బాబీ డియోల్ కన్నీటి కథను రివీల్ చేసిన 'డాకు మహారాజ్' దర్శకుడు
బాబీ డియోల్(Bobby Deol) ఒకప్పుడు బాలీవుడ్‌లో స్టార్ హీరో.. ఆయన అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేసిన నిర్మాతలు బోలెడు మంది ఉన్నారు. 1995లో విడుదలైన 'బర్సాత్' మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన ఆ తర్వాత సోల్జర్,రేస్ 3,ఓం శాంతి ఓం, క్రాంతి,దోస్తానా, కిస్మత్, హీరోస్, హౌస్‌ఫుల్ 4 వంటి భారీ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపారు. అయితే, కెరీర్ పరంగా ఒకానొక సమయంలో వరుస పరాజయాలు దక్కడంతో సరైన అవకాశాలు రాలేదు. దీంతో ఎంతో కుంగుబాటుకు గురయ్యారు.
చివరకు భార్య సంపాదన మీద ఆధారపడుతున్నాడు అనే మాటలు కూడా ఆయనపై వచ్చాయి. ఒక్క ఛాన్స్‌తో రీ ఎంట్రీ కోసం ఎన్నో నిర్మాణ సంస్థలను కలిశారు. కానీ, ఎవ్వరూ ఇవ్వలేదు. కానీ, ఒక్క సినిమాతో ఆయన జీవితం మారిపోయింది. ప్రస్తుతం చాలా ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉన్నారు. దాదాపుగా 15 ఏళ్లు ఇంట్లోనే కూర్చున్న బాబీ డియోల్‌కు ఇప్పుడు మళ్లీ ఛాన్సులు వస్తున్నాయి. ఇదంతా తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) వల్లే జరిగిందని బాబీ డియోల్ అన్నట్లు ప్రముఖ తెలుగు దర్శకుడు బాబీ కొల్లి(Bobby Kolli) చెప్పారు.
యానిమల్( Animal) సినిమా తర్వాత డాకు మహారాజ్‌తో బాబీ డియోల్ తెలుగువారికి మరింత దగ్గరయ్యాడు. అయితే, ఆయన జీవితానికి సంబంధించిన పలు విషయాలు డైరెక్టర్ బాబీ కొల్లి ఇలా చెప్పారు. 'యానిమల్ సినిమా తర్వాత బాబీ డియోల్ బిజీ అయిపోయాడు. మళ్లీ వరుస సినిమా ఛాన్సులతో స్పీడ్ పెంచాడు. దీనికి ప్రధాన కారణం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అని తెలిసిందే. ఇదే విషయాన్ని బాబీ డియోల్ కూడా బహిరంగంగానే ఒప్పుకున్నాడు. మీ తెలుగోడు నా జీవితాన్ని మార్చేశాడు అంటూ.. ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు. మనం ఆయన్ను టచ్ చేస్తే చాలు ఏడ్చేస్తున్నాడు. అంతలా మన తెలుగువారిని బాబీ డియోల్ ప్రేమిస్తున్నాడు.' అని డైరెక్టర్ బాబీ కొల్లి పంచుకున్నారు.
బాబీ డియోల్ కన్నీళ్లకు కారణాలు కూడా ఉన్నాయి. 2012 తర్వాత ఆయనకు సరైన సినిమాలు లేవు. ఛాన్సుల కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగాడు. కానీ, పలితం దక్కలేదు. దీంతో దాదాపు 15 ఏళ్ల పాటు ఇంటికే పరిమితం అయ్యాడు. తన భార్య సంపాదనతోనే ఉండేవాడని ఒక బ్యాడ్ నేమ్ కూడా వచ్చేసింది. ఒక ఇంటర్వ్యూలో తన కుమారుడి మాటలను ఆయన ఇలా గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ' నేను ఇంట్లో ఉండగానే నా కుమారుడు తన తల్లి వద్దకు వెళ్లి నాన్న ఎప్పుడూ ఇంట్లోనే ఎందుకు ఉంటున్నాడు..? ఎలాంటి పని చేయడా..? అని ప్రశ్నించాడు. అప్పుడు చాలా బాధ అనిపించింది. వాడు పుట్టక ముందే నేనొక సూపర్‌స్టార్. కానీ, ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఫెయిల్యూ స్టార్‌ని అని నా మనసులో అనుకున్నా.' అని బాబీ డియోల్ గతంలో పంచుకున్నాడు.
(ఇదీ చదవండి: మహేశ్‌బాబు సినిమా కోసం 'ప్రియాంక చోప్రా' భారీ రెమ్యునరేషన్)
సరిగ్గా అలాంటి సమయంలోనే ఆయనకు యానిమల్ సినిమాలో సందీప్ రెడ్డి ఛాన్స్ ఇచ్చారు. దీంతో ఆయన దశ తిరిగింది. పాన్ ఇండియా రేంజ్‌లో ఎన్నో సినిమాలు వస్తున్నాయి. అందుకే సందీప్ రెడ్డి అంటే బాబీ డియోల్‌కు చాలా ఇష్టం. యానిమల్ తర్వాత అతని లైఫే మారిపోయింది. హరిహర వీరమల్లు, హౌస్‌ఫుల్ 5, ఆల్ఫా, విజయ్ 69 ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment