Asia Cup Cricket
-
ఫైనల్లో బంగ్లాదేశ్ చిత్తు.. ఆసియాకప్ విజేతగా భారత్
అండర్–19 మహిళల ఆసియాకప్ విజేతగా భారత్ నిలిచింది. ఆదివారం కౌలాలంపూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఫైనల్లో 41 పరుగుల తేడాతో భారత్ ఘన విజయాన్ని సాధించింది. దీంతో తొట్ట తొలి ఆసియాకప్ టీ20 టోర్నీ టైటిల్‌ను భారత్ తమ ఖాతాలో వేసుకుంది.ఈ తుది పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 117 పరుగుల స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. భారత బ్యాటర్లలో హైదరాబాదీ గొంగడి త్రిష(52) హాఫ్ సెంచరీతో చెలరేగింది. ఆమెతో పాటు మిథిలా వినోద్(17), కెప్టెన నిక్కీ ప్రసాద్(12) పరుగులతో రాణించారు. బంగ్లా బౌలర్లలో ఫర్జానా ఈస్మిన్ 4 వికెట్లు పడగొట్టగా..నిషితా అక్టర్ నిషి రెండు, హాబీబా ఇస్లాం ఒక్క వికెట్ సాధించారు.చెలరేగిన భారత బౌలర్లు..అనంతరం స్వల్ప లక్ష్య చేధనలో భారత బౌలర్లు చెలరేగడంతో బంగ్లాదేశ్ కేవలం 76 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో అయూషీ శుక్లా 3 వికెట్లతో బంగ్లాను దెబ్బతీయగా.. పరుణికా సిసోడియా, సోనమ్ యాదవ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. బంగ్లా బ్యాటర్లలో జువైరియా ఫెర్డోస్(22) మినహా మిగితా అందరూ దారుణంగా విఫలమయ్యారు. -
భారత్-పాక్ మ్యాచ్ నేడే..
దంబుల్లా: మహిళల ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్లో భారత్‌కు ఘనమైన రికార్డు ఉంది. వన్డే ఫార్మాట్లో నాలుగు సార్లు టోర్నీ జరగ్గా... ప్రతీ సారి విజేతగా భారత్ నిలిచింది. టి20 ఫార్మాట్లో నాలుగుసార్లు టోర్నీ నిర్వహిస్తే ఒక్కసారి మినహా మూడు సార్లు భారతే చాంపియన్. ఒక్క 2018లో మాత్రమే ఫైనల్లో భారత్‌ను ఓడించి బంగ్లాదేశ్ ట్రోఫీ అందుకుంది. ఈ నేపథ్యంలో హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు మరోసారి ఫేవరెట్ ఆసియా కప్ టి20 టోర్నీలో బరిలోకి దిగుతోంది. నేటి నుంచి జరిగే ఈ పోరులో పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో పాటు అసోసియేట్ టీమ్‌లు యూఏఈ, నేపాల్, థాయ్‌లాండ్, మలేసియా కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాయి. ఎనిమిది జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. లీగ్ దశ అనంతరం టాప్–2 టీమ్‌లు సెమీస్ చేరతాయి. ఈ నెల 28న ఫైనల్ నిర్వహిస్తారు. శుక్రవారం భారత్ తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఎదుర్కొంటోంది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 14 మ్యాచ్‌లు జరిగాయి. భారత్ 11 గెలిచి, 3 మాత్రమే ఓడింది. టోర్నీలో భాగంగా ఈ నెల 21 యూఏఈతో, 23న నేపాల్‌తో భారత్ తలపడుతుంది. ఫామ్‌లో ఉన్న హర్మన్ బృందం ఇటీవల సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన టి20 సిరీస్‌ను 1–1తో సమంగా ముగించగా... అంతకుముందు బంగ్లాదేశ్‌ను 5–0తో చిత్తు చేసింది. -
శ్రీలంకలో కష్టమే.. యూఏఈ వేదికగా ఆసియా కప్..!
శ్రీలంక వేదికగా ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 11 వరకు టీ20 ఆసియా కప్ టోర్నమెంట్ జరగాల్సి ఉంది. అయితే శ్రీలంకలో ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో పాటు రాజకీయ పరిణామాలు తీవ్ర స్థాయిలో ఉండడంతో.. మరోసారి ఆసియా కప్ నిర్వహణపై చర్చ నడుస్తోంది. తాజా పరిణామాలు ప్రకారం.. శ్రీలంక గడ్డపై జరగాల్సిన ఆసియా కప్‌ను యూఏఈ కు తరలించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఎసిసి) భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి)తో ఆసియా క్రికెట్ కౌన్సిల్ జరిపినట్లు సమాచారం. "ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా శ్రీలంకలో ఆసియాకప్‌ను నిర్వహించడం సరైనది కాదని భావిస్తున్నాం" అని ఎసిసి అధికారి ఒకరు క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఇక ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్టు పాల్గొనున్నాయి. భారత్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్తాన్ ఆర్హత సాధించగా.. మరో స్థానం కోసం హాంకాంగ్, కువైట్, సింగపూర్,యూఏఈ జట్లు క్వాలిఫయర్ రౌండ్లో తలపడనున్నాయి. చదవండి: Singapore Open 2022: సింగపూర్ ఓపెన్ విజేతగా పీవీ సింధు.. మూడో భారత ప్లేయర్‌గా..! -
ఆసియా కప్ విజేతగా టీమిండియా.. ఫైనల్లో లంకేయులపై ఘన విజయం
దుబాయ్: ఆసియా కప్ అండర్-19 విజేతగా యువ భారత్ నిలిచింది. వరుణుడి ఆటంకాల నడుమ 38 ఓవర్లకు కుదించిన ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక యువ జట్టుపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, రికార్డు స్థాయిలో ఎనిమిదో సారి టైటిల్ విజేతగా నిలిచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన లంకేయులు.. 38 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 106 పరుగుల స్వల్ప స్కోర్‌కే పరిమితమయ్యారు. లంక ఇన్నింగ్స్‌లో యాసిరు రోడ్రిగో(19 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలువగా.. భారత బౌలర్లు విక్కీ ఓస్వాల్(3/11), కౌశల్ తాంబే(2/23), రాజ్ బవా(1/23), రవికుమార్(1/17), రాజవర్ధన్(1/26) ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. అనంతరం డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 38 ఓవర్లలో 102 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యువ భారత్.. కేవలం 21.3 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ రఘువంశీ(56 నాటౌట్), గుంటూరు కుర్రాడు షేక్ రషీద్(31 నాటౌట్) టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. కాగా, ఈ టోర్నీ నిర్వహించిన 9 పర్యాయాల్లో టీమిండియా 8 సార్లు విజేతగా నిలవడం విశేషం. 2017లో యువ అఫ్గాన్ జట్టు.. పాక్‌ను ఓడించి అండర్-19 ఆసియా కప్ విజేతగా నిలిచింది. ఇదిలా ఉంటే, ప్రస్తుత టోర్నీలో భారత యువ జట్టు సెమీస్‌లో బంగ్లాదేశ్‌పై 103 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరగా.. లంకేయులు పాక్ యువ జట్టుకు షాకిచ్చి తుది పోరుకు అర్హత సాధించారు. చదవండి: విదేశీ లీగ్‌ల కోసం రెండేసి నెలలు దూరంగా ఉంటారు.. కానీ.. టెస్టులు ఆడరా? -
భారత బౌలర్ల ధాటికి లంక జట్టు విలవిల.. ఛాంపియన్‌గా యువ భారత్
Update: దుబాయ్ వేదికగా శ్రీలంకతో జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో యువ భారత జట్టు ఘన విజయం సాధించి, ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది. వరుణుడి అటంకాల నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 38 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. అనంతరం డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం యువ భారత్ లక్ష్యాన్ని 38 ఓవర్లలో 102 పరుగులకు కుదించగా.. కేవలం 21.3 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత ఓపెనర్ రఘువంశీ(56 నాటౌట్), గుంటూరు కుర్రాడు షేక్ రషీద్(31 నాటౌట్) టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. అంతకుముందు విక్కీ ఓస్వాల్(3/11), కౌశల్ తాంబే(2/23), రాజ్ బవా(1/23), రవికుమార్(1/17), రాజవర్ధన్(1/26) లంకేయుల పతనాన్ని శాసించారు. దుబాయ్: భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న అండర్-19 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌కి వరుణుడు ఆటంకం కలిగించాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచే సమయానికి 33 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. భారత స్పిన్నర్లు విక్కీ ఓస్వాల్(3/11), కౌశల్ తాంబే(2/23), పేసర్లు రాజ్ బవా(1/11), రవికుమార్(1/8)ల ధాటికి లంక జట్టు విలవిలలాడింది. India U19 are on a roll with the ball! 👌 👌 Vicky Ostwal, Kaushal Tambe, Raj Bawa and Ravi Kumar share the spoils. 👏👏 #BoysInBlue Sri Lanka U19 seven down. #ACC #U19AsiaCup #INDvSL 📸 📸: ACC Follow the match ▶️ https://t.co/GPPoJpzNpQ pic.twitter.com/nbcyvpgbfH — BCCI (@BCCI) December 31, 2021 రవీన్ డిసిల్వా(26 బంతుల్లో 13 నాటౌట్; ఫోర్), యాసిరు రోడ్రిగో(13 బంతుల్లో 4 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. 26.3 ఓవర్ల వద్ద 57 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన శ్రీలంకను రవీన్ డిసిల్వా, యాసిరు రోడ్రిగో ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, భారత యువ జట్టు సెమీస్‌లో బంగ్లాదేశ్‌పై 103 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరగా.. లంకేయులు పాక్ యువ జట్టుకు షాకిచ్చి తుది పోరుకు అర్హత సాధించారు. చదవండి: ఇంగ్లండ్ కోచ్‌గా గ్యారీ కిర్‌స్టన్! -
భారత అభిమానుల కోరిక నెరవేరే ఛాన్స్! మరోసారి పాక్‌తో మ్యాచ్.. ఎప్పుడంటే?
India Clash With Pakistan In 2022, Check Complete Details: దాయాదుల పోరు అంటే క్రికెట్ ఆభిమానులకు పెద్ద పండగే. ఇరు జట్లు మధ్య పోరు కోసం భారత అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే టీ20 ప్రపంచకప్-2021లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయి టీమిండియా ఘోర పరాభవం పొందింది. దీంతో పాక్‌పైన భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని అభిమానులు భావిస్తున్నారు. అయితే భారత్-పాక్ దేశాల నెలకొన్న ఉద్రిక్తల మధ్య ఇప్పటిలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగే అవకాశం లేదు. దీంతో క్రికెట్ అభిమానులు ఐసీసీ ఈవెంట్లు కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. ఈ క్రమంలో క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది జరగనున్న ఆసియా కప్‌లో భారత్- పాకిస్తాన్‌లు మరో సారి తలపడనున్నాయి. దీనికి శ్రీలంక వేదిక కానుంది. 2020లో జరగాల్సిన ఆసియాకప్ కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ క్రమంలో 2022లో ఆసియా కప్‌కు శ్రీలంక అతిథ్యం ఇవ్వబోతుంది. ఈ టోర్నమెంట్ వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆసియా కప్ ఈసారి టీ20 ఫార్మట్‌లో జరగనుంది. అదే విధంగా 2022లో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్లోను ఇరు దేశాలు తలపడే అవకాశం ఉంది. మొత్తంమీద వచ్చే ఏడాది భారత ఆభిమానులకు పండగే అనే చెప్పాలి. చదవండి: T20 WC 2021: ఫైనల్‌కు ముందు రాత్రంతా.. గాయంతో బాధపడినా గానీ.. -
17 ఏళ్ల తర్వాత పాక్‌లో పర్యటించనున్న టీమిండియా..!
Team India Likely To Tour Pakistan After 17 Years For Asia Cup 2023: 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించే అవకాశం ఉంది. ఆసియా కప్ 2023 నిర్వహణ హక్కులను దాయాది దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) దక్కించుకోవడంతో టీమిండియా పాక్ పర్యటన అంశం తెరపైకి వచ్చింది. ఈనెల 15న దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ భేటీలో పీసీబీకి ఆసియా కప్ 2023 వన్డే ఫార్మాట్ నిర్వహణ బాధ్యతలను అప్పచెబుతూ కౌన్సిల్ తీర్మానం చేసింది. వాస్తవానికి 2020లోనే ఆసియా కప్‌ను పాక్‌లో నిర్వహించాల్సి ఉండింది. అయితే అప్పట్లో పాక్ పర్యటనకు బీసీసీఐ ససేమిరా అనడంతో పీసీబీ ఆ బాధ్యతలను శ్రీలంకకు కట్టబెట్టింది. కరోనా కారణంగా శ్రీలంక కూడా టోర్నీ నిర్వహణ సాధ్యం కాదని చేతులెత్తేయడంతో అప్పట్లో టోర్నీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, తాజాగా జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ భేటీలో పాక్ 2023 ఆసియా కప్ నిర్వహణ బాధ్యతలను దక్కించుకుంది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా, పీసీబీ నూతన చైర్మన్ రమీజ్ రాజా దృవీకరించారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలో వెల్లడిస్తామని వారు సంయుక్తంగా ప్రకటించారు. అన్నీ సజావుగా సాగితే టోర్నీని 2023 జూన్, జులై మాసాల్లో నిర్వహించే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. కాగా, టీమిండియా చివరిసారిగా 2006లో పాక్‌లో పర్యటించింది. ఆ తర్వాత భారత్-పాక్‌ల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడంతో పాక్ వెలుపల జరిగిన ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే ఇరు జట్లు తలపడ్డాయి. చదవండి: నువ్వు కాకపోతే ఇంకొకరు.. పంత్‌కు కోహ్లి వార్నింగ్..! -
భారత్‌కు నేపాల్ షాక్
కౌలాలంపూర్: ఆసియా కప్ అండర్–19 క్రికెట్ టోర్నమెంట్లో నేపాల్ జట్టు పెను సంచలనం సృష్టించింది. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో నేపాల్ 19 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 185 పరుగులు చేసింది. దీపేంద్ర సింగ్ (88; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో ఆదిత్య, అభిషేక్ శర్మ రెండేసి వికెట్లు తీశారు. 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 48.1 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. హిమాంశు రాణా (46; 7 ఫోర్లు, ఒక సిక్స్) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యా రు. నేపాల్ బౌలర్ దీపేంద్ర సింగ్ నాలుగు వికెట్లు తీసి భారత్‌ను దెబ్బతీశాడు. -
మరోసారి బంగ్లాలోనే ఆసియా కప్
ఢాకా: మరోసారి ఆసియా కప్ క్రికెట్ టోర్నీ ఆతిథ్యాన్నిబంగ్లాదేశ్ దక్కించుకుంది. ఇప్పటికే వరుసగా రెండు సార్లు ఆసియా కప్ క్రికెట్ టోర్నీని నిర్వహించిన బంగ్లాదేశ్.. మరోసారి ఈ టోర్నీ నిర్వహణకు సిద్ధమైంది. ఈ మేరకు మంగళవారం సింగపూర్ లో జరిగిన సమావేశంలో సభ్యల దేశాల నుంచి బంగ్లాకు మద్దతు లభించింది. తొలుత బంగ్లా పేరును పాకిస్థాన్ ప్రతిపాదించగా అందుకు సభ్య దేశాలు అంగీ్కారం తెలిపాయి. దీంతో బంగ్లాదేశ్ ఐదోసారి ఆసియా కప్ నిర్వహిస్తున్నట్లు అవుతుంది. బంగ్లాదేశ్ తొలిసారి 1988 లో ఆసియా కప్ ను నిర్వహించింది. ఈ టోర్నీలో టెస్టు హోదా కల్గిన భారత్, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లతో పాటు ఒక అసోసియేట్ దేశం కూడా పాల్గొంటుంది. దీనిలో భాగంగా నవంబర్ లో జరిగే క్వాలిఫయింగ్ టోర్నమెంట్ లో అసోసియేట్ దేశాలైన ఆఫ్ఘనిస్థాన్, ఓమాన్, హాంకాంగ్, యూఏఈ జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఇందులో అర్హత సాధించిన ఒక జట్టు.. ఐదో జట్టుగా ఆసియా కప్ బరిలో దిగుతుంది. ఈ టోర్నీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 వ తేదీ మొదలుకొని మార్చి 6 వ తేదీ వరకూ జరుగనుంది. సరిగ్గా ట్వంటీ 20 వరల్డ్ కప్ కు ప్రారంభం కావడానికి ఐదు రోజుల ముందు ఆసియా కప్ ముగియనుంది. గతేడాది ఆసియా కప్ ను శ్రీలంక చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే.