ఫిరాయింపుల్లో రికార్డు కేసీఆర్‌దే: షబ్బీర్ | shabbir ali press meet over party shifting mlas and by elections | Sakshi
Sakshi News home page

ఫిరాయింపుల్లో రికార్డు కేసీఆర్‌దే: షబ్బీర్

Published Thu, Aug 18 2016 3:09 PM | Last Updated on Fri, Mar 22 2019 6:25 PM

ఫిరాయింపుల్లో రికార్డు కేసీఆర్‌దే: షబ్బీర్ - Sakshi

ఫిరాయింపుల్లో రికార్డు కేసీఆర్‌దే: షబ్బీర్

హైదరాబాద్: పార్టీ ఫిరాయింపుల్లో రికార్డు సృష్టించిన ఘనత తెలంగాణ సీఎం కేసీఆర్‌కే దక్కిందని కాంగ్రెస్ శాసనమండలి పక్షనేత షబ్బీర్ అలీ అన్నారు. గాంధీభవన్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పీకర్‌కు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఇప్పటికే నోటీసులు జారీ చేసిందన్నారు.

పార్టీ ఫిరాయింపుదారులపై అనర్హత వేటువేయడం ఖాయమని షబ్బీర్ అన్నారు. పార్టీ మారిన 25 మంది ఎమ్మెల్యేలు, ఎంపీ స్థానాలకు త్వరలో ఉపఎన్నికలు రాబోతున్నాయని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఉపఎన్నికలకు సిద్ధంగా ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికైనా టీఆర్‌ఎస్, పార్టీ మారిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి... ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల రీడిజైన్పై తమ పార్టీ విసిరిన సవాల్‌కు కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. దీనిపై రిటైర్డ్ ఇంజినీర్లు ఎందుకు స్పందించారో అర్థం కాలేదని షబ్బీర్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement