Sachin
-
సచిన్ ఎవరెస్ట్.. కోహ్లీ బిస్కెట్.. ఇదిగో ప్రూఫ్!
-
Paralympics: సచిన్‌కు రజతం.. 21కి చేరిన పతకాల సంఖ్య
ప్యారిస్ పారాలింపిక్స్-2024లో భారత్ మరో పతకం సాధించింది. ప్రపంచ చాంపియన్ సచిన్ ఖిలారి పురుషుల షాట్‌పుట్ ఎఫ్46 ఈవెంట్లో రజతం గెలిచాడు. బుధవారం నాటి ఈ ఈవెంట్లో కెనడాకు చెందిన గ్రెగ్ స్టువర్ట్ 16.38 మీటర్ల దూరం షాట్ విసిరి స్వర్ణం గెలవగా.. సచిన్ 16.32 మీటర్ల దూరంవిసిరి రెండో స్థానంలో నిలిచాడు.తద్వారా పారాలింపిక్స్ తాజా ఎడిషన్‌లో భారత్ ఖాతాలో 21వ మెడల్ చేరింది. ఇక ఇదే ఈవెంట్లో సచిన్‌తో పాటు పోటీ పడిన భారత అథ్లెట్లు మొహ్మద్ యాసిర్, రోహిత్ కుమార్ వరుసగా 8, 9వ స్థానాల్లో నిలిచారు. కాగా ప్యారిస్ పారాలింపిక్స్‌లో భారత్ ఇప్పటి వరకు మూడు స్వర్ణాలు, 8 రజతాలు, 10 కాంస్య పతకాలు గెలిచింది.ప్యారిస్ పారాలింపిక్స్-2024లో ఇప్పటి వరకు పతకాలు గెలిచిన భారత అథ్లెట్లు👉శరద్ కుమార్- మెన్స్ హై జంప్ టీ63- రజతం👉అజీత్ సింగ్- మెన్స్ జావెలిన్ త్రో- రజతం👉మరియప్పన్ తంగవేలు- మెన్స్ హై జంప్ టీ63- కాంస్యం👉సుందర్ సింగ్ గుర్జార్- మెన్స జావెలిన్ త్రో ఎఫ్46- కాంస్యం👉దీప్తి జివాంజి- వుమెన్స్ 400 మీటర్ల టీ20 పరుగు- కాంస్యం👉సుమిత్ ఆంటిల్- మెన్స్జావెలిన్ త్రో ఎఫ్64- స్వర్ణం👉సుహాస్ యతిరాజ్- బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ ఎస్ఎస్64- రజతం👉తులసిమతి మురుగేశన్- బ్యాడ్మింటన్ వుమెన్స్ సింగిల్స్ ఎస్‌యూ45- రజతం👉మనీషా రామదాస్- బ్యాడ్మింటన్ వుమెన్స్ సింగిల్స్ ఎస్‌యూ45- కాంస్యం👉నిత్యశ్రీ సుమతి శివన్- బ్యాడ్మింటన్ వుమెన్స్ సింగిల్స్ ఎస్‌హెచ్6- కాంస్యం👉శీతల్ దేవి- రాకేశ్ కుమార్- మిక్స్డ్ కాంపౌండ్ ఓపెన్ ఆర్చరీ- కాంస్యం👉యోగేశ్ కతూనియా- మెన్స్ డిస్కస్ త్రో ఎఫ్56- రజతం👉నితేశ్ కుమార్- బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ ఎస్ఎల్3- స్వర్ణం👉అవని లేఖరా- వుమెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1- స్వర్ణం👉మోనా అగర్వాల్- వుమెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1- కాంస్యం👉ప్రీతి పాల్- వుమెన్స్ 100 మీటర్ల పరుగు టీ35- కాంస్యం👉మనీశ్ నర్వాల్- పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1- రజతం👉రుబీనా ఫ్రాన్సిస్- వుమెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1- కాంస్యం👉ప్రీతి పాల్- వుమెన్స 200 మీటర్ల పరుగు టీ35- కాంస్యం👉నిషద్ కుమార్- మెన్స్ హై జంప్ టీ47- రజతం👉సచిన్ ఖిలారి- పురుషుల షాట్‌పుట్ ఎఫ్46- రజతం -
PKL: సచిన్‌కు రూ. 2.15 కోట్లు
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఆటగాళ్ల వేలంలో రూ. కోట్ల కూత కూసింది. దీంతో కబడ్డీ ప్లేయర్ల రాత కూడా రానురానూ మారుతోంది. పీకేఎల్ 11వ సీజన్ కోసం నిర్వాహకులు గురువారం ఆటగాళ్ల వేలం ప్రక్రియను మొదలుపెట్టారు. తొలిరోజు ఎ, బి కేటగిరీలకు చెందిన ఆటగాళ్ల వేలం నిర్వహించగా, రాజస్తాన్‌కు చెందిన సచిన్ తన్వర్‌పై ఫ్రాంచైజీలు రూ. రెండు కోట్లకు పైగా వెచ్చించేందుకు పోటీపడ్డాయి. చివరకు తమిళ్ తలైవాస్ ఈ రెయిడర్పై రూ. 2.15 కోట్లు కురిపించి మరీకైవసం చేసుకుంది. గత సీజన్లో పట్నా పైరేట్స్ తరఫున కూత పెట్టిన సచిన్ అంతకుముందు గుజరాత్ జెయింట్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. తన్వర్ భారత జట్టులో కీలక సభ్యుడు. గతేడాది హాంగ్జూలో జరిగిన ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన విజేత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఇతనితో పాటు ‘ఎ’ కేటగిరీలో ఉన్న మరో స్టార్ కబడ్డీ ప్లేయర్, ఇరానియన్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ రెజా కోసం ఫ్రాంచైజీలు ఎగబడి వేలం పాట పాడాయి. చివరకు అతన్ని రూ. 2.07 కోట్లతో హరియాణా స్టీలర్స్ చేజిక్కించుకుంది. తొలి రోజు వేలంలో రెండు కేటగిరీల్లో కలిపి 8 మంది ఆటగాళ్లు రూ. కోటికి పైగా ధర పలికారు. రెయిడర్లు గుమన్ సింగ్ రూ. 1.97 కోట్లు (గుజరాత్ జెయింట్స్), మణీందర్ సింగ్ రూ. 1.15 కోట్లు (బెంగాల్ వారియర్స్), అజింక్యా అశోక్ రూ. 1.10 కోట్లు (బెంగళూరు బుల్స్), ఆల్‌రౌండర్లు పవన్ కుమార్ సెహ్రావత్ రూ.1.72 కోట్లు (తెలుగు టైటాన్స్), భరత్ రూ. 1.30 కోట్లు (యూపీ యోధాస్), డిఫెండర్ సునీల్ కుమార్ రూ. 1.01 కోట్లు (యు ముంబా)లు భారీ ధర పలికారు. తెలుగు టైటాన్స్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ పవన్ సెహ్రావత్‌తో పాటు డిఫెండర్ క్రిషన్ ధుల్ (రూ. 70 లక్షలు), ఆల్‌రౌండర్ విజయ్ మలిక్ (రూ. 20 లక్షలు)లను తొలిరోజు వేలంలో కొనుక్కుంది. రెండో రోజు శుక్రవారం వేలంలో ‘ఎ’, ‘బి’లతో పాటు ‘సి’ కేటగిరీ ఆటగాళ్ల వేలం నిర్వహిస్తారు. -
‘పారిస్’కు చేరువగా సచిన్
బ్యాంకాక్: పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు ఆఖరి క్వాలిఫయింగ్ టోర్నీలో భారత బాక్సర్లు సచిన్ సివాచ్ (57 కేజీలు) క్వార్టర్ ఫైనల్ చేరగా... అమిత్ పంఘాల్ (51 కేజీలు), సంజీత్ కుమార్ (92 కేజీలు), జైస్మిన్ (57 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ బౌట్లో సచిన్ 5–0తో బతుహన్ సిఫ్టిసీ (టర్కీ)పై ఏకపక్ష విజయం సాధించాడు. రెండో రౌండ్ బౌట్లలో సంజీత్ 5–0తో లూయిస్ సాంచెజ్ (వెనిజులా)పై, అమిత్ 4–1తో మౌరిసియో రూయిజ్ (మెక్సికో)పై గెలిచారు. మహిళల 57 కేజీల రెండో రౌండ్లో జైస్మిన్ 5–0తో మహసతి హమ్జయేవా (అజర్బైజాన్)పై విజయం సాధించింది. ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరిన బాక్సర్లకు పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌లు ఖరారవుతాయి. -
ఈ చిత్ర ప్రదర్శన.. భళా!
మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రంలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం ఉమ్మడి జిల్లాకే తలమానికంగా నిలుస్తోంది. హైదరాబాద్‌లోని ఇండోర్ స్టేడియాలకు ధీటుగా పాలమూరులో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియాన్ని తీర్చిదిద్దారు. ఈ స్టేడియంలో ఆరు షటిల్ బ్యాడ్మింటన్ కోర్టులను ఏర్పాటుచేశారు.ఆకట్టుకుంటున్న చిత్రాలు..మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం బయట గోడలపై వేసిన క్రీడాకారుల చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. ఔత్సాహిక క్రీడాకారులకు అవగాహన కలిగేలా ఆయా క్రీడల్లో రాణిస్తున్న ప్రముఖ క్రీడాకారుల చిత్రాలు ఇండోర్ స్టేడియానికి కొత్త శోభను తెచ్చిపెట్టాయి. జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ ఆర్టిస్ట్ మధు క్రీడాకారుల చిత్రాలు గీశారు. స్టేడియం ప్రధాన ద్వారం గోడపై ఓవైపు ప్రముఖ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ, మరోవైపు బాక్సర్ నిఖత్ జరీన్, మధ్యలో ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, స్టేడియానికి మరోవైపు క్రికెటర్లు విరాట్ కొహ్లి, సిరాజ్, షటిల్ క్రీడాకారిణి గుత్తాజ్వాల, మహిళా క్రికెటర్ స్మృతి మంధాన, జావెలిన్‌త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా, కబడ్డీ క్రీడాకారుడు రాహుల్ చౌదరితో పాటు ఇతర క్రీడాకారుల చిత్రాలు అమితంగా ఆకట్టుకుంటున్నాయి.అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది..మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో క్రీడాకారుల చిత్రాలు గీయడానికి అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. గతంలో జిల్లా కేంద్రంలోని స్టేడియం ప్రహరీపై 36 గంటల్లోనే 300 లకుపైగా క్రీడలకు సంబంధించిన చిత్రాలను గీశాను. అదే విధంగా వాలీబాల్ అకాడమీలో క్రీడల బొమ్మలను వేశాను. – మధు, ఆర్టిస్ట్, మహబూబ్నగర్ఇవి చదవండి: బోరు చుట్టూ.. ఇంకుడుగుంత నిర్మించడం ఎలా? -
సీమా హైదర్‌కు రూ. 3 కోట్ల పరువు నష్టం నోటీసు!
పాక్ నుంచి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించి, తన ప్రియుని చెంతకు చేరిన సీమా హైదర్ ఇప్పుడు మరిన్ని చిక్కుల్లో పడ్డారు. పాక్‌లో ఉంటున్న సీమా హైదర్ భర్త గులాం హైదర్ తాజాగా సీమా హైదర్, ఆమె ప్రియుడు సచిన్ మీనాలకు పరువు నష్టం నోటీసు పంపారు. సీమా హైదర్ పాకిస్తాన్ భర్త గులాం హైదర్ తరపు న్యాయవాది మోమిన్ మాలిక్ తాజాగా సీమా, ఆమె ప్రియుడు సచిన్ మీనాకు రూ. మూడు కోట్ల విలువైన పరువు నష్టం నోటీసు పంపారు. అలాగే సీమా తరపు న్యాయవాది డాక్టర్ ఏపీ సింగ్‌కు రూ. ఐదు కోట్ల పరువు నష్టం నోటీసు పంపారు. ఈ ముగ్గురికీ కోట్ల విలువైన పరువు నష్టం నోటీసులు పంపిన ఆయన వారంతా నెల రోజుల్లోగా క్షమాపణలు చెప్పాలని కోరారు. అలాగే జరిమానా కట్టకుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాకిస్తాన్లో ఉంటున్న సీమా హైదర్ భర్త గులాం హైదర్ ఇటీవల హర్యానాలోని పానిపట్‌కు చెందిన సీనియర్ న్యాయవాది మోమిన్ మాలిక్‌ను తన తరపు న్యాయవాదిగా నియమించుకున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘సీమా హైదర్‌ను పోలీసులు అరెస్టు చేసినప్పుడు, ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్‌లన్నింటిలో సీమా హైదర్ భర్త పేరు గులాం హైదర్ అని రాసి ఉంది. ఇంతేకాదు కోర్టు నుండి ఆమె బెయిల్ పొందినప్పుడు, సంబంధిత పేపర్లలో గులాం హైదర్ భార్య సీమా హైదర్ అని రాసివుందన్నారు. ఈ విధంగా ఆమె తాను గులాం హైదర్ భార్యనని ప్రకటించుకున్నదని అన్నారు. అయితే సీమా తరపు న్యాయవాది ఏపీ సింగ్ ఇంకా సీమా హైదర్ సచిన్ భార్య అని ఏ ప్రాతిపదికన చెబుతున్నారని ప్రశ్నించారు. ఈ కారణంగానే సీమా హైదర్ పాక్ భర్త గులాం హైదర్ ఆమెకు పరువు నష్టం నోటీసు పంపారని మోమిన్ మాలిక్ తెలిపారు. గులాం హైదర్ పంపిన నోటీసులో తాను సీమా హైదర్ నుండి ఇప్పటి వరకు చట్టబద్ధంగా విడాకులు తీసుకోలేదని, సచిన్ కారణంగానే తన నలుగురు పిల్లలు తనకు దూరమయ్యారని, వారి చదువులు దిగజారుతున్నాయని ఆరోపించారు. -
భారత్ క్రికెట్ లో సచిన్ దాస్ పేరు ట్రెండింగ్
-
తండ్రి కలలు కన్నాడు.. కొడుకు నేరవేర్చాడు! ఎవరీ సచిన్ దాస్?
సచిన్ దాస్.. ప్రస్తుతం భారత క్రికెట్లో మారుమోగుతున్న పేరు. అండర్ 19 వరల్డ్‌కప్-2024లో టీమిండియా ఫైనల్‌కు చేరడంలో ఈ యువ ఆటగాడిది కీలక పాత్ర. క్రికెట్ గాడ్ పేరు పెట్టుకున్న ఈ యువ సంచలనం.. అందుకు తగ్గట్టుగానే అసాధారణమైన ప్రతిభను కనబరుస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి సెమీఫైనల్లో సచిన్ తనకు కెరీర్లో చిరకాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 244 పరగుల ఛేదనలో 32 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో కెప్టెన్ ఉదయ్ సహారన్‌తో జతకట్టిన సచిన్.. తన విరోచిత పోరాటంతో తొమ్మిదోసారి ఫైనల్‌కు చేర్చాడు. బౌలర్లకు అనుకూలిస్తున్న వికెట్‌పై సచిన్ దాస్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. కేవలం 4 పరుగుల దూరంలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయిన దాస్.. తన సంచలన ఇన్నింగ్స్‌తో మాత్రం అందరి ప్రశంసలను అందుకుంటున్నాడు. ఈ మ్యాచ్‌లో 95 బంతులు ఎదుర్కొన్న సచిన్ 11 ఫోర్లు, 1 సిక్స్‌తో 96 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో ఎవరీ సచిన్ దాస్ అని నెటిజన్లు అరాతీసున్నారు. ఎవరీ సచిన్ దాస్? సచిన్ దాస్.. 2005 ఫిబ్రవరి 3న మహారాష్ట్రలోని బీడ్ గ్రామంలో జన్మించాడు. సచిన్‌కు తన చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువ ఎక్కువ. నాలుగున్నర ఏళ్ల వయస్సు నుంచే సచిన్ క్రికెట్ ఆడడం మొదలెట్టాడు. కానీ అతడు ఉన్న చోట క్రికెట్ ఆడేందుకు అత్యుత్తమ సౌకర్యాలు లేవు. అతడు ప్రాక్టీస్ చేయడానికి పూర్తి స్ధాయి క్రికెట్ పిచ్‌లు కూడా అందుబాటులో ఉండేవి కాదు. దాస్ హాఫ్ టర్ఫ్లపైనే ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడు. సచిన్ తన ప్రయాణంలో ఎన్ని ఇబ్బందిలు ఎదుర్కొన్నప్పటికీ తన అభిరుచిని మాత్రం వదులుకోలేదు. నిరంతరం శ్రమ, పట్టుదలతో భారత జెర్సీ ధరించే స్ధాయికి చేరుకున్నాడు. అయితే సచిన్ భారత్ అండర్-19 క్రికెటర్‌గా ఎదగడంలో అతడి తల్లిదండ్రుల కూడా కీలక పాత్ర. సచిన్ తండ్రి పేరు సంజయ్ దాస్. అతడు మహారాష్ట్ర ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నారు. సంజయ్ దాస్‌కు కూడా క్రికెట్ అంటే ఇష్టం ఎక్కువే. యూనివర్సిటీ స్థాయి వరకు అతడు క్రికెట్ ఆడాడు. కానీ అతడు అంతకంటే ముందుకు వెళ్లలేదు. అయితే తన కలను కొడుకు రూపంలో నెరవేర్చుకోవాలని అనుకున్నాడు. తనకు తనయడు జన్మించిన వెంటనే ఎలాగైనా క్రికెటర్ చేయాలని సంజయ్ నిర్ణయించుకున్నాడు. మరోవైపు సచిన్ తల్లిపేరు సురేఖ దాస్. మహారాష్ట్ర పోలీస్ విభాగంలో అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. కోచ్ కూడా.. అదే విధంగా సచిన్ ఈ స్ధాయికి చేరుకోవడంలో కోచ్ షేక్ అజార్ కూడా తన వంతు పాత్ర పోషించాడు. సచిన్‌కు పేస్ బౌలర్లకు ఆడటంలో కాస్త ఇబ్బంది పడుతూ వస్తుండేవాడు. ముఖ్యంగా బౌన్సర్లను ఎదుర్కొవడంలో ఇబ్బంది పడేవాడు. ఈ క్రమంలో సచిన్.. కోచ్ షేక్ అజార్ సాయంతో తన సమస్యను అధిగమించాడు. ఈ విషయాన్ని స్వయంగా అతడి తండ్రి సంజయ్ దాస్ తెలిపాడు. సచిన్ దాస్ పేరు ఎలా వచ్చిందంటే? సచిన్ దాస్ తండ్రి సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్‌కి వీరాభిమాని. అయితే తన ఆరాధ్య క్రికెటర్లలో ఒకరైన సచిన్ టెండూల్కర్ పేరును తన కొడుక్కి పెట్టుకున్నారు. అయితే 18 ఏళ్ల సచిన్ దాస్ కూడా టెండూల్కర్‌కు వీరాభిమాని. అందుకే మాస్టర్ బ్లాస్టర్ ధరించిన 10వ నంబర్ జెర్సీనే వరల్డ్‌కప్‌లో వేసుకుంటున్నాడు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో 6 మ్యాచ్‌లు ఆడిన సచిన్ దాస్.. 73.50 సగటుతో 294 పరుగులు చేశాడు. -
బార్ క్యాషియర్ దారుణహత్య
కర్ణాటక: బార్లో మద్యం తాగడానికి వచ్చిన యువకులు– సిబ్బంది మధ్య గొడవ జరిగి సిబ్బంది ఒకరు హత్యకు గురయ్యారు. ఈ ఘటన ఆదివారం రాత్రి శివమొగ్గ తాలూకాలోని ఆయనూరు గ్రామంలో చోటు చేసుకుంది. హతుడు బార్ క్యాషియర్ సచిన్ (27). నిందితులు ఆయనూరు తండాకు చెందిన నిరంజన్, సతీష్, అశోక్ నాయక్‌లు. నవరత్న బార్లో వీరు మద్యం తాగడానికి వచ్చారు. రాత్రి 11 గంటలకు.. బార్ మూసేయాలి, ఇక వెళ్లిపోవాలని సిబ్బంది వారికి సూచించారు. మందు తాగుతుంటే మధ్యలో ఇబ్బంది పెడుతారా అని తాగుబోతులు గొడవ పడ్డారు. దాంతో క్యాషియర్ సచిన్ వచ్చి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేయగా నువ్వేంటి మాకు చెప్పేది అని కత్తితో అతని పొట్టలో పొడిచారు. తరువాత బయట పోలీసులు ఉన్నప్పటికీ, బైక్‌లపై పారిపోయారు. తీవ్రంగా గాయపడిన సచిన్‌ను బార్ సిబ్బంది ఆయనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి అక్కడ చికిత్స చేసి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం శివమొగ్గ నగరానికి తరలిస్తున్న సమయంలో మృతి చెందాడు. కుంసి పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు. -
సచిన్ కొడుకుపై షారుక్ ట్వీట్ అదే రేంజ్ లో సచిన్ రిప్లై
-
సచిన్ ను దాటేసిన కోహ్లీ.. స్వదేశంలో 20వ సెంచరీ
-
Ultimate Kho Kho 2022: తెలుగు యోధాస్ గెలుపు.. అరంగేట్ర సీజన్లో తొలి జట్టుగా!
పుణే: అల్టిమేట్ ఖో–ఖో లీగ్‌లో భాగంగా రాజస్తాన్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తెలుగు యోధాస్ 83–45తో నెగ్గింది. ఈ టోర్నీలో తెలుగు యోధాస్కిది మూడో విజయం. అటాకర్ సచిన్, డిఫెండింగ్ అరుణ్ తమ ప్రదర్శనతో తెలుగు యోధాస్ విజయంలో కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం తెలుగు యోధాస్ 9 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో 83 పాయింట్లు స్కోరు చేసిన తెలుగు యోధాస్.. అల్టిమేట్ ఖో-ఖో తొలి సీజన్లో ఇప్పటి వరకు 80+ పాయింట్లు సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో సచిన్ భార్గో బెస్ట్ అటాకర్‌గా నిలిచాడు. అరుణ్ గుంకీకి బెస్ట్ డిఫెండర్ అవార్డు దక్కింది. ఇక మంగళవారం(ఆగష్టు 23) తెలుగు యోధాస్ తమ తదుపరి మ్యాచ్ ఆడనుంది. ముంబై ఖిలాడీస్‌తో తలపడనుంది. చదవండి: Ned Vs Pak 3rd ODI: పాపం.. జస్ట్ మిస్! ఆ తొమ్మిది పరుగులు చేసి ఉంటే! కనీసం.. IND vs ZIM 3rd ODI: క్లీన్‌స్వీప్‌పై భారత్ గురి -
సచిన్ 'దేవుడు', ధోని 'లెజెండ్', కోహ్లి..?
ముంబై: ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్.. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో "ఆస్క్ మీ ఎనీ థింగ్" అనే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. అందులో అభిమానులు అడిగిన ప్రశ్నలకు అతను సింగల్ వర్డ్‌లో సమాధానమిచ్చాడు. సచిన్ గురించి అభిమానులు అడగ్గా.. క్రికెట్ దేవుడని, ధోనిని దిగ్గజ క్రికెటర్ అని, కోహ్లి అంటే ఇన్స్పిరేషన్(స్పూర్తి) అని, రోహిత్ శర్మ అంటే హిట్‌మ్యాన్ అని, పోలార్డ్ అంటే లార్డ్ అని, హార్దిక్ పాండ్య అంటే ఎంటర్టైనర్ అని టకాటకా బదులిచ్చాడు. ఇక క్రికెటే తన ఊపిరని, అందులో తనకిష్టమైన షాట్ స్వీప్‌షాట్ అని చెప్పుకొచ్చాడు. ముంబై ఇండియన్స్ జట్టును అతను కుటుంబంతో పోల్చాడు. క్రికెటర్ కాకపోయుంటే ఏమైవుండేవాడివని ఓ అభిమాన్ని అడిగిన ప్రశ్నకు.. నటుడిగా రాణించేవాడినని సమాధానమిచ్చాడు. క్రికెట్‌కు సంబంధించిన అంశాలే కాకుండా, అభిమానులడిన వ్యక్తిగత విషయాలకు సంబంధించిన ప్రశ్నలకు కూడా సూర్యకుమార్ ఓపికగా సమాధానమిచ్చాడు. బిర్యాని తనకిష్టమైన ఆహారమని, బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ ఫేవరెట్ తన యాక్టర్ అని వెల్లడించాడు. కాగా, గత ఐపీఎల్ సీజన్ సందర్భంగా.. సూర్యకుమార్, కోహ్లిల మధ్య మైదానంలో జరిగిన ఘర్షన నేపథ్యంలో కోహ్లిని స్పూర్తిదాయకమైన ఆటగాడని పేర్కొనడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. చదవండి: 45 ఏళ్ల వయసులో ఇరగదీశాడు.. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగాడు -
సచిన్ పసిడి పంచ్
న్యూఢిల్లీ: ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలను భారత్ స్వర్ణ పతకంతో ముగించింది. పోలాండ్‌లో శుక్రవారం జరిగిన పురుషుల 56 కేజీల ఫైనల్లో భారత యువ బాక్సర్ సచిన్ పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. యెర్బోలాత్ సాబిర్ (కజకిస్తాన్)తో జరిగిన టైటిల్ పోరులో సచిన్ 4–1తో నెగ్గాడు. ఓవరాల్‌గా ఈ మెగా ఈవెంట్లో భారత్‌కిది ఎనిమిదో స్వర్ణ పతకం కావడం విశేషం. గురువారం మహిళల విభాగంలో భారత బాక్సర్లు బరిలోకి దిగిన ఏడు వెయిట్ కేటగిరీల్లోనూ బంగారు పతకాలు గెల్చుకున్న సంగతి తెలిసిందే. పురుషుల, మహిళల విభాగాల్లో కలిపి భారత్ ఎనిమిది స్వర్ణాలు, మూడు కాంస్యాలతో 11 పతకాలు దక్కించుకొని టాప్ ర్యాంక్‌లో నిలిచింది. పురుషుల విభాగంలో అంకిత్ నర్వాల్ (64 కేజీలు), బిశ్వామిత్ర చోంగ్తోమ్ (49 కేజీలు), విశాల్ గుప్తా (91 కేజీలు) సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. ఈ మెగా టోర్నీలో 52 దేశాల నుంచి మొత్తం 414 మంది బాక్సర్లు పాల్గొన్నారు. -
మొన్న అలా, నేడు ఇలా.. కోహ్లిపై సెహ్వాగ్
అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో డకౌటైనా, రెండో మ్యాచ్‌లో మాత్రం మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్(49 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆడిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. తొలి టీ20 తుది జట్టు ఎంపిక విషయంలో(రోహిత్‌కు విశ్రాంతినివ్వడం) కొద్ది రోజుల కిందట టీమిండియా సారధిపై విరుచుకుపడిన ఆయన.. రెండో టీ20లో కోహ్లి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌ను ఆకాశానికెత్తేశాడు. అంతటితో ఆగకుండా మ్యాచ్‌ను ముగించడంలో కోహ్లి.. దిగ్గజ ఆటగాడు సచిన్‌తో సరిసమానమని కొనియాడాడు. ఈ విషయంలో యువ క్రికెటర్లు రిషబ్ పంత్, ఇషాన్ కిషన్‌లు కోహ్లిని ఆదర్శంగా తీసుకోవాలని సూచనలు చేశాడు. అరంగేట్రం మ్యాచ్‌లోనే ఇషాన్ కిషన్(32 బంతుల్లో 56; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అదరగొట్టే ప్రదర్శన చేసినా, కోహ్లిలా ఆఖరి దాకా క్రీజ్‌లో ఉండేందుకు అనాసక్తి కనబరిచాడని, ఈ విషయంలో అతను కెప్టెన్ సలహాలు తీసుకోవాలని సూచించాడు. అలాగే మరో యువ ఆటగాడు రిషబ్ పంత్ (13 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) సైతం వేగంగా పరుగులు రాబట్టేందుకు ప్రయత్నించాడే కానీ, కోహ్లిలా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడన్నాడు. జట్టును విజయతీరాలకు చేర్చడంలో కోహ్లి చాలా పట్టుదలగా ఉంటాడని, ఈ కసిని యువ క్రికెటర్లు కూడా కలిగి ఉండాలని అభిప్రాయపడ్డాడు. ఇటీవలకాలంలో వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న విరాట్ కోహ్లికి తాజా ఇన్నింగ్స్ ఊరట కలిగించి ఉంటుదని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్‌తో ముగిసిన టెస్ట్ సిరీస్‌లో సైతం అంతగా ఆకట్టుకోని కోహ్లి రెండో టీ20లో అద్భుతమైన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి యువ క్రికెటర్లకు మార్గదర్శిగా నిలిచాడని సెహ్వాగ్ కితాబునిచ్చాడు. కాగా, ఇంగ్లండ్‌తో ముగిసిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి 1-1తో సిరిస్‌ను సమం చేసింది. ఇరు జట్ల మధ్య మూడో మ్యాచ్ ఇదే వేదికగా ఇవాళ ప్రారంభంకానుంది. -
ప్రాణం తీసిన సెల్ఫీ సరదా
ఆదిలాబాద్‌రూరల్: సెల్ఫీ సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. రక్షాబంధన్ రోజున జలపాతం వద్దకు స్నేహితులతో వెళ్లిన యువకుడు అందులోపడి గల్లంతు కాగా మంగళవారం మృతదేహం లభ్యమైంది. పోలీసుల, కుటుంబ సభ్యుల క థనం ప్రకారం.. ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని భీంనగర్‌కు చెందిన డి.సచిన్ (20) స్నేహితుడితో కలిసి సోమవారం మండలంలోని ఖండాల జలపాతానికి వెళ్లాడు. సరదాగా సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు జలపాతంలో జారీ పడ్డాడు. దీంతో తోటిమిత్రులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గల్లంతైన యువకుడి కోసం గాలింపు చేపట్టిగా చీకటి పడడంతో ఆచూకీ లభ్యం కాలేదు. తిరిగి మంగళవారం ఉదయం నుంచే జలపాతం వద్ద గాలింపు చర్యలు చేపట్టగా యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు. పెద్ద దిక్కుకోల్పోయిన కుటుంబం.. సచిన్ తండ్రి ఏడేళ్ల కిందట పాముకాటుతో మృతిచెందాడు. అప్పటి నుంచి తల్లి తిర్వణబాయి సచిన్‌తో పాటు మరో కుమారుడిని చూసుకుంటుంది. ఈ క్రమంలోనే సచిన్ ఆదిలాబాద్ పట్టణంలో డిగ్రీ చదువుతూ ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ఓ టీ హోటల్లో పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న సచిన్ మృతి చెందడంతో ఆ కుటుంబం పెద్ద దిక్కు కోల్పోయింది. సచిన్ కుటుంబ సభ్యుల రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. -
అభిమాన క్రికెటర్‌పై అంతులేని ప్రేమతో...
మన దేశంలో క్రికెటర్లకు ఉన్న ప్రేక్షకారాధన అంతాఇంత కాదు. వారి అభిమానులు చేసే హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక సచిన్‌ను ఆరాధించేవారైతే అతడిని ఓ మానవాతీత వ్యక్తిగానే భావిస్తారు. ఇలాంటి కోట్లాది మందిలో కేరళలోని కాలికట్లో ఉన్న మలబార్ క్రిస్టియన్ కళాశాల చరిత్ర విభాగం అధిపతి ప్రొఫెసర్ ఎంసీ వశిష్ట్ ఒకరు. అయితే, మాస్టర్ బ్యాట్స్‌మన్‌పై తన అభిమానాన్ని వశిష్ట్ అందరికంటే భిన్నంగా పుస్తక రూపంలో విశిష్టంగా చాటుకున్నారు. సచిన్ రిటైరైన 2013లోనే తమ కళాశాలలో ‘సచిన్స్ గ్యాలరీ’ పేరిట అతడి ఘనతలు, విశేషాల వివరాలతో గ్రంథాలయం ఏర్పాటు చేశారు. ఇందులో సచిన్‌పై 11 (తెలుగు, మలయాళం, తమిళం, కన్నడం, ఒడియా, బెంగాలీ, అస్సామీ, మరాఠీ, గుజరాతీ, హిందీ, ఇంగ్లిష్) భాషల్లో రూపొందించిన 60 పుస్తకాలుండటం గమనార్హం. ఇన్ని భాషల్లో సచిన్ లైబ్రరీ ఏర్పాటు వెనుక దేశ సమైక్యతకు క్రికెట్ ఏవిధంగా తోడ్పడుతుందో చాటే ఉద్దేశమూ ఉండటం అభినందించదగ్గ విషయం. -
క్రికెట్ అడ్వైజరీ కమిటీకి దాదా గుడ్‌బై చెప్పనున్నారా?
-
ధోని... ‘సాక్షి’
ఆష్లే నర్స్ బౌలింగ్‌లో 37వ ఓవర్ మూడో బంతిని లాంగాన్ దిశగా పంపి సింగిల్ (81వ పరుగు) తీయడంతో ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి వన్డేల్లో 10 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ సమయంలో నాన్ స్ట్రయికింగ్‌లో ఉన్న ధోని అతడి వద్దకు వచ్చి అభినందించగా కోహ్లి బిగ్గరగా నవ్వాడు. ఇక్కడ చెప్పుకోవాల్సిందేమంటే... భారత క్రికెట్లో మధుర ఘట్టాలుగా నిలిచే సందర్భాలన్నింటిలో ధోని సాక్షిగా నిలవడం! 2007 టి20 ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు కొట్టినపుడు, 2010లో సచిన్ వన్డేల్లో తొలి డబుల్ సెంచరీని సాధించినపుడు, రోహిత్ శర్మ వన్డేల్లో తన తొలి ద్విశతకాన్ని అందుకున్నప్పుడు... నాన్ స్ట్రయికర్‌గా ధోనినే ఉండటం విశేషం. ఇక వీటన్నింటికీ మించినదేమంటే, స్ట్రయికింగ్‌లో ఉండి... 2011 ప్రపంచ కప్ ఫైనల్లో సిక్స్‌తో దేశాన్ని విశ్వ విజేతగా నిలపడం. ఆ మ్యాచ్..: వన్డే క్రికెట్లో అందరికంటే ముందుగా 10 వేల పరుగుల మైలు రాయిని చేరుకోవడం మాస్టర్ బ్లాస్టర్‌కే సాధ్యమైంది. మార్చి 31, 2001న ఇండోర్‌లో ఆస్ట్రేలియాపై అతను ఈ ఘనతను నమోదు చేశాడు. భారత్ 118 పరుగుల భారీ తేడాతో గెలిచిన ఆ మ్యాచ్‌లో సచిన్ 125 బంతుల్లో 19 ఫోర్లతో 139 పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. ఇది సచిన్ కెరీర్లో 28వ సెంచరీ. -
సచిన్–మిడిలెసెక్స్ అకాడమీ
ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంగ్లండ్‌కు చెందిన మిడిలెసెక్స్‌తో కలిసి అంతర్జాతీయ క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు. ‘టెండూల్కర్ మిడిలెసెక్స్ గ్లోబల్ అకాడమీ’ (టీఎంజీఏ) పేరుతో త్వరలోనే నార్త్వుడ్ (ఇంగ్లండ్)లో తొలిదశ శిక్షణ శిబిరం ప్రారంభం కానుంది. నార్త్‌వుడ్‌లోని ప్రఖ్యాత మర్చంట్ టేలర్స్ స్కూల్ క్యాంపస్‌లో వచ్చే నెల 6 నుంచి 9వ తేదీ వరకు క్యాంప్ జరుగనుంది. ఆ తర్వాత ముంబై, లండన్లలోనూ శిబిరాలను నిర్వహించనున్నారు. 9 నుంచి 14 ఏళ్ల బాలబాలికలకు విశేష అనుభవజ్ఞులతో శిక్షణ ఇప్పించడమే ఈ శిబిరాల లక్ష్యం. ఇందులో సచిన్ కోచ్‌గా పరకాయ ప్రవేశం చేయనున్నాడు. ‘మిడిలెసెక్స్‌తో జతకట్టడం ఆనందంగా ఉంది. ఇక్కడ కేవలం క్రికెటర్లను తయారు చేయడమే కాదు, ఉన్నతమైన పౌరుల్ని అందించడమే మా లక్ష్యం’ అని సచిన్ అన్నాడు. -
‘క్రీడా తరగతి’ని విస్తరించండి: సచిన్ టెండూల్కర్
తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రతి రోజూ క్రీడా తరగతిని తప్పనిసరి చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తీసుకున్న నిర్ణయాన్ని దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసించాడు. ఇదే విధానాన్ని మిగతా అన్ని తరగతుల వారికి వర్తింపజేయాలని కోరాడు. తద్వారా విద్యార్థుల్లో చురుకుదనం పెంపొందేందుకు వీలుంటుందని పేర్కొన్నాడు. -
హైదరాబాలో సందడి చేసిన సచిన్
-
రోడ్డుపై క్రికెట్ ఆడిన సచిన్..!
-
వైరల్ : రాత్రివేళ రోడ్డు పక్కన సచిన్..
ముంబై : క్రికెట్‌ను అమితంగా ప్రేమించే టీమిండియా మాజీ క్రికెటర్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పినా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ఐకాన్‌గా వ్యవహరిస్తున్నారు. సచిన్ జీవితాన్ని క్రికెట్‌ను విడదీసి చూడలేమనేది అందరికి తెలిసిందే. చాలా మంది యువ క్రికెటర్లకు సచినే మార్గదర్శి. ప్రపంచ క్రికెట్లో తన పేరు మీద అనేక రికార్డులు నెలకొల్పిన సచిన్, రిటైర్మెంట్ తర్వాత కుటుంబంతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. తాజాగా హోమ్ టౌన్ ముంబైలో రాత్రి సమయంలో సచిన్ ఓ రోడ్డు పక్కన సరదాగా క్రికెట్ ఆడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సచిన్ బ్యాటింగ్ చేస్తుండగా, కొంత మంది యువకులు ఫీల్డింగ్ చేశారు. పరిసరాలను బట్టి అది విల్లే పార్లేలోని రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతమని తెలుస్తోంది. రోడ్డుపైనే క్రికెట్ ఆడుతుండటంతో వికెట్లుగా ప్లాస్టిక్ డివైడర్ని వాడారు. -
డుమ్మా మాస్టర్లు సచిన్, రేఖ
సాక్షి, హైదరాబాద్ : ఒకరు క్రికెట్ రంగానికే దేవుడు.. మరొకరు బాలీవుడ్ ఎవర్గ్రీన్.. తమ రంగాల్లో అత్యంత ప్రతిభావంతులు. ప్రజల మనసు దోచుకున్న వారు.. కోట్లాదిమంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. కానీ, ప్రజాప్రతినిధులుగా వారి పనితీరు మాత్రం అధ్వానంగా ఉంది. వాళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే ఎవరైనా నోరు వెళ్లబెట్టాల్సిందే! సచిన్ టెండూల్కర్, రేఖ ఇద్దరూ 2012 మార్చిలో పెద్దల సభలో అడుగు పెట్టారు. ఈ నెలాఖరుకి పదవీ విరమణ చేయబోతున్నారు. రాజ్యసభ అందించిన వివరాల ప్రకారం ఈ ఆరేళ్లలో సచిన్ హాజరు 7.3 శాతం మాత్రమే.. 22 ప్రశ్నలు అడిగారు. ఒక్క బిల్లు కూడా ప్రవేశపెట్టలేదు. ఇక రేఖ విషయానికొస్తే ఆమె హాజరు మరీ అన్యాయంగా 4.5 శాతం ఉంది..పెద్దల సభలో అడుగు పెట్టిన దగ్గర్నుంచి ఏ ఒక్క సెషన్‌ని తీసుకున్నా ఒక్క రోజుకు మించి రేఖ హాజరు కాలేదు. అంతే కాదు సభలో అసలు నోరు విప్పలేదు. వీరిద్దరి పనితీరుపై విమర్శలు రావడం ఇది కొత్తేమీ కాదు. గత ఏడాది సమాజ్ వాదీ పార్టీ ఎంపీ నరేష్ అగర్వాల్ సెలబ్రిటీ ఎంపీల హాజరు అంశాన్ని సభలోనే ప్రశ్నించారు. అప్పుడే సెలెబ్రిటీలకు ఈ రాజకీయ పదవులెందుకన్న చర్చ విస్తతంగా జరిగింది. ఎంపీ పదవులు చేపట్టిన మొదటి రెండేళ్లలో సచిన్, రేఖ ఇద్దరూ ఎంపీ లాడ్స్ ని«ధులు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదన్న విషయమూ బయటపడింది.. ప్రతీ రాజ్యసభ సభ్యుడికి ఏడాదికి ఎంపీ ల్యాడ్స్ కింద రూ.5 కోట్ల నిధులు ఇస్తారు.. ఆ నిధుల్ని మురగబెట్టారే తప్ప ఖర్చు చేయలేదు. విమర్శలు వెల్లువెత్తాక వాళ్లలో కదలిక వచ్చింది. సచిన్ టెండూల్కర్ నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజు కండ్రిగ, మహారాష్ట్రలోని డోంజా అనే గ్రామాలను దత్తత తీసుకున్నారు. రేఖ కూడా ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి పుణెలోని కసర్‌వాడి దగ్గర ఛత్రపతి సాహు మహరాజ్ స్కూల్ నిర్మాణానికి రూ.3.03 కోట్లు కేటాయించారు. రాయ్‌బరేలిలో ఒక స్కూలు నిర్మాణానికి కూడా రూ.2.5 కోట్లు ఇచ్చారు.. కానీ, ఆ ప్రాజెక్టుల అతీగతీ ఇప్పటికీ తెలీదు. సచిన్ టెండూల్కర్, రేఖలను 2012లో అప్పటి యూపీఏ ప్రభుత్వం నామినేట్ చేసింది. ఇలా వివిధ రంగాలకు చెందిన నామినేటెడ్ ఎంపీల వల్ల ఒరిగేదేమిటన్న విమర్శలు ఘాటుగానే వినిపిస్తున్నాయి. సచిన్ రిపోర్ట్ కార్డు (2012 ఏప్రిల్ నుంచి) సభ జరిగిన రోజులు: 397 సచిన్ హాజరైన రోజులు: 29 ఆరేళ్లలో అందుకున్న జీతభత్యాలు: రూ.86,23,266 అడిగిన ప్రశ్నలు: 22 ప్రవేశపెట్టిన బిల్లులు: 0 రేఖ రిపోర్ట్ కార్డు (2012 ఏప్రిల్ నుంచి) సభ జరిగిన రోజులు : 397 రేఖ హాజరైన రోజులు : 18 అందుకున్న జీత భత్యాలు : రూ.99,59,178 అడిగిన ప్రశ్నలు: 0 ప్రవేశపెట్టిన బిల్లులు: 0 – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
'నేను ఇద్దరు గొప్ప వ్యక్తులను కలిశాను'
-
ఇక ముంబై టి20 లీగ్
ముంబై: క్రికెట్ లీగ్‌ల జోరు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే జాతీయంగా, అంతర్జాతీయంగా ఎన్నో లీగ్‌లు జరుగుతున్నాయి. తాజాగా ఇప్పుడు ప్రాంతీయ లీగ్‌ల వంతు వచ్చినట్లుంది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో టి20 క్రికెట్ లీగ్‌లు మొదలైనట్లే... తాజాగా ఇప్పుడు మహారాష్ట్రలోనూ ‘టి20 ముంబై లీగ్’కు రంగం సిద్ధమైంది. ముంబై క్రికెట్ సంఘం సౌజన్యంతో ‘ప్రాబబిలిటీ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ ఆధ్వర్యంలో మొదలవనున్న ఈ లీగ్‌కు భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. వచ్చే నెల 11 నుంచి 21 వరకు వాంఖెడే స్టేడియంలో ఈ ‘టి20 లీగ్’ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ సందర్భంగా జరిగిన ప్రచార కార్యక్రమంలో సచిన్ మాట్లాడుతూ ‘ముంబైకి ఇలాంటి లీగ్‌ల అవసరం ఎంతో ఉంది. సుదీర్ఘ కాలంగా ముంబై క్రికెటర్లే పెద్ద సంఖ్యలో భారత క్రికెట్లో ప్రధాన పాత్ర పోషించారనేది వాస్తవం. ఈ స్థానిక లీగ్‌లో ‘బ్రాండ్ అంబాసిడర్’గా నేనులో భాగమైనందుకు సంతోషంగా ఉంది. తమ సత్తా చాటేందుకు కుర్రాళ్లకు ఇది చక్కని వేదిక’ అని అన్నారు. ముంబై గల్లీ కుర్రాళ్లు శివాజీ పార్క్, క్లబ్‌ల స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వేదికైన వాంఖెడేలో మెరిసేందుకు ఇది మంచి అవకాశమని సచిన్ అన్నారు. -
అంధుల క్రికెట్‌కూ గుర్తింపు ఇవ్వండి
న్యూఢిల్లీ: ‘అంధుల జట్టు ఎన్నో అవరోధాలు అధిగమించింది. వారి స్ఫూర్తిదాయక ప్రపంచకప్ విజయం మానవ మేధస్సుకు పరిమితి లేదని గుర్తుచేస్తోంది. అందుకని భారత అంధుల క్రికెట్ సంఘం (సీఏబీఐ)కు గుర్తింపునిస్తూ ఆ క్రికెటర్లను బోర్డు పెన్షన్ పథకం పరిధిలోకి తీసుకోండి’ అని బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బీసీసీఐని కోరాడు. ఈ మేరకు బోర్డు పరిపాలకుల కమిటీ అధ్యక్షుడు వినోద్‌రాయ్‌కు లేఖ రాశాడు. బీసీసీఐ గుర్తింపు దక్కడం వారి కృషికి మెచ్చుకోలుగా ఉంటుందని, ఆటగాళ్ల ఆర్థిక భద్రతకూ భరోసాగా నిలుస్తుందని పేర్కొన్నా డు. గత నెలలో అంధుల జట్టు ప్రపంచకప్ గెలిచిన సందర్భంగా బీసీసీఐ తరఫున రివార్డు అందిస్తామని రాయ్ ప్రకటించారు. -
క్రైమ్ థ్రిల్లర్‌గా యార్ ఇవన్
తమిళసినిమా: క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రంగా తెరకెక్కిన యార్ ఇవన్ చిత్రం ఈ నెల 15న తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. ఒక పక్క వ్యాపార రంగంలో రాణిస్తూ మరో పక్క సినిమాను ఫ్యాషన్‌గా నటిస్తున్న నటుడు సచిన్. ఇంతకు ముందు పలు తెలుగు చిత్రాల్లో నటించిన ఆయన తాజాగా యార్ ఇవన్ పేరుతో తమిళ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తమిళం, తెలుగు భాషల్లో సచిన్ కథానాయకుడిగా నటించి నిర్మించిన ఈ చిత్రంలో ఆయనకు జంటగా ఇషాగుప్తా నాయకిగా నటించింది. ఇతర ప్రధాన పాత్రల్లో ప్రభు, కిశోర్, సతీష్ తదితరులు నటించారు. ఎస్ఎస్.థమన్ సంగీతం అందించిన యార్ ఇవన్ చిత్రానికి టీ.సత్య దర్శకుడు. చిత్రం ఈ నెల 15వ తేదీన రెండు భాషల్లో విడుదల కానున్న సందర్భంగా చిత్ర యూనిట్ సోమవారం ఉదయం చెన్నైలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన ఈ సమావేశంలో దర్శకుడు టీ.సత్య మాట్లాడుతూ క్రీడా నేపథ్యంలో తెరకెక్కించిన మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రం యార్ ఇవన్ అని తెలిపారు. ఇందులో సచిన్ ప్రోకబడ్డీ క్రీడాకారుడిగా నటించారని తలిపారు. లవ్, యాక్షన్ సన్నివేశాలతో కూడిన భారీ చిత్రంగా యార్ ఇవన్ ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం చిత్ర నిర్మాత, కథానాయకుడు సచిన్ మాట్లాడుతూ తాను వ్యాపార రంగానికి చెందిన వాడినైనా 8 ఏళ్ల వయసులోనే బాల నటుడిగా పరిచయం అయ్యానని చెప్పారు. అందువల్ల వ్యాపారాన్ని నాన్న చూసుకుంటారని, తనకు నటనే ముఖ్యం అని తెలిపారు. అదే విధంగా సినిమాకు భాష లేదని, యార్ ఇవన్ చిత్రం అన్ని భాషల ప్రేక్షకులను అలరించే చిత్రంగా ఉంటుందని తెలిపారు. -
అది శక్తికి మించిన పని
‘సచిన్ సెంచరీల’ రికార్డుపై కోహ్లి కొలంబో: వన్డే క్రికెట్లో విఖ్యాత బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన అత్యధిక సెంచరీల (49) రికార్డును అధిగమించడం అత్యంత కష్టమైన పని అని భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. 30వ సెంచరీతో రికీ పాంటింగ్ (ఆసీస్) రికార్డును సమం చేసిన ఈ భారత స్టార్ మాట్లాడుతూ ‘గ్రేట్ మ్యాన్ (సచిన్) రికార్డు అయ్యే పని కాదు. దాని కోసం శక్తికి మించి శ్రమించాలి. అందుకే దానిపై ఆలోచించడం లేదు. టీమ్ గెలిచేందుకు నేను అజేయంగా 90 పరుగులు చేసినా అదే అమూల్యమైందిగా భావిస్తాను’ అని అన్నాడు. 2019 ప్రపంచకప్‌పై: మెగా ఈవెంట్‌కు 20–25 మంది ప్లేయర్లను సన్నద్ధం చేస్తామని కోహ్లి అన్నాడు. వీరందరికీ ప్రపంచకప్ బరిలోకి దిగే సత్తా ఉండేలా తీర్చిదిద్దుతామన్నాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో కీలకమైన సిరీస్‌ల్లో కుర్రాళ్లకు అవకాశమిస్తామని... సుదీర్ఘమైన ఈ ప్రక్రియలో పారదర్శకతతో ఆటగాళ్లను ఎంపిక చేస్తామని చెప్పాడు. తద్వారా అత్యుత్తమ తుది జట్టు ప్రపంచకప్ ఆడుతుందన్నాడు. అత్యధిక రేటింగ్ పాయింట్లతో.... దుబాయ్: ఐసీసీ వన్డే క్రికెటర్ల ర్యాంకింగ్స్‌లో రెండు దశాబ్దాల క్రితం సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డును స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి సమం చేశాడు. తాజా ర్యాంకింగ్స్‌లో కోహ్లి నంబర్‌వన్ ర్యాంక్‌ను మరింత పటిష్టం చేసుకుంటూ అత్యధికంగా 887 పాయింట్లు సాధించాడు. దీంతో భారత క్రికెటర్లలో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన ఆటగాడిగా సచిన్ సరసన నిలిచాడు. 1998లో సచిన్ ఈ ఫీట్ సాధించి నంబర్‌వన్‌గా నిలిచాడు. -
జీల్, సచిన్‌లకు స్వర్ణాలు
కామన్వెల్త్ యూత్ గేమ్స్ నసావు (బహమాస్): పతకాల వేటను పసిడితో మొదలుపెట్టిన భారత క్రీడాకారులు స్వర్ణ పతకంతోనే ముగించారు. కామన్వెల్త్ యూత్ గేమ్స్‌లో మరోసారి సత్తా చాటుకున్నారు. బహమాస్‌లో ముగిసిన ఈ ఆరు రోజుల క్రీడల్లో భారత్ ఓవరాల్‌గా నాలుగు స్వర్ణాలు, రజతం, ఆరు కాంస్య పతకాలను సాధించి మొత్తం 11 పతకాలతో ఏడో స్థానంలో నిలిచింది. చివరిరోజు టెన్నిస్‌లో జీల్ దేశాయ్ బాలికల సింగిల్స్ విభాగంలో స్వర్ణం సాధించగా... బాలుర సింగిల్స్‌లో సిద్ధాంత్ బంతియా కాంస్య పతకాన్ని గెలిచాడు. మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్లో జీల్ దేశాయ్–సిద్ధాంత్ ద్వయం బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. సింగిల్స్ ఫైనల్లో జీల్ దేశాయ్ 6–3, 7–6తో ఎలీజా ఒమిరూ (సైప్రస్)ను ఓడించగా... మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో జీల్–సిద్ధాంత్ జంట 6–4, 6–3తో నియోస్–ఒమిరూ (సైప్రస్) జోడీపై గెలిచింది. కాంస్య పతక పోరులో సిద్ధాంత్ 6–2, 6–0తో నియోస్ (సైప్రస్)పై నెగ్గాడు. ఇక బాక్సింగ్‌లో సచిన్ సివాచ్ (49 కేజీలు) స్వర్ణం దక్కించుకోగా... మొహమ్మద్ ఎతాష్ ఖాన్ (56 కేజీలు) కాంస్యం... బాలికల ఈవెంట్లో జానీ (60 కేజీలు) రజతం, ఏక్తా (51 కేజీలు) కాంస్యం గెలిచారు. -
శ్రీవారి ఆలయంలో సచిన్
సాక్షి, తిరుమల: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సతీమణి అంజలితో కలసి ఉదయం నైవేద్య విరామ సమయంలో సచిన్ సంప్రదాయ దస్తులతో ఆలయానికి వచ్చారు. ముందుగా ధ్వజ స్తంభానికి మొక్కుకున్నారు. తర్వాత శ్రీవారిని, వకుళమాతను దర్శించుకున్నారు. తర్వాత హుండీలో కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు శ్రీవారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలు అందజేశారు. సచిన్ వెంట పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ కూడా ఉన్నారు. ఆలయం వెలుపల అభిమానులు సచిన్‌ను పలుకరించేందుకు పోటీ పడ్డారు. కొందరు సెల్ఫీలు తీసుకోవటం కనిపించింది. -
తిరుమలలో సచిన్
తిరుపతి అర్బన్: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ బుధవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. గురువారం వేకువజామున స్వామివారిని దర్శించుకోనున్నారు. సచిన్‌తో పాటు పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ కూడా తిరుమలకు చేరుకున్నారు. -
మాకు రవిశాస్త్రే కావాలి..
ముంబై: భారత జట్టు ఆటగాళ్లు ప్రధాన కోచ్ గా రవిశాస్త్రినే గట్టిగా కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆటగాళ్లు క్రికెట్ దిగ్గజం సచిన్ ముందు ఉంచడంతో రంగంలోకి దిగిన మాస్టర్ రవిశాస్త్రిని కోచ్ పదవి దరఖాస్తు చేయించాడనే ప్రచారం జరుగుతోంది. రవిశాస్త్రి 2014 నుంచి 2016 భారత జట్టుకు డైరెక్టర్ గా సేవలిందించాడు. ఈ సమయంలో రవిశాస్త్రితో ఆటగాళ్లకు సాన్నిహిత్యం ఏర్పడింది. దీంతోనే వారు రవిశాస్త్రిని కోచ్ గా కోరుకుంటున్నట్లు సమాచారం. రవిశాస్త్రి డైరెక్టర్ గా ఉన్నపుడు భారత జట్టు అద్భుతంగా రాణించింది. 2015 వరల్డ్ కప్ లో సెమీస్ చేరింది. 22 ఏళ్ల తర్వాత శ్రీలంకతో టెస్టు సిరీస్ నెగ్గింది. సౌతాఫ్రికాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ ను 3-0 తో కైవసం చేసుకుంది. రవిశాస్త్రి గత సంవత్సరం కూడా కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు కానీ గంగూలీ, సచిన్, లక్ష్మణ్ నేతృత్వంలోని సలహాదారుల కమిటీ కుంబ్లే వైపే మొగ్గు చూపింది. ఈ విషయంలో రవిశాస్త్రి గంగూలీ మధ్య అప్పట్లో మాటల యుద్దం బాహాటంగానే నడిచింది. తొలుత చాంపియన్స్ ట్రోఫీకి ముందు కోచ్ పదవికి దరఖాస్తుల ఆహ్వానించిన బీసీసీఐ కుంబ్లే రాజీనామా చేయడంతో ఆ గడవును జులై 9 కి పొడగించింది. ముందు కోచ్ పదవికి సుముఖత చూపని రవిశాస్త్రి సచిన్ సూచనతో దరఖాస్తు చేశాడని తెలుస్తోంది. బీసీసీఐ గడువు కూడా రవిశాస్త్రి కోసమే పెంచిందని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కోచ్ పదవికి రవిశాస్త్రితో పాటు వీరేంద్ర సెహ్వాగ్, టామ్ మూడీ, దొడ్డ గణేష్, రిచర్డ్ పైబస్, లాల్ చంద్ రాజ్ పుత్ లు దరఖాస్తు చేసుకున్నారు. జులై 10 న సలహాదారుల కమిటి ఇంటర్వ్యూలు చేయనుంది. ఆరోజే ఈ కోచ్ పదవి సందిగ్ద వీడనుంది. -
ఇదే నా బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్: సచిన్
ముంబై: తన కుమారడు అర్జున్ టెండూల్కర్ తయారు చేసిన బ్రేక్ ఫాస్ట్ ను చూసి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తెగి మురిసిపోతున్నాడు. అర్జున్ తయారు చేసిన బ్రేక్ ఫాస్ట్ ఎంతబాగుందో అంటూ అర్జున్‌ని పొగడ్తలతో ముంచుత్తుతున్నాడు. ఈ మేరకు అర్జున్ చేసిన బ్రేక్ ఫాస్ట్ ను బెడ్ పైనే ఉండి తింటుండగా తీసిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు సచిన్. 'మా అబ్బాయి తయారు చేసిన బ్రేక్ ఫాస్ట్ ఇది.. ఎప్పటికీ ఇదే నా బెస్ట్ బ్రేక్ ఫాస్ట్'అని సచిన్ క్యాప్షన్ జోడించాడు. తనదైనందిన విశేషాలను సోషల్ మీడియా ద్వారా పంచుకునే సచిన్.. తాజాగా కుమారుడు చేసిన బ్రేక్ ఫాస్ట్ ను సైతం ఫోటో తీసి అభిమానులతో పంచుకోవడం విశేషం. Breakfast in bed cooked by my son Arjun :-) best breakfast ever!!! A post shared by Sachin Tendulkar (@sachintendulkar) on Jul 2, 2017 at 2:29am PDT -
బీఎండబ్ల్యూ 5 సిరీస్ కొత్త వెర్షన్
ధర రూ.49.9 లక్షలు – రూ.61.3 లక్షలు ముంబై: లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం బీఎండబ్ల్యూ గురువారం భారత మార్కెట్లో మోడల్ 5 సిరీస్‌లో లేటెస్ట్ వెర్షన్ కారును ఆవిష్కరించింది. దీని ధర రూ. 49.9 లక్షలు–61.3 లక్షలు(ఎక్స్ షోరూం ముంబై). కొత్త మోడల్ డీజిల్, పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తుంది. 3 వేరియంట్స్‌లో లభించే డీజిల్ ఇంజిన్ కారు ధర రూ. 49.9 లక్షల నుంచి రూ. 61.3 లక్షల దాకా ఉండనుండగా, పెట్రోల్ వెర్షన్ రేటు రూ. 49.9 లక్షలుగా ఉంటుంది. డ్రైవర్ అసిస్టెన్స్, జెస్చర్ కంట్రోల్, రిమోట్ కంట్రోల్ పార్కింగ్ మొదలైన ఫీచర్స్ ఉంటాయి. అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్స్‌లో సిరీస్ 5 ఒకటని బీఎండబ్ల్యూ ఇండియా గ్రూప్ ప్రెసిడెంట్ విక్రమ్ పవా పేర్కొన్నారు. భారత్ విభాగం కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు మరో రూ. 130 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు. -
సలహాలకే పరిమితమా!
♦ బాధ్యత తీసుకోని సీఏసీ ♦ బాధ్యత తీసుకోని సీఏసీకోచ్, కెప్టెన్ల వివాదంలో ముగ్గురు దిగ్గజాల నిస్సహాయత సచిన్, గంగూలీ, లక్ష్మణ్... భారత క్రికెట్‌కు ఆటగాళ్లుగా ఎనలేని సేవలందించారు. వారి అనుభవాన్ని, ఆలోచనలను మరో రీతిలో వాడుకోవాలనే ఆలోచనతో బీసీసీఐ ప్రత్యేకంగా క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)ని ఏర్పాటు చేసింది. దాంతో పాటు కోచ్‌ను ఎంపిక చేసే పనిని కూడా వారి చేతుల్లోనే పెట్టింది. అయితే ఈ కమిటీ ఇచ్చిన సలహాలు ఏమిటి, అవి ఎంత వరకు భారత క్రికెట్‌కు మేలు చేశాయో కూడా స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. కానీ భారత కోచ్ ఎంపిక విషయంలో, కోచ్, కెప్టెన్ వివాదాన్ని పరిష్కరించే విషయంలో కూడా కమిటీ చురుగ్గా వ్యవహరించలేకపోయింది. ఈ దిగ్గజాలు మరింత బాధ్యతను తీసుకొని ఉంటే గొడవ ముదరకుండా ముగిసిపోయేదేమో! సాక్షి క్రీడా విభాగం గత ఏడాది భారత కోచ్‌గా అనిల్ కుంబ్లేను ఎంపిక చేసే విషయంలో క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) తమ పరిధికంటే మించి ఉత్సాహంగా పని చేసింది. ఎలాగైనా తమ మాజీ సహచరుడు కుంబ్లేను ఆ పదవిలో కూర్చోబెట్టేందుకు సచిన్, గంగూలీ, లక్ష్మణ్ తమ అధికారాన్ని గట్టిగా ఉపయోగించారు. ‘కనీసం జాతీయ జట్టుకు లేదా ఫస్ట్ క్లాస్ జట్టుకు కోచింగ్ ఇచ్చిన అనుభవం ఉండాలి’ అనేది కోచ్ పదవికి పోటీ పడేందుకు ఉంచిన నిబంధనల్లో ప్రధానమైంది. కానీ ఈ ముగ్గురు దానిని తోసిరాజన్నారు. నిబంధనల ప్రకారం కుంబ్లేకు అర్హత లేకపోయినా అతడికి అవకాశం కల్పించారు. ఈ క్రమంలో రవిశాస్త్రితో గొడవ పెట్టుకునేందుకు కూడా గంగూలీ సిద్ధమయ్యాడు. ఆ సమయంలో కమిటీ వ్యవహరించిన తీరు ఇది. అంటే నిబంధనలను ఉల్లంఘించవచ్చని తామే చేసి చూపించారు. పరిష్కరించే ప్రయత్నమేది? కోహ్లి, కుంబ్లే మధ్య చాలా రోజులుగా విభేదాలు సాగుతున్నాయనే విషయం చాంపియన్స్ ట్రోఫీకి ముందే మీడియాలో వచ్చింది. కానీ ఇలాంటి విషయాలు ఆ ముగ్గురికి అప్పటి వరకు తెలియదనుకోవాలా! తెలిసినా ఎందుకు మౌనం వహించారు. తాము ఏరికోరి ఎంపిక చేసిన కోచ్‌కు, కెప్టెన్‌కు పడటం లేదంటే కలగజేసుకొని సరిదిద్దే ప్రయత్నం కూడా వారు చేయలేదు. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు, చాంపియన్స్ ట్రోఫీకి మధ్య దాదాపు రెండు నెలల విరామం ఉంది. ఆ సమయంలో దీనికి ఏదైనా పరిష్కారం వెతికే ప్రయత్నం కూడా జరగలేదు. అది మా పని కాదని వారు చెప్పడానికి వీలులేదు. భారత క్రికెట్లో దిగ్గజాలుగా గుర్తింపు తెచ్చుకున్న వీరినుంచి బీసీసీఐ కేవలం సలహాలకంటే ఎక్కువే ఆశించడం సహజం. తాము కోచ్‌ను ఎంపిక చేయడంతోనే పని ముగిసిపోయిందని ఈ ముగ్గురు భావించారా? నిజానికి సచిన్ స్థాయి వ్యక్తి పూనుకుంటే ఆరంభంలో కచ్చితంగా ఎంతో కొంత మెరుగైన ఫలితం వచ్చేది. అతని మాటను కుంబ్లే గౌరవించకపోయేవాడా? లేక గురుభావంతోనైనా కోహ్లి కాదనేవాడా? ఇప్పుడేం చేస్తారు? పరిస్థితి చేయి దాటిపోయిందని తెలిసిన తర్వాత కూడా ఈ ముగ్గురు కుంబ్లేనే కోచ్‌గా కొనసాగించమంటూ సిఫారసు చేశారు. కోహ్లి అసలు దానిని లెక్క చేయకపోవడం ఈ కమిటీ వైఫల్యం కిందనే లెక్క. కుంబ్లే హుందాగా తప్పుకున్నాడు కాబట్టి వివాదం సద్దుమణిగింది. కమిటీ చెప్పింది కాబట్టి తాను కొనసాగుతానంటే పరిస్థితి ఎలా ఉండేదో! మరో సారి కొత్త కోచ్ ఎంపిక కూడా ఈ త్రిసభ్య కమిటీ చేతికే వచ్చింది. మేం కోచ్ ఎంపికలో జోక్యం చేసుకోమని పరిపాలకుల కమిటీ (సీఓఏ) ఇప్పటికే స్పష్టం చేసింది కాబట్టి పూర్తి బాధ్యత మళ్లీ కమిటీదే. తాము ఎంపిక చేసిన వ్యక్తి ఏడాది కాలానికే తప్పుకున్న నేపథ్యంలో ఈసారి కమిటీపై బాధ్యత మరింత పెరిగింది. భారత క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ముందు చూపుతో కోచ్‌ను ఎంపిక చేయాల్సి ఉంది. సొంత ఇష్టా ఇష్టాలను పట్టించుకోకుండా ఈసారి తమ క్రికెట్ పరిజ్ఞానం, అనుభవం, వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కోచ్‌ను ఎంపిక చేయడం అవసరం. అదే విధంగా తాజా పరిణామాల కారణంగా కోహ్లితో కూడా ముందుగా మాట్లాడతారా అనేది ఆసక్తికరం. నిజంగానే అదే జరిగి కోహ్లి చెప్పిన పేరుకే ఆమోద ముద్ర వేస్తే మాత్రం ఏ మాత్రం బాధ్యతలు పట్టని, కోరలు లేని ఈ కమిటీ ఉండటం కూడా అనవసరం! ఆరు నెలలుగా మాటల్లేవ్! బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం... ఏడాది పదవీ కాలంలో గత ఆరు నెలల నుంచి కెప్టెన్, కోచ్ అసలు మాట్లాడుకోవడం లేదట. ఇంగ్లండ్‌తో సిరీస్ ముగిసిన నాటినుంచి వీరిద్దరు ఎడమొహం, పెడమొహంగానే ఉంటున్నట్లు సమాచారం. మరి కీలకమైన ఆస్ట్రేలియా సిరీస్ కూడా అలాగే సాగిపోయిందంటే బోర్డు పెద్దలు ఏం చేస్తున్నారనేది ప్రశ్న. ‘వీరిద్దరు ఆరు నెలల్లో ఒకే ఒక్కసారి ఇటీవల చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ముగిసిన తర్వాత ఎదురెదురుగా కూర్చున్నారు. అప్పుడు కూడా వారిద్దరు ఏం మాట్లాడుకోలేదు. ఇక మైత్రి కొనసాగదని వారిద్దరికి అర్థమైపోయింది’ అని బోర్డు అధికారి వ్యాఖ్యానించారు. ఫైనల్లో పాక్ చేతిలో ఓటమి తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లపై కుంబ్లే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా తెలిసింది. దాంతో చిర్రెత్తిన క్రికెటర్లు కుంబ్లేపై మరింత వ్యతిరేకతను పెంచుకున్నారు. ఇదే విషయాన్ని వారు కోహ్లికి కూడా ఫిర్యాదు చేయడంతో వివాదం మరింత ముదిరింది. అంతకు ముందు కూడా కోచ్ గురించి ఆటగాళ్ల లెక్కలేనితనం బయటపడింది. చాంపియన్స్ ట్రోఫీ వార్మప్ మ్యాచ్ తర్వాత ఆటగాళ్ల తప్పొప్పులను గుర్తించేందుకు కుంబ్లే వీడియో అనలిస్ట్‌తో సుదీర్ఘంగా కూర్చున్నారు. ఒక్కొక్కరి వీడియో క్లిప్‌లను తీసుకొని లోపాలు ఎలా సరిదిద్దుకోవాలో కూడా వివరిస్తూ కుంబ్లే నోట్స్ రాశారు. అదే రోజు రాత్రి వీడియో, నోట్స్‌ను ఒక్కో ఆటగాడికి పంపించారు. కానీ రెండు రోజుల తర్వాత చూస్తే జట్టులో ఏ ఒక్కరు కుంబ్లే వీడియోను చూడలేదు. అతనిచ్చిన నోట్స్‌ను కూడా కనీసం చదవలేదు! కుంబ్లే తాను తప్పుకోవడం అవసరమనే నిర్ణయం తీసుకునేందుకు ఇది సరిపోయింది. -
ఆ రికార్డు సచిన్ తర్వాత యువరాజ్‌దే..
లండన్: చాంపియన్స్ట్రోఫిలో భారత్-పాక్ మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత ఘన విజయంలో కీలక పాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న యువరాజ్ సింగ్ ఓ అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. ఇప్పటికే ఈ మ్యాచ్‌తో భారత్ తరపున అత్యధిక ఐసీసీ టోర్నిలు ఆడిన తొలి ప్లేయర్‌గా నిలిచిన యువీ, అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు అందుకున్న భారత ఆటగాళ్లలో రెండో ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఐసీసీ టోర్నిల్లో భారత్ తరుపున అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు అందుకున్నరికార్డు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉండగా ఆ తరువాతి స్థానంలో యువీ నిలిచాడు. సచిన్ 10 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు అందుకోగా యువీ నిన్నటి దానితో కలిపి 9 అందుకున్నాడు. ఈ సందర్భంగా భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైప్ యువీకి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు. ఇక ఐసీసీ టోర్నిల్లో అత్యధికంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు వెస్టిండీస్ ప్లేయర్ క్రిస్‌గేల్ (11) అందుకొని అగ్రస్థానంలో ఉండగా, ఆ తరువాతి స్థానంలో సచిన్, యువరాజ్లున్నారు. ICC tournaments get the best out of @YUVSTRONG12 . His 9th Man of the Match, only second to Sachin Paaji's 10 . A real champ.#IndvsPak — Mohammad Kaif (@MohammadKaif) 5 June 2017 -
అభిమాని కోసం సచిన్ లేఖ
లండన్: భారత్ ఆడే ప్రతి క్రికెట్ మ్యాచ్‌కు చేతిలో త్రివర్ణ పతాకాన్ని, ముఖంపై సచిన్ అని రాసుకొని అలరించే ఓ వ్యక్తి కనపిస్తూ ఉంటాడు. అతడే సచిన్ వీరాభిమాని సుధీర్ కుమార్ చౌదరి. సచిన్ రిటైర్మెంట్ అనంతరం కూడా సుధీర్ భారత్ ఆడే మ్యాచ్‌ల్లో పాల్గొని ఆటగాళ్లను, అభిమానులను ఉత్సహపరుస్తూనే ఉన్నాడు. చాంపియన్స్ ట్రోఫి కోసం భారత్ జట్టు ఇంగ్లండ్ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే భారత జట్టుతో కలిసి సుధీర్ అక్కడికి వెళ్లేందుకు దరఖాస్తు చేసుకోగా అతనికి వీసా రాలేదు. దీంతో భారత్- న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్‌కు సుధీర్ హాజరు కాలేకపోయాడు. తన వీరాభిమానికి వీసా దక్కలేదన్న విషయం తెలుసుకున్న సచిన్ స్పందించాడు. సుధీర్‌కు వీసా ఇవ్వాలని కోరుతూ లేఖ రాశాడు. సుధీర్ గొప్ప మద్దతుదారుడని, ఎలాంటి సహాయం లేకుండా ఎవరు అతనిలా మద్దతు తెలుపుతారని, సొంత ఖర్చులతో భారత జట్టుకు మద్దతు తెలిపాడని, అతను ఇంగ్లండ్ వెళ్లేందుకు వీసా మంజూరు చేస్తారని ఆశిస్తున్నట్లు సచిన్ లేఖలో పేర్కొన్నాడు. భారత ఆటగాళ్లతో సుధీర్ సచిన్ ఏబిలియన్ డ్రీమ్స్ ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన విషయం తెలిసిందే. -
థ్రిల్ ఆఫ్ లైఫ్
మీకు నచ్చింది చేస్తున్నప్పుడు మీరు చేస్తున్నది అందరికీ నచ్చుతుంది! మన పిల్లలకు కూడా మనం ఇదే చెప్పాలేమో. మనకు నచ్చింది వాళ్లతో చేయించడం కంటే... వాళ్ల అభిరుచిని అర్థం చేసుకుని ప్రోత్సహించాలేమో..! ఎవరైనా అనుకున్నారా.. ఒకరోజు మనం పక్షిలా ఎగరగలమని! ఎవరైనా అనుకున్నారా..ఒకరోజు మనం చంద్రుడిపై కాలు పెట్టగలమని! సచిన్ లైఫ్ లోని థ్రిల్‌ని చూస్తే ఇదే అనిపిస్తోంది. సచిన్ అసాధ్యాలను సుసాధ్యం చేసుకున్నాడు. మన పిల్లలు కనవలసిన బిలియన్ డ్రీమ్స్‌కి స్ఫూర్తిని ఇచ్చాడు. విఖ్యాత సంగీత దర్శకుడు ఎస్డీ బర్మన్పై అభిమానంతో తల్లిదండ్రులు సచిన్ అని పేరు పెట్టారు. ప్రొఫెసర్‌గా పని చేసిన తండ్రి రమేశ్ టెండూల్కర్ ప్రఖ్యాత మరాఠీ రచయిత కూడా. సచిన్‌కు ఇద్దరు సోదరులు నితిన్, అజిత్, సోదరి సవిత ఉన్నారు. వీరిద్దరు రమేశ్ తొలి భార్య సంతానం కాగా, తల్లి రజనికి సచిన్ ఒక్కడే. ఈ విషయాన్ని సచిన్ తన సొంత ఆటోబయోగ్రఫీలో కూడా ప్రస్తావించలేదు. చిన్నప్పుడు టెన్నిస్ స్టార్ జాన్ మెకన్రోను విపరీతంగా అభిమానించిన సచిన్ అతనిలాగే రింగుల జుట్టు పెంచుకొని హెడ్ బ్యాండ్‌తో కనిపించేవాడు. కిషోర్ కుమార్, లతా మంగేష్కర్ పాటలను సచిన్ అమితంగా ప్రేమిస్తాడు. వేసవి సెలవుల్లో ఓ సాయంత్రం దూరదర్శన్ గైడ్ సినిమా ప్రసారమవుతున్న సమయంలో చెట్టుపైనుంచి పక్కింట్లో చూడబోయే ప్రయత్నంలో సచిన్ కింద పడ్డాడు. దాంతో అతని అన్న అజిత్ పనిష్మెంట్ కింద క్రికెట్ కోచింగ్ క్లాస్‌లకు తీసుకెళ్లాడు. మొదటిసారి గురువు రమాకాంత్ అచ్రేకర్ ముందు వెళ్లినప్పుడు ఆయన ముందు భయంతో సరిగా బ్యాట్ కూడా పట్టలేకపోయాడు. అయితే సచిన్‌లో మంచి ప్రతిభ ఉందని, ఎదురుగా నిలబడకుండా మరో అవకాశం ఇవ్వమని అజిత్ కోరాడు. దాంతో సచిన్‌ను ఆడమని చెప్పిన అచ్రేకర్ చెట్టు చాటునుంచి పరీక్షించారు. అంతే... ఆ అద్భుతాన్ని చూసిన తర్వాత తన అకాడమీలోకి తీసుకోవడం, చరిత్ర సృష్టించేందుకు అడుగులు పడటం అక్కడే జరిగిపోయాయి. సచిన్ అక్కడ సుదీర్ఘంగా సాధన చేసేవాడు. కుర్రాడిని ఉత్సాహపరిచేందుకు కోచ్ స్టంప్స్‌పై ఒక రూపాయి నాణాన్ని ఉంచేవారు. సెషన్ మొత్తం అవుట్ కాకుండా ఉంటే అది సచిన్‌కు, ఎవరైనా అతడిని అవుట్ చేస్తే అది వారికి దక్కుతుంది. ఈ రకంగా ఎన్నో సెషన్లలో అసలు అవుట్ కాకుండా ఆడిన సచిన్ వద్ద ఆ రూపాయి నాణాలు ఎన్నో భద్రపరిచి ఉన్నాయి. అవన్నీ తన అపురూపమైన కానుకలని అతను అంటాడు. శారదాశ్రమ్ విద్యా మందిర్ స్కూల్ తరఫున సచిన్, వినోద్ కాంబ్లీ కలిసి స్కూల్ క్రికెట్లో ప్రపంచ రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హారిస్ షీల్డ్ ట్రోఫీ సెమీ ఫైనల్లో సెయింట్ జేవియర్ స్కూల్‌పై వీరిద్దరు ఏకంగా 664 పరుగులు జోడించారు. ఇందులో సచిన్ 326 పరుగులు, కాంబ్లీ 349 పరుగులు చేశారు. జట్టు అసిస్టెంట్ కోచ్ లక్ష్మణ్ చౌహాన్ ఇక చాలు డిక్లేర్ చేయమని ఎన్ని సందేశాలు పంపించినా... వీరిద్దరు పట్టించుకోకుండా తమ జోరును కొనసాగించారు. ఆ తర్వాత అచ్రేకర్ సర్ తిట్లు తినాల్సి వచ్చింది. ఏ స్థాయికి చేరినా తన మూలాలు మరచిపోని సచిన్, నాలుగు నెలల సుదీర్ఘ పర్యటన తర్వాత 1992 వరల్డ్ కప్‌నుంచి తిరిగొచ్చాక స్థానిక లీగ్‌లలో కీర్తి కాలేజ్ తరఫున ఆడాడు. ప్రేమ... సచిన్‌కంటే అతని భార్య అంజలి వయసులో ఐదేళ్లు పెద్ద. చిన్న పిల్లల వైద్యురాలు. టీనేజర్‌గానే సచిన్, అంజలిపై మనసు పారేసుకున్నాడు. తొలిసారి 1990 న్యూజిలాండ్ పర్యటనకు వెళుతున్న సమయంలో సచిన్‌ను ఎయిర్‌పోర్ట్‌లో అంజలి కలిసింది. జర్నలిస్ట్‌గా తనను తాను పరిచయం చేసుకొని నేరుగా అతని ఇంటికే వచ్చి కలిసే ప్రయత్నం కూడా చేసింది. ఆ తర్వాత ఆ ప్రేమ అలాగే పెరిగింది. మూడేళ్ల స్నేహం తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో సచిన్ వయసు 22 ఏళ్లు మాత్రమే. సాధారణంగా బయట ఏ కెరీర్ చూసుకున్నా ఇంత చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడం అరుదు. కానీ అంతర్జాతీయ క్రికెటర్‌కు కుటుంబం అవసరం ఎక్కువగా ఉందని భావించిన సచిన్ 1995లో అంజలిని వివాహమాడాడు. సచిన్ విషయంలో కూడా అప్పట్లో అనేక గాసిప్స్ వినిపించాయి. ముఖ్యంగా నాటి బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్‌తో ప్రేమ వ్యవహారం అంటూ టెండూల్కర్, శిరోద్కర్ కులాలు కూడా ఒక్కటే... సమస్య లేదు, ఇక పెళ్లే తరువాయి అంటూ కథనాలు ఇచ్చాయి. అయితే సచిన్ తాను అనుకున్నట్లుగా పెళ్లి చేసుకొని వాటన్నింటికీ ఫుల్స్టాప్ పెట్టేశాడు. సచిన్ పెళ్లి లైవ్ కవరేజి కోసం ఒక ఛానల్ భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినా అతను తిరస్కరించాడు. 1987 ప్రపంచకప్‌లో భాగంగా భారత్, జింబాబ్వే మధ్య వాంఖెడేలో జరిగిన మ్యాచ్‌లో సచిన్ బాల్ బాయ్‌గా పని చేశాడు. తర్వాతి ఏడాది బ్రబోర్న్ స్టేడియంలో పాకిస్తాన్ జట్టు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడగా, ఆ టీమ్ తరఫున సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగడం విశేషం. సునీల్ గావస్కర్ బహుమతిగా ఇచ్చిన ప్యాడ్స్ కట్టుకొని అతను తన తొలి టెస్టు (కరాచీ)లో బరిలోకి దిగాడు. ఎడమ కాలికి ముందుగా ప్యాడ్ కట్టుకునే సెంటిమెంట్ అతడికి ఉంది. ముంబై సహచరుడు ప్రవీణ్ ఆమ్రే తొలి సారి సచిన్‌కు అంతర్జాతీయ క్రికెటర్లు ధరించే బ్రాండింగ్ షూస్‌ను కానుకగా ఇచ్చాడు. సచిన్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఆమ్రే కొత్త అడిడాస్ స్పైక్స్ తీసుకొని అక్కడికి వచ్చాడు. అవి సచిన్‌ను బాగా ఆకర్షించడంతో పదే పదే ఆమ్రేను వాటి గురించి అడిగాడు. దాంతో ఆమ్రే నువ్వు సెంచరీ కొడితే చాలు షూస్ నీవే అన్నాడు. అంతే...తర్వాతి వారమే స్కూల్ క్రికెట్లో సచిన్ శతకం మోత మోగింది. సచిన్ తన కెరీర్ చివర్లో అడిడాస్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం విశేషం. కెరీర్లో పెద్ద సంఖ్యలో ప్రకటనలకు ప్రచారకర్తగా కోట్లాది రూపాయలు ఆర్జించిన సచిన్ తొలి ప్రకటన బ్యాండ్ – ఎయిడ్. తనతో ఆడుతూ గాయపడిన ఫీల్డర్ వేలికి అతను బ్యాండ్ ఎయిడ్‌తో చికిత్స చేస్తాడు. 1996 ప్రపంచకప్‌లో పరుగుల వరద పారించిన సమయంలో సచిన్ బ్యాట్‌కు స్పాన్సర్ ఎవరూ లేరు. ఆ తర్వాత అతనితో జత కట్టిన ఎంఆర్ఎఫ్ సుదీర్ఘ కాలం ఆ అనుబంధాన్ని కొనసాగించింది. ప్రకటనల విషయంలో కూడా సచిన్ ఆటను ఏ మాత్రం తక్కువ చేయడానికి ఇష్టపడడు. ఒక సారి పెప్సీ యాడ్‌లో అతను బంతిని ఫ్లై స్వాటర్ (దోమలను కొట్టే పరికరం)తో కొట్టే విధంగా రూపొందించారు. అది క్రికెట్ విలువను తగ్గించినట్లే అని చెప్పడంతో రూపకర్త ప్రహ్లాద్ కక్కడ్ చివరకు స్టంప్స్‌తో బంతిని కొట్టే విధంగా మార్చారు. 1999 వరల్డ్ కప్ జరుగుతున్న సమయంలో సచిన్ తండ్రి రమేశ్ కన్నుమూశారు. హుటాహుటిన ఇంగ్లండ్‌నుంచి తిరిగొచ్చిన సచిన్ కార్యక్రమాలు పూర్తి చేసి మళ్లీ వచ్చి జట్టుతో చేరాడు. కీలకమైన మ్యాచ్‌లో కెన్యాపై సెంచరీ సాధించి భారత్‌ను గెలిపించాడు. అప్పటినుంచి అతను తాను చేసి ప్రతీ సెంచరీకి ఆకాశం వైపు చూసి తండ్రిని గుర్తు చేసుకోవడం అలవాటుగా మార్చుకున్నాడు. 1988లో సచిన్ తొలి సారి రంజీ ట్రోఫీకి ఎంపికయ్యాడు. అంతకు కొద్ది రోజుల ముందు అతను ఒక మ్యాచ్‌లో అతను మరో ఆటగాడు సాయిరాజ్ బహుతులే (భారత్ తరఫున 2 టెస్టులు, 8 వన్డేలు ఆడాడు) బ్యాట్‌తో బరిలోకి దిగి మంచి స్కోర్ సాధించాడు. దాంతో సెంటిమెంట్‌గా మరో ఫ్రెండ్‌కు చెప్పి అదే బ్యాట్ తెప్పించమని కోరాడు. అదే బ్యాట్‌తో గుజరాత్‌తో తొలి మ్యాచ్‌లోనే సెంచరీ బాదడంతో చరిత్రకు తొలి అడుగు పడింది. బ్యాట్లను కానుకలుగా ఇచ్చే అలవాటు సచిన్‌కు కూడా ఉంది. 1989లో సచిన్ ఆడిన తొలి టెస్టు పాక్ దిగ్గజ పేస్ బౌలర్ వకార్ యూనిస్‌కు కూడా మొదటి టెస్టే. ఈ సిరీస్ చివరి టెస్టులో వకార్ బౌలింగ్‌లో ముక్కుకు గాయమై రక్తం కారినా కూడా ఇన్నింగ్స్ కొనసాగించి సచిన్ అర్ధసెంచరీ చేశాడు. ఆ తర్వాత వకార్‌తో మంచి స్నేహం కుదిరింది. ఒక సారి సచిన్ తన బ్యాట్‌ను అభిమానంతో వకార్‌కు కానుకగా ఇచ్చాడు. కొన్నాళ్లకు షాహిద్ ఆఫ్రిది ఇదే బ్యాట్‌తో 37 బంతుల్లో ప్రపంచరికార్డు సెంచరీ సాధించాడు. అంటే పరోక్షంగా ఆ రికార్డులో సచిన్‌దే పాత్ర ఉంది. సచిన్ ఆరంభంలో తాను ఫాస్ట్ బౌలర్‌ను కావాలని కోరుకున్నాడు. మద్రాస్‌లోని ఎంఆర్ఎఫ్ పేస్ అకాడమీ సెలక్షన్స్‌కు కూడా అతను హాజరయ్యాడు. అయితే అక్కడి డైరెక్టర్, దిగ్గజ బౌలర్ డెన్నిస్ లిల్లీ నువ్వు బౌలింగ్‌కు పనికి రావని తేల్చేశాడు. బ్యాటింగ్‌పై దృష్టి పెడితే మంచిదని మందలించి వెనక్కి పంపించాడు. ఆ రోజు అలా జరగకబోతే క్రికెట్ ప్రపంచం వేల కొద్దీ పరుగులను చూసి ఉండకపోయేదేమో. ►సచిన్ బ్యాటింగ్‌లో రైట్ హ్యాండరే అయినా... తినడం, ఆటోగ్రాఫ్ ఇవ్వడం అంతా ఎడమ చేత్తోనే చేస్తాడు. ►తన తొలి రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ మ్యాచ్‌లలో సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్ సచిన్. ►భారతరత్న కూడా అయిన సచిన్‌కు ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో గ్రూప్ కెప్టెన్ ర్యాంక్ ఉంది. మూవీ రివ్యూ సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్ సచిన్ అంటే క్రికెట్ ఒక్కటే కాదు... అతని జీవితంలోనూ అందరిలాగే అమ్మా నాన్నల ఆప్యాయత ఉంది...అండగా నిలిచిన అన్న ఉన్నాడు... అడుగులో అడుగు వేసి నడిచిన అంజలి ఉంది. అందులో అందరికీ తెలిసిందే కొంతే. కొడుకుగా, భర్తగా, నాన్నగా మనం చూడని సచిన్‌ను అతను కొత్తగా వెండి తెరపై ‘సచిన్– ఎ బిలియన్ డ్రీమ్స్’ పేరుతో తనను తను ఆవిష్కరించుకున్నాడు. ఈ చిత్రం నిన్న శుక్రవారం విడుదలైంది. సచిన్ అభిమానులను ఆకట్టుకుంటోంది. సమ్‌థింగ్ స్పెషల్ ‘సచిన్ – ఎ బిలియన్ డ్రీమ్స్’ అనేది పూర్తి స్థాయి ఫీచర్ ఫిల్మ్ కాదు. డాక్యుమెంటరీ కమ్ మూవీ. ధోని, అజహర్, మిల్కా సింగ్‌ల తరహాలో మరొకరు సచిన్ పాత్రను పోషిస్తూ సన్నివేషాలను షూట్ చేయలేదు. ఇందులో సచిన్ మాత్రమే కనిపిస్తాడు. వినిపిస్తాడు. తన చిన్ననాటి అల్లరి, ఆట పాటల మొదలు దిగ్గజంగా ఎదిగే వరకు వేర్వేరు దశల్లో సచిన్ తన గురించి తాను చెప్పుకుంటాడు. మధ్యలో గొప్ప మ్యాచ్‌లు, విజయాలు, పరాజయాలు, వివాదాలు.... ఇలా అన్నీ రియల్స్ విజువల్స్ చూపిస్తూ మనల్ని మరోసారి పాత రోజుల్లోకి ఈ సినిమా తీసుకెళుతుంది. దాదాపు 10 వేల గంటల వ్యవధి గల సచిన్ వీడియోలను తీసుకొని వాటిని సందర్భానుసారం ఈ సినిమాలో వాడుకున్నారు. అలాగే తనకు మాత్రమే పరిమైతమైన కొన్ని అరుదైన ఫ్యామిలీ వీడియోలు కూడా సచిన్ మనకు చూపించాడు. – మొహమ్మద్ అబ్దుల్ హాది, సాక్షి క్రీడా ప్రతినిధి -
టెస్టు చరిత్రలో స్పెషల్ రికార్డు
హైదరాబాద్: టెస్టు మ్యాచ్ ఒక ఇన్నింగ్స్ లో నలుగురు సెంచరీలు చేయడమే అరుదు. అటువంటిది వరుసగా నలుగురు ఆటగాళ్ల శతకాలతో ప్రత్యర్థిపై ముప్పేట దాడి చేస్తే ఎలా ఉంటుంది. 2007లో మే 25 నుంచి 27వ తేదీ వరకూ బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు వరుస నాలుగు సెంచరీల నమోదు చేసి తొలిసారి కొత్త చరిత్ర సృష్టించింది. దాదాపు 10 ఏళ్ల క్రితం భారత జట్టు రికార్డును నమోదు చేసిన సందర్భంగా ఆ మ్యాచ్‌ను మరొకసారి జ్ఞప్తికి తెచ్చుకుందాం. బంగ్లాదేశ్‌లోని మిర్పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఓపెనర్లు దినేష్ కార్తీక్(129), వసీం జాఫర్(138) శతకాలతో మెరవగా, ఆ పై వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ ద్రావిడ్(129) సెకండ్ డౌన్ బ్యాట్స్‌మన్ సచిన్(122)లు సెంచరీలతో చెలరేగిపోయారు. ఈ మ్యాచ్ లో మరో విశేషమేమిటంటే... 175 పరుగుల వద్ద కార్తీక్ గాయంతో రిటైర్డ్ అవుట్‌గా మైదానం వీడగా క్రీజులో ఉన్న జాఫర్ ద్రావిడ్‌తో ఆడుతూ సెంచరీ సాధించాడు. అనంతరం కొద్దిసేపటికి జాఫర్ కూడా గాయంతో రిటైర్ట్ అవుట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ వికెట్ కోల్పోకుండా 281 పరుగులు చేసింది. తర్వాత సచిన్, ద్రావిడ్‌లు సెంచరీలతో కదం తొక్కడంతో భారత్ తొలివికెట్ కు 408 పరుగులు చేసింది. ద్రావిడ్ అవుటవ్వడంతో వినూమన్కడ్-పంకజ్ రాయ్ పేరిట ఉన్న 413 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్య రికార్డును 5 పరుగుల దూరంలో చేజార్చుకుంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కార్తీక్ సెంచరీ చేయడంతో నలుగురు ఆటగాళ్లు సెంచరీలు చేసిన రికార్డు నమోదు అయింది. ఈమ్యాచ్ లో భారత్ ఇన్నింగ్స్, 239 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. టెస్టుల్లో ఇషాంత్ శర్మకు తొలి మ్యాచ్ కావడం మరో విశేషం. -
హీరో సచిన్‌తో రిపోర్టర్ రకుల్
రకుల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వడం బాగా అలవాటు. కానీ, ఇంటర్వ్యూ చేయడమనేది అస్సలు అలవాటు లేని కొత్త పాత్రే. యాక్టర్స్ పనేంటి? అలవాటు లేని పాత్రలను అవలీలగా చేసుకుంటూ వెళ్లడమే కదా! అలా బోలెడుఇంటర్వ్యూ లు ఇచ్చిన ఎక్స్‌పీరియన్స్‌తో ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్నుఇంటర్వ్యూ చేశారీ బ్యూటీ. అసలే సచిన్ అంటే ఆమెకు బోల్డంత అభిమానమేమో... సచిన్ లైఫ్ గురించి ఎవ్వరికీ తెలియని విషయాలను రాబట్టే ప్రయత్నం చేశారు. భలే భలే ప్రశ్నలు అడిగారు. ఇదంతా ఎందుకు? అంటే... సచిన్ జీవితకథతో ‘సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్’ అనే సినిమా రూపొందింది కదా! ఈ నెల 26న విడుదలవుతోన్న ఆ సినిమా కోసం రియల్ లైఫ్ అండ్ రీల్ లైఫ్ హీరో సచిన్‌ను ఇంటర్వ్యూ చేశానని ట్వీట్ చేశారామె. రకుల్ రిపోర్టర్‌గా మారి, ఇంటర్వ్యూ చేయడం ఇది రెండోసారి. ‘సాక్షి’ పత్రిక కోసం గతంలో ఆమె(రకుల్)ను, ఆమె (ప్రీత్)ఇంటర్వ్యూ చేసుకున్నారు. -
సచిన్, ధోనిలకు నో ప్లేస్..
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ బౌలర్ అజిత్ అగార్కర్ ప్రకటించిన ఆల్ టైమ్ ఐపీఎల్ ఎలెవన్ జట్టులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తో పాటు మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనిలకు చోటు దక్కలేదు. ఇదిలా ఉంచితే అజిత్ అగార్కర్ విడుదల చేసిన ఐపీఎల్ జట్టులో ఓపెనర్ గా వీరేంద్ర సెహ్వాగ్ కు స్థానం దక్కింది. అయితే అతనితో కలిసి ఓపెనింగ్ చేసే బాధ్యతను క్రిస్ గేల్ కు కట్టబెట్టాడు అగార్కర్. మరొకవైపు మిడిల్ ఆర్డర్ లో రోహిత్ శర్మ, సురేష్ రైనా,విరాట్ కోహ్లి, డివిలియర్స్ లకు చోటు కల్పించగా, ఆల్ రౌండర్లగా హర్భజన్ సింగ్, సునీల్ నరైన్ లను ఎంపిక చేశాడు. ఇక బౌలింగ్ విషయానికొస్తే లసిత్ మలింగా, జస్ప్రిత్ బూమ్రా, ఆశిష్ నెహ్రాలను అగార్కర్ తన ఆల్ టైమ్ ఐపీఎల్ జట్టులో ఎంపిక చేశాడు. అగార్కర్ జట్టు ఇదే: విరాట్ కోహ్లి(కెప్టెన్), క్రిస్ గేల్, వీరేంద్ర సెహ్వాగ్, సురేశ్ రైనా, రోహిత్ శర్మ, ఏబీ డివిలియర్స్(వికెట్ కీపర్), లసిత్ మలింగా, బూమ్రా, ఆశిష్ నెహ్రా, సునీల్ నరైన్, హర్భజన్ సింగ్ -
ప్రధానితో ‘సచిన్’ సినిమా విశేషాలు
న్యూఢిల్లీ: ఈనెల 26న విడుదల కానున్న ‘సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్’కు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాల్లో భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బిజీగా గడుపుతున్నారు. దీంట్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్న ఆయన తన జీవిత చరిత్రపై వస్తున్న సినిమా గురించి వివరించారు. ‘ప్రధానిని కలుసుకుని సినిమా గురించి తెలపడం సంతోషంగా ఉంది. ఆయన చాలా సానుకూలంగా స్పందించారు. వచ్చే తరానికి ఈ సినిమా ప్రేరణగా నిలవడమే కాకుండా కెరీర్లో నా ఒడిదుడుకుల గురించి కూడా తెలుసుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు. దీనివల్ల సవాళ్లనేవి ఎక్కడైనా ఉంటాయని, వాటికి లొంగకుండా పైకి ఎదిగేందుకు ప్రయత్నించాలనే సందేశం ఇందులో ఉందని అన్నారు. ఈ సందర్భంగా నా గురించి ప్రత్యేకంగా ‘జో ఖేలే.. వహీ ఖిలే’ అని రాశారు. ఓ క్రీడాకారుడికి ఇది చాలా ఉత్తేజాన్నిచ్చే సందేశం. ఇది నిజంగా నా హృదయాన్ని తాకింది’ అని సచిన్ వివరించారు. మరోవైపు సచిన్‌తో జరిగిన భేటిని ప్రధాని మోదీ ట్వీటర్ ద్వారా తెలిపారు. ‘సచిన్ జీవనయానం, సాధించిన విజయాలు ప్రతీ భారతీయుడు గర్వించేలా.. స్ఫూర్తి పొందేలా ఉన్నాయి’ అని ట్వీట్ చేశారు. -
గెలిపించని శతకాలు ఇవే..
హైదరాబాద్: ఐపీఎల్ అంటేనే బౌండరీల మోత. తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయడమే బ్యాట్సమన్ ప్రధాన లక్ష్యం. ఇలాంటి లీగ్ లో ఇక సెంచరీ బాదెస్తే మ్యాచ్ గెలవడం ఎంతో సులభం. కానీ పూర్తిగా బ్యాటింగ్ మద్దతుగా ఉండే ఈ పొట్టి క్రికెట్ లీగ్ లో కొందరు క్రికెటర్లు సెంచరీలు బాదినా మ్యాచ్ లు గెలిపించలేకపోయారు. ఇలా ఐపీఎల్ చరిత్రలో సెంచరీలు బాది జట్టును గెలిపించ లేక పోయినా ఆటగాళ్లపై ఓ లుక్కెద్దాం. హషీమ్ ఆమ్లా, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (2017) ఆమ్లా ఈ సీజన్ లో రెండు సెంచరీలు బాదాడు. కానీ రెండు మ్యాచుల్లో పంజాబ్ ఓడడం గమనార్హం. ముంబై ఇండియన్స్ పై 60 బంతుల్లో 104 పరుగులతో తొలి సెంచరీ నమోదు చేశాడు. ఈ సెంచరీ తో పంజాబ్ ముంబై కి 198 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఇక గెలుపు కాయం అనుకున్న సందర్భంలో ముంబై కేవలం 15 ఓవర్లలోనే లక్ష్యాన్ని సునాయసంగా చేదించింది. ఆమ్లా సెంచరీ వృధా అయింది. ఇక మరో సెంచరీ గుజరాత్ లయన్స్ పై మరో సారి 104 పరుగలే నమోదు చేశాడు. ఈ శతకంతో ఒక సీజన్ లో రెండు అంతకన్నా ఎక్కువ సెంచరీలు నమోదు చేసిన మూడో బ్యాట్స్ మన్ గా ఆమ్లా గుర్తింపు పొందాడు. పంజాబ్, ఆమ్లా శతకంతో గుజరాత్ కు 190 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించినా గెలువలేక పోయింది. ఆమ్లా రెండు సెంచరీలు బాదినా రెండు మ్యాచుల్లో జట్టు గెలవకపోవడం గమనార్హం. విరాట్ కోహ్లీ, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (2016) ఐపీఎల్-9 సీజన్లో విరాట్ కోహ్లీ గుజరాత్ లయన్స్ పై రాజ్ కోట్ లో సెంచరీ నమోదు చేశాడు. కానీ ఈ మ్యాచ్ లో బెంగళూరు ఓడిపోయింది. కోహ్లీ 63 బంతుల్లో 100 పరుగులు చేయడంతో బెంగళూరు 180 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని గుజరాత్ 5 బంతులు మిగిలి ఉండగానే చేదించింది. దీంతో ఈ సీజన్ లో సెంచరీ చేసిన జట్టును గెలిపించకపోయినా ఆటగాడిగా కోహ్లీ నిలిచిపోయాడు. వృద్ధిమాన్ సాహా, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (2014) ఐపీఎల్-2014 ఫైనల్లో కోల్ కతా నైట్ రైడర్స్ పై సాహా కెరీర్ లో తొలి సెంచరీ చేసినా జట్టు గెలువలేకపోయింది. సాహా 66 బంతుల్లో 115 పరుగులు చేయడంతో కింగ్స్ పంజాబ్ 199 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఒంటి చేత్తో టైటిల్ అందించాలని భావించిన సాహాకు చివరకు నిరాశే మిగిలింది. కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాడు మనీష్ పాండే(94) చెలరేగడంతో పంజాబ్ కు ఓటమి తప్పలేదు. ఇలా ఈ సీజన్ లో సెంచరీ చేసి జట్టును గెలిపించలేక పోయిన ఆటగాడిగా సాహా నిలిచాడు. సచిన్ టెండూల్కర్, ముంబై ఇండియన్స్(2011) ఐపీఎల్-2011 సీజన్ లో వాంఖేడ్ స్టేడియంలో సచిన్ టెండూల్కర్ అప్పటి టీం కొచ్చి టస్కర్స్ పై 66 బంతుల్లో సెంచరీ నమోదు చేశాడు. సచిన్ 12 ఫోర్లు, 3సిక్సర్లతో చెలరేగడంతో ముంబై 182 పరుగులు చేసింది. కానీ బ్రెండన్ మెకల్లమ్(81), మహేలా జయవర్ధనే(56) ఆట ముందు ముంబై లక్ష్యం చిన్నబోయింది. ఈ సీజన్ లో సెంచరీ చేసి జట్టును గెలిపించలేకపోయిన ఆటగాడిగా సచిన్ నిలిచాడు. యూసఫ్ పఠాన్, రాజస్థాన్ రాయల్స్ (2010) ఐపీఎల్-2010 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఆటగాళ్లు అంబటి రాయుడు(55), సౌరభ్ తివారీ(53) లు చెలరేగడంతో రాజస్థాన్ కు ముంబై 212 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఈ లక్ష్య చేధనలో తడబడిన రాజస్థాన్ 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ తరుణంలో బ్యాటింగ్ కు దిగిన యూసఫ్ పఠాన్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగమైన సెంచరీ నమోదు చేశాడు. యూసఫ్ కేవలం 37 బంతుల్లోనే శతకం బాదాడు. ఈ రికార్డు ఇప్పటి వరకు బ్రేక్ కాలేదు. 173 పరుగుల వద్ద రనౌట్ గా యూసఫ్ వెనుదిరిగాడు. చివర్లో పారాస్ దోగ్రా (41) ప్రయత్నించినా, రాజస్థాన్ 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఈ సీజన్లో సెంచరీ వృథా చేసుకున్న బాట్స్ మన్ గా యూసఫ్ నిలిచాడు. ఆండ్రూ సైమండ్స్, డెక్కన్ చార్జెర్స్ (2008) ఐపీఎల్ తొలి సీజన్లో రాజస్థాన్ రాయల్స్ పై సైమండ్స్ 53 బంతుల్లో 117 పరుగులు బాదడంతో డెక్కన్ చార్జెర్స్ 214 పరుగులు చేసింది. గెలుపు కాయం అనుకున్న తరుణంలో రాజస్థాన్ బ్యాట్స్ మెన్స్ గ్రేమ్ స్మిత్ (71), యూసఫ్ పఠాన్ (61) విజృంభించడంతో డెక్కన్ చార్జెర్స్ కు పరాజయం తప్పలేదు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగుల చేజింగ్ రికార్డుగా నమోదు అయింది. ఈ రికార్డు ఇప్పటి వరకు ఎవరూ అధిగమించకపోవడం గమనార్హం. సెంచరీ వృధా చేసుకున్న ఆటగాడిగా సైమండ్స్ నిలిచాడు. -
నా సినిమా నన్ను ఆవిష్కరిస్తుంది: సచిన్
లండన్: తన జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘సచిన్ ఎ బిలి యన్ డ్రీమ్స్’ చిత్రం తనను ఆవిష్కరిస్తుందని సచిన్ టెండూల్కర్ చెప్పారు. సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందు కు ఇక్కడికి వచ్చిన సచిన్ మాట్లాడుతూ ‘నా జీవితంలోని మధురఘట్టాల్ని నేను తిరిగి చూసుకునేందుకు, నా సుదీర్ఘ పయనంలో నాకు మాత్రమే తెలిసిన విశేషాలను అభిమానులతో పంచుకునేందుకు ఈ బయోపిక్చర్ ఉపయోగపడుతుం ది. ఈ సినిమా నా ఇన్నింగ్స్ల్లాగే అభిమానుల్ని అలరిస్తుంది. 24 ఏళ్ల కెరీర్లో నాపై కురిపించిన ఆదరాభిమానాల్ని ఈ సినిమాపై కూడా చూపిస్తారని ఆశిస్తున్నా’నని అన్నారు. ఈ చిత్రానికి రవి భాగ్‌చంద్క నిర్మాతగా వ్యవహరించగా.. ప్రముఖ డైరెక్టర్ జేమ్స్ ఎర్స్కిన్ దర్శకత్వం వహించాడు. -
నన్ను ‘సార్’ అనొద్దు... ‘ఓకే సార్’!
న్యూఢిల్లీ: క్రికెట్లో ఎవరెస్ట్ అంతటోడు సచిన్. తన సుదీర్ఘ ప్రస్థానంలో వేలకొద్దీ పరుగులు... లెక్కలేనన్ని రికార్డులున్నట్లే... ఎన్నో విశేషాలు, గమ్మత్తు అనుభవాలూ ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు ఈ బ్యాటింగ్ దిగ్గజం చెబుతుంటే సరదాగానే ఉండొచ్చు కానీ... అయనకు అప్పుడు ఎదురైనవి మాత్రం ఇబ్బందికర పరిస్థితులే మరి! బుధవారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన తను సారథ్యం వహించిన రోజుల్లో హిందీ, ఇంగ్లీష్ భాష రాని సహచరులతో ఎలా వేగాడో ఇలా చెప్పుకొచ్చారు. 1997లో సచిన్ సేన దక్షిణాఫ్రికాలో పర్యటించింది. ఈ క్రమంలో కర్ణాటక బౌలర్ దొడ్డ గణేష్‌కు కన్నడ తప్ప ఇంకే భాష రాదు. ఇలాంటి సందర్భంలో సచిన్ పడరాని పాట్లే పడ్డారు. అయితే గణేష్ మాత్రం సచిన్ ఏమని అడిగిన... ఏం చెప్పినా... ‘ఓకే సార్’ అనేవాడు. ‘దీంతో నాకు అర్థమైందేమిటంటే... నేనేం చెప్పిన అతనిచ్చే సమాధానం ‘ఓకే సార్’. పదేపదే అలా అనడంతో నేనోసారి... నన్ను సార్ అని పిలవొద్దని చెప్పా. విచిత్రంగా దానిక్కూడా అతనిచ్చిన సమాధానం ‘ఓకే సార్’! ఏం చేయను.. ఒక దేశానికి చెందిన మేమిద్దరమే భాష అర్థం కాక సతమతమవుతుంటే... ఓ రోజు డొనాల్డ్‌తో పెట్టుకున్నాడు. వెంటనే నేను వెళ్లి నీవు ఎం చెప్పాలనుకున్నా ముందు నాకు అర్థమయ్యేలా చెబితే... నేను డొనాల్డ్‌కు వివరిస్తాను అని చెప్పా! దీనికీ ఓకే సార్ అనే సమాధానమే’ అని సచిన్ వివరించారు. గణేష్ -
లెజెండ్
-
ఓటమితోనే... గెలిచేది, నేర్చేది!
షారుక్ ట్వీట్‌కు సచిన్ స్పందన న్యూఢిల్లీ: ఒకరేమో వెండితెర వేల్పు! మరొకరు క్రికెట్ దేవుడు! ఎవరికి వారే సాటి. విభిన్న చిత్రాలతో షారుక్ ఖాన్ బాలీవుడ్‌కు బాద్షా అయితే... సంచలన బ్యాటింగ్‌తో సచిన్ క్రికెట్లో పరుగుల మెషీన్ అయ్యాడు. ఈ హేమాహేమీలు అప్పట్లో పెప్సీ యాడ్‌లో కలిసి నటించడం... ఇద్దరి స్టార్ల అభిమానుల్ని అదేస్థాయిలో అలరించిన సంగతి తెలిసిందే! ఇప్పుడు కొత్తగా ట్వీట్లతోనూ ఒకరికొకరు తమ హృదయ స్పందనను తెలియజేసుకున్నారు. దీనికి ట్విట్టర్ వేదికైంది. ఈ సెలబ్రిటీల ట్వీట్లు ఇరు వర్గాల అభిమానుల్ని ఉత్సాహపరిచేలా ఉన్నాయి. క్రికెట్ లెజెండ్ సచిన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సచిన్– ఎ బిలియన్ డ్రీమ్స్’. చ్చే నెల 26న విడుదలకు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో షారుక్... మాస్టర్ బ్లాస్టర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ‘నేను బలంగా నమ్ముతున్నా... నీవు బాగా ఆడినపుడు నా సినిమా బాగా ఆడింది. అదే నీవు విఫలమైనపుడు నా సినిమా ఫెయిలైంది. నీ శతకోటి అభిమానుల్లో నేను ఒకడ్ని. నీ బయోపిక్చర్కు ఆల్ ద బెస్ట్ సచిన్’ అని ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన సచిన్ ‘జీవితంలో ఓటమే లేకుంటే గెలుపనేదే ఉండదు... నేర్చుకునేదీ ఉండదు. శతకోటి అభిమానుల్లాగే నీ మాటలు నా మనసును తాకాయ్..! లవ్ యూ షారుక్’ అని పోస్ట్ చేశారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ అభినేత్రి మాధురి దీక్షిత్, శ్రేయా ఘోషల్‌లు కూడా సచిన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. -
ముల్తాన్..సుల్తాన్.. సెహ్వాగ్
న్యూఢిల్లీ: సరిగ్గా ఇదే రోజు భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఓ మైలు రాయిగా నిలిచింది. అదే త్రిశతక వీరుడు డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వీర రూపం చూపించన రోజు. మార్చి 29, 2004 ప్రపంచ టెస్టు క్రికెట్లోనే అత్యంత వేగమైన త్రిబుల్ సెంచరీ నమోదయింది. ఈ ఘనత వీరు మన దాయాదీ పాకిస్థాన్‌పై సాధించడంతో భారత అభిమానులకు పండుగ దినమైంది. ఈ ఘనత సాధించి నేటికి 13 సంవత్సరాలు. దీన్ని గుర్తు చేసుకుంటూ క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో సెహ్వాగ్‌కు అభినందనలు తెలుపుతున్నారు. ముల్తాన్ టెస్టు రెండో రోజు ఆటలో త్రిశతకం సాధించి భారత్ తరపున తొలి త్రిబుల్ సెంచరీ సాధించన క్రికెటర్‌గా సెహా్వగ్ రికార్డు నమోదు చేశాడు. త్రిబుల్ సెంచరీని వీరు సిక్సర్‌తో సాధించడం కొసమెరుపు. అప్పటి వరకు వీవీఎస్ లక్ష్మణ్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల (281) రికార్డును వీరు అధగమించాడు. ఈ ఇన్నింగ్స్‌లో సెహ్వాగ్ 39 బౌండరీలు, ఆరు సిక్సర్లతో దాయదులకు చుక్కలు చూపించాడు. వీరు 82.40 స్ట్రైక్‌రేట్‌తో అత్యంత వేగంగా త్రిశతకం బాదిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పాడు. వీరు మెరుపు బ్యాటింగ్‌తో భారత్ రెండేరోజుల్లో650 పరుగులు చేసింది. మిగతా రెండురోజుల్లో పాక్‌ను రెండు సార్లు ఆల్ అవుట్ చేసి ఇన్నింగ్స్ తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ అత్యంత దుమారానికి కూడా కారణమైంది. సచిన్ టెండూల్కర్ (194 ) డబుల్ సెంచరీకి దగ్గర్లో ఉండగా అప్పటి కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ మ్యాచ్‌ను డిక్లెర్ చేశాడు. ఇది పెద్ద వివాదం అయింది. సచిన్ తన కన్న ముందు 5 డబుల్ సెంచరీలు చేస్తాడన్న అక్కసుతోనే ద్రవిడ్ డిక్లర్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. కానీ మ్యాచ్ గెలవడం కోసమే అలా చేశానని, సచిన్‌కు ముందే చెప్పానని ద్రవిడ్ వివరణ ఇచ్చాడు. ఇదే విషయాన్ని సచిన్ తన బయోగ్రఫీ ప్లేయింగ్ ఇట్ మై వే లో ద్రవిడ్ తప్పులేదని, ముందే తనకు సూచించాడని తెలిపాడు. -
సచిన్, ధోనీలను మించిన కోహ్లి..
-
సచిన్, ధోనీలను మించిన కోహ్లి..
ముంబై: భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఆటతోనే కాకుండా ప్రచారకర్తగా కూడా దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ప్రముఖ స్పోర్ట్స్ లైఫ్ స్టైల్ బ్రాండ్ పూమాకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు. దేశంలో ఒకే బ్రాండ్‌తో వంద కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న తొలి క్రీడాకారుడిగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లి రికార్డులకెక్కాడు. ఎనిమిది సంవత్సరాలకు రూ.110 కోట్లతో ప్రచారకర్తగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో కోహ్లి ప్రసిద్ధ క్రీడాకారులు జమైకా పరుగుల వీరులు ఉసెన్‌బోల్ట్, అసఫా పోవెల్, ఫుట్‌బాల్ ఆటగాళ్లు థీయరీ హెన్రీ, ఆలివర్ గిరౌడ్‌ల సరసన చేరాడు. ఒప్పందం ప్రకారం కోహ్లికి పూమా సంవత్సరానికి రూ.12 నుంచి రూ.14 కోట్లు ఇవ్వనుంది. పూమాతో చాలకాలం ఒప్పందం కుదుర్చుకున్నానని, పూమా భారత్‌లో అతి తక్కువ కాలంలో పాపులారిటీ పొందడం తనను ఆకట్టుకుందని, గొప్ప చరిత్ర కలిగిన ఆటగాళ్లు పూమాకు ప్రచారకర్తలుగా ఉండటం సంతోషంగా ఉందని కోహ్లి తెలిపాడు. సచిన్, ధోని, వివిధ స్పోర్ట్స్, ఏజెన్సీల ఒప్పందాలతో రూ.100 కోట్ల క్లబ్లో చేరారు. సచిన్ 24 ఏళ్ల క్రికెట్ కెరీర్లో 50కంపెనీలకు ప్రచారకర్తగా వ్యవహరించాడు. సచిన్ 1995లో వరల్డ్‌టెల్‌తో అత్యధికంగా రూ.30 కోట్లకుపైగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. 2001లో ఇదే ఒప్పందాన్ని డబుల్ రేటుతో పునరుద్ధరించుకున్నాడు. సాచి, సాచిస్ కంపెనీలకు ప్రచారకర్తగా 2006లో సచిన్ మూడు సంవత్సరాలకు రూ.175 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నారు. సచిన్ తర్వాత అంత స్థాయిలో ప్రచారాల ద్వారా లబ్ధి పొందిన క్రికెటర్ ధోనినే. ప్రచారకర్తగా సుమారు రూ.180 కోట్లు ఆర్జించాడు. ధోని దెబ్బతో 2013లో 20 కంపెనీలకు ప్రచారకర్తగా ఉన్న నటుడు షారుక్‌ఖాన్ అతని ఒప్పందం విరమించుకోవాల్సి వచ్చింది. కోహ్లి 2013లో అడిడాస్‌తో ఏడాదికి రూ.10 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం గత ఏడాది డిసెంబర్ వరకూ కొనసాగింది. తర్వాత ఈ ఒప్పందం పునరుద్దరించకపోవడంతో పూమాతో తాజాగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. -
ట్రైనీ ఎస్ఐ ఆత్మహత్య
హైదరాబాద్: షామీర్‌పేట్‌లోని సీఐఎస్ఎఫ్లో ట్రైనీ ఎస్ఐ సచిన్(25) ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉరికి వేలాడుతూ కనిపించడం గమనించిన సహచరులు అధికారులకు సమాచారం ఇచ్చారు. సచిన్ స్వస్థలం హర్యానా. గత అక్టోబర్ నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. -
మరో కారు కొనుక్కున్న దీపా కర్మాకర్
ఒలింపిక్స్‌లో ప్రదర్శనకుగాను ప్రోత్సాహకంగా సచిన్ చేతుల మీదుగా తాను అందుకున్న బీఎండబ్ల్యూ కారు స్థానంలో జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ మరో కారును కొనుక్కుంది. అగర్తలా వీధులలో తాను బీఎండబ్ల్యూ కారును వాడలేనంటూ దీపా, తనకు బహుమతి ఇచ్చిన చాముండేశ్వరీనాథ్‌కు తిరిగి ఇచ్చేసింది. దానికి బదులుగా ఆయన నుంచి అందుకున్న రూ. 25 లక్షలతో హ్యుందాయ్ ఎలాంత్రా కారును ఆమె కొనుక్కుందని కోచ్ బిశ్వేశ్వర్ నంది వెల్లడించారు. తమ నగరంలో దానికి సర్వీస్ సెంటర్ కూడా ఉందని ఆయన చెప్పారు. -
కోహ్లి ఒక బ్రాండ్..కానీ
న్యూఢిల్లీ:భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నా, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌తో పోల్చే స్థాయి మాత్రం కాదని ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్ బైచింగ్ భూటియా అభిప్రాయపడ్డాడు. గత కొంతకాలంగా విరాట్ సాధించిన ఘనతలతో అతనొక బ్రాండ్‌గా మారిపోయాడని భూటియా తెలిపాడు. 'ప్రస్తుతం విరాట్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఓవరాల్‌గా చూస్తే కోహ్లి పేరే ఒక బ్రాండ్ గా మారిపోయింది. కానీ సచిన్ టెండూల్కర్‌తో విరాట్ ను పోల్చడం మాత్రం కరెక్టు కాదు. సచిన్ సాధించిన ఘనతలు అసాధారణం. సచిన్ చాలా మైలురాళ్లను సృష్టించిన దిగ్గజ క్రికెటర్. విరాట్‌ను వేరుగా, సచిన్‌ను వేరుగా చూస్తేనే మంచింది. సచిన్‌తో పోల్చదగిన స్థాయికి ఇంకా విరాట్ చేరలేదు'అని బైచింగ్ భూటియా అన్నాడు. ఈ ఏడాది విరాట్ కోహ్లి అన్ని ఫార్మాట్లలో కలిపి 2,595 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు సాధించిన కోహ్లి..13 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.అత్యంత నిలకడైన ప్రదర్శనతో వరల్డ్ క్రికెట్‌ను శాసించే స్థాయికి ఎదిగాడు. ఈ క్రమంలోనే సచిన్ తో విరాట్ ను పలువురు పోల్చుతుండగా, కొంతమంది మాత్రం ఆ పోలికతో విభేదిస్తున్నారు. సూపర్ మ్యాన్.. విరాట్ కోహ్లి(ఇక్కడ క్లిక్ చేయండి); -
ఆ పోలిక విరాట్‌కు వద్దే వద్దు..
ముంబై:ఇప్పటికే క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులను తిరగరాసిన భారత స్టార్ విరాట్ కోహ్లిని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌తో పోల్చుతుంటే, అసలు ఆ పోలిక వద్దే వద్దే అంటున్నాడు ఇంగ్లండ్ దిగ్గజ ఆటగాడు జెఫ్రీ బాయ్‌కాట్. ఏవో కొన్ని రికార్డులను ఒక ఆటగాడు లిఖించినంత మాత్రానా, దిగ్గజ ఆటగాళ్లతో విరాట్‌ను పోల్చడం ఎంతమాత్రం సమంజసం కాదంటున్నాడు. దాంతో పాటు విరాట్ కోహ్లి క్రికెట్లోని అన్ని రికార్డులను బద్ధలు కొడతాడని తాను అనుకోవడం లేదన్నాడు. ఒకవేళ సచిన్ రికార్డులను కోహ్లి బద్ధలు కొట్టినా, అది ఏమీ పెద్ద విషయమే కాదని బాయ్‌కాట్ పేర్కొన్నాడు. గత విరాట్‌ను చూస్తే అతనేమీ పెద్ద గొప్ప ఆటగాడు విషయం అవగతం అవుతుందన్నాడు. ఈ క్రమంలోనే ఒక ఉదాహరణను జెఫ్రీ తెలిపాడు. గతంలో ఢిల్లీలో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన వెస్టిండీస్ దిగ్గజం గ్యారీ సోబర్స్ రికార్డును తాను బద్ధలు కొట్టిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాడు. ఆ ఘనతతో తాను సోబర్స్ కంటే అత్యుత్తమ ఆటగాడిగా మారిపోలేదనే విషయాన్ని జెఫ్రీ అంగీకరించాడు. రికార్డులు వస్తూ పోతూ ఉంటాయనే విషయాన్ని మాత్రమే ఇక్కడ గ్రహించాలన్నాడు. ఒకవేళ విరాట్ ఫామ్ కడవరకూ ఇలానే ఉంటే అప్పుడు మాత్రమే అతను గ్రేటెస్ట్ అనే అంశాన్ని నిర్ధారించాలన్నాడు. అంతేకానీ సచిన్ టెండూల్కర్‌తో విరాట్‌ను ఇప్పుడు పోల్చడం మాత్రం సరికాదన్నాడు. -
బ్యాడ్మింటన్ లీగ్‌లోకి సచిన్
► పీబీఎల్‌లో ‘బెంగళూరు బ్లాస్టర్స్’ ఫ్రాంచైజీలో వాటా కొనుగోలు ►భాగస్వాములుగా నిమ్మగడ్డ ప్రసాద్, చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్ బెంగళూరు: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తాజాగా బ్యాడ్మింటన్ లీగ్‌లోనూ అడుగు పెట్టారు. ఇప్పటికే ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో కేరళ బ్లాస్టర్స్ సహ యజమానిగా ఉన్న ఆయన బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ (పీబీఎల్)లో బెంగళూరు బ్లాస్టర్స్ ఫ్రాంచైజీలో వాటా తీసుకున్నారు. ‘ఫిట్నెస్, నైపుణ్యత, చురుకుదనం కలబోతే బ్యాడ్మింటన్. బెంగళూరు బ్లాస్టర్స్‌లో భాగం అవుతున్నందుకు చాలా ఉద్వేగంగా ఉంది. వచ్చే సీజన్లో ఈ జట్టు మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకోవాలని కోరుకుంటున్నాను’ అని సచిన్ తెలిపారు. మరోవైపు ఈ ఒప్పదం వివరాలను సహ యజమాని, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ వెల్లడించారు. ‘సచిన్, చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్, నేను కలిసి ఓ బృందంగా ఏర్పడి బెంగళూరు జట్టులో పెట్టుబడి పెట్టాం. ప్రస్తుతానికై తే ఆ మొత్తం ఎంత అనేది చెప్పలేం. కానీ సరైన సయమంలో వెల్లడిస్తాం’ అని నిమ్మగడ్డ ప్రసాద్ తెలిపారు. అంతగా విజయవంతం కాని బ్యాడ్మింటన్ లీగ్‌లో ప్రవేశించడాన్ని ఆయన సమర్థించుకున్నారు. క్రీడల్లో అడుగుపెట్టే ప్రతీ పెట్టుబడిదారులకు ఇలాంటి సవాళ్లు మామూలేనని, అరుుతే తాము లాభాల కోసమే ఇందులో అడుగుపెట్టలేదని ఆయన స్పష్టం చేశారు. దేశంలో బ్యాడ్మింటన్ ప్రమాణాలను మరింత పెంచే ఉద్దేశంతోనే దీంట్లోకి వచ్చినట్టు ఆయన చెప్పారు. లీగ్‌లో సచిన్ అడుగుపెట్టడం ఆటగాళ్లకు ప్రేరణగా ఉండడమే కాకుండా ప్రేక్షకుల సంఖ్య కూడా పెరుగుతుందని జాతీయ కోచ్ గోపీచంద్ అభిప్రాయపడ్డారు. మీడియా సమావేశంలో సినీ హీరో అల్లు అర్జున్, తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ కూడా పాల్గొన్నారు. పీబీఎల్ జనవరి 1 నుంచి 14 వరకు జరుగుతుంది. -
బన్నీ జీవితంలో బెస్ట్ సెల్ఫీ
ఈ జనరేషన్ హీరోలందరూ సినిమాలతో పాటు ఇతర బిజినెస్‌ల మీద కూడా దృష్టి పెడుతున్నారు. కొంత మంది సినీ నిర్మాణరంగంలో డబ్బులు పెడుతుంటే మరికొందరు హోటల్ బిజినెస్, క్రీడారంగంలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్ లోకి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరిపోయాడు. వరుస బ్లాక్ బస్టర్స్‌తో సత్తా చాటుతున్న బన్నీ బిజినెస్‌మేన్‌గా కూడా ప్రూవ్ చేసుకునే పనిలో ఉన్నాడు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఓ హైక్లాస్ బార్ ఓపెన్ చేశాడు బన్నీ. ఇద్దరు పార్టనర్స్‌తో కలిసి బన్నీ ప్రారంభించిన క్లబ్ సూపర్ హిట్ అయ్యింది. అదే బాటలో మరో బిజినెస్‌లోకి అడుగుపెడుతున్నాడు స్టైలిష్ స్టార్. ఇటీవల చిరంజీవి, నాగార్జునలతో కలిసి కేరళ ఫుట్‌బాల్ టీంను సొంతం చేసుకున్న సచిన్ టెండుల్కర్, ఇప్పుడు బ్యాడ్మింటన్ టీంను కూడా కొన్నాడు. నాగ్, నిమ్మగడ్డ ప్రసాద్‌లతో పాటు అల్లు అర్జున్ కూడా ఈ టీంకు భాగస్వామిగా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్లో ప్రకటించిన అల్లు అర్జున్, సచిన్ టెండుల్కర్, పుల్లెల గోపీచంద్, నిమ్మగడ్డ ప్రసాద్‌లతో కలిసి దిగిన సెల్ఫీని తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేశాడు. తన జీవితంలో దిగిన బెస్ట్ సెల్ఫీలలో ఇదీ ఒకటి అంటూ కామెంట్ చేసిన బన్నీ, లెజెండరీ క్రీడాకారులతో కలిసి బెంగళూరు బ్లాస్టర్స్ బ్యాడ్మింటన్ టీంకు భాగస్వామిగా వ్యవహరించటం ఎంతో ఆనందంగా ఉందన్నాడు.One of my Best selfie's ! Legendary Sports men ! Great Honour being associated & Co-owners of the Team #BengaluruBlasters pic.twitter.com/n9DjljUpPW— Allu Arjun (@alluarjun) 8 December 2016 -
సచిన్ ‘ఆత్మకథ’కూ అవార్డు
న్యూఢిల్లీ: ఇప్పుడు తన ఆత్మకథతో కూడా అవార్డు దక్కించుకున్నాడు. రెండేళ్ల క్రితం విడుదలైన అతని స్వీయచరిత్ర ‘ప్లేరుుంగ్ ఇట్ మై వే’ అభిమానులు, పుస్తక ప్రియుల ఆదరణతో తాజా గా రేమండ్ క్రాస్‌వర్డ్ పాపులర్ అవార్డును సొంతం చేసుకుంది. అమ్మకాల రికార్డుతో ఈ ఏడాది ఆరంభంలో ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకున్న ఈ ఆత్మకథకు ఇప్పుడు పాపులర్ చారుుస్ అవార్డు లభించడం పట్ల క్రికెట్ దిగ్గజం... ప్రచురణ కర్తలకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. -
సూపర్మ్యాన్లా భావిస్తారు!
► అభిమానాన్ని అదుపు చేయడం కష్టం ► నాలుగు ఐస్ ముక్కలు చాలని సచిన్‌తో చెప్పా ► విరాట్ కోహ్లి చెప్పిన విశేషాలు క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు రారాజులా వినిపిస్తున్న పేరు విరాట్ కోహ్లి... ఫార్మాట్ ఏదైనా అతని తిరుగులేని ప్రదర్శనకు ఆటగాళ్లు, విశ్లేషకులు అంతా దాసోహం అంటున్నారు. ప్రత్యర్థి జట్లకు సింహస్వప్నంలాటి కోహ్లి భారత అభిమానుల దృష్టిలో మరో సచిన్ టెండూల్కర్. ముఖ్యంగా గత రెండేళ్ల కాలంలో అతని ఆటకు అన్ని రికార్డులు ముంగిట వచ్చి వాలిపోతున్నారుు. పోలికలో ఒక రకంగా సచిన్‌ను కూడా అతను మించిపోతున్నాడు. భారత టెస్టు కెప్టెన్‌గా విశాఖపట్నంలో మరో అద్భుత విజయం సాధించిన అనంతరం కోహ్లి తన గురించి ఆసక్తికర అంశాలు పంచుకున్నాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన కొన్ని విశేషాలు... సెంచరీలే ఆశిస్తారు బౌండరీ వద్ద నిలబడినప్పుడు ప్రేక్షకులు పదే పదే నేను సెంచరీ కొట్టాలని కోరుతూ ఉంటారు. సాధ్యాసాధ్యాల సంగతి పక్కన పెడితే వారి అభిమానాన్ని తప్పు పట్టలేం. ప్రారంభంలో కాస్త ఇబ్బంది పడ్డాను కానీ ఇది వారు కురిపిస్తున్న ప్రేమని మెల్లగా అర్థమైంది. భారత క్రికెటర్‌కు ఇదంతా సహజం. దానినుంచి దూరంగా వెళ్లాలని ప్రయత్నిస్తే అది ఇంకా వెంటాడుతుంది. మరింతగా ఒత్తిడి పెంచి మనల్ని కింద పడేస్తుంది. కొన్నేళ్లు పోతే మర్చిపోతారు నేను బాగా ఆడుతున్నానని, అన్ని రికార్డులు బద్దలు కొడతానని అంతా చెబుతుంటారు. అరుుతే నేను వాస్తవానికి దగ్గరగా బతుకుతాను. ఒక 10-12 ఏళ్లు ముందుకు వెళితే నేను మీకు కనిపించను. ఆ స్థానంలో మరొకరు వస్తారు. ఇప్పుడు చూపిస్తున్న ఆదరాభిమానాలు, కీర్తి అతనికి దక్కుతారుు. కాబట్టి ప్రస్తుతంకంటే నేను భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తా. జట్టులోని మిగతా 10 మందికంటే నేనేమీ గొప్ప కాదని భావిస్తాను. చేతులు పట్టుకొని చూశాడు టి20 ప్రపంచ కప్ సందర్భంగా ఆశ్చర్యకర అనుభవం ఎదురైంది. ఎరుుర్‌పోర్ట్‌లో ఒక వ్యక్తి నాకు చేరువగా వచ్చాడు. సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోబోతే నేను వారించాను. అతను నా చేరుు చూపించమని అడిగాడు. పట్టుకొని ఏదో ఒంట్లో కరెంట్ వచ్చినట్లుగా కదిలిపోయాడు. నాకు చాలా ఇబ్బందిగా అనిపించి ఏంటిది అని తిట్టుకున్నాను. అతను నన్నేదో సూపర్మ్యాన్లా భావించాడు. చాలా మంది మమ్మల్ని పట్టుకొని మనిషా కాదా అన్నట్లుగా చూసి చెక్ చేసుకుంటారంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ మాటలు మార్చేశారుు ప్రొఫెషనల్ క్రీడలలో ప్రొఫెషనలిజం కనిపించనిది ఒక్క క్రికెట్లోనే. టెన్నిస్ ఆటగాళ్లలాంటి ఫిట్నెస్ మనకేదీ అని అప్పటి కోచ్ ఫ్లెచర్ ఒక రకంగా వ్యంగ్యంగా అన్నారు. దాంతో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని నిర్ణరుుంచుకున్నా. అప్పట్లో ఏది పడితే అది తినేవాడిని. ఎక్కువసేపు మెలకువగా ఉండటంతో పాటు రెగ్యులర్‌గా మద్యం తాగేవాడిని కూడా. తర్వాత అన్నీ మానేసి కఠినంగా కసరత్తులు చేశాను. ఒక్కోసారి ఆకలికి తట్టుకోలేకపోయేవాడిని. అరుుతే మంచి ఫలితాలు వచ్చాక అదే డైట్‌ను కొనసాగించాను. శ్రీలంకలో ఒకసారి ఫీల్డింగ్ సందర్భంగా నా ఫిట్నెస్ స్థారుు చూసి నేనే ఆశ్చర్యపోయా. క్రికెట్టే నన్ను ఎంచుకుంది నాకు గుర్తున్నంత వరకు క్రికెట్ బ్యాట్‌తోనే నా బాల్యం గడిచిపోరుుంది. ఇంట్లో అందరికంటే చిన్నవాడిని కావడంతో బాగా చదవాలని, సంపాదించాలనే ఒత్తిడి నాపై ఎప్పుడూ లేదు. నన్ను అందరూ గారాబం చేయడాన్ని కూడా బాగా వాడుకున్నాను! ఆరేళ్ల వయసులో క్రికెట్‌కు ఉన్న విలువేమిటో అర్థమైంది. సచిన్ గురించి తెలిసింది కూడా అప్పుడే. 12 ఏళ్ల వయసులో తొలిసారి చూశాను. చాలా మందిలాగే ఆయనే స్ఫూర్తిగా ఆట వైపు మరలాను. డ్రెస్సింగ్ రూమ్‌లో తొలిసారి... చాలా ఏళ్ల తర్వాత సచిన్‌తో కలిసి ఆడే అవకాశం వచ్చింది. సహజంగానే సీనియర్ల ముందు మన ఇష్టాఇష్టాలు, పార్టీల గురించి చెప్పలేకపోవడం భారతీయుల్లో సహజం. నాకు డ్రింక్ అంటే ఇష్టమని సచిన్‌తో చెప్పగలగడమే నాకు ఎదురైన పెద్ద సవాల్! ఆయన డ్రింక్ తీసుకోమని అడిగారు. నాకు అలవాటు లేదన్నాను. మళ్లీ అడిగితే మళ్లీ అదే జవాబిచ్చాను.చివరకు నాకు నాలుగు ఐస్ క్యూబ్‌లు చాలని చెప్పగలిగాను. ఆ తర్వాత అది చాలా సాధారణంగా మారిపోరుుంది. అరుుతే ఇప్పుడు ఐపీఎల్ వల్ల అందరం తొందరగా కలిసిపోగలుగుతున్నాం. జోక్స్ చెప్పుకోవడం, సెల్ఫీలు కామన్‌గా మారిపోయారుు. ఇంకా మారాల్సి ఉంది మైదానంలో నా ఆవేశాన్ని ప్రదర్శిస్తుంటాను. కొన్నిసార్లు పరిస్థితులు చేజారిపోరుునప్పుడు అసహనం పెరిగిపోవడమే దానికి కారణం. దీన్ని ఇంకా తగ్గించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాను. అర్ధ సెంచరీలు, సెంచరీలు సాధించినప్పుడు సంబరాలు జరుపుకోవడం కూడా తగ్గించేశాను. నా పనే పరుగులు చేయడం అరుునప్పుడు అంత ఉద్వే గం ప్రదర్శించడం అవసరమా అనిపించడమే అందుకు కారణం. -
ప్రిక్వార్టర్స్‌లో సచిన్
న్యూఢిల్లీ: ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ సచిన్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. రష్యాలో జరుగుతున్న ఈ టోర్నీలో 49 కేజీల విభాగం రెండో రౌండ్లో సచిన్ 3-0తో పీటర్ కాస్మిన్ (రొమేనియా)పై గెలిచాడు. -
నేడు నెల్లూరు జిల్లాకు క్రికెట్ లెజెండ్ సచిన్
-
త్వరలో పుట్టంరాజు కండ్రిగకు సచిన్?
ఏర్పాట్లు పరిశీలించిన జేసీ, సచిన్ పీఏ గూడూరు: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ దత్తత గ్రామం అయిన పుట్టమరాజు కండ్రిగలో జేసీ ఇంతియాజ్, సచిన్ పీఏ నారాయణలతోపాటు ఇన్చార్జి ఆర్డీఓ వెంకటసుబ్బయ్యలతో కలిసి గురువారం పర్యటించారు. త్వరలో సచిన్ ఆ గ్రామానికి రానున్నారని, ఈ మేరకే జేసీ గ్రామాన్ని విజిట్ చేసినట్లు తెలుస్తోంది. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గాను వర్మిక్యులైట్, టైలరింగ్, పచ్చళ్ల తయారీపై శిక్షణ ఇచ్చేందుకు అక్కడికి వచ్చిన ఏజన్సీవారితో పలు విషయాలపై చర్చించారు. త్వరలో గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్స్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు, త్వరితగతిన గ్రౌండ్‌ను చదును చేయాలని సంబంధిత అధికారుకు ఆదేశించారు. ముఖ్యంగా గ్రామంలో రోడ్డు విస్తరణలో 7 కాలనీ ఇళ్ల బేస్మెంట్లు తీసివేయడం జరిగింది. దీంతో హౌసింగ్ అధికారులు ఆ మొత్తాన్ని మినహాఇంచి బిల్లులు చేస్తామని చెప్పడంతో ఆ మొత్తంతో తాము ఇళ్ల నిర్మించుకోలేమని, నూతనంగా ఇళ్లు మంజూరుకు గతంలో జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు గ్రామాన్ని సందర్శించిన సమయంలో వారు విన్నవించుకోవడం జరిగింది. ఈ క్రమంలో వారికి పూర్తి పేమెంట్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన నేపథ్యంలో మళ్లీ ఆ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఆయన వెంట చీఫ్ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకయ్య, ఇతర శాఖాధికారులు ఉన్నారు. -
ఆలస్యానికి అడ్రస్ లక్ష్మణ్
కోల్‌కతా: సచిన్‌కు తెలిసింది రెండే రెండు... మైదానంలో పరుగుల వరద పారించడం, ఆ తర్వాత షాపింగ్‌లో మునగడం! అతని సహచరుడు, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చెప్పిన ముచ్చట ఇది. సొంతగడ్డపై భారత్ 250వ టెస్టు ఆడుతున్న సందర్భంగా కొందరు క్రికెటర్లతో సరదాగా నిర్వహించిన చర్చా కార్యక్రమంలో తమ డ్రెస్సింగ్ రూం విశేషాలను ఆటగాళ్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ ‘మ్యాచ్‌లో సెంచరీ చేశాడంటే మరుసటి రోజు సచిన్‌కు షాపింగ్ తప్ప మరో వ్యాపకం ఉండేదికాదు. అర్మానీ, వెర్సెస్లాంటి బ్రాండింగ్ డ్రెస్‌లు అతని వార్డ్‌రోబ్‌లో చాలా కనిపిస్తాయి. తన దుస్తుల విషయంలో సచిన్ ప్రత్యేక శ్రద్ధ పెడతాడు’ అని చెప్పారు. హైదరాబాదీ సొగసరి బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ అయితే ఆలస్యానికి కేరాఫ్ అడ్రస్ అని గంగూలీ గుర్తు చేసుకున్నారు. ‘నాలుగో, ఐదో స్థానం ఆటగాళ్లు క్రీజ్‌లో ఉన్న సమయంలో కూడా అతను ఇంకా బాత్రూంలో స్నానం చేస్తూ కనిపించేవాడు. టీమ్ బస్సులోకి అందరికంటే ఆలస్యంగా వచ్చేది కూడా అతనే’ అని గంగూలీ అన్నారు. తాను ఆడిన రోజుల్లో శుచీ శుభ్రతా గురించి అసలు ఏ మాత్రం పట్టించుకోని ఆటగాళ్లంటే సిద్ధూ, అజయ్ జడేజాలే అని మరో మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ చెప్పారు. ‘ఉత్తరాదివారే దూకుడుగా ఉంటారని మేం అనుకునేవాళ్లం. దక్షిణాదివాళ్లు సున్నితంగా, ప్రశాంతంగా ఉంటారని భావించాం. కానీ కుంబ్లే తన ఆటతో వారిలోని దూకుడును చూపించాడు’ అని కపిల్‌దేవ్ వ్యాఖ్యానించడం విశేషం. -
సచిన్ ఓనం వేడుక
తిరువనంతపురం: భారత మాజీ లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తిరువనంతపురంలో సందడి చేశారు. కేరళ బ్లాస్టర్ టీం సభ్యులతో కలిసి ఓనమ్ పండుగను జరుపుకున్నారు. కేరళ బ్లాస్టర్స్ యాజమాని అయిన సచిన్ టీం సభ్యులతో కలిసి భోజనాలు చేశాడు. ఈ విషయాన్ని సచిన్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఓనం పండుగను దేశ, విదేశాల్లో ఉన్న కేరళీయులు ఘనంగా జరుపుకుంటారు. -
అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాం
కేరళ బ్లాస్టర్స్ యజమాని సచిన్ టీమ్ జెర్సీ ఆవిష్కరణ కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్‌బాల్ మూడో సీజన్లో మరింత మెరుగైన ప్రదర్శన కనబరుస్తామని మాజీ క్రికెటర్, కేరళ బ్లాస్టర్స్ టీమ్ యజమాని సచిన్ టెండూల్కర్ విశ్వాసం వ్యక్తం చేశారు. గత ఏడాది వైఫల్యం తర్వాత ఈ సారి అనేక మార్పులతో జట్టు బరిలోకి దిగుతోంది. బుధవారం ఇక్కడ బ్లాస్టర్స్ జెర్సీ ఆవిష్కరణతో పాటు జట్టు సభ్యుల పరిచయ కార్యక్రమం కూడా జరిగింది. సచిన్‌తో పాటు ఫ్రాంచైజీ సహ యజమానులు నిమ్మగడ్డ ప్రసాద్, చిరంజీవి, అక్కినేని నాగార్జున, అల్లు అరవింద్ కూడా ఇందులో పాల్గొన్నారు. కేరళ సంప్రదాయ దుస్తుల్లో వీరు హాజరయ్యారు. ‘కుర్రాళ్లు, అనుభవజ్ఞులతో కూడిన మా జట్టులో మంచి ప్రతిభ ఉంది. అటాకింగ్ తరహా ఆటతో మైదానంలో దూసుకుపోవాలని వారు ఉత్సాహంగా ఉన్నారు‘ అని సచిన్ అన్నారు. అందరూ ఇష్టపడే తరహాలో కేరళ శైలిలో ఫుట్‌బాల్ ఆడాలన్నారు. గత ఏడాది ఆడిన జట్టులో ఆంటోనియా జర్మన్, జోసూలతో పాటు ఐదుగురు భారత ఆటగాళ్లను ఈ సారి కూడా బ్లాస్టర్స్ కొనసాగించింది. 27 మంది సభ్యుల టీమ్‌లో మిగతావారంతా కొత్తవారే. మార్క్యూ ప్లేయర్ ఆరోన్ హ్యూజెస్‌తో పాటు దిదియార్ బోరిస్, సెడ్రిక్ హెంగ్బార్ట్ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. మాంచెస్టర్ యునెటైడ్ మాజీ ఆటగాడు స్టీఫెన్ కోపెల్‌ను ఈ సారి జట్టు కోచ్‌గా ఎంచుకుంది. సీజన్ ఆరంభానికి ముందు కేరళ బ్లాస్టర్స్ జట్టు థాయ్‌లాండ్‌లో కొన్ని ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడనుంది. -
'సచిన్, లారా, పాంటింగ్ గ్రేట్ బ్యాట్స్మన్లు కాదు'
న్యూఢిల్లీ: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ దేవుడు, భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్, వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా, ఆస్ట్రేలియా గ్రేట్ రికీ పాంటింగ్ తన దృష్టిలో అంత గొప్ప ఆటగాళ్లు కారని పేర్కొన్నాడు. తాను క్రికెట్ ఆడిన దశకంలో ప్రపంచంలో అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా పేరున్న షోయబ్ అక్తర్ బెస్ట్ బ్యాట్స్ మన్ ఈ ముగ్గురిలో ఎవరూ కాదని అభిప్రాయపడ్డాడు. పాక్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ టాక్ షో లో పాల్గొన్న సందర్భంగా షోయబ్ ఈ విషయాలను వెల్లడించాడు. 'ప్రపంచంలో చాలా మంది గొప్ప బ్యాట్స్ మన్లు ఉన్నప్పటికీ చాలా కష్టమైనా సరే వారిని ఏదో విధంగా ఔట్ చేయగలిగాను. కానీ, తన సహచరుడు, అప్పట్లో జట్టు కెప్టెన్ అయిన ఇంజమామ్ ఉల్ హక్ ను ఔట్ చేయడం చాలా కష్టం. కనీసం నెట్స్ లో ఒక్కసారి కూడా ఇంజీని ఔట్ చేయలేకపోయాను' అని అక్తర్ వెల్లడించాడు. అతడి ఫుట్ వర్క్ చాలా అద్భుతంగా ఉండటంతో తన బంతిని కచ్చితంగా అంచనా వేసేవాడన్నాడు. అందుకే తన బౌలింగ్ ఎదుర్కొన్న వారిలో ఇంజమామ్ అత్యుత్తమ బ్యాట్స్ మన్ అని, అతడితో సరితూగే బ్యాట్స్ లేడని.. ఎవరితోనూ అతడిని పోల్చలేమని అక్తర్ కొనియాడాడు. -
ఈ విజయంతో ఆగిపోవద్దు!
‘రియో’ స్టార్లకు సచిన్ సూచన 2020లో మరింత బాగా ఆడాలన్న మాస్టర్ సింధు, సాక్షి, దీప, గోపీచంద్‌లకు కార్లు బహుకరణ హైదరాబాద్: భారత దేశం యావత్తూ కలిసి వేడుకను జరుపుకునేందుకు రియో విజేతలు అవకాశం ఇచ్చారని, మున్ముందు ఇలాంటి రోజులు మరిన్ని రావాలని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆకాంక్షించారు. జాతి మొత్తం ఈ సమయంలో పట్టరాని సంతోషంతో ఉందని ఆయన అన్నారు. రియోలో పతకాలు గెల్చుకున్న సింధు, రెజ్లర్ సాక్షి మలిక్‌లతో పాటు జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, కోచ్ గోపీచంద్‌లను అభినందించేందుకు ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సచిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు వి. చాముండేశ్వరీనాథ్ తరఫున ఈ నలుగురికి బీఎండబ్ల్యూ కార్లను సచిన్ బహుకరించారు. ‘భారత క్రీడల్లో ఇదో సుదినం. మన అమ్మాయిలు గర్వపడే ప్రదర్శన ఇచ్చారు. ఇప్పుడే విజయాల ప్రయాణం ప్రారంభమైంది. ఇది ఇక్కడితో ఆగిపోవద్దు. మేమందరం మీ కోసం ప్రార్థిస్తాం. మీకు అండగా నిలుస్తాం. మేం సంబరాలు జరుపుకునేందుకు మళ్లీ మీరు అవకాశం ఇవ్వాలి. భవిష్యత్తులో మరిన్ని గొప్ప విజయాలు రానున్నాయని నేను నమ్ముతున్నా’ అని సచిన్ వ్యాఖ్యానించారు. పుల్లెల గోపీచంద్‌ను రియల్ హీరోగా, యువతరానికి రోల్‌మోడల్‌గా అభివర్ణించిన సచిన్... మరిన్ని పతకాలు సాధించేందుకు ఆయన మార్గదర్శనం కావాలని చెప్పారు. ఈ పతకాల సాధన వెనుక ఎంతో శ్రమ, పట్టుదల, త్యాగాలు ఉన్నాయని సింధు, సాక్షిలపై మాస్టర్ ప్రశంసలు కురిపించారు. మరిన్ని విజయాలు సాధిస్తాం... దశాబ్దం క్రితం బ్యాడ్మింటన్ ఒలింపిక్ పతకం తెస్తానని తాను చెబితే ఎవరూ నమ్మలేదని, సహకరించేందుకు ముందుకు రాలేదని గోపీచంద్ గుర్తు చేసుకున్నారు. అలాంటి సమయంలో పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ అండగా నిలవడంతో అకాడమీ నిర్మాణం సాధ్యమైందని, ఇప్పుడు వరుస ఒలింపిక్స్‌లలో పతకాలు గెలవగలిగామని ఆయన అన్నారు. ఒలింపిక్స్‌కు ముందు, ఒలింపిక్స్ సమయంలో కూడా సచిన్ మాటలు ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపాయని గోపీ చెప్పారు. ముగ్గురు అమ్మాయిలు ఒకేసారి దేశంలో సంబరాలకు కారణం కావడం గతంలో ఎప్పుడూ లేదని ఆయన వ్యాఖ్యానించారు. తాను ఒలింపిక్స్‌కు ఒంటరిగా వెళ్లానని, ఇప్పుడు దేశం మొత్తం తన వెంట ఉందని సాక్షి సంతోషం వ్యక్తం చేయగా... పతకం తీసుకురాకపోయినా దేశ ప్రజలు ఇంతటి ప్రేమ చూపించడం గర్వంగా అనిపిస్తోందని దీపా కర్మాకర్ చెప్పింది. చాన్నాళ్ల క్రితం బ్యాడ్మింటన్‌లో ప్రదర్శనకే తొలి కారు స్విఫ్ట్ డిజైర్ అందుకున్నానని, ఇప్పుడు కారు బహుమతిగా ఇచ్చి ప్రోత్సహించడం పట్ల సింధు కృతజ్ఞతలు తెలిపింది. సింధు, గోపీలకు బీఎండబ్ల్యూ 320డి మోడల్... సాక్షి, దీపలకు బీఎండబ్ల్యూ ఎక్స్1 మోడల్ కార్లను బహుమతిగా అందజేశారు. చాముండేశ్వరీనాథ్‌తో పాటు పారిశ్రామికవేత్తలు వై.నవీన్, టి. శ్రీనివాస్, ఎం.వెంకటరమణ, సి.అనిల్ వీటికి స్పాన్సర్లుగా వ్యవహరించారు. మరోవైపు గోపీచంద్ అకాడమీ తరఫున కూడా సింధు, సాక్షి, దీప లకు ప్రత్యేక బహుమతులు ఇచ్చారు. -
పీవీ సింధుకు సచిన్ ప్రశంసలు
-
ఇంతకన్నా గొప్ప 'రాఖీ' కానుక ఉండదేమో!
అన్నా-చెల్లెలి అనుబంధానికి రక్షగా నిలిచే రాఖీ పండుగను జరుపుకొంటున్న తరుణంలోనే రెజ్లర్ సాక్షి మాలిక్ దేశంలో కొత్త ఆనందాన్ని నింపారు. రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించి దేశ గౌరవాన్ని నిలబెట్టారు. తన సోదరి సాధించిన ఈ విజయంపై సాక్షిమాలిక్ సోదరుడు సచిన్ రాధాకృష్ణన్ ఆనందం వ్యక్తం చేశారు. రాఖీ పండుగ సందర్భంగా ఇంతకన్నా గొప్ప కానుకను ఏ చెల్లి కూడా తన అన్నకు ఇచ్చి ఉండదంటూ ఆయన పేర్కొన్నారు. పతకం గెలువాగానే తాను సాక్షికి రక్షాబంధన్ మెసేజ్ పంపించానని, ఒక అన్నగా ఆమెను తనకు ఎంత ఆప్యాయత ఉందో ఆ మెసేజ్‌లో తెలియజేశానని సచిన్ చెప్పారు. మరోవైపు సాక్షి మాలిక్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ఆమెను పెద్ద ఎత్తున అభినందిస్తూ.. మహిళా శక్తిని చాటిన సాక్షికి నీరాజనాలు పడుతున్నారు. ఆమె ప్రతిభను కీర్తిస్తూ ట్వీట్ చేస్తున్నారు. -
ఆమె హృదయాలను గెలుచుకుంది: సచిన్
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ లో అద్భుత ప్రతిభ ప్రదర్శించిన దీపా కర్మాకర్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. దీపాను కీర్తించిన జాబితాలో తాజాగా లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చేరారు. ఆటలో గెలుపోటములు సహజమని దీపా తన అద్భుత ప్రదర్శనతో కోట్లాది మంది భారతీయుల హృదయాలను గెలుచుకుందని, దేశం ఆమెను చూసి గర్విస్తోందని సచిన్ ట్వీట్ చేశారు. భారత త్రివర్ణ పతాకాన్ని ప్రపంచంలో ముందుంచడానికి దీపా, ఆమె కోచ్ గొప్ప కృషి చేశారని మరో భారత క్రికెటర్ శిఖర్ ధవన్ కొనియాడారు. జిమ్నాస్టిక్ పోటీలో 0.150 పాయింట్ల తేడాతో దీపా నాల్గవ స్థానంలో నిలిచి తృటిలో కాంస్య పథకాన్ని కోల్పోయింది. Winning & losing is a part of sport.. You've won millions of hearts & the entire nation is proud of ur achievements. https://t.co/qSpiWFSp2K — sachin tendulkar (@sachin_rt) 15 August 2016 Congratulations to you and your coaches @dipakarmakar for placing the tricolour at the forefront of world gymnastics. Proud #DipaKarmakar — Shikhar Dhawan (@SDhawan25) 15 August 2016 -
కొద్దిగంటల్లో పెళ్లి... అంతలోనే... వరుడు ఆకస్మిక మృతి
సచిన్ మృతదేహం బెంగళూరు(బనశంకరి): కొద్దిగంటల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడు ఆకస్మికంగా మృతిచెందిన ఘటన చిక్కమంగళూరు జిల్లా సుళ్య పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు... సుళ్య తాలూకా పంజ గ్రామంలోని కండూరకు చెందిన పరమేశ్వరగౌడ కుమారుడు సచిన్(29)కు ఎడమంగలలోని హొన్నప్పాడి బాలకృష్ణగౌడ కుమార్తె గాయత్రితో వివాహం నిశ్చయించారు. పైందోడి సుబ్రమణ్యస్వామి దేవస్థానంలో బుధవారం ఉదయం వివాహం చేయడానికి ఇరుకుటుంబాలు సిద్ధమయ్యాయి. మంగళవారం రాత్రే బంధుమిత్రులతో కళ్యాణమంటపానికి చేరుకోవడానికి సిద్ధమయ్యారు. బుధవారం ఉదయం ఇంటిలో పెళ్లి కుమారుడు సచిన్ షేవింగ్ చేసుకుంటూ ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. గాయపడిన బాధితుడిని వెంటనే పుత్తూరు ఆదర్శ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. సచిన్ మరణవార్త తెలియగానే ఇరు కుటుంబాలు, బంధుమిత్రులు విషాదంలో మునిగిపోయారు. ఘటనపై సుళ్య పోలీసులు కేసు నమోదు చేశారు. -
వెస్ట్ జోన్ జట్టులో అర్జున్ టెండూల్కర్
వడోదర:ఇంటర్ జోనల్ టోర్నమెంట్లో భాగంగా అండర్ -16 వెస్ట్ జోన్ జట్టుకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఎంపికయ్యాడు. ఈ మేరకు సోమవారం ఆలిండియా జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ రాకేష్ పారిక్ నేతృత్వంలో సెలక్టర్లు అర్జున్ కు అవకాశం కల్పించారు. వెస్ట్ జోన్ జట్టుకు ఓఎమ్ భోసాలే కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. అండర్-16 వెస్ట్ జోన్ జట్టు: ఓఎమ్ భోసాలే(కెప్టెన్), వాసుదేవ్ పాటిల్, సువేద్ పార్కర్, స్మిత్ పటేల్, సన్ ప్రీత్ బగ్గా, యస్వి జైశ్వాల్, దైవాంశ్ సక్సెనా, నీల్ జాదవ్, అర్జన్ టెండూల్కర్, యోగేష్ దోంగ్రే, అంకోల్కర్, సురజ్ సుర్యాల్, సిద్దార్త్ దేశాయ్, అకాశ్ పాండే, ముకుంద సర్దార్ -
స్మార్ట్ రాన్ నుంచి టి-ఫోన్
♦ ఆవిష్కరించిన సచిన్, కేటీఆర్ ♦ స్మార్ట్‌ఫోన్ ధర రూ.22,999 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ కంపెనీ స్మార్ట్రాన్ టి-ఫోన్ పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను గురువారమిక్కడ ప్రవేశ పెట్టింది. క్రికెటర్ సచిన్ టెండూల్కర్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు చేతుల మీదుగా ఈ ఫోన్‌ను విడుదల చేసింది. 5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ అమోలెడ్ డిస్ప్లే, 64 బిట్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 810 అక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమరీని దీనికి పొందుపరిచారు. 4జీ, డ్యూయల్ ఫ్లాష్‌తో 13 ఎంపీ కెమెరా, 4 ఎంపీ ఫ్రంట్ కెమెరా, డీటీఎస్ ప్రీమియం సౌండ్, డ్యూయల్ సిమ్, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ, టైప్-సి చార్జర్ ఇతర ఫీచర్లు. వెలుతురులో డిస్ప్లే స్పష్టత కోసం అపికల్ అసెర్టివ్ టెక్నాలజీని వాడారు. ధర రూ.22,999. నాలుగు రంగుల్లో లభిస్తుంది. జూన్ నుంచి స్మార్ట్రాన్ టి-స్టోర్, గ్యాడ్జెట్360.కామ్‌లో కొనుక్కోవచ్చు. ఏటా ఒక మోడల్..: స్మార్ట్రాన్ ఇటీవలే ఇక్కడి గచ్చిబౌలిలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. తయారీ కేంద్రాన్ని సైతం నెలకొల్పాల్సిందిగా ఈ సందర్భంగా కేటీఆర్ కోరారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. 14 అంగుళాల అల్ట్రాబుక్, 15.6 అంగుళాల ల్యాప్‌టాప్‌తోపాటు ఇతర యాక్సెసరీస్‌ను కొద్ది రోజుల్లో ప్రవేశపెడతామని కంపెనీ వ్యవస్థాపకులు మహేష్ లింగారెడ్డి వెల్లడించారు. ఏటా ఒక ఫ్లాగ్షిప్ మోడల్‌ను తీసుకొస్తామని చెప్పారు. ఇప్పటికే టీ-బుక్ పేరుతో అల్ట్రాబుక్‌ను ప్రవేశపెట్టామన్నారు. ‘ప్రస్తుతం ఫాక్స్‌కాన్‌కు చెందిన విదేశీ ప్లాంట్లలో తయారు చేసి ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాం. కొద్ది రోజుల్లో ఫాక్స్‌కాన్ భారత ప్లాంట్లలో తయారు చేయిస్తాం. రెండు మూడేళ్లలో సొంత ప్లాంటు పెట్టాలన్న ఆలోచన ఉంది. పరిశోధన, అభివృద్ధికి రూ.50 కోట్లకుపైగా ఖర్చు చేశాం’ అని పేర్కొన్నారు. సవాళ్లుంటేనే ఫన్..: స్మార్ట్రాన్లో సచిన్ సైతం పెట్టుబడులు పెట్టారు. టి-ఫోన్ విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సవాళ్లు లేకుంటే జీవితంలో ఫన్ ఉండదని అన్నారు. సవాళ్ల నుంచి వచ్చిన విజయమే మరింత తీయగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ‘నేను యవ్వనంలో ఉన్నప్పుడు స్మార్ట్ఫోన్లు లేవు. ల్యాండ్‌లైన్ ముందు కుటుంబ సభ్యులందరూ కూర్చుని మాట్లాడేవారు. ఇప్పుడు అందరి చేతిలోనూ మొబైల్ ఉంటోంది. అందరూ అందుబాటులో ఉంటున్నారు. నా కుమారుడు అర్జున్ కి ఆరేళ్ల వయసు వచ్చే దాకా అతనితో మొబైల్లో మాట్లాడలేదు. స్మార్ట్రాన్ విషయంలో సరైన కంపెనీనే ఎంచుకున్నందుకు గర్వంగా ఉంది’ అన్నారు. -
మరో 36 పరుగులు చేస్తే...
► అరుదైన రికార్డు కుక్ సొంతం ► నేటి నుంచి లంకతో తొలి టెస్టు లీడ్స్: మరో 36 పరుగులు చేస్తే ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ అలిస్టర్ కుక్... టెస్టుల్లో అరుదైన రికార్డును సొంతం చేసుకోనున్నాడు. ఇంగ్లండ్ క్రికెట్ చరిత్రలో 10 వేల పరుగులు పూర్తి చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డులకెక్కుతాడు. ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా సచిన్ రికార్డునూ అధిగమిస్తాడు. ఈ నేపథ్యంలో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా నేటి నుంచి జరిగే తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్... శ్రీలంకతో తలపడుతుంది. గతంలో సచిన్ 31 ఏళ్ల 10 నెలల వయసులో పాకిస్తాన్ (2005)పై ఈ రికార్డును సాధించాడు. గతేడాది క్రిస్మస్తో కుక్కు 31 ఏళ్లు నిండాయి. -
నన్ను సచిన్‌తో పోల్చకండి.. ఇబ్బందిగా ఉంది!
పరుగుల యంత్రంలా మారి నిరంతరం రికార్డులతో హోరెత్తిస్తున్న విరాట్ కోహ్లిపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొని ఉంది. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, టీ-20 వరల్డ్ కప్, ఐపీఎల్.. ఇలా తాను ఆడిన ప్రతి సీరిస్‌లోనూ తనదైన ప్రత్యేకత నిలుపుకొంటున్న కోహ్లిని ఇప్పుడు అందరూ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌తో పోలుస్తున్నారు. డొనాల్డ్ బ్రాడ్‌మన్ తర్వాత క్రికెట్లో ఆ స్థాయిలో గొప్ప ఆటతీరును ప్రదర్శించిన ఆటగాడు సచిన్. 100 అంతర్జాతీయ సెంచరీలు, 200 టెస్టులు ఆడిన ఏకైక ఆటగాడికి క్రికెట్ చరిత్రలో సచిన్‌కు తిరుగులేని స్థానం. మరి, అంతటి లెజండరీ ఆటగాడితో పోలిక పట్ల కోహ్లి ఎలా ఫీలవుతున్నాడంటే.. 'నిజాయితీగా చెప్తున్నా. చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. ఇది సరికాదు. సచిన్‌ను ఎవరితో పోల్చలేం. నా విషయంలో ఈ పోలిక ఎంతమాత్రం ప్రామాణికం కాదు. అతన్ని చూస్తేనే నేను ఎదిగాను. కానీ క్రీజ్‌లో నాలా ఆడాలనుకుంటాను. కచ్చితంగా సచిన్ నుంచి స్ఫూర్తి పొందుతాను. ఏ ఆటగాడితో పోల్చినా రెండు రెట్లు ఎక్కువ ఎత్తులో ఉంటారు ఆయన. సచిన్‌కు ప్రతిభ స్వతహఃగా జన్మతో వచ్చింది. నేను కష్టపడి దానిని సొంతం చేసుకున్నాను' అని కోహ్లి వివరణ ఇచ్చాడు. -
సచిన్‌కన్నా కాంబ్లీ ఎక్కువ ప్రతిభావంతుడు!
క్రీడల్లో ఎదిగేందుకు ప్రతిభ ఒక్కటే సరిపోదని, సరైన కుటుంబ వాతావరణం, మంచి స్నేహితులు వంటివి కూడా ప్రభావం చూపిస్తాయని క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్ అభిప్రాయపడ్డారు. వాస్తవానికి సచిన్‌కంటే వినోద్ కాంబ్లీ ప్రతిభావంతుడే అయినా అతనికి సరైన మార్గదర్శనం లభించక వెనుకబడిపోగా, అందరి ప్రోత్సాహంతో సచిన్ 24 ఏళ్లు భారత్‌కు ఆడగలిగాడని గుర్తు చేశారు. అతని విజయాల్లో కుటుంబం కీలకపాత్ర పోషించిందన్నారు. -
మోదీ గురించి కోహ్లి చెప్పిన ఒక్కమాట!
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భారత టాప్ క్రికెటర్ విరాట్ కోహ్లి వ్యక్తిగతంగా ఎప్పుడూ కలుసుకోలేదు. కానీ, సోషల్ మీడియాలో వీరు పలుసార్లు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నరేంద్రమోదీ దేశ ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టినప్పుడు ట్విట్టర్ లో కోహ్లి శుభాకాంక్షలు తెలిపాడు. మోదీ దేశాన్ని మరింత గొప్పగా నిలబెట్టాలని ఆకాంక్షించారు. ఆ తర్వాత ఇటీవలి వరల్డ్ కప్ సందర్భంలో కోహ్లిని ట్యాగ్ చేస్తూ ప్రధాని మోదీ వ్యక్తిగతంగా ఆల్ ద బెస్ట్ చెప్పారు. వరల్డ్ కప్ లో తన అద్భుత పోరాటంతో టీమిండియాను కోహ్లిని గెలిపించినప్పుడు అతనిపై మోదీ ప్రశంసల వర్షం కురిపించాడు. వ్యక్తిగతంగా కలుసుకోకపోయినా ఇలా కోహ్లి-మోదీ మధ్య మంచి అనుబంధమే ఉంది. ఈ నేపథ్యంలో సీఎన్ఎన్ చానెల్ లో మల్లికా కపూర్ కు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ గురించి ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారని మల్లికా కపూర్ అడుగగా..'సెల్ఫ్ బిలీఫ్' (ఆత్మవిశ్వాసం) అని కోహ్లి బదులిచ్చారు. ప్రధాని మోదీకి ఆత్మవిశ్వాసం ఎక్కువ అని కితాబిచ్చారు. అదే సమయంలో తనకున్న క్రికెట్ నైపుణ్యంపైనే విశ్వాసంతోనే తాను మైదానంలో అడుగుపెడతానని కోహ్లి తెలిపారు. ఈ ఇంటర్వ్యూలో కోహ్లి ఇచ్చిన ఫటాఫట్ జవాబులివి.. క్రికెట్ ను మీరు ఎలా భావిస్తారు? నా జీవితంలో క్రికెట్ కే అన్నింటికన్నా ఎక్కువ ప్రాధాన్యమిస్తాను దూకుడుగా ఆడటంపై.. దూకుడుగా ఆడటమే నన్ను గేమ్ లో టాప్ ఆటగాడిగా నిలబెట్టింది. ఏదిఏమైనా ఎట్టిపరిస్థితుల్లో దానిని వీడను. టెస్ట్ క్రికెట్ ఆడటంపై.. టెస్ట్ క్రికెట్ ఒక ప్రయాణం లాంటింది. ఎన్నింటినో నేర్పిస్తుంది. నిన్ను నువ్వు కనుగొనేందుకు ఉపయోగపడుతుంది. మీ వ్యక్తిగత జీవితంపై వస్తున్న కథనాలపై.. మైదానంలో ఎలా ఆడుతారు అన్న దానిపైనే ఆటగాళ్లను పరిగణించాలి. అంతేకానీ వ్యక్తిగతంగా వారు ఏమిటి అన్నదానిపై కాదు సచిన్ తో అంతర్జాతీయ వేదిక పంచుకోవడంపై.. సచిన్ నా ఆరాధ్యుడు. నా ఆదర్శంగా భావిస్తూ వచ్చిన ఆయనతో కలిసి క్రికెట్ ఆడటం నిజం కాదేమో అనిపిస్తుంది. మ్యాచ్ ఫిక్సింగ్ పై.. ఎవరైనా తప్పు చేయాలనుకుంటే ఎవరూ ఆపలేరు.ఎంత నియంత్రణ ఉన్నా మ్యాచ్ ఫిక్సింగ్ ఆపడం కష్టం. -
నటించడమే కష్టంగా ఉంది:సచిన్
ముంబై: క్రికెట్ ఆడటం కంటే నటించడమే చాలా కష్టంగా ఉందని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. 'సచిన్' మూవీ టీజర్‌ను గురువారం విడుదల చేసిన అనంతరం సచిన్ టెండూల్కర్ మీడియాతో మాట్లాడాడు. ' నాకు క్రికెట్ ను ఆడటం కంటే నటించడమే ఒక ఛాలెంజ్ అనిపించింది. సినిమా సందర్భంగా నేను ఏది చేయాలనుకున్నానో అది చేశా. కానీ కొన్ని ప్రత్యేకమైన సీన్లలో చాలా ఇబ్బంది పడ్డా. నా డ్రీమ్‌లో భాగమైన యాక్టింగ్ కంటే క్రికెట్ ఆడటమే సులువుగా అనిపించింది. క్రికెట్ ను ఎంజాయ్ చేస్తూ ఆడా. ఈ రెండింటిని పోల్చి చూస్తే మాత్రం నాకు నటించడమే సవాల్ గా అనిపించింది. ఇందులో ఎటువంటి సందేహం లేదు' అని సచిన్ పేర్కొన్నాడు. -
వెండితెర మీద క్రికెట్ గాడ్
బాలీవుడ్ తెర మీద మరో బయోపిక్కు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఇండియన్ క్రికెటర్స్ ధోని, అజారుద్దీన్‌ల జీవిత కథల ఆధారంగా సినిమాలు తెరకెక్కుతున్న నేపథ్యంలో క్రికెట్ గాడ్ సచిన్ బయోగ్రఫీ కూడా వెండితెర మీద సందడి చేయనుంది. తాజాగా ఈ సినిమాకు సంబందించిన పోస్టర్‌ను సచిన్ స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. కాళ్లకు ప్యాడ్స్ కట్టుకొని వస్తున్న ఈ ఫొటో అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. సచిన్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఏ బిలియన్ డ్రీమ్స్ అనే క్యాప్షన్‌ను యాడ్ చేశారు. '55 రోజుల ట్రైనింగ్, ఒక జత ట్రౌజర్స్, సచిన్ స్టోరీ' అని పోస్టర్‌పై రాసిన స్టేట్ మెంట్, ఇది సచిన్ పూర్తి బయోగ్రఫీ కాదేమో అన్న అనుమానం కలిగిస్తోంది. తన పాత్రలో సచిన్ స్వయంగా నటిస్తున్న ఈ సినిమాను డాక్యుమెంటరీ సినిమా తరహాలో రూపొందిస్తున్నారు. బ్రిటిష్ దర్శకుడు జేమ్స్ ఎరిక్సన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అదిస్తున్నాడు. ఈ నెల 14న సచిన్ ఫస్ట్ లుక్ టీజర్‌ను విడుదల చేయనున్నారు. -
సచిన్ మూవీ పోస్టర్ విడుదల
ముంబై:ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానుల్ని సంపాదించుకున్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ జీవితకథ ఆధారంగా రూపొందుతున్న 'సచిన్' చిత్ర పోస్టర్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌లో భాగంగా పోస్టర్ ను సచిన్ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. 42 ఏళ్ల సచిన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ముంబైకి చెందిన ఒక ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ నిర్మిస్తుండగా, బ్రిటన్ కు చెందిన జేమ్స్ ఏర్స్కిన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని దాదాపు అన్ని భాషల్లోనూ అనువాదం చేసే అవకాశం ఉంది. '55 డేస్ ఆఫ్ ట్రైనింగ్. వన్ పెయిర్ ఆఫ్ ట్రూజర్స్. ది సచిన్ స్టోరీ' అని పోస్టర్ పై రాసి ఉన్న క్యాప్షన్ ఆలోచింపజేసేదిగా ఉండగా, మరోవైపు బ్యాక్ గ్రౌండ్ లో సచిన్ చేతిలో బ్యాట్ పట్టుకుని ఫీల్డ్‌లో నడుచుకుంటూ వెళుతున్నట్లు ఉండటం ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉండగా ఈ చిత్ర టీజర్‌ను ఏప్రిల్ 14వ తేదీన విడుదల చేయనున్నారు. సచిన్ తన క్రీడా జీవితంలో 200 టెస్టులు, 463 వన్డేలు ఆడి మొత్తం 100 సెంచరీలు చేసి ప్రపంచ క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనతను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి క్రికెట్ ఫీల్డ్ లో తనదైన ముద్ర వేసిన సచిన్ ఇక చిత్రాల్లో ఎలాంటి హిట్లు కొడతాడనేది అనేది మాత్రం వేచి చూడకతప్పదు. -
మేమంతా నీతోనే: సచిన్
న్యూఢిల్లీ:ఇటీవల జరిగిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో రజత పతకం సాధించి రియో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన భారత బాక్సర్ శివ థాపాకు మాస్టర్ బ్టాస్టర్ సచిన్ టెండూల్కర్ నుంచి మద్దతు లభించింది. 'రియోకు అర్హత సాధించిన నీకు అంతా మంచే జరగాలి. మేమంతా నీతోనే ఉన్నాం. మా నుంచి నీకు పూర్తి సహకారం ఉంటుంది. రియో పోరులో ఎటువంటి ఒత్తిడికి లోను కావద్దు. లక్ష్యంపైనే గురి పెట్టు. ఫలితం అదే వస్తుంది' అని టెండూల్కర్ ట్వీట్ చేశాడు. బరిలో దిగేటప్పుడు సానుకూల దృక్పథంతో ఉండాలని సచిన్ సూచించాడు. ఒక బిగ్ ఈవెంట్ లో పాల్గొంటున్నప్పుడు ఒత్తిడి అనేది సహజంగానే ఉంటుందని, దాన్ని అధిగమించడానికి కృషి చేయమని శివ థాపాకు విజ్ఞప్తి చేశాడు. టీమిండియా వన్డే వరల్డ్ కప్ ను గెలిచినప్పుడు ఒత్తిడిని ఎలా అధిగమించారంటూ థాపా ట్విట్టర్లో అడిగిన ప్రశ్నకు సచిన్ పై విధంగా బదులిచ్చాడు. -
ప్రపంచంలో ఎప్పుడైనా...ఎక్కడైనా...
► ఈడెన్లోనూ పాకిస్తాన్‌పై భారత్ విజయం ► చెలరేగిన విరాట్ కోహ్లి భారత్ మళ్లీ గర్జించింది... విశ్వ వేదికపై మనల్ని ఓడించడం పక్కవాడి, పగవాడి తరం కాదని మరో సారి నిరూపించింది. చరిత్ర మార్చడం అంత సులువు కాదని, అదిప్పుడు శిలాక్షరంగా మారిపోయిందని ప్రత్యర్థికి గట్టిగా గుర్తు చేసింది. ఈడెన్‌లో శత సహస్ర సంఖ్యలో ‘హిందుస్తాన్ జిందాబాద్’ అని వినిపిస్తుండగా, సగర్వంగా మరో విజయాన్ని అందుకుంది. ఈ మైదానం మాకు అచ్చి వచ్చిందని చెప్పుకుంటూ ఆటకు ముందే సంబరపడిన పాకిస్తాన్‌ను ధోని సేన దుమ్ము దులిపింది. ఇక్కడే కాదు ప్రపంచంలో భారత్‌తో ఎక్కడ ప్రపంచకప్ మ్యాచ్ జరిగినా విజయం వారి వాకిలి వైపు కూడా తిరిగి చూడదని ఆ జట్టుకు అర్థమయ్యేలా గట్టి దెబ్బ కొట్టిన మన జట్టు పనిలో పనిగా సొంతగడ్డపై ప్రపంచకప్‌లో మనమేంటో చూపిస్తూ రేసులో నిలబడింది. కొలంబో, ఢాకా, సిడ్నీ, కోల్‌కతా... మైదానం ఏదైనా ‘పాకిస్తాన్‌తో మ్యాచ్ అంటే నేనే గెలిపిస్తాను’ అని విరాట్ కోహ్లి మరోసారి ఢంకా బజాయించి చెప్పాడు. దాయాదిపై తన ఘన రికార్డును నిలబెట్టుకున్నాడు. వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయి ఆందోళనతో ఉన్న సమయంలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి భారత్కుచిరస్మరణీయ విజయాన్ని అందించాడు. కోల్‌కతానుంచి సాక్షి క్రీడా ప్రతినిధి టి20 ప్రపంచకప్‌లో భారత్ మళ్లీ రేస్‌లోకి వచ్చేసింది. గత మ్యాచ్ ఓటమి నుంచి తొందరగానే కోలుకున్న ధోనిసేన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ని చిత్తు చేసి వరల్డ్‌కప్‌లలో తమ రికార్డును నిలబెట్టుకుంది. శనివారం ఇక్కడి ఈడెన్ గార్డెన్స్ మైదానంలో వర్షం కారణంగా 18 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ 18 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. మాలిక్ (16 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్), అక్మల్ (16 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్) కీలక భాగస్వామ్యంతో ఆ జట్టు ఈ మాత్రం పరుగులైనా చేయగలిగింది. అనంతరం భారత్ 15.5 ఓవర్లలో 4 వికెట్లకు 119 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (37 బంతుల్లో 55 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్ ) అర్ధ సెంచరీతో చెలరేగగా, యువరాజ్ (23 బంతుల్లో 24; 1 ఫోర్, 1 సిక్స్) అండగా నిలిచాడు. వీరిద్దరు నాలుగోవికెట్‌కు 44 బంతుల్లోనే 61 పరుగులు జోడించడం విశేషం. భారత్ తమ తర్వాతి మ్యాచ్‌లో ఈ నెల 23న బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. కీలక భాగస్వామ్యం గింగిరాలు తిరుగుతున్న అశ్విన్ బంతి, అనూహ్య బౌన్స్... చూస్తే ఈడెన్ గార్డెన్ కూడా నాగ్‌పూర్ పిచ్‌లాగే అనిపించింది. పాక్ జట్టు కూడా తడబడుతూనే తమ ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ప్రారంభించింది. మూడో ఓవర్ చివరి బంతికి గానీ ఆ జట్టు తొలి బౌండరీని కొట్టలేకపోయింది. భారత బౌలింగ్ కట్టుదిట్టంగా సాగడంతో పరుగులు తీయడానికి తీవ్రంగా ఇబ్బంది పడిన ఓపెనర్లు షర్జీల్ (24 బంతుల్లో 17; 2 ఫోర్లు), షహజాద్ (28 బంతుల్లో 25; 3 ఫోర్లు) తక్కువ వ్యవధిలోనే వెనుదిరిగారు. గత మ్యాచ్‌లో బంగ్లాపై చెలరేగిన ఆఫ్రిది (8) ఒక్కో బంతిని ఆడేందుకు శ్రమించి చివరకు పాండ్యా బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఈ దశలో మాలిక్, అక్మల్ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు పాండ్యా వేసిన 14వ ఓవర్లో రెండు సిక్సర్లతో 15 పరుగులు రావడంతో పాక్ పరిస్థితి కాస్త మెరుగైంది. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 4 ఓవర్లలోనే 41 పరుగులు జోడించారు. చివర్లో మళ్లీ వేగం తగ్గిన పాక్ ఆఖరి 3 ఓవర్లలో 23 పరుగులతోనే సరిపెట్టుకుంది. పిచ్‌పై తేమను ఉపయోగించుకోవడంతో పాటు వర్షం పడితే లక్ష్య ఛేదనపై స్పష్టత ఉంటుందని టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయకపోగా... పాక్ మాత్రం లెఫ్టార్మ్ స్పిన్నర్ ఇమాద్ స్థానంలో అనూహ్యంగా నాలుగో పేసర్‌గా సమీని ఎంచుకుంది. సూపర్ కోహ్లి: స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ ఆరంభంలో మళ్లీ న్యూజిలాండ్ మ్యాచ్ అనుభవాన్నే గుర్తుకు తెచ్చింది. ఇర్ఫాన్ ఓవర్లో 2 ఫోర్లు బాదిన తర్వాత రోహిత్ (10) ఆమిర్ చక్కటి బంతికి వెనుదిరగ్గా, ఆ వెంటనే సమీ వరుస బంతుల్లో ధావన్ (6), రైనా (0)లను క్లీన్‌బౌల్డ్ చేసి ఒక్కసారిగా అలజడి రేపాడు. కానీ ఎప్పటిలాగే కోహ్లి ముందుండి నడిపించాడు. తనదైన శైలిలో జాగ్రత్తగా ఆరంభం చేసి నిలదొక్కుకున్న తర్వాత దూకుడు కనబర్చాడు. పాక్ బౌలర్లు ఒక్కసారి కూడా కోహ్లిని కనీసం ఇబ్బంది పెట్టలేకపోయారు. మరో వైపు యువరాజ్నుంచి కోహ్లికి చక్కటి సహకారం లభించింది. చాలా కాలం తర్వాత యువరాజ్ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు ప్రతీ బౌలర్‌ను సమర్థంగా ఎదుర్కోవడంతో పరుగులు రావడంలో ఎలాంటి ఇబ్బంది లేకపోయింది. చివర్లో అనవసర షాట్‌తో యువీ వెనుదిరిగినా... కోహ్లి, ధోని (13 నాటౌట్) మరో 13 బంతులు మిగిలి ఉండగానే ముగించారు. స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: షర్జీల్ (సి) పాండ్యా (బి) రైనా 17; షహజాద్ (సి) జడేజా (బి) బుమ్రా 25; ఆఫ్రిది (సి) కోహ్లి (బి) పాండ్యా 8; అక్మల్ (సి) ధోని (బి) జడేజా 22; మాలిక్ (సి) అశ్విన్ (బి) నెహ్రా 26; సర్ఫరాజ్ (నాటౌట్) 8; హఫీజ్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (18 ఓవర్లలో 5 వికెట్లకు) 118. వికెట్ల పతనం: 1-38; 2-46; 3-60; 4-101; 5-105. బౌలింగ్: నెహ్రా 4-0-20-1; అశ్విన్ 3-0-12-0; బుమ్రా 4-0-32-1; జడేజా 4-0-20-1; రైనా 1-0-4-1; పాండ్యా 2-0-25-1. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) మాలిక్ (బి) ఆమిర్ 10; ధావన్ (బి) సమీ 6; కోహ్లి (నాటౌట్) 55; రైనా (బి) సమీ 0; యువరాజ్ (సి) సమీ (బి) రియాజ్ 24; ధోని (నాటౌట్) 13; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (15.5 ఓవర్లలో 4 వికెట్లకు) 119. వికెట్ల పతనం: 1-14; 2-23; 3-23; 4-84. బౌలింగ్: ఆమిర్ 3-1-11-1; ఇర్ఫాన్ 2.5-0-25-0; సమీ 2-0-17-2; ఆఫ్రిది 4-0-25-0; మాలిక్ 2-0-22-0; రియాజ్ 2-0-16-1. సచిన్‌కు వందనం అర్ధ సెంచరీ సాధించినప్పుడు విరాట్ కోహ్లి ఏదో బ్యాట్ చూపించడంతో ఆగిపోకుండా ప్రేక్షకుల వైపు చూస్తూ కిందికి వంగుతూ వందనం చేయడం అందరికీ కనిపించింది. అప్పటికే జట్టు విజయం దాదాపు ఖాయమైన స్థితిలో హాఫ్ సెంచరీకి ఈ రకంగా భిన్నంగా తన ఆనందాన్ని వ్యక్తం చేయడం ఆసక్తిని కలిగించింది. అయితే అది తాను ఎంతో అభిమానించే దిగ్గజం సచిన్ టెండూల్కర్ కోసమని కోహ్లి చెప్పాడు. సచిన్ ఎన్నో గొప్ప చారిత్రాత్మక ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును గెలిపించారని, ఆయన సమక్షంలో ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాలని ఎంతో కాలంగా కోరుకున్నట్లు కోహ్లి చెప్పాడు. ఇప్పుడు ఇది సరైన సందర్భంగా తాను భావించానని, అందుకే సచిన్‌కు ఈ తరహాలో వందనం చేసినట్లు అతను వెల్లడించాడు. ప్రతిగా సచిన్ కూడా చిరునవ్వుతో విరాట్‌కు బదులిచ్చారు. 11 ప్రపంచకప్‌లలో (వన్డేలు, టీ20లు కలిపి) పాకిస్తాన్‌పై భారత్ గెలవడం ఇది 11వ సారి. -
మోదీ ఏమన్నారంటే..
ప్రధాని నరేంద్రమోదీ నేటి 'మన్ కీ బాత్' కార్యక్రమంలో పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఆసక్తికర ఉదాహరణలతో విద్యార్థులకు పలు సూచనలు, సలహాలను అందజేశారు. మోదీతోపాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. మోదీ ఏం మాట్లాడారంటే.. - నాకు తెలుసు మీరంతా మీ పిల్లల పరీక్షల గురించి కంగారు పడుతున్నారని, మీతోపాటు నేను కూడా విద్యార్థుల పరీక్షల విషయంలో కొంత ఆందోళనతోనే ఉన్నాను. - ఈ 20 నిముషాలు నేను మాట్లాడబోతున్న విషయాలు విద్యార్థులుకు తప్పక ఉపయోగపడతాయని భావిస్తున్నాను. - పరీక్షలంటే మొత్తంగా మార్కులకు సంబంధించినవి కావు, ప్రతి పరీక్ష గొప్ప ప్రయోజనానికి దారి మాత్రమే. - ఈ పరీక్షలతోనే మీకు మీరు హద్దులు ఏర్పరుచుకోకండి, గొప్ప గొప్ప ప్రయోజనాలపై దృష్టి పెట్టండి. - తగిన విశ్రాంతి, నిద్ర చాలా అవసరం. ప్రతిరోజు పడుకునేముందు ఎక్కువ సమయం ఫోన్ లో సంభాషించటం మనకు అలవాటుగా మారిపోయింది. అంతసేపు మన కలతల గురించి మాట్లాడాక ఇక ప్రశాంతమైన నిద్ర ఎలా పడుతుంది? అందుకే మనం ఆ అలవాటుని అధిగమించాలి. - క్రమశిక్షణే జీవితంలో విజయానికి పునాది అవుతుంది. - టెన్షన్ కి లోనుకాకుండా ప్రశాంతంగా చిరునవ్వుతో పరీక్షలు రాయండి, మీ భవిష్యత్తును మీరే తీర్చిదిద్దుకోండి. - జె.కె.రోలింగ్ మనందరికీ మంచి ఉదాహరణ. ఎవరైనా ఏ సమయంలోనైనా ఏదైనా సాధించగలరని ఆమె నిరూపించారు. ఎన్నో కష్టనష్టాలకోర్చి ఆమె విజయం సాధించారు. - ఉత్సుకత అనేది ఆవిష్కరణలకు తల్లి వంటిది. శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధితోనే ఆవిష్కరణలు సాధ్యం. 'నేషనల్ సైన్స్ డే' రోజున శాస్త్ర, సాంకేతిక రంగాలను మన జీవితాల్లో ముఖ్యమైన భాగాలుగా గుర్తిద్దాం. ఈ సందర్భంగా నేను సర్ సివి రామన్ కు ప్రణమిల్లుతున్నాను. అలాగే శాస్త్రీయ దృక్పధాన్ని పెంపొందించుకునే దిశగా కృషి చేయమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. - దేశ ప్రజలు రేపు ఆర్థిక బడ్జెట్ తో నన్ను పరీక్షించనున్నారు, నా పరీక్షతోపాటు మీ పరీక్షలు సఫలమవుతాయని ఆశిస్తున్నాను. - తల్లిందండ్రులు, ఉపాధ్యాయులు, సీనియర్ విద్యార్థులు పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు తగిన సపోర్ట్ అందించండి. వారి విజయంలో మీరూ భాగస్వాములు కండి. సచిన్ టెండూల్కర్ ఏమన్నారంటే.. - రిలాక్స్డ్గా ఉండండి, మీ టార్గెట్ ను మీరే నిర్దేశించుకుని.. సాధించేందుకు ప్రయత్నించండి. నేను ఆడుతున్నప్పుడు నా మీద ఎందరికో భారీ అంచనాలుండేవి, కానీ నా టార్గెట్ ను నేనే నిర్దేశించుకునేవాడిని. - ప్రశాంతమైన మనస్సుతో పరీక్షలకు సిద్ధంకండి. మీకు మీరే పోటీగా భావించాలి తప్ప, పక్కవారితో పోల్చుకోకూడదు. - మీ ఆలోచనలు పాజిటివ్ గా ఉండే ఫలితాలు కూడా పాజిటివ్ గానే ఉంటాయి.. గుడ్ లక్. విశ్వనాధన్ ఆనంద్ ఏమన్నారంటే.. - మౌనంగా ఉండండి, మంచి ఆహారం, తగినంత నిద్ర తప్పనిసరి. - భారీ అంచనాలు విపరీతమైన ఒత్తిడికి దారితీస్తాయి, కాబట్టి మరీ భారీ అంచనాల జోలికి వెళ్లకపోవడం మంచిది. - ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉండొద్దు, అలా అని నిరాశావాదులుగా కూడా ఉండొద్దు. కేవలం ఒక చాలెంజ్ గా మాత్రమే తీసుకోండి. గురు మోరారీ బాపూ.. - ప్రశాంతంగా ఉండండి, విజయం వెంట పరుగులు తీయాల్సిన పని లేదు.. పరిస్థితిని అంగీకరిస్తే చాలు. - అందరూ విజయాలే అందుకోవాల్సిన అవసరం లేదు, అపజయాలతో కూడా సంతోషంగా బతకడం నేర్చుకోవాలి. మీకు నా ఆశీస్సులు. ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావు - నాకు తెలుసు.. పరీక్షల సమయంలో విద్యార్థులు ఎంతటి యాంగ్జైటీకి గురవుతారో, ముఖ్యంగా కాంపిటీటివ్ పరీక్షల విషయంలో.. కానీ దిగులు పడొద్దు.. మీరే విజేతలు. - దేశంలో ఎన్నెన్నో అవకాశాలున్నాయి. మీరేం చేయాలనుకుంటున్నారనేది మీరే ఆలోచించుకోండి.. డోన్ట్ గివ్ ఇట్ అప్. ఇంకా మోదీ మాట్లాడుతూ తనతోపాటు విద్యార్థులకు విలువైన సూచనలు అందించిన సచిన్ టెండూల్కర్, విశ్వనాధన్ ఆనంద్, ప్రొఫెసర్ సిఎన్ఆర్ రావు, మోరారీ బాపూలకు ధన్యవాదాలు తెలిపారు. సైన్స్ డే సందర్భంగా పలువురు శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. -
'మన్ కీ బాత్'లో సచిన్ టెండూల్కర్
ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ 'మన్ కీ బాత్' కార్యక్రమం ద్వారా దేశ ప్రజలతో తన అభిప్రాయాలను పంచుకుంటున్న విషయం తెలిసిందే. కాగా ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆల్ ఇండియా రేడియో ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమంలో మోదీతో పాటు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా ముచ్చటించనున్నారు. పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడనున్నారు. అలాగే సచిన్ తోపాటు ప్రముఖ చెస్ ఛాంపియన్ విశ్వనాధన్ ఆనంద్ కూడా విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పనున్నారు. ఈ కార్యక్రమాన్ని యాప్ ద్వారా కూడా వినే అవకాశం ఉంది. Being positive and setting your own goals...Happy to join PM @narendramodi on #MannKiBaat wishing students good luck for their Board exams! — sachin tendulkar (@sachin_rt) February 28, 2016 Tune in at 11 AM. You can also hear it on the Mobile App. #MannKiBaat https://t.co/TYuxNNJfIf pic.twitter.com/jKnMs4Udal — Narendra Modi (@narendramodi) February 28, 2016 -
ఆటను మార్చేద్దాం!
ఊర్లలో సరదాగా ఆడుకునే మ్యాచ్‌లు కావచ్చు... పట్టణాల్లో పాఠశాల స్థాయి క్రికెట్ కావచ్చు... నగరాల్లో క్లబ్ క్రికెట్ కావచ్చు... చాలా సాధారణంగా ఒక దృశ్యం కనిపిస్తూ ఉంటుంది. బాగా ఆడే క్రికెటర్లు ఒక నలుగురు జట్టులో ఉంటారు. వాళ్లే బౌలింగ్ చేస్తారు, వాళ్లే బ్యాటింగ్ చేస్తారు. సెంచరీలు, డబుల్ సెంచరీలు బాదేస్తారు. మిగిలిన ఏడుగురూ ఫీల్డర్లుగా మాత్రమే పనికొస్తారు. మరో ముగ్గురు లేదా నలుగురిని మంచినీళ్లు ఇవ్వడానికి మాత్రమే వాడుకుంటారు. దేశం తరఫున ఆడే పోటీ క్రికెట్లో విజయం ముఖ్యం కాబట్టి... బాగా ఆడే నలుగురు ముందే ఆడినా అభ్యంతరం లేదు. కానీ నైపుణ్యం వెలుగులోకి రావాల్సిన జూనియర్ స్థాయి క్రికెట్లోనూ ఇదే జరుగుతోంది. దీనివల్ల చాలా తక్కువ మంది క్రికెటర్లు మాత్రమే వెలుగులోకి వస్తున్నారు. రోజంతా స్కూల్ మానేసి కూడా పిల్లలు బెంచ్ మీద కూర్చుని ఆట చూస్తున్నారు. దీనివల్ల లక్షలాది మంది పిల్లలు వెలుగులోకి రావడం లేదు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? ఏ స్థాయి క్రికెట్లో అయినా విజయం ముఖ్యం. కచ్చితంగా మన దగ్గర ఉన్న ఉత్తమ క్రికెటర్లను ఆడించి ప్రత్యర్థిని ఓడించాలి. ఏ కోచ్ అయినా, ఏ అకాడమీ అయినా, ఏ కెప్టెన్ అయినా ఇదే ఆలోచిస్తాడు. అండర్-16 స్థాయి దాటిన తర్వాత ఈ వ్యవస్థ ఉన్నా ఫర్వాలేదు. కానీ పిల్లల్లో ప్రతిభను వెలికితీయాల్సిన స్థాయిలోనూ ఇదే జరుగుతోంది. భారత క్రికెట్‌కు ఇది ఎంతమాత్రం మంచిది కాదనేది ద్రవిడ్ అభిప్రాయం. దీనివల్ల పిల్లల సమయం వృథా అవడం తప్ప ఉపయోగం లేదని చెబుతున్నాడు. మరోవైపు సచిన్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాడు. అందుకే ఈ ఇద్దరు క్రికెట్లో కొన్ని మార్పులు చేయాలని సూచించారు. ముఖ్యంగా జూనియర్ క్రికెట్లో ఈ మార్పులు చేస్తే ఎక్కువ మంది వెలుగులోకి వస్తారని ఇద్దరు దిగ్గజాలు అభిప్రాయపడుతున్నారు. సచిన్ చేసిన ప్రతిపాదనలను ముంబై క్రికెట్ సంఘం కొంతమేరకు అంగీకరించింది. అయితే చిన్న మార్పులతో వాటిని అమలు చేయాలని నిర్ణయించింది. -సాక్షి క్రీడావిభాగం ద్రవిడ్ ప్రతిపాదనలు * ఫుట్‌బాల్‌లో మాదిరిగా స్కూల్ స్థాయి క్రికెట్లో సబ్స్టిట్యూట్లను విరివిగా వాడుకునేందుకు అనుమతి ఇవ్వాలి. * బ్యాటింగ్, బౌలింగ్‌లో కచ్చితంగా రొటేషన్ పద్ధతిని పాటించాలి. * జూనియర్ క్రికెట్లో ఆడే ఆటగాళ్ల సంఖ్యను పెంచాలి. దీనివల్ల కుర్రాడు ఆటను ఆస్వాదించడమే కాకుండా ఆసక్తి పెంచుకుంటాడు. * ఓ బ్యాట్స్‌మన్ అర్ధసెంచరీ చేస్తే ఇక అతను రిటైరవ్వాలి. జట్టు మూడు వికెట్లు కోల్పోతేనే మళ్లీ అతను బ్యాటింగ్‌కు రావాలి. ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్కరికీ బ్యాటింగ్ చేసే అవకాశం వస్తుంది. * క్రీజులో ఉన్న బ్యాట్స్‌మన్ సెంచరీ తర్వాత కూడా అలాగే కొనసాగితే తర్వాతి మ్యాచ్‌లకు కూడా అతనిపైనే ఎక్కువ ఆధారపడతారు. దీనివల్ల ఆటగాళ్లలోని సహజ నైపుణ్యం, అంకితభావం దెబ్బతింటాయి. ఖాళీగా కూర్చోవడం, వాటర్ బాటిల్స్ అందించడం మినహా మిగిలిన వారికి పని ఉండదు. * మ్యాచ్‌లో బౌలర్ గరిష్టంగా మూడోవంతు ఓవర్లు బౌలింగ్ చేయడానికి అనుమతించాలి. * ఎవరైనా బౌలర్ ఐదు వికెట్లు తీస్తే అతన్ని బౌలింగ్ నుంచి తప్పించాలి. * స్కూల్ స్థాయి మొదలుకొని అండర్-15 వరకు ఇదే పద్ధతిని కొనసాగించాలి. అప్పుడు కుర్రాళ్లలో నైపుణ్యాన్ని, ప్రతిభను వెలికి తీయొచ్చు. * జూనియర్ స్థాయి మ్యాచ్‌ల్లో ఆడటానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి. లేకపోతే సరైన అవకాశాల్లేక వాళ్లలోని ప్రతిభ మరుగున పడిపోతుంది. అలాగే వాళ్ల తల్లిదండ్రులు కూడా ఆటపై ఆసక్తి చంపేసుకుంటారు. అవకాశాలు ఇచ్చినప్పుడే ఏదో ఓ రూపంలో అతనికి ప్రోత్సాహం అందుతుంది. సచిన్ ప్రతిపాదనలు * ఇంటర్ స్కూల్ మ్యాచ్‌ల్లో 11 మందికి బదులుగా 15 మందికి అవకాశం ఇవ్వాలి. దీనివల్ల మైదానానికి వచ్చిన ప్రతి పిల్లాడికీ ఆడే అవకాశం వస్తుంది. * బ్యాటింగ్ సమయంలో నిఖార్సైన ఏడుగురు బ్యాట్స్‌మన్ ఆడాలి. * బౌలింగ్ సమయంలో నాణ్యమైన బౌలర్లకు ఆరుగురికి అవకాశం ఇవ్వాలి. ఇందులో పేసర్లయినా స్పిన్నర్లయినా ఉండొచ్చు. * ఫీల్డింగ్‌లో మాత్రం 11 మందినే కొనసాగించాలి. మ్యాచ్‌లో ఏదో ఒక సమయంలో కచ్చితంగా ఇద్దరిని సబ్‌స్టిట్యూట్‌గా అనుమతించాలి. * దీనివల్ల కుర్రాళ్లకు సమ ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ఆటపై ఆసక్తి ఏర్పడుతుంది. లేదంటే... రిజర్వ్ బెంచ్‌కు పరిమితమైన క్రికెటర్ కొన్నాళ్లకు తమ సహజ నైపుణ్యాన్ని మర్చిపోతాడు. * ఆటగాళ్ల సంఖ్య పెరిగితే జట్టు మేళవింపులో భిన్నత్వం పెరుగుతుంది. దీంతో జట్టులోని ప్రతి ఒక్కరూ మ్యాచ్ విన్నర్‌గా తయారవుతారు. ఒక్కరిపైనే ఆధారపడే భావన తగ్గుతుంది. రిజర్వ్ బెంచ్ సత్తా పెరుగుతుంది. * గాయాలు, ఫిట్నెస్ సమస్యలు కూడా తగ్గుతాయి. ముఖ్యంగా సమష్టితత్వం పెంపొందుతుంది. * 2013లో రిటైర్మెంట్ తర్వాత సచిన్ ఈ ప్రతిపాదన చేశాడు. * సచిన్ చేసిన ఈ ప్రతిపాదనను మొదట తిరస్కరించిన ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) ఇప్పుడు దాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. అండర్-14 విభాగంలో 11 మంది క్రికెటర్లకు బదులు 13 మందికి అవకాశం ఇవ్వనుంది. ఇద్దర్ని సబ్‌స్టిట్యూట్‌గా తీసుకొవచ్చు. ఏడుగురు బ్యాట్స్‌మెన్ బ్యాటింగ్ చేయొచ్చు. ఆరుగురు బౌలర్లు బౌలింగ్ చేసుకోవచ్చు. సచిన్ 15 మందిని ప్రతిపాదిస్తే... ప్రస్తుతం 13 మందితో దీనిని ఆచరణలోకి తెచ్చారు. -
సచిన్, గవాస్కర్.. నాకు దేవుళ్లు!
-
సచిన్, గవాస్కర్.. నాకు దేవుళ్లు!
న్యూఢిల్లీ: తన అద్భుత విజయాలతో ప్రపంచ యువలోకానికే ఒక ఐకాన్‌గా అవతరించిన ఐఐటీ ఖరగ్‌పూర్ పూర్వ విద్యార్థి గూగల్ సీఈఓ సుందర్ పిచాయ్ (43). ఆయనకు భారత క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ అంటే చాలా అభిమానమట. వాళ్లే తనకు రోల్ మోడల్స్ అని, వారిలా గొప్ప క్రికెటర్‌ను కావాలని కలలు కనేవాడినని పేర్కొన్నారు. చదువుతో పాటు తనకు ఫుట్‌బాల్, క్రికెట్ అంటే చాలా ప్రేమించేవాడినన్నారు. రాత్రిళ్లు మేల్కొని మరీ సాకర్ వరల్డ్ కప్‌ను చూసేవాడినని జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఇటీవల ఢిల్లీలో శ్రీరాం కాలేజీ విద్యార్థులతో తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్న ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలను నెమరు వేసుకున్నారు. చదువుకునే రోజుల్లోనే చాలామంది క్రికెటర్స్ లాగే తనకూ క్రికెట్ అంటే విపరీతమైన అభిమానమని తెలిపారు. అలా క్రమం తప్పకుండా చూస్తూ క్రికెట్ లెజెండ్స్ సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్‌లకు వీరాభిమానిగా మారిపోయానన్నారు. గవాస్కర్ క్రికెట్ నుంచి రిటైరయ్యాక కూడా ఆయనంటే తెలియని అభిమానం ఉండిపోయిందన్నారు. వరల్డ్ కప్ పోటీలు జరిగే సమయంలో తెల్లవారుజామున తన ఫేవరెట్ ఆటలను చూడడం ఇప్పటికీ గుర్తుందని తెలిపారు. బార్సిలోనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ అంటే విపరీతమైన ఇష్టమన్నారు. సుందర్ పిచాయ్ ఆగస్టులో గూగుల్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారతదేశానికి రావడం ఇదే ప్రథమం. గూగుల్ సీఈఓగా అత్యున్నత పదవిని స్వీకరించిన అనంతరం ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. ఉన్నత భవిత కోసం, అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని కలలుగనే యువలోకానికి ఆయనో స్పూర్తి ప్రదాతగా మారిపోయారు. -
సానియా మీర్జా ‘స్వీట్ గర్ల్’...
* సచిన్ అంటే చాలా ఇష్టం * టెన్నిస్ దిగ్గజం ఫెడరర్ వ్యాఖ్య న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాపై స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ప్రశంసలు కురిపించాడు. ‘గత ఏడాది సానియాతో కలిసి ఐపీటీఎల్‌లో మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్ ఆడాను. అంతకుముందు నుంచే ఆమె పరిచయం. అయితే ఆమెతో ఆడాక తనో స్వీట్ గర్ల్ అని అర్థమైంది. ఈ ఏడాది వింబుల్డన్ డబుల్స్ ఫైనల్ మొత్తం చూశాను. ఆమె అద్భుతంగా ఆడింది. సానియా-హింగిస్ జోడీకి ప్రతి టోర్నీలోనూ మద్దతు ఇస్తాను’ అని ఫెడరర్ చెప్పాడు. అలాగే భారత క్రీడాకారులలో తనకు క్రికెటర్ సచిన్ అంటే చాలా ఇష్టమన్నాడు. ‘వింబుల్డన్‌లో సచిన్‌ను కలిసి మాట్లాడాను. అతనో గొప్ప క్రీడాకారుడు. నేను ఎప్పుడు వీడియోగేమ్ క్రికెట్ ఆడినా తనని నా జట్టులో ప్రధాన బ్యాట్స్‌మన్‌గా తీసుకుంటాను’ అని ఫెడరర్ అన్నాడు. ఐపీటీఎల్ ద్వారా భారత్‌కు వచ్చే అవకాశం మరోసారి లభించడం సంతోషంగా ఉందని ఈ స్టార్ ఆటగాడు చెప్పాడు. -
వార్న్ వారియర్స్ క్లీన్‌స్వీప్
మళ్లీ ఓడిన సచిన్ సేన ముగిసిన ఆల్ స్టార్స్ సిరీస్ లాస్ ఏంజెల్స్: క్రికెట్ ప్రపంచం దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించి, ప్రత్యక్షంగా అమెరికా అభిమానులకు ఆనందం పంచిన ఆల్ స్టార్స్ సిరీస్ ఆదివారం ముగిసింది. దిగ్గజ క్రికెటర్లంతా ఒక చోట చేరి టి20 వినోదం పంచిన ఈ టోర్నీలో మొత్తంగా సచిన్ బ్లాస్టర్స్‌పై వార్న్ వారియర్స్‌దే పైచేయి అయింది. ఇక్కడి డాడ్జర్ స్టేడియంలో జరిగిన చివరి టి20 మ్యాచ్‌లో వారియర్స్ 4 వికెట్ల తేడాతో బ్లాస్టర్స్‌ను ఓడించింది. ఫలితంగా 3-0తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బ్లాస్టర్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ సచిన్ (27 బంతుల్లో 56; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) ముందుండి నడిపించగా, మాజీ సహచరుడు సౌరవ్ గంగూలీ (37 బంతుల్లో 50; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా చెలరేగాడు. జయవర్ధనే (18 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), కార్ల్ హూపర్ (22 బంతుల్లో 33 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లు) కూడా రాణించారు. వెటోరికి 3 వికెట్లు దక్కాయి. అనంతరం వారియర్స్ 19.5 ఓవర్లలో 6 వికెట్లకు 224 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కలిస్ (23 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), పాంటింగ్ (25 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), సంగక్కర (21 బంతుల్లో 42; 4 ఫోర్లు, 3 సిక్సర్లు)లతో పాటు సైమండ్స్ (19 బంతుల్లో 31; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కలిస్, పాంటింగ్ కలిసి ఆరో వికెట్‌కు 37 బంతుల్లోనే 88 పరుగులు జోడించడం జట్టుకు విజయాన్నందించింది. సంగక్కరకు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ పురస్కారం లభించింది. సచిన్, సౌరవ్ దూకుడు... టాస్ గెలిచిన బ్లాస్టర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. తనదైన శైలిలో కొన్ని చక్కటి షాట్లు ఆడిన సెహ్వాగ్ (15 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), సచిన్‌తో కలిసి తొలి వికెట్‌కు 23 బంతుల్లోనే 55 పరుగులతో శుభారంభం అందించారు. అనంతరం సచిన్, జయవర్ధనే ఇదే జోరును కొనసాగిస్తూ రెండో వికెట్‌కు 34 బంతుల్లోనే 74 పరుగులు జోడించారు. వీరిద్దరు మూడు పరుగుల వ్యవధిలోనే వెనుదిరిగారు. ఆ తర్వాత గంగూలీ, హూపర్ చెలరేగి 51 బంతుల్లోనే 86 పరుగులు చేయడంతో బ్లాస్టర్స్ భారీ స్కోరు సాధించింది. కీలక భాగస్వామ్యాలు... భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆంబ్రోస్ వేసిన తొలి బంతికే వాన్ (0) బౌల్డ్ కావడంతో వారియర్స్ మొదటి వికెట్ కోల్పోయింది. రెండో వికెట్‌కు 25 బంతుల్లో 50 పరుగులు జోడించిన తర్వాత సైమండ్స్ అవుట్ కాగా, లక్ష్మణ్ చక్కటి ఫీల్డింగ్‌కు హేడెన్ (12) రనౌటయ్యాడు. ఈ దశలో సంగక్కర, రోడ్స్ (17) మధ్య 58 పరుగుల భాగస్వామ్యం ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. సెహ్వాగ్ వేసిన ఆఖరి ఓవర్లో విజయానికి మూడు పరుగుల దూరంలో కలిస్ అవుటైనా...ఐదో బంతిని వార్న్ సిక్సర్ బాది తన జట్టుకు క్లీన్ స్వీప్ విజయాన్ని అందించాడు. -
మాజీల మెరుపులు...
ఆల్ స్టార్స్ మ్యాచ్‌లో ‘వార్న్’ వారియర్స్ ఘన విజయం ఆరు వికెట్ల తేడాతో ఓడిన సచిన్సేన వీరేంద్ర సెహ్వాగ్ జోరు వృథా 11న రెండో మ్యాచ్ అదే జోరు.. అవే షాట్లు.. అదే ఊపు... వయసు పైబడినా.. ఆటలో పదును మాత్రం ఇంకా తగ్గలేదు.. స్టార్ల నుంచి దిగ్గజాలుగా మారినా... కొట్టే షాట్లలో మాత్రం మార్పు రాలేదు... ఇప్పటికీ కుర్రాళ్లకు తీసిపోమనే విధంగా ‘క్రికెట్ ఆల్ స్టార్స్ సిరీస్’లో ప్రపంచ మాజీలు చేసిన బ్యాటింగ్ విన్యాసాలకు అమెరికా అభిమానులు ముగ్దులయ్యారు. చూడ ముచ్చటైన కవర్ డ్రైవ్‌లు... తమకు మాత్రమే సాధ్యమయ్యే స్ట్రయిట్ డ్రైవ్‌లు... అప్పర్ కట్స్.. స్వీప్‌లు.. లాంగాన్ షాట్స్‌తో దుమ్మురేపడంతో శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో వార్న్ వారియర్స్... సచిన్ సేనపై ఘన విజయం సాధించింది. న్యూయార్క్: ఆటకు దూరమైనా... తన స్పిన్ మ్యాజిక్‌ను మాత్రం మర్చిపోలేదని ఆసీస్ బౌలింగ్ దిగ్గజం షేన్ వార్న్ (3/20) నిరూపించుకున్నాడు. గింగరాలు తిరిగే బంతులతో కీలక వికెట్లు పడగొట్టాడు. వార్న్‌కు తోడు సైమండ్స్ (3/15), రికీ పాంటింగ్ (38 బంతుల్లో 48 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), సంగక్కర (29 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) జోరు చూపెట్టడంతో... క్రికెట్ ఆల్‌స్టార్స్ సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో వార్న్ వారియర్స్ 6 వికెట్ల తేడాతో సచిన్స్ బ్లాస్టర్పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సచిన్స్ బ్లాస్టర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 140 పరుగులు చేసింది. సెహ్వాగ్ (22 బంతుల్లో 55; 3 ఫోర్లు, 6 సిక్సర్లు), సచిన్ (27 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగి ఆడారు. తర్వాత వార్న్ వారియర్స్ 17.2 ఓవర్లలో 4 వికెట్లకు 141 పరుగులు చేసింది. వార్న్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో వార్న్ వారియర్స్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో మ్యాచ్ ఈనెల 11న హూస్టన్‌లో జరుగుతుంది. వీరూ... జోరు సచిన్‌తో కలిసి ఓపెనింగ్‌కు వచ్చిన సెహ్వాగ్ వీరవిహారం చేశాడు. అక్రమ్ బౌలింగ్‌లో థర్డ్ మ్యాన్ దిశగా తొలి బౌండరీ సాధించిన వీరూ ఆ తర్వాత సిక్సర్లను లక్ష్యంగా చేసుకున్నాడు. డొనాల్డ్, కలిస్ ఓవర్లలో షార్ట్ బంతులను లాంగాన్, ఆన్‌సైడ్‌లో భారీ షాట్లుగా మలిచాడు. వాల్ష్ వేసిన ఏడో ఓవర్లో మూడు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 23 పరుగులు రాబట్టడంతో స్కోరు బోర్డు పరుగెత్తింది. ఈ దశలో బౌలింగ్‌కు వచ్చిన వార్న్ ఆఖరి బంతికి సచిన్‌ను అవుట్ చేయగా, తర్వాతి ఓవర్ తొలి బంతికి సెహ్వాగ్ జోరుకు వెటోరి కళ్లెం వేశాడు. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 85 పరుగులు జత చేశారు. తర్వాత వార్న్.. వరుస ఓవర్లలో బ్రియాన్ లారా (1), వీవీఎస్ లక్ష్మణ్ (8)లను పెవిలియన్‌కు చేర్చడంతో బ్లాస్టర్స్ జట్టు 97 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో హూపర్ (11), జయవర్ధనే (18) ఇన్నింగ్స్‌ను కుదుటపర్చే ప్రయత్నం చేసినా.. సైమండ్స్ స్లో బౌలింగ్‌లో పరుగులు చేయలేక ఇబ్బంది పడ్డారు. 16వ ఓవర్లో జయవర్ధనేను అవుట్ చేసిన సైమండ్స్... 18వ ఓవర్లో నాలుగు బంతుల వ్యవధిలో హూపర్, మొయిన్ ఖాన్ (1)ను అవుట్ చేయడంతో బ్లాస్టర్స్ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. పాంటింగ్ అదుర్స్.. లక్ష్య ఛేదనకు దిగిన వారియర్స్... మూడో ఓవర్లోనే ఓపెనర్లు కలిస్ (13), హెడెన్ (4)ల వికెట్లను కోల్పోయింది. అయితే వన్‌డౌన్‌లో పాంటింగ్, సంగక్కరలు మంచి సమన్వయంతో ఆడారు. అంబ్రోస్ బౌలింగ్‌లో సంగ రెండు సిక్సర్లు బాది రన్‌రేట్‌ను పెంచాడు. పాంటింగ్ కూడా పొలాక్, మురళీధరన్‌లకు సిక్సర్ల రుచి చూపెట్టాడు. ఈ ఇద్దరు మూడో వికెట్‌కు 80 పరుగులు జోడించాక.. అక్తర్ బౌలింగ్‌లో సంగక్కర అవుటయ్యాడు. తర్వాతి ఓవర్లో సైమండ్స్ (1) వెనుదిరిగినా... పాంటింగ్, జాంటీ రోడ్స్ (14 బంతుల్లో 20 నాటౌట్; 3 సిక్సర్లు) దుమ్మురేపారు. 21 బంతుల్లో అజేయంగా 37 పరుగులు సమకూర్చడంతో వారియర్స్ మరో 16 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. అక్తర్‌కు 2 వికెట్లు పడ్డాయి. ►సచిన్, సెహ్వాగ్ బ్యాటింగ్‌కు వస్తుంటే ఒక్కసారిగా స్టేడియం దద్దరిల్లింది. ‘సచిన్, సచిన్, వీరూ, వీరూ’ అంటూ మైదానంలో ప్రేక్షకులు గొంతు కలిపారు. ►న్యూయార్క్‌లోని సిటీ ఫీల్డ్ బేస్‌బాల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌కు దాదాపు 36 వేల మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ►వివిధ దేశాల జాతీయ పతాకాలతో అభిమానులు ఆటగాళ్లకు మద్దతు తెలిపారు. భారత జాతీయ జెండా రంగులను ముఖానికి పూసుకుని, టీమిండియా టీ షర్ట్‌లను ధరించి చాలా మంది హాజరయ్యారు. ► సచిన్ మా దేవుడు, అధ్యక్షుడు అంటూ రకరకాల బ్యానర్లతో స్టేడియం నిండిపోయింది. చాలా మంది ఇతర దేశాల టీ షర్ట్‌లను కూడా ధరించి మద్దతు తెలిపారు. స్కోరు వివరాలు సచిన్స్ బ్లాస్టర్స్ ఇన్నింగ్స్: సెహ్వాగ్ (బి) వెటోరి 55; సచిన్ (సి) కలిస్ (బి) వార్న్ 26; లక్ష్మణ్ (స్టంప్డ్) సంగక్కర (బి) వార్న్ 8; లారా ఎల్బీడబ్ల్యు (బి) వార్న్ 1; జయవర్ధనే సబ్ (సి) అగర్కార్ (బి) సైమండ్స్ 18; హూపర్ ఎల్బీడబ్ల్యు (బి) సైమండ్స్ 11; పొలాక్ (సి) కలిస్ (బి) డొనాల్డ్ 11; మొయిన్ ఖాన్ (సి) కలిస్ (బి) సైమండ్స్ 1; ఆంబ్రోస్ నాటౌట్ 1; మురళీధరన్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 140. వికెట్ల పతనం: 1-85; 2-85; 3-88; 4-97; 5-118; 6-127; 7-130; 8-137. బౌలింగ్: అక్రమ్ 4-0-16-0; డొనాల్డ్ 3-0-23-1; వాల్ష్ 2-0-30-0; కలిస్ 1-0-19-0; వార్న్ 4-0-20-3; వెటోరి 4-0-13-1; సైమండ్స్ 2-0-15-3. వార్న్ వారియర్స్ ఇన్నింగ్స్: కలిస్ రనౌట్ 13; హెడెన్ (సి) మొయిన్ (బి) అక్తర్ 4; పాంటింగ్ నాటౌట్ 48; సంగక్కర (సి) జయవర్ధనే (బి) అక్తర్ 41; సైమండ్స్ ఎల్బీడబ్ల్యు (బి) మురళీధరన్ 1; రోడ్స్ నాటౌట్ 20; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం: (17.2 ఓవర్లలో 4 వికెట్లకు) 141. వికెట్ల పతనం: 1-20; 2-22; 3-102; 4-104. బౌలింగ్: అక్తర్ 4-0-26-2; పొలాక్ 3-0-30-0; అంబ్రోస్ 3-0-36-0; మురళీధరన్ 4-1-18-1; హూపర్ 3-0-20-0; సచిన్ 0.2-0-7-0. -
ఆ జ్ఞాపకాలు మళ్లీ....
షార్జా స్టేడియంలో షేన్‌వార్న్ బౌలింగ్‌లో సచిన్ ముందుకొచ్చి లాంగాన్‌లోకి కొట్టిన భారీ సిక్సర్... 17 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతోంది. మళ్లీ అలాంటి ఆటను తర్వాతి తరం చూడలేదని అప్పట్లో అనుకునేవాళ్లు. సచిన్, షేన్‌వార్న్‌ల సమరాన్ని ప్రత్యక్షంగా చూడలేకపోయిన ఈ తరం కుర్రాళ్లకు ఇది నిజంగా పండగే. మరోసారి ఈ దిగ్గజ క్రికెటర్లు ముఖాముఖి తలపడబోతున్నారు. ఆల్‌స్టార్స్ సిరీస్‌లో భాగంగా జరిగే మూడు టి20 మ్యాచ్‌లలో సచిన్ బ్లాస్టర్స్, వార్న్ వారియర్స్ జట్లు తలపడబోతున్నాయి. ఎనిమిది దేశాలకు చెందిన 30 మంది దిగ్గజ క్రికెటర్లు ఇందులో ఆడబోతున్నారు. గంగూలీ, సంగక్కర, పాంటింగ్.... ఇలా రిటైరైన స్టార్ క్రికెటర్లను మళ్లీ చూసేందుకు ఇది గొప్ప అవకాశం. సిరీస్ ఉద్దేశం అమెరికాతో పాటు క్రికెట్‌ను విశ్వవ్యాప్తం చేయడంలో భాగంగా సచిన్ టెండూల్కర్, షేన్ వార్న్‌ల మదిలో వచ్చిన ఆలోచన ఇది. అనుకున్నదే తడవుగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయిన ఆటగాళ్లను సంప్రదించి వారిని రెండు జట్లుగా విడదీశారు. సచిన్ బ్లాస్టర్స్, వార్న్ వారియర్స్‌గా విడిపోయి మూడు టి20 మ్యాచ్‌లు ఆడనున్నారు. కేవలం మ్యాచ్‌లను ఆడటమే కాకుండా మొత్తం ఎనిమిది రోజుల పాటు వివిధ కార్యక్రమాలకు కూడా ఏర్పాట్లు జరిగాయి. ఇందులో భాగంగా తమ అభిమాన ఆటగాళ్లతో కలిసి ఆటకు ముందు రోజు రాత్రి అభిమానులు విందులో పాల్గొనవచ్చు. ఇందుకోసం రూ.50 వేల నుంచి రూ.లక్షా 71 వేలు చెల్లించాల్సి ఉంటుంది. వేదికలు అమెరికాలో క్రికెట్ స్టేడియాలు లేకపోవడంతో న్యూయార్క్, హోస్టన్, లాంస్ ఏంజిల్స్ నగరాల్లోని బేస్‌బాల్ స్టేడియాల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందుకు డ్రాప్ ఇన్ పిచ్‌లను వాడనున్నారు. ఆటగాళ్లు మొత్తం ఎనిమిది దేశాలకు చెందిన 30 మంది ఆటగాళ్లు ఇందులో ఆడనున్నారు. భారత్ నుంచి సచిన్, గంగూలీ, లక్ష్మణ్, అగార్కర్, సెహ్వాగ్, సమీర్ డిఘే.. ఆసీస్ నుంచి వార్న్, హేడెన్, పాంటింగ్, సైమండ్స్, మెక్‌గ్రాత్.. దక్షిణాఫ్రికా నుంచి పొలాక్, కలిస్, డొనాల్డ్, క్లూసెనర్, రోడ్స్.. ఇంగ్లండ్ నుంచి మైకేల్ వాన్, స్వాన్.. విండీస్ నుంచి వాల్ష్, అంబ్రోస్, హూపర్, లారా... శ్రీలంక నుంచి మురళీధరన్, సంగక్కర, జయవర్ధనే.. కివీస్ నుంచి వెటోరి.. పాక్ నుంచి అక్రం, మొయిన్ ఖాన్, అక్తర్, సక్లైన్ ముస్తాక్ పాల్గొననున్నారు. -
'దాదా అప్లికేషన్ పరిశీలనలో ఉంది'
నవంబర్ 9న అమెరికాలోని న్యూయార్క్‌లో జరుగనున్న ఆల్ స్టార్స్ క్రికెట్ టోర్నమెంట్లో తనకు ఓపెనర్‌గా అవకాశం ఇవ్వాలని, లేకుంటే వెంటనే కోల్‌కతా విమానం ఎక్కుతానని సరదాగా అన్న గంగూలీ వ్యాఖ్యలకు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ బదులిచ్చారు. ఓపెనర్ స్థానానికి గంగూలీ అప్లికేషన్ పరిశీలనలో ఉందని, అలాగే అతని బ్యాట్ నుంచి చక్కటి ఆఫ్ డ్రైవ్‌ని ఆశిస్తున్నానని సచిన్ ట్వట్టర్ ద్వారా తెలిపారు. ఆస్ట్రేలియా లెజెండ్ స్పిన్నర్ షేన్ వార్న్ నేతృత్వం వహిస్తున్న 'వార్న్ వారియర్స్' జట్టుతో సచిన్ బ్లాస్టర్స్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్‌లో మంచి ప్రదర్శన చేసేందుకు గంగూలీ చాలా కాలం తరువాత మంగళవారం నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా చేశాడు. Dada your application for the opener's position is being processed!Hope the off drive is coming from the sweet spot @T20AllStars @ShaneWarne — sachin tendulkar (@sachin_rt) November 4, 2015 -
విజయనగరంలో అర్జున్ టెండూల్కర్
విజయనగరం: బ్యాటింగ్ దిగ్గజం సచిన్ కుమారుడు అర్జున్ అండర్-16 టోర్నీ కోసం విజయనగరం వచ్చాడు. నాలుగు జట్లు పాల్గొంటున్న ఈ సిరీస్‌లో అర్జున్ ముంబై తరఫున బరిలోకి దిగుతున్నాడు. గురువారం విదర్బతో జరిగిన మ్యాచ్ కోసం అర్జున్ స్థానిక విజ్జి స్టేడియానికి రావడంతో అభిమానులు పోటెత్తారు. అయితే భద్రతా సిబ్బంది ఎవర్నీ అనుమతించలేదు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఆట ముగిసే సమయానికి 6 వికెట్లకు 229 పరుగులు చేసింది. ఆట చివర్లో అర్జున్ కొద్దిసేపు బ్యాటింగ్ చేశాడు. -
భవిష్యత్‌కు ‘భరోసా’
ఒక సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. చేజారిందనుకున్న ప్రాభవం మళ్లీ మన వశమైంది. శ్రీలంక గడ్డపై 22 ఏళ్ల తర్వాత భారత జట్టు టెస్టు సిరీస్ గెలిచింది. చివరిసారిగా 1993లో అజహరుద్దీన్ నేతృత్వంలో భారత జట్టు 1-0తో సిరీస్ గెలిచింది. ఆ తర్వాత సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్, గంగూలీ లాంటి హేమాహేమీలంతా ఆ గడ్డపై సిరీస్ విజ యాన్ని అందుకోలేకపోయారు. ఈసారి ఆశ్చర్యకరంగా కొత్త కుర్రాళ్లతో నిండిన యువ భారత్ దాన్ని సాధించగలిగింది. గత నాలుగేళ్లుగా దిగ్గజాలు ఒక్కొక్కరూ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెబుతుండటంతో భారత క్రికెట్ సంధికాలంలో సాగింది. వారి స్థానంలో వచ్చిన యువ ఆటగాళ్లు ఇంకా పూర్తిగా కుదురుకోలేదు. కనుకే స్వదేశంలో టెస్టులు గెలవడమే కష్టంగా మారింది. ఇక విదేశాల్లో టెస్టు సిరీస్ విజయం గురించి చెప్పేదేముంది? ఈ లోటును కూడా కోహ్లి సారథ్యంలోని యువ భారత్ తీర్చింది. దిగ్గజాలు రిటైరైన తర్వాత కూడా వన్డేల్లో భారత జట్టు నిలకడగానే ఆడుతోంది. ధోని ఇంకా ఆ ఫార్మాట్లో కొనసాగుతూ ఉండటంతో పాటు కోహ్లి, రోహిత్ శర్మ లాంటి వాళ్లకు నాలుగేళ్లకు పైగా అనుభవం ఉండటంతో వన్డేలలో సీనియర్లు లేని లోటు తెలియలేదు. కానీ టెస్టు క్రికెట్లో మాత్రం ఇన్నాళ్లూ ఆ లోటు కనిపించింది. శ్రీలంకతో సిరీస్ ద్వారా ఆ లోటు పూర్తిగా తీరకపోయినా కొంతమేరకు భారత క్రికెట్లో ప్రత్యామ్నాయాలు కనిపించాయి. లోకేశ్ రాహుల్, శిఖర్ ధావన్, మురళీ విజయ్‌ల రూపంలో ముగ్గురు ఓపెనర్లు ఈ సిరీస్‌లో రాణించారు. గాయాల కారణంగా ధావన్, విజయ్ ఒక్కో టెస్టుకే పరిమితమైనా భారత్‌కు ఓపెనర్ లేని లోటు తెలియకుండా పుజారా మూడో టెస్టులో అద్భుతంగా ఆడాడు. రహానే, కోహ్లి కూడా సెంచరీలతో తమ విలువను పెంచుకున్నారు. రోహిత్ శర్మ విషయంలో విమర్శలు ఎదురైనా అతని బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చి లోయర్ ఆర్డర్లో ఆడించి ఫలితాన్ని పొందారు. కాబట్టి మొత్తం మీద భారత బ్యాటింగ్ లైనప్‌లో ఉన్న చిన్న చిన్న లోపాలు బయటపడ్డా... వాటిని అధిగమించే సత్తా కూడా ఈ యువ జట్టులో ఉందనే సందేశం ఈ సిరీస్ ద్వారా వచ్చింది. ఇక ఈ సిరీస్‌ను భారత్‌కు అందించింది మాత్రం బౌలర్లే. మూడు టెస్టుల్లోనూ మూడు రకాల పిచ్‌లు ఎదురయ్యాయి. గాలెలో స్పిన్, సారా ఓవల్‌లో స్వింగ్, సింహళీస్ క్లబ్లో బౌన్స్ ఉన్న వికెట్లు భారత బౌలర్లకు పరీక్ష పెట్టాయి. దీనికి తగ్గ ట్టుగా మనవాళ్లు స్పందించారు. ఇషాంత్ శర్మ భారత పేస్ బౌలింగ్ లీడర్‌గా ఎది గాడు. అతను ముందుండి లంక టాపార్డర్ వెన్నువిరిచాడు. ప్రస్తుతం భారత్‌లో ఫాస్ట్ బౌలర్లలో అందరికంటే ఎక్కువగా వేగాన్ని నమ్ముకుంది ఉమేశ్ యాదవ్. పూర్తి స్థాయిలో అతను ఆకట్టుకోలేకపోయినా ఇషాంత్‌కు కావలసిన సహకారం అందిం చాడు. ఇక స్పిన్నర్ అశ్విన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. భారత క్రికెట్ భవి ష్యత్ ఇక అశ్విన్‌పై ఆధారపడి ఉందనడ ం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. వెటరన్ అమిత్ మిశ్రా కూడా తన ఎంపికకు న్యాయం చేశాడు. బౌలింగ్ బాగా చేయగల ఆల్ రౌండర్ ఒకరు జట్టులో ఉంటే టెస్టు విజయాలు సాధించడం సులభం అనే సంకేతం కూడా ఈ సిరీస్ ద్వారా వచ్చింది. స్టువర్ట్ బిన్నీ ఈ పాత్రలో విశేషంగా రాణించక పోయినా.. ప్రస్తుతం ఎవరూ లేనిచోట తనే గొప్ప ఆయుధంలా కనిపిస్తున్నాడు. అయితే సమీప భవిష్యత్తులో భారత్‌కు మంచి ఆల్‌రౌండర్ కచ్చితంగా కావాలి. ఇక కెప్టెన్‌గా కోహ్లికి ఇది మరచిపోలేని సిరీస్. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాలో తొలిసారి పూర్తి స్థాయి కెప్టెన్‌గా అతను బాధ్యతలు తీసుకున్నాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్‌లోనూ ఓ టెస్టు ఆడాడు. కానీ ఇవేవీ తనని పూర్తిగా అంచనా వేసేందుకు పనికి రాలేదు. తొలిసారి కోహ్లి పూర్తి స్థాయిలో మూడు టెస్టుల సిరీస్ శ్రీలంకలో ఆడాడు. టెస్టు మ్యాచ్ గెలవాలంటే 20 వికెట్లు తీసే బౌలర్లు జట్టులో ఉండాలి. ఇది జగమెరిగిన సత్యం. ఐదుగురు బౌలర్లు ఉంటే 20 వికెట్లు తీయడం సులభమవుతంది. అయితే గతంలో ఏ భారత కెప్టెన్ కూడా ఎప్పుడూ ఐదుగురు బౌలర్ల సిద్ధాంతాన్ని ఎంచుకోలేదు. అడపాదడపా పిచ్ స్వభావాన్ని బట్టి ఐదుగురు బౌలర్లను ఆడినా సిసలైన ఆల్‌రౌండర్ లేకపోవడం వల్ల నలుగురు బౌలర్ల సిద్ధాంతాన్నే అనుసరించారు. కానీ కోహ్లి మాత్రం దీనికి భిన్నంగా వెళ్లాలనుకున్నాడు. ఐదుగురు బౌలర్లతోనే వెళతానంటూ దీనిపై విమర్శలు వచ్చినా వెరువకుండా తన నిర్ణయానికి కట్టుబడ్డాడు. ఒక రకంగా ఈ సిద్ధాంతం ఈసారి మంచి ఫలితాన్నిచ్చింది. కెప్టెన్‌గా తొలి సిరీస్ విజయం ఎవరికైనా గొప్ప సంతోషాన్నిస్తుంది. అందులోనూ ఎంతోమంది గొప్ప కెప్టెన్లు సాధించలేకపోయిన ఘనతను కోహ్లి సొంతం చేసుకున్నాడు. కాబట్టి కోహ్లి కూడా కచ్చితంగా ఇప్పుడు గాల్లో తేలుతూనే ఉంటాడు. అయితే కెప్టెన్‌గా మారాక తన వైఖరి కాస్త మొండిగా తయారయింది. దీనిని కొంత తగ్గించుకుని పట్టువిడుపుల ధోరణిని అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఎంత గొప్ప ఫార్ములా అయినా కొన్ని సందర్భాల్లో పనికిరాదు. భారత్ సిరీస్ విజయం సాధించడం గొప్ప విషయమే. అయితే ఇదే సమయంలో ప్రత్యర్థిని కూడా గమనించాలి. గత రెండు దశాబ్దాలలో ఇంత బలహీనంగా శ్రీలంక జట్టు ఎప్పుడూ లేదు. అర్జున రణతుంగ, అరవింద డిసిల్వా, జయసూర్య, చమిందా వాస్, మురళీధరన్, మహేల జయవర్ధనే, కుమార సంగక్కర ఇలా ఎంతోమంది దిగ్గజాలు ఆ దేశ క్రికెట్ స్థాయిని పెంచారు. వీళ్లవల్లే రెండు దశాబ్దాలకు పైగా భారత్ జట్టు శ్రీలంకలో గెలవలేకపోయిందనేది కఠోరసత్యం. ఈ దిగ్గజాలెవరూ ఇప్పుడు ఆడటం లేదు. సంగక్కర కూడా ఈ సిరీస్‌లో రెండో టెస్టుతో పూర్తిగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాడు. శ్రీలంక జట్టులోనూ చాలా మంది కొత్త క్రికెటర్లు. ఏమాత్రం అనుభవం లేదు. అందుకే చాలా బలహీనంగా ఆ జట్టు కనిపిస్తోంది. ఇటు భారత జట్టులోని క్రికెటర్లు కూడా కొత్తవాళ్లే అయినా... లంక జట్టు కోహ్లి సేనతో పోలిస్తే బాగా బలహీనంగా ఉందనేది కూడా వాస్తవం. అయితే ఎలాంటి జట్టుపై గెలిచినా గెలుపు గెలుపే. నాలుగు టెస్టుల సిరీస్ ఆడేందుకు వచ్చే నెలలో భారత్ వస్తున్న దక్షిణాఫ్రికా జట్టుతో తలపడినప్పుడు ఇప్పటి విజయం బలుపా లేక వాపా అనే సంగతి తేలుతుంది. గతంలో స్పిన్ బలంతో భారత్ పైచేయి సాధించినా... ప్రస్తుతం సఫారీ జట్టు చాలా బలంగా ఉంది. ఆ సిరీస్ ముగిస్తే గానీ కోహ్లి అండ్ కో సత్తా ఏమిటనేది పూర్తిగా తేలదు. ఏమైనా ప్రస్తుత విజయంతో భవిష్యత్‌పై ఎంతో కొంత భరోసా వచ్చిందని మాత్రం చెప్పవచ్చు. -
పీఆర్ కండ్రిగలో కేంద్ర బృందం పర్యటన
గూడూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ మండలంలో క్రికెటర్ సచిన్ దత్తత గ్రామమైన పుట్టంరాజువారి కండ్రిగలో ఆదివారం కేంద్రబృందం పర్యటించింది. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖకు చెందిన నితీష్ అహుజ్, ఆకాష్ అహుజ్, జితేంద్ర భార్గవ్‌తో పాటు జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ గ్రామంలో పర్యటించారు. గ్రామసభ నిర్వహించి అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. దేశంలో ఎంపీలు దత్తత తీసుకున్న 640 గ్రామాల్లో కేంద్రం పుట్టంరాజుకండ్రిగతో సహా ఐదు గ్రామాలను ఎంపికచేసింది. వాటిలో కేంద్రబృందాలు రెండురోజులు పర్యటించి అభివృద్ధి పనుల్ని చిత్రీకరిస్తున్నట్లు జేసీ చెప్పారు. గ్రామానికి చెందిన సుమారు 40 మందికి శ్రీసిటీలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. గ్రామంలోని గిరిజనులకు త్వరలోనే ఇళ్లు నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు పెంచల్రావు, సర్పంచ్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
'వీళ్లేమీ సచిన్‌లు, ద్రావిడ్‌లు కారు'
కొలంబో: ప్రస్తుత టీమిండియా బ్యాట్స్‌మెన్.. సచిన్, ద్రావిడ్‌లు కారని, స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఈ దిగ్గజాలతో పోల్చరాదని శ్రీలంక కెప్టెన్ ఏంజిలో మాథ్యూస్ అన్నాడు. సచిన్, ద్రావిడ్‌ల మాదిరిగా భారత ఆటగాళ్లు స్పిన్ బౌలింగ్‌లో ఆడలేరని మాథ్యూస్ చెప్పాడు. తొలి టెస్టులో 176 పరుగుల లక్ష్యసాధనలో టీమిండియా బ్యాట్స్‌మెన్ స్పిన్‌కు తడబడి 63 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. భారత్, శ్రీలంకల మధ్య గురువారం నుంచి రెండో టెస్టు జరగనుంది. మ్యాచ్ ముందు రోజు బుధవారం మాథ్యూస్ మీడియాతో మాట్లాడుతూ.. భారత్ ఆటగాళ్లు స్పిన్ బౌలింగ్‌లో ఆడటం నేర్చుకోవాలని సూచించాడు. భారత జట్టులో ఏ క్రికెటర్‌నూ సచిన్, ద్రావిడ్‌లతో పోల్చరాదని చెప్పాడు. భారత యువ బ్యాట్స్‌మెన్‌ను సచిన్, ద్రావిడ్‌లతో ఎలా పోల్చరాదో.. తమ జట్టులోని యువ ఆటగాళ్లను మహేల జయవర్ధనె, సంగక్కరలతో పోల్చరాదని మాథ్యూస్ వ్యాఖ్యానించాడు. -
రేపటి కబడ్డీ మ్యాచ్ కు ప్రముఖులు
హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ లో భాగంగా మంగళవారం ఇక్కడ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలోజైపూర్ పింక్ పాంథర్స్ - తెలుగు టైటాన్స్ ల మధ్య జరిగే మ్యాచ్ ను వీక్షించేందుకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. జైపూర్ కబడ్డీ టీమ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రేపటి మ్యాచ్ ను వీక్షించేందుకు నగరానికి రానున్నాడు. తొలుత స్పోర్ట్స్ స్టోర్ ను ప్రారంభిచనున్న సచిన్.. తరువాత మ్యాచ్ ను వీక్షించనున్నాడు. దీంతో పాటు జైపూర్ టీం ఓనర్స్ గా ఉన్న ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ లు కూడా మ్యాచ్ చూసేందుకు హైదరాబాద్ కు రానున్నారు. హైదరాబాద్ కబడ్డీ టీమ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ప్రముఖ హీరో అల్లు అర్జున్ మ్యాచ్ కు హాజరై ప్రేక్షకులను ఉత్సాహపరచనున్నాడు. ప్రస్తుతం తెలుగు టైటాన్స్ ఐదు విజయాలు, 26 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. గత ఏడాది విశాఖపట్నంను హోం గ్రౌండ్‌గా ఉంచుకున్న టీమ్, ఈసారి తమ కేంద్రాన్ని హైదరాబాద్‌కు మార్చింది. మంగళవారం నుంచి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో తెలుగు టీమ్ వరుసగా నాలుగు రోజుల పాటు మ్యాచ్‌లు ఆడనుంది. -
బ్యాట్‌మెన్ 3
బయోగ్రఫీ బ్యాట్మన్ ఓ సూపర్ హీరో... కలలో మాత్రమే సాధ్యమయ్యే వాటిని క్షణాల్లో చేసి చూపిస్తాడు. భారత క్రికెట్‌కు అలాంటి బ్యాట్‌మెన్ ముగ్గురున్నారు. ఆడినంతకాలం ప్రపంచ క్రికెట్‌ను శాసించిన దిగ్గజ త్రయం సచిన్, గంగూలీ, లక్ష్మణ్... ఇప్పుడు భారత క్రికెట్ భవిష్యత్‌ను బంగారుబాట పట్టించేందుకు కంకణం కట్టుకున్నారు. మైదానంలో ఎదురుగా ధోని, కోహ్లిల వంటి హేమాహేమీల్లాంటి ఆటగాళ్లు... వారిని ఎలా నిలువరించాలా అనేది ప్రత్యర్థి జట్ల ఆలోచన. ఇప్పుడు అగ్నికి వాయువు తోడైనట్లుగా... మరికొందరు దిగ్గజాలు ఆటగాళ్ల వెన్నంటి నిలిచి వ్యూహాలకు పదును పెడితే... ఇక వారి కోసం కూడా అవతలి జట్లు ప్రతివ్యూహం పన్నాల్సి వస్తుందేమో. భారత క్రికెట్ భవిష్యత్తును దూరదృష్టితో చూస్తే ఇదే దృశ్యం ఇప్పుడు మన ముందు కనిపించనుంది. ఎందుకంటే ఇకపై భారత జట్టుకు దశ, దిశను ఇచ్చేందుకు నాటి స్టార్ క్రికెటర్లు దిగుతున్నారు. పుష్కర కాలానికి పైగా కలిసి ఆడిన తమ సమష్టి అనుభవంతో త్రిమూర్తులు... ఇప్పుడు మార్గదర్శనం అందించేందుకు సిద్ధమయ్యారు. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లు ఇకపై సలహాదారులుగా జట్టుకు అండగా నిలవనున్నారు. భారత క్రికెట్ జట్టుకి అనుభవం లేదు... అంతా కుర్రాళ్లే... సచిన్ టెండూల్కర్ రిటైర్ అయిన తర్వాత క్రికెట్ ప్రపంచంలో ఉన్న అభిప్రాయం ఇది. ఇది వాస్తవమే. కానీ మాస్టర్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత కూడా గత ఏడాదిన్నరగా మనోళ్లు చాలా చోట్ల మెరుపులు మెరిపించారు. అయితే కొన్ని చోట్ల మోకరిల్లారు. ఫలితాల్లో తేడాలు ఉన్నా, అనుభవం లేకపోయినా కొత్త కుర్రాళ్లు సాన పెట్టిన వజ్రంలా రాటుదేలుతూ పోయారు. అయితే విజయాలు ఒక్కటే కాదు... ఇంకేదో కావాలి. అలనాటి విండీస్ లాగానో, ఆ తర్వాతి ఆస్ట్రేలియాలానో భారత్ కూడా అజేయ శక్తిలా నిలవాలి. సరిగ్గా చెప్పాలంటే ఐసీసీలో కాదు ఆటలో కూడా సూపర్ పవర్ కావాలి. అదిగో... దానికోసమే బీసీసీఐ త్రిమూర్తులను ముందుకు తెచ్చింది. ఈ ముగ్గురినీ ఆటలో మళ్లీ భాగం చేసింది. తమ అనుభవాన్ని నవ తరానికి అందించమని కోరింది. మైదానం బయట కూడా తమదైన ముద్ర వేసేందుకు మరో అవకాశం కల్పించింది. వీరంతా తమ 1308 అంతర్జాతీయ మ్యాచ్‌ల అనుభవాన్నంతా రంగరించి కుర్రాళ్లలో స్ఫూర్తి నింపితే, మార్గదర్శనం అందిస్తే ఇక తిరుగేముంది. ఈ ముగ్గురిలో ఎవరి పాత్ర ఏమిటనే విషయంలో పూర్తి స్థాయిలో స్పష్టత లేకపోయినా... సంవత్సరాల పాటు భారత క్రికెట్‌కు మూల స్తంభాలుగా నిలిచినన ఈ త్రయం తెర వెనుక నుంచి కూడా మరో చరిత్రకు అంకురార్పణ చేయగలదనే నమ్మకం ఉంది. సచిన్: వివాద రహితంగా మెలగడం మాస్టర్ బ్లాస్టర్ గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. తన 24 ఏళ్ల కెరీర్లో ఎక్కడా ఒక్క వివాదం కూడా లేదు. మైదానం లోపల, బయట కూడా మంచివాడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇకపై భారత బ్యాట్స్‌మెన్ తమ ఆటతీరు గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఏ చిన్న తప్పులు చేస్తున్నా నెట్స్‌లో సరిదిద్దడానికి సచిన్ ఉంటాడు. నిజానికి సచిన్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండటమే ఓ పాఠం. తన అనుభవాలు చెప్తే చాలు స్ఫూర్తి పెరుగుతుంది. ఫలానా మ్యాచ్‌లో ఇలాంటి ఒత్తిడిలో నేను ఇలా ఆడా అని మాస్టర్ చెప్పినా అదే కొండంత ధైర్యాన్నిస్తుంది. 2003 ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచిన సచిన్ ఆ టోర్నీలో తాను ఒక్కసారి నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయలేదని చెబితే ఆశ్చర్యం కలగడమే కాదు... మరో రకమైన సన్నాహకం దాని వెనక ఉందనే విషయం తెలిస్తే యువ ఆటగాళ్లు అదో పెద్ద పాఠం. ఇటీవల కాలంలో ఆటతీరు ఎలా ఉన్నా మైదానం లోపల, బయట కూడా భారత క్రికెటర్లు పదే పదే వివాదాల్లోకి వెళుతున్నారు. ముఖ్యంగా టెస్టు కెప్టెన్ కోహ్లి ఇందులో ముందుంటున్నాడు. ఇలాంటి వాటికి దూరంగా ఉండటం వల్ల ఎలాంటి మేలు జరుగుతుందో చెప్పే బాధ్యత ఇకపై సచిన్ తీసుకోవచ్చు. గంగూలీ: సమపాళ్లలో దూకుడు భారత జట్టు కెప్టెన్‌గా ప్రత్యర్థులతో దూకుడు ఎలా వ్యవహరించాలో తొలుత నేర్పినవాడు గంగూలీ. అయితే తను ఏనాడూ శృతి మించలేదు. గీత దాటి వేటు పడేదాకా పరిస్థితిని తెచ్చుకోలేదు. అలాగే వ్యూహాల విషయంలో తనకు తనే సాటి. ఆట కంటే మిగిలిన విషయాలలో గంగూలీ అనుభవం యువ జట్టుకు ఎక్కువగా ఉపయోగపడొచ్చు. ఇక గంగూలీలో మంచి అడ్మినిస్ట్రేటర్ కూడా ఉన్నాడు. బోర్డుకు, ఆటగాళ్లకు మధ్య వారధిగా తను ఉపయోగపడతాడు. తను కెప్టెన్‌గా ఉన్న రోజుల్లో యువ క్రికెటర్లను వెనకేసుకొచ్చి సెహ్వాగ్, హర్భజన్ లాంటి వాళ్లు నిలదొక్కుకునేలా చేసిన ఘనత తనది. మరోసారి ఇప్పటితరం క్రికెటర్లు కూడా గంగూలీని నమ్ముకోవచ్చు. నైపుణ్యం ఉన్న క్రికెటర్‌ను గుర్తించి, తనకు అండగా నిలవడంలో దాదా ఎప్పుడూ ముందుంటాడు. లక్ష్మణ్: విదేశాల్లో బాగా ఆడటం ప్రస్తుత క్రికెటర్లు లక్ష్మణ్ నుంచి నేర్చుకోవాల్సిన తొలి పాఠం విదేశీ గడ్డపై ఎలా ఆడాలో తెలుసుకోవడమే. ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ గడ్డలపై మన రికార్డు అత్యంత పేలవంగా ఉంది. ప్రస్తుత టి20 తరంలో బ్యాట్స్‌మెన్ టెక్నిక్‌ను బాగా మెరుగుపరిస్తే ఈ రికార్డును సరిజేయొచ్చు. ఈ బాధ్యతను లక్ష్మణ్ సమర్థంగా నిర్వర్తించే అవకాశం ఉంది. ఇప్పటికే సన్‌రైజర్స్ జట్టు మెంటర్‌గా, బెంగాల్లో యువ బ్యాట్స్‌మెన్‌కు శిక్షకుడిగా కొంత అనుభవం కూడా తను గడించాడు. నిజానికి తమ తరంలో ఎక్కువగా అన్యాయం జరిగిన క్రికెటర్ లక్ష్మణ్. అద్భుతమైన ఫామ్‌లో ఉన్నా వన్డే ప్రపంచకప్ జట్టులోకి ఎంపిక కాలేదు. అయినా ఏనాడూ బయటకు ఒక్క మాట అనలేదు. వివాదాలను తెచ్చుకోలేదు. ఈ ముగ్గురూ తమ తొలి ఇన్నింగ్స్‌లో క్రికెట్ ఆడుతూ దిగ్గజాలుగా పేరు తెచ్చుకున్నారు. తాము ఆడినంత కాలం భారత క్రికెట్‌ను శిఖరాన నిలబెట్టారు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. తమ అనుభవంతో యువ జట్టును కూడా అదే స్థాయికి చేరుస్తారా..? చూద్దాం... త్వరలోనే దీనికి సమాధానం దొరకొచ్చు. - బత్తినేని జయప్రకాష్ భవిష్యత్ కోసం ద్రవిడ్ సలహా కమిటీలో త్రిమూర్తులు మాత్రమే ఉండి ద్రవిడ్ లేకపోవడం క్రికెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. నిజానికి బీసీసీఐ ద్రవిడ్‌ను కూడా ఈ కమిటీలో ఉండాలని కోరింది. అయితే తాను భారత క్రికెట్ భవిష్యత్ కోసం పని చేస్తానని ‘వాల్’ స్పష్టం చేశాడు. దీంతో భారత్ ఎ, అండర్-19 జట్లకు తనని కోచ్‌గా నియమించారు. భారత్ జట్టు తరఫున క్రికెట్ ఆడే వాళ్లంతా ఈ రెండు జట్లలో ఏదో ఒక దశలో ఆడి రావాల్సిందే. కాబట్టి క్షేత్రస్తాయిలోనే ఆటగాళ్లను సాన బెట్టాలనే ఆలోచన తనది. త్రిమూర్తులతో పోలిస్తే ద్రవిడ్‌దే కఠినమైన పని. క్రికెటర్‌గా ఉన్న రోజుల్లో జట్టు భారాన్ని అనేకసార్లు ఒంటిచేత్తో మోసిన రాహుల్ ద్రవిడ్‌కు ఇలాంటి సవాళ్లంటేనే ఇష్టం. -
కోచ్ ఎంపిక ‘త్రిమూర్తుల’ చేతుల్లో...
* కమిటీలో సచిన్, గంగూలీ, ద్రవిడ్ * బీసీసీఐ వర్కింగ్ కమిటీ నిర్ణయం కోల్‌కతా: భారత క్రికెట్ జట్టు కొత్త కోచ్‌ను ఎంపిక చేయడంలో ముగ్గురు మాజీ దిగ్గజాలు కీలక పాత్ర పోషించనున్నారు. డంకన్ ఫ్లెచర్ పదవీ కాలం ప్రపంచకప్‌తో ముగియడంతో బీసీసీఐ కోచ్ ఎంపికపై దృష్టి పెట్టింది. ఆదివారం ఇక్కడ సమావేశమైన బోర్డు వర్కింగ్ కమిటీ అందు కోసం ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భారత మాజీ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ సభ్యులుగా ఉంటారు. టీమిండియా శిక్షకుడిని ఎంపిక చేయడంపై వీరు ముగ్గురూ తమ సూచనలు, సలహాలు బోర్డు అధ్యక్ష, కార్యదర్శులకు అందజేస్తారు. దీంతో కోచ్ పదవికి గంగూలీ రేసులో ఉన్నట్లు ఇటీవల వచ్చిన వార్తలకు ఫుల్స్టాప్ పడినట్లే. త్వరలోనే భారత జట్టుకు కొత్త కోచ్ రానుండగా... అసిస్టెంట్ కోచ్‌లు సంజయ్ బంగర్, భరత్ అరుణ్, ఆర్. శ్రీధర్‌లు మాత్రం ఇకపై కూడా కొనసాగే అవకాశం ఉంది. ఆటను మరింతగా అభివృద్ధి చేసేందుకు మాజీ ఆటగాళ్లతో కూడిన సలహా కమిటీని కూడా ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. న్యాయ సలహా కోసం: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తమ విలువను కేవలం రూ. 5 లక్షలుగా చూపడంపై వర్కింగ్ కమిటీలో తీవ్ర చర్చ జరిగింది. పలువురు సభ్యులు దీనిపై ఐపీఎల్ సీఓఓ సుందర్ రామన్‌కు అనేక ప్రశ్నలు సంధించారు. మార్కెట్ విలువ కనీసం రూ. 1500 కోట్లు ఉండే జట్టును ఏ లెక్క ప్రకారం రూ. 5 లక్షలుగా చూపించారని మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ గట్టిగా నిలదీశారు. అయితే ఈ అంశంపై బోర్డు ఎలాంటి చర్య తీసుకోలేదు. దీనిపై తాజాగా న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని మాత్రం నిర్ణయించారు. ‘అర్జున’కు రోహిత్ పేరు ప్రతిపాదన: మరోవైపు కేంద్ర ప్రభుత్వ క్రీడా పురస్కారం ‘అర్జున’ అవార్డు కోసం 2015 సంవత్సరానికి రోహిత్ శర్మ పేరును ప్రతిపాదించాలని కూడా వర్కింగ్ కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. వన్డేల్లో రెండు డబుల్ సెంచరీలు నమోదు చేసిన ఏకైక ఆటగాడిగా రోహిత్ గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల మృతి చెందిన క్రికెటర్లు అంకిత్ కేసరి, గౌరవ్ కపూర్లకు ఈ సమావేశంలో శ్రద్ధాంజలి ఘటించారు. బుకీతో బోర్డు కార్యదర్శి! ముంబై: బీసీసీఐ కార్యదర్శిగా ఇటీవలే ఎంపికైన అనురాగ్ ఠాకూర్ వివాదంలో చిక్కుకున్నారు. జాతీయ మీడియా కథనం ప్రకారం... కరణ్ గిల్హోత్రా అనే అనుమానిత బుకీతో ఠాకూర్ సన్నిహితంగా మెలిగినట్లు సమాచారం. ఒక పార్టీలో కరణ్‌కు స్వయంగా ఠాకూర్ కేక్ తినిపిస్తున్న ఫొటో ఒకటి బయటికి వచ్చింది. ఐసీసీ అవినీతి నిరోధక విభాగం (ఏసీఎస్‌యూ) వద్ద ఉన్న బుకీల జాబితాలో కరణ్ పేరు కూడా ఉండటం వివాదానికి కారణమైంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ నాలుగు రోజుల క్రితం ఐసీసీ, బీసీసీఐకి ఘాటుగా లేఖ రాసినట్లు తెలిసింది. ఫిక్సింగ్ మాయలో పడకుండా ఆటగాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతూ బీసీసీఐ ఏసీఎస్‌యూ డెరైక్టర్ రవి సవాని 2014లో అన్ని ఐపీఎల్ జట్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో కూడా కరణ్ గిల్హోత్రాకు దూరంగా ఉండాలని సూచనలు ఉన్నాయి. అయితే ఐసీసీ లేఖ రాసి నాలుగు రోజులు దాటినా బీసీసీఐ దానికి స్పందించలేదు. శ్రీనివాసన్ గూఢచర్యం!: మరోవైపు ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్ గతంలో తాను బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బోర్డు సభ్యులపైనే గూఢచర్యానికి పాల్పడినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. సహచరుల ఫోన్లు ట్యాప్ చేసేందుకు, ఇ-మెయిల్స్ హ్యాక్ చేసేందుకు శ్రీనివాసన్ లండన్‌కు చెందిన ప్రైవేట్ ఏజెన్సీని ఉపయోగించుకున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆయన దాదాపు రూ. 14 కోట్ల బోర్డు సొమ్మునే వాడినట్లు తెలుస్తోంది. దీనిపై బీసీసీఐ త్వరలో విచారణ జరిపే అవకాశం ఉంది. -
నేడు భారతరత్న సచిన్ జన్మదినం
-
రీతూను చంపింది భర్తే
వీడిన మాజీ ఎయిర్ హోస్టెస్ హత్య కేసు మిస్టరీ నేరాన్ని అంగీకరించిన ఆమె భర్త సచిన్ హైదరాబాద్: నగరంలోని రామాంతపూర్ పరిధి ఇందిరానగర్‌కు చెందిన మాజీ ఎయిర్ హోస్టెస్ రీతూను ఆమె భర్తే అంత మొందించాడు. ఆమె ముఖంపై దిండుతో అదిమి ప్రాణాలు తీసినట్లు రీతూ భర్త సచిన్ ఉప్పల్ నేరాన్ని అంగీకరించాడు. కేసు వివరాలను గురువారం ఉప్పల్ ఏసీపీ కార్యాలయంలో మల్కాజిగిరి ఏసీపీ రవిచందన్‌రెడ్డి విలేకరులకు వెల్లడించారు. రీతూ ఈ నెల 19 న హత్యకు గురైన సంగతి విదితమే. భార్య మీద అనుమానంతో పాటు తనను స్నేహితుని ముందు అవమానించిందన్న ఆగ్రహంతో ఆమెను భర్తే అంతమొందించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. మద్యం తాగి..స్నేహితునితో వచ్చి.. ఈ నెల 19వ తేదీ రాత్రి సచిన్ తన స్నేహితుడు కోటగిరి రాకేశ్‌తో కలిసి హిమాయత్ నగర్‌లోని ఓ బార్లో మద్యం తాగాక 10.30 గంటల సమయంలో అతన్ని తీసుకొని తమ ప్లాట్‌కు వచ్చాడు. అలా రావడాన్ని భార్య రీతూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీన్ని పట్టించుకోని సచిన్ ఆమె టీవి చూస్తుండగా రిమోట్ తీసుకొని స్నేహితునితో కలిసి చూసేందుకని క్రికెట్ మ్యాచ్ పెట్టాడు. ఇది వారి మధ్య తొలుత వాగ్వాదానికి దారి తీసింది. అంతే కాకుండా తనకూ, తన స్నేహితునికీ ఇంట్లో ఉన్న బిర్యానీ వడ్డించమని కోరాడు. రీతూ అంగీకరించక పోవడంతో అవమానంగా భావించి స్నేహితుని సమక్షంలోనే ఆమెపై చేయి చేసుకున్నాడు. దాన్ని అడ్డుకునేందుకు రాకేశ్ ప్రయత్నించడంతో అతన్ని ఇంట్లోనుంచి బయటకు గెంటి తలుపు వేసేశాడు. అనంతరం రీతూను మంచంపైకి నెట్టి ఆమె ముఖంపై దిండుతో అదిమి హతమార్చాడు. ఈ సంఘటనను దాచి ఉంచి భార్య తల్లితండ్రులకు సచిన్ ఫోన్‌చేసి రీతూ ఆరోగ్యస్థితి సీరియస్‌గా ఉందని తెలియజేశాడు. వారు అక్కడికి చేరువలోనే ఉన్న తమ మరో కుమార్తె ఇంటివద్ద ఉంటున్నారు. వారు వెంటనే వచ్చి చూసేసరికి రీతూ మంచంపై మరణించి ఉంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అదే రోజు నిందితుడ్ని కస్టడీలోకి తీసుకొని విచారించడంతో కేసు గుట్టు వీడింది. ఈ మేరకు పోలీసులు గురువారం సచిన్ ఉప్పల్‌ను రిమాండ్‌కు తరలించారు. నిందితులుగా ఉన్న అతని తండ్రి రమేష్ ఉప్పల్, తల్లి సీమా ఉప్పల్, సోదరి నితిన్ ఉప్పల్‌పై కూడా కేసు నమోదు చేశారు. వీరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సచిన్, అతని స్నేహితుడు రాకేశ్‌లపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాకేశ్‌ను కూడా అరెస్టు చేశారు. కాగా తమ కుమార్తె మరణానికి కారకుడైన సచిన్‌కు ఉరిశిక్ష వేస్తేనే ఆమె ఆత్మకు శాంతి చేకూరుతుందని రీతూ తల్లిదండ్రులు తెలిపారు.కాగా సచిన్ దంపతుల ఆరునెలల కొడుకు తల్లి మంచంపై ఆడుకుంటున్న సమయంలోనే తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలిసి పలువురు కదిలిపోయారు. రీ పోస్టుమార్టం నిర్వహించాం: ఏసీపీ రీతూ హత్య కేసులో రెండో అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు రీ-పోస్టుమార్టం కూడా జరిపించామని ఏసీపీ రవిచందన్‌రెడ్డి తెలిపారు. కాగా సచిన్‌కు కొడుకు విషయంలో భార్యపై అనుమానం ఉండేదనీ దీనికోసం డీఎన్ఏ పరీక్ష కోసం ఆమెపై ఒత్తిడి తెచ్చేవాడని కూడా తమ దృష్టికి వచ్చిందన్నారు. అయితే ఈ విషయమై తమ వద్ద స్పష్టమైన సమాచారం లేదనీ ఈ కోణంలోనూ విచారణ చేపడతామని వెల్లడించారు. రీతు హత్య కేసులో వెంటనే స్పందించిన ఉప్పల్ ఇన్స్పెక్టర్ నర్సింహారెడ్డి, పోలీస్ సిబ్బందికి తగిన పారితోషికం అందచేయనున్నట్లు ఏసీపీ తెలిపారు. -
సచిన్ తో డిన్నర్ చేయాలనుందా?
వీలైతే ఓ ఆటోగ్రాఫ్.. కుదిరితే ఫొటోగ్రాఫ్.. క్రికెట్ ఎవరెస్ట్ సచిన్ టెండూల్కర్ తో అంతకుమించిన సమయం గడపడం సాధ్యమవుతుందా..? సచిన్‌తో మాట్లాడే అవకాశం రావడమే అరుదు.. అలాంటిది ఏకంగా మాస్టర్‌తో కలసి డిన్నర్ చేసే అవకాశం వచ్చింది. అభిమానుల కోసం ఓ బంపర్ ఆఫర్! వచ్చే ఆదివారం (ఫిబ్రవరి 22న) సిడ్నీలోని ఓ ప్రఖ్యాత రెస్టారెంట్లో దాదాపు 60 మందితో కలసి సచిన్ డిన్నర్ చేయనున్నారు. ఈ 60 మందిలో మీరూ ఒకరు కావాలనుకుంటే దాదాపు 70 వేల రూపాయల నుంచి 1.40 లక్షల వరకు చెల్లించాలి. ఈ విందు ద్వారా వసూలు చేసిన మొత్తాన్ని సచిన్ పేరుతో నిర్వహిస్తున్న స్వచ్చంద సంస్థకు అందించనున్నారు. ఒకవేళ 22న మిస్ అయినా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగిన తర్వాత మెల్‌బోర్న్‌లోనూ ఇలాంటి విందే మరోటి జరుగనుంది.ఇటు సచిన్‌తో కలసి భోజనం చేశామన్న సంతోషం.. అటు సామాజిక సేవకు సాయపడ్డామన్న తృప్తి కావాలంటే.. గెట్ రెడీ టు డైన్ విత్ లిటిల్ మాస్టర్. -
ఆ పోటీలకు దూరంగా పిల్లలను ఉంచా : సచిన్ భార్య అంజలి
ప్రపంచ కప్ క్రికెట్ పోటీలు ప్రారంభం 2011...ప్రపంచకప్ పోటీలు ... జరుగుతున్నదీ భారత్‌లోనే... ఫైనల్ మ్యాచ్ శ్రీలంకతో భారత్ తలపడుతోంది. దోనీ కెప్టెన్‌గా ఉన్న ఆ టీం వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. సచిన్ కల ఫలించింది. దేశమంతా ఒళ్లంతా కళ్లు చేసుకుని టీవీలకు అతుక్కుపోయింది. సచిన్ కుటుంబం మాత్రం టీవీలకు దూరంగా ఉంది. ఎందుకంటే వారి పిల్లలకు ఆ మరుసటి రోజునే పరీక్షలు. పిల్లల్ని చదివించుకుంటూ ఉన్నానని సచిన్ భార్య అంజలి పత్రికలకు చెప్పారు. భవితకే ప్రాధాన్యం కోట్లకు అధిపతులు ... చదువు ఒడుదొడుకుల్లో పడినా పెద్ద ఇబ్బందులేమీ ఆ కుటుంబాలకు ఉండవు. కానీ, చదువుకే వారు ప్రాధాన్యం ఇచ్చారు. భవితకు పునాదులు వేయడానికి వాళ్లు ఎంతగా తపన పడుతున్నారో ఈ రెండు ఉదాహరణలు చాలు. కానీ, చాలామంది యువత భవిష్యత్తును తేలికగా తీసుకుని తాత్కాలిక ఆనందాలకే పెద్దపీట వేస్తున్నారు. ప్రపంచ కప్ క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. సుమారు నెలరోజుల పాటు జరుగుతాయి. ఇవి కొనసాగినన్నాళ్లూ తరగతి గదులు ఖాళీ అవడం సంప్రదాయంగా వస్తున్నదే. కానీ నేటి పోటీ ప్రపంచంలో ఒక్క రోజు క్లాస్ మిస్సయినా వెనుక‘బడి’పోయినట్టే. అందుకే ఇటు చదువు...అటు క్రికెట్‌ను సమన్వయం చేసుకుంటామని అంటున్నారు నేటి విద్యార్థులు. అవసరమైతే క్రికెట్‌కు దూరంగా ఉంటాం, భవితకే పెద్ద పీట వేస్తామని ‘సాక్షి’కి చెప్పారు. -
'2015 ప్రపంచ కప్ ధోనీ టార్గెట్ కావాలి'
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచ కప్ సాధించడం భారత కెప్టెన్ ధోనీ లక్ష్యం కావాలని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నాడు. మహీ టెస్టు క్రికెట్‌కు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించగానే సచిన్ స్పందించాడు. టెస్టు క్రికెట్లో ధోనీ అద్భుతమైన కెరీర్ కొనసాగించాడని సచిన్ ట్వీట్ చేశాడు. తామిద్దరం కలిసి క్రికెట్ ఆడేందుకు ఎంతో ఉత్సాహం చూపేవాళ్లమని గతాన్ని గుర్తుచేసుకున్నాడు. 2015 ప్రపంచ కప్ ధోనీ టార్గెట్ కావాలని సచిన్ సూచించాడు. -
రెండు దశాబ్దాల కోరిక తీరింది
రిటైర్మెంట్ తర్వాత సచిన్ ‘తొలి' సంగతులు రెండున్నర దశాబ్దాల పాటు క్రికెట్ కోసం కడుపారా తినాలనుకున్న అనేక ఆహార పదార్థాలకు సచిన్ దూరమయ్యాడు. అలాగే నచ్చినచోట సెలవులు గడపాలన్న కోరికనూ చంపుకున్నాడు. గత ఏడాది క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాక తనకు నచ్చిన అనేక పనులు చేసుకుంటున్నాడు. రిటైర్మెంట్ తర్వాత తన తొలి హాలిడే, కడుపు నిండా తిన్న స్నాక్స్... ఇలా అనేక ‘తొలి' అంశాల గురించి విశేషాలు మాస్టర్ మాటల్లోనే... క్రికెట్‌ను వదిలేసినందుకు: ఇప్పటికీ బాధలేదు. లార్డ్స్‌లో ఎంసీసీ తరఫున మ్యాచ్ ఆడినప్పుడు సిడిల్ బౌలింగ్‌లో వరుసగా స్ట్రయిట్ డ్రైవ్, కవర్‌డ్రైవ్‌లతో రెండు ఫోర్లు కొట్టాను. అప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది. తొలిసారి తిన్న స్నాక్స్: రిటైరైన రోజే హోటల్‌కు వెళ్లగానే షాంపేన్ తాగి, హలీమ్ తిన్నాను. మామూలుగా క్రికెట్ ఆడే రోజుల్లో ఫిట్నెస్ దృష్ట్యా ఎక్కువ తినేవాడిని కాదు. ఆ రోజు మాత్రం కడుపునిండా తిన్నా. ఇచ్చిన తొలి సలహా: రహానేకు. ‘చాలాకాలంగా నిన్ను గమనిస్తున్నా. ఇప్పటిలాగే ఎప్పుడూ కష్టపడు. నువ్వు ఆట కోసం కష్టపడుతుంటే ఆటే నిన్ను ఎత్తుకు తీసుకెళుతుంది’ అని రహానేకు చెప్పాను. ఆడిన ఆట: డిసెంబరు 5న ఎంసీఏ రిక్రియేషన్‌లో బ్యాడ్మింటన్ ఆడా. ముస్సోరీలో హాలిడేకు వెళ్లినప్పుడు కూడా బ్యాడ్మింటన్తోనే సమయం గడిపా. తొలి హాలిడే: క్రిస్మస్ సమయంలో లండన్‌లో ఉండాలనేది గత 20 సంవత్సరాలుగా నా కోరిక. అక్కడ జరిగే సంబరాల గురించి వినడమే కానీ, ప్రత్యక్షంగా చూడలేకపోయా. ప్రతిసారీ షెడ్యూల్ కారణంగా డిసెంబరులో ఇంగ్లండ్ వెళ్లడం కుదిరేది కాదు. రిటైరయ్యాక డిసెంబరులో లండన్ వెళ్లి క్రిస్మస్ సంబరాలు చూశా. మ్యూజిక్ కన్సర్ట్: మా పిల్లల్ని తీసుకుని లండన్‌లో ఒక మ్యూజిక్ కన్సర్ట్కు వెళ్లా. ఆ బ్యాండ్‌కు సంబంధించిన ఒక్కపాట కూడా అంతకుముందు నేను వినలేదు. కానీ పిల్లలు అడిగారని వెళ్లాం. తొలిసారి బ్యాట్ పట్టుకుంది: డిసెంబరులోనే మా అబ్బాయి అర్జున్ మా ఇంటి వెనక స్నేహితులతో కలిసి ఆడుతున్నప్పుడు. ‘అంకుల్... ప్లీజ్ మాతో కొద్దిసేపు ఆడండి’ అని అర్జున్ స్నేహితులు అడిగారు. ఆటలో ఉన్నప్పటి స్థాయిలో కష్టపడింది: జనవరిలో బ్యాడ్మింటన్ ఆడటం కోసం బాగా కష్టపడ్డా. రిటైరయ్యాక బాగా ఎమోషనల్ అయింది: రిటైరయిన తర్వాతి రోజు మా అమ్మ భగవంతుడికి హారతి ఇచ్చి, దేవుడి ముందు స్వీట్స్ ఉంచింది. సాధారణంగా నేను క్రికెట్ టూర్ ముగించుకుని వచ్చిన ప్రతిసారీ అలా చేస్తుంది. దీంతో కాస్త ఎమోషనల్‌గా ఫీలయ్యా. తొలిసారి చేసిన డ్యాన్స్: డిసెంబరు 31కి. పిల్లలతో, స్నేహితులు అమోల్ మజుందార్, సాయిరాజ్ బహుతులే, అతుల్లతో కలిసి బీకేసీలో జరిగిన పార్టీలో డ్యాన్స్ చేశా. -
మరో ఏడాది ఆడాలనుకున్నా..!
రిటైర్మెంట్పై సచిన్ న్యూఢిల్లీ: అన్ని తొలుత అనుకున్నట్లు జరిగితే మరో ఏడాది ఆడి 2014లోనే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేవాడినని సచిన్ చెప్పాడు. ‘రిటైర్మెంట్ గురించి ఎప్పుడూ పెద్దగా ఆలోచించలేదు. డిసెంబర్ 2013లో దక్షిణాఫ్రికా, 2014లో న్యూజిలాండ్ పర్యటనలు ఉండటంతో వీటిపైనే ఎక్కువగా దృష్టిపెట్టా. అయితే స్వదేశంలో విండీస్ సిరీస్ రావడంతో పునరాలోచన మొదలైంది. ఈ సిరీస్ తర్వాత వీడ్కోలు చెబితే ఎలా ఉంటుందని అంజలి, అజిత్‌తో చర్చించా. విండీస్‌తో రెండో టెస్టు నా కెరీర్లో 200ల టెస్టు మ్యాచ్. స్వదేశంలో రిటైర్మెంట్ చెప్పడానికి ఇంతకంటే మంచి అవకాశం రాదని భావించా. 2014 చివరి దాకా గాయాలు కావన్న హామీ లేదు. కాబట్టి పరిస్థితులను సాగదీయడం కంటే నిర్ణయం తీసుకోవడమే మేలనిపించింది’ అని మాస్టర్ వెల్లడించాడు. పిల్లలపై ఒత్తిడి: నాకున్న పేరు ప్రఖ్యాతల వల్ల అర్జున్, సారా కూడా ఇబ్బందులకు గురయ్యారు. 2007లో అర్జున్‌కు ఏడేళ్లు. మేం ప్రపంచకప్ తొలి రౌండ్లోనే ఓడటంపై కామెంట్స్ చేస్తే పట్టించుకోవద్దని చెప్పా. అయినప్పటికీ... మీ నాన్న సున్నాకు అవుటైనందుకే భారత్ ఓడిందని ఎవరో స్నేహితుడు కామెంట్ చేశాడంట. దీనికి అర్జున్ కూడా ఘాటుగానే సమాధానమిచ్చాడంట. క్రానే ఇబ్బందిపెట్టాడు: కెరీర్లో ఓ 30 మంది దిగ్గజ బౌలర్లను ఎదుర్కొన్నాను. ఎవరి బౌలింగ్‌లోనూ ఇబ్బందిపడలేదు. కానీ హాన్సీ క్రానే (దక్షిణాఫ్రికా) బౌలింగ్‌లో ఆడాలంటే అసౌకర్యంగా ఉండేది. స్ట్రయిక్ బౌలర్లకు రెస్ట్ ఇచ్చేందుకు అతను ఓ 2,3 ఓవర్లు వేసేవాడు. దీంతో క్రానేపై ఒత్తిడిని పెంచాలనే ప్రయత్నంలో సరిగా ఆడలేకపోయేవాణ్ని. పాలకూరతో గోడ కట్టా: కౌంటీల్లో యార్క్‌షైర్‌కు ఆడేటప్పుడు డబ్బులు చాలకపోయేవి. నేను, కొంతమంది స్నేహితులం కలిసి పిజ్జా తినడానికి వెళ్లేవాళ్లం. బఫెట్ ఆర్డర్ చేస్తే కావాల్సినంత తినొచ్చు. కానీ సలాడ్ ఒక్క బౌల్ మాత్రమే ఇచ్చేవారు. దీంతో మేం కొత్తగా ఆలోచించి బౌల్లో పాలకూరతో గోడ మాదిరిగా కట్టి దాని నిండా సలాడ్ నింపేవాళ్లం. ఈ టెక్నిక్ బాగా పని చేసింది. -
‘సచిన్’ ఆడియో రిలీజ్
-
నన్ను అవమానించారు!
ముంబై: సచిన్ ఆత్మకథ ‘ప్లేయింగ్ ఇట్ మై వే’లో సంచలనాలకు కొదువ లేదు. మాస్టర్ తాను చెప్పినట్లుగా ఇప్పటి వరకు బయటికి వెల్లడించని అనేక అంశాలను ఈ పుస్తకంలో ప్రస్తావించాడు. నిజాలే చెప్పానన్న అతను నాటి ఘటనలపై తన ఆగ్రహావేశాలు దాచుకోలేదు. వేర్వేరు అంశాలపై సచిన్ రాసిన విశేషాలు అతని మాటల్లోనే... కనీసం చెప్పలేదు: నన్ను కెప్టెన్సీనుంచి తొలగించిన విధానం చాలా బాధగా, అవమానకరంగా అనిపించింది. బీసీసీఐ నుంచి ఎవరూ నాకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదు. నేను కెప్టెన్‌ను కాదని మీడియా ద్వారానే తెలిసింది. అయితే అలా చేయడం నేను ఇంకా బాగా ఆడాలనే పట్టుదల నాలో పెంచింది. అయితే నా కోపం మాత్రం తగ్గలేదు. కెప్టెన్సీ బాధనుంచి కోలుకోవడానికి కొంత సమయం పట్టింది’ కోచ్‌గా కపిల్ విఫలం: నేను రెండో సారి కెప్టెన్‌గా వ్యవహరించిన సమయంలో భారత దిగ్గజం కపిల్‌దేవ్ కోచ్‌గా ఉన్నారు. 1999-2000 ఆస్ట్రేలియాలాంటి కఠిన సిరీస్‌లో ఆయన నుంచి నేను చాలా ఆశించాను. జట్టు వ్యూహాలు, ప్రణాళికలు రూపొందించడంలో కోచ్‌దే కీలక పాత్ర అని నేను గట్టిగా నమ్ముతాను. అయితే ఆయన మాత్రం అన్నీ కెప్టెన్‌కే వదిలేశారు. మైదానంలో ఉపయోగపడగల వ్యూహ ప్రతివ్యూహాలు, చర్చల్లో ఆయన పెద్దగా పాల్గొనకపోయేవారు. ఒక కోచ్‌గా కపిల్ నన్ను తీవ్రంగా నిరాశపరిచారు. నన్ను ఒంటరిగా వదిలెయ్: ముల్తాన్ టెస్టులో నేను 194 పరుగులతో ఆడుతున్నాను. మేం ముందుగా అనుకున్నదానికంటే ఒక ఓవర్ ముందే డిక్లరేషన్ జరిగింది. ఇలా చేయడంలో అర్థమే లేదు. నిరాశతో, బాధతో డ్రెస్సింగ్ రూమ్ చేరాను. ఆ సమయంలో చాలా ఆగ్రహంతో ఉన్నాను. జాన్ రైట్ వచ్చి తన తప్పేమీ లేదని క్షమాపణ చెప్పారు. కోచ్‌కే తెలియకపోతే సారీ చెప్పటం ఎందుకన్నాను. గంగూలీ వచ్చి నాకూ తెలీదంటూ సారీ చెప్పినా అదే అన్నాను. చివరికి ఇక నటించలేనంటూ నా అసంతృప్తిని ద్రవిడ్ ముందు ప్రకటించేశాను. జట్టు గెలుపు కోసం నిర్ణయమంటూ అతను చెప్పిన వివరణతో నేను సంతృప్తి చెందలేదు. నేను కూడా జట్టు కోసం ఆడుతున్నానని, 194 పరుగులు జట్టుకే ఉపయోగపడతాయని చెప్పాను. ఈ కోపాన్ని నేను మైదానంలో చూపించను కానీ మైదానం బయట నన్ను ఒంటరిగా వదిలెయ్. కోలుకోవడానికి సమయం పడుతుంది అని ద్రవిడ్‌తో అన్నాను. -
దశావతారం
ఇంతింతై వటుడింతై అన్నట్టు అంతర్జాతీయ క్రికెట్లో విశాఖ అంచలంచెలుగా ఎదిగింది. 1988లో భారత్-న్యూజిలాండ్‌ల మధ్య జరిగిన మ్యాచ్ మొదలు గత ఏడాది భారత్-వెస్టిండీస్ మ్యాచ్ వరకు పదహారేళ్లలో మొత్తం పది వన్డే మ్యాచ్‌లు జరిగాయిక్కడ. అరకొర వసతులతో ఉన్న మున్సిపల్ స్టేడియంను ముస్తాబు చేసి అంతర్జాతీయ మ్యాచ్‌కు నడుం కట్టిన దగ్గర్నుంచి ప్రపంచ ప్రమాణాలతో అధునాతన స్టేడియంను సమకూర్చుకునే వరకు విశాఖ క్రికెట్ రంగానిది ఓ విశిష్ట చరిత్ర. డి.వి.సుబ్బారావు వంటి ఉద్దండుల కృషి ఫలితమిది. వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియం ప్రస్తుతం టెస్ట్ మ్యాచ్ హోదాకు తగిన హంగులు సమకూర్చుకొని అనుమతి కోసం ఎదురుచూస్తోంది. మంగళవారం భారత్-వెస్టిండీస్ మ్యాచ్ జరగనున్న సందర్భంగా ఈ అందాల నగరంలో జరిగిన పది వన్డే మ్యాచ్‌లపై విహంగ వీక్షణం... తొలి మ్యాచ్‌లో శ్రీకాంత్ ఆల్‌రౌండ్ ప్రతిభ వైజాగ్‌లో తొలి మ్యాచ్ 1988 డిసెంబర్ 10న జరిగింది. భారత జట్టుకు దిలీప్ వెంగ్‌సర్కార్ నాయకత్వం వహించాడు. న్యూజిలాండ్ జట్టుకు జాన్ రైట్ నాయకత్వం వహించాడు. జోన్స్ 64 పరుగులు, రూథర్‌ఫోర్డ్ 67 పరుగులు చేశారు. దాంతో న్యూజిలాండ్ జట్టు తొమ్మిది వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. తొలి వికెట్ కపిల్‌దేవ్‌కు లభించింది. అప్పట్లో బ్యాటింగ్ సెన్సేషన్‌గా గుర్తింపు పొందిన క్రిష్ శ్రీకాంత్ ఆఫ్‌స్పిన్‌తో విజృంభించి 7 ఓవర్లలో 27 పరుగులిచ్చి ఐదువికెట్లు పడగొట్టాడు. విశాఖలో ఇదే బౌలింగ్‌లో అత్యుత్తమ రికార్డు. తర్వాత భారత బ్యాటింగ్‌లో శ్రీకాంత్ 70 పరుగులు, అజరుద్దీన్ 48 పరుగులు చేశారు. లక్ష్యాన్ని భారత జట్టు 46.2 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి సాధించింది. అలరించిన సచిన్, సిద్దూ రెండో వన్డే 1994 నవంబర్ 7న జరిగింది. భారత వెస్టిండీస్ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 44 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 260 పరుగులు సాధించింది. సచిన్ 54 పరుగులు చేశాడు. విశాఖ ప్రేక్షకులను సచిన్ అలరించాడు. జడేజాతో కలసి సచిన్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ఫస్ట్‌డౌన్‌లో వచ్చిన సిద్ధూ విజృంభించి 103 బాల్స్ ఎదుర్కొని 9 బౌండరీలు,రెండు సిక్సర్లతో 114 పరుగులు చేశాడు. కెప్టెన్ అజరుద్దీన్ 45 పరుగులు చేశాడు. వెస్టిండీస్ పోరాడినా, స్లో ఓవర్ రేట్ వల్ల ఓ ఓవర్ జరిమానాగా కోల్పోవడం ఆ జట్టు కొంప ముంచింది. ఆ జట్టు 43 ఓవర్లే బ్యాటింగ్ చేసి ఏడు వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసి మ్యాచ్‌ను కేవలం 4 పరుగుల తేడాలో కోల్పోయింది. అప్పట్లో బ్యాటింగ్ సెన్సేషన్ లారా 39 పరుగులు చేశాడు. సిమ్మన్స్ 51 పరుగులు, కార్ల్ హూపర్ 74 పరుగులు చేశారు. సిమ్మన్స్ వికెట్ సచిన్‌కు లభించింది. చెలరేగిన ‘వా’ సోదరులు వైజాగ్‌లో మూడో మ్యాచ్ వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ లీగ్ మ్యాచ్‌గా జరిగింది. ఫిబ్రవరి 23, 1996న జరిగిన ఈ మ్యాచ్‌లో కొదమ సింహం ఆస్ట్రేలియా, పసికూన కెన్యా తలపడ్డాయి. ఆసీస్ ముందుగా బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో ఏడువికెట్ల నష్టానికి 304 పరుగులు భారీస్కోర్ సాధించింది. మార్క్ వా చెలరేగి 128 బాల్స్‌లో 14 బౌండరీలు, ఓ సిక్సర్‌తో 130 పరుగులు చేశాడు. అతని సోదరుడు స్టీవ్ వా 82 పరుగులు చేశాడు. కెన్యా 7 వికెట్ల నష్టానికి 204 పరుగులే చేసి చిత్తుగా ఓడింది. ఒంటెనో 85 పరుగులు చేసినా ఫలితం లేకపోయింది. స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్, ప్రముఖ పేసర్ మెక్‌గ్రాత్ తదితరుల విజృంభణను వైజాగ్ ప్రేక్షఖులు తొలిసారిగా చూడగలిగారు. పాక్‌పై శ్రీలంక గెలుపు విశాఖలో నాలుగో మ్యాచ్ పెప్సీకప్ టోర్నీలో భాగంగా పాకిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య జరిగింది. 1999 మార్చి 27న జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లంక జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. జయవర్దనే 101 పరుగులు చేశాడు. పాక్ జట్టులో అజర్ మహమూద్ 4 వికెట్లు పడగొట్టాడు. పాక్ జట్టు బ్యాటింగ్‌లో విఫలమైంది. ఆఖర్లో కెప్టెన్ వసీం అక్రమ్ చెలరేగి 60 బంతుల్లో ఐదు బౌండరీలు, నాలుగు సిక్సర్లతో 79 పరుగులు చేసినా ఫలితం లేకపోయింది. ఆ జట్టు 46.3 ఓవర్లలో 241 పరుగులకే ఆలవుట్ అయింది. లంక జట్టు 12పరుగుల ఆధిక్యంతో గెలుపొందింది. కంగారెత్తించారు... విశాఖపట్నంలో ఐదో మ్యాచ్ భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య 2001 ఏప్రిల్ 3న జరిగింది. ఆస్ట్రేలియా జట్టు భారతబౌలర్లకు చుక్కలు చూపించింది. ఓపెనర్ హేడెన్, ఫస్ట్ డౌన్లో వచ్చిన పాంటింగ్ చెలరేగిపోయారు. హేడెన్ 111 పరుగులు, పాంటింగ్ 101 పరుగులు చేసి మొదటి వికెట్‌కు 219 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. తర్వాత భారత బ్యాటింగ్‌లో సచిన్ ఉన్నది కొద్ది సేపైనా ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపిం చాడు. అతడు 68 నిమిషాలు క్రీజ్‌లో నిలబడి 11 బౌండరీలతో 62 పరుగులు చేశాడు. విశాఖ లో సచిన్‌కు ఇది అత్యధిక స్కోర్. మిగిలిన భా రత బ్యాట్స్‌మెన్ అంతా చేతులెత్తేశారు. ధోనీ స్టార్ అయ్యిందిక్కడే.. వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో తొలి మ్యాచ్ చిరకాల ప్రత్యర్థులైన భారత,పాకిస్తాన్ జట్ల మధ్య జరిగింది. 2005 అక్టోబర్ 5న జరిగిన ఈ మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా భారత అభిమానులకు కనుల పండువగా జరిగింది. అప్పటి బ్యాటింగ్ సంచల నం, ఇప్పటి కెప్టెన్ తన హెలికాప్టర్ షాట్లతో అల రించింది ఇక్కడే. ధోనీ ఈ మ్యాచ్‌తో ఒక్కసారిగా స్టార్ అయ్యాడు. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు సెవాగ్, ధోనీ అండతో ఆడుతూ పాడుతూ 9 వికెట్ల నష్టానికి 356 పరుగుల భారీ స్కోర్ సాధిం చింది. ఓపెనర్ సెవాగ్ 12 ఫోర్లు,రెండు సిక్సర్లతో 74 పరుగులు చేశాడు. ధనాధన్ ధోనీ 123 బంతుల్లో 15 బౌండరీలు, 4 సిక్సర్లతో 148 పరుగులు సాధించాడు. పాక్ జట్టు బ్యాటింగ్‌లో రజాక్ (88), యూసఫ్ యొహానా (71) పోరాడినా ఫలితం లేకపోయింది. భారత్ తిరుగులేని రీతిలో 58 పరుగుల ఆధిక్యంతో గెలుపొందింది. ‘యూవీ’రవిహారం విశాఖలో ఏడో మ్యాచ్ భారత, శ్రీలంక జట్ల మధ్య 2007 ఫిబ్రవరి 17న జరిగింది. చమర సిల్వా సెంచరీ సాయంతో శ్రీలంక జట్టు 47 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 259 పరుగులు సాధించింది. తర్వాత భారత బ్యాటింగ్‌లో యువరాజ్ సింగ్ వీరవిహారం చేశాడు. 83 బంతుల్లో 11 బౌండరీలు, 3 సిక్సర్లతో అజేయంగా 95 పరుగులు సాధించాడు. గంగూలీ అజేయంగా 58 పరుగులు, ఉతప్ప 52 పరుగులు సాధించడంతో భారత జట్టు 41 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి 263 పరుగులు సాధించింది. ఆస్ట్రేలియాపై కసి తీర్చుకున్న భారత్ ఆస్ట్రేలియా జట్టు విశాఖలో మరో మ్యాచ్ ఆడినా ఈసారి పరాజయం నుంచి తప్పించుకోలేక పోయింది. 2010 అక్టోబర్ 20న జరిగిన ఈమ్యాచ్‌లో భారత జట్టు కసిగా ఆడి ఐదు వికెట్ల ఆధిక్యంతో గెలుపొందింది. ముందు బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టులో కెప్టెన్ క్లార్క్ 111 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. హసీ (69), వైట్ (89) అతనికి తోడ్పాటు అందించారు. దాంతో కంగారూ జట్టు 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసిం ది. కోహ్లీ 118 పరుగులు చేసి భార త గెలుపుకు బాట వేశాడు. యువరాజ్ సింగ్ 58 పరుగులు చేయగా, కీలక దశలో సురేశ్‌రైనా కేవలం 47 బంతుల్లో 71 పరుగులు చేసి భారత్‌ను గెలుపు తీరం చేర్చాడు. వెస్టిండీస్‌పై జయభేరి విశాఖలో తొమ్మిదో మ్యాచ్ భారత, వెస్టిండీస్ జట్ల మధ్య 2011 డిసెంబర్ 2న జరిగింది. భారత్ అలవోకగా ఐదు వికెట్ల ఆధిక్యంతో గెలుపొందింది. ముందు బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 50 ఓవర్లలో 269 పరుగులు చేయగలిగింది. విరాట్ కోహ్లీ మరోసారి చెలరేగి 117 పరుగులు చేసి భారత్‌కు గట్టి పునాది వేశాడు. రో‘హిట్’ శర్మ రాణించి అజేయంగా 90 పరుగులు చేయడంతో భారత్ ఐదు వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసి అవలీలగా గెలుపొందింది. వైఎస్సార్ స్టేడియంలో తొలి ఓటమి విశాఖలో గత ఏడాది మరోసారి ఆడిన వెస్టిండీస్ జట్టు అనుకోని రీతిలో భారత జట్టుకు షాక్ తినిపించింది. ఈ మ్యాచ్ నవంబర్ 24న జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఏడు వికెట్ల నష్టానికి 288 పరుగుల స్కోరు సాధించింది. కోహ్లీ కేవలం ఒక్క పరుగులో సెంచరీ మిస్ అయ్యాడు. ధోనీ అజేయంగా అర్ధసెంచరీ సాధించాడు. తర్వాత వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ అంతా బాధ్యతాయుతంగా ఆడి జట్టును విజయతీరం చేర్చారు. రెండు వేల మందితో బందోబస్తు అల్లిపురం: భారత్- వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే వన్డే మ్యాచ్‌కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్టు నగర శాంతి, భద్రతల డీసీపీ ఎం.శ్రీనివాసులు తెలిపారు. భద్రతా ఏర్పాట్లకు సుమారు 2 వేల మంది పోలీస్ సిబ్బందిని వినియోగిస్తున్నామన్నారు. నాలుగు వందల మంది అధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తారన్నారు. ఇప్పటికే హనుమంతవాక నుంచి పీఎం పాలెం క్రికెట్ స్టేడియం వరకు విద్యుత్ దీపాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ నెల 17న కూడా నగరంలో మరో వన్డే మ్యాచ్ జరిగే అవకాశముందని వస్తున్న వార్తల నేపథ్యంలో అవసరాన్ని బట్టి బందోబస్తును పెంచుతామన్నారు. నగర ఇన్చార్జి సీపీ అతుల్‌సింగ్ ఆదేశాల మేరకు క్రికెట్ మ్యాచ్‌కి సంబంధించి దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. -
సచిన్ ‘ఊడ్చేశాడు’!
బాంద్రా... ముంబైలోని అత్యంత ఖరీదైన, విలాసవంతమైన ప్రాంతం. ఎంతో మంది ప్రముఖులు, ధనవంతులకు నిలయం. అలాంటి ప్రదేశంలో కూడా భరించలేని దుర్గంధంతో కూడిన ఓ ఫుట్‌పాత్. నిత్యం వేలాది మంది ఆ పక్క నుంచే ప్రయాణిస్తున్నా కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ బ్యాటింగ్ దిగ్గజం సచిన్ చూపిన చొరవతో ఒకే ఒక్క రోజులో ఆ ఫుట్‌పాత్ సుందరంగా తయారైంది. అసలు ఇది ఎలా సాధ్యమైందంటారా...! అయితే చదవండి...మరి ముంబై: అప్పుడప్పుడే తెల్లవారుతోంది... తెల్లటి టీ షర్టు ధరించిన ఓ వ్యక్తి.. కొంత మందితో కలసి చేతుల్లో చీపురు కట్టలు, గునపాలు, గంపలతో బాంద్రా బస్ డిపోకు వ్యతిరేకంగా ఉన్న ఫుట్‌పాత్ దగ్గరకు వచ్చాడు.ఎక్కడ చూసినా చెత్త, కవర్లు, ఎండిన ఆకులు, ఆలములతో భరించలేని వాసన... కనీసం నిలబడటానికి కూడా వీల్లేని ఆ ప్రాంతం ఓ చిన్నసైజ్ మురికి గుంటలా ఉంది. చాలా మంది మూత్ర విసర్జనకు నిలయంగా మార్చుకున్న ఆ ప్రాంతాన్ని ఆ వ్యక్తి నెమ్మదిగా శుభ్రం చేయడం మొదలుపెట్టాడు. అలా ఓ గంట గడిచింది... అక్కడ జరుగుతున్న పనిని నిశితంగా గమనిస్తున్న కొంత మంది రిక్షా కార్మికులు అతని చూసి ఆశ్చర్యపోయారు. బ్యాట్ పట్టిన చేతులతో సచిన్ చీపురుతో ఊడ్చేస్తున్నాడు. ఇంకేముంది మాస్టర్‌తోనే తాము అన్నట్లు వాళ్లు కూడా పనిలోకి దిగారు. అందరూ కలిసి రెండు గంటలు గట్టిగా శ్రమించారు. కానీ సగం కూడా క్లీన్ కాలేదు. తర్వాతి రోజు ఉదయం వచ్చి చూస్తే ఫుట్‌పాత్‌పై మళ్లీ చెత్త చెదారం. దీంతో కాస్త కోపం వచ్చినా.. దీన్ని అధిగమించడమే నిజమైన సవాలని మాస్టర్ తన పనిని కొనసాగించాడు. అంతే కొన్ని గంటల పాటు శ్రమించి ఫుట్‌పాత్‌ను శుభ్రం చేశారు. స్థానిక కార్పొరేటర్‌తో కలిసి గోడకు, ఫుట్‌పాత్‌కు పెయింటింగ్ వేశారు. ఫుట్‌పాత్‌పై చెట్లు నాటించడంతో పాటు, బెంచ్‌లు, సోలార్ లైట్ల బాధ్యతను కార్పొరేటర్ తీసుకుంటే... ముంబై పోలీసులు అక్కడ అక్రమ పార్కింగ్‌కు అరికట్టేందుకు ముందుకు వచ్చారు. ఓవరాల్‌గా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ‘స్వచ్ఛ్ భారత్’ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టిన సచిన్ దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో ఉంచాడు. అంతేకాదు. జహీర్, సైనా, సర్దార్ సింగ్, అతుల్ రనాడే, అతుల్ కస్బేకర్లను కూడా ఇలాంటి కార్యక్రమాల్లో భాగం కావాలని కోరాడు. అందరూ ఈ వీడియోను చూడాలని విజ్ఞప్తి చేశాడు. -
మా ఆయన బంగారం - అంజలి
ఇప్పటికీ అంతే! సచిన్ బయట ఎంత పెద్ద క్రికెట్‌స్టార్ అయినా... ఇంట్లో మాత్రం పిల్లాడిలా ఉంటారు. మాటల్లో ఎక్కడా అహంభావం కనిపించదు. ఆయన ఒక బాధ్యతను తలకెత్తుకుంటే దానికి న్యాయం చేసే వరకు విశ్రమించరు. ఇప్పుడు కూడా ఆయనకు శారీరక క్రమ శిక్షణ ఎక్కువ. క్రికెట్ ఆడుతున్న సమయంలో శారీరక క్రమశిక్షణను ఎలా పాటించేవారో ఇప్పుడు కూడా అంతే. అప్పట్లో క్రికెట్‌ను కారణంగా చూపిస్తూ... ‘‘కూర రుచిగా ఉంది. అయినప్పటికీ ఎక్కువ తినను’’ అనేవారు. ఇప్పుడు ఆయన క్రికెట్ ఆడకపోయినప్పటికీ, తిండి విషయంలో ‘‘ఇక చాలు’’ అనే దాంట్లో తేడా లేదు. అలాగే, ఆయనెప్పుడూ ‘ఇలా చేయాలి’, ‘అలా చేయాలి’ అని గంభీరమైన ఉపాన్యాసాలు ఇవ్వరు. ‘‘నువ్వు చేయ గలవు’’ అనే ధైర్యాన్నిస్తారు. ఎవరినీ తక్కువ చేసి మాట్లాడరు. అదే సమయంలో అందరి అభిప్రాయాలకూ విలువ ఇస్తారు. -
‘ఆషికి-2’ కంటే బాగా వచ్చింది
హిందీలో ఘనవిజయం సాధించిన ‘ఆషికి 2’ తెలుగులో ‘నీ జతగా నేనుండాలి’ పేరుతో రీమేక్ అయిన విషయం తెలిసిందే. సచిన్ జోషి, నజియా జంటగా శివబాబు బండ్ల సమర్పణలో బండ్ల గణేశ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ప్లాటినమ్ డిస్క్ వేడుకను హైదరాబాద్‌లో చేశారు. ఈ ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ హిందీలోకన్నా తెలుగులో బాగా వచ్చిందని గణేశ్ అన్నారు. పాటలు ఘనవిజయం సాధించడానికి స్వరాలతో పాటు సాహిత్యం కారణమని, మంచి ఫీల్ ఉన్న చిత్రమనీ సచిన్ తెలిపారు. ఈ సినిమా తనకు ప్రత్యేకమని నజియా అన్నారు. -
విజయవాడలో సచిన్, అనుష్కల సందడి
-
విజయవాడలో సచిన్ సందడి
-
సచిన్...కమాన్, సమ్ డే ఐ విల్ బ్రేక్ యువర్ రికార్డ్స్
విజయవాడ : భారతరత్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ ఆగస్టు 1వ తేదీన విజయవాడ నగరంలోని పీవీపీ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న సందర్భంగా వెల్కం హోర్డింగ్‌లు దర్శనమిస్తున్నాయి. 'వెల్కం టు విజయవాడ ఫ్రైడ్ ఆఫ్ ఇండియా', 'వెల్కం లిటిల్ మాస్టర్ టు ది సిటీ ఆఫ్ విక్టరీ' పేరుతో బెంజిసర్కిల్, స్వరాజ్య మైదానం వద్ద ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లు అందర్ని ఆకట్టుకుంటున్నాయి. కాగా ఎంజీ రోడ్డులో రూ.125 కోట్లతో నిర్మించిన పీవీపీ స్క్వేర్ షాపింగ్ మాల్‌ను సచిన్ ప్రారంభించనున్నాడు. అతనితో పాటుగా హీరోయిన్ అనుష్క కూడా రానుంది. సచిన్ విచ్చేస్తున్నఈ వేడుకని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు పీవీపీ సంస్థ భారీ ఏర్పాటు చేస్తోంది. మరోవైపు ఇండియన్ క్రికెట్ దేవుడు సచిన్‌ను చూడాలని క్రికెట్ అభిమానులు, యువత ఎదురు చూస్తున్నారు. -
ప్యారడైజ్‌లో ఛాయ్ తాగిన సచిన్
-
ప్యారడైజ్‌లో టిఫిన్ తిని, ఛాయ్ తాగిన సచిన్
హైదరాబాద్ : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ శుక్రవారం నగరంలో సందడి చేశారు. సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ హోటల్లో ఆయన టిఫిన్ తిని, ఇరానీ ఛాయ్ తాగారు. ప్యారడైజ్ హోటల్ యాజమాన్యం ఆహ్వానం మేరకు సచిన్ ఇక్కడకు విచ్చేసినట్లు సమాచారం. కాగా సచిన్‌ను చూసేందుకు ప్యారడైజ్ వద్ద పెద్ద ఎత్తున అభిమానులు, సామాన్యులు బారులు తీరారు. ఈ సందర్భంగా అభిమానులతో పాటు, పోలీసులు కూడా తమ సెల్ ఫోన్లలో సచిన్‌ను ఫోటోలు తీసేందుకు పోటీ పడ్డారు. ఇక గతంలో రాహుల్ గాంధీ కూడా హైదరాబాదు నగర పర్యటనలో ప్యారడైజ్ బిర్యానీ రుచి చూశారు. అలాగే ఎంపీలు ప్రియాదత్, జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్ తదితరులు ఈ బిర్యానీని రుచి చూసినవారే. -
క్రికెట్ నేపథ్యంలో ఇలాంటి సినిమా రాలేదు :చిరంజీవి
‘‘క్రికెట్ నేపథ్యంలో చాలా సినిమాలొచ్చాయి. వాటిల్లో ‘లగాన్’ బెస్ట్ అని నా అభిప్రాయం. ఆటిజంతో బాధ పడుతున్న కుర్రాడికి క్రికెట్‌పై ఉన్న ప్రేమను ఇందులో చూపించారు. ఇప్పటివరకూ క్రికెట్ నేపథ్యంలో ఇలాంటి సినిమా రాలేదు. మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’’ అని చిరంజీవి అన్నారు. స్నేహిత్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘సచిన్’. సుహాసిని ప్రత్యేక పాత్ర పోషించారు. ఎస్.మోహన్ దర్శకుడు. తానికొండ వెంకటేశ్వర్లు నిర్మాత. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రాన్ని హైదరాబాద్‌లో సినీ ప్రముఖులకు ప్రదర్శించారు. కె.విశ్వనాథ్, చిరంజీవి, టి.సుబ్బిరామిరెడ్డి, కుట్టి పద్మిని, మారుతి ఈ చిత్రాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ- ‘‘నటిగా సుహాసిని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి మంచి సినిమాలో తాను భాగమైనందుకు ఆనందంగా ఉంది. స్నేహిత్ బాగా నటించాడు. దర్శకుడు మోహన్ చేసిన మంచి ప్రయత్నమిది’’ అన్నారు. 45 ఏళ్ల పైచిలుకు వయసులో 11 ఏళ్ల అబ్బాయికి అక్కగా నటించడం ఆనందంగా ఉందని, ఈ నెలాఖరున సినిమాను విడుదల చేస్తామని సుహాసిని చెప్పారు. ఇందులో సుహాసిని నటన చూసి ఈర్ష్య కలిగిందని, కథ నచ్చి హిందీ హక్కులు తీసుకున్నానని నటి కుట్టి పద్మిని అన్నారు. -
అంతా సచిన్ పుణ్యమే...
* మాస్టర్ జోక్యంతోనే సారథినయ్యా * ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటా ఎంఎస్ ధోని వ్యాఖ్య నాటింగ్‌హామ్: ఎంఎస్ ధోని... భారత క్రికెట్ జట్టుకు అత్యంత విజయవంతమైన సారథిగా పేరు తెచ్చుకున్న ఆటగాడు.. క్రికెట్‌ను పిచ్చిగా ఆరాధించే వంద కోట్లకు పైగా భారతీయుల ఆకాంక్షలను గత ఏడేళ్లుగా ఎలాంటి ఒత్తిడి లేకుండా మోస్తున్న మిస్టర్ కూల్. జట్టును టెస్టుల్లో నంబర్‌వన్‌గా నిలబెట్టడమే కాకుండా టి20, వన్డే ప్రపంచకప్‌లు, చాంపియన్స్ ట్రోఫీ అందించి అభిమానులను అలరించిన నాయకుడు. అయితే ఇన్ని విజయాలకు కారణం మైదానంలో అత్యంత సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకోవడమే కారణమని ధోని చెబుతున్నాడు. ప్రస్తుత స్థానం గురించి తనకే ఆశ్చర్యంగా ఉందని, వికెట్ కీపర్‌గా కొనసాగుతున్న తాను సచిన్ టెండూల్కర్ జోక్యంతోనే జట్టు సారథిగా బాధ్యతలు చేపట్టగలిగానని చెప్పుకొచ్చాడు. ఆదివారం 33వ పుట్టిన రోజు జరుపుకున్న ధోని ఓ ఇంటర్వ్యూలో పలు అంశాల గురించి చెప్పిన విషయాలు అతడి మాటల్లోనే.... నేనేదీ ప్లాన్ చేసుకోను: వాస్తవానికి నేను ఏ విషయం గురించి ముందుగా ప్రణాళికలు రచించను. అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలపై నాకు నమ్మకముంటుంది. చాలామందికి ఈ విషయంలో తమ గురించి తమకు సరైన పరిజ్ఞానం ఉండదు. ఇప్పటిదాకా ఆడిన అన్ని రకాల క్రికెట్ కారణంగానే కాకుండా జీవితంలో నేను ఎదుర్కొన్న అనుభవాల వల్లే నాకీ స్వభావం వచ్చింది. సీనియర్ల సలహాలు విన్నాను: సచిన్, లక్ష్మణ్, ద్రవిడ్, గంగూలీలాంటి దిగ్గజాలున్న జట్టుకు నేను నాయకత్వం వహించాను. అయితే ఆ సమయంలో నేను వారి అనుభవాన్ని ఉపయోగించుకున్నాను. వారిచ్చే సలహాలను స్వీకరించాను. ఒకవేళ వారు చెప్పిన దాంతో విభేదిస్తే అప్పుడే వారికి ఆ విషయం చెప్పేవాణ్ణి. దీన్ని వారు కూడా అంగీకరించి కొద్ది సేపటికి మరో ఐడియాతో వచ్చి నిర్ణయాన్ని నాకు వదిలేసేవారు. ఇది నిజంగా వారి గొప్పతనం. నా నిజాయతీ, ముక్కుసూటి తనం నచ్చడం వల్లే వారు నాకు సహకరించగలిగారు. అంతా టెండూల్కర్ చలవే: నేను కెప్టెన్‌గా అయిన క్షణం చాలా ఆశ్చర్యపోయా. అసలు నేను ఏనాడూ ఆ లక్ష్యాన్ని పెట్టుకోలేదు. అంతకుముందు నేను సచిన్‌తో మాట్లాడిన తీరు వల్లే ఈ అవకాశం వచ్చి ఉండొచ్చు. బౌలింగ్‌లో సచిన్ చాలా వైవిధ్యమైన బంతులు వేయగలడు. అతడు బంతి తీసుకున్నప్పుడల్లా నా దగ్గరకు వచ్చి బ్యాట్స్‌మన్‌కు లెగ్ స్పిన్, ఆఫ్ స్పిన్, సీమ్ అప్‌లో ఎలాంటి బంతులు వేయాలి? అని అడిగేవాడు. నేనిచ్చిన సూచనల మేరకు... ఇతడు ఆటను బాగా అర్థం చేసుకోగలుగుతున్నాడని సచిన్ భావించి ఉంటాడు. రిటైరయ్యాక అదే పని చేస్తా: మ్యాచ్ గెలిచిన ప్రతీసారి స్టంప్‌ను తీసుకోవడం నాకు అలవాటు. ఓడిన మ్యాచ్ విషయంలో ఇది పట్టించుకోను. నేను ఆట నుంచి తప్పుకున్నాక నా మ్యాచ్‌ల వీడియోలన్నింటినీ చూస్తాను. స్టంప్స్ మీదున్న స్పాన్సర్ లోగోలను నిశితంగా పరీక్షిస్తే అది ఏ మ్యాచ్‌కు సంబంధించిన స్టంప్ అనేది తెలిసిపోతుంది. రిటైరయ్యాక ఇదే నా టైమ్ పాస్. -
మంత్రి సచిన్‌తో పద్మశాలీల భేటీ
సాక్షి, ముంబై: తమ సంస్థ గదికి నామమాత్రపు అద్దె వసూలు చేయాలని కోరుతూ ‘పద్మశాలి సమాజ సుధారక మండలి’ కి చెందిన సభ్యులు గృహనిర్మాణ శాఖ సహాయ మంత్రి సచిన్ అహిర్‌తో భేటీ అయ్యారు. మంత్రాలయ ఎదురుగా ఉన్న ఆయన విశ్రాంతి గృహంలో మంగళవారం ఈ బృందం కలిసి వినతి పత్రం అందజేసింది. నగరంలో కొన్ని ప్రముఖ ప్రార్థన మందిరాలకు, సేవా సంస్థలకు ప్రభుత్వం నామమాత్రపు అద్దె రూపాయి చొప్పున వసూలు చేస్తోంది. ఇదే తరహాలో తమ సంస్థ గదికి నామమాత్రపు అద్దె వసూలు చేసేలా ప్రజా పనులశాఖకు సూచించాలని కోరుతూ అహిర్‌కు విజ్ఞప్తి చేశారు. అందుకు ఆయన సానుకూలంగా వ్యవహరించారు. వచ్చే శాసన సభ ఎన్నికలలోపే ఈ సమస్య పరిష్కరించేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. అహిర్‌ను కలిసిన ఈ బృందంలో ట్రస్టీలు భోగ సహదేవ్, గాజెంగి రమేశ్, ప్రధాన కార్యదర్శి కస్తూరి హరిప్రసాద్, జిందం భాస్కర్, సురేశ్ సురుకుట్ల, గుజ్జేటి గంగాధర్, వేముల మనోహర్, అల్లె శంకరయ్య తదితర సభ్యులు ఉన్నారు. -
అద్భుతమైన ప్రేమకథ
బాలీవుడ్ హిట్ ‘ఆషికి 2’ ఆధారంగా రూపొందుతోన్న చిత్రం ‘నీ జతగా నేనుండాలి’. సచిన్, నజియా జంటగా నటిస్తున్నారు. కె.జయరవీంద్ర దర్శకుడు. బండ్ల గణేశ్ నిర్మాత. జీత్ గంగూలి, అంకిత్ తివారి, మిథున్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. దిల్ రాజు ఆడియో సీడీని ఆవిష్కరించగా, శిరీష్, లక్ష్మణ్ ప్రచార చిత్రాలను విడుదల చేశారు. వీరితో పాటు అతిథులుగా విచ్చేసిన పరుచూరి వెంకటేశ్వరరావు, బీవీఎస్ఎన్ ప్రసాద్, బీవీఎస్ రవి సినిమా విజయం సాధించాలని ఆకాంక్షను వెలిబుచ్చారు. ఈ కథ మీదున్న ప్రేమతో సచిన్ ఈ సినిమా చేస్తున్నారని, బండ్ల గణేశ్ సంస్థలో పనిచేయడం ఆనందంగా ఉందని దర్శకుడు చెప్పారు. ‘‘ ‘ఆషికి 2’ రైట్స్ తీసుకున్న తర్వాత ఎవరైతే కరెక్ట్ అని ఆలోచిస్తున్న సమయంలో టక్కున సచిన్ గుర్తొచ్చారు. తెలుగులో తను నటించి చాలా కాలమైంది. పదేళ్లుగా నాకు మంచి మిత్రుడు తను. హిందీలో విజయం సాధించినట్లే, తెలుగులో కూడా ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకుంటుంది. జూలై మూడో వారంలో సినిమాని విడుదల చేస్తాం’’ అని బండ్ల గణేశ్ తెలిపారు. దర్శకుడు జయ రవీంద్ర అద్భుతంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని, ఖర్చుకు వెనుకాడకుండా గణేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని, ఇది అద్భుతమైన ప్రేమకథ అని సచిన్ చెప్పారు. ఇంకా చిత్రబృందం మాట్లాడారు. -
ప్రేమ కథకు.. పాటే టైటిల్
మౌనమేలనోయి, ఒరేయ్ పండు చిత్ర కథానాయకుడు సచిన్ హీరోగా బండ్ల గణేశ్ నిర్మిస్తున్న చిత్రానికి ‘నీ జతగా నేనుండాలి’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘ఆషికి-2’ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కె.రవీంద్ర దర్శకుడు. ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ -‘‘ఈ సినిమా కోసం చాలా టైటిల్స్ అనుకున్నాం. చివరకు రామ్‌చరణ్ ‘ఎవడు’లోని ‘నీ జతగా నేనుండాలి..’ పాట పల్లవిలోని మొదటి పదాన్ని మా సినిమా టైటిల్‌గా ఖరారు చేశాం. ఈ కథకు ఆ పేరు సరిగ్గా సరిపోతుంది. ఈ నెల 14 నుంచి పోలెండ్‌లో పది రోజుల పాటు జరిగే చిత్రీకరణతో షూటింగ్ పూర్తవుతుంది’’ అని తెలిపారు. ఈ సంగీత భరిత ప్రేమకథను మనసులకు హత్తుకునే రీతిలో దర్శకుడు తెరకెక్కిస్తున్నారని, హిందీలో లాగే ఇక్కడా ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందని సచిన్ నమ్మకం వెలిబుచ్చారు. ‘‘నా కెంతో ఇష్టమైన ‘ఆషికీ-2’ చిత్రాన్ని తెలుగులో తెరకెక్కించే అవకాశం రావడం నా అదృష్టం’’ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: అంకిత్ తివారి, మాటలు: మధుసూదన్, కెమెరా: ఎ.వసంత్, సమర్పణ: శివబాబు బండ్ల. -
నీజతగా నేనుండాలి మూవీ స్టిల్స్
-
సచిన్‌కు ఫుట్‌బాల్ నేర్పిస్తా
‘సచిన్‌కు ఫుట్‌బాల్ ఆడడం రాదు. అందుకే నేర్పించాలని అనుకుంటున్నాను. దాదాపు 15 ఏళ్లు మేం కలిసి క్రికెట్ ఆడినా సచిన్ బెంగాలీ పూర్తిగా నేర్చుకోలేకపోయాడు. అలాగే ఫుట్‌బాల్ నేర్చుకోవడానికి 15 ఏళ్ల సమయం తీసుకోకూడదనే కోరుకుంటున్నాను. ఎందుకంటే అన్నేళ్ల తర్వాత సచిన్ మైదానంలో కనిపించడు. కాబట్టి ఈ ఆటను వేగంగా నేర్చుకోవాలని కోరుతున్నాను’ - సౌరవ్ గంగూలీ -
యువీ పనైపోలేదు: సచిన్
టి20 ప్రపంచ కప్ ఫైనల్లో విఫలమైన మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ యువరాజ్‌ను భారత దిగ్గజం సచిన్ వెనకేసుకొచ్చాడు. ‘ఒక్క సారి బాగా ఆడనంత మాత్రాన అతని పనైపోలేదు. మరపురాని ఇన్నింగ్స్‌లతో చిరస్మరణీయ విజయాలందించిన ఘనత యువీది. 2015 వన్డే ప్రపంచకప్ టైటిల్‌ను నిలబెట్టుకునే భారత జట్టులో అతను ఉంటాడు’ అని సచిన్ ఫేస్బుక్లో పేర్కొన్నాడు -
తెలుగులో ఆషికి-2 మొదలైంది
‘‘హిందీ ‘దబాంగ్’ చిత్రాన్ని తెలుగులో ‘గబ్బర్ సింగ్’గా తీస్తే పెద్ద హిట్టయ్యింది. ఇప్పుడు ‘ఆషికి-2’ని రీమేక్ చేస్తున్నాం. అందులో పాటల్ని తెలుగులోనూ వాడుతున్నాం’’ అని నిర్మాత బండ్ల గణేశ్ చెప్పారు. సచిన్, నజియా జంటగా జయ రవీంద్ర దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి జెమినీ కిరణ్ కెమెరా స్విచాన్ చేయగా, జయంత్ క్లాప్ ఇచ్చారు. రంజిత్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ -‘‘ ‘ఒరేయ్ పండు’ తర్వాత నేను చేస్తున్న తెలుగు సినిమా ఇది’’ అని చెప్పారు. నజియా మాట్లాడుతూ -‘‘నేను సంజయ్‌దత్ మేనకోడల్ని. ఇంత మంచి సినిమాతో తెలుగులో పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు. జయ రవీంద్ర, కాశీ విశ్వనాథ్ కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి పాటలు: చంద్రబోస్, సంగీతం: అంకిత్ తివారి. ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎన్. చంద్రశేఖర్, సమర్పణ: శివబాబు బండ్ల -
బహ్రెయిన్ గ్రాండ్‌ప్రికి సచిన్
దుబాయ్: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ కెరీర్ ఆసాంతం బిజీ బిజీ... ఊపిరి సలపని షెడ్యూలుతో ఇంటా బయట 24 ఏళ్లు ఆటను ఆస్వాదించిన ఈ ‘భారతరత్న’ం... ఇప్పుడు రిటైర్మెంట్తో బాధ్యతల నుంచి బంధవిముక్తుడవడంతో ఎంచక్కా కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. భార్యాపిల్లలతో కలిసి అడవుల్ని, ఆలయాల్ని చుట్టివస్తున్నాడు. మొన్న గుజరాత్‌లోని గిర్ అడవుల్ని, నిన్నేమో సుప్రసిద్ధ సోమనాథ్ ఆలయాన్ని సందర్శించిన సచిన్ తనకెంతో ఇష్టమైన ఫార్ములావన్‌ను కూడా ప్రత్యక్షంగా చూసేందుకు ఫ్యామిలీ, బ్యాగేజ్‌తో సిద్ధమయ్యాడు. బహ్రెయిన్ గ్రాండ్‌ప్రిని చూసేందుకు మనామాకు వెళ్లనున్నాడు. వచ్చేనెల 4 నుంచి 6వ తేదీ వరకు జరిగే ప్రాక్టీస్, క్వాలిఫయింగ్, ప్రధాన రేసుల్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు రావాలని ఆ దేశ రాజు ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని మన్నించిన సచిన్ త్వరలోనే తమ దేశానికి వస్తున్నాడని బహ్రెయిన్‌కు చెందిన వ్యాపారవేత్త, ‘మాస్టర్’ మిత్రుడైన మహ్మద్ దాదాభాయ్ వెల్లడించారు. అతని రాక తమ గ్రాండ్ప్రికే ప్రత్యేక ఆకర్షణ కానుందని ఆయన తెలిపార. -
అంజలికి లేఖ రాసేందుకు కష్టపడేవాడిని
ఎంతటి క్లిష్టమైన బంతినైనా అలవోకగా బౌండరీ దాటించగల మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కూడా భార్యను నొప్పించకుండా నడచుకునేందుకు ఎంతో కష్టపడేవాడట. సెల్ఫోన్లు అందుబాటులోకి రాని రోజుల్లో తన భార్య అంజలితో లెటర్ల ద్వారానే ఎక్కువగా సంభాషించేవాడట సచిన్. అయితే ఆమెకు నచ్చేవిధంగా లేఖ రాసేందుకు అందమైన వాక్యాల కోసం, గుండ్రని అక్షరాల కోసం ఎంతో శ్రమించాల్సివచ్చేదట. కానీ, అంజలి మాత్రం అందమైన అక్షరాలతో ఆకర్షణీయంగా రాసేదట. సాధారణంగా డాక్టర్ల చేతిరాత అర్థం చేసుకోవడానికే కష్టంగా ఉంటుందన్నది తెలిసిన విషయమే అయినా.. పిల్లల డాక్టర్ అయిన అంజలి చేతిరాత మాత్రం చూడచక్కగా ఉండేదన్నాడు మాస్టర్. విద్యార్థులు చేతిరాతను మెరుగుపరచుకునేందుకు మెళకువలు నేర్పించే అంశంపై బుధవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సచిన్ తన గత స్మృతులను నెమరువేసుకున్నాడు. తన సహచరుల్లో అనిల్ కుంబ్లే చేతిరాత ఆకర్షణీయంగా ఉంటుందన్నాడు. తాను కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్‌ని అయినా ఎడమ చేత్తో రాయడం అలవాటని మాస్టర్ బ్లాస్టర్ చెప్పాడు. -
టెండూల్కర్ కాదు!
ఒకప్పటి ఫాస్ట్ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ నటుడిగా మారారు. క్రికెట్ నేపథ్యంలో తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతున్న ‘సచిన్’ అనే చిత్రంలో ఆయన ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. సీనియర్ నటి సుహాసిని ఓ కీలక పాత్రలో ఏఎన్ఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై బీయన్ గంగాధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘టెండూల్కర్ కాదు’ అనేది ఉపశీర్షిక. ఎస్. మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం ఇటీవల పలువురు చిత్రరంగ ప్రముఖుల సమక్షంలో బెంగళూరులో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో మానవ సంబంధాల్ని హృద్యంగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ చిత్రానికి రాజేష్ రాంనాథ్ పాటలు స్