Ganga Arti
-
కుంభమేళా ఎఫెక్ట్.. గంగా హారతి నిలిపివేత
ప్రయాగ్‌రాజ్: మహా కుంభమేళాకు భక్తుల రద్దీ రోజురోజుకు భారీగా పెరుగుతోంది. భక్తులు పోటెత్తుండుండటంతో ఫిబ్రవరి 5 వరకు కాశీలోని ఘాట్ల వద్ద గంగా హారతి కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.వారణాసిలోని దశాశ్వమేధ్, శీత్ల, అస్సీ మొదలైన ఘాట్లలో నిర్వహించే గంగా హారతి కారక్రమాన్ని ఆపేస్తున్నట్లు చెప్పారు.కుంభమేళా జరిగే ప్రాంతాల్లో ప్రజలు అవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని పోలీస్ కమిషనర్ మోహిత్ అగర్వాల్ విజ్ఞప్తి చేశారు.ఘాట్ల వద్ద ప్రమాదాలు జరగకుండా నివారించేందుకే గంగా హారతిని తాత్కాలికంగా ఆపేసినట్లు తెలిపారు.ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు వచ్చిన భక్తులు వారణాసికి పెద్ద సంఖ్యలో వస్తుండడంతో కొందరు ప్రయాణికులు వారణాసి, బనారస్ రైల్వే స్టేషన్లలో చిక్కుకుపోయినట్లు చెప్పారు.మౌని అమావాస్య నుంచి కాశీలో భక్తుల రద్దీ పెరిగిందని వారి సంఖ్య తగ్గేవరకు ఇతరులు ఎవరూ వారణాసికి రావద్దని విజ్ఞప్తి చేశారు.కాగా,మహా కుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో రద్దీ నియంత్రణకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసకుంది. ఈ క్రమంలోనే కుంభమేళా ప్రాంతంలోకి వాహనాల రాకపోకలను నిషేధించారు. దీంతోపాటు వీవీఐపీ, స్పెషల్ పాసులను రద్దు చేశారు.ఇప్పటివరకు 29.64 కోట్లమంది భక్తులు కుంభమేళాకు వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. -
కాశీలో ‘కేసీఆర్’ హీరో.. రోజాతో సెల్ఫీ (ఫోటోలు)
-
స్కర్ట్స్ వేసుకునేవారు.. గంగాజలాన్ని గౌరవిస్తున్నారు
న్యూఢిల్లీ : ఎన్ని విమర్శలు వచ్చినా మగానుభావులు మాత్రం మారడం లేదు. నిన్ననే కాంగ్రెస్ మిత్రపక్షం నేత ఒకరు స్మృతి ఇరానీ గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేసి అగ్గి రాజేశాడు. అది ఇంకా పూర్తిగా ఆరకముందే ఈ రోజు బీజేపీ నాయకులు రెడీ అయిపోయారు. ప్రియాంక గాంధీని ఉద్దేశిస్తూ స్కర్ట్స్ ధరించే వారు ఇప్పుడు చీరలు కట్టుకుని ఆలయాలకు వెళ్తున్నారు. గంగానదికి పూజలు చేస్తున్నారంటూ బీజేపీ నాయకుడు జయకరణ్ గుప్తా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజుల క్రితమే ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లో ర్యాలీలు, బోటు యాత్ర నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ పలు ఆలయాలను సందర్శించడమే కాక గంగానదికి పూజలు చేసి హారతి కూడా ఇచ్చారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని జయకరణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జయకరణ్ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘అచ్చెదిన్ ఎక్కడ అని ప్రశ్నించే కాంగ్రెస్ నాయకులు దాన్ని చూడటంలేదు. గతంలో స్కర్ట్స్ వేసుకుని ఆలయాలకు వెళ్లి గంగానదిని అగౌరవపర్చిన వారు నేడు చీరలు ధరించి అదే గంగానదికి పూజలు చేసి మర్యాద ఇస్తున్నారు’ అని పేర్కొన్నారు. అయితే జయకరణ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విపరీతమైన ఆగ్రహం వ్యక్తం అయ్యింది. ఈ నేపథ్యంలో జయకరణ్ తాను ప్రత్యేకంగా ఏ రాజకీయనాయకుడి పేరుని పేర్కొనలేదని.. జనరల్‌గా చెప్పానని తెలిపారు. ఈ వ్యాఖ్యలతో ప్రియాంక గాంధీ, సోనియా గాంధీని విమర్శించే వారి జాబితాలో జయకరణ్ కూడా చేరారు. -
ఘనంగా వైఎస్సార్ గంగాహారతి
