ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పుష్ప-2 రికార్డుల మోత మోగిస్తోంది. విడుదలైన ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్ల మార్క్‌ను దాటేసింది పుష్ప-2. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం వసూళ్లపరంగా అన్ని రికార్డులను బద్దలు కొడుతోంది. 2021లో పుష్ప మూవీకి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
అయితే చిత్రంలో కీలకపాత్రలో మెప్పించారు బాలీవుడ్ నటుడు సౌరభ్ సచ్‌దేవా. యానిమల్ మూవీలో బాబీ డియోల్ సోదరుడిగా మెప్పించిన సౌరభ్ సచ్‌దేవా పుష్ప-2లో నటించడంపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఓ ఇంటర్వ్యుకు హాజరైన సౌరభ్ అల్లు అర్జున్‌తో కలిసి పని చేయడంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
సౌరభ్ సచ్‌దేవా మాట్లాడుతూ..' యానిమల్‌లో నా నటన చూసిన పుష్ప 2 మేకర్స్ నన్ను సంప్రదించారు. నాతో సుకుమార్ సార్ వీడియో సమావేశంలో మాట్లాడారు. పుష్ప-2లో నా పాత్ర గురించి దాదాపు 20 నిమిషాలు చర్చించాం. నా కంటే ముందు చాలా మందిని సంప్రదించినా.. చివరికీ నన్ను ఖరారు చేశారు' అని తెలిపాడు.
అల్లు అర్జున్ గురించి సౌరభ్ మాట్లాడుతూ..'నేను అతన్ని మొదటిసారి సెట్స్‌లోనే కలిశా. అతను చాలా స్వీట్ పర్సన్. నా అభ్యర్థనపై తన వానిటీ వ్యాన్ మొత్తం నాకు చూపించాడు. అతను ఒక సూపర్‌స్టార్‌లా కాకుండా చాలా బాగా మాట్లాడారు. యానిమల్ నా రోల్ పవర్‌ఫుల్ అని అల్లు అర్జున్ అన్నారు. నా పాత్రను బన్నీ ప్రశంసించడం చాలా సంతోషంగా ఉంది.' అంటూ ఆనందం వ్యక్తం చేశారు. యానిమల్, పుష్ప-2 చిత్రాలతో నాకు మరింత ఫేమ్ వచ్చిందని సౌరభ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment