sheetal
-
ఇంటి మహాలక్ష్మి.. భార్య కాళ్లు మొక్కితే తప్పేంటి? : హీరో
భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని మహిళలు కర్వాచౌత్ పండగ జరుపుకుంటారు. ఆ రోజు ఉపవాసం ఉండి రాత్రి జల్లెడలో భర్త ముఖాన్ని చూస్తారు. ఉత్తరాదిన సెలబ్రిటీలందరూ ఈ పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో 12th ఫెయిల్ హీరో విక్రాంత్ మాస్సే.. భార్య, నటి షీతల్ ఠాకూర్ కాళ్లకు నమస్కరించాడు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా తనను విపరీతంగా ట్రోల్ చేశారట!భార్య కాళ్లు మొక్కితే..దీని గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా ఫోన్లో ఉన్న ఫోటోల్లో నాలుగు బాగా హైలైట్ అయ్యాయి. కొందరికి అవి నచ్చాయి. మరికొందరికి నచ్చకపోవడంతో నానా బూతులు తిట్టారు. ఎందుకలా తిడుతున్నారో నాకు అర్థం కాలేదు. భార్య కాళ్లు మొక్కితే ప్రశాంతంగా అనిపిస్తుంది. అది తప్పేమీ కాదని నా అభిప్రాయం.అది తప్పేం కాదుఆమె నా ఇంటి మహాలక్ష్మి. లక్ష్మీదేవి పాదాలు తాకడం తప్పు కాదు. పదేళ్ల క్రితం నా జీవితంలో అడుగుపెట్టి లైఫ్‌ను అందంగా మార్చిందని గర్వంగా చెప్తాను. తను వచ్చాకే నాకు అంతా మంచి జరుగుతోంది. మీరెన్ని అనుకున్నా నేను నా భార్య కాళ్లు మొక్కడం మానను అని చెప్పుకొచ్చాడు.పర్సనల్ లైఫ్కాగా విక్రాంత్, షీతల్ ఏళ్ల తరబడి ప్రేమించుకున్నారు. 2022 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కుమారుడు జన్మించగా అతడికి వర్దన్ అని నామకరణం చేశారు. ఇకపోతే విక్రాంత్ మాస్సే.. ద సబర్మతి రిపోర్ట్ అనే సినిమా చేస్తున్నాడు. రాశీ ఖన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ నవంబర్ 15న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Vikrant Massey (@vikrantmassey) చదవండి: అది లేకపోతే ఇండస్ట్రీలో ఎవరూ పట్టించుకోరు: హీరో రాకేశ్ కామెంట్స్ -
అలాంటి వాళ్లే ఇప్పుడు మిఠాయిలు తినిపిస్తున్నారు: శీతల్ దేవి
చిన్న చిన్న సమస్యలకే భయపడి జీవితాన్ని ముగించే యువత ఉన్న నేటి రోజుల్లో.. తనకు రెండు చేతులు లేకపోయినా కోట్లాది మందికి ఆదర్శంగా నిలుస్తోంది శీతల్ దేవి. పదిహేడేళ్ల వయసులోనే పారాలింపిక్స్ పతకం గెలిచి సత్తా చాటింది. తనను కన్న తల్లిదండ్రులతో పాటు దేశం మొత్తం గర్వపడేలా పారా విశ్వక్రీడ వేదికపై కాంస్యంతో మెరిసింది. అయితే, తన ప్రయాణమేమీ సజావుగా సాగలేదని.. పారా ఆర్చర్‌గా ఎదిగే క్రమంలో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నాని చెబుతోంది శీతల్.విల్లు ఎక్కువపెట్టిన ప్రతిసారి‘‘మొదట్లో నాకు క్రీడల గురించి అసలేమీ తెలియదు. అయితే, మా గ్రామంలో చాలా మంది కర్రలతో విల్లులు తయారు చేస్తారు.వాటితో ఆడుకోవడం అంటే నాకెంతో ఇష్టం. అలా విలువిద్యపై దృష్టి సారించాను.అయితే, విల్లు ఎక్కువపెట్టిన ప్రతిసారి నా మనసులో ఒకే ఆలోచన ఉండేది. నేను నా దేశ జెండాను క్రీడా వేదికపై రెపరెపలాడిస్తే ఎంతో బాగుంటుంది కదా అనిపించేది. ఆ కలను సాకారం చేసుకునేందుకు కృషి చేశాను.నా కళ్లల్లో నీళ్లు తిరుగుతాయిత్రివర్ణ పతాకం రెపరెపలాడినప్పుడల్లా నా కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. అసలు నేను ఏదైనా సాధించగలనని ఎవరూ నమ్మలేదు. నాపై ఎవరికీ విశ్వాసం లేదు. అయితే, అప్పుడు ఎవరైతే నన్ను తక్కువగా చూశారో.. ఇప్పుడు వాళ్లే స్వయంగా నా తల్లిదండ్రులకు మిఠాయిలు తినిపిస్తున్నారు’’ అని శీతల్ దేవి గర్వంగా చెప్పింది. సలాం శీతల్అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా ధైర్యంగా ముందడుగు వేస్తే గెలుపు జెండా ఎగర వేయవచ్చునని తన సంకల్ప బలాన్ని ఉదాహరించింది. ఈ మేరకు శీతల్ దేవి మాట్లాడిన వీడియో సోషల్ మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది. సలాం శీతల్ అంటూ ఆమెకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు నెటిజన్లు.శీతల్ దేవి.. తనే ఒక అద్భుతంకశ్మీర్లోని కిష్టవర్ జిల్లా లియోధర్ గ్రామం శీతల్ స్వస్థలం. ఆమె తండ్రి మాన్ సింగ్. తల్లి శక్తిదేవి. వీరిది దిగువ మధ్యతరగతి కుటుంబం. మాన్ సింగ్ రైతు కాగా.. కుటుంబ పోషణలో భర్తకు సాయంగా ఉండేందుకు శక్తి దేవి గొర్రెలు సాకుతోంది. ఈ జంటకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి సంతానం. వీరిలో శీతల్ అందరికంటే పెద్దది. అయితే, ఫొకోలిమా అనే డిజార్డర్ కారణంగా పుట్టుకతోనే ఆమెకు చేతులు ఏర్పడలేదు. అయినప్పటికీ శీతల్ తల్లిదండ్రులు కుంగిపోలేదు. మిగతా ఇద్దరు పిల్లల మాదిరే ఆమెనూ పెంచారు. ఆత్మవిశ్వాసం ఇనుమడించేలా ధైర్యం నూరిపోశారు. అమ్మానాన్నల ప్రోత్సాహంతో చేతులతో చేయాల్సిన పనులు కాళ్లతోనే చేయడం అలవాటు చేసుకుంది శీతల్. భారత ఆర్మీ కోచ్‌ల శిక్షణలోఈ క్రమంలో ఆమెలోని ప్రతిభను గుర్తించిన బీయింగ్ యు సంస్థ తనకు విలువిద్యలో శిక్షణ ఇప్పించింది. ఈ క్రమంలో రెండు చేతులు లేకుండానే విల్లు ఎక్కుపెట్టిన తొలి పారా ఆర్చర్‌గా శీతల్ ఎదిగింది. భారత ఆర్మీకి చెందిన కోచ్‌లు అభిలాష చౌదరి, కుల్దీప్ వధ్వాన్ శిక్షణలో రాటుదేలింది.పసిడి వెలుగులువారి ఆధ్వర్యంలో ట్రెయినింగ్ మొదలుపెట్టిన కేవలం 11 నెలల వ్యవధిలోనే 2023 ఆసియా పారా గేమ్స్‌లో పాల్గొన్న శీతల్ స్వర్ణం గెలిచి ఔరా అనిపించింది. వ్యక్తిగత కాంపౌండ్, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లలో పసిడి పతకాలు గెలిచింది. అదే విధంగా మహిళల డబుల్స్ విభాగంలో సిల్వర్ మెడల్‌తో మెరిసింది. అరుదైన ఘనతఈ క్రమంలో పారా ఆర్చర్ కాంపౌండ్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్‌గా ఎదిగిన శీతల్.. ఖేలో ఇండియా పారా గేమ్స్ 2023లోనూ స్వర్ణ పతకం గెలిచింది. ఈ క్రమంలో అర్జున అవార్డు అందుకున్న శీతల్ దేవి.. ప్యారిస్ పారాలింపిక్స్-2024లో రాకేశ్ కుమార్‌తో కలిసి మిక్స్డ్ కాంపౌండ్ ఓపెన్ ఆర్చరీ విభాగంలో కాంస్యం కైవసం చేసుకుంది. 17 ఏళ్లకే ఘనత సాధించి.. అత్యంత పిన్న వయసులో పారాలింపిక్ మెడల్ గెలిచిన భారత తొలి పారా ప్లేయర్‌గా నిలిచింది.చదవండి: పీటీ ఉషపై వినేశ్ ఫొగట్ సంచలన ఆరోపణలుSheetal Devi - What a Star 💫 Credits Mrityuu Dev Insta pic.twitter.com/YQpS6tANE7— ISH PARA Sports (@ISHsportsmedia) September 10, 2024 -
మరో శీతల్ దేవి.. పారాలింపిక్స్ లక్ష్యంగా(వీడియో)
శీతల్ దేవి.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రెండు చేతులు లేనప్పటకి ప్యారిస్ పారాలింపిక్స్‌లో పతకం సాధించి చరిత్ర సృష్టించింది. పట్టుదల ఉంటే ఎదైనా సాధించవచ్చు అని శీతల్ నిరూపించింది.తన సంకల్పాన్ని, ప్రతిభను వైక్యల్యం ఏ మాత్రం ఆడ్డుకోలేకపోయింది. ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగంలో శీతల్ గురితప్పినప్పటకి.. డబుల్స్‌లో మాత్రం పతకంతో మెరిసింది. జమ్ముకాశ్మీర్‌లోని మారుమూల ప్రాంతానికి చెందిన శీతల్.. విశ్వవేదికపై సత్తాచాటి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది.మరో శీతల్.. ఇప్పుడు మరో శీతల్ ప్రపంచానికి పరిచయం అవ్వడానికి సిద్దమవుతోంది. జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ ప్రాంతంలోని లోయిదార్ గ్రామానికి చెందిన ఓ వికలాంగ యువతి ఆర్చర్‌గా తన ప్రాక్టీస్ మొదలు పెట్టింది. సదరు యువతి శీతల్ సొంత గ్రామానికి చెందిన ఆమె కావడం విశేషం. ఆ 13 ఏళ్ల అమ్మాయి కోచ్ కుల్దీప్ వెద్వాన్ మార్గదర్శకత్వంలో విలువిద్యలో శిక్షణ పొందుతోంది. అయితే ఈ అమ్మాయికి పూర్తిగా కాళ్లు చేతులు కూడా లేకపోవడం గమనార్హం. అయినప్పటకి తన సదరు యువతి పారాలింపిక్సే లక్ష్యంగా పెట్టుకుంది. పారా-ఆర్చరీ కోసం రూపొందించబడిన కృత్రిమ విల్లు సాయంతో ఆమె ప్రాక్టీస్ చేస్తోంది. కృత్రిమ కాలితోనే విల్లును పట్టి.. భుజంతో తాడును లాగి బాణం విసిరి అందరిని ఆమె ఆకట్టుకుంటుంది.త ఆమె టాలెంట్‌కు నెటిజన్లు పిధా అవుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా శీతల్ కోచ్ కూడా కుల్దీప్ వెద్వాన్ కావడం విశేషం. After taking Inspiration from Sheetal Devi 🏹A 13 Year old girl without arms or legs has started chasing her dreams through Archery 🥹 pic.twitter.com/BNczd7Jhc6— The Khel India (@TheKhelIndia) September 8, 2024 -
Paralympics: సచిన్‌కు రజతం.. 21కి చేరిన పతకాల సంఖ్య
ప్యారిస్ పారాలింపిక్స్-2024లో భారత్ మరో పతకం సాధించింది. ప్రపంచ చాంపియన్ సచిన్ ఖిలారి పురుషుల షాట్‌పుట్ ఎఫ్46 ఈవెంట్లో రజతం గెలిచాడు. బుధవారం నాటి ఈ ఈవెంట్లో కెనడాకు చెందిన గ్రెగ్ స్టువర్ట్ 16.38 మీటర్ల దూరం షాట్ విసిరి స్వర్ణం గెలవగా.. సచిన్ 16.32 మీటర్ల దూరంవిసిరి రెండో స్థానంలో నిలిచాడు.తద్వారా పారాలింపిక్స్ తాజా ఎడిషన్‌లో భారత్ ఖాతాలో 21వ మెడల్ చేరింది. ఇక ఇదే ఈవెంట్లో సచిన్‌తో పాటు పోటీ పడిన భారత అథ్లెట్లు మొహ్మద్ యాసిర్, రోహిత్ కుమార్ వరుసగా 8, 9వ స్థానాల్లో నిలిచారు. కాగా ప్యారిస్ పారాలింపిక్స్‌లో భారత్ ఇప్పటి వరకు మూడు స్వర్ణాలు, 8 రజతాలు, 10 కాంస్య పతకాలు గెలిచింది.ప్యారిస్ పారాలింపిక్స్-2024లో ఇప్పటి వరకు పతకాలు గెలిచిన భారత అథ్లెట్లు👉శరద్ కుమార్- మెన్స్ హై జంప్ టీ63- రజతం👉అజీత్ సింగ్- మెన్స్ జావెలిన్ త్రో- రజతం👉మరియప్పన్ తంగవేలు- మెన్స్ హై జంప్ టీ63- కాంస్యం👉సుందర్ సింగ్ గుర్జార్- మెన్స జావెలిన్ త్రో ఎఫ్46- కాంస్యం👉దీప్తి జివాంజి- వుమెన్స్ 400 మీటర్ల టీ20 పరుగు- కాంస్యం👉సుమిత్ ఆంటిల్- మెన్స్జావెలిన్ త్రో ఎఫ్64- స్వర్ణం👉సుహాస్ యతిరాజ్- బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ ఎస్ఎస్64- రజతం👉తులసిమతి మురుగేశన్- బ్యాడ్మింటన్ వుమెన్స్ సింగిల్స్ ఎస్‌యూ45- రజతం👉మనీషా రామదాస్- బ్యాడ్మింటన్ వుమెన్స్ సింగిల్స్ ఎస్‌యూ45- కాంస్యం👉నిత్యశ్రీ సుమతి శివన్- బ్యాడ్మింటన్ వుమెన్స్ సింగిల్స్ ఎస్‌హెచ్6- కాంస్యం👉శీతల్ దేవి- రాకేశ్ కుమార్- మిక్స్డ్ కాంపౌండ్ ఓపెన్ ఆర్చరీ- కాంస్యం👉యోగేశ్ కతూనియా- మెన్స్ డిస్కస్ త్రో ఎఫ్56- రజతం👉నితేశ్ కుమార్- బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ ఎస్ఎల్3- స్వర్ణం👉అవని లేఖరా- వుమెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1- స్వర్ణం👉మోనా అగర్వాల్- వుమెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1- కాంస్యం👉ప్రీతి పాల్- వుమెన్స్ 100 మీటర్ల పరుగు టీ35- కాంస్యం👉మనీశ్ నర్వాల్- పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1- రజతం👉రుబీనా ఫ్రాన్సిస్- వుమెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1- కాంస్యం👉ప్రీతి పాల్- వుమెన్స 200 మీటర్ల పరుగు టీ35- కాంస్యం👉నిషద్ కుమార్- మెన్స్ హై జంప్ టీ47- రజతం👉సచిన్ ఖిలారి- పురుషుల షాట్‌పుట్ ఎఫ్46- రజతం -
శీతల్ దేవీ.. ఓ అద్భుతం! రెండు చేతులు లేకపోయినా?
ప్యారిస్ పారాలింపిక్స్‌లో అర్చర్ శీతల్ దేవి తన అద్భుత ప్రతిభతో యావత్ క్రీడా ప్రపంచాన్నీ అందర్నీ ఆశ్చర్యపరిచింది. వ్యక్తిగత విభాగంలో త్రుటిలో పతకాన్ని చేజార్చుకున్న శీతల్.. డబుల్స్‌లో మాత్రం సంచలన ప్రదర్శన కనబరిచింది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో మరో ఆర్చర్ రాకేశ్ కుమార్‌తో కలిసి కాంస్యపతకం సాధించింది. హోరాహోరీగా సాగిన కాంస్య పతక పోరులో టాప్‌సీడ్ శీతల్- రాకేశ్ జోడీ 156-155 తేడాతో ఎలోనోరా- మాటియో (ఇటలీ)పై విజయం సాధించారు. ఈ మ్యాచ్‌లో తొలి రౌండ్లో 38-40తో భారత్ వెనుకబడింది. ఆ తర్వాత రెండో రౌండ్లో తిరిగి పుంజుకున్న భారత జోడీ 40-38తో ప్రత్యర్ధిపై పై చేయి చేయి సాధించింది. మళ్లీ మూడో రౌండ్లో ఇటీలీ జంట రాకేశ్-శీతల్‌ను 38-39తో వెనక్కి నెట్టారు. అయితే ఫలితాన్ని తేల్చే నాలుగో రౌండ్లో భారత ద్వయం అద్బుతం చేశాడరు. 40-38తో ప్రత్యర్ధిని ఓడించి పతకాన్ని దక్కించుకున్నాడు.ఆ షాట్ ఓ అద్భుతం.. నాలుగో రౌండ్లో 17 ఏళ్ల శీతల్ కొట్టిన షాట్ ఓ అద్బుతం అని చెప్పుకోవాలి. చివరి ఎండ్‌లో కాలితో విల్లు ఎక్కి పెట్టి పది పాయింట్లను దేవి కొట్టింది. ఈ షాట్‌తో భారత్ విజయాన్ని అందుకుంది. వెంటనే స్టాండ్స్‌లో ఉన్న ఆమె కోచ్ కుల్దీప్ వెధ్వాన్ ఆనందంలో మునిగి తేలిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.చేతులు లేకపోతేనేమి..ఏదైనా సాధించాలంటే మానవ అవయవాలతో సంబంధం లేదు.. దృఢ సంకల్పం ఉంటే చాలు అని ఆర్చర్ శీతల్ నిరూపించింది. ఆమె ఆత్మవిశ్వాసం ముందు వైకల్యం ఓడిపోయింది. రెండు చేతులు లేకపోయినప్పటి పట్టుదలతో తన పేరును ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగేలా చేసింది. పుట్టుకతోనే రెండు చేతులు లేకున్నా కాలితోనే విల్లును పట్టి.. భుజంతో తాడును లాగి బాణం విసిరే ప్రత్యేకత ఆమెది. ఆ అరుదైన స్కిల్స్‌తోనే విశ్వవేదికపై శీతల్ సత్తాచాటింది. డబుల్స్‌తో పతకం సాధించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. A triumph of teamwork and tenacity!Rakesh Kumar & Sheetal Devi, your Bronze Medal in the Para Archery Mixed Team Compound Open at #paralympics2024 speaks volumes about your hard work & dedication. Your journey together has been inspiring, showing that with mutual support &… pic.twitter.com/EFut4er5jk— Kiren Rijiju (@KirenRijiju) September 2, 2024 -
శీతల్ దేవి శుభారంభం
పారిస్: పారా ఆర్చరీలో గత కొంత కాలంగా సంచలన విజయాలు సాధిస్తున్న భారత ప్లేయర్ శీతల్ దేవి పారాలింపిక్స్‌లోనూ శుభారంభం చేసింది. ఆర్చరీ కాంపౌండ్ ఈవెంట్ మహిళల వ్యక్తిగత విభాగంలో ఆమె నేరుగా రెండో రౌండ్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన ర్యాంకింగ్ రౌండ్లో శీతల్ రెండో స్థానంలో నిలిచింది. మొత్తం 703 పాయింట్లతో ఆమె తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేయడంతో పాటు 700 పాయింట్లు దాటిన భారత తొలి మహిళా పారా ఆర్చర్‌గా ఘనత సాధించింది. ఈ క్రమంలో ఆమె కొత్త ప్రపంచ రికార్డు కూడా సృష్టించింది. ఈ నెలలోనే ఫోబ్ పేటర్సన్ (బ్రిటన్) 698 పాయింట్లతో నెలకొల్పిన ప్రపంచ రికార్డును శీతల్ బద్దలు కొట్టింది. అయితే కొద్ది సేపటికే 704 పాయింట్లతో ఈ రికార్డును సవరిస్తూ ఒజ్నర్ క్యూర్ (టర్కీ) మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడాది జరిగిన ఆసియా క్రీడల్లో శీతల్ 2 స్వర్ణాలు, ఒక రజతం గెలుచుకుంది. ఆ తర్వాత పారా వరల్డ్ చాంపియన్íÙప్లో కూడా పతకం సాధించింది. కశీ్మర్‌కు చెందిన శీతల్ పుట్టుకతోనే ‘ఫొకెమెలియా సిండ్రోమ్’ వ్యాధి బారిన పడటంతో ఆమె రెండు చేతులూ పని చేయకుండా ఉండిపోయాయి. సుకాంత్, సుహాస్, తరుణ్ ముందంజ... బ్యాడ్మింటన్ పోటీల్లో తొలి రోజు భారత్ మెరుగైన ఫలితాలు సాధించింది. భారత్‌కు చెందిన సుకాంత్ కదమ్, సుహాస్ యతిరాజ్, తరుణ్ గ్రూప్ దశలో తమ మొదటి రౌండ్లలో విజయాలు అందుకున్నారు. సుకాంత్ 17–21, 21–15, 22–20తో మొహమ్మద్ అమీన్ (మలేసియా)పై, సుహాస్ 21–7, 21–5తో హిక్మత్ రమ్‌దాని (ఇండోనేసియా)పై, తరుణ్ 21–17, 21–19తో ఒలీవిరా రోజరియో (బ్రెజిల్)పై గెలుపొందారు. అయితే మరో ఇద్దరు షట్లర్లు మన్దీప్ కౌర్, మానసి జోషిలకు తొలి మ్యాచ్‌లో ఓటమి ఎదురైంది. మానసి 21–16, 13–21, 18–21తో ఇక్తియార్ (ఇండోనేసియా) చేతిలో, మన్దీప్ 8–21, 14–21తో మరియమ్ బొలాజి (నైజీరియా) చేతిలో పరాజయంపాలయ్యారు. మిక్స్డ్ డబుల్స్‌లో నితీశ్ కుమార్–తులసిమతి 21–14, 21–17తో భారత్‌కే చెందిన సుహాస్ యతిరాజ్–పలక్ కోహ్లిలను ఓడించి ముందంజ వేయగా... శివరాజన్–నిత్యశ్రీ ద్వయం 21–23, 11–21తో మైల్స్ క్రాజెస్కీ–జేసీ సైమన్ (అమెరికా) చేతిలో ఓడారు. తైక్వాండో భారత ప్లేయర్ అరుణ తన్వర్ కథ ముగిసింది. ప్రిక్వార్టర్స్‌లో టరీ్కకి చెందిన నూర్సిహన్ ఎకిన్సీ 19–0తో అరుణను చిత్తుగా ఓడించింది. సైక్లింగ్ 3000 మీటర్ల వ్యక్తిగత పర్సూ్యట్ ఈవెంట్లో భారత్‌కు చెందిన జ్యోతి గడేరియా 10వ స్థానంలో నిలిచి ని్రష్కమించింది. జ్యోతి ఈ రేస్‌ను 4 నిమిషాల 53.929 సెకన్లలో ముగించింది. -
శీతల్ దేవి అద్భుతం: సాధారణ ఆర్చర్లతో పోటీ పడి మరీ!
న్యూఢిల్లీ: ఆర్చరీ పారా క్రీడల్లో వరుస విజయాలతో సత్తా చాటి ‘అర్జున’ అవార్డు అందుకున్న దివ్యాంగురాలు శీతల్ దేవి అరుదైన ఘనతను సాధించింది. రెండు చేతులు కూడా లేని శీతల్ ‘ఖేలో ఇండియా’ క్రీడల్లో సాధారణ ఆర్చర్లతో పోటీ పడి రజత పతకం సాధించడం విశేషం. జూనియర్ వరల్డ్ చాంపియన్ ఏక్తా రాణి ఈ పోటీల్లో స్వర్ణం గెలుచుకోగా... ఫైనల్లో ఏక్తా చేతిలో 140–138 తేడాతో శీతల్ ఓడింది. ‘ఫోకోమెలియా’ అనే అరుదైన వ్యాధి బారిన పడి రెండు చేతులు కోల్పోయిన శీతల్... గత ఏడాది పారా ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలుచుకుంది. పారా ఈవెంట్లలో కాకుండా సాధారణ పోటీల్లో పాల్గొంటే తగిన సాధన లభించడంతో పాటు ఆమెలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందనే ఈ ప్రయత్నం చేశామని శీతల్ కోచ్ అభిలాష వెల్లడించారు. -
మేము పెళ్లి చేసుకోలేదు, సహజీవనం చేశాం.. ఇప్పుడు మాత్రం..
చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు బబ్లూ పృథ్వీరాజ్. ఓ పక్క సినిమాలు చేస్తూనే అడపాదడపా సీరియల్స్‌లోనూ యాక్ట్ చేశాడు. మధ్యలో కాస్త వెనుకబడ్డ నటుడు ఈ మధ్యే మళ్లీ దూకుడు పెంచాడు. వ్యక్తిగత విషయాలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే పృథ్వీరాజ్ గతంలో బీనాను పెళ్లాడాడు. వీరికి అహద్ మోహన్ జబ్బర్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. ఇతడు ఆటిజంతో బాధఫడుతున్నాడు. బ్రేకప్ రూమర్స్.. కొన్నేళ్లపాటు బాగానే ఉన్న పృథ్వీరాజ్-బీనా మధ్య గొడవలు ఎక్కువవడంతో విడాకులు తీసుకున్నారు. తర్వాత శీతల్ అనే తెలుగమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ సహజీవనం చేశారు. 56 ఏళ్ల వయసులో నటుడు సీక్రెట్‌గా ఆమెను పెళ్లి చేసుకున్నాడని ప్రచారం జరిగింది. ఇంతలోనే వీరి బంధం బీటలు వారిందని కొంతకాలంగా ఊహాగానాలు ఊపందుకున్నాయి. బబ్లూ తనకు ప్రపోజ్ చేసిన వీడియో శీతల్ డిలీట్ చేయడంతో ఈ రూమర్స్ మరింత బలపడ్డాయి. తాజాగా తన బ్రేకప్ నిజమేనని అంగీకరించింది శీతల్. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టి క్లారిటీ ఇచ్చింది. మేము పెళ్లి చేసుకోలేదు.. 'చాలామంది నా జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఎన్నో ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. నా పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఏదేదో ఊహించుకుంటున్నారు. పృథ్వీ, నేను పెళ్లి చేసుకోలేదు. సహజీవనం చేశామంతే! మేము ఊహించినట్లుగా మా రిలేషన్షిప్ ముందుకు వెళ్లలేదు. అయితే ఈ ప్రయాణంలో మేము సంతోషాన్ని పంచుకున్న క్షణాలెన్నో ఉన్నాయి. కొద్ది నెలల క్రితమే మేము విడిపోయాము. జరిగిందేదో జరిగిపోయింది. దయచేసి మా నిర్ణయాన్ని గౌరవిస్తూ, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించరని ఆశిస్తున్నాను' అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Rukmini Sheetal (@sheetal_sheetu1) చదవండి: కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్‌కి పెళ్లయిపోయింది -
పారా ఆర్చర్ శీతల్‌కు స్వర్ణం, రజతం
ఆసియా పారా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు నాలుగు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి మొత్తం తొమ్మిది పతకాలు లభించాయి. ఆసియా పారా గేమ్స్‌లో రెండు స్వర్ణాలు నెగ్గి అందరి ప్రశంసలు అందుకున్న శీతల్ దేవి ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ రాణించింది. రెండు చేతులు లేకున్నా తన కాళ్లతో విల్లు ఎక్కుపెట్టి బాణాలు సంధించే శీతల్ ఈ టోర్నీలో మిక్స్డ్ టీమ్ విభాగంలో రాకేశ్‌తో కలిసి స్వర్ణం... వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించింది. వ్యక్తిగత విభాగం ఫైనల్లో శీతల్ దేవి ‘షూట్ ఆఫ్’లో సింగపూర్ ప్లేయర్ నూర్ సియాదా చేతిలో ఓడిపోయింది. -
Sheetal Mahajan: ఎవరెస్ట్ జంప్
41 ఏళ్ల భారతీయ మహిళా స్కై డైవర్ శీతల్ మహాజన్ ఎవరెస్ట్ ఎదుట పక్షిలా ఎగిరారు. హెలికాప్టర్లో ఎవరెస్ట్ ఒడిలో 21,500 అడుగుల ఎత్తు నుంచి దూకి ఊపిరి బిగపట్టి చూసే జంప్‌ను పూర్తి చేసి ప్రపంచ రికార్డు సాధించారు. నవంబర్ 13న ఆమె ఈ ఘనత సాధించారు. ఆ సాహసం వెనుక కథనం. ‘స్కై డైవింగ్ చేసి కాళ్లూ చేతులూ విరిగితే నిన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడు’ అని ఇంటివాళ్ల చేత చివాట్లు తిన్న అమ్మాయి రికార్డుల మీద రికార్డులు సాధిస్తూ ఇంటివారినే కాదు ప్రపంచాన్ని కూడా నివ్వెర పరుస్తూనే ఉంది. 41 ఏళ్ల శీతల్ మహాజన్ ఎవరెస్ట్ చెంత సముద్ర మట్టానికి 21,500 అడుగుల ఎత్తున హెలికాప్టర్లో నుంచి జంప్ చేసి 17,444 అడుగుల ఎత్తు మీదున్న కాలాపత్థర్ అనే చోట సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. ఊపిరి బిగ పట్టి చూడాల్సిన సాహసం ఇది. గడ్డ కట్టే చలిలో, ఆక్సిజన్ అందని ఎత్తు నుంచి, ఎవరెస్ట్ సానువుల వంటి ప్రమాదకరమైన చోట ఒక మహిళ ఇలా జంప్ చేయడం ప్రపంచ రికార్డు. ఇప్పటివరకూ ప్రపంచంలో ఏ మహిళా ఇంత ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేయకపోవడం మరో రికార్డు. ఫ్రాన్స్‌కు చెందిన దిగ్గజ స్కై డైవర్ పౌల్ హెన్రీ ఇందుకు గైడ్‌గా వ్యవహరిస్తే నీతా అంబానీ, అనంత్ అంబానీ తదితరులు స్పాన్సరర్స్‌గా వ్యవహరించారు. స్త్రీలు ఎందుకు చేయలేరు? శీతల్ మహాజన్‌ది పూణె. తండ్రి కమలాకర్ మహాజన్ టాటా మోటార్స్‌లో ఇంజినీర్‌గా చేసేవాడు. ఇంటర్ చదువుతూ ఉండగా ‘నీ చదువుతో నువ్వు హ్యాపీగా ఉన్నావా?’ అని తండ్రి అడిగిన ప్రశ్న ఆమెలో సంచలనం రేపింది. ‘సైన్స్ చదవాలనుకుని చేరాను. కాని ఇలా చదవడం కాకుండా ఇంకేదో చేయాలి. ఎవరూ చేయనిది చేయాలి. అదే నాకు సంతోషాన్ని ఇస్తుందని గ్రహించాను’ అంటుంది శీతల్. ఆ తర్వాత ఆమె గూగుల్ చేయడం మొదలెట్టింది– భారతీయ స్త్రీలు ఎక్కువగా లేని రంగంలో ఏదైనా సాధించాలని. అలా తారసపడినదే స్కై డైవింగ్. ‘అప్పటికి మన దేశంలో స్కై డైవింగ్‌లో రేచల్ థామస్ వంటి ఒకరిద్దరు తప్ప ఎక్కువమంది స్త్రీలు లేరు. నేనెందుకు చేయకూడదు అనుకున్నాను. 22 ఏళ్ల వయసులో నార్త్‌పోల్‌లో మొదటి స్కై డైవింగ్ చేశాను. ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ స్త్రీని నేనే’ అంటుంది రేచల్. 15 లక్షల ఖర్చుతో 2004లో శీతల్ తండ్రి జీతం 18 వేలు. కాని ఆ సంవత్సరం శీతల్ నార్త్ పోల్‌లో స్కై డైవింగ్ చేయాలని నిశ్చయించుకున్నప్పుడు అందుకు అయ్యే ఖర్చు 15 లక్షలు. దాని కంటే ముందు ‘నువ్వు ఆడపిల్లవు. ఇలాంటి వాటికి పనికిరావు’ అన్నారు అంతా. ‘నన్ను ఆ మాటలే ఛాలెంజ్ చేశాయి’ అంటుంది శీతల్. అప్పటివరకూ శీతల్ విమానం కూడా ఎక్కలేదు. పారాచూట్ జంప్ అసలే తెలియదు. ఏ ట్రైనింగ్ లేదు. అయినా సరే స్పాన్సరర్లను వెతికి నార్త్‌పోల్‌కు వెళ్లింది. అయితే అక్కడి ఇన్స్ట్రక్టర్లు ఆమెను వెనక్కు వెళ్లమన్నారు. ‘ఇంతకుముందు ఒక మహిళ ఇలాగే నార్త్‌పోల్‌కు వచ్చి జంప్ చేయబోయి మరణించింది. అందుకని వారు అంగీకరించలేదు. నేను పట్టువదలక వారంపాటు అక్కడే ఉండి మళ్లీ సంప్రదించాను. ఈసారి అంగీకరించారు’ అంది శీతల్. 2004 ఏప్రిల్ 18న నార్త్‌పోల్‌లో మైనస్ 37 డిగ్రీల ఉష్ణోగ్రతలో తన మొదటి జంప్ చేసింది. అలా లోకానికి సాహసిగా పరిచయమైంది. ఎన్నో రికార్డులు ఆ తర్వాతి నుంచి శీతల్ స్కై డైవింగ్‌లో రికార్డులు సాధిస్తూనే ఉంది. ఆ వెంటనే ఆమె అంటార్కిటికాలో స్కై డైవింగ్ చేసింది. ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం ఎదుట స్కై డైవింగ్ చేయడంతో భూమ్మీద ఉన్న రెండు ధ్రువాలతో పాటు మూడో ధ్రువం వంటి ఎవరెస్ట్ దగ్గర కూడా జంప్ చేసిన ఏకైక మహిళగా రికార్డు స్థాపించింది. అంతేకాదు, సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన వైభవ్ రాణెను హాట్ ఎయిర్ బెలూన్‌లో 5,800 అడుగుల ఎత్తులో వివాహం చేసుకుని అందరినీ హాశ్చర్యపరిచింది. శీతల్‌కు కవల అబ్బాయిలు. ‘పెళ్లయ్యి పిల్లలు పుట్టాక మహిళ జీవితం కెరీర్ పరంగా అంతమైనట్టేనని అందరూ అనుకుంటారు. నేను కూడా ఆగిపోతానని కొందరు ఆశపడ్డారు. నేను ఆ తరహా కాదు. పిల్లల్ని తల్లిదండ్రులు కలిసి పెంచాలి. తల్లి మాత్రమే కాదు. నేను నా పిల్లల్ని పెంచుతాను... అలాగే నా కెరీర్‌ని కూడా కొనసాగిస్తాను. నిజానికి పెళ్లయ్యాకే అమెరికా వెళ్లి స్కై డైవింగ్‌లో ఉత్తమ శ్రేణి ట్రైనింగ్ తీసుకున్నాను’ అంటుందామె. ఇప్పుడు పూణెలో స్కై డైవింగ్ అకాడెమీ తెరిచి స్కై డైవింగ్‌లో శిక్షణ ఇస్తోంది.బయటకు రండి స్త్రీలు నాలుగ్గోడల నుంచి బయటకు వచ్చి లోకాన్ని చూడాలి... తమలోని సామర్థ్యాలను తెలుసుకుని వాటిని సానబట్టుకోవాలి... విజయం సాధించాలి... భారతీయ స్త్రీలు సాధించలేనిది లేదు... వారికి కావాల్సింది అవకాశమే అంటున్న శీతల్ కచ్చితంగా ఒక గొప్ప స్ఫూర్తి. -
చేతులు లేని తొలి మహిళా పారా ఆర్చర్! రెండు పతకాలతో ప్రపంచాన్నే..
జీవితంలో ఎదురయ్యే చిన్నాచితకా కష్టాల గురించి ఇక మీదట నేను యాగీ చేయను. తల్లీ నువ్వొక గురువువి’ అని ట్వీట్ చేశాడు ఆనంద్ మహీంద్ర, పారా ఆర్చర్ శీతల్ దేవి గురించి. అంతే కాదు తమ సంస్థ నుంచి కోరిన కారు తీసుకోమన్నాడు.రెండు చేతులూ లేకపోయినా విలువిద్య అభ్యసించి ఆసియా పారాగేమ్స్‌లో స్వర్ణాలు సాధించిన కశ్మీర్ అమ్మాయి శీతల్‌దేవి జీవితాన్ని ఎలా ఎదుర్కొనాలో తన పట్టుదలతో చూపించింది. ఆమె జీవితం ఒక ఆదర్శమైతే ఆమె నేర్పిన పాఠం సాకులు చెప్పేవారికి గుణపాఠం. 2021లో బెంగళూరుకు చెందిన ‘బీయింగ్ యు’ అనే సంస్థ శీతల్‌కు ప్రోస్థెటిక్ చేతులు పెట్టించడానికి ఏర్పాట్లు చేసింది. ‘ప్రొస్థెటిక్ చేతులు పెడితే నువ్వు చేసే మొదటి పని ఏమిటి?’ అని అడిగితే ‘గాజులు వేసుకుంటా’ అని టక్కున సమాధానం చెప్పింది శీతల్. నిజానికి ఆ అలంకరణకు తప్పితే మిగిలిన అన్ని పనులకు, తన జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి శీతల్‌కు తన ఆత్మవిశ్వాసం చాలు. అందుకే ఆమె ప్రోస్థెటిక్ చేతులను పెద్దగా ఉపయోగించదు. దాదాపు పెట్టుకోదనే చెప్పాలి. ‘నేనెలా ఉన్నానో అలాగే ఉంటాను’ అంటుంది శీతల్. ఈ ధైర్యం ఎంతమందికి ఉంది? రికార్డులు తిరగరాసింది ఇటీవల చైనాలో ముగిసిన ‘ఆసియన్ పారా గేమ్స్’ (దివ్యాంగుల క్రీడలు)లో విలువిద్యలో రెండు స్వర్ణాలు, ఒక రజతం సాధించి రికార్డు సృష్టించింది శీతల్ దేవి. 16 ఏళ్ల వయసులో ఇలా మన దేశం నుంచి విలువిద్య లో రెండు స్వర్ణాలు సాధించిన క్రీడాకారులు లేరు. అది ఒక పెద్ద విశేషం అయితే అంతకన్నా పెద్ద విశేషం శీతల్‌కు రెండుచేతులూ లేకపోవడం. అయినా సరే కుడికాలితో విల్లు ఎత్తి, కుడి భుజంతో నారి సారించి, 50 మీటర్ల దూరంలో ఉండే లక్ష్యాన్ని గురి చూసి బాణం వదిలిందంటే కచ్చితంగా లక్ష్యాన్ని ఛేదించాల్సిందే. అర్జునుడు రెండు చేతులతో బాణాలు సంధిస్తాడు కాబట్టి సవ్యసాచి అన్నారు. శీతల్‌కు చేతులు లేకపోయినా రెండు కాళ్లతో బాణాలు సంధిస్తే ఏమని పిలవాలో. ‘నవ్యసాచి’ అనాలేమో! " You will need Arms to compete at Archery " Sheetal Devi : OKAY , WATCH ME !!! First Female Armless Archer to play World Final 🤯#AsianParaGames #Praise4Para pic.twitter.com/8qS2THRxM0 — The Khel India (@TheKhelIndia) October 27, 2023 జీవితం గొప్పది ‘జీవితంలో నువ్వు ఫలానాది ఎందుకు సాధించలేదు, జీవితం అంటే ఎందుకు ఆసక్తి కోల్పోయావు, జీవితాన్ని ఎందుకు వృథా చేస్తున్నావు’ అని ఎవరినైనా అడిగితే సవాలక్ష వంకలు చెబుతారు, అడ్డంకులొచ్చాయంటారు, కష్టాలు వచ్చాయంటారు, రోజువారి జీవితంలో వచ్చే చిన్నాచితకా సమస్యలకు చికాకు పడిపోతుంటారు, జీవితం నుంచి దూరంగా వ్యసనాల్లోకి పారిపోవాలనుకుంటారు... కాని శీతల్‌ను చూస్తే ఆ అమ్మాయికి మించిన కష్టమా? అయినా కూడా ఆ అమ్మాయి సాధించలేదా? మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రా అదే అన్నాడు శీతల్‌ను చూసి– ‘తల్లి.. నిన్ను చూశాక జీవితం విలువ తెలిసింది’ అని! ఆమెకు కారు ఆఫర్ చేశాడు. కశ్మీర్ అమ్మాయి శీతల్ దిగువ మధ్యతరగతి కశ్మీర్ అమ్మాయి. వీళ్లది కిష్టవర్ జిల్లా లియోధర్ గ్రామం. తండ్రి మాన్ సింగ్ రైతు, తల్లి శక్తిదేవి కాసిన్ని గొర్రెలను సాకుతుంటుంది. వీరి పెద్దకూతురు శీతల్. చిన్న కూతురు శివాని. శీతల్‌కు పుట్టుకతో చేతులు ఏర్పడలేదు. ఇలాంటి స్థితిని వైద్యపరిభాషలో ‘ఫొకొమెలియా’ అంటారు. అయితే శీతల్ నిరాశలో కుంగిపోలేదు. తల్లిదండ్రులు ఆమెను బేలగా పెంచలేదు. శీతల్ తనకు లేని చేతుల లోటును కాళ్లతో పూడ్చడానికి ప్రయత్నించేది. ఆమెకు చేతులు లేకపోవడం వల్ల మిగిలిన శరీరం అంతా మరింత సూక్ష్మంగా, దృఢంగా తయారయ్యింది. రెండు చేతులూ లేకపోయినా శీతల్ చెట్లు ఎక్కి ఆడుకునేదంటే ఆశ్చర్యం. స్కూల్లో కూడా కాళ్లతోనే నోట్స్ రాసుకోవడం, ఫోన్‌ను ఉపయోగించడం నేర్చుకుంది. 2 year's before whn I visited to #SheetalDevi village in Loi Dhaar (Kishtwar), she totally surprised me by her actions. She was adopted by Indian Army 11 RR Col. Shishpal & thy mde efforts & tried to tie up with no. of NGO's. It ws difficult task bt nvr fr Army @NorthernComd_IA pic.twitter.com/b69zvkDaEl — Deepak Prem Thakur 🇮🇳 (@DeepakThakur_10) October 30, 2023 జీవితం అలాగే సాగిపోయేదేమో కాని కరోనా లాక్డౌన్ వల్ల ఇంటర్నెట్లో తనలాంటి దివ్యాంగులకు సాయం చేసే సంస్థ– బీయింగ్ యు గురించి తెలిసింది. ఆ సంస్థకు చెందిన ప్రీతి రాయ్.. శీతల్లోని క్రీడాకారిణిని గుర్తించింది. దివ్యాంగుల క్రీడల పోటీల్లో ఆమె ప్రతిభ చూపగలదని గ్రహించి, తన సంస్థ స్పాన్సర్షిప్ కింద కశ్మీర్‌లోని కత్రాలో దివ్యాంగుల క్రీడా శిక్షణా కేంద్రానికి పంపింది. ఆగస్టు 2022 నుంచి మాత్రమే శీతల్ విలువిద్య సాధన మొదలెట్టింది. 2023 అక్టోబర్ నాటికి అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ఇంతకన్నా విజయం ఉందా? ‘నాకు ఎలాగైనా సాధించాలని ఉండేది. అందుకు ఏమిటి మార్గం అని మా కోచ్‌ను అడిగాను. కష్టపడాలి అన్నాడు. కష్టపడ్డాను. చాలా చాలా కష్టపడ్డాను’ అంటుంది శీతల్. అడ్డదారుల్లో వెళితే విజయం ఉండొచ్చు లేకపోవచ్చు. కాని కష్టపడితే? గెలుపు తథ్యం. శీతల్‌ను చూసి మన జీవితాల్లో లక్ష్యాన్ని గురి చూద్దాం. (చదవండి: ఎమర్జెన్సీపై ఇందిరా గాంధీ వ్యాఖ్యలు.. విలేకరుల ముఖంపై చిరునవ్వులు) -
శెభాష్.. రెండు చేతుల్లేకపోయినా.. రెండు స్వర్ణాలు.. శీతల్ సరికొత్త చరిత్ర
హాంగ్జౌ: తన వైకల్యమే కుంగిపోయేలా... ఆత్మవిశ్వాసానికి నిలువుటద్దంలా భారత క్రీడాకారిణి శీతల్ దేవి ఆసియా పారా క్రీడల్లో పతకాల ‘హ్యాట్రిక్’ సాధించింది. కశ్మీర్‌కు చెందిన 16 ఏళ్ల ఈ టీనేజ్ ఆర్చర్‌కు రెండు చేతులు భుజాల నుంచే లేవు. మరి రెండు చేతులు తప్పక కావాల్సిన విలువిద్యలో ఆమె పతకాలపై గురిపెట్టడం ఏంటని ఆశ్చర్యం కలుగకమానదు. శీతల్ కాళ్లతో విల్లును నిటారుగా నిలబెట్టి, నోటితో బాణాన్ని లాగిపట్టి... లక్ష్యంపై గురిపెట్టే ఆమె ప్రావీణ్యానికి జేజేలు పలకాల్సిందే! ఆమె ప్రదర్శన ముందు వైకల్యం పూర్తిగా ఓడిపోయింది. ఈ ఆసియా పారా క్రీడల్లో రెండు స్వర్ణాలు, ఒక రజతంతో ఆమె ‘హ్యాట్రిక్’ సాధించింది. ఇంతకుముందు మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో రజతం నెగ్గిన ఆమె రాకేశ్ కుమార్‌తో కలిసి గురువారం మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో స్వర్ణం సాధించింది. శుక్రవారం జరిగిన వ్యక్తిగత విభాగం ఫైనల్లో శీతల్ దేవి 144–142తో అలీమ్ నూర్ సియాదా (సింగపూర్)పై గెలిచింది. తద్వారా ఒకే ఆసియా పారా ఈవెంట్లో రెండు బంగారు పతకాలు గెలిచిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా రికార్డుల్లోకెక్కింది. ఇదే ఈవెంట్లో అంకుర్ రెండు స్వర్ణాలతో పురుష అథ్లెట్‌గా నిలిచాడు. శుక్రవారం పారాలింపిక్ చాంపియన్ అయిన షట్లర్ ప్రమోద్ భగత్, మహిళల్లో తులస్మతి మురుగేశన్, పురుషుల డబుల్స్‌లో నితేశ్–తరుణ్ జోడీ బంగారు పతకాలు సాధించారు. ఒక్క బ్యాడ్మింటన్‌లోనే భారత్ ఖాతాలో తొమ్మిది పతకాలు చేరడం విశేషం. కాగా శనివారం ముగిసిన ఈ క్రీడల్లో భారత్ 111 పతకాలు కైవసం చేసుకుని తొలిసారి వంద పతకాల మైలురాయిని అందుకుంది. ఇందులో 29 పసిడి, 31 రజతాలు, 51 కాంస్యాలున్నాయి. ఇక ఇటీవలే ఆసియా క్రీడల్లో భారత్ 107 పతకాలతో నాలుగో స్థానం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా పారా క్రీడల్లో ఐదో స్థానం సంపాదించింది. Here is the inspirational story of Sheetal Devi. She is crowned as Asian Para games champion. This old video was by @thebeingyou. Watch to believe. pic.twitter.com/Fskqj09tdn — Parveen Kaswan, IFS (@ParveenKaswan) October 27, 2023 -
నిర్మాతతో సహజీవనం.. నటి సంచలన ఆరోపణలు!
సినీ ఇండస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎప్పుడు ఏదో ఒక సందర్భంలో వినిపిస్తూనే ఉంటుంది. అవకాశాల కోసం కొందరు అడ్డదారులు తొక్కితే.. మరికొందరు తన టాలెంట్‌పైనే నమ్మకంతో ఉంటారు. అలా సినీ ఇండస్ట్రీలోనూ లైంగిక వేధింపుల బారిన పడిన వారు కూడా ఉన్నారు. తాజాగా ఒడిషా నటి శీతల్ పాత్ర ఓ నిర్మాత తనను మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది. అంతే కాకుండా తన ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ చేశాడని ఆరోపించింది. నటి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. (ఇది చదవండి: శరీరమంతా స్క్రూలు, రాడ్లు.. బతకడం కష్టమేనన్నారు: నటి) ఒడియా నటి శీతల్ పాత్రా చిత్రనిర్మాత దయానిధి దహిమాపై సంచలన ఆరోపణలు చేశారు. జూలై 28న భువనేశ్వర్‌లోని లక్ష్మీసాగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దయానిధి ఎంటర్టైన్మెంట్ యజమానిగా ఉన్న దయానిధి తనపై లైంగిక, మానసిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది. తనను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని.. తనకు ఇచ్చిన అన్ని రెమ్యునరేషన్లను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారని నటి ఆరోపించింది. అంతేకాకుండా తన ఫోటోలు, వీడియోలను నెట్టింట్లో పెడతానని బెదిరించాడని తెలిపింది. భౌతిక దాడి దయానిధి తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని శీతల్ పాత్ర పోలీసులకు వివరించింది. తాను చదివే కళాశాలలో విద్యార్థుల ముందే తనపై తన యూనిఫామ్‌ను చించేశాడని.. తనకు తీవ్రమైన అవమానానికి గురి చేశాడని పేర్కొంది. తన ప్రతిష్టను దిగజార్చడానికి సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నాడని.. అంతే కాకుండా తన కుటుంబ సభ్యులను కూడా లక్ష్యంగా చేసుకుని కించపరిచేందుకు చిత్రనిర్మాత తప్పుడు సమాచారాన్ని ఉపయోగించారని నటి పేర్కొంది. అయితే తాను గత కొన్నేళ్లుగా నిర్మాతతో లివ్ ఇన్ రిలేషన్ ఉన్నట్లు తెలిపింది. అందుకే తనను మోసం చేశాడని నటి ఫిర్యాదులో పేర్కొంది. శీతల్ పాత్ర మాట్లాడుతూ..'మొదట అతను నాతో సన్నిహితంగా ఉన్నప్పుడు మా ఫోటోలు, వీడియోలను రికార్డ్ చేసేవాడు. అప్పుడు వాటిని నేనేమీ పట్టించుకోలేదు. అతను ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తున్నాడని నేను అనుకోలేదు. నేను అతనిని పూర్తిగా నమ్మాను. ఆయనతో సినిమా కూడా చేశాను. అంతేకాకుండా సినిమాకి రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదు. అప్పటి నుంచి మా మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఆ తర్వాత నన్ను చాలా అసభ్యకరంగా దూషించేవాడు. ఇప్పుడు ఏకంగా నా ప్రైవేట్ వీడియో, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.' అంటూ వాపోయింది. ఈ ఫిర్యాదు ఆధారంగా నిర్మాత దయానిధి దాహిమాపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిర్మాతతో లివ్ ఇన్ రిలేషన్ కాగా.. నటనతో పాటు ఈ జంట కొన్నేళ్లుగా ఒకే ఇంట్లో ఉంటున్నారు. చాలా సినిమాల్లో కలిసి పనిచేశారు. ఆ తర్వాత కూడా నటి మరో సినిమా నిర్మాతతో సినిమా చేయబోతుండడంతో దయానిధి కళ్లు ఎర్రబడ్డాయి. వేరే నిర్మాతలతో సినిమా తీయడం తనకు ఇష్టం లేదని.. నా ప్రొడక్షన్లో మాత్రమే నటించాలని ఆమెను బెదిరించాడు. దీనికి అంగీకరించక పోవడంతో నటిని వేధించడం ప్రారంభించాడు. గత రెండేళ్లుగా ఇదే తంతు జరుగుతోంది. తాజాగా ప్రైవేట్ వీడియోలు లీక్ కావడం ఒడిశా సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. (ఇది చదవండి: మీరు నా జీవితంలోకి రావడం నా ప్రయాణానికి నాంది: మంచు మనోజ్ ) . -
డాక్టర్ స్మైల్
డాక్టర్లు మందులు రాస్తారు.శీతల్ అగర్వాల్ వాటితోపాటు తన నవ్వులను టానిక్‌లా జత చేస్తుంది.శీతల్ బహుశా దేశంలో మొదటి మహిళా ‘మెడికల్ క్లౌన్’.అంటే ఇన్ పేషెంట్స్‌గా ఉన్న చిన్నారులను, వృద్ధులను హుషారుగా పలకరించిఉత్సాహపరిచే విదూషకురాలు. నిరాశ నిస్పృహలను కలిగించే అనారోగ్యం నుంచి బయట పడాలంటే తనలాంటి వారు అవసరమని‘కౌన్సిలర్ల’కు బదులుగా ‘క్లౌన్సిలర్లను’ తయారు చేసే సంస్థను స్థాపించిందామె.శీతల్ ఆలోచనను పెద్ద పెద్ద ఆస్పత్రులు ఆహ్వానిస్తున్నాయి. వినూత్న సేవ డాక్టర్లే ఆహ్వానిస్తూ ‘మొదట మేము ప్రతి శనివారం ఏదో ఒక హాస్పిటల్‌కు వెళ్లాలని అనుకున్నాం. కాని మాకు వచ్చిన స్పందన చూసి డాక్టర్లు, నర్సులు మమ్మల్ని ఆహ్వానించసాగారు. మందులకు స్పందించనివారు కూడా నవ్వులకు స్పందిస్తున్నారని వారి అభిప్రాయం. ముఖ్యంగా చిన్న పిల్లల ఆస్పత్రుల్లో మెడికల్ క్లౌన్ల అవసరం చాలా ఉందని మాకు అర్థమైంది. హాస్పిటల్‌లోని భయాన్ని పోగొట్టాలంటే వారికి మాలాంటి వారు కనపడుతుండాలి. అందుకే ఇన్ పేషెంట్స్‌గా ఉన్న పిల్లలు మా రాక కోసం ఎదురు చూస్తుంటారు. అంతే కాదు వారి ముఖంలో నవ్వును చూసి తల్లిదండ్రులు కార్చే ఆనందబాష్పాలకు విలువ కట్టలేం. – శీతల్ పిల్లలో, పెద్దలో ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చిందనుకోండి... అప్పుడు వారిలో ఒక రకమైన నిర్లిప్తత వచ్చేస్తుంది. వారిని అటెండ్ చేస్తున్న అయినవారిలో అలసట వచ్చేస్తుంది. నవ్వులు మర్చిపోతారు. ఉత్సాహం మర్చిపోతారు. అప్పుడు ఎవరైనా వచ్చి, వింత వింత చేష్టలు చేసి, పిచ్చి మాటలు చెప్పి హాయిగా నవ్విస్తే ఎలా ఉంటుంది? తిరిగి బలం రాదూ? శీతల్ అగర్వాల్ చేస్తున్నది అదే. నవ్వుతో రోగుల్లో జీవాన్ని తేవడం. హాస్పిటల్లో జోకర్ ఇంగ్లిష్‌లో క్లౌన్ అంటే విదూషకుడు. కాని జన సామాన్యం జోకర్ అనీ బఫూన్ అనీ అంటుంటారు. అలాంటి బఫూన్ వేషంలో హాస్పిటల్లో ప్రవేశించి ఒక ఉత్సాహకరమైన వాతావరణం తేవడాన్నే ‘మెడికల్ క్లౌనింగ్’ అంటారు. ఢిల్లీకి చెందిన 36 ఏళ్ల శీతల్ అగర్వాల్‌కు ఈ మెడికల్ క్లౌనింగ్ గురించి 2016 వరకూ తెలియదు. సోషల్ ఆంత్రోపాలజీ చదివి, లాఫ్టర్ యోగా థెరపీ నేర్చుకుని, ఒక ఎన్.జి.ఓలో ఉద్యోగం చేస్తున్న శీతల్ 2016 సంవత్సరంలో అహ్మదాబాద్‌కు వెళ్లినప్పుడు అక్కడి ఒక హాస్పిటల్లో మెడికల్ క్లౌన్ను చూసింది. అతను బఫూన్ వేషం వేసుకుని పేషెంట్స్‌ను హుషారు పరచడం శీతల్‌కు చాలా నచ్చింది. ఢిల్లీకి తిరిగి వచ్చి నెట్లో మెడికల్ క్లౌనింగ్ గురించి తెలుసుకుంది. దేశంలో కొంత మంది ఇలాంటి సేవ చేస్తున్నారని, హాస్పిటల్స్‌లో ఇలాంటి వారి అవసరం ఉందని తెలుసుకుంది. ఒక్కతే మొదలయ్యి ‘ఢిల్లీలో అప్పటి వరకూ మెడికల్ క్లౌన్‌గా ఎవరూ పని చేయడం లేదు. ఫేస్బుక్లో నేను పోస్ట్ చేసి ఆసక్తి ఉందా ఎవరికైనా అని అడిగితే కొంతమంది స్పందించారు. నేను కేంద్ర మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకుని మొదట ఐదుమందితో ఒక గ్రూప్ మొదలుపెట్టాను. మాకు ట్రైనింగ్ ఏమీ లేదు. తెలిసిందల్లా ఎదుటివారికి మనస్ఫూర్తిగా ఉల్లాసం అందించడమే. అదే సంవత్సరం నేను ఢిల్లీలోని ‘చాచా నెహ్రూ హాస్పిటల్’లో మొదటిసారిగా మెడికల్ క్లౌనింగ్ చేశాను. కాని ఎలా చేయబోతామా అనే భయం చాలా కలిగింది. మేం వెళ్లేసరికి పిల్లలు చాలామంది ఏడుస్తున్నారు. పేషెంట్లు వెయిటింగ్లో ఈసురోమంటున్నారు. కాని ఒక్కసారి మేము రంగంలో దిగి వింత చేష్టలతో తమాషా పలకరింపులతో తిరుగాడేసరికి పిల్లలు ఏడుపు ఆపేశారు. అందరిలో కుతూహలం, ఉత్సాహం వచ్చింది. ఐదు ఫ్లోర్లలో ఐదు గంటల పాటు తిరిగితే మా వల్ల అందరి ముఖాల్లో ఆనందం చూసి ఎంతో తృప్తి కలిగింది’ అంది శీతల్ అగర్వాల్. 500 వాలెంటీర్లు ఈ ఐదారేళ్లలో శీతల్ పిలుపు మేరకు 500 మంది వాలెంటీర్లు మెడికల్ క్లౌన్లుగా ఆమె స్థాపించిన సంస్థ ‘క్లౌన్సెలర్స్’లో నమోదు అయ్యారు. వీరంతా యూనివర్సిటీ విద్యార్థులు, కార్పొరెట్ సంస్థల ఉద్యోగులు. ‘మా జీవితంలో ఇలాంటి పని సంతృప్తిని ఇస్తుంది’ అని వారు ఈ వినూత్న సేవకు వస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, కశ్మీర్‌లలో శీతల్ బృందాల సేవలు కొనసాగుతున్నాయి. ఆస్పత్రుల్లోనే కాకుండా ఓల్డ్ ఏజ్ హోమ్‌లకు, మానసిక చికిత్సాలయాలకు కూడా వీరు వెళుతున్నారు. ఈ సేవలో మరింతమంది పాల్గొనాలని కోరుకుందాం. -
రెండోసారి తండ్రైన సీఎస్కే బ్యాటర్.. మా చిన్నారి దేవత అంటూ ఎమోషనల్!
టీమిండియా వెటరన్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప రెండోసారి తండ్రయ్యాడు. ఊతప్ప దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఈ విషయాన్ని ఊతప్ప సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. భార్యా, బిడ్డలతో ఉన్న ఫొటోను ఈ సందర్భంగా షేర్ చేశాడు. ‘‘మా జీవితాల్లో అడుగుపెట్టిన చిన్నారి దేవతను మీకు పరిచయం చేయడం సంతోషంగా ఉంది. ట్రినిటి థియా ఊతప్ప.. మమ్మల్ని నీ తల్లిదండ్రులుగా ఎంచుకున్నందుకు.. నిన్ను ఈ ప్రపంచంలోకి తీసుకువచ్చే అవకాశం ఇచ్చినందుకు నీకు రుణపడి ఉంటాం. నీకు తల్లిదండ్రులమైనందుకు మేము.. అన్నయ్య అయినందుకు నీ సోదరుడు.. దీనిని మాకు దక్కిన గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నాం’’ అని ఊతప్ప ఉద్వేగపూరిత నోట్ రాసుకొచ్చాడు. కాగా కేరళకు చెందిన రాబిన్ వేణు ఊతప్ప వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఎదిగాడు. 2006లో భారత్ తరఫున అంతర్జాతీయ వన్డేల్లో అడుగుపెట్టాడు. ఆ మరుసటి ఏడాది టీ20 ఫార్మాట్లోనూ అరంగేట్రం చేశాడు. ఊతప్ప చివరిసారిగా జింబాబ్వేతో వన్డే మ్యాచ్ ఆడాడు. ప్రస్తుతం ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇక ఊతప్ప వ్యక్తిగత విషయానికొస్తే.. 2016లో శీతల్‌ను పెళ్లాడాడు. వీరికి ఇప్పటికే కుమారుడు నీల్ నోలన్ ఊతప్ప ఉన్నాడు. తాజాగా కుమార్తె జన్మించింది. కాగా కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించే ఊతప్ప ఎప్పటికప్పుడు తమ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు. చదవండి: Ind Vs Eng 2nd ODI: తుది జట్ల అంచనా, పిచ్, వాతావరణం వివరాలు! రోహిత్ సేన గెలిచిందంటే! View this post on Instagram A post shared by ROBIN UTHAPPA (@robinaiyudauthappa) View this post on Instagram A post shared by ROBIN UTHAPPA (@robinaiyudauthappa) -
శీతలమైన క్లౌన్స్లింగ్
నవ్వు ఆరోగ్యానికి అన్ని విధాలా మంచి చేస్తుంది. ఒక్కసారి నవ్వగానే మనసులో ఉన్న బాధ అంతా పోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఈ విషయం అందరికీ తెలిసినప్పటికీ.. వివిధ భావోద్వేగాల మధ్య నలిగిపోతూ నవ్వునే మర్చిపోతాం. అలా నవ్వులని మర్చిపోయిన వారికి.. వారి బాధలని నవ్వుతో దూరం చేద్దాం అని భుజం తట్టి చెబుతోంది శీతల్ అగర్వాల్. ‘‘మనమంతా ఎప్పుడూ శారీరకంగా ఫిట్‌గా ఉండడంపైనే దృష్టిపెడతాం. కానీ మానసిక ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోము. అందుకే వివిధ రకాల సమస్యలు చుట్టుముట్టి మెదడును తొలిచేస్తుంటాయి. అందుకే నవ్వుతూ ఉండండి’’ అని చెప్పడమేగాక, ఢిల్లీలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేషంట్ల వద్దకు వెళ్లి వాళ్లను నవ్విస్తూ, మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యతను వివరిస్తోంది శీతల్. ఢిల్లీకి చెందిన శీతల్ అగర్వాల్...ఆంత్రోపాలజిస్ట్‌గా, ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది. 2016లో ఒకసారి శీతల్ అహ్మదాబాద్ వెళ్లినప్పుడు అక్కడ ధారను కలిసింది. ధార తనని తాను శీతల్‌కు పరిచయం చేసుకుంటూ.. ‘‘నేను ఒక మెడికల్ క్లౌను’’ను అని చెప్పింది. చిన్నప్పటి నుంచి రకరకాల సర్కస్ విదూషకులు (క్లౌన్స్) చేసే కామెడీని బాగా ఎంజాయ్ చేస్తూ పెరిగిన శీతల్‌కు మెడికల్ క్లౌన్ అనగానే విచిత్రంగా అనిపించింది. వెంటనే ‘‘అవునా! మెడికల్క్లౌన్ అంటే ఏంటీ?’’ అని అడిగింది..ఆసుపత్రులకు వెళ్లి రోగులను నవ్వించడమే’’ తన పని అని ధార చెప్పిన విషయం శీతలకు బాగా నచ్చింది. మెడికల్ క్లౌన్ గురించి మరింతగా అన్వేషించి అనేక విషయాలు తెలుసుకుంది. ఇందులో భాగంగానే ‘ప్యాచ్ అడమ్స్’ అనే అమెరికా కామెడీ సినిమా చూసింది. దీనిలో డాక్టర్ హాస్యం పండిస్తూ రోగులకు చికిత్స చేస్తుంటాడు. ఈ సినిమా ద్వారా మెడికల్ క్లౌన్ వల్ల ఎంతోమంది జీవితాల్లో ఆనందం నింపవచ్చని అర్థం చేసుకుని శీతల్ తను కూడా మెడికల్ క్లౌన్ కావాలనుకుంది. క్లౌన్స్‌లర్స్.. మెడికల్ క్లౌన్స్ కావాలనుకుని తన ఫేస్బుక్లో కొంతమంది మెడికల్ క్లౌన్స్ కావాలని పోస్టు చేసింది. శీతల్ పోస్టుకు 33 మంది స్పందించారు. దీంతో ఢిల్లీ ఆరోగ్య మంత్రిత్వ శాఖకు మెడికల్ క్లౌన్స్గా పనిచేసేందుకు అనుమతి కోసం దరఖాస్తు చేసింది. అనుమతి రాగానే కొన్ని హాస్పిటళ్లకు వెళ్లి అక్కడ రోగులకు తన వేషభాషల ద్వారా ఉల్లాసం కలిగించడం ప్రారంభించింది. జోకర్లా డ్రెస్, నెత్తిమీద టోపీ, ముక్కుకు, చెంపలకు రంగులు వేసుకుని చూడగానే నవ్వు వచ్చేలా మేకప్ వేసుకుని పిల్లల వార్డుకు వెళ్లి అక్కడ ఉన్న పిల్లలను నవ్వించడానికి ప్రయత్నించారు. వార్డులో ఉన్న పిల్లలంతా తమ బాధను మర్చిపోయి చక్కగా నవ్వారు. ఆ చిన్నారుల ముఖాల్లో విరిసిన నవ్వులు శీతల్‌కు చాలా తృప్తినిచ్చాయి. అంతేగాక వీళ్ల టీమ్ రోజూ ఆ వార్డుకు వెళ్లి రావడం వల్ల అక్కడున్న పిల్లలంతా చక్కగా తింటూ హాయిగా ఆడుకునేవారు. ఈ ప్రేరణతో ఢిల్లీలోని ఇతర ఆసుపత్రుల్లో కూడా అనుమతి తీసుకుని, ఆయా ఆసుపత్రులను సందర్శించి అక్కడి రోగులను నవి్వంచి, మానసికంగా దృఢంగా ఎలా ఉండాలో చెబుతూ వారిలో ధైర్యాన్ని నింపేవారు. వీరివల్ల రోగుల్లో వస్తున్న సానుకూల మార్పులను చూసి సంతృప్తి పడ్డ ఆయా హాస్పిటల్స్ యాజమాన్యాలు వీరి టీమ్‌ను మళ్లీ మళ్లీ రావలసిందిగా కోరేవి. ఆ నోటా ఈ నోటా శీతల్ క్లౌన్స్‌లర్స్ గురించి తెలిసిన వారంతా తమ ఆసుపత్రులకు పిలిస్తే, కొంతమంది ఈ టీమ్‌లో స్వచ్ఛందంగా మెడికల్ క్లౌన్స్లర్గా చేరి సేవలందిస్తున్నారు. ఉద్యోగం వదిలేసి.. శీతల్ క్లౌన్స్‌లర్స్ టీమ్‌కు మంచి గుర్తింపు రావడంతో..ఐదేళ్ల తరువాత తన ఉద్యోగాన్ని వదిలేసి పూర్తి సమయాన్ని మెడికల్ క్లౌన్స్కే కేటాయించింది. కోవిడ్ సమయంలోనూ..క్లౌన్స్ సేవలందించింది. మొదటి లాక్డౌన్ సమయంలో మైక్రో షెల్టర్స్‌ను సందర్శించడం, కొన్ని షెల్టర్లలో ఫేస్బుక్ ద్వారా లైవ్ ఈవెంట్స్‌ను అందిచారు. ఆన్లైన్ సెషన్స్‌కు స్పందన బావుండడంతో ఏడాదిన్నరపాటు అనేక ఆన్లైన్ సెషన్లను నిర్వహించారు. న్యూఢిల్లీతోపాటు మహారాష్ట్ర, హర్యాణ, మేఘాలయ, మణిపూర్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కూడా శీతల్ తన సేవలను విస్తరించింది. ప్రస్తుతం ఆసుపత్రులతోపాటు, అనాథ, వృద్ధాశ్రమాలు, మురికి వాడల్లో మెడికల్ క్లౌన్ సేవలు అందిస్తోంది. ఈ విషయం ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వైరల్ అవ్వడంతో నెటిజన్లంతా శీతల్‌ను అభినందనలతో ముంచెత్తుతున్నారు. -
నిరుపేదలకు ఉచిత ప్రయాణం
నేటి రోజులతో పోల్చుకుంటే ఒకనాడు పడిన కష్టమే నయం అనిపిస్తుంది. ఈ రోజు ఎలా గడుస్తుందా అని ఆపన్నుల కోసం దిక్కులు చూసే జీవులే ఎన్నో. ఇక అత్యవసర పరిస్థితి వస్తే.. ఆరోగ్యం సహకరించకపోతే.. ఆసుపత్రికి వెళ్లాలన్నా కష్టమే. కావల్సిన సరుకులు తీసుకొని ఇంటికి తిరిగి రావాలన్నా సరైన రవాణా సదుపాయం లేక యాతనపడే వారెందరో. ఇలాంటి సమయంలో పేదలకు ఉచితంగా ఆటో సదుపాయం అందిస్తోంది ముంబయ్‌లోని ఓ మహిళా డ్రైవర్. ఆమె పేరు శీతల్. తన కుటుంబ పోషణకు శీతల్ కొన్నేళ్లుగా ఆటో నడుపుతోంది. కరోనా వైరస్ కారణంగా దేశమంతా లాక్డౌన్ కొనసాగుతోంది. అత్యవసర పరిస్థితుల్లో ఇళ్ల నుంచి బయటకు వచ్చిన నిరుపేదలను తన ఆటోలో ఉచితంగా తీసుకెళుతోంది. తిరిగి వారిని వారున్న చోటుకు చేర్చుతోంది. ‘నా కుటుంబ పోషణకు ఆటోను నడిపేదాన్ని. ఇప్పుడు పేదప్రజల ఇబ్బందిని చూసి, వారికి ఇలా సేవ చేయాలనుకున్నాను. వారిని వారి గమ్యాలకు చేర్చడం, అవసరాలు తీరే మార్గం చూపడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది’ అంటుంది శీతల్. ఈ కష్ట సమయంలో శీతల్ లాంటి వ్యక్తులు తమ సేవాగుణంతో గొప్పవారిగా నిలుస్తున్నారు. -
మేము నిశ్చితార్థం చేసుకున్నాం: హీరో
బాలీవుడ్ నటుడు, 'ఏ డెత్ ఇన్ ది గంజ్' ఫేం విక్రాంత్ మాసే తన పెళ్లి విషయంలో వస్తన్న వదంతులపై క్లారిటీ ఇచ్చాడు. చిన్ననాటి స్నేహితురాలు షీతల్ ఠాకూర్‌తో నిశ్చితార్థం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. అయితే వీళ్లిద్దరూ ఇప్పటికే పీకల్లోతు ప్రేమలో ఉన్నారన్న విషయం తెలిసిందే. అంతేగాక తాజాగా వీరు గత నెలలో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారనే వార్తలు బీటౌన్‌లో బాగానే వినిపించాయి. వీటన్నింటికి ఫుల్స్టాప్ పెడుతూ ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విక్రాంత్ ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే వివాహం ఎప్పుడన్న విషయం మాత్రం చెప్పడానికి నిరాకరించాడు. ఆయన మాట్లాడుతూ.. ‘అవును మా ఇద్దరికీ నిశ్చితార్థం జరిగింది. నవంబర్‌లో జరిగిన ఈ వేడుకకు సన్నిహితులు మరియు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. దీని గురించి ఇప్పుడు ఏం చెప్పలేను. సరైన సమయంలో మాట్లాడాలి అనుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చారు. ఇక విక్రాంత్, షీతల్ బుల్లితెరపై ప్రసారమైన ‘బ్రోకెన్ బట్ బ్యూటీఫుల్’ వెబ్ సిరీస్ సీజన్-1లో కలిసి నటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇద్దరూ తమకు సంబంధించిన విషయాలను, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఒకరిమీద ఒకరికి ఉన్న ప్రేమను చాటుకున్నారు. కాగా తాజాగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొన్ నటించిన ‘చపాక్’ సినియాలో విక్రాంత్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. మేఘనా గుల్జార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం యాసిడ్ దాడికి గురైన లక్ష్మీ అగర్వాల్ నిజ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. లక్ష్మీ అగర్వాల్ పాత్రలో దీపిక కనిపించనుంది. ఈ చిత్రం 2020 జనవరి 10 ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram Happy happy birthday to the light of my life♥️ A post shared by Sheetal Thakur (@sheetalthakur) on Apr 2, 2019 at 2:17pm PDT -
అసభ్యంగా తాకాడు: నటి షాకింగ్ కామెంట్స్
ముంబై : హిందీ బుల్లితెర నటి షీతల్ ఖందల్ తన సహ నటుడు సిద్ధార్థ్ శుక్లాపై షాకింగ్ కామెంట్స్ చేశారు. షూటింగ్ సమయాల్లో సిద్ధార్థ్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించారు. వీరిద్దరు కలిసి హిందీలో బాగా పాపులర్ అయిన ‘బాలికా వధు’ సీరియలో నటించారు. హిందీలో దాదాపు 8 సంవత్సరాలపాటు కొనసాగిన ఈ సీరియల్ తెలుగులోనూ ‘చిన్నారి పెళ్లి కూతురు’గా ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఆ సీరియల్లో గాయత్రి పాత్ర పోషించిన షీతల్ తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో... సిద్ధార్థ్ శుక్లాపై తీవ్ర ఆరోపణలు చేశారు. సిద్ధార్థ్ తనను సెట్లో అనేకసార్లు అనుచితంగా తాకాడని, లైంగికంగా వేధించాడని ఆరోపించారు. కాగా ప్రస్తుతం సిద్ధార్థ్ శుక్లా హిందీ బిగ్‌బాస్-13లో కంటెస్టెంట్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బిగ్‌బాస్‌లో ఆర్తిసింగ్పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన సిద్ధార్థ్ డేకు వ్యతిరేకంగా సిద్ధార్థ్ శుక్లా మాట్లాడటం ఆశ్చర్యంగా తనకు ఉందన్నారు. వాస్తవంగా శుక్లా తనతో ప్రవర్తించిన తీరుతో పోలిస్తే ఆర్తితో సిద్ధార్థ్ డే మాట్లాడిన మాటలు చాలా తక్కువ అని పేర్కొన్నారు. షీతల్ మాట్లాడుతూ.. ‘‘సిద్ధార్థ్ షూటింగ్లో నాపై అసభ్యకరమైన జోకులు వేసేవాడు. నేను ఎవరితో పంచుకోలేని పదాలను సైతం నాపై ఉపయోగించాడు. తను నాతో అనుచితంగా ప్రవర్తించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒకరోజు షూటింగ్లో అతను నన్ను తాకిన విధానం నాకు అసహ్యం కలిగించింది. నాకు అది మొదటి సీరియల్ కాబట్టి ఏం చేయలేకపోయాను. అయితే తరువాత చాలాసార్లు సీరియల్ నిర్మాతకు సిద్ధార్థ్‌పై ఫిర్యాదు చేశాను. అప్పటి నుంచి సిద్ధార్థ్ సెట్లో నాకు వ్యతిరేకంగా మట్లాడటం, నాపై అవమానకర వ్యాఖ్యలు చేయడం ప్రారంభించాడు. తనకు తాను గొప్ప వ్యక్తిగా అనుకునేవాడు. అంతేగాక తనకు వ్యతిరేకంగా మాట్లడిన వారందరితో కఠినంగా వ్యవహరించేవాడు. కానీ అతనికి వ్యతిరేకంగా వెళ్లే ధైర్యం ఎవరికీ లేకపోయింది’’ అని చెప్పుకొచ్చారు. చదవండి: దర్శకుడిపై హీరోయిన్ ఫిర్యాదు -
పాండ్యా ప్రపంచ రికార్డుకు 29 ఏళ్లు
నూఢిల్లీ : క్యాన్సర్ మహ్మమారిపై అవగాహన కల్పించాడానికి దేశ రాజధాని ఢిల్లీ నుంచి అహ్మాదాబాద్ వరకు కేవలం ఐదేళ్ల పసిప్రాయంలోనే రోలర్ స్కెటింగ్ చేసింది. అత్యంత పిన్న వయసులోనే ప్రపంచ రికార్డు నెలకొల్పింది రోలర్ స్కెటర్ షీతల్ పాండ్యా. 1989 జూన్ 7న ఆమె గిన్నిస్ బుక్‌లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. ఐదేళ్లప్పుడు ఆ పిడుగు సాధించిన విజయానికి నేటితో 29 ఏళ్లు నిండాయి. తన తండ్రి జగదీష్ పాండ్యాతో కలిసి అతి చిన్న వయసులో అంత దూరం రోలర్ స్కెటింగ్ చేస్తూ ఆమె ఈ ఘనత సాధించింది. అంతే కాకుండా 2009లో కూడా ఆరు రాష్ట్రాల మీదుగా రోలర్ స్కెటింగ్ చేస్తూ ఆడ పిల్లల రక్షణపై అవగాణ కలిగించింది. ‘సెవ్ గర్ల్ చెల్డ్’ అనే పేరుతో ఆమె ఈ ప్రయాణం సాగించింది. -
త్వరలో ఓ ఇంటివాడు కానున్న రెజ్లర్
న్యూఢిల్లీ: భారతీయ రెజ్లర్ యోగేశ్వర్ దత్ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. కాంగ్రెస్ నాయకుడు జై భగవాన్ శర్మ కుమార్తె శీతల్ ను యోగేశ్వర్ వివాహాం చేసుకోనున్నాడు. ఆదివారం సాయత్రం ఓ ప్రైవేటు పార్టీలో ఇరువురికి పెద్ద సమక్షంలో నిశ్చితార్ధం జరిగింది. ఈ కార్యక్రమానికి కొద్దిమంది సన్నిహితులనే ఆహ్వానించారు. భారతీయ రెజ్లింగ్ ఫౌండేషన్(ఐడబ్ల్యూఎఫ్) చైర్మన్ బ్రిజ్ భూషణ్ శరణ్, కొందరు కాంగ్రెస్ పార్టీ లీడర్లు నిశ్చితార్ధానికి హాజరైనట్లు తెలిసింది. వచ్చే ఏడాది జనవరి 16న శీతల్, యోగేశ్వర్ ల వివాహం జరనుంది.