
సాక్షి, కర్నూలు: సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీరును కర్నూలు జిల్లా వైఎస్ఆర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి తప్పుపట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డైరెక్షన్‌లో పవన్ నటిస్తున్నారని నంద్యాల పార్లమెంట్ వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు చక్రపాణి రెడ్డి విమర్శించారు. రాష్ట్ర సమస్యలు తెలుసుకుని వాటిపై చంద్రబాబును ప్రశ్నించాలని పవన్‌కు సూచించారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిపక్షాన్ని తిట్టడం మానేసి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై దృష్టిపెట్టాలని హితవు పలికారు. ముచ్చుమర్రి పైపులు తీసుకెళ్లి పట్టిసీమకు బిగించారని, కనీసం నాలుగు రోజులు కూడా నీళ్లివ్వలేదని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు హామీల వల్ల రాష్ట్రానికి ఒరిగిన ప్రయోజనమే లేదని చక్రపాణిరెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment