
న్యూఢిల్లీ: సోమవారం ఉప ఎన్నిక జరిగిన ప్రాంతాల్లోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని ఎన్నికల సంఘం(ఈసీ) నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్‌లోని కైరానా నియోజకవర్గంలోని 73 పోలింగ్ స్టేషన్లు, మహారాష్ట్ర భండారా–గోండియా నియోజకవర్గంలోని 49, నాగాలాండ్‌లోని ఒక పోలింగ్ కేంద్రాల్లో బుధవారం మళ్లీ పోలింగ్ జరగనుంది. వీవీపాట్‌లలో లోపాలు తలెత్తటంతో రీపోలింగ్ అవసరమైందని, ఆయా ప్రాంతాలకు కొత్త మెషీన్లను తరలించినట్లు ఈసీ తెలిపింది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన గోండియా కలెక్టర్‌ను బదిలీ చేసి, కొత్త కలెక్టర్‌కు బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment