
చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు బబ్లూ పృథ్వీరాజ్. ఓ పక్క సినిమాలు చేస్తూనే అడపాదడపా సీరియల్స్‌లోనూ యాక్ట్ చేశాడు. మధ్యలో కాస్త వెనుకబడ్డ నటుడు ఈ మధ్యే మళ్లీ దూకుడు పెంచాడు. వ్యక్తిగత విషయాలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే పృథ్వీరాజ్ గతంలో బీనాను పెళ్లాడాడు. వీరికి అహద్ మోహన్ జబ్బర్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. ఇతడు ఆటిజంతో బాధఫడుతున్నాడు.
బ్రేకప్ రూమర్స్..
కొన్నేళ్లపాటు బాగానే ఉన్న పృథ్వీరాజ్-బీనా మధ్య గొడవలు ఎక్కువవడంతో విడాకులు తీసుకున్నారు. తర్వాత శీతల్ అనే తెలుగమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ సహజీవనం చేశారు. 56 ఏళ్ల వయసులో నటుడు సీక్రెట్‌గా ఆమెను పెళ్లి చేసుకున్నాడని ప్రచారం జరిగింది. ఇంతలోనే వీరి బంధం బీటలు వారిందని కొంతకాలంగా ఊహాగానాలు ఊపందుకున్నాయి. బబ్లూ తనకు ప్రపోజ్ చేసిన వీడియో శీతల్ డిలీట్ చేయడంతో ఈ రూమర్స్ మరింత బలపడ్డాయి. తాజాగా తన బ్రేకప్ నిజమేనని అంగీకరించింది శీతల్. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టి క్లారిటీ ఇచ్చింది.
మేము పెళ్లి చేసుకోలేదు..
'చాలామంది నా జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఎన్నో ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. నా పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఏదేదో ఊహించుకుంటున్నారు. పృథ్వీ, నేను పెళ్లి చేసుకోలేదు. సహజీవనం చేశామంతే! మేము ఊహించినట్లుగా మా రిలేషన్‌షిప్ ముందుకు వెళ్లలేదు. అయితే ఈ ప్రయాణంలో మేము సంతోషాన్ని పంచుకున్న క్షణాలెన్నో ఉన్నాయి. కొద్ది నెలల క్రితమే మేము విడిపోయాము. జరిగిందేదో జరిగిపోయింది. దయచేసి మా నిర్ణయాన్ని గౌరవిస్తూ, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించరని ఆశిస్తున్నాను' అని రాసుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment