విరాట్ కోహ్లి
అండర్-19 ప్రపంచకప్ సంబరం శనివారంతో ముగియనుంది. టీమిండియా, ఇంగ్లండ్‌లు ఫైనల్లో అమితుమీ తేల్చుకోనున్నాయి. ఆస్ట్రేలియాపై స్టన్నింగ్ విక్టరీతో టీమిండియా యువ జట్టు బలోపేతంగా కనిపిస్తున్నప్పటికి ప్రత్యర్థి ఇంగ్లండ్‌ను తక్కువ అంచనా వేయడానికి లేదు. ఏ మాత్రం తేడా జరిగిన మొదటికే మోసం వస్తుంది. ఇప్పటికే నాలుగు సార్లు అండర్-19 ప్రపంచకప్ టైటిల్ గెలిచిన టీమిండియా ఐదో టైటిల్‌పై కన్నేసింది. యష్ ధుల్ నేతృత్వంలోని యువజట్టు ఏం చేస్తుందో చూడాలి. ఇక అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ పురస్కరించుకొని ఐసీసీ కూడా తనదైన శైలిలో ప్రమోషన్ చేస్తుంది.
చదవండి: ఇంగ్లండ్‌తో ఫైనల్.. కుర్రాళ్లకు విరాట్ కోహ్లి కీలక సూచనలు!
విరాట్ కోహ్లి, జో రూట్, బాబర్ అజమ్, స్టీవ్ స్మిత్, బెన్ స్టోక్స్ లాంటి స్టార్ క్రికెటర్లు ఒకప్పుడు అండర్-19కు ఆడినవారే. తమ దేశం తరపున అండర్-19 వరల్డ్‌కప్ ఆడి తమ జట్టును విజేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించారు. ఇప్పుడంటే వీరి ఆటను చూసి మనం ఎంజాయ్ చేస్తున్నాం. అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టకముందు ఈ కుర్రాళ్ల ఆట ఎలా ఉందో చూడండి అంటూ ఐసీసీ ఒక వీడియోనూ షేర్ చేసింది. పైన పేర్కొన్న క్రికెటర్లంతా అండర్-19 ఆడిన రోజులతో పాటు.. ప్రస్తుతం ఆడుతున్న రోజులను కలిపి వీడియో రూపంలో వదిలింది. ''సంవత్సరాలు గడిచాయి.. టెక్నిక్‌లో మార్పు ఉండొచ్చు.. కానీ క్లాస్ మాత్రం అలాగే మిగిలిపోయింది.ఇప్పుడు వీరంతా పెద్ద సూపర్‌స్టార్స్.. ఇందులో ఏ ఆటగాడిలో మార్పు వచ్చిందో కాస్త చెప్పండి'' అంటూ క్యాప్షన్ జత చేసింది.
చదవండి: 'టీమిండియాదే ప్రపంచకప్.. యష్ ధుల్ మరోసారి చెలరేగడం ఖాయం'
Comments
Please login to add a commentAdd a comment