సాక్షి, కర్నూలు: ఆత్మకూరు మండలంలోని సిద్ధాపురం చెరువు వద్ద ‘వైఎస్సార్ గంగాహారతి’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజలు భారీఎత్తున తరలి వచ్చారు. 1200మంది మహిళలలు బోనాలతో వచ్చి గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంజీవ్ నగర్ తండా నుంచి మహిళలు బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా సిద్ధాపురం చెరువు వద్దకు చేరారు. అనంతరం నేరుగా కట్టమీదకు వెళ్లి తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన గంగమ్మ విగ్రహం వద్ద బోనాలను సమర్పించారు. అలాగే యాగంలో పాల్గొని దీపాలను చెరువులో వదిలారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చలువ వల్లే సిద్ధాపురం ఎత్తిపోతల పథకం పూర్తయ్యిందని, దీనివల్ల వేలాది ఎకరాల భూములు సస్యశ్యామలం కానున్నయని శిల్ప చక్రపాణిరెడ్డి తెలిపారు. ఆ మహానేతను స్మరించుకోవడానికే ‘వైఎస్సార్ గంగాహారతి’ కార్యక్రమాన్ని రైతులతో, మహిళలతో ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. -
శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ గంగాహారతి
-
నేడు వైఎస్సార్ గంగాహారతి
ఆత్మకూరు/ రూరల్ : ఆత్మకూరు మండలంలోని సిద్ధాపురం చెరువు వద్ద మంగళవారం ‘వైఎస్సార్ గంగాహారతి’ కార్యక్రమాన్ని భారీఎత్తున నిర్వహించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చలువ వల్లే సిద్ధాపురం ఎత్తిపోతల పథకం పూర్తయ్యింది. దీనివల్ల వేలాది ఎకరాల భూములు సస్యశ్యామలం కానున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సహకారాన్ని స్మరించుకుంటూ వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో ‘వైఎస్సార్ గంగాహారతి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆయన మూడు రోజులుగా ఆత్మకూరులోనే మకాం వేసి.. ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. అలాగే సోమవారం పార్టీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, పార్టీ నాయకులు శిల్పా కార్తీక్‌రెడ్డి, రవిచంద్ర కిశోర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, శిల్పా భువనేశ్వరరెడ్డి తదితరులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. భారీగా ఏర్పాట్లు మండు వేసవి కావడంతో గంగాహారతిలో పాల్గొనేందుకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సిద్ధాపురం చెరువు వద్ద సభాస్థలిని సిద్ధం చేశారు. సుమారు 20వేల మంది కూర్చునేందుకు వీలుగా విశాలమైన చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. మధ్యాహ్న భోజన ఏర్పాట్లు కూడా ఘనంగానే ఉన్నాయి. సుమారు 30 కౌంటర్లను సిద్ధం చేశారు. సోమవారం రాత్రి నుంచే వంటలు చేయడం ప్రారంభించారు. 50 వేల నీటి ప్యాకెట్లు, 30 వేల మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నారు. చెరువులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా బోట్లను ఏర్పాటు చేస్తున్నారు. గంగమ్మకు బోనాలెత్తనున్న 1,200 మంది మహిళలు వైఎస్ఆర్ గంగాహారతి కార్యక్రమంలో బోనాలను ఎత్తడానికి సుమారు 1,200 మంది మహిళలు ఇప్పటికే నిర్వాహకుల వద్ద నమోదు చేసుకున్నారు. సంజీవ్ నగర్ తండా నుంచి మహిళలు బోనాలను తీసుకుని ఊరేగింపుగా సిద్ధాపురం చెరువు వైపు సాగుతారు. నేరుగా కట్టమీదకు వెళ్లిన తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన గంగమ్మ విగ్రహం వద్ద బోనాలను సమర్పిస్తారు. అలాగే యాగంలో పాల్గొని దీపాలను చెరువులో వదలనున్నారు. ప్రముఖ నాయకుల రాక ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వైఎస్సార్సీపీ ప్రముఖ నాయకులు భారీ సంఖ్యలో విచ్చేస్తున్నారు. పలువురు ఎమ్మెల్యేలతో పాటు ఎంఎల్సీలు, ఎంపీలు కూడా హాజరుకానున్నారు. కార్యక్రమం సాగుతుందిలా... ఉదయం 9.30 గంటలకు జలాశయం సమీపంలోని సంజీవనగర తండా నుంచి మహిళలు బోనాలు తీసుకుని ఊరేగింపుగా చెరువు కట్టపైకి సాగుతారు. 