కౌలాలంపూర్: ఐసీసీ మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్‌కు ముందు డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు వార్మప్ మ్యాచ్‌లో భారీ విజయంతో శుభారంభం చేసింది. సోమవారం జరిగిన ఈ సన్నాహక పోరులో భారత్ ఏకంగా 119 పరుగుల భారీ తేడాతో స్కాట్లాండ్‌పై జయభేరి మోగించింది.
ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. కమలిని (23 బంతుల్లో 32) టాప్‌స్కోరర్ కాగా, తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష (26), కెప్టెన్ నికీ ప్రసాద్ (25) సనిక చల్కే (17) సహచరులకూ బ్యాటింగ్ ప్రాక్టీస్ అవకాశమిచ్చేందుకు రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగారు.
ప్రత్యర్థి బౌలర్లలో అమీ బల్డీ (2/13) కాస్త ప్రభావం చూపింది. 3 ఓవర్లు వేసిన ఆమె 13 పరుగులే ఇచి్చంది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన స్కాట్లాండ్‌ను భారత బౌలర్లు 18.5 ఓవర్లలో 45 పరుగులకే ఆలౌట్ చేశారు. వైజాగ్‌కు చెందిన షబ్నమ్ షకీల్, వైష్ణవి శర్మ, సోనమ్ యాదవ్ తలా 2 వికెట్లు తీశారు.
సోమవారం జరిగిన మిగతా వార్మప్ మ్యాచ్‌ల్లో ఆ్రస్టేలియా 140 పరుగుల తేడాతో ఆతిథ్య మలేసియాను ఓడించగా, వెస్టిండీస్ 9 పరుగుల తేడాతో నేపాల్‌పై గట్టెక్కింది. అమెరికా జట్టు 13 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌కు షాక్ ఇచి్చంది. బంగ్లాదేశ్ 4 వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలుపొందగా, ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో సమోవాపై ఘనవిజయం సాధించింది. పాకిస్తాన్ 11 పరుగులతో నైజీరియాను ఓడించింది.
ప్రధాన టోర్నీ ఈనెల 18 నుంచి జరుగుతుంది. అయితే భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను ఆదివారం వెస్టిండీస్‌తో ఆడుతుంది. రెండేళ్ల క్రితం 2023లో దక్షిణాఫ్రికాలో తొలిసారిగా నిర్వహించిన మహిళల అండర్–19 మెగా ఈవెంట్‌లో భారత్ విజేతగా నిలిచింది. ఫైనల్లో 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను కంగుతినిపించింది.
Comments
Please login to add a commentAdd a comment