండలికే పరిమితమయ్యారు. శాసనసభలో మాత్రం మొదటిసారి అడుగుపెడుతున్నట్టే. ఇక కర్నూలు నుంచి హఫీజ్‌ఖాన్, కోడుమూరు నుంచి సుధాకర్, పత్తికొండ నుంచి శ్రీదేవి, నంద్యాల నుంచి శిల్పా రవి, ఆళ్లగడ్డ నుంచి గంగుల నాని, నందికొట్కూరు నుంచి ఆర్థర్ మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గళమెత్తండి.. జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి. కర్నూలుకు రెండో సమ్మర్ స్టోరేజీ ట్యాంకు, రక్షణగోడ నిర్మాణం, జిల్లా ఆసుపత్రి స్థాయి పెంపు, గుండ్రేవుల, వేదావతి ప్రాజెక్టుల నిర్మాణం, కేసీ కెనాల్ కింద ఆయకట్టు మొత్తానికి నీరు అందించడం, ముచ్చుమర్రి పూర్తి వంటివి ప్రధానమైనవి. ఎల్ఎల్సీ కింద కూడా చివరి ఆయకట్టు వరకూ నీరందించాల్సిన అవసరం ఉంది. జిల్లా పశ్చిమ ప్రాంతంలో వలసలు ఎక్కువగా ఉన్నాయి. తాగునీటి సమస్య కూడా అధికం. ఈ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేలు గళమెత్తాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. మొత్తం మీద ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత అసెంబ్లీలో మొదటిసారి అడుగుపెడుతున్న ఎమ్మెల్యేలందరికీ ఆల్ ద బెస్ట్! -
మోసం.. ఎమ్మెల్యే నైజం
ఆత్మకూరు: టీడీపీ నాయకుడు చంద్రబాబునాయుడు లాగే ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి ప్రజలను మోసగించడమే నైజంగా మార్చుకున్నారని వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. వెంకటాపురం గ్రామంలో గురువారం టీడీపీకి చెందిన కార్యకర్తలు శిల్పా ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుడ్డా రాజశేఖర్‌రెడ్డి వైఎస్సార్సీపీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలందరినీ మోసగించి టీడీపీకి అమ్ముడుపోయారన్నారు. ప్రతి పనిలో కమీషన్ తీసుకుంటూ అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారారని విమర్శించారు. నీరు–చెట్టు పనులే కాకుండా చివరకు పట్టణంలోని గాంధీ విగ్రహానికి ప్రహరి నిర్మిస్తే అందులోనూ కమీషన్ తీసుకున్నారన్నారు. రూ.3 లక్షలు మంజూరు చేసుకుని రూ.లక్ష మాత్రమే ఖర్చు పెట్టారని విమర్శించారు. ఇలా గాంధీ, అంబేడ్కర్ లాంటి నాయకుల పేర్లుతో కూడా నిధులు స్వాహా చేయడం ఆయనకే చెల్లుతుందనన్నారు. పొదుపు మహిళలపై వేధింపులు.. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఎమ్మెల్యే బుడ్డా పొదుపు మహిళలను సైతం వేధిస్తున్నారని శిల్పా చక్రపాణిరెడ్డి విమర్శించారు. పార్టీలకు అతీతంగా చేపట్టాల్సిన పసుపు–కుంకుమ చెక్కుల పంపిణీలో కూడా రాజకీయం చేస్తున్నారన్నారు. తనకు అనుకూలమైన గ్రూపులకు ఇచ్చుకుంటూ మిగతా మహిళలకు చెక్కులు ఇవ్వకుండా వేధిస్తున్నారని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు రోజుకో అబద్ధం ఆడుతూ ప్రజలను, చివరకు రైతులకు అందజేసే సాయంలో కూడా మోసగిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.6 వేలకు కేవలం రూ.4 వేలు మాత్రమే కలిపి ఇస్తూ రూ.10 వేలు అంటూ తప్పులు దోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ప్రజలకు మేలు జరగాలంటే వైఎస్ జగన్ సీఎం కావాలన్నారు. భారీగా వైఎస్సార్సీపీలో చేరిక.. వెంకటాపురం గ్రామంలో వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన ముల్లంగి కృష్ణారెడ్డి, గోవిందరెడ్డి, సందీప్‌రెడ్డి, మల్లికార్జునరెడ్డి , ముర్తుజా, మాబాషా, మధుసూదన్‌రెడ్డి , ప్రసాద్‌రెడ్డి , హుస్సేన్‌మియా, షేక్ మాబాషా , నూర్ అహ్మద్‌తో పాటూ 100 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరాయి. వారికి శిల్పా చక్రపాణిరెడ్డి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ శ్రీశైలం నియోజకవర్గం నాయకులు శిల్పా భువనేశ్వరరెడ్డి , వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు అంజాద్ అలీ, కుందూరు శివారెడ్డి, వి.రామచంద్రరెడ్డి, నజీర్అహ్మద్, నాగేశ్వరరెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, మాబాషా, ఎలీష, కేశవరెడ్డి పాల్గొన్నారు. -
‘బుల్ బుల్ రాజా మమ్మల్ని విమర్శించడం హాస్యాస్పదం’
సాక్షి, కర్నూలు : రాష్ట్రంలోని ప్రతి వర్గాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల పార్లమెంట్ ఇంచార్జి శిల్పా చక్రపాణి రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర ఓ చారిత్రక సంచలనం అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సమస్యలు స్వయంగా తెలుసుకున్న ఏకైక నాయకుడు వైఎస్.జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు. వైఎస్ జగన్ పాదయాత్ర ఎఫెక్ట్ చంద్రబాబుపై పడిందన్నారు. నవరత్నాల ప్రకటనతో చంద్రబాబు మతి భ్రమించిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రకటించిన రూ.రెండు వేల పెన్షన్ కేవలం ఎన్నికల ముగిసే వరకే అందిస్తారనని, అధికారం కోసమే పెన్షన్ పెంచారని ఆరోపించారు. మాటలు సరిగ్గా రాని బుల్ బుల్ రాజా బాలకృష్ణ కూడా ప్రతిపక్షాలపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన వాళ్లు బాలకృష్ణ కుటుంబంలోనే ఉన్నారని విమర్శించారు. (వైరల్: బుల్బుల్ బాలయ్య..!) తెలంగాణ ప్రజల మాదిరే ఏపీ ప్రజలు కూడా చంద్రబాబుకు రాజకీయ సమాధి చేసే సమయం దగ్గరలోనే ఉందన్నారు. గతంలో కాంగ్రెస్‌పై విమర్శలు చేసిన చంద్రబాబు మళ్లీ రాహుల్‌తోనే జతకట్టడం సిగ్గు చేటన్నారు. అసెంబ్లీలో రాజ్యాంగాన్ని గౌరవించేవాళ్లు లేనందుకే తాము సమావేశాలకు హాజరుకావడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలు, రెండు ఎంపీ స్థానాలు సాధించి రికార్డు సృష్టిస్తామని ధీమా వ్యక్తం చేశారు. -
‘టీడీపీని బొందపెట్టే రోజులు వస్తాయి’
సాక్షి, నంద్యాల : కర్నూలు జిల్లాలోని 53 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల పార్లమెంట్ ఇంచార్జి శిల్పా చక్రపాణి రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం జరగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులకు ఏం న్యాయం చేశారంటూ ప్రశ్నించారు. సిద్ధాపురం ఎత్తిపోతల పథకం నుంచి కనీసం ఒక్క ఎకరానికైనా సాగునీరు అందించారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను మభ్యపెడుతూ పబ్బం గడుపుకొంటున్న బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలను బొంద పెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చక్రపాణి రెడ్డి అన్నారు. జిల్లాలో ఓ వైపు పశువులు కాటికి వెళ్లే పరిస్థితి ఉంటే జలసిరి అంటూ హారతులు పడతారా అంటూ మండిపడ్డారు. -
గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం
శ్రీశైలం ప్రాజెక్ట్(కర్నూలు): రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆ పార్టీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మధ్యాహ్నం సున్నిపెంటలోని రెడ్ల కల్యాణ మండలంలో వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. డబ్బులకు అమ్ముడుపోయి, పార్టీలు మారే తత్త్వం తనది కాదని, ఎమ్మెల్సీ పదవిని తృణప్రాయంగా త్యాగం చేశానని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే శ్రీశైలంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలు కేటాయించి, ఇళ్లు కూడా కట్టిస్తామన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయిస్తామని హామీ ఇచ్చారు. దేవస్థానంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికుల జీతాల పెంపునకు ఈఓతో మాట్లాడానని తెలిపారు. సున్నిపెంటలో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. టీడీపీ తరహాలో శ్రీశైలం అభివృద్ధి చెందుతుందంటే అందులో తన కృషి , పట్టుదల ఉందన్నారు. ప్రజల ఇబ్బందులు కనిపించడం లేదా? శ్రీశైలం ప్రాజెక్ట్ కాలనీలో సమస్యలు తాండవిస్తున్నా.. పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని శిల్పా చక్రపాణిరెడ్డి విమర్శించారు. శాశ్వత మంచినీటి సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది లేక వైద్యం అంతంత మాత్రమే అందుతుందన్నారు. ఆయుర్వేద ఆసుపత్రి , నూతన ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. గ్రామంలో వీధి లైట్లు లేవని, ప్రధాన రహదారులు అధ్వానంగా మారాయని, కరువు పనులు లేక పేదల ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఇన్ని సమస్యలు ఉన్నా ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అప్రమత్తంగా ఉండాలి.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలోకి రావడానికి ప్రజలను మభ్య పెడుతున్నారని, నిరుద్యోగ భృతి పేరిట మోసం చేస్తున్నారని శిల్పా విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని, పార్టీ ›క్రియాశీలక కార్యకర్తలు, బూత్ కమిటీ కన్వీనర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. పార్టీ నాయకులు వట్టి వెంకటరెడ్డి, ఎమ్ఏ రజాక్, జింకా గుండయ్య యాదవ్, గవ్వల విష్ణు నారాయణ, హనుమన్న, కృష్ణమోహన్ రెడ్డి, గౌస్ మొహద్దీన్, ప్రభావతి, పార్వతి, కుమారి, శంకర స్వామి, వెంకటేశ్వర్లు, హమీర్‌బాషా, అయ్యప్ప, శేఖర్ సాహు, కొండబాబు, మల్లికార్జున, సోమేష్, మలిక్షా వలి, దాసు, డి.మల్లికార్జున , ఎస్కె ఆరీఫ్, కోదండం, చిన్న అబిబు, సుబ్బన్న, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
నిరుద్యోగుల చెవిలో పూలు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): భృతి విషయంలో నిరుద్యోగుల చెవిలో సీఎం చంద్రబాబునాయుడు పూలు పెట్టారని వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి విమర్శించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో నెలకు రెండు వేలు నిరుద్యోగ భృతి ఇస్తానని..ఇప్పుడు ఒక్క వేలు చూపుతూ రూ.1000 ఇస్తానని, దానికి ముఖ్యమంత్రి యువనేస్తం అని పేరు పెట్టుకోవడం దారుణమన్నారు. వచ్చే ఎన్నికల్లో దాచుకున్న వేలు నిరుద్యోగులు కట్ చేస్తారని హెచ్చరించారు. రాష్ట్రంలో 1.70 కోట్ల మంది నిరుద్యోగులు ఉంటే 12 లక్షల మందికే భృతి వచ్చేలా మంత్రి నారా లోకేష్‌బాబు 600 గంటలు కష్టపడి నిబంధనలను రూపొందించారన్నారు. చంద్రబాబునాయుడు..లోకేష్‌కు మాత్రమే మంత్రి పదవి ఉద్యోగాన్ని ఇచ్చారని, యువతీ, యువకులను మాత్రం మోసం చేశారని ధ్వజమెత్తారు. నిరుద్యోగ భృతి నిబంధనలు సడలించకపోతే రాష్ట్రవ్యాప్తంగా యువతీయువకులతో కలసి పోరాటాలకు పిలుపునిస్తామన్నారు. ఆ నిధులు ఎప్పుడిస్తారు? రైతు రుణమాఫీకి రూ.11,500 కోట్లు విడుదల చేయాల్సి ఉందని, అక్క చెల్లెమ్మలకు రూ. 4 వేల కోట్ల నిధులను జమ చేయాల్సి ఉందని శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. మరో ఐదారు నెలల్లో ప్రభుత్వ సమయం ముగుస్తున్న నేపథ్యంలో ఆ నిధులను ఎప్పుడు విడుదల చేస్తారని ప్రశ్నించారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్రలో 45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన వారికి పింఛన్ ఇస్తామంటే టీడీపీ నాయకులు అవహేళన చేశారని, అయితే సీఎం చంద్రబాబునాయుడు మాత్రం డప్పు కళాకారులకు, చెప్పులు కుట్టుకునే వారికి 40 ఏళ్లకే రూ.1500 పింఛన్ ఇస్తామని చెప్పడం వైఎస్ జగన్మోహన్రెడ్డి బాటలో పయనించడం కాదా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నీరు–చెట్టు పనుల్లో జరిగిన అవినీతిపై విచారణ చేయిస్తామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి 1.49 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వీటితో 720 భారీ పరిశ్రమలు, 2.27 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పడం దారుణమన్నారు. ఇలా గొప్పలు చెప్పుకుంటే పోతే కేంద్ర ప్రభుత్వం ఎందుకు ప్రత్యేక హోదాను ఇస్తుందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని, టీడీపీ నాయకులకు అవినీతి సొమ్ముతో పొట్టలు వచ్చాయన్నారు. కాపులను మోసగించిన చంద్రబాబు కాపులను బీసీల్లోకి చేరుస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి సీఎం చంద్రబాబునాయుడు మోసం చేశారని కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపి చేతులు దులుపుకున్నారని ఎద్దేశా చేశారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేసే పనులనే చెబుతారని, ఆయన మాటే గవర్నమెంట్ ఆర్డర్ అని చెప్పారు. వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్ బిల్లు కేంద్రం నుంచి తిరిగి వచ్చినా చంద్రబాబు స్పందించడం లేదన్నారు. ఏపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ఎన్నికలంటే టీడీపీకి భయం ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడుతూ..తెలుగుదేశం ప్రభుత్వానికి ఎన్నికలంటే భయం అని తేలిపోయిందన్నారు. అందులో భాగంగానే సర్పంచ్ల స్థానంలో ప్రత్యేకాధికారులను నియమించిందన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్సీపీ ఘన విజయం సాధిస్తుందన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ..ఎన్నికల్లో అడ్డగోలుగా గెలిచేందుకు వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను టీడీపీ తీసివేస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 16 లక్షల ఓటర్లను తొలగించడం దారుణమన్నారు. ప్రతి ఒక్క పౌరుడు తమ ఒటు హక్కును పొందాలని సూచించారు. కార్యక్రమంలో కోడుమూరు, కర్నూలు సమన్వకర్తలు మురళీకృష్ణ, హఫీజ్‌ఖాన్, నాయకులు తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, కర్నాటి పుల్లారెడ్డి, అబ్దుల్ రెహమాన్, పర్ల శ్రీధర్‌రెడ్డి, సత్యంయాదవ్, తోట కృష్ణారెడ్డి, ఆది మోహన్‌రెడ్డి, కరుణాకరరెడ్డి, భాస్కరరెడ్డి, ఆసిఫ్, మహేశ్వరరెడ్డి, శీను తదితరులు పాల్గొన్నారు. -
నేడు ప్రత్యేక బంద్
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం చేపట్టనున్న రాష్ట్ర బంద్‌కు జిల్లాలో సానుకూల స్పందన లభిస్తోంది. ఉద్యోగ, వ్యాపార, వాణిజ్య, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించేందుకు ముందుకు వచ్చాయి. జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలు మంగళవారం సెలవు ప్రకటించాయి. ఇదే బాటలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు కూడా నడిచే అవకాశం ఉంది. మరోవైపు పీడీఎస్‌యూ, వైఎస్‌ఆర్‌ఎస్‌యూ, ఏఐఎస్ఏ, ఎంఎస్ఎఫ్ తదితర విద్యార్థి సంఘాలు బేషరతుగా బంద్‌కు మద్దతును ప్రకటించాయి. ఏపీయూడబ్ల్యూజే, పలు బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల విద్యార్థి, యువజన, మహిళా నాయకులు బంద్‌లో పాల్గొని విజయవంతం చేసేందుకు ముందుకు వచ్చారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు బంద్‌కు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటన చేయడంతో సంపూర్ణమవుతుందని భావిస్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు కూడా బంద్‌కు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. హోదా కోసం ఎందాకైనా.. నాలుగేళ్ల టీడీపీ పాలనలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు వైఎస్సార్సీపీ నాయకులు ప్రణాళికలు రూపొందించుకున్నారు. మంగళవారం బంద్ సందర్భంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు, క్యాండిల్ లైట్ కార్యక్రమాలను చేపట్టనున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం ఎలా డ్రామాలు ఆడుతుందో.. ఐదు కోట్ల మంది ఆకాంక్షను సీఎం చంద్రబాబు నాయుడు ఎలా తాకట్టు పెట్టారో వివరించనున్నారు. డిపోలకే పరిమితం కానున్న ఆర్టీసీ బస్సులు దేశవ్యాప్త సమ్మెతో ప్రస్తుతం లారీల రాకపోకలు స్తంభించి పోయాయి. ఇప్పటికే నాలుగు రోజులుగా లారీలు రోడ్డు ఎక్కడం లేదు. ఈనేపథ్యంలో మంగళవారం రాష్ట్రబంద్ కావడంతో రహదారులపై వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించేపోయే అవకాశం ఉంది. జిల్లాలోని ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. ప్రతి ఒక్కరూ సహకరించాలి: ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం బంద్ చేపడుతున్నాం. ఇందుకు జిల్లాలోని ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఉద్యోగ, ఉపాధ్యాయులు, వ్యాపారులు..అన్ని వర్గాల ప్రజలు ముందుకు వచ్చి ప్రత్యేక హోదా కాంక్షను వినిపించాలి. హోదాతోనే రాష్ట్రానికి భవిష్యత్ ఉంటుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఉదయం 5 గంటల నుంచే బస్సుల రాకపోకలు నిలిచిపోనున్నాయి. ప్రజలు మంగళవారం ఒక్క రోజు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి. అత్యవసరం అనుకుంటే బయటకు వచ్చి ఇబ్బంది పడకూడదు. ఏపీకి సంజీవని అయిన ప్రత్యేక హోదా కోసం కొన్ని ఇబ్బందులు తలెత్తినా భవిష్యత్ తరాల కోసం సర్దుకోవాలి. బంద్‌ను సంపూర్ణవంతం చేసి హోదా సెగ ఢిల్లీకి తాకేలా నినదించాలి. -
జగన్ వస్తేనే బీసీలకు భరోసా
బండిఆత్మకూరు: వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకుంటే బీసీలకు భరోసా ఉంటుందని పార్టీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భోగోలు శివశంకర్‌నాయుడు అన్నారు. నంద్యాలలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం బండిఆత్మకూరు మండల అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వెలుగోడు, బండిఆత్మకూరు మండలాలకు చెందిన బీసీ సంఘాల నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శివశంకర్‌నాయుడు మాట్లాడుతూ బీసీల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. గత ఎన్నికల్లో వాల్మీకులను ఎస్టీలుగా, రజకులు, యాదవులను ఎస్సీ జాబితాలో చేర్చుతామని హామీ ఇచ్చి పట్టించుకోలేదని గుర్తు చేశారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో బీసీలపై కపట ప్రేమ చూపుతున్నారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో భాగంగా బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను కళ్లారా చూశారని, అందరికీ న్యాయం చేసేందుకు దృడసంకల్పంతో ఉన్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీల సమస్యలను తెలుసుకోవడానికి కమిటీలు ఏర్పాటు చేశారన్నారు. ఈ కమిటీల ప్రతినిధులు పార్లమెంట్, నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహించి సమస్యలు తెలుసుకుంటారని చెప్పారు. 15 తర్వాత బీసీ సంఘాలతో సమీక్ష.. వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 15 తర్వాత పార్లమెంట్ స్థాయిలో సమావేశం నిర్వహిస్తున్నట్లు శివశంకర్ నాయుడు తెలిపారు. ఏ చర్యలు తీసుకుంటే బీసీలకు న్యాయం జరుగుతుందో చెబితే వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సుదర్శన్, మల్లేశ్వర్, పుల్లారెడ్డి, పాలరాముడు, బాబు, తిరుపతయ్య, శివ, ఉమ్మడి శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వర్లు, గోపాల్, సంపంగి శివ తదితరులు పాల్గొన్నారు. -
ఏ ఒక్క హామీని నెరవేర్చని ఘనుడు ఆయన
సాక్షి, ఆత్మకూరు (కె) : నాలుగేళ్ల చంద్రబాబు పాలన వంచన మయమని వైఎస్సార్సీపీ నేత శిల్పాచక్రపాణి రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం ఆయన ఆత్మకూరులో మీడియాతో మాట్లాడుతూ.. ఇచ్చిన మాట తప్పడమే చంద్రబాబు నైజమని మండిపడ్డారు. రాష్ట్రంలో అవినీతి తారాస్థాయికి చేరిందని విమర్శించారు. నాలుగేళ్లలో అభివృద్ధి శూన్యమని, పాలన గాలికొదిలేసి ప్రజలను దోచుకోవడమే టీడీపీ సర్కార్ పనిగా పెట్టుకుందని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చని ఘనుడని చంద్రబాబుపై వ్యాంగ్యాస్త్రాలు సంధించారు. మోసానికి, వంచనకు మారుపేరు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. నాయీ బ్రాహ్మణుల పట్ల చంద్రబాబు వైఖరి సరికాదన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే నాయీ బ్రాహ్మణులను ఉద్యోగులుగా గుర్తిస్తామని, వారికి పార్టీ అండగా ఉంటుందని చక్రపాణి రెడ్డి చెప్పారు. ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్సీపీ ఎంపీల రాజీనామాలు చారిత్రాత్మకమని, ఎంపీలు చేసిన త్యాగం ప్రజల గుండెల్లో నిలిచిపోతాయని అన్నారు. 14 నెలల ముందు పదవులను తృణ ప్రాయంగా వదులుకున్న ఘనత తమ పార్టీ ఎంపీలదని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసుంటే కేంద్రం దిగొచ్చేదని, కానీ స్వప్రయోజనాలకోసం టీడీపీ ముందుకు రాలేదంటూ మండిపడ్డారు. శ్రీశైలం ఫిరాయింపు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, అతని అనుచరులు దోచుకోవడం, దాచుకోవడమే పనిగా పెట్టుకున్నారని శిల్పా ధ్వజమెత్తారు. నియోజకవర్గ పరిధిలో కమిషన్లు ఇస్తే కానీ పనులు జరగని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తామని అన్నారు. ప్రజలకు అండగా ఈనెల 30న అనంతపురంలో టీడీపీ వంచనపై వైఎస్సార్సీపీ గర్జన నిర్వహించనున్నట్లు శిల్పా వెల్లడించారు. అదే తీరుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో టీడీపీ సర్కార్ వంచనపై గర్జన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. -
రాష్ట్రంలో ధృతరాష్ట్ర పాలన
ఆత్మకూరు: రాష్ట్రంలో ధృతరాష్ట్రుని పాలన సాగుతోందని, ప్రజలు త్వరలోనే చరమ గీతం పాడనున్నారని వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఆత్మకూరు పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు. సంక్షేమ పథకాలన్నీ టీడీపీ కార్యకర్తలకే మంజూరు చేస్తున్నారన్నారు. అమరావతిలోని అసెంబ్లీని టీడీపీ కార్యాలయంగా మార్చారని విమర్శించారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలను ఒకవైపు మోసగిస్తూ..మరోవైపు తాము ధర్మపోరాటం చేస్తున్నామని నీతులు చెప్పడం సిగ్గు చేటన్నారు. పొదుపు మహిళలు, రైతులను రుణమాఫీ పేరుతో నిలువునా ముంచినందుకా దీక్షలు అంటూ ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు 23 మందిని సంతల్లా పశువుల్లా కొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారన్నారు. ప్రత్యేకహోదా కోసం వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామా చేస్తే అది డ్రామా అంటూ టీడీపీ వారు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలోని 25 మంది ఎంపీలనూ రాజీనామా చేయిస్తే కేంద్రం దిగి వచ్చి ప్రత్యేక హోదా ఇస్తుందని వైఎస్ జగన్మోహన్రెడ్డి చెబుతున్నా.. ముఖ్యమంత్రి స్పందించకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్రంలోని బ్రాహ్మణులను సైతం చంద్రబాబు వదలలేదని, వారిపై నిందారోపణలు చేయడం బాధాకరమని అన్నారు. చంద్రబాబు తీరుతో ప్రజలు విసిగిపోయారని, రానున్నది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. నాలుగేళ్ల పాలనలో టీడీపీ విఫలం: బీవై రామయ్య నాలుగేళ్ల పాలనలో టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు 600 హామీలిచ్చి అందులో 70 కూడా నెరవేర్చలేదన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములను టీడీపీ నాయకులు కబ్జా చేస్తున్నారని విమర్శించారు. నవనిర్మాణ దీక్షల పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలకు ఏమి మేలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు. హామీలను నెరవేర్చనందున వచ్చే ఎన్నికల్లో టీడీపీ అడ్రెస్ గల్లంతు కావడం ఖాయమన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్పయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, జిల్లాలోని 14 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో మైనార్టీలకు ఒరిగిందేమీలేదన్నారు. దుల్హన్ పథకం కింద రుణాలు అందడం లేదన్నారు. కాగా.. ఆత్మకూరు పట్టణంలోని 23 మసీదుల వద్ద ముస్లిం సోదరుల కోసం ఇఫ్తార్ విందును శిల్పా చక్రపాణిరెడ్డి ఏర్పాటు చేశారు. -
మార్క్ ఫెడ్ అధికారుల తీరుపై శిల్పాచక్రపాణి ఆగ్రహం
-
శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో గంగాహారతి
-
ఘనంగా వైఎస్సార్ గంగాహారతి
సాక్షి, కర్నూలు: ఆత్మకూరు మండలంలోని సిద్ధాపురం చెరువు వద్ద ‘వైఎస్సార్ గంగాహారతి’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజలు భారీఎత్తున తరలి వచ్చారు. 1200మంది మహిళలలు బోనాలతో వచ్చి గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంజీవ్ నగర్ తండా నుంచి మహిళలు బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా సిద్ధాపురం చెరువు వద్దకు చేరారు. అనంతరం నేరుగా కట్టమీదకు వెళ్లి తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన గంగమ్మ విగ్రహం వద్ద బోనాలను సమర్పించారు. అలాగే యాగంలో పాల్గొని దీపాలను చెరువులో వదిలారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చలువ వల్లే సిద్ధాపురం ఎత్తిపోతల పథకం పూర్తయ్యిందని, దీనివల్ల వేలాది ఎకరాల భూములు సస్యశ్యామలం కానున్నయని శిల్ప చక్రపాణిరెడ్డి తెలిపారు. ఆ మహానేతను స్మరించుకోవడానికే ‘వైఎస్సార్ గంగాహారతి’ కార్యక్రమాన్ని రైతులతో, మహిళలతో ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. -
నేడు వైఎస్సార్ గంగాహారతి
ఆత్మకూరు/ రూరల్ : ఆత్మకూరు మండలంలోని సిద్ధాపురం చెరువు వద్ద మంగళవారం ‘వైఎస్సార్ గంగాహారతి’ కార్యక్రమాన్ని భారీఎత్తున నిర్వహించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చలువ వల్లే సిద్ధాపురం ఎత్తిపోతల పథకం పూర్తయ్యింది. దీనివల్ల వేలాది ఎకరాల భూములు సస్యశ్యామలం కానున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సహకారాన్ని స్మరించుకుంటూ వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో ‘వైఎస్సార్ గంగాహారతి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆయన మూడు రోజులుగా ఆత్మకూరులోనే మకాం వేసి.. ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. అలాగే సోమవారం పార్టీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, పార్టీ నాయకులు శిల్పా కార్తీక్‌రెడ్డి, రవిచంద్ర కిశోర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, శిల్పా భువనేశ్వరరెడ్డి తదితరులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. భారీగా ఏర్పాట్లు మండు వేసవి కావడంతో గంగాహారతిలో పాల్గొనేందుకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సిద్ధాపురం చెరువు వద్ద సభాస్థలిని సిద్ధం చేశారు. సుమారు 20వేల మంది కూర్చునేందుకు వీలుగా విశాలమైన చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. మధ్యాహ్న భోజన ఏర్పాట్లు కూడా ఘనంగానే ఉన్నాయి. సుమారు 30 కౌంటర్లను సిద్ధం చేశారు. సోమవారం రాత్రి నుంచే వంటలు చేయడం ప్రారంభించారు. 50 వేల నీటి ప్యాకెట్లు, 30 వేల మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నారు. చెరువులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా బోట్లను ఏర్పాటు చేస్తున్నారు. గంగమ్మకు బోనాలెత్తనున్న 1,200 మంది మహిళలు వైఎస్ఆర్ గంగాహారతి కార్యక్రమంలో బోనాలను ఎత్తడానికి సుమారు 1,200 మంది మహిళలు ఇప్పటికే నిర్వాహకుల వద్ద నమోదు చేసుకున్నారు. సంజీవ్ నగర్ తండా నుంచి మహిళలు బోనాలను తీసుకుని ఊరేగింపుగా సిద్ధాపురం చెరువు వైపు సాగుతారు. నేరుగా కట్టమీదకు వెళ్లిన తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన గంగమ్మ విగ్రహం వద్ద బోనాలను సమర్పిస్తారు. అలాగే యాగంలో పాల్గొని దీపాలను చెరువులో వదలనున్నారు. ప్రముఖ నాయకుల రాక ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వైఎస్సార్సీపీ ప్రముఖ నాయకులు భారీ సంఖ్యలో విచ్చేస్తున్నారు. పలువురు ఎమ్మెల్యేలతో పాటు ఎంఎల్సీలు, ఎంపీలు కూడా హాజరుకానున్నారు. కార్యక్రమం సాగుతుందిలా... ఉదయం 9.30 గంటలకు జలాశయం సమీపంలోని సంజీవనగర తండా నుంచి మహిళలు బోనాలు తీసుకుని ఊరేగింపుగా చెరువు కట్టపైకి సాగుతారు. 10.45 గంటలకల్లా గంగమ్మకు బోనాలు సమర్పిస్తారు. ఆతరువాత చెరువు గర్భం ర్యాంప్‌పై ఏర్పాటు చేసిన యాగశాలలో యాగం జరుగుతుంది. గంగమ్మకు దీపాల సమర్పణ జరుగుతుంది. 11 గంటలకు చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన సభాస్థలిలో బహిరంగ సభ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 1,00 గంటకు భోజన కార్యక్రమం ఉంటుంది. -
శ్రీశైలం వైఎస్సార్సీపీ ఇంఛార్జ్‌గా శిల్పాచక్రపాణి రెడ్డి
-
ప్రజాభిమానాన్ని అమ్ముకోవడం సిగ్గుచేటు
సాక్షి, ఆత్మకూరు: తాను ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా గత ఎన్నికల్లో శ్రీశైలం నియోజకవర్గ ప్రజలు దివంగత మహానేత వైఎస్ఆర్పై అభిమానంతో బుడ్డా రాజశేఖరరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించారని, అయితే అమూల్యమైన ప్రజాభిమానాన్ని ఆయన డబ్బులకు అమ్ముకోవడం సిగ్గుచేటని వైఎస్ఆర్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణి రెడ్డి విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిద్ధాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ.. విలువల కోసం తాను ఎమ్మెల్సీ పదవిని తృణప్రాయంగా వదిలేశానని, బుడ్డా రాజశేఖరరెడ్డి మాత్రం డబ్బుల కోసం పార్టీని వీడారన్నారు. మహానేత వైఎస్ఆర్ శంకుస్థాపన చేసి, నిధులు విడుదల చేసిన సిద్ధాపురం ఎత్తి పోతల పథకం ఆయన హయాంలోనే 80 శాతం పూర్తి అయిందన్నారు. మిగిలిన పనుల్లోనూ చాలావరకు తాను ఎమ్మెల్సీగా ఎన్నికైన తరువాత ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి విడుదల చేసిన నిధులతో పూర్తి చేయించామన్నారు. కానీ బుడ్డా రాజశేఖర్‌రెడ్డి మాత్రం సిద్దాపురం గురించి ఆయన తండ్రి కల గన్నాడని, తాను పూర్తి చేశానని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. ఎన్టీఆర్ స్మృతివనం పేరిట ఒక పార్క్‌ను ఏర్పాటు చేస్తూ అందులో తన తండ్రి విగ్రహాన్ని పెట్టాలని అనుకుంటున్న ఎమ్మెల్యే ఎక్కడా స్థలం లేనట్లు ఎస్ఎన్ తండా గిరిజనుల భూములను లాక్కునే ప్రయత్నం చేశారని, వారు ప్రతిఘటించడంతోనే సిద్ధాపురం రైతుల భూములను లాక్కునే యత్నం చేస్తున్నారన్నారు. ప్రాజెక్ట్‌కు తండ్రి పేరు మాత్రమే పెట్టించుకున్న బుడ్డా.. స్థానికులకు పిసరంత సాయం కూడా చేయలేకపోయారన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు శిల్పా భువనేశ్వరరెడ్డి, కుందూరు శివారెడ్డి, చిట్యాల వెంకటరెడ్డి యన్నం చంద్రారెడ్డి, బి.రామచంద్రారెడ్డి, ఎలీషా, లక్ష్మిరెడ్డి, రాజమోహన్ రెడ్డి, అంజాద్ అలి, విష్ణు వర్ధన్ రెడ్డి, రామారావు తదితరులు పాల్గొన్నారు. -
మైనార్టీల సంక్షేమమే వైఎస్సార్సీపీ ధ్యేయం
సాక్షి, కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటుందని ఆ పార్టీ జిల్లా రీజినల్ కో–ఆర్డినేటర్ మేకపాటి గౌతంరెడ్డి, కర్నూలు, నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు బీవై రామయ్య, శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. కర్నూలు పాతబస్తీలోని రాయల్ ఫంక్షన్ హాల్లో బుధవారం.. వైఎస్సార్సీపీ కర్నూలు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం సమన్వయకర్త హఫీజ్ ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి అధ్యక్షత వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గౌతంరెడ్డి, బీవై రామయ్య, శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్‌కు పార్టీ నాయకులు, కార్యకర్తలు కలసికట్టుగా సహకరించాలని సూచించారు. చంద్రబాబు ప్రభుత్వం టార్గెట్లు విధించి..ప్రజలకు మద్యం తాపిస్తూ ప్రాణాలను హరిస్తోందన్నారు. టీడీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి జరగలేదని.. అధికార పార్టీ నేతలు అక్రమమార్గంలో ఆర్థికంగా బలపడుతున్నారని విమర్శించారు. నమ్ముకున్న వారిని అమ్ముకుని పోయాడంటూ పార్టీ మారిన ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి గురించి ఎద్దేవా చేశారు. జన్మభూమిలో రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్లు ఇవ్వకుండా మోసం చేస్తున్నారన్నారు. దీంతో విసిగిపోయిన ప్రజలు అధికారులను నిలదీస్తున్నారన్నారు. కర్నూలు మండల పరిధిలోని పూడూరులో అధికారులను ఊర్లోకి కూడా రానీయలేదన్నారు. సాధ్యంకాని హామీలు గుప్పించడం టీడీపీ అధినేత చంద్రబాబు నైజమన్నారు. మాట ఇస్తే మడమ తిప్పని నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అని, అన్ని వర్గాల ప్రజల మేలు కోసం నవరత్నాల వంటి పథకాలను రూపొందించారని తెలిపారు. డబ్బుతో రాజకీయం చేసే చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ప్రజలు వైఎస్ఆర్సీపీకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. నైతిక విలువలు కాపాడేందుకే వైఎస్సార్సీపీ ఆవిర్భవించిందని, ప్రజల కోసమే జగన్మోహన్రెడ్డి ఎండనకా, వాననకా పాదయాత్రలు నిర్వహిస్తున్నారని తెలిపారు. రాజీనామా చేయించకుండానే 22 మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకున్న టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని విమర్శించారు. కర్నూలు సమన్వయకర్త హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ.. మైనారిటీలపై మానవత్వం చూపేది ఒక్క వైఎస్ఆర్ కుటుంబం మాత్రమేనని స్పష్టం చేశారు. పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. మైనార్టీలంతా వైఎస్సార్సీపీ పక్షమేనన్నారు. మైనారిటీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్‌ఖాదర్ మాట్లాడుతూ జాబు రావాలంటే బాబు పోవాలన్నారు. పార్టీ తల్లిలాంటిదని, గెలిపించిన పార్టీని వదలి మరో పార్టీలోకి చేరడం తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్లు ఉందని విమర్శించారు. పత్తికొండ నేత, దివంగత చెరుకులపాడు నారాయణరెడ్డి సోదరుడు ప్రదీప్‌రెడ్డి మాట్లాడుతూ.. కార్యకర్తల్లో నుంచే నాయకుడు పుడతాడన్నారు. అనంతరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఎ.రహ్మాన్, సంయుక్త కార్యదర్శి బి.జహీర్‌అహ్మద్‌ఖాన్, ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు సి.హెచ్.మద్దయ్య, జిల్లా నాయకురాలు విజయకుమారి మాట్లాడారు. కార్యక్రమంలో వివిధ శ్రేణుల నాయకులు టి.వి.రమణ, కటారి సురేశ్‌కుమార్, మాజీ కార్పొరేటర్ దాదామియ్య, మహమ్మద్ తౌఫిక్, రాఘవేంద్రరెడ్డి, హరినాథ్‌రెడ్డి, ఆదిమోహన్‌రెడ్డి, సాంబశివారెడ్డి, మల్లికార్జున, జాన్, లతీఫ్, బోదేపాడు భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేను వద్దనుకున్న దాన్ని పోటీపడి ఏరుకుంటున్నారు
సాక్షి, కర్నూలు : జిల్లాలో జరగనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై మాజీ ఎమ్మెల్సీ, వైసీపీ నేత శిల్పా చక్రపాణి రెడ్డి స్పందించారు. రాజకీయాల్లో విలువల కోసం తమ నాయకుడు వైఎస్ జగన్ ఆదేశానుసారం తాను తెలుగుదేశం పార్టీ సభ్యత్వంతోపాటు ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేశానని అన్నారు. తాను వద్దని వదిలేసిన స్థానం కోసం టీడీపీ నేతలు పోటీపడి ఏరుకుంటున్నారని చక్రపాణి రెడ్డి వ్యాఖ్యానించారు. తాను నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేశానని, రాజీనామా చేసిన పదవి కోసం మళ్లీ యుద్ధం చేయాల్సిన అవసరం లేదని అన్నారు. అందుకే స్థానిక సంస్థల ఉప ఎన్నికలో వైసీపీ పోటీ చేయడం లేదని శిల్పా స్పష్టం చేశారు. నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయన టీడీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఈ స్థానానికి తాజాగా ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. జనవరి 21న ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్‌ను పార్టీ అభ్యర్ధిగా ప్రకటించారు. అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికపై వైఎస్ఆర్సీపీ నేతలు స్పందించారు. ప్రజాస్వామ్యం మరోమారు అపహాస్యం కావడం ఇష్టం లేని కారణంగా ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేట్లేదని తెలిపారు. విలువల కోసం తృణప్రాయంగా ఎమ్మెల్సీ పదవిని త్యజించిన తాము.. తిరిగి ఆ పదవి కోసం పోటీ చేయదలుచుకోలేదని పార్టీ నాయకులు పేర్కొన్నారు. -
టీడీపీకి పతనం తప్పదు
ఆత్మకూరురూరల్: టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి త్వరలో పతనం తప్పదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. గురువారం ఆత్మకూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రకటించే ప్రతి పథకంలోను, నిర్మించే ప్రతి ప్రాజెక్ట్‌లోనూ టీడీపీ ప్రభుత్వం కమీషన్లు దండుకుంటోందని ఆరోపించారు. పంటలకు గిట్టుబాటు ధర లభించక రైతులు అల్లాడుతుంటే మంత్రి ఆదినారాయణ రెడ్డికి చెందిన శనగలు మాత్రం ఆళ్లగడ్డలోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో పూర్తిగా అమ్ముడయి పోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నారు. సంక్రాంతికి సిద్ధంచేసిన చంద్రన్న కానుకలు నాసిరకంగా ఉన్నాయని... వీటి వెనక కమీషన్ల కుంభకోణం జరిగిందని విమర్శించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల్లో సైతం టీడీపీ నేతల అవినీతి కంపును జనం ఈసడించుకుంటున్నారన్నారు. పదేళ్ళ క్రితం నిర్మించుకున్న మరుగుదొడ్లకు సైతం బిల్లులు చేసుకున్నారని.. అంశంపైనే త్వరలో జిల్లాలోని అన్ని ఎంపీడీవో కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించనున్నామన్నారు.తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహనరెడ్డి సంకల్ప యాత్రను చూసి టీడీపీ నేతల వెన్నులో వణుకు పుడుతోందన్నారు. పార్టీ నాయకులు శిల్పా భువనేశ్వరరెడ్డి, కుందూరు శివారెడ్డి, రాజమోహన్ రెడ్డి, స్వామి, కాలానజీర్, లాలు, చిట్యాల వెంకట రెడ్డి, శిఖామణి, బైరాపురం బాషా తదితరులు పాల్గొన్నారు. -
'చంద్రబాబు డైరెక్షన్.. పవన్ యాక్షన్'
సాక్షి, కర్నూలు: సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీరును కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి తప్పుపట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో పవన్ నటిస్తున్నారని నంద్యాల పార్లమెంట్ వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు చక్రపాణి రెడ్డి విమర్శించారు. రాష్ట్ర సమస్యలు తెలుసుకుని వాటిపై చంద్రబాబును ప్రశ్నించాలని పవన్‌కు సూచించారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిపక్షాన్ని తిట్టడం మానేసి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై దృష్టిపెట్టాలని హితవు పలికారు. ముచ్చుమర్రి పైపులు తీసుకెళ్లి పట్టిసీమకు బిగించారని, కనీసం నాలుగు రోజులు కూడా నీళ్లివ్వలేదని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు హామీల వల్ల రాష్ట్రానికి ఒరిగిన ప్రయోజనమే లేదని చక్రపాణిరెడ్డి అన్నారు.