10.45 గంటలకల్లా గంగమ్మకు బోనాలు సమర్పిస్తారు. ఆతరువాత చెరువు గర్భం ర్యాంప్‌పై ఏర్పాటు చేసిన యాగశాలలో యాగం జరుగుతుంది. గంగమ్మకు దీపాల సమర్పణ జరుగుతుంది. 11 గంటలకు చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన సభాస్థలిలో బహిరంగ సభ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 1,00 గంటకు భోజన కార్యక్రమం ఉంటుంది. -
బాసరలో 'దక్షిణ గంగా నిత్య హారతి'
సాక్షి, బాసర: కార్తీక మాసం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా బాసర పుణ్యకేత్రంలో 'దక్షిణ గంగా వేద నిత్య హారతి' అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ హారతి కార్యక్రమం శనివారం ( నవంబర్ 4 ) న మొదలు కానున్నట్టు వేద పండితులు తెలిపారు. మానవ జాతి సుఖ సంతోషాలతో వర్థిల్లాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ హారతి ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాటు పలువురు పాల్గొంటారన్నారు. ఈ నిత్య హారతి కార్యక్రమానికి అందరూ సహకరించాలని నిర్వాహకులు కోరారు. -
బాసరలో 'దక్షిణ గంగా నిత్య హారతి'
-
భారత్‌లో చార్లెస్ దంపతులు పర్యటన: భద్రత కట్టుదిట్టం
బ్రిటన్ యువరాజు చార్లెస్, కెమిల్లా పార్కర్ దంపతులు భారత్‌లో తొమ్మిది రోజుల పర్యటనలో భాగంగా నేటి సాయంత్రం డెహ్రాడూన్‌లోని జోలీగ్రాండ్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారని ఉత్తరాఖండ్ రాష్ట్ర ఉన్నతాధికారులు బుధవారం ఇక్కడ వెల్లడించారు. వారి పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి అయినట్లు తెలిపారు. చార్లెస్ యువరాజు దంపతుల పర్యటన నేపథ్యంలో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేసినట్లు చెప్పారు. అందుకోసం భారీగా పోలీసుల బలగాలను మోహరించినట్లు పేర్కొన్నారు. నరేంద్రనగర్‌లోని ఓ హోటల్లో చార్లెస్ దంపతులకు విడిది ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా చార్లెస్ దంపతులు రిషికేశ్‌లోని పరమత నికేతన్ ఆశ్రమంలో నిర్వహించే హవన్, గంగా హారతి కార్యక్రమంలో పాల్గొంటారని ఉన్నతాధికారులు తెలిపారు. అనంతరం ఉత్తరాఖండ్ సీఎం విజయ్ బహుగుణ గౌరవార్థం ఇచ్చే విందులో చార్లెస్ దంపతులు పాల్గొనున్నారని చెప్పారు. యువరాజు దంపతుల కోసం నరేంద్రనగర్‌లోని హోటల్లో విడిది చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలటరీ అకాడమీ, ఫారెస్ట్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్, డూన్ స్కూల్లో జరిగే ప్రత్యేక కార్యక్రమాల్లో వారు పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం ఇటీవల ఉత్తరాఖండ్‌లో వరదల వల్ల అతలాకుతలమైన ప్రాంతాలలో వారు పర్యటించనున్నారు. భారత్ పర్యటనలో భాగంగా చార్లెస్ దంపతులు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీలతో సమావేశం కానున్నారు. అలాగే భారత్ వాణిజ్య రాజధాని ముంబైలో దేశానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలతో చార్లెస్ దంపతులు భేటీ అవుతారు. భారత్‌లో వివిధ ప్రాంతాల్లో వ్యాపారవేత్తలు, సంస్కృతిక రంగానికి చెందిన ప్రముఖులు, నాయకులను బ్రిటన్ యువరాజు చార్లెస్ దంపతులు కలుసుకుంటారని ఉత్తరాఖండ్ ఉన్నతాధికారులు వివరించారు.