సాక్షి, కర్నూలు: ఆత్మకూరు మండలంలోని సిద్ధాపురం చెరువు వద్ద ‘వైఎస్సార్ గంగాహారతి’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజలు భారీఎత్తున తరలి వచ్చారు. 1200మంది మహిళలలు బోనాలతో వచ్చి గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సంజీవ్ నగర్ తండా నుంచి మహిళలు బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా సిద్ధాపురం చెరువు వద్దకు చేరారు. అనంతరం నేరుగా కట్టమీదకు వెళ్లి తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన గంగమ్మ విగ్రహం వద్ద బోనాలను సమర్పించారు. అలాగే యాగంలో పాల్గొని దీపాలను చెరువులో వదిలారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చలువ వల్లే సిద్ధాపురం ఎత్తిపోతల పథకం పూర్తయ్యిందని, దీనివల్ల వేలాది ఎకరాల భూములు సస్యశ్యామలం కానున్నయని శిల్ప చక్రపాణిరెడ్డి తెలిపారు. ఆ మహానేతను స్మరించుకోవడానికే ‘వైఎస్సార్ గంగాహారతి’ కార్యక్రమాన్ని రైతులతో, మహిళలతో ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment