Kairana town
-
ప్రతిష్టాత్మక పోరు: ‘కైరానా’ మే హైరానా!
యూపీలో హాట్ సీట్లలో ఒకటైన కైరానాలో నాలుగు దశాబ్దాలుగా రెండు కుటుంబాల మధ్య జరుగుతున్న పోరు ప్రస్తుత ఎన్నికల్లోనూ ప్రతిష్టాత్మకంగా మారింది. సమాజ్‌వాదీ తరపున పోటీ చేస్తున్న నహిద్ హసన్, బీజేపీ తరపున పోటీ చేస్తున్న మృగాంక సింగ్‌ల మధ్యే ఈ ఎన్నికల్లోనూ గట్టి పోరు జరుగనుంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో నహిద్ హసన్ గెలుపొందగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో హుకుంసింగ్ కుటుంబాన్ని పక్కనబెట్టిన బీజేపీ, ప్రదీప్ చౌదరిని నిలబెట్టి గెలిపించుకుంది. అయితే ఈసారి తొలిదశలో ఫిబ్రవరి 10న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి మృగాంకను బరిలో నిలిపిన కమలదళ పెద్దలు, తమ సత్తా చాటేందుకు క్షేత్రస్థాయిలో ఇప్పటికే రంగంలోకి దిగారు. – సాక్షి, న్యూఢిల్లీ వలసలు, శాంతిభద్రతల సమస్యలపైనే నజర్ 2017లో వలసల సమస్యతో పాటు శాంతిభద్రతల అంశాన్ని తెరపైకి తెచ్చి అప్పటి ఎస్పీ ప్రభుత్వాన్ని కమలదళం చుట్టుముట్టింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశాన్నే ప్రచారాస్త్రంగా చేసుకొని బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటికీ, కైరానాలో ప్రజలు మాత్రం ఎస్పీ అభ్యర్థి నహిద్ హసన్ వైపే మొగ్గు చూపారు. అయితే గతంలో మాదిరిగానే వలసలు, శాంతిభద్రతల అంశాలను బీజేపీ ప్రచారాస్త్రంగా చేసుకుంది. అందుకే కైరానాలో బీజేపీ అభ్యర్థికి ఓట్లు వేయాలని కోరుతూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇంటింటికీ వెళ్లి ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వలస బాధితులను కూడా కలిశారు. గతేడాది నవంబర్లోనూ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా వలస బాధితులను కలిశారు. (క్లిక్: అన్నయ్యతో అవ్వట్లేదు... ప్రియాంక అలుపెరుగని పోరాటం) అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కైరానా వలసల అంశాన్ని లేవనెత్తిన బీజేపీకి మాత్రం కైరానాలోనే ఎదురుదెబ్బ తగిలింది. కాగా బీజేపీ లేవనెత్తిన ఈ అంశాన్ని ఎదుర్కొనేందుకు ఎస్పీ కూటమి పరస్పర సోదరభావ అంశంతో పాటు నహిద్ హసన్‌ను గ్యాంగ్‌స్టర్ చట్టం కింద అరెస్ట్ చేయడాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడంపై దృష్టి సారించింది. ప్రస్తుతం ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే నహిద్ హసన్ ఎస్పీ టికెట్‌పై అభ్యర్థిగా నామినేషన్ వేసిన మరుసటి రోజే గ్యాంగ్‌స్టర్ చట్టం కేసులో పోలీసులు అరెస్టు చేసి, 14 రోజుల రిమాండ్‌కు పంపారు. దీంతో కైరానాలో అతని తరపున ప్రచార బాధ్యతలను చెల్లెలు ఇక్రా హసన్ నిర్వహిస్తున్నారు. రెండు కుటుంబాల మధ్య కొనసాగుతున్న రాజకీయ వైరం కైరానా ప్రాంతంలో సుమారు 120 ఏళ్ళ క్రితం మాజీ ఎంపీ బాబు హుకుం సింగ్, మునవ్వర్ హసన్‌ల పూర్వీకులు ఒకే కుటుంబానికి చెందినప్పటికీ, అందులో ఒకరు ఇస్లాంను స్వీకరించడంతో మొదలైన వైరం ఇప్పుడు తర్వాత తరానికి చేరింది. సుమారు నాలుగు దశాబ్దాలుగా ఒక్కొక్కసారి ఒక్కో కుటుంబానిది పైచేయిగా సాగుతోంది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేసిన మునవ్వర్ హసన్ భార్య తబస్సుమ్ హసన్, హుకుంసింగ్‌ను ఓడించారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో హుకుంసింగ్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2014లో కైరానా నుంచి ఎంపీగా గెలవడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అనంతరం 2014లో జరిగిన ఎమ్మెల్యే ఉపఎన్నికలో మునవ్వర్ కుమారుడు నహిద్ హసన్ సమాజ్‌వాదీ తరపున పోటీ చేసి గెలుపొందారు. అయితే 2018లో హుకుంసింగ్ మరణంతో ఖాళీ అయిన స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆర్ఎల్డీ తరపున పోటీ చేసిన తబస్సుమ్ హసన్ చేతిలో దివంగత హుకుం సింగ్ కుమార్తె మృగాంక సింగ్ ఓడిపోయారు. అంతకు ముందు 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ మృగాంక సింగ్‌పై నహిద్ హసన్ విజయం సాధించారు. ఆ తర్వాత 2019 లోక్‌సభ ఎన్నికల్లో హుకుంసింగ్ కుటుంబాన్ని పక్కనబెట్టిన బీజేపీ... ప్రదీప్ చౌదరిని బరిలో దింపడంతో తబస్సుమ్ హసన్ మరోసారి పరాజయం పాలయ్యారు. (చదవండి: యోగికి దడ పుట్టిస్తున్న ‘ఆలూ’ సినిమా!) -
కైరానా ఎమ్మెల్యే వ్యాఖ్యలతో హైరానా..
లక్నో : యూపీలోని కైరానా ఎస్పీ ఎమ్మెల్యే నహిద్ హసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మద్దతుదారుల దుకాణాల నుంచి ఏ వస్తువూ కొనుగోలు చేయరాదని స్ధానిక ముస్లింలకు ఎమ్మెల్యే పిలుపు ఇవ్వడం కలకలం రేపింది. ముస్లింలు ఈ షాపుల నుంచి సరుకులు కొనుగోలు చేయడం వల్లే బీజేపీ మద్దతుదారులైన వీరు బతుకుతున్నారని ఆ వీడియోలో ఎమ్మెల్యే చెప్పడం గమనార్హం. కైరానాతో పాటు పరిసర గ్రామాల్లోని ముస్లింలు స్ధానిక బీజేపీ మద్దతుదారుల దుకాణాల్లో ఎలాంటి వస్తువులు కొనుగోలు చేయరాదని, పది రోజుల నుంచి నెలరోజుల పాటు ఇలా చేస్తే పరిస్ధితిలో మార్పు వస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వేరే గ్రామాలకు లేదా ఎక్కడికైనా వెళ్లి అవసరమైన సరుకులు తెచ్చుకుని మీ సోదరులకు సంఘీభావం తెలిపేందుకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా తప్పులేదని ఆయన చెప్పుకొచ్చారు. మార్కెట్లో బీజేపీ సానుభూతిపరులైన వ్యాపారులను బహిష్కరించండి. ‘వారి నుంచి మీరు సరుకులు కొనడం వల్లే వాళ్ల ఇళ్లు నడుస్తున్నాయి..మన వైఖరి వల్లనే మనం ఇబ్బందులు పడుతున్నామ’ని ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింల కారణంగా కైరానాలో హిందువులు వలస వెళుతున్నారని కొన్నేళ్ల కిందట ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. -
‘అవును.. అందుకే నాకు టికెట్ ఇవ్వలేదు’
లక్నో : తనకు లోక్‌సభ టికెట్ రాకపోవడం వెనుక పెద్ద కుట్ర జరిగిందని బీజేపీ దివంగత ఎంపీ హకుం సింగ్ తనయ మ్రిగాంకా సింగ్ ఆరోపించారు. బీజేపీ నినాదం బేటీ బచావో.. బేటీ పడావోను ఉటంకిస్తూ.. ‘ నన్ను ఎన్నికల బరిలో నిలవకుండా చేసేందుకు కొంతమంది కుట్ర పన్నారు. బేటీ హఠావో.. అస్థిత్వ మిటావో (కూతుళ్లను తొలగించండి.. వారి వారసత్వాన్ని పూర్తిగా తుడిచేయండి) అనే నినాదంతో సదరు వ్యక్తులు ముందుసాగుతున్నారు’ అని బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాగా 2018లో బీజేపీ సిట్టింగ్ ఎంపీ హుకుం సింగ్ మరణించడంతో యూపీలోని కైరానా నియోజకవర్గంలో ఉపఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో మ్రిగాంక సింగ్‌ను బీజేపీ ఎన్నికల బరిలో దింపగా ఆమె ఓడిపోయారు. ఎస్పీ, బీఎస్పీ మద్దతుతో పోటీ చేసిన రాష్ట్రీయ లోక్‌దళ్(ఆరెల్డీ) అభ్యర్థి తబస్సుం బేగం చేతిలో పరాజయం చవిచూశారు. ఈ క్రమంలో కైరానాతో పాటు గోరఖ్‌పూర్, ఫుల్పూర్ ఉపఎన్నికల్లో ఓటమి చెందడంతో 2014 లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీకి గట్టి షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో మ్రిగాంకను కాదని.. 2019 ఎన్నికల్లో కైరానా నుంచి ప్రదీప్ చౌదరికి బీజేపీ టికెట్ కేటాయించింది. ఈ నేపథ్యంలో మ్రిగాంక మంగళవారం మాట్లాడుతూ... ‘ అవును నాకు టికెట్ రాలేదు. 2018 ఉపఎన్నికల్లో బీజేపీకి 46శాతం ఓట్లు వచ్చాయి. కాబట్టి నాకు మరోసారి అవకాశం ఇస్తారని భావించాను. కానీ అలా జరగలేదు. నా తండ్రి 45 ఏళ్లుగా కైరానాలో చురుగ్గా పనిచేశారు. కానీ నేను అలాచేయలేకపోయానని బాధ పడుతున్నా. నాకు టికెట్ రావడం వెనుక కొంతమంది ప్రమేయం ఉంది అని వ్యాఖ్యానించారు. -
గంట కూడా అధికారాన్ని వదులుకోం!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: షెడ్యూల్ ప్రకారమే లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయని ముందస్తుకు అవకాశమే లేదని బీజేపీ వర్గాలు స్పష్టం చేశాయి. లోక్‌సభతో పాటు 13 రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం వల్ల తలెత్తిన గందరగోళానికి తెరదించాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలేదని పార్టీ అధ్యక్షుడు అమిత్ షా చెప్పినట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఐదేళ్లు అధికారంలో కొనసాగేలా ప్రజలు తీర్పునిచ్చారని, అందుకు కనీసం గంట ముందు కూడా గద్దెదిగబోమని తేల్చిచెప్పాయి. దేశవ్యాప్తంగా 51 శాతం ఓట్లు గెలుచుకోవడమే తమ లక్ష్యమని, ప్రతిపక్షాల ఐక్యతను చెడగొట్టే ఉద్దేశం లేదని తెలిపాయి. మోదీకి రాహుల్ గాంధీ సరితూగరని, ఆయన్ని కాంగ్రెస్ తన ప్రధాని అభ్యర్థిగా నిలబెడితే, అది తమకు లాభమే చేకూరుస్తుందని అన్నాయి. ఇందుకు ఉత్తరప్రదేశ్‌లోని కైరానా ఉప ఎన్నికల్లో బీజేపీ 47 శాతం ఓట్లు పొందడాన్ని ఉదహరించాయి. 14 కోట్ల మంది కార్యకర్తలతో సైన్యం బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తున్నామని, ఒక్కో బూత్‌లో 25 మంది చొప్పున మొత్తం 7 లక్షల బూత్‌లలో కార్యకర్తలను నియమించుకున్నట్లు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా 14 కోట్ల మంది కార్యకర్తలు బీజేపీ కోసం పనిచేస్తున్నారని, వారందరి ఫోన్ నంబర్లు, ఓటరు గుర్తింపు కార్డులు, ఇతర వివరాలు అధ్యక్షుడు అమిత్ షా వద్ద ఉన్నాయని చెప్పాయి. కార్యకర్తలతో షా తరచూ సమావేశమవుతూ వారిని ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారని తెలిపాయి. బీజేపీ ఎంపీలంతా అవిశ్వాస తీర్మానంపై చర్చలో పాల్గొనేందుకు అందుబాటులో ఉండేలా గురువారం, శుక్రవారం వారికి భోజనాలు, ఇతర ఏర్పాట్లు చేయాలని పార్టీ విప్‌లను ఆదేశించినట్లు వెల్లడించాయి. సభకు హాజరై అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటేసేలా తమ పార్టీ సభ్యులందరికీ విప్ జారీచేశామని, దాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించాయి. -
ఉప ఎన్నికల ఎఫెక్ట్: కేంద్రం దిద్దుబాటు చర్యలు
సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీకి గట్టి షాక్ తగిలిన సంగతి తెలిసిందే. మొత్తం నాలుగు లోక్‌సభ స్థానాలు, 11 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఒక లోక్‌సభ స్థానం, ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రమే గెలుపొందింది. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నట్టు ఈ ఉప ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. దేశవ్యాప్తంగా రైతులు ఆందోళనబాటు పడుతున్న నేపథ్యంలో వారికి చేరువయ్యేందుకు కొన్ని ఊరట చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా చెరకు రైతులకు ఒకట్రెండు రోజుల్లో కేంద్రం తీపి కబురు అందించనుందని తెలుస్తోంది. సంక్షోభంలో ఉన్న చెరకు రైతులను ఆదుకునేందుకు రూ. 10వేల కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రకటించనుంది. అలాగే చెరకు ఎగుమతులపై సుంకాన్ని పూర్తిగా రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. చెరకు దిగుమతులపై ప్రస్తుతం 50శాతం సుంకం విధిస్తుండగా.. దానిని 100శాతానికి పెంచనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం వెలువడవచ్చునని భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కీలకమైన కైరానా లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో బీజేపీ దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. సిట్టింగ్ సీటు అయిన కైరానాలో బీజేపీ విపక్షాల ఉమ్మడి అభ్యర్థి చేతిలో పరాజయం పాలైంది. ఇక్కడ బీజేపీ ఓటమిలో చెరకు రైతులు కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో కేంద్రం చెరకు రైతులను ఆదుకునేందుకు ముందుకొచ్చింది. -
కైరానా ఎంపీకి షాక్
లక్నో: కైరానా లోక్‌సభ ఎంపీ ఎన్నికైన బేగం తబస్సుమ్ హసన్‌కు షాక్ తగిలింది. సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్లు సృష్టించిన కొందరు.. ఆమె పేరు మీద కొన్ని వ్యాఖ్యలను వైరల్ చేశారు. అవి స్థానిక వాట్సాప్ గ్రూప్‌లలో వైరల్ కాగా, రాజకీయ దుమారం చెలరేగింది. దీంతో కంగుతిన్న ఆమె షామిలీ పట్టణ పోలీసులను ఆశ్రయించారు. తబస్సుమ్ పేరిట ట్విటర్లో ఫేక్ అకౌంట్లు తెరిచి నిందితులు ఈ పనికి పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా ఈ కేసును సైబర్ విభాగానికి బదిలీ చేసినట్లు ఎస్పీ వర్మ తెలిపారు. ఇటీవల జరిగిన కైరానా ఎన్నికలో కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలు సంయుక్తంగా బేగం తబస్సుమ్ హసన్(ఆర్ఎల్డీ)ను నిలపగా, బీజేపీ అభ్యర్థిని చిత్తుగా ఓడించి ఆమె ఘన విజయం సొంతం చేసుకున్నారు. -
యోగిపై సొంత ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
లక్నో : కైరానా లోక్‌సభ ఉపఎన్నికలో విపక్షాల చేతిలో బీజేపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. పార్టీలోని అంతర్గత కలహాల వల్లే బీజేపీ ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని కూడా వార్తలు వ్యాప్తి చెందాయి. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ హర్దోయి ఎమ్మెల్యే శ్యామ్ ప్రకాశ్ సొంత ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ‘అధికారులంతా అవినీతికి పాల్పడుతున్నారు. రైతులు ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కలిగి ఉన్నారు. ఇలాంటి ఇంకెన్నో కారణాల వల్లే మేం ఓటమి చవిచూడాల్సి వచ్చింది’ అని ఆయన వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం అన్ని శాఖల్లో అవినీతి పెరిగిపోయిందంటూ శ్యామ్ ప్రకాశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కైరానా ఓటమి నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను టార్గెట్ చేస్తూ తన ఫేస్బుక్ పేజీలో ఒక పద్యం కూడా పోస్ట్ చేశారు. ‘మోదీ హవా కారణంగానే మీకు అధికారం దక్కించుకోగలిగారు గానీ ప్రజల మనసుల్ని గెలవలేకపోయారు. పగ్గాలు సంఘ్ చేతిలో ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రైనా నిస్సహాయులుగా మారారు. అధికారులు అవినీతిలో కూరుకుపోయారు. దాంతో ప్రజలు, ప్రజాప్రతినిధులు విసుగెత్తిపోయారు. ప్రభుత్వం గాడి తప్పింది. పాలన విఫలమైంది’ అంటూ సాగిన పద్యానికి తెలివైన వారికి ఇందులో కావాల్సిన సమాధానం దొరుకుతుందంటూ శ్యామ్ ప్రకాశ్ ముగింపునిచ్చారు. -
బీజేపీకు 3.. విపక్షాలకు 11
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 4 పార్లమెంటు స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార ఎన్డీయేకు ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు 11 సీట్లు గెలుచుకోగా.. బీజేపీ కూటమి మూడు స్థానాలకే పరిమితమైంది. ఈ ఉపఎన్నికల ఫలితాలు విపక్షాలకు భారీ విజయం వంటివే. అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన యూపీలోని కైరానా లోక్‌సభ స్థానంలో బీజేపీ (సిట్టింగ్ స్థానంలో) ఓటమిపాలైంది. ఇక్కడ విపక్షాల తరపున బరిలో దిగిన ఆర్ఎల్డీ అభ్యర్థి తబస్సుమ్ హసన్ బీజేపీ అభ్యర్థి మృగాంక సింగ్‌పై విజయం సాధించారు. యూపీలోని నూర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ (బీజేపీ సిట్టింగ్ స్థానం) విపక్షాల ఉమ్మడి అభ్యర్థి (సమాజ్‌వాదీ పార్టీ) గెలిచారు. పంజాబ్, పశ్చిమబెంగాల్, కేరళ, కర్ణాటక, జార్ఖండ్ లలో జరిగిన అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లోనూ బీజేపీ ఓటమిపాలైంది. మహారాష్ట్రలోని పాల్ఘర్ ఎంపీ స్థానంలో 29వేల పై చిలుకు ఓట్లతో, ఉత్తరాఖండ్‌లో ఒక ఎమ్మెల్యే స్థానాన్ని బీజేపీ గెలుచుకుంది. మరాఠా గడ్డపై ఫిఫ్టీ–ఫిఫ్టీ మహారాష్ట్రలో పాల్ఘర్, భండారా–గోందియా లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఒకచోట గెలిచి.. మరోచోట ఓటమి పాలైంది. పాల్ఘర్ ఎన్నికల్లో శివసేనతో చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు జరిగిన పోటీలో బీజేపీ విజయం 29,572 ఓట్లతో సాధించింది. బీజేపీ తరపున రాజేంద్ర గవిట్, శివసేన తరపున శ్రీనివాస్ వనగా పోటీపడ్డారు. బీజేపీ మిత్రపక్షమైన శివసేన ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా బరిలో దిగింది. బీజేపీకి 2,72,782 ఓట్లు, శివసేనకు 2,43,210 ఓట్లు రాగా.. బహుజన్ వికాస్ అఘాడీ (బీవీఏ) పార్టీ 2,22,838 ఓట్లతో మూడోస్థానంలో నిలిచింది. కాంగ్రెస్ 47,714 ఓట్లతో ఐదో స్థానానికి పరిమితమైంది. ఈ ఎన్నికకు ముందే కాంగ్రెస్ నుంచి గవిట్ బీజేపీలో చేరారు. అటు, భండారా–గోందియా స్థానానికి జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీ, ఎన్సీపీ మధ్య హోరాహోరీగానే పోటీ నెలకొంది. బీజేపీ అభ్యర్థి హేమంత్పై ఎన్సీపీ అభ్యర్థి 48,907 ఓట్లతో విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్, ఆర్పీఐ మరో స్వతంత్రుడు కలిపి ఎన్సీపీకి మద్దతిచ్చారు. ఈ విజయంతో ఎన్సీపీ ఎంపీల సంఖ్య ఐదుకు పెరగగా.. లోక్‌సభలో బీజేపీ సభ్యుల సంఖ్య (మహారాష్ట్ర నుంచి) 22కు తగ్గింది. గోందియాలో బీజేపీ ఓటమితో మోదీ అహంకార పూరిత పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైందని ఎన్సీపీ విమర్శించింది. నాగాలాండ్‌లోని ఏకైక ఎంపీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే మిత్రపక్షమైన ఎన్డీపీపీ అభ్యర్థి తోఖెహో యెప్తోమీ లక్షా 73వేల ఓట్లతో ఘనవిజయం సాధించారు. 2014లో ఈ స్థానం నుంచి ఎన్డీపీపీ అధ్యక్షుడు, నాగాలాండ్ ప్రస్తుత సీఎం నీఫూ రియో విజయం సాధించారు. బిహార్‌లో ఆర్జేడీ.. బెంగాల్లో మమత బిహార్‌లోని జోకిహత్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో అధికార జేడీయూకు, సీఎం నితీశ్ కుమార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో ఈ స్థానంలో జేడీయూ గెలిచింది. అయితే ఉప ఎన్నికల్లో మాత్రం ఆర్జేడీ భారీ మెజారిటీతో విజయం సాధించటంతో ఎన్డీయే కూటమికి ప్రతికూలంగా మారింది. లాలూ జైలుకు వెళ్లిన నేపథ్యంలో ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమికి ఈ విజయం భారీగా నైతిక బలాన్నిచ్చింది. ఈ విజయం మోదీ అహంకారపూరిత పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు అని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ విమర్శించారు. అటు పశ్చిమబెంగాల్లోని మహేస్తల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ 62వేల పై చిలుకు ఓట్లతో ఘన విజయం సాధించింది. ఇక్కడ బీజేపీ రెండోస్థానంలో నిలవగా, లెఫ్ట్–కాంగ్రెస్ కూటమి అభ్యర్థి మూడో స్థానానికే పరిమితమయ్యారు. కేరళలోని చెంగన్నూర్ స్థానం ఉప ఎన్నికలో అధికార సీపీఎం అభ్యర్థి సాజిచెరియన్ 20,956 ఓట్లతో కాంగ్రెస్‌పై గెలిచారు. పంజాబ్‌లో అకాలీదళ్ కంచుకోట షాకోట్లో కాంగ్రెస్ పాగా వేసింది. కాంగ్రెస్ అభ్యర్థి హర్దేవ్ సింగ్ లాడీ 38,801 ఓట్లతో అకాలీ–ఆప్ సంయుక్త అభ్యర్థిపై గెలిచారు. ఉత్తరాఖండ్‌లోని థరాళీలో బీజేపీకి చెందిన మున్నీదేవీ షా 1900 ఓట్లతో కాంగ్రెస్‌పై విజయం సాధించారు. జార్ఖండ్‌లోని సిల్లీ, గోమియా నియోజకవర్గాలో జేఎంఎం ఘన విజయం సాధించింది. మేఘాలయాలో కాంగ్రెస్ తన స్థానాన్ని నిలుపుకుంది. కాంగ్రెస్ నేత ముకుల్ సంగ్మా కూతురు మియానీ షిరా 3191 మెజారిటీతో అంపతీ నియోజకవర్గంలో గెలిచారు. కర్ణాటకలోని రాజరాజేశ్వరి నగర్లో కాంగ్రెస్ అభ్యర్థి మునిరత్న నాయుడు 41వేల ఓట్లతో బీజేపీ అభ్యర్థిని ఓడించారు. యూపీలో హసన్‌ల హవా 2014 సార్వత్రిక ఎన్నికల్లో, 2017లో అసెంబ్లీ ఎన్నికల్లోనూ యూపీపై స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించిన బీజేపీ.. ఆ తర్వాత మెల్లమెల్లగా పట్టుకోల్పోతోంది. మార్చిలో యూపీలో గోరఖ్‌పూర్, ఫుల్పూర్ ఎంపీ స్థానాల ఉప ఎన్నికల్లో ఓడిన బీజేపీ.. గురువారం వెల్లడైన కైరానా ఫలితాల్లోనూ పరాజయం పాలైంది. నూర్పూర్ అసెంబ్లీ స్థానంలోనూ ఓటమిపాలైంది. కైరానాలో బీజేపీ, ఆర్ఎల్డీ అభ్యర్థుల మధ్య నువ్వానేనా అన్నట్లుగానే పోలింగ్ జరిగింది. విపక్షాల (ఆర్ఎల్డీ, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ) ఉమ్మడి అభ్యర్థి తబస్సుమ్ హసన్ 44,618 ఓట్లతో విజయం సాధించారు. ఈ విజయంతో తబస్సుమ్.. యూపీ నుంచి 16వ లోక్‌సభకు ఎన్నికైన తొలి ముస్లింగా నిలిచారు. నూర్పూర్లో ఎస్పీ అభ్యర్థి నయీముల్ హసన్ (కాంగ్రెస్, బీఎస్పీ, ఆప్ మద్దతు) 5,662 సీట్లతో గెలిచారు. ఈ రెండు స్థానాలూ బీజేపీ నుంచే విపక్షాలు గెలుచుకున్నాయి. 2019లో యూపీలో ప్రధాని మోదీ ప్రభావమేమీ ఉండదని ఫలితాలు నిరూపిస్తున్నాయని తబస్సుమ్ అన్నారు. ‘ప్రజాస్వామ్యాన్ని విశ్వసించని వారికి, విభజన రాజకీయాలు చేసేవారికి ఈ ఫలితాలు చెంపపెట్టు’ అని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ చెప్పారు. ఎవరేమన్నారంటే.. ఉప ఎన్నికల ఫలితాలతో బీజేపీకి చావుగంట మోగింది. నేను ప్రతిపాదించిన మూడో కూటమి ఫార్ములా విజయవంతమైంది. ప్రజలకు బీజేపీపై ఉన్న భ్రమలు తొలగిపోయాయి. ఆ పార్టీ పతనం ఉత్తరప్రదేశ్ నుంచే ప్రారంభమైంది. ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ కలసి పనిచేస్తే యూపీలో బీజేపీ ఓటమి ఖాయం. ప్రస్తుతం దేశంలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. – మమతా బెనర్జీ ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేని, విభజన రాజకీయాలకు పాల్పడే వారి ఓటమి ఇది. బీజేపీకి ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారు. ఇది దళితులు, రైతులు, పేదల విజయం. – అఖిలేశ్ యాదవ్ నాలుగేళ్ల ఎన్డీయే పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారు. అబద్ధాలు, మోసంతో పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వ పతనానికి ఇదే నాంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి, కాంగ్రెస్–మిత్ర పక్షాల విజయం తథ్యం. – కాంగ్రెస్ యూపీలోని కైరానాలో బీజేపీ ఓటమితో ప్రజలు కుల రాజకీయాలను తిరస్కరించారన్న సంగతి స్పష్టమవుతోంది. వచ్చే ఎన్నికల్లో హిందూత్వ ఓటుబ్యాంకును ఏర్పర్చుకోవడానికి బీజేపీ కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టే ముప్పు ఉంది. – సీతారాం ఏచూరి మోదీ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారు. ఓట్ల చీలిక వల్లే పాల్ఘర్లో బీజేపీ గెలుపొందింది. బీజేపీ పతనం ఆరంభమైందని అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలే తేటతెల్లం చేస్తున్నాయి. – ఎన్సీపీ -
లోక్‌సభలో బీజేపీ మైనార్టీలో పడబోతుందా?
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభలో బీజేపీ మైనార్టీలో పడబోతుందా? ప్రస్తుత పరిస్థితి చూస్తే అలానే ఉంది. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 282 సీట్లతో భారీ మెజార్టీలో ఉన్న బీజేపీ ప్రస్తుతం 273 స్థానాలతో మైనార్టీకి ఒక్క స్థానం దూరంలో ఉంది. ఇటీవల దేశ వ్యాప్తంగా జరిగిన లోక్‌సభ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులు వరుసగా ఓటమి చవిచూస్తున్నారు. 13 లోకసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా ఎనిమిది స్థానాల్లో బీజేపీ పరాజయం పాలైంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఎస్ యడ్యూరప్ప, బీ శ్రీరాములు ఎంపీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడంతో లోక్‌సభలో బీజేపీ ఎంపీల సంఖ్య 273కి చేరింది. మరో 12 మంది కూటమి సభ్యుల మద్దతు బీజేపీకి ఉంది. బీజేపీకి ఎంతో పట్టున్న గోరఖ్‌పూర్ స్థానంలో బీజేపీ అభ్యర్ధి ఓడిపోవడంతో 2019లో జరిగే ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపుపై అనుమానాలు రెకేత్తిస్తున్నాయి. యూపీలో గత ఎన్నికల్లో 71 సీట్లు గెలుచుకున్న కాషాయ దళం గోరఖ్‌పూర్‌తో సహా, పూల్పుర్, కైరానా స్థానాల్లో ఘోర పరాభావం పాలైంది. మధ్యప్రదేశ్, పంజాబ్‌లో సిట్టింగ్ స్థానాలను కోల్పోయింది. ఆ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. రాజస్తాన్‌లో సిట్టింగ్ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు కాంగ్రెస్ చేతిలో ఓటమి చవిచూశారు. కర్ణాటక అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించినా విపక్షాల మద్దతు కూడగట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో బీజేపీ ఘోరంగా విఫలమైంది. ఇన్ని పరాజయాల మధ్య 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడం అంత సులువు కాదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీకి ఎదురుదెబ్బ
-
కైరానా విపక్షాల కైవసం
సాక్షి, న్యూఢిల్లీ : కైరానా(ఉత్తరప్రదేశ్) లోక్‌సభ స్థానాన్ని విపక్షాలు కైవసం చేసుకున్నాయి. దాదాపు 55 వేల ఓట్ల మెజార్టీతో రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్ఎల్డీ) అభ్యర్థి తబస్సుమ్ హసన్ తన సమీప ప్రత్యర్థి మృగంకా సింగ్‌పై ఘన విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో విపక్షాలు(సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్) అన్నీ కలసి ఆర్ఎల్డీ అభ్యర్థి తబస్సుమ్‌కు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. భారతీయ జనతా పార్టీ(బీజేపీ) చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి సరిగా తీసుకెళ్లలేకపోవడమే పరాజయానికి కారణమని ఓటమి అనంతరం మృగంకా వ్యాఖ్యానించారు. ఫలితాలు నిరాశకు గురి చేసినా, భవిష్యత్‌లో తిరిగి నియోజకవర్గంపై పట్టు సాధిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. బీజేపీలో అంతర్గత కలహాల వల్లే ఓటమిని ఎదుర్కొవాల్సి వచ్చిందనే వార్తలను ఆమె కొట్టిపారేశారు. విపక్షాలు అన్నీ ఏకమై బీజేపీను ఓడించాయని అన్నారు. ఇందుకు బీజేపీ మరింత సన్నద్ధం కావాల్సివుందని అభిప్రాయపడ్డారు. కాగా, కైరానా ఉప ఎన్నికలో విజయం సాధించిన తబస్సుమ్ మాట్లాడుతూ ఈ విజయం కైరానా ప్రజలదని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుడిగాలి రాష్ట్రంలో లేదని చెప్పడానికి ఈ ఫలితమే నిదర్శమని అన్నారు. మహ్మద్ అలీ జిన్నా వివాదాన్ని తెరపైకి తెచ్చి ఉప ఎన్నికలో గెలవాలని చూసిన బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అభిప్రాయపడ్డారు. అంతకుముందు కైరానా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ హుకుమ్ సింగ్ ఫిబ్రవరిలో అర్థాంతరంగా తుది శ్వాస విడిచారు. దీంతో ఆయన తనయ మృగంకా సింగ్‌ను కైరానా నుంచి బీజేపీ బరిలో నిలిపింది. -
123 చోట్ల రీ పోలింగ్
న్యూఢిల్లీ: సోమవారం ఉప ఎన్నిక జరిగిన ప్రాంతాల్లోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని ఎన్నికల సంఘం(ఈసీ) నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్‌లోని కైరానా నియోజకవర్గంలోని 73 పోలింగ్ స్టేషన్లు, మహారాష్ట్ర భండారా–గోండియా నియోజకవర్గంలోని 49, నాగాలాండ్‌లోని ఒక పోలింగ్ కేంద్రాల్లో బుధవారం మళ్లీ పోలింగ్ జరగనుంది. వీవీపాట్లలో లోపాలు తలెత్తటంతో రీపోలింగ్ అవసరమైందని, ఆయా ప్రాంతాలకు కొత్త మెషీన్లను తరలించినట్లు ఈసీ తెలిపింది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన గోండియా కలెక్టర్‌ను బదిలీ చేసి, కొత్త కలెక్టర్‌కు బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించింది. -
123 చోట్ల రీ పోలింగ్
న్యూఢిల్లీ: సోమవారం ఉప ఎన్నిక జరిగిన ప్రాంతాల్లోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని ఎన్నికల సంఘం(ఈసీ) నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్‌లోని కైరానా నియోజకవర్గంలోని 73 పోలింగ్ స్టేషన్లు, మహారాష్ట్ర భండారా–గోండియా నియోజకవర్గంలోని 49, నాగాలాండ్‌లోని ఒక పోలింగ్ కేంద్రాల్లో బుధవారం మళ్లీ పోలింగ్ జరగనుంది. వీవీపాట్లలో లోపాలు తలెత్తటంతో రీపోలింగ్ అవసరమైందని, ఆయా ప్రాంతాలకు కొత్త మెషీన్లను తరలించినట్లు ఈసీ తెలిపింది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన గోండియా కలెక్టర్‌ను బదిలీ చేసి, కొత్త కలెక్టర్‌కు బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించింది. -
అందరి దృష్టి ‘కైరానా’ ఫలితంపైనే
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని కైరానా లోక్‌సభ నియోజకవర్గానికి సోమవారం నాడు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఇటు పాలకపక్ష బీజేపీకి, ప్రతిపక్ష పార్టీలకు అత్యంత ప్రతిష్టాకరమైనవి. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలిచ్చిన అనుభవంతో ప్రతిపక్ష పార్టీలన్నీ కలసికట్టుగా కైరానా సీటుకు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టగా బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తోంది. 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికలకు ఈ ఉప ఎన్నిక ఫలితం ఓ సంకేతం లాంటిది. ఎందుకంటే యూపీ నుంచి 80 లోక్‌సభ స్థానాలున్న విషయం తెల్సిందే. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హవా కారణంగా 80 సీట్లకుగాను బీజేపీకి 71 సీట్లు, దాని మిత్రపక్షమైన అప్నాదళ్‌కు రెండు సీట్లు వచ్చాయి. నాటి ఎన్నికల్లో బీజేపీ తనకంటూ ప్రత్యేక ఓటర్ల పునాదిని ఏర్పాటు చేసుకోవడంతోపాటు మాయావతి దళిత ఓటర్లను కూడా కొల్లగొట్టింది. నాడు కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ మధ్య ఓబీసీ, దళితులు, ముస్లింలు ఓటర్లు చీలిపోవడంతో బీజేపీ బాగా లాభపడింది. ఆనాటి గుణపాఠంతో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా ఏకమయ్యాయి. ఫలితంగా యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి ఖాళీ చేసిన గోరఖ్‌పూర్, డిప్యూటి ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఖాళీ చేసిన ఫూల్పూర్ లోక్‌సభ నియోజక వర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినప్పటికీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ముందస్తు ఎన్నికల ఒప్పందం లేకపోయినప్పటికీ జేడీఎస్‌తో కలసి కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఒకే వేదికపై బీజేపీకి వ్యతిరేకంగా పలు ప్రాంతీయ, జాతీయ పార్టీల నాయకులు చేతులు కలపడం వారి భవిష్యత్ ఐక్యతను సూచిస్తోంది. ఈ నేపథ్యంలో జరుగుతున్న కైరానా లోక్‌సభ ఉప ఎన్నిక ప్రతిష్టాకరంగా మారడంతో బీజేపీ తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితోపాటు పలువురు రాష్ట్ర మంత్రులు ఎన్నికల ప్రచారం చేశారు. బీజేపీ సిట్టింగ్ సభ్యుడు ఎంపీ హుకుమ్ సింగ్ మరణంతో కైరానా లోక్‌సభకు ఉప ఎన్నిక అనివార్యమైంది. 2014లో జరిగిన ఎన్నికల్లో ఆయన తన సమీప ఎస్పీ అభ్యర్థి నహీద్ హాసన్‌పై 2.3 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో పది లక్షల మంది హిందువులుండగా, 5.46 లక్షల మంది ముస్లింలు ఉన్నారు. ఇక్కడి నుంచి సమాజ్‌వాది సభ్యురాలు తబాసన్ హాసన్ ఆర్ఎల్డీ టిక్కెట్‌పై పోటీ చేయగా, బీజేపీ పార్టీ తరఫున హుకుమ్ సింగ్ కూతురు మగాంక సింగ్ పోటీ చేశారు. -
ఉపఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ,విపక్షాలు
-
కైరానా ఉపఎన్నికల్లో బీజేపీకి ఓటేయ్యకండి
-
బీజేపీకి మరో షాక్ ఇవ్వనున్న అఖిలేశ్..!
లక్నో : గోరఖ్‌పూర్, ఫూల్పూర్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీకి షాక్ ఇచ్చిన మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ రానున్న కాలంలో అదే జోరును కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీఎస్పీ మద్దతుతో ఎస్పీ అభ్యర్థులు విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో సీఎం, డిప్యూటీ సీఎంలు యోగి, మౌర్య ఈ స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఉప ఎన్నికల్లో మాత్రం అధికార పార్టీ సిట్టింగ్ స్థానాల్లో ఎస్పీ అభ్యర్థులు గెలుపొందడం ఆ పార్టీలో నూతన ఉత్సహాన్ని నింపింది. అదే స్ఫూర్తిగా కైరానా లోక్‌సభ, నూర్పూర్ అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సాధారణ ఎన్నికల్లో ఈ స్థానాల్లో గెలుపొందిన బీజేపీ నాయకలు మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. గత ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఏకం చేసి విజయం సాధించిన అఖిలేశ్ అదే వ్యుహాన్ని మళ్లీ రచిస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్రీయ్ లోక్ దళ్‌తో జట్టు కట్టారు. కైరానా లోక్‌సభ స్థానానికి ఎస్పీ నేతను ఆర్ఎల్డీ పార్టీ తరఫున పోటీ చేయించనున్నారు. అదేవిధంగా నూర్పూర్ అసెంబ్లీ స్థానానికి ఆర్ఎల్డీ అభ్యర్థిని ఎస్పీ తరఫున నిలుపనున్నారు. దీనిద్వారా ఇరు పార్టీల కార్యకర్తలు విజయం కోసం శ్రద్ధగా పనిచేస్తారని అఖిలేశ్‌తోపాటు, ఆర్ఎల్డీ ఉపాధ్యక్షుడు జయంత్ చౌదరి భావిస్తున్నారు. ముస్లిం, దళితుల ఓట్లు కీలకంగా ఉన్న కైరానా లోక్‌సభ స్థానంలో 2009లో ఎస్పీ తరఫున విజయం సాధించిన తబుసమ్ హసన్‌ను ఎస్పీ-ఆర్ఎల్డీ కూటమి తమ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే మాయావతి మాత్రం ఇక్కడ ఎస్పీ అభ్యర్థికి మద్దతు తెలిపేది లేదని చెప్పడం, కాంగ్రెస్ కూడా ఆర్ఎల్డీ అభ్యర్థికైతేనే మద్దతు తెలుపుతామని చెప్పడంతో అఖిలేశ్ తమ పార్టీ అభ్యర్థిని ఆర్ఎల్డీ తరఫున బరిలోకి దింపనున్నట్టు తెలుస్తోంది. బీజేపీ తరఫున చనిపోయిన హుకుమ్ సింగ్ కుమార్తె మ్రింగాక సింగ్‌ను ఆ స్థానంలో బరిలోకి దించారు. మే 28న జరగనున్న ఈ ఉప ఎన్నికల్లో విజయం ద్వారా బీజేపీకి గట్టి షాక్ ఇవ్వడంతోపాటు, కార్యకర్తల్లో నూతన ఉత్తేజం తీసుకురావచ్చని అఖిలేశ్ భావిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ మద్దతు పొందిన ఎస్పీ-ఆర్ఎల్డీ కూటమికి ఒకవేళ మాయావతి మద్దతు తెలిపితే విజయం సులువవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
హెరాయిన్ స్వాధీనం: మహిళ స్మగ్లర్లు అరెస్ట్
ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్‌లోని షామిలి జిల్లాలో కైరానా పట్టణంలో గురువారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఓ ఇంట్లో దాచి ఉంచిన దాదాపు 200 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఇద్దరు మహిళ స్మగ్లర్లు రిహనా, సోనను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం హెరాయిన్ సీజ్ చేసి... స్మగ్లర్లను పోలీసు స్టేషన్‌కు తరలించారు. నిందితులపై ఎన్డీపీసీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కైరానా పట్టణంలో ఇటీవల కాలంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణ జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు నిఘా పెంచారు. ఆ క్రమంలో ఓ ఇంట్లో హెరాయిన్ స్మగ్లింగ్ చేస్తున్నారంటూ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు సదరు నివాసంలో తనిఖీలు నిర్వహించారు. సీజ్ చేసిన హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ. 40 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. -
8 నెలల క్రితం గ్యాంగ్‌రేప్... ఇప్పుడు వెలుగులోకి...
వికలాంగురాలైన మహిళ (25)పై నలుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. అయితే విషయం దాదాపు ఎనిమిది నెలల తర్వాత వెలుగులోకి వచ్చింది. అది సదరు మహిళ గర్భవతి కావడంతో అసలు విషయం బయటపడింది. దాంతో వికలాంగురాలిని కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. దాంతో ఆ యువతి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. దాంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఆ సంఘటన ఉత్తరప్రదేశ్ షామిల్ జిల్లా కైరానా పట్టణంలో చోటు చేసుకుంది. నిందితులు మహబూబ్, మొబిన్, మున్నావర్, నూర్ మహ్మద్‌లుగా గుర్తించినట్లు... వారికోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో వికలాంగురాలిపై పైన పేర్కొన్న సదరు నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ విషయాన్ని బయటకు వెల్లడిస్తే చంపేస్తామంటూ బెదిరించారు. దాంతో ఆమె మిన్నుకుండిపోయింది. ఆ క్రమంలో ఇటీవల ఆ వికలాంగురాలైన మహిళ తీవ్ర అనారోగ్యం పాలైంది. దాంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆమె గర్బవతి అని వైద్యులు తల్లిదండ్రులకు వెల్లడించారు. దాంతో వారు వికలాంగురాలిని ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.