under-19 cricket
-
భారత్ X పాకిస్తాన్
దుబాయ్: ఆసియా కప్ అండర్–19 వన్డే క్రికెట్ టోర్నీలో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. యూఏఈలో జరుగుతున్న ఈ టోర్నీలో నేడు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో యువ భారత జట్టు తలపడుతుంది. ఉదయం గం. 10:30 నుంచి జరిగే ఈ మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. గ్రూప్ ‘ఎ’లో భాగంగా జరగనున్న ఈ లీగ్ పోరులో శుభారంభం చేయాలని మొహమ్మద్ అమాన్ సారథ్యంలోని భారత జట్టు భావిస్తోంది. ఇప్పటి వరకు 10 సార్లు జరిగిన ఈ టోర్నీలో ఎనిమిదిసార్లు విజేతగా నిలిచిన యువ భారత్... ఈసారి కూడా టైటిల్ నెగ్గాలనే లక్ష్యంతో ఉంది. ఇటీవల ఐపీఎల్ మెగా వేలంలో రూ.1.10 కోట్లకు అమ్ముడుపోయిన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై అందరి దృష్టి నిలవనుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌ల్లో అఫ్గానిస్తాన్‌పై బంగ్లాదేశ్; నేపాల్ జట్టుపై శ్రీలంక విజయం సాధించాయి. -
టీమిండియాకు మరో హార్దిక్ పాండ్యా.. ఎవరీ అర్షిన్ కులకర్ణి?
టీమిండియాకు మరో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దొరికేశాడు. అచ్చెం హార్దిక్ లాంటి బ్యాటింగ్, మీడియం పేస్ బౌలింగ్, అదే దూకుడైన కెప్టెన్సీ. అతడు ఎవరో కాదు మహారాష్ట్ర యువ సంచలనం, భారత జట్టు అండర్-19 ఆటగాడు అర్షిన్ కులకర్ణి. ప్రస్తుతం అండర్-19 ఆసియాకప్‌లో భారత జట్టుకు సారథ్యం వహిస్తున్న అర్షిన్.. తన అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. ఆల్‌రౌండ్ స్కిల్స్‌తో అకట్టుకుంటున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా దుబాయ్ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కులకర్ణి సత్తా చాటాడు. బౌలింగ్‌లో 3 కీలక వికెట్లు పడగొట్టిన ఈ యువ సంచలనం.. బ్యాటింగ్‌లో 70 పరుగులతో ఆజేయంగా నిలిచి భారత్‌కు తొలి విజయాన్ని అందించాడు. ఈ నేపథ్యంలో అర్షిన్ కులకర్ణి గురుంచి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ఎవరీ అర్షిన్ కులకర్ణి..? 18 ఏళ్ల అర్షిన్ కులకర్ణి మహారాష్ట్రలోని షోలాపూర్‌లో జన్మించాడు. అతడి తండ్రి అతుల్ కులకర్ణి వృత్తి రీత్యా వైద్యుడు. అతుల్ కులకర్ణి కూడా క్రికెటర్ అయ్యేందుకు అన్ని విధాల ప్రయత్నించి విఫలమయ్యాడు. క్రికెటర్ కావాల్సింది డాక్టరయ్యాడు. అయితే తన కలను కొడుకు రూపంలో నెరవేర్చకోవాలని అతుల్ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే తన కొడుకు చిన్నతనం నుంచే క్రికెట్ మెళకువలు నేర్పించాడు. అర్షిన్ ప్రాధమికంగా షోలాపూర్‌లో శిక్షణ పొందాడు. అయితే అతడిలో అద్భుత టాలెంట్‌ను గుర్తించిన కోచ్‌లు మెరుగైన క్రికెట్ అవకాశాల కోసం పూణేకు మకాం మార్చమని కోరారు. అదే సమయంలో మహారాష్ట్ర అండర్-14 జట్టులో అర్షిన్ కులకర్ణికి చోటు దక్కడంతో అతడి తండ్రి తన ఫ్యామిలీని పుణేకు షిప్ట్ చేశాడు. పుణేలోని కాడెన్స్ అకాడమీలో అర్షిన్ కులకర్ణి తన స్కిల్స్‌ను మరింత మెరుగుపరుచుకున్నాడు. ఓ వైపు క్రికెట్‌తో ప్రయాణం సాగిస్తునే చదువును కూడా కొనసాగించాడు. వారానికి నాలుగు రోజులు షోలాపూర్‌లోని సెయింట్ జోసెఫ్ స్కూల్‌కు వెళ్లి విద్యను అభ్యసించేవాడు. ఆ తర్వాత వినూ మన్కడ్ ట్రోఫీలో లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచిన అర్షిన్ కులకర్ణి.. మహారాష్ట్ర సీనియర్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అదే విధంగా మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్‌లో కూడా అర్షిన్ దుమ్మురేపాడు. ఈ క్రమంలోనే భారత అండర్-19 ఆసియాకప్ జట్టుకు అర్షిన్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. హార్దిక్‌ను కలిసిన అర్షిన్ అర్షిన్కు హార్దిక్ పాండ్యా ఆరాద్య క్రికెటర్. ఆసియాకప్‌లో పాల్గోనేందుకు వెళ్లే ముందు బెంగళూరులోని ఏన్సీఏలో హార్దిక్‌ను కులకర్ణి కలిశాడు. హార్దిక్ నుంచి విలువైన సూచనలు స్వీకరించాడు. గాయం నుంచి కోలుకుంటున్న హార్దిక్ పాండ్యా ఏన్సీఏలో చికిత్స పొందుతున్నాడు. -
భారత్‌ను కాదని ఇంగ్లండ్‌కు ఆడనున్న మాజీ క్రికెటర్ కుమారుడు
టీమిండియా మాజీ పేసర్ రుద్రప్రతాప్ సింగ్ (సీనియర్) కుమారుడు హ్యారీ సింగ్ ఇంగ్లండ్ తరపున అండర్-19 క్రికెట్ ఆడనున్నాడు. శ్రీలంకతో స్వదేశంలో జరగనున్న ద్వైపాక్షిక అండర్-19 సిరీస్‌కు హ్యారీ సింగ్ ఎంపికయ్యాడు. కొన్నాళ్ల నుంచి హ్యారీ సింగ్తన బ్యాటింగ్‌తో అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నాడు. అండర్-19లో రాణిస్తే.. సీనియర్ ఇంగ్లండ్ జట్టులో చోటు దక్కే అవకాశం ఉండడంతో హారి సింగ్‌కు ఇది కీలకం కానుంది. కాగా హ్యారీ సింగ్ లంకాషైర్ జూనియర్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. కాగా అండర్-19కు ఎంపికైన తన కుమారుడిపై సీనియర్ ఆర్పీ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెక్స్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ..'' కొద్ది రోజుల క్రితం, ఇంగ్లండ్ అండర్-19 జట్టుకు హ్యారీని ఎంపిక చేసినట్లు ఈసీబీ నుంచి కాల్ వచ్చింది. శ్రీలంక అండర్-19 జట్టుతో స్వదేశంలోనే ఈ సిరీస్ ఆడనుంది. అయితే హారీ ఎంపిక అంత సులభంగా కాలేదు. ఉన్నత స్థాయికి చేరుకోవడానికి కొంచెం అదృష్టంతో పాటు పరుగులు చేయడం కూడా అవసరం. 90వ దశకంలో మన భారత్‌లో దేశవాళీ క్రికెట్లో బాగా రాణిస్తున్న చాలా మంది క్రికెటర్లను చూశాను. కానీ వారు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించినప్పుడు ఘోరంగా విఫలమయ్యారు. హ్యారీ ఎదుగుతున్న కొద్దీ.. ప్రతి క్రికెటర్ చేసే టెక్నికల్ సర్దుబాట్లను చేయడానికి కష్టపడాల్సి వచ్చింది.'' అని పేర్కొన్నాడు. కూతురు, కుమారుడితో మాజీ క్రికెటర్ రుద్రప్రతాప్ సింగ్ సీనియర్ ఇక లక్నోకు చెందిన సీనియర్ రుద్రప్రతాప్ సింగ్(ఆర్పీ సింగ్) 1986లో టీమిండియా తరపున ఆస్ట్రేలియాతో వన్డే ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. కేవలం రెండు వన్డే మ్యాచ్‌ల్లో మాత్రమే అతను టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. కపిల్‌దేవ్ కెప్టెన్సీలోనే ఆర్పీ సింగ్ ఈ రెండు మ్యాచ్‌లు ఆడాడు. ఇక దేశవాలీ క్రికెట్లో ఉత్తర్ ప్రదేశ్‌కు ఆడిన ఆర్పీ సింగ్ 59 ఫస్ట్‌క్లాస్, 21 లిస్ట్ -ఏ మ్యాచ్‌లు ఆడాడు. ఇక ఆర్పీ సింగ్ బ్రిటన్‌కు చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కుటుంబంతో కలిసి లండన్‌లోనే సెటిలయ్యాడు. కాగా ఆర్పీ సింగ్ కూతురు కూడా మెడిసిన్ చదవడానికి ముందు లంకాషైర్ తరపున అండర్-19 క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించింది. మరో ఆసక్తికర విశేషమేమిటంటే.. సీనియర్ ఆర్పీ సింగ్ అరంగేట్రం చేసిన 19 ఏళ్లకు.. అంటే 2005లో టీమిండియా తరపున మరో ఆర్పీ సింగ్(రుద్రప్రతాప్ సింగ్) అరంగేట్రం చేశాడు. ఇతనికి కూడా ఉత్తర్‌ప్రదేశ్ కావడంతో.. సీనియర్ ఆర్పీ సింగ్‌కు బంధువు అని చాలా మంది అనుకున్నారు. కానీ సీనియర్ ఆర్పీ సింగ్‌తో.. జూనియర్ ఆర్పీ సింగ్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఇక జూనియర్ ఆర్పీ సింగ్ టీమిండియా తరపున 2005-2011 వరకు బౌలింగ్‌లో ఆర్పీ సింగ్ కీలకపాత్ర పోషించాడు. టీమిండియా గెలిచిన 2007 టి20 వరల్డ్‌కప్ జట్టులో ఆర్పీ సింగ్ సభ్యుడు. అంతేకాదు ఆ టోర్నీలో రెండో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. టీమిండియా తరపున 14 టెస్టుల్లో 40 వికెట్లు, 58 వన్డేల్లో 69 వికెట్లు తీశాడు. 2018లో ఆర్పీ సింగ్ అన్ని ఫార్మాట్లు సహా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. చదవండి: Asia Cup 2022: టీమిండియా వైస్ కెప్టెన్ వచ్చేస్తున్నాడు.. మరి కోహ్లి సంగతి! Asia Cup 2022: ఆసియా కప్‌లో భారత్, పాక్‌లు మూడుసార్లు ఎదురెదురు పడే అవకాశం..! -
Under-19 World Cup: అప్పుడు కుర్రాళ్లు.. ఇప్పుడు సూపర్స్టార్లు
అండర్-19 ప్రపంచకప్ సంబరం శనివారంతో ముగియనుంది. టీమిండియా, ఇంగ్లండ్‌లు ఫైనల్లో అమితుమీ తేల్చుకోనున్నాయి. ఆస్ట్రేలియాపై స్టన్నింగ్ విక్టరీతో టీమిండియా యువ జట్టు బలోపేతంగా కనిపిస్తున్నప్పటికి ప్రత్యర్థి ఇంగ్లండ్‌ను తక్కువ అంచనా వేయడానికి లేదు. ఏ మాత్రం తేడా జరిగిన మొదటికే మోసం వస్తుంది. ఇప్పటికే నాలుగు సార్లు అండర్-19 ప్రపంచకప్ టైటిల్ గెలిచిన టీమిండియా ఐదో టైటిల్‌పై కన్నేసింది. యష్ ధుల్ నేతృత్వంలోని యువజట్టు ఏం చేస్తుందో చూడాలి. ఇక అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ పురస్కరించుకొని ఐసీసీ కూడా తనదైన శైలిలో ప్రమోషన్ చేస్తుంది. చదవండి: ఇంగ్లండ్‌తో ఫైనల్.. కుర్రాళ్లకు విరాట్ కోహ్లి కీలక సూచనలు! విరాట్ కోహ్లి, జో రూట్, బాబర్ అజమ్, స్టీవ్ స్మిత్, బెన్ స్టోక్స్ లాంటి స్టార్ క్రికెటర్లు ఒకప్పుడు అండర్-19కు ఆడినవారే. తమ దేశం తరపున అండర్-19 వరల్డ్‌కప్ ఆడి తమ జట్టును విజేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించారు. ఇప్పుడంటే వీరి ఆటను చూసి మనం ఎంజాయ్ చేస్తున్నాం. అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టకముందు ఈ కుర్రాళ్ల ఆట ఎలా ఉందో చూడండి అంటూ ఐసీసీ ఒక వీడియోనూ షేర్ చేసింది. పైన పేర్కొన్న క్రికెటర్లంతా అండర్-19 ఆడిన రోజులతో పాటు.. ప్రస్తుతం ఆడుతున్న రోజులను కలిపి వీడియో రూపంలో వదిలింది. ''సంవత్సరాలు గడిచాయి.. టెక్నిక్‌లో మార్పు ఉండొచ్చు.. కానీ క్లాస్ మాత్రం అలాగే మిగిలిపోయింది.ఇప్పుడు వీరంతా పెద్ద సూపర్‌స్టార్స్.. ఇందులో ఏ ఆటగాడిలో మార్పు వచ్చిందో కాస్త చెప్పండి'' అంటూ క్యాప్షన్ జత చేసింది. చదవండి: 'టీమిండియాదే ప్రపంచకప్.. యష్ ధుల్ మరోసారి చెలరేగడం ఖాయం' View this post on Instagram A post shared by ICC (@icc) -
భారత బౌలర్ల ధాటికి లంక జట్టు విలవిల.. ఛాంపియన్‌గా యువ భారత్
Update: దుబాయ్ వేదికగా శ్రీలంకతో జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో యువ భారత జట్టు ఘన విజయం సాధించి, ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది. వరుణుడి అటంకాల నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 38 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. అనంతరం డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం యువ భారత్ లక్ష్యాన్ని 38 ఓవర్లలో 102 పరుగులకు కుదించగా.. కేవలం 21.3 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత ఓపెనర్ రఘువంశీ(56 నాటౌట్), గుంటూరు కుర్రాడు షేక్ రషీద్(31 నాటౌట్) టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. అంతకుముందు విక్కీ ఓస్వాల్(3/11), కౌశల్ తాంబే(2/23), రాజ్ బవా(1/23), రవికుమార్(1/17), రాజవర్ధన్(1/26) లంకేయుల పతనాన్ని శాసించారు. దుబాయ్: భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న అండర్-19 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌కి వరుణుడు ఆటంకం కలిగించాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచే సమయానికి 33 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. భారత స్పిన్నర్లు విక్కీ ఓస్వాల్(3/11), కౌశల్ తాంబే(2/23), పేసర్లు రాజ్ బవా(1/11), రవికుమార్(1/8)ల ధాటికి లంక జట్టు విలవిలలాడింది. India U19 are on a roll with the ball! 👌 👌 Vicky Ostwal, Kaushal Tambe, Raj Bawa and Ravi Kumar share the spoils. 👏👏 #BoysInBlue Sri Lanka U19 seven down. #ACC #U19AsiaCup #INDvSL 📸 📸: ACC Follow the match ▶️ https://t.co/GPPoJpzNpQ pic.twitter.com/nbcyvpgbfH — BCCI (@BCCI) December 31, 2021 రవీన్ డిసిల్వా(26 బంతుల్లో 13 నాటౌట్; ఫోర్), యాసిరు రోడ్రిగో(13 బంతుల్లో 4 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. 26.3 ఓవర్ల వద్ద 57 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన శ్రీలంకను రవీన్ డిసిల్వా, యాసిరు రోడ్రిగో ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, భారత యువ జట్టు సెమీస్‌లో బంగ్లాదేశ్‌పై 103 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరగా.. లంకేయులు పాక్ యువ జట్టుకు షాకిచ్చి తుది పోరుకు అర్హత సాధించారు. చదవండి: ఇంగ్లండ్ కోచ్‌గా గ్యారీ కిర్‌స్టన్! -
ఫోటో షేర్ చేసిన భారత స్పిన్నర్.. ఈ ఫొటోలో ఉన్నది ఎవరో చెప్పుకోండి చూద్దాం.!
Harbhajan Singh posts throwback picture from U19 days: భారత వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పడు అభిమానుల కోసం ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూనే ఉంటాడు. ఈ క్రమంలో అండర్-19 ప్రపంచకప్ నాటి జ్ఞాపకాలను భజ్జీ గుర్తు చేసుకున్నాడు. 1997-98 దక్షిణాఫ్రికాలో జరిగిన అండర్-19 ప్రపంచ కప్ నాటి ఫొటోను హర్భజన్ ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలో హర్భజన్‌తో పాటు అండర్-19 ప్రపంచకప్‌లో పాల్గొన్న పాక్ క్రికెటర్లు ఇద్దరు ఉన్నారు. ఈ ఫొటోకు భజ్జీ పెహచానో టు మానే(అర్ధం తెలుసుకో) అంటూ క్యాప్షన్ పెట్టాడు. అయితే ఈ ఫొటోలో హర్భజన్ సింగ్‌ను ఈజీగా గుర్తు పట్టవచ్చు. కానీ మిగతా ఇద్దరు ఆటగాళ్లను గుర్తు పట్టడం కొంచెం కష్టం. అందులో ఒకరు ప్రస్తుతం దక్షిణాఫ్రికాకు ఆడుతున్న ఇమ్రాన్ తహీర్, మరొకరు పాక్ ఆటగాడు హసన్ రాజా. కాగా ఈ ప్రపంచకప్‌లో భారత్, పాకిస్తాన్‌లు ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాయి. డర్బన్‌లో జరిగిన ఏకైక మ్యాచ్‌లో భారత జట్టు పాక్‌పై విజయం సాధించింది. చదవండి: Virat Kholi: బలమైన జట్టును తయారు చేయడం కష్టం.. కానీ నాశనం చేయడం ఈజీ కదా! Pehchano to maaane.. U-19 World Cup days 1998/99 pic.twitter.com/2iawM1dSUK — Harbhajan Turbanator (@harbhajan_singh) December 10, 2021 -
యువ భారత్ రెండో గెలుపు
డర్బన్ (దక్షిణాఫ్రికా): నాలుగు దేశాల అండర్–19 క్రికెట్ టోర్నమెంట్లో యువ భారత్ రెండో విజయం నమోదు చేసింది. జింబాబ్వేతో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు 89 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లకు 301 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (86 బంతుల్లో 78; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), దివ్యాంశ్ సక్సేనా (137 బంతుల్లో 128 నాటౌట్; 11 ఫోర్లు, సిక్స్) అదరగొట్టారు. దివ్యాంశ్ అజేయ సెంచరీ సాధించాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 143 పరుగులు జోడించారు. కుమార్ కుశాగ్ర (51 బంతుల్లో 47; 2 ఫోర్లు) రాణించాడు. అనంతరం జింబాబ్వే జట్టు 49.5 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. డియాన్ మైర్స్ (108 బంతుల్లో 83; 9 ఫోర్లు, సిక్స్) జింబాబ్వే ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో సుశాంత్ మిశ్రా (3/37), శుభాంగ్ హెగ్డే (3/40) ఆకట్టుకున్నారు. మంగళవారం జరిగే తదుపరి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత్ ఆడుతుంది. నాలుగు దేశాలు పోటీపడుతున్న ఈ టోర్నీలో భారత్ 4 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. దాదాపు ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. -
అండర్–19 ముక్కోణపు క్రికెట్ టోర్నీ విజేత భారత్
హోవ్ (ఇంగ్లండ్): బ్యాట్స్‌మెన్ బాధ్యతాయుతంగా ఆడటంతో... ఇంగ్లండ్‌లో జరిగిన అండర్–19 ముక్కోణపు క్రికెట్ టోర్నమెంట్లో భారత జట్టు విజేతగా నిలిచింది. హోవ్ నగరంలో ఆదివారం జరిగిన ఫైనల్లో యువ భారత్ ఆరు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. తొలుత బంగ్లాదేశ్ సరిగ్గా 50 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటైంది. హసన్ జాయ్ (109; 9 ఫోర్లు, సిక్స్) సెంచరీ చేశాడు. భారత బౌలర్లలో కార్తీక్ త్యాగి, సుశాంత్ మిశ్రా రెండేసి వికెట్లు తీశారు. అనంతరం భారత్ 48.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసి గెలిచింది. యశస్వి జైస్వాల్ (50), దివ్యాంశ్ సక్సేనా (55), కెప్టెన్ ప్రియమ్ గార్గ్ (73), ధ్రువ్ జురెల్ (59 నాటౌట్) అర్ధ సెంచరీలు చేశారు. హైదరాబాద్ క్రికెటర్ ఠాకూర్ తిలక్ వర్మ (10 బంతుల్లో 16 నాటౌట్; 3 ఫోర్లు) రాణించాడు. ధ్రువ్‌తో కలిసి తిలక్ వర్మ అజేయ ఐదో వికెట్‌కు 29 పరుగులు జోడించాడు. -
క్రికెటర్ రసిక్ సలామ్‌పై రెండేళ్ల సస్పెన్షన్
న్యూఢిల్లీ: నకిలీ జనన ధ్రువీకరణ పత్రం సమర్పించినందుకు జమ్మూ కశ్మీర్ యువ పేసర్ రసిక్ సలామ్‌ను బీసీసీఐ రెండేళ్ల పాటు సస్పెండ్ చేసింది. వచ్చే నెలలో ఇంగ్లండ్‌లో పర్యటించనున్న జాతీయ అండర్–19 జట్టు నుంచి సైతం తప్పించింది. అతడి స్థానంలో బెంగా ల్కు చెందిన ప్రభాత్ మౌర్యను ఎంపిక చేసింది. రసిక్... ఐపీఎల్–12 సీజన్లో ముంబై ఇండియన్స్‌కు ఒక మ్యాచ్‌లో ప్రాతినిధ్యం వహించాడు. ప్రతిభావంతుడైన బౌలర్‌గా పేరు తెచ్చుకున్న అతడు అనవసర వివాదంతో కెరీర్‌కు చేటు తెచ్చుకున్నాడు. -
ఒమన్ 24 ఆలౌట్
అల్ అమారత్: ఒమన్ క్రికెట్ జట్టు అరుదైన, చెత్త రికార్డును నమోదు చేసింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా స్కాట్లాండ్తో మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆ జట్టు 17.1 ఓవర్లలో 24 పరుగులకే కుప్పకూలింది. ఖావర్ అలీ (15) టాప్ స్కోరర్‌గా నిలవగా... ఆరుగురు బ్యాట్స్‌మెన్ అయితే ఖాతా తెరవలేదు. మిగతా బ్యాట్స్‌మెన్ 2, 2, 1, 1 చొప్పున పరుగులు చేశారు. అనంతరం స్కాట్లాండ్ 3.2 ఓవర్లలో 26 పరుగులు చేసి విజయాన్నందుకుంది. అయితే ఈ మ్యాచ్‌కు అంతర్జాతీయ వన్డే హోదా లేదు. దీనిని దేశవాళీ వన్డే (లిస్ట్–ఎ) మ్యాచ్‌గానే పరిగణిస్తున్నారు. ఒమన్ చేసిన 24 పరుగులు ఓవరాల్‌గా లిస్ట్ ‘ఎ’లో నాలుగో అత్యల్ప స్కోరుగా నమోదైంది. గతంలో వెస్టిండీస్ అండర్–19 టీమ్ (18 పరుగులు), సరకెన్స్ సీసీ (19), మిడిల్‌ఎసెక్స్ (23) ఇంతకంటే తక్కువ స్కోర్లు చేశాయి. -
అర్జున్ ఎంపికపై గంగూలీ ఏమన్నాడంటే ?
ముంబై : క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ భారత అండర్-19 జట్టుకు ఎంపికైన విషయం తెలిసిందే. తనయుడి ఎంపికపట్ల ఇప్పటికే సచిన్ సంతోషం వ్యక్తం చేస్తూ పుత్రోత్సాహంతో పొంగిపోయాడు. కెరీర్లో తొలి మైలురైయిని అందుకున్న అర్జున్‌కు సర్వత్రా అభినందనలు వెల్లువెత్తాయి. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. ‘చాలా మంది అర్జున్‌కు విషెస్ తెలియజేస్తున్నారు. నేను అయితే ఇప్పటి వరకు అతని ఆట చూడలేదు. అతను అద్భుతంగా రాణిస్తాడని ఆశిస్తున్నాను.’ గంగూలీ పేర్కొన్నాడు. శ్రీలంకలో పర్యటించే భారత అండర్–19 జట్టులోకి అర్జున్ ఎంపికైన విషయం తెలిసిందే. వచ్చే నెల 11 నుంచి ఆగస్టు 11 వరకు ఈ జూనియర్ జట్టు లంకలో రెండు నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్‌ల్ని, ఐదు వన్డే మ్యాచ్‌ల్ని ఆడనుంది. అయితే నాలుగు రోజుల టోర్నీకే ఎంపికైన అర్జున్‌కు వన్డే జట్టులో చోటు దక్కలేదు. అర్జున్ రంజీల్లో ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహించాలంటే ఈ టోర్నీలో తప్పక రాణించాల్సిందే. ఎందుకంటే అర్జున్ వచ్చే( 2020) అండర్-19 వరల్డ్‌కప్ ఆడలేడు. అప్పటికే అతని వయసు 19 ఏళ్లు దాటుతోంది. అర్జున్‌కు సోషల్ మీడియా వేదికగా అభినందనలు వెల్లువెత్తాయి. ఐపీఎల్ చైర్మెన్ రాజీవ్ శుక్లా సైతం అర్జున్ బాగా రాణిస్తాడని ఆకాంక్షించారు. పాకిస్తానే గెలిచింది.. ఇంగ్లండ్ పర్యటనలో కోహ్లి సేన రాణిస్తోందని గంగూలీ జోస్యం చెప్పాడు. ‘ ఇంగ్లండ్ పర్యటనలో భారత్ విజయం సాధిస్తుందని నేను భావిస్తున్నా. దక్షిణాఫ్రికాలో వన్డే సిరీస్ గెలవడానికి ఆడిన ఆట ఇక్కడ పునరావృతం అయితే భారత్ విజయం సులువు.’ అని అభిప్రాయపడ్డాడు. ఇక కోహ్లి సేన ఇంగ్లండ్ పర్యటనలో జూలై 3 నుంచి మూడు టీ20లు, మూడు వన్డేలు, ఐదు టెస్ట్‌లు ఆడనుంది. ఇటీవల పాక్‌తో ఇంగ్లండ్ తొలి టెస్ట్‌లో 9 వికెట్లతో ఓడి తరువాత సిరీస్ సమం చేసిన విషయం తెలిసిందే. ‘పాకిస్తానే గెలిచింది.. అలాంటప్పుడు భారత్ సులువుగా సీరీస్ గెలుస్తోంది. పాక్ కన్నా భారత్‌కు చాలా అవకాశాలున్నాయి.’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు. -
జిల్లా అండర్–19 క్రికెట్ జట్టు ఎంపిక
కడప స్పోర్ట్స్ : ఈనెల 27 నుంచి ఆగస్టు 6వ తేదీ వరకు కడప నగరంలో నిర్వహించనున్న అంతర్ జిల్లాల అండర్–19 ఎలైట్ గ్రూపు మ్యాచ్‌లలో పాల్గొనే జిల్లా అండర్–19 జట్టును జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రామ్మూర్తి ప్రకటించారు. గత నెలలో నిర్వహించిన ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ప్రాబబుల్స్‌కు ఎంపికచేసి ప్రాక్టీస్ మ్యాచ్‌లు నిర్వహించిన అనంతరం తుదిజట్టును శనివారం ప్రకటించారు జిల్లా అండర్–19 జట్టు : ఎస్ఎండీ రఫీ (కెప్టెన్), వంశీకృష్ణ (వైస్ కెప్టెన్), ధృవకుమార్, నూర్‌బాషా, భరద్వాజ్, హరికృష్ణ, శ్రీహరి, సాయిసుధీర్, అభిషేక్, అజారుద్దీన్, తేజ, మారుతీశంకరాచార్య, జహీర్అబ్బాస్, సత్యప్రణవ్, సులేమాన్, ఆరీఫ్‌బాషా. స్టాండ్‌బై : నూర్‌అహ్మద్,మదన్, భరత్‌రెడ్డి, దిలీప్, జాఫర్, సాయిచెన్నారెడ్డి, సుదర్శన్.