
కల్యాణ్ రామ్ (Kalyan Ram), విజయశాంతి (Vijayasanthi) కీలక పాత్రల్లో నటిస్తోన్న తాజా చిత్రం 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'. ఈ సినిమాకు ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో టీజర్ లాంఛ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఈ చిత్రంలో నటుడు బబ్లూ పృథ్వీరాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీలో పోలీసు అధికారిగా ఆయన అభిమానులను అలరించనున్నారు. తాజాగా నిర్వహించిన టీజర్ లాంఛ్ ఈవెంట్‌కు బబ్లూ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈవెంట్‌లో తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
బబ్లూ పృథ్వీరాజ్ మాట్లాడుతూ..'నేను సినిమా ఇండస్ట్రీలో గత 50 ఏళ్లుగా ఎన్నో కష్టాలు పడ్డాను. సినిమాల్లో ఎన్నో ఎత్తు, పల్లాలు చూశాను. కానీ ఇప్పుడు నా టైమ్ మారింది. సందీప్ రెడ్డి వంగా యానిమల్ మూవీ తర్వాత నా లైఫ్ మారింది. కానీ ఈ రోజు వరకు 250 నుంచి 300 వరకు సినిమాలు చేశాను. నా కెరీర్‌లో ఎన్నో రోల్స్ చేశాను. నా లైఫ్‌లో అత్యంత కష్టమైన పాత్ర మాత్రం ఈ సినిమాలోనే చేశా' అని ఆయన అన్నారు. కాగా.. తాజగా రిలీజైన అర్జున్ సన్నాఫ్ వైజయంతి టీజర్ చూస్తుంటే తల్లీ తనయుల అనుబంధం నేపథ్యంలో ఈసినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో డైలాగ్స్ చూస్తుంటే మోస్ట్ పవర్‌ఫుల్ యాక్షన్ మూవీగానే రూపొందించినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment