
సాక్షి, నంద్యాల : కర్నూలు జిల్లాలోని 53 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల పార్లమెంట్ ఇంచార్జి శిల్పా చక్రపాణి రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం జరగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులకు ఏం న్యాయం చేశారంటూ ప్రశ్నించారు. సిద్ధాపురం ఎత్తిపోతల పథకం నుంచి కనీసం ఒక్క ఎకరానికైనా సాగునీరు అందించారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను మభ్యపెడుతూ పబ్బం గడుపుకొంటున్న బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలను బొంద పెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చక్రపాణి రెడ్డి అన్నారు. జిల్లాలో ఓ వైపు పశువులు కాటికి వెళ్లే పరిస్థితి ఉంటే జలసిరి అంటూ హారతులు పడతారా అంటూ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment