హెరాయిన్ స్వాధీనం: మహిళ స్మగ్లర్లు అరెస్ట్ | 200 gm heroin seized; 2 women arrested in UP | Sakshi
Sakshi News home page

హెరాయిన్ స్వాధీనం: మహిళ స్మగ్లర్లు అరెస్ట్

Published Thu, Oct 30 2014 11:01 AM | Last Updated on Sat, Sep 2 2017 3:37 PM

హెరాయిన్ స్వాధీనం:  మహిళ స్మగ్లర్లు అరెస్ట్

హెరాయిన్ స్వాధీనం: మహిళ స్మగ్లర్లు అరెస్ట్

ముజఫర్నగర్: ఉత్తరప్రదేశ్లోని షామిలి జిల్లాలో కైరానా పట్టణంలో గురువారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఓ ఇంట్లో దాచి ఉంచిన దాదాపు 200 గ్రాముల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఇద్దరు మహిళ స్మగ్లర్లు రిహనా, సోనను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం హెరాయిన్ సీజ్ చేసి... స్మగ్లర్లను పోలీసు స్టేషన్కు తరలించారు.

నిందితులపై ఎన్డీపీసీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కైరానా పట్టణంలో ఇటీవల కాలంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణ జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు నిఘా పెంచారు.  ఆ క్రమంలో ఓ ఇంట్లో హెరాయిన్ స్మగ్లింగ్ చేస్తున్నారంటూ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు సదరు నివాసంలో తనిఖీలు నిర్వహించారు. సీజ్ చేసిన హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ. 40 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement