నేడు ఆసియా కప్ పోరులో మహిళా జట్ల ‘ఢీ’
రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
దంబుల్లా: మహిళల ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో భారత్‌కు ఘనమైన రికార్డు ఉంది. వన్డే ఫార్మాట్‌లో నాలుగు సార్లు టోర్నీ జరగ్గా... ప్రతీ సారి విజేతగా భారత్ నిలిచింది. టి20 ఫార్మాట్‌లో నాలుగుసార్లు టోర్నీ నిర్వహిస్తే ఒక్కసారి మినహా మూడు సార్లు భారతే చాంపియన్. ఒక్క 2018లో మాత్రమే ఫైనల్లో భారత్‌ను ఓడించి బంగ్లాదేశ్ ట్రోఫీ అందుకుంది. ఈ నేపథ్యంలో హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు మరోసారి ఫేవరెట్ ఆసియా కప్ టి20 టోర్నీలో బరిలోకి దిగుతోంది.
నేటి నుంచి జరిగే ఈ పోరులో పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో పాటు అసోసియేట్ టీమ్‌లు యూఏఈ, నేపాల్, థాయ్‌లాండ్, మలేసియా కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాయి. ఎనిమిది జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. లీగ్ దశ అనంతరం టాప్–2 టీమ్‌లు సెమీస్ చేరతాయి. ఈ నెల 28న ఫైనల్ నిర్వహిస్తారు. శుక్రవారం భారత్ తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఎదుర్కొంటోంది.
ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 14 మ్యాచ్‌లు జరిగాయి. భారత్ 11 గెలిచి, 3 మాత్రమే ఓడింది. టోర్నీలో భాగంగా ఈ నెల 21 యూఏఈతో, 23న నేపాల్‌తో భారత్ తలపడుతుంది. ఫామ్‌లో ఉన్న హర్మన్ బృందం ఇటీవల సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన టి20 సిరీస్‌ను 1–1తో సమంగా ముగించగా... అంతకుముందు బంగ్లాదేశ్‌ను 5–0తో చిత్తు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment