Update: దుబాయ్ వేదికగా శ్రీలంకతో జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో యువ భారత జట్టు ఘన విజయం సాధించి, ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది. వరుణుడి అటంకాల నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 38 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. అనంతరం డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం యువ భారత్ లక్ష్యాన్ని 38 ఓవర్లలో 102 పరుగులకు కుదించగా.. కేవలం 21.3 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత ఓపెనర్ రఘువంశీ(56 నాటౌట్), గుంటూరు కుర్రాడు షేక్ రషీద్(31 నాటౌట్) టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. అంతకుముందు విక్కీ ఓస్వాల్(3/11), కౌశల్ తాంబే(2/23), రాజ్ బవా(1/23), రవికుమార్(1/17), రాజవర్ధన్(1/26) లంకేయుల పతనాన్ని శాసించారు.
దుబాయ్: భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న అండర్-19 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌కి వరుణుడు ఆటంకం కలిగించాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచే సమయానికి 33 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. భారత స్పిన్నర్లు విక్కీ ఓస్వాల్(3/11), కౌశల్ తాంబే(2/23), పేసర్లు రాజ్ బవా(1/11), రవికుమార్(1/8)ల ధాటికి లంక జట్టు విలవిలలాడింది.
India U19 are on a roll with the ball! 👌 👌
— BCCI (@BCCI) December 31, 2021
Vicky Ostwal, Kaushal Tambe, Raj Bawa and Ravi Kumar share the spoils. 👏👏 #BoysInBlue
Sri Lanka U19 seven down. #ACC #U19AsiaCup #INDvSL
📸 📸: ACC
Follow the match ▶️ https://t.co/GPPoJpzNpQ pic.twitter.com/nbcyvpgbfH
రవీన్ డిసిల్వా(26 బంతుల్లో 13 నాటౌట్; ఫోర్), యాసిరు రోడ్రిగో(13 బంతుల్లో 4 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. 26.3 ఓవర్ల వద్ద 57 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన శ్రీలంకను రవీన్ డిసిల్వా, యాసిరు రోడ్రిగో ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, భారత యువ జట్టు సెమీస్‌లో బంగ్లాదేశ్‌పై 103 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరగా.. లంకేయులు పాక్ యువ జట్టుకు షాకిచ్చి తుది పోరుకు అర్హత సాధించారు.
చదవండి: ఇంగ్లండ్ కోచ్‌గా గ్యారీ కిర్‌స్టన్!
Comments
Please login to add a commentAdd a comment