ప్యారిస్ పారాలింపిక్స్-2024లో భారత్ మరో పతకం సాధించింది. ప్రపంచ చాంపియన్ సచిన్ ఖిలారి పురుషుల షాట్‌పుట్ ఎఫ్46 ఈవెంట్లో రజతం గెలిచాడు. బుధవారం నాటి ఈ ఈవెంట్లో కెనడాకు చెందిన గ్రెగ్ స్టువర్ట్ 16.38 మీటర్ల దూరం షాట్ విసిరి స్వర్ణం గెలవగా.. సచిన్ 16.32 మీటర్ల దూరంవిసిరి రెండో స్థానంలో నిలిచాడు.
తద్వారా పారాలింపిక్స్ తాజా ఎడిషన్‌లో భారత్ ఖాతాలో 21వ మెడల్ చేరింది. ఇక ఇదే ఈవెంట్లో సచిన్‌తో పాటు పోటీ పడిన భారత అథ్లెట్లు మొహ్మద్ యాసిర్, రోహిత్ కుమార్ వరుసగా 8, 9వ స్థానాల్లో నిలిచారు. కాగా ప్యారిస్ పారాలింపిక్స్‌లో భారత్ ఇప్పటి వరకు మూడు స్వర్ణాలు, 8 రజతాలు, 10 కాంస్య పతకాలు గెలిచింది.
ప్యారిస్ పారాలింపిక్స్-2024లో ఇప్పటి వరకు పతకాలు గెలిచిన భారత అథ్లెట్లు
👉శరద్ కుమార్- మెన్స్ హై జంప్ టీ63- రజతం
👉అజీత్ సింగ్- మెన్స్ జావెలిన్ త్రో- రజతం
👉మరియప్పన్ తంగవేలు- మెన్స్ హై జంప్ టీ63- కాంస్యం
👉సుందర్ సింగ్ గుర్జార్- మెన్‌స జావెలిన్ త్రో ఎఫ్46- కాంస్యం
👉దీప్తి జివాంజి- వుమెన్స్ 400 మీటర్ల టీ20 పరుగు- కాంస్యం
👉సుమిత్ ఆంటిల్- మెన్స్‌జావెలిన్ త్రో ఎఫ్64- స్వర్ణం
👉సుహాస్ యతిరాజ్- బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ ఎస్‌ఎస్64- రజతం
👉తులసిమతి మురుగేశన్- బ్యాడ్మింటన్ వుమెన్స్ సింగిల్స్ ఎస్‌యూ45- రజతం
👉మనీషా రామదాస్- బ్యాడ్మింటన్ వుమెన్స్ సింగిల్స్ ఎస్‌యూ45- కాంస్యం
👉నిత్యశ్రీ సుమతి శివన్- బ్యాడ్మింటన్ వుమెన్స్ సింగిల్స్ ఎస్‌హెచ్6- కాంస్యం
👉శీతల్ దేవి- రాకేశ్ కుమార్- మిక్స్‌డ్ కాంపౌండ్ ఓపెన్ ఆర్చరీ- కాంస్యం
👉యోగేశ్ కతూనియా- మెన్స్ డిస్కస్ త్రో ఎఫ్56- రజతం
👉నితేశ్ కుమార్- బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ ఎస్‌ఎల్3- స్వర్ణం
👉అవని లేఖరా- వుమెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1- స్వర్ణం
👉మోనా అగర్వాల్- వుమెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1- కాంస్యం
👉ప్రీతి పాల్- వుమెన్స్ 100 మీటర్ల పరుగు టీ35- కాంస్యం
👉మనీశ్ నర్వాల్- పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1- రజతం
👉రుబీనా ఫ్రాన్సిస్- వుమెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1- కాంస్యం
👉ప్రీతి పాల్- వుమెన్‌స 200 మీటర్ల పరుగు టీ35- కాంస్యం
👉నిషద్ కుమార్- మెన్స్ హై జంప్ టీ47- రజతం
👉సచిన్ ఖిలారి- పురుషుల షాట్‌పుట్ ఎఫ్46- రజతం
Comments
Please login to add a commentAdd a comment