Animal Movie
-
అల్లు అర్జున్ ఆ మాట అనడం సంతోషాన్నిచ్చింది: యానిమల్ నటుడు
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పుష్ప-2 రికార్డుల మోత మోగిస్తోంది. విడుదలైన ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్ల మార్క్‌ను దాటేసింది పుష్ప-2. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం వసూళ్లపరంగా అన్ని రికార్డులను బద్దలు కొడుతోంది. 2021లో పుష్ప మూవీకి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.అయితే చిత్రంలో కీలకపాత్రలో మెప్పించారు బాలీవుడ్ నటుడు సౌరభ్ సచ్‌దేవా. యానిమల్ మూవీలో బాబీ డియోల్ సోదరుడిగా మెప్పించిన సౌరభ్ సచ్‌దేవా పుష్ప-2లో నటించడంపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఓ ఇంటర్వ్యుకు హాజరైన సౌరభ్ అల్లు అర్జున్‌తో కలిసి పని చేయడంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.సౌరభ్ సచ్‌దేవా మాట్లాడుతూ..' యానిమల్‌లో నా నటన చూసిన పుష్ప 2 మేకర్స్ నన్ను సంప్రదించారు. నాతో సుకుమార్ సార్ వీడియో సమావేశంలో మాట్లాడారు. పుష్ప-2లో నా పాత్ర గురించి దాదాపు 20 నిమిషాలు చర్చించాం. నా కంటే ముందు చాలా మందిని సంప్రదించినా.. చివరికీ నన్ను ఖరారు చేశారు' అని తెలిపాడు.అల్లు అర్జున్ గురించి సౌరభ్ మాట్లాడుతూ..'నేను అతన్ని మొదటిసారి సెట్స్‌లోనే కలిశా. అతను చాలా స్వీట్ పర్సన్. నా అభ్యర్థనపై తన వానిటీ వ్యాన్ మొత్తం నాకు చూపించాడు. అతను ఒక సూపర్స్టార్లా కాకుండా చాలా బాగా మాట్లాడారు. యానిమల్ నా రోల్ పవర్ఫుల్ అని అల్లు అర్జున్ అన్నారు. నా పాత్రను బన్నీ ప్రశంసించడం చాలా సంతోషంగా ఉంది.' అంటూ ఆనందం వ్యక్తం చేశారు. యానిమల్, పుష్ప-2 చిత్రాలతో నాకు మరింత ఫేమ్ వచ్చిందని సౌరభ్ తెలిపారు. -
‘యానిమల్’ వార్ మెషిన్‌గన్ వాహనంపై పెళ్లి ఊరేగింపు, నెటిజన్ల కామెంట్స్
‘మురారి’, ‘వరుడు’ సినిమాల లెవల్లో పెళ్లి చేసుకోవాలని ఒకపుడు పెళ్లి కాని పిల్లలు కలలు కనేవారు. కాలానికి తగ్గట్టు ఇపుడు ట్రెండ్ మారింది. బ్లాక్ బస్టర్ మూవీ ప్రేరణతో పెళ్లి చేసుకోవడం విశేషంగా నిలిచింది. 'వార్ మెషిన్ గన్'తో వధూవరుల ఎంట్రీ అందరి దృష్టిని ఆకర్షించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్ల వేలాది ఫన్నీ కామెంట్లతో సందడితో ఏకంగా 15 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.రణబీర్ కపూర్ , నేషనల్ క్రష్ రష్మిక నటించిన యానిమల్ స్ఫూర్తితో కదిలే స్టీల్ మెషిన్ గన్‌పై జంట వివాహ వేడుకును జరుపుకున్నారు. ఇన్స్టాగ్రామ్ యూజర్ ఆశిష్ సుయ్వాల్ ఈ వీడియోను షేర్ చేశాడు. ఈ మూవీలో రణబీర్ కేరెక్టర్ 500 కిలోల మూవబుల్ స్టీల్ మెషిన్ గన్ని ఉపయోగించి తన శత్రువులతో పోరాడిన దృశ్యాలు అభిమానులను ఉర్రూతలూగించి. ఈ నేపథ్యంలో యాక్షన్ సీక్వెన్స్‌లా ప్రత్యేకంగా తయారు చేసిన వాహనంగాపై వివాహ వేదికకు చేరుకోవడాన్ని ఈ వీడియోలు చూడవచ్చు. వధువు సిగ్గుతో గన్ క్యారేజ్‌పై కూర్చొని ఉండగా, వరుడు గర్వంగా ఈ స్పెషల్ రైడ్‌ను ఆస్వాదిస్తున్నాడు. View this post on Instagram A post shared by Ashish Suiwal (@saini5019) “హవ్వా పగ, ప్రతీకారంతో అధికారంకోసం మనుషులను చంపే పాత్రగా ఎందుకు మారతారు" అని ఒకరు, "ఆమె తన జీవితంలో తదుపరి యుద్ధానికి సిద్ధమవుతోంది’’ అని ఒకరు వ్యాఖ్యానించారు క్రియేటివిటీకోసం ఎంతకైనా తెగిస్తున్నారు అంటే ఇంకొక నెటిజన్ ఒకింత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. ఇది ఎక్కడ జరిగింది అనే వివరాలు మాత్రం అందుబాటులో లేవు. -
యానిమల్ రిజెక్ట్ చేసినందుకు బాధగా లేదు: పరిణితి చోప్రా
సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన 'యానిమల్' సినిమాలో హీరోయిన్గా మొదట పరిణితీ చోప్రాను అనుకున్నారు. కానీ ఆమె రిజెక్ట్ చేయడంతో ఈ అవకాశం రష్మిక మందన్నా చేతికి వెళ్లింది. అయితే ఈ మూవీ వద్దనడానికి గల కారణాన్ని పరిణితి తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టింది.అందుకే యానిమల్ రిజెక్ట్ చేశాపరిణితి చోప్రా మాట్లాడుతూ.. 'యానిమల్ సినిమాను మొదట ఒప్పుకున్నాను. అంతా ఫైనలైపోయింది అనుకుంటున్న సమయంలో నాకు అమర్ సింగ్ చమ్కీలా మూవీ ఆఫర్ వచ్చింది. రెండు సినిమాలు ఒకే సమయంలో తీస్తున్నారు. డేట్స్ కుదరట్లేదు. నాకెందుకో చమ్కీలా వదులుకోకూడదనిపించింది. అందుకే యానిమల్‌ను వదిలేసుకున్నాను. చమ్కీలా మూవీ ద్వారా నేను పొందిన ప్రేమ, గుర్తింపు, అభిమానం.. ఏదీ మర్చిపోలేను. ఇంతటి ఆనందిచ్చిన ఈ మూవీ కోసం యానిమల్‌ను వదిలేసుకున్నందుకు నేనేమీ బాధపడటం లేదు. సంతోషంగా ఉన్నాను అని చెప్పుకొచ్చింది.అమర్ సింగ్ చమ్కీలా సినిమా పోస్టర్సినిమాకాగా గొప్ప సంగీతకారుడు అమర్ సింగ్ చమ్కీలా జీవిత కథ ఆధారంగా అమర్ సింగ్ చమ్కీలా చిత్రం తెరకెక్కింది. ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దిల్జిత్ దోసాంజ్ ప్రధాన పాత్రలో నటించాడు. పరిణితి అతడి రెండో భార్య అమర్‌జోత్‌గా యాక్ట్ చేసింది. ఈ మూవీ ఏప్రిల్ 12న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది.చదవండి: విడాకుల తర్వాత ఒకే స్టేజీపై కోలీవుడ్ జంట.. ఫ్యాన్స్ ఎమోషనల్ -
మరింత హాట్‌గా యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ.. ఫోటోలు
-
అప్పు డు యానిమల్.. ఇప్పుడు పుష్ప 2.. రణబీర్ ను ఫాలో అవుతున్న పుష్ప రాజ్
-
బ్లాక్ డ్రెస్‌లో యానిమల్ బ్యూటీ.. మతి పొగోట్టేస్తోందిగా!
-
యానిమల్ రిలీజ్ తర్వాత మూడు రోజులు ఏడ్చా: తృప్తి
సోషల్ మీడియా వల్ల సెలబ్రిటీలపై ట్రోలింగ్ చాలా ఎక్కువైపోయింది. లుక్ బాలేకున్నా, సినిమాలో పాత్ర అటూఇటుగా ఉన్నా, ఏం చేసినా, చేయకపోయినా సరే నోరు పారేసుకుంటున్నారు. అలా యానిమల్ మూవీలోని తన పాత్ర వల్ల చాలామంది ట్రోల్ చేశారంటోంది హీరోయిన్ తృప్తి డిమ్రి.ట్రోలింగ్ అంటేనే తెలీదుతాజాగా ఓ ఇంటర్వ్యూలో తృప్తి డిమ్రి మాట్లాడుతూ.. 'యానిమల్ సినిమాకు ముందు విమర్శలనేవే తెలియదు. కానీ ఈ సినిమా వచ్చాక చాలా ట్రోల్ చేశారు. మెయిన్ స్ట్రీమ్‌లో ఉండే సైడ్ ఎఫెక్ట్స్ ఇవే.. అయినా నేను సంతోషంగానే ఉన్నాను. బుల్బుల్, కాలా సినిమాల సమయంలో ఎవరూ విమర్శించలేదు. ఏ పోస్ట్ కింద చూసినా మంచి కామెంట్లే ఉండేవి. ఓపక్క అలా.. మరోపక్క ఇలా..కానీ యానిమల్ సినిమాకు వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. కామెంట్లు చూస్తే పిచ్చెక్కిపోయింది. నేను నా డ్యూటీ చేశాను. ఏ తప్పు చేశానని ఇలా తిడుతున్నారని బాధపడ్డాను. ఇంత నెగెటివిటీ ఎందుకు చూపిస్తున్నారో అసలు అర్థం కాలేదు. ఓపక్క సగంమంది నన్ను మెచ్చుకుంటున్నారు. మరో పక్క మిగతా సగం మంది నన్ను కిందకు లాగడానికి ప్రయత్నిస్తున్నారు.చాలా ఏడ్చా..యానిమల్ రిలీజయ్యాక రెండుమూడురోజులపాటు చాలా ఏడ్చాను. ఇంత ట్రోలింగ్ ఉంటుందని ఊహించలేదు. నేను చాలా సెన్సిటివ్. ఎవరితోనైనా ఫైట్ చేయాల్సి వస్తే నా గదిలోకి వెళ్లి తాళం వేసుకుంటాను. అలాంటిదాన్ని. ఆ సమయంలో విపరీతమైన ట్రోల్స్ చూశాక వర్క్‌పై కూడా శ్రద్ధ పెట్టలేకపోయాను' అని చెప్పుకొచ్చింది.కాగా తృప్తి.. మామ్ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. లైలా మజ్ను, బుల్బుల్, కాలా చిత్రాల్లో నటించింది. యానిమల్ మూవీతో నేషనల్ క్రష్‌గా మారింది. ఈ బ్యూటీ ఇటీవలే బ్యాడ్ న్యూస్ సినిమాలో నటించింది.చదవండి: దమ్ములాగిన విష్ణు.. సోనియా చెప్పింది ఈమె గురించేనా? -
యానిమల్ బ్యూటీపై ఆరోపణలు.. ఆమె టీమ్ ఏమన్నారంటే?
యానిమల్ మూవీతో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకున్న బ్యూటీ తృప్తి డిమ్రీ. రణ్‌బీర్ కపూర్ ప్రియురాలిగా ఈ సినిమాలో అలరించింది. తృప్తి గ్లామర్‌కు ఆడియన్స్ ఫుల్ ఫిదా అయిపోయారు. ఈ మూవీ తర్వాత ముద్దుగుమ్మకు వరుసగా ఆఫర్స్ కొట్టేసింది. అయితే తాజాగా ఈ బాలీవుడ్ భామ ఓ వివాదంలో చిక్కుకుంది. ఓ ఈవెంట్‌కు హాజరయ్యేందుకు డబ్బులు తీసుకుని మోసం చేశారని ఆమెపై ఆరోపణలొచ్చాయి. ఈవెంట్‌కు వచ్చేందుకు వారి నుంచి దాదాపు రూ.5.5 లక్షలు తీసుకుందని నిర్వాహకులు చెబుతున్నారు.తాజాగా తృప్తి డిమ్రీపై వస్తున్న ఆరోపణలపై ఆమె టీమ్ స్పందించింది. ఆమె కేవలం షెడ్యూల్ ప్రకారమే ఈవెంట్స్‌కు హాజరవుతారని వెల్లడించింది. సినిమా ప్రమోషన్స్ మినహాయించి వ్యక్తిగతంగా ఎలాంటి కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదని తెలిపింది. ఎలాంటి కార్యక్రమాలకు డబ్బులు తీసుకోవడం, చెల్లింపులను ఆమోదించడం లాంటిది జరగలేదని స్పష్టం చేసింది. ఆమె ప్రస్తుతం తన రాబోయే చిత్రం విక్కీ విద్య కా వో వాలా వీడియో మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారని ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసింది.కాగా.. ఇక సినిమాల విషయానికొస్తే తృప్తి చివరిసారిగా బ్యాడ్ న్యూజ్‌లో కనిపించింది. ప్రస్తుతం విక్కీ విద్యా కా వో వాలా వీడియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత భూల్ భూలయ్యా-3, ధడక్-2 లో నటించనుంది.అసలేం జరిగిందంటే..?జైపుర్‌కి చెందిన మహిళా వ్యాపారవేత్తలు ఎఫ్ఐసీసీఐ ఎఫ్ఎల్ఓ ఆధ్వర్యంలో ఓ ఈవెంట్ ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం ఇది జరిగింది. అయితే ఈవెంట్‌కు హాజరవుతానని చెప్పి తృప్తి డిమ్రీ రూ.5.5 లక్షలు తీసుకుంది. ఈవెంట్ మొదలవడానికి ఐదు నిమిషాల ముందు వరకు వచ్చేస్తానని చెప్పిందట. తీరా రాకపోయేసరికి నిర్వాహకులు, మహిళ వ్యాపారవేత్తలు తృప్తిపై నిరసన వ్యక్తం చేశారు. ఆమె ఫొటోపై నల్లని పెయింట్ రాశారు. ఈక్రమంలోనే ఆమె టీమ్ క్లారిటీ ఇచ్చింది.Muh Kaal Karo 😱 #TriptiDimri skips event after taking 5 Lacs; Women group blackened her poster #MovieTalkies pic.twitter.com/45spP3LrMa— $@M (@SAMTHEBESTEST_) October 1, 2024 -
మోసం చేసిన 'యానిమల్' హీరోయిన్.. డబ్బులు తీసుకుని
'యానిమల్' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన నటి తృప్తి దిమ్రి. అంతకు ముందు పలు హిందీ చిత్రాల్లో నటించింది. కానీ ఈ మూవీతో స్టార్డమ్ సొంతం చేసుకుంది. దీంతో సినిమా ఛాన్సులు, యాడ్స్, ఈవెంట్స్‌తో కాస్త బిజీ అయిపోయింది. అంత బాగానే ఉంది కానీ ఇప్పుడు ఓ ఈవెంట్‌కి హాజరవుతానని చెప్పి లక్షల తీసుకుని మోసం చేయడం హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: సోనియాలా మారిపోతున్న యష్మీ.. బక్వాస్ గేమ్ అని చాడీలు) ఇంతకీ ఏమైంది?జైపుర్‌కి చెందిన మహిళా వ్యాపారవేత్తలు ఎఫ్ఐసీసీఐ ఎఫ్ఎల్ఓ ఆధ్వర్యంలో ఓ ఈవెంట్ ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం ఇది జరిగింది. అయితే దీనికి హాజరవుతానని చెప్పి తృప్తి రూ.5.5 లక్షలు తీసుకుంది. ఈవెంట్ మొదలవడానికి ఐదు నిమిషాల ముందు వరకు వచ్చేస్తానని చెప్పిందట. తీరా రాకపోయేసరికి నిర్వహకులు, మహిళ వ్యాపారవేత్తలు తృప్తిపై నిరసన వ్యక్తం చేశారు. ఆమె ఫొటోపై నల్లని పెయింట్ రాశారు.ఇక ఈ ఘటనపై స్పందించిన నిర్వహకురాలు.. తృప్తి బాధ్యతరాహిత్యంగా వ్యవహరించిందని, ఆమెపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పింది. జైపుర్‌లో ఆమె సినిమాలని బ్యాన్ చేస్తామని, ఆమె తమని మోసం చేసిందని చెబుతూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి ఈ విషయంలో తృప్తి ఎలా స్పందిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి ఫీల్ గుడ్ మూవీ.. ప్రతి తల్లిదండ్రులు చూడాల్సిందే!)Tripti Dimri skips event after pocketing ₹5 lakhs; women’s group protests by blackening her poster pic.twitter.com/Ih2bLKzWcG— WarpaintJournal.in (@WarpaintJ) October 1, 2024 -
ఐఫా వేదికపై ఆర్జీవీకి కృతజ్ఞతలు చెప్పిన సందీప్ రెడ్డి వంగా
భారతీయ సినీ పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) (IIFA Awards-2024) అవార్డుల కార్యక్రమం తాజాగా అబుదాబిలో జరిగింది. ఆ వేదికపై దర్శకులు రామ్‌గోపాల్ వర్మ గురించి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్లో ఆయన తెరకెక్కించిన యానిమల్ సినిమాకు తొమ్మిది విభాగాల్లో ఐఫా నుంచి అవార్డులు అందాయి. దీంతో ఈ సినిమాను తెరకెక్కించిన సందీప్‌పై భారీగా ప్రశంసలు అందాయి.యానిమల్ చిత్రానికి గాను ఉత్తమ చిత్రం, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో అవార్డులను సందీప్ రెడ్డి వంగా అందుకున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు సందీప్ థ్యాంక్స్ చెప్పారు. రామ్‌గోపాల్ వర్మ సినిమాలు చూసి తాను ఎడిటింగ్ నేర్చుకున్నానని అబుదాబి వేదికగా సందీప్ అన్నారు. వర్మ సినిమాలకు తాను పని చేయకపోయినప్పటికీ ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పారు. ఈ క్రమంలోనే 'థాంక్యూ ఆర్జీవీ సర్' అని సందీప్ చెప్పారు. ఇప్పటికే పలు వేదికల మీద ఆర్జీవీ పట్ల తనకున్న గౌరవాన్ని సందీప్ చాటుకున్నారు. తాజాగా మరోసారి తన అభిమానాన్ని ఇలా పంచుకున్నారు.సందీప్ రెడ్డి వంగా మాట్లాడిన మాటలను రామ్‌గోపాల్ వర్మ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. తనదైన స్టైల్లో ఆయన ఇలా స్పందించారు. 'సార్.. సందీప్ రెడ్డి వంగా గారు. ఇప్పుడు మీ నుంచి నేను సినిమా తీయడం నేర్చుకోవాలని అనుకుంటున్నాను. మియా మాల్కోవా, దావూద్ ఇబ్రహీం, అయాన్ రాండ్తో పాటు మీపై ఒట్టేసి చెబుతున్నా.' అని ఆర్టీవీ ట్వీట్ చేశారు.యానిమల్ చిత్రం 2023లో విడుదలైంది. సందీప్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో రణ్వీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి డిమ్రి నటించారు. రూ. 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 917 కోట్లు రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేసింది. యానిమల్ చిత్రానికి దర్శకుడిగానే కాకుండా ఎడిటర్‌గానూ సందీప్ తన ప్రతిభను చూపించారు. అలా బాలీవుడ్లో తన సత్తా ఏంటో చూపించారు. ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో స్పిరిట్ చిత్రానికి సందీప్ దర్శకత్వం వహించనున్నారు. 2026లో ఈ సినిమా విడుదల కానుంది.Sirrrrrrr @imvangasandeep I now want to LEARN film making from YOU and I SWEAR this on Mia Malkova, Dawood Ibrahim ,Ayn Rand and YOU pic.twitter.com/sY0MtdJ7KG— Ram Gopal Varma (@RGVzoomin) September 30, 2024 -
#IIFAAwards2024 : అట్టహాసంగా ఐఫా అవార్డుల వేడుక (ఫొటోలు)
-
శ్రద్ధాకపూర్ మూవీ రికార్డ్.. ఏకంగా యానిమల్‌ను దాటేసింది!
బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్ రావు జంటగా నటించిన హారర్ కామెడీ చిత్రం స్త్రీ-2. ఆగస్టు 15న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే పలు రికార్డులు కొల్లగొట్టిన ఈ మూవీ.. తాజాగా మరో మైలురాయిని అధిగమించింది. బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో రెండోస్థానంలో నిలిచింది. అంతేకాకుండా గతంలోనే టాలీవుడ్ మూవీ బాహుబలి ది బిగినింగ్ వసూళ్లను దాటిన స్త్రీ-2.. సందీప్ రెడ్డి వంగా చిత్రం యానిమల్ దేశవ్యాప్తంగా రాబట్టిన కలెక్షన్స్‌ను సైతం దాటేసింది.కాగా.. రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన యానిమల్ గతేడాది విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. కేవలం ఇండియా వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.553 కోట్లు వసూళ్లు సాధించింది. తాజాగా స్త్రీ-2 రూ.583 కోట్ల వసూళ్లతో యానిమల్ చిత్రాన్ని దాటేసింది. అంతేకాకుండా బాలీవుడ్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల్లో షారూఖ్ ఖాన్ జవాన్ (రూ.640 కోట్లు) తర్వాత రెండోస్థానంలో నిలిచింది. (ఇది చదవండి: బాహుబలిని దాటేసిన చిన్న సినిమా.. జవాన్‌పై గురి!)అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కేవలం కంటెంట్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆగస్టు 15న విడుదలైన ఈ హారర్ కామెడీ సినిమా.. బాలీవుడ్లో స్టార్ హీరోల చిత్రాలకు గట్టి పోటీ ఇచ్చింది. శ్రద్ధాకపూర్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. -
ఏడాదిన్నర ఆగితే.. 12 రోజులు షూట్ చేశారు: బాబీ డియోల్
సందీప్‌రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రంలో బాబీ డియోల్ విలన్‌గా నటించాడు. సినిమా రిలీజ్ తర్వాత చాలామంది రణ్‌బీర్‌తో పాటు బాబీ డియోల్ నటనపై కూడా ప్రశంసలు కురిపించారు. తెరపై ఆయన కనిపించేది కాసేపయినా.. తనదైన నటనతో భయపెట్టాడు. అయితే పాత్ర కోసం బాబీ దాదాపు ఏడాదిన్నర వేచి చూశాడట. ఒకనొక దశలో సినిమాలో తన పాత్ర ఉంటుందో లేదో అని భయపడిపోయాడట. ఈ విషయాన్ని స్వయంగా బాబీ డియోలే తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ‘ఒక రోజు నాకు సందీప్ వంగా నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. తాను తీయబోతున్న కొత్త సినిమాలో విలన్ పాత్ర కోసం కలవాలని చెప్పారు. వెంటనే ఫోన్ చేసి మాట్లాడాను. కథ చెప్పేందకు నా దగ్గరకు వస్తూ.. ఓ ఫోటోని తీసుకొని వచ్చాడు. అది నేను సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో పాల్గొన్న ఫోటో. అందులో నా ఎక్స్ప్రెషన్స్ చూసి ఆ పాత్రకు సెలెక్ట్ చేసుకున్నానని సందీప్ చెప్పడంతో ఆశ్చర్యపోయాను. కథ, నా పాత్ర నచ్చి వెంటనే ఒకే చెప్పేశాను. షూటింగ్ మొదలై నెలలు గడుస్తున్న నన్ను మాత్రం పిలవలేదు. దీంతో నాకు అనుమానం కలిగింది. సందీప్ మనసు మార్చుకొని నా పాత్రను వేరే వాళ్లకి ఇచ్చాడేమో అనుకున్నాను. దాదాపు ఏడాదిన్నర తర్వాత నాకు పిలుపొచ్చింది.రణ్‌బీర్‌తో కలిసి నేను 12 రోజులు మాత్రమే షూటింగ్లో పాల్గొన్నాను. అయితే సినిమా ఈ స్థాయిలో విజయం సాధిస్తుందని ఊహించలేదు. నేను తెరపై కనిపించేది కాసేపే అయినా.. ప్రతి ఒక్కరు నా పాత్ర గురించి మాట్లాడుకోవడం సంతోషంగా అనిపించింది. సినిమా విడుదలకు ముందు తన అత్తయ్య చనిపోవడం వల్లే సెలబ్రేషన్స్‌లో పాల్గొనలేకపోయాను’అని బాబీ డియోల్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బాబీ.. సూర్య హీరోగా నటిస్తున్న ‘కంగువా’ చిత్రంలో విలన్ పాత్రను పోషిస్తున్నాడు. అలాగే పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’, యశ్ రాజ్ ఫిల్మ్ నిర్మిస్తున్న ‘ఆల్ఫా’, బాలకృష్ణ 109వ చిత్రంలోనూ కీలక పాత్రలు పోషిస్తున్నాడు. -
నాలుగేళ్ల షెడ్యూల్.. ప్రభాస్ 'స్పిరిట్' రిలీజ్‌పై సందీప్ ప్రకటన
అర్జున్ రెడ్డి నుంచి యానిమల్ సినిమా వరకు బాక్సాఫీస్‌ను షేక్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. రీసెంట్గా యానిమల్ సినిమాతో తన సత్తా ఏంటో బాలీవుడ్‌కు పరిచయం చేశాడు. ఈ సినిమాతో ఆయన పేరు భారీగా ట్రెండ్ అయింది. ఈ సినిమా తర్వాత ఆయన ప్రభాస్‌తో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమా గురించి తాజాగా పలు ఆసక్తికరమైన విషయాలను ఆయన పంచుకున్నారు. ప్రభాస్‌తో హీరోగా తాను తెరకెక్కించనున్న 'స్పిరిట్'కు సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించినట్లు ఓ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగా తెలిపారు.'ప్రస్తుతం తన చేతిలో రెండు కీలక ప్రాజెక్ట్‌లు మాత్రమే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఆ సినిమాలకు సంబంధించిన ప్రణాళికలు పూర్తి అయినట్లు తెలిపారు. వచ్చే నాలుగేళ్లు తన పూర్తి షెడ్యూల్ ఈ రెండు ప్రాజెక్ట్‌లకే సరిపోతుందని అన్నారు. ఈ క్రమంలో ఈ ఏడాదిలోనే స్పిరిట్ సెట్స్‌పైకి తీసుకెళ్తున్నట్లు చెప్పాడు. అయితే, సినిమా విడుదలకు మాత్రం రెండేళ్లు పట్టవచ్చని తెలిపాడు. అంటే స్పిరిట్ 2026లో విడుదల కానుందని రివీల్ చేశాడు. స్పిరిట్ సినిమా తర్వాతనే 'యానిమల్ పార్క్'పై దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం తన చేతిలో ఈ రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయని సందీప్ రెడ్డి చెప్పాడు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఖాకీ డ్రెస్‌లో తొలిసారి ప్రభాస్'స్పిరిట్' పాన్ ఇండియా రేంజ్లో టీ సిరీస్ బ్యానర్‌పై తెరకెక్కనుంది. ఈ ఏడాది చివరిలో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టే అవకాశముందని ఇప్పటికే నిర్మాత భూషణ్ కుమార్ తెలిపారు. ప్రభాస్ కెరీర్లో తొలిసారి ఈ సినిమాలో ఖాకీ డ్రెస్ వేసుకోబోతుండటంతో ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీని భారతీయ భాషలతోపాటు చైనీస్, కొరియన్ భాషలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో సౌత్ కొరియన్ పాపులర్ యాక్టర్ మడాంగ్సియోక్ విలన్‌గా కనిపించబోతున్నాడని ప్రచారం ఉంది. 'యానిమల్ పార్క్' విషయానికి వస్తే.. గతేడాది విడుదలైన 'యానిమల్'కు సీక్వెల్‌గా రానున్న విషయం తెలిసిందే. -
కెమెరాలకు కూడా దొరకని అందంతో తృప్తి డిమ్రి (ఫోటోలు)
-
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి (ఫొటోలు)
-
'యానిమల్' నిర్మాత ఇంట్లో విషాదం.. 20 ఏళ్ల కూతురు మృతి
'యానిమల్' నిర్మాతల్లో ఒకరైనా కృషన్ కుమార్ కుమార్తె కన్నుమూసింది. చాలా చిన్న వయసులోనే అంటే 20 ఏళ్లకే క్యాన్సర్‌తో పోరాడుతూ మరణించింది. ఈ విషయం తెలిసి ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఈయన నిర్మాణ సంస్థ టీ-సిరీస్ కూడా మరణవార్తని ధ్రువీకరించారు.(ఇదీ చదవండి: 'డార్లింగ్' సినిమా రివ్యూ)బాలీవుడ్లోనే బడా నిర్మాణ సంస్థ టీ-సిరీస్. ప్రస్తుతం దీన్ని భూషణ్ కుమార్ చూసుకుంటున్నారు. ఈయనకు చిన్నాన్న కృషన్ కుమార్. ప్రస్తుతం కృషన్.. టీ-సిరీస్ ఛైర్ పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. 1995లో 'బేవఫా సనమ్' అనే సినిమాలో నటించిన ఈయన.. ఆ తర్వాత పూర్తిగా నిర్మాణ వ్యవహారాలకే పరిమితమైపోయారు. గతేడాది వచ్చిన 'యానిమల్' నిర్మాతల్లో ఈయన కూడా ఒకరు.ఇకపోతే కృషన్ కుమార్‌కి ఒకే ఒక్క కూతురు త్రిష కుమార్. ప్రస్తుతం ఈమెకు 20 ఏళ్లు. కానీ ఊహించని విధంగా క్యాన్సర్ బారిన పడిన ఈమెకు జర్మనీలో అత్యాధునిక చికిత్స అందించారు. కానీ వైద్యులు ఈమెని కాపాడలేకపోయారు. జూలై 18న త్రిష తుది శ్వాస విడిచింది. మరీ చిన్న వయసులోనే ఇలా క్యాన్సర్‌తో త్రిష చనిపోవడం బాధాకరమైన విషయం!(ఇదీ చదవండి: బాలీవుడ్ మాఫియాకి దెబ్బ మీద దెబ్బ.. షాకిచ్చిన 'కల్కి' మేకర్స్!) -
నేను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితుడినే: యానిమల్ నటుడు షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ నటుడు సిద్దాంత్ కర్నిక్ గతేడాది సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ చిత్రంలో కనిపించారు. 2023 డిసెంబర్లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ మూవీ రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించిన సిద్ధాంత్ కర్నిక్.. ప్రభాస్ ఆదిపురుష్‌లోనూ నటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హజరైన సిద్ధాంత్ తన కెరీర్లో ఎదురైన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తాను క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైందని షాకింగ్ కామెంట్స్ చేశారు. అదేంటో తెలుసుకుందాం.సిద్ధాంత్ కర్నిక్ మాట్లాడుతూ.. " అప్పడప్పుడే నా కెరీర్ ప్రారంభించా. 2005లో కేవలం 22 ఏళ్ల వయసులోనే పరిశ్రమలోకి ప్రవేశించా. ఓ సినిమా ఛాన్స్ కోసం కోఆర్డినేటర్ని కలిశా. అతను నా పోర్ట్‌ఫోలియో తీసుకుని రాత్రి 10:30 గంటలకు ఇంటికి రమ్మన్నాడు. ఆ టైమ్‌లో పిలవడం నాకు కాస్తా వింతగా అనిపించింది. అయినా అవకాశం కోసం వెళ్లక తప్పలేదు. ' అని అన్నారు. అనంతరం మాట్లాడుతూ..' అవకాశాల కోసం కొన్ని విషయాల్లో రాజీపడక తప్పదు. లేకపోతే నీకు ఎలాంటి పని ఉండదని అన్నాడు. దీంతో అతని మాటలను నేను వెంటనే గ్రహించా. ఆ సమయంలో అతను నాకు చాలా దగ్గరగా వచ్చాడు. నేను వెంటనే ఇంట్రెస్ట్ లేదని చెప్పి బయటకొచ్చేశా' అని తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత అతను నా సినిమా అవకాశాలను దెబ్బతీస్తాడేమోనని భయపడినట్లు వెల్లడించారు. కానీ కొన్నేళ్ల తర్వాత ఓ ఈవెంట్లో అతనే నన్ను అభినందించాడని తెలిపారు. కాగా.. సిద్ధాంత్ కర్నిక్ యానిమల్, ఆదిపురుష్ వంటి చిత్రాలతో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాకుండా ఫేమస్ వెబ్ సిరీస్ మేడ్ ఇన్ హెవెన్ సీజన్- 2 కీలక పాత్ర పోషించాడు. 2004లో టీవీ షో రీమిక్స్‌తో కర్నిక్ తన కెరీర్ ప్రారంభించాడు. -
Triptii Dimri: యానిమల్ బ్యూటీ గ్లామర్ షో (ఫోటోలు)
-
కేవలం రూ.4 కోట్ల సినిమా.. నెల రోజుల్లోనే యానిమల్‌ను దాటేసి!
అమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించిన చిత్రం లపతా లేడీస్. ఈ చిత్ర నిర్మాతల్లో అమిర్ ఖాన్ కూడా ఉన్నారు. ఈ చిత్రం మార్చి 1న థియేటర్లలో రిలీజ్ అయింది. తక్కువ బడ్జెట్‌తో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కేవలం రూ.4 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.20 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకున్న లాపతా లేడీస్ గత నెల 26న ఓటీటీ స్ట్రీమింగ్ వచ్చింది. ఈ చిత్రానికి హిట్ టాక్ రావడంతో ఓటీటీలోనూ దూసుకెళ్తోంది. తాజాగా ఈ చిత్రం సరికొత్త రికార్డ్ సృష్టించింది. సందీప్ రెడ్డి వంగా చిత్రం యానిమల్‌ను అధిగమించింది. కేవలం 30 రోజుల్లోనే రికార్డ్ స్థాయి వ్యూయర్షిప్ను సొంతం చేసుకుంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ చిత్రం రికార్డు స్థాయిలో 13.8 మిలియన్ వ్యూస్ సాధించింది. కేవలం నెల రోజుల్లోనే ఈ ఘనతను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని కిరణ్ రావు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకున్నారు.ఇదిలా ఉంటే.. బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన సందీప్ రెడ్డి, రణ్‌బీర్ కపూర్ చిత్రం యానిమల్ ఇప్పటివరకు కేవలం 13.6 మిలియన్ వ్యూస్ మాత్రమే సాధించింది. జనవరి 26న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన యానిమల్ ఈ మైలురాయిని చేరుకునేందుకు నాలుగు నెలల సమయం పట్టింది. కాగా.. గతేడాది డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైన యానిమల్ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.కాగా.. లాపతా లేడీస్ చిత్రంలో నితాశీ గోయల్, స్పర్శ్ శ్రీవాత్సవ్, ప్రతిభా రత్న, ఛాయా కదమ్, రవికిషన్ ప్రధాన పాత్రలు పోషించారు. గీతా అగర్వాల్ శర్మ, సతేంద్ర సోనీ, భాస్కర్ ఝా, దావూద్ హుస్సేన్ నటించారు. ఈ సినిమా టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో 2023 సెప్టెంబర్‌లోనే ప్రదర్శితమైంది. ఆ తర్వాతనే ఈ ఏడాది మార్చి 1వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. కాగా.. సందీప్ రెడ్డి వంగా యానిమల్ గురించి గతంలో కిరణ్ రావు మాట్లాడారు. సందీప్ వంగా సినిమాలను ఎప్పుడూ ప్రత్యేకించి విమర్శలు చేయలేదని ఆమె అన్నారు. అతని సినిమాలను నేను చూడలేదు.. అందుకే కామెంట్స్ చేయడం లేదన్నారు. నేను తరచుగా స్త్రీ ద్వేషం, తెరపై మహిళల ప్రాతినిధ్యం గురించి మాట్లాడుతున్నట్లు తెలిపారు. చాలా సార్లు మహిళల గురించి మాట్లాడాను.. కానీ నేను ఏ సినిమా పేరును ప్రస్తావించలేదని వెల్లడించారు. ఎందుకంటే నేను పోరాటం చేసేది సినిమాల గురించి కాదని.. మహిళల సమస్యలపై మాత్రమేనని కిరణ్ రావు పేర్కొన్నారు. -
'యానిమల్' ఓ చెత్త సినిమా.. చూస్తుంటే చిరాకేసింది: 12th ఫెయిల్ నటుడు
'యానిమల్' సినిమాని ఎంతమందికి నచ్చిందో తెలీదు గానీ విమర్శలు మాత్రం చాలా ఎక్కువే వచ్చాయి. చాలామంది సినీ ప్రముఖులు ఈ సినిమాలోని సన్నివేశాలపై బహిరంగంగానే కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ లిస్టులో 12th ఫెయిల్ నటుడు, మాజీ ఐఏఎస్ వికాస్ దివ్యకృతి కూడా చేశారు. ఈ చిత్రం మన సమాజాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్తుందని కౌంటర్స్ వేశారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 18 సినిమాలు.. అవేంటంటే?) ''యానిమల్' లాంటి సినిమా మన సమజాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్తుంది. ఇలాంటిది అసలు తీసి ఉండకూడదు. మీకు డబ్బులు వచ్చి ఉండొచ్చు. కానీ హీరోని మీరు జంతువులా చూపించారు. అలానే ఈ సినిమాలో హీరోయిన్ ని హీరో తన కాలికి ఉన్న షూ నాకమనే సీన్ ఒకటి ఉంటుంది. దీన్ని చూసి రేప్పొద్దున యూత్ కూడా ఇలానే ప్రవర్తిస్తే ఏంటి పరిస్థితి? ఇలాంటి కేర్ లెస్, బుద్ధిలేని సినిమాలు తీయడం చూస్తుంటే బాధేస్తోంది. మూవీ చూస్తుంటే చిరాకేసింది' అని వికాస్ దివ్యకృతి ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తీసిన ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్, రష్మిక, తృప్తి దిమ్రి హీరోహీరోయిన్లుగా నటించారు. హింస, శృంగార సన్నివేశాలు కాస్త ఈ మూవీలో ఎక్కువగానే ఉన్నాయి. దీంతో యూత్ కి తప్పితే ఫ్యామిలీ ఆడియెన్స్ కి ఈ చిత్రం నచ్చలేదని కామెంట్స్ వచ్చాయి. సినిమా వచ్చి దాదాపు ఐదు నెలలు అవుతున్నా సరే ఇప్పటికీ ఎవరో ఒకరు 'యానిమల్'పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ఫ్యామిలీ స్టార్'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయిందా?) -
'చిన్నా'పై ఇలాంటి వ్యాఖ్యలా అంటూ కన్నీళ్లు పెట్టుకున్న సిద్దార్థ్
సిద్ధార్థ్ ఇటీవలి చిత్రం చిత్త (తెలుగులో చిన్నా) ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా అభినందనలు పొందింది. సిద్ధార్ధ్ కెరియర్లో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రంగా 'చిన్నా' ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గతేడాది విడుదలైన ఈ సినిమా సౌత్ ఇండియాలో మంచి విజయాన్ని అందుకుంది. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ అవార్డుల కార్యక్రమంలో సిద్ధార్థ్ పాల్గొన్నారు. చిన్నా సినిమాకు గాను 'మ్యాన్ ఆఫ్ ది ఇయర్'గా ఆయన అవార్డు అందుకున్నారు. ఆ సమయంలో పలు ఆసక్తికరమైన విషయాలతో పాటు పరోక్షంగా రణబీర్ కపూర్ యానిమల్ సినిమాపై ఆయన విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సిద్ధార్థ్ మాట్లాడుతూ.. చిన్నా సినిమాను చూసిన కొందరు డిస్టర్బ్ అయ్యామంటూ వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా సినిమా చూడలేకపోయామని అన్నారు. అది నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇటీవల హిట్ అయిన బాలీవుడ్ సినిమాను కొంతమంది ఎలాంటి ఇబ్బందిలేకుండా చూశారు. కానీ మనసుని హత్తుకునే కథతో చిన్నా సినిమా చేస్తే మాత్రం వారికి ఇబ్బందిగా మారింది. ఇది నిజంగానే సిగ్గుచేటు మనస్తత్వం.' అని సిద్ధార్థ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. యానిమల్ సినిమా పేరు ఎత్తకుండా సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలపై కొందరి నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తున్నా మరికొందరు మాత్రం ఆయన వ్యాఖ్యల్లో నిజం ఉందని పేర్కొంటున్నారు. ప్రస్తుత సమాజంలో చిన్న పిల్లలపై జరుగుతోన్న లైంగిక దాడుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చిన్నా సినిమాలో సిద్ధార్థ్ ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరించారు. ఈ సినిమాలో నిమిషా సజయన్, సహస్ర శ్రీ కీలక పాత్రలు పోషించారు. Siddharth’s strong attack on #Animal 👌 pic.twitter.com/lgO0XD2TuG — Haricharan Pudipeddi (@pudiharicharan) April 13, 2024 -
ఖరీదైన కారు కొన్న ఆర్ఆర్ఆర్ సింగర్.. ఎన్ని కోట్లంటే?
సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ యానిమల్. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. గతేడాది డిసెంబర్లో రిలీజైన యానిమల్ దాదాపు రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీలో బాలీవుడ్ భామ త్రిప్తి డిమ్రీ కీలక పాత్రలో కనిపించింది. అయితే ఈ చిత్రంలోని పెహేలే భీ మే, కబీర్ సింగ్ కైసే హువా అనే పాటలను ఆలపించారు ప్రముఖ సింగర్ విశాల్ మిశ్రా. తాజాగా అతను ఖరీదైన కారును కొనుగోలు చేశారు. ఆధునాతన సౌకర్యాలున్న లగ్జరీ మెర్సిడెస్-బెంజ్ మేబ్యాక్ కారును సొంతం చేసుకున్నారు. ఈ కారు ధర దాదాపు రూ.3.50 కోట్ల రూపాయలుగా ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా ద్వారా పంచుకున్నారు. సింగర్ విశాల్ గతంలో యోధా , సత్యప్రేమ్ కి కథ, చోర్ నికల్ కే భాగే, ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్ నాటు నాటు సాంగ్ పాడారు. ప్రస్తుతం అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలలో నటించిన రాబోయే చిత్రం బడే మియాన్ చోటే మియాన్లో పాటలను ఆలపించారు. ఈ చిత్రంలో మానుషి చిల్లర్, అలయ ఎఫ్, సోనాక్షి సిన్హా, రోనిత్ బోస్ రాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇది ఏప్రిల్ 11, 2024న థియేటర్లలో రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Vishal Mishra (@vishalmishraofficial) -
తండ్రి కష్టాలను తాను మోస్తూ.. పోరాటం కొనసాగించిన 'రష్మిక మందన్న'
రష్మిక మందన్నా.. నిజానికి కన్నడ నటి. నేడు 28వ పుట్టిన రోజు జరుపుకుంటుంది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన రష్మిక 'కిరిక్ పార్టీ' చిత్రంతో కన్నడ సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత 'ఛలో' సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ‘గీతగోవిందం, సరిలేరు నీకెవ్వరు, పుష్ప,యానిమల్ చిత్రాలతో నేషనల్ క్రష్‌గా వెలిగిపోతుంది. తనపట్ల పలు రకాలుగా రూమర్స్, డీప్ ఫేక్ వీడియోలు వంటివి ఎదురైనా బలంగా నిలబడింది. అందుకే నేడు ఆమె పాన్ ఇండియా రేంజ్లో సత్తా చాటుతూ చరిత్రలో తనకంటూ ఒక పేజీని ఏర్పాటు చేసుకుంది. రష్మిక విద్యాభ్యాసం వివరాలు రష్మిక మందన్న కర్ణాటకలో కొడగు జిల్లాలోని విరాజ్‌పేట్‌లో ఏప్రిల్ 5, 1996లో జన్మించారు. రష్మిక కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత రష్మిక M. S. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్ నుంచి సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి పెంచుకున్న రష్మిక.. చదువును నిర్లక్ష్యం చేస్తూ నటి కావాలని కలలు కనలేదు. చదువులో అగ్రస్థానంలో నిలిచిన రష్మిక మొదట మోడలింగ్ షోలలో పనిచేయడం ప్రారంభించింది. అలా ఒక షోలో ఆమెను చూసిన రక్షిత్ శెట్టి 'కిరిక్ పార్టీ' సినిమాలో ఎలాంటి ఆడిషన్ లేకుండానే ఛాన్స్ ఇచ్చాడు. అద్దె ఇంట్లో జీవితం ప్రారంభం రష్మిక చిన్నప్పుడు తమ కుటుంబం మొత్తం ఓ అద్దె ఇంట్లో ఉండేవారమని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆర్థిక కష్టాల కారణంగా రెంట్ కట్టలేకపోవడంతో పదే పదే ఇల్లు మారాల్సి వచ్చేదని చెబుతూ ఆ సమయంలో కంటతడి పెట్టుకుంది. తల్లిదండ్రులు చివరికి తనకి ఆడుకోవడానికి ఒక బొమ్మని కూడా కొనివ్వలేకపోయారని వాపోయింది. పాఠశాల రోజుల్లో తన కుటుంబం ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంది. ఆపై వ్యాపారాల్లో నష్టం వచ్చి తన నాన్నగారు బాధపడిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఎలాగైనా ఆ పరిస్థితిని మార్చాలని రష్మిక బలంగా కోరుకుంది. అందుకు తగ్గట్లు కష్టపడింది. తన తల్లిదండ్రులకు ఎలాంటి సినీ నేపథ్యం లేదు.. అయినా ధైర్యంగా ఇందులో అడుగుపెట్టింది. ఇప్పుడు తను రెండుజేతులా ఆర్జిస్తూ తండ్రికి బిజినెస్‌లో ఫైనాన్షియల్‌గా హెల్ప్ చేస్తోంది. అలానే ఓ పెద్ద ఇల్లుని కూడా పేరంట్స్‌కి గిప్ట్గా ఇచ్చింది. ఛలో టూ పుష్ప కిరిక్ పార్టీ సినిమా విజయంతో రష్మిక మందన్నకు ఛలో సినిమాలో ఛాన్స్ దక్కింది. కేవలం రంగుల కలలు కని సినిమాల్లోకి తను రాలేదు. ఈ వృత్తిలో ఉండే సాధకబాధకాల గురించి ముందే తెలుసుకుంది. అయితే ప్రతి వృత్తిలో ఉన్నట్లే సినిమారంగంలో కూడా ఒడిదొడుకులు, ఎగుడుదిగుళ్లు ఉంటాయనేది కూడా బాగా తెలుసు అందుకే ఆమెపై ఎన్ని రూమర్స్ వచ్చినా బలంగా తట్టుకుని నిలబడింది. సరైన అవకాశం కోసం ఎదురుచూసింది. ఆ సమయం పుష్ప సినిమాతో వచ్చింది. దీంతో ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రస్తుతం పుష్ప2 తో అంతకు మించి ఇమేజ్ ను సాధించడానికి రెడీగా ఉంది రష్మిక. ఫస్ట్ రెమ్యునరేషన్ కిరిక్ పార్టీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక రూ. 1.50 లక్షలు మాత్రమే రెమ్యునరేషన్ తీసుకున్నారట. ఆ తర్వాత ఛలో సినిమాకు రూ. 50 లక్షలు అందుకున్నారని టాక్. టాలీవుడ్ తర్వాత కోలీవుడ్లోకి అడుగుపెట్టింది రష్మిక. తమిళంలో కార్తీ సరసన నటించిన ఆమె ఆ తర్వాతి సినిమాలోనే తలపతి విజయ్ సరసన నటించే అవకాశాన్ని చేజిక్కించుకుని కోలీవుడ్ మార్కెట్‌ని కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 5 కోట్లకు పైగా డిమాండ్ చేస్తున్న రష్మిక యానిమల్ సినిమాకు మాత్రం రూ. 7 కోట్ల వరకు తీసుకున్నట్లు టాక్. పేదరికం నుంచి కోట్లలో సంపద చిన్నతనంలో నాన్న పడుతున్న కష్టాన్ని తన కళ్లతోనే చూసింది. ఎలాగైనా తన కుటుంబ పరిస్థితిని మార్చాలని కోరుకుంది. అందుకే సంపాదించిన ప్రతి రూపాయి ఇప్పటికి కూడా తన తండ్రికి అప్పజెప్పుతుంది. ప్రస్తుతం సినిమా రెమ్యునరేషన్‌తో పాటు ఆమె పలు ప్రకటనల్లో కూడా కనిపిస్తుంది. ఒక్కో ప్రకటనకి డెబ్బై లక్షల నుంచి కోటి రూపాయల వరకు డిమాండ్ చేస్తోందట. అలా ఇప్పటి వరకు మొత్తంగా రూ. 70 కోట్ల వరకు రష్మిక సంపాధించినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్న మాట. 23 ఏళ్లకే కోటీశ్వరురాలిగా మారిన రష్మికకు బెంగళూరు, కూర్గ్, గోవా, హైదరాబాద్, ముంబై సహా నగరాల్లో ఇళ్లు ఉన్నాయట. ఇందులో రష్మిక బెంగళూరులోని లగ్జరీ ఇంటి విలువ 10 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. రష్మికకు కార్లంటే చాలా ఇష్టం మరియు అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. టయోటా ఇన్నోవా, ఆడి క్యూ3, మెర్సిడెస్ బెంజ్ సి క్లాస్, రేంజ్ రోవర్ స్పోర్ట్, హ్యుందాయ్ క్రెటా వంటి ఖరీదైన కార్లు ఆమె గ్యారేజీలో వరుసలో ఉన్నాయి. ముఖ్యంగా ఆమె సినిమాల్లో సంపాదించని డబ్బును తన తండ్రి ద్వారా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెడుతందని సమాచారం. దాంతో తన ఆస్తులతో పాటు.. సంపద కూడా భారీగా పెరుగుతూ వస్తోందట. చిన్నప్పుడు తన తల్లిదండ్రులను గర్వించేలా చేయాలని బలంగా కోరుకున్న రష్మిక అనుకున్నట్లు గానే సాధించింది. చిన్నతనంలోనే తన జీవితం గురించి ఏ విధంగా అయితే కలలుకనిందో వాటిని నిజం చేసుకుంది. అయినా జీవితంలో ఇంకా సాధించాల్సింది చాలానే ఉందంటున్న రష్మిక.. అవన్నీ నెరవేరాలని కోరుకుంటూ నేషనల్ క్రష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. -
అందం + అభినయం +అల్లరి.. హ్యాపీ బర్త్‌డే రష్మిక మందన (ఫొటోలు)