ఊ అన్నావా భామా..! | Sakshi
Sakshi News home page

ఊ అన్నావా భామా..!

Published Fri, May 24 2024 12:04 AM

Tripti Dimri will Share the Screen with Allu Arjun

‘పుష్ప: ది రైజ్‌’ చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌ ‘ఊ అంటావా మావ....’ ఎంత పాపులర్‌ అయిందో తెలిసిందే. ఈ ప్రత్యేక పాటలో అల్లు అర్జున్‌తో కలిసి హాట్‌ హాట్‌ స్టెప్పులేశారు సమంత. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘పుష్ప: ది రూల్‌’లో కూడా ఇలాంటి ఓ ప్రత్యేక పాట ఉందని సమాచారం. ఈ పాటకు అల్లు అర్జున్‌తో కలిసి బాలీవుడ్‌ నటి త్రిప్తి దిమ్రి కాలు కదపనున్నారని సమాచారం.

రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా సందీప్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘యానిమల్‌’లో చేసిన ఓ పాత్రతో త్రిప్తి బాగా పాపులర్‌ అయ్యారు. ఈ చిత్రం తర్వాత త్రిప్తీకి హిందీలో అవకాశాలు పెరిగాయి. ఇప్పుడు ‘పుష్ప: ది రూల్‌’ పాటకు ఆమెను తీసుకున్నారనే వార్త ప్రచారంలోకి రావడంతో ‘ఊ అన్నావా భామా...!’ అని అభిమానులు సరదాగా అంటున్నారు. మరి.. ప్రచారంలో ఉన్నట్లు ఈ పాటతో త్రిప్తి తెలుగుకి పరిచయం అవుతారా? వేచి చూడాల్సిందే.

29న అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే...
‘పుష్ప: ది రూల్‌’ సినిమా నుంచి ఈ నెల 1న ‘పుష్ప..పుష్ప’ అంటూ సాగే పాట విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా నుంచి ‘సూసికి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ అంటూ సాగే మరో పాట లిరికల్‌ వీడియోను ఈ నెల 29న విడుదల చేయనున్నట్లుగా చిత్ర యూనిట్‌ వెల్లడించింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా ఈ పాట విడుదల కానుంది. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకు స్వరకర్త. అల్లు అర్జున్, రష్మికా మందన్నా జంటగా సుకుమార్‌ దర్శకత్వంలో నవీన్  ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ‘పుష్ప: ది రూల్‌’ చిత్రం ఆగస్ట్‌ 15న విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement