అండర్–19 మహిళల ఆసియాకప్ విజేతగా భారత్ నిలిచింది. ఆదివారం కౌలాలంపూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఫైనల్లో 41 పరుగుల తేడాతో భారత్ ఘన విజయాన్ని సాధించింది. దీంతో తొట్ట తొలి ఆసియాకప్ టీ20 టోర్నీ టైటిల్‌ను భారత్ తమ ఖాతాలో వేసుకుంది.
ఈ తుది పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 117 పరుగుల స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. భారత బ్యాటర్లలో హైదరాబాదీ గొంగడి త్రిష(52) హాఫ్ సెంచరీతో చెలరేగింది. ఆమెతో పాటు మిథిలా వినోద్(17), కెప్టెన నిక్కీ ప్రసాద్(12) పరుగులతో రాణించారు. బంగ్లా బౌలర్లలో ఫర్జానా ఈస్మిన్ 4 వికెట్లు పడగొట్టగా..నిషితా అక్టర్ నిషి రెండు, హాబీబా ఇస్లాం ఒక్క వికెట్ సాధించారు.
చెలరేగిన భారత బౌలర్లు..
అనంతరం స్వల్ప లక్ష్య చేధనలో భారత బౌలర్లు చెలరేగడంతో బంగ్లాదేశ్ కేవలం 76 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో అయూషీ శుక్లా 3 వికెట్లతో బంగ్లాను దెబ్బతీయగా.. పరుణికా సిసోడియా, సోనమ్ యాదవ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. బంగ్లా బ్యాటర్లలో జువైరియా ఫెర్డోస్(22) మినహా మిగితా అందరూ దారుణంగా విఫలమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment