టీడీపీకి పతనం తప్పదు | Shilpa Chakrapani Reddy fire on TDP govt | Sakshi
Sakshi News home page

టీడీపీకి పతనం తప్పదు

Published Fri, Dec 22 2017 3:05 PM | Last Updated on Wed, Jul 25 2018 4:58 PM

Shilpa Chakrapani Reddy fire on TDP govt - Sakshi

ఆత్మకూరురూరల్‌: టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి త్వరలో పతనం తప్పదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నంద్యాల పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు.  గురువారం ఆత్మకూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రకటించే ప్రతి పథకంలోను, నిర్మించే ప్రతి ప్రాజెక్ట్‌లోనూ టీడీపీ ప్రభుత్వం కమీషన్లు దండుకుంటోందని ఆరోపించారు. పంటలకు గిట్టుబాటు ధర లభించక రైతులు అల్లాడుతుంటే మంత్రి ఆదినారాయణ రెడ్డికి చెందిన శనగలు మాత్రం ఆళ్లగడ్డలోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో పూర్తిగా అమ్ముడయి పోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నారు. సంక్రాంతికి సిద్ధంచేసిన చంద్రన్న కానుకలు నాసిరకంగా ఉన్నాయని... వీటి వెనక కమీషన్ల కుంభకోణం జరిగిందని విమర్శించారు.

వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల్లో సైతం టీడీపీ నేతల అవినీతి కంపును జనం ఈసడించుకుంటున్నారన్నారు.  పదేళ్ళ క్రితం నిర్మించుకున్న మరుగుదొడ్లకు సైతం బిల్లులు చేసుకున్నారని.. అంశంపైనే త్వరలో జిల్లాలోని అన్ని ఎంపీడీవో కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించనున్నామన్నారు.తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్ మోహనరెడ్డి సంకల్ప యాత్రను చూసి టీడీపీ నేతల వెన్నులో వణుకు పుడుతోందన్నారు. పార్టీ నాయకులు శిల్పా భువనేశ్వరరెడ్డి, కుందూరు శివారెడ్డి, రాజమోహన్ రెడ్డి, స్వామి, కాలానజీర్, లాలు, చిట్యాల వెంకట రెడ్డి, శిఖామణి, బైరాపురం బాషా తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement