మీరు జీవితకాల ప్రేమ పొందారు: యూపీ పోలీసు వినూత్న ట్వీట్‌ | UP Police congratulates indian team over fan Life Term love After World Cup Win | Sakshi

మీరు జీవితకాల ప్రేమ పొందారు: యూపీ పోలీసు వినూత్న ట్వీట్‌

Jun 30 2024 8:12 AM | Updated on Jun 30 2024 6:18 PM

UP Police congratulates indian team over fan Life Term love After World Cup Win

లక్నో: భారత జట్టు టీ20 ప్రపంచ కప్‌ను రెండోసారి సొంతం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ 7 ఏడు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడిచింది.  దీంతో 17  ఏళ్ల నిరీక్షణ తర్వాత ధోని బృందం సాధించిన తొలి టీ20 ప్రపంచకప్‌ జట్టులోని సభ్యుడు రోహిత్‌ శర్మ  సారథ్యంలో రెండో టీ20 ప్రపంచ కప్‌ను అందుకుంది.  

భారత్‌ టీ 20 ప్రపంచం కప్‌ సాధించటంతో ప్రధాని మోదీ నుంచి మొదలు.. సెలబ్రిటీలు అంతా అభినందనలు తెలియజేస్తున్నారు. తాజాగా ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు కూడా భారత జట్టుకు అభినందనలు తెలిపారు. యూపీ పోలీసులు.. తమ ‘ఎక్స్‌’అకౌంట్‌లో ఆసక్తికర పోస్ట్‌ చేశారు.

‘బ్రేకింగ్‌ న్యూస్‌.. భారత జట్టు బౌలర్లు దక్షిణాఫ్రికా హృదయాలను బద్దలు కొట్టడంలో దోషులుగా మిగిలారు. అలాగే భారత్‌లోని బిలియన్ క్రికెట్‌ అభిమానుల నుంచి జీవితకాల ప్రేమను పొందారు!’ అని  పోస్ట్‌లో తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘సరిగా చెప్పారు. భారత జట్టు  బిలయన్‌ అభిమాను జీవితం కాలం పొందారు’అని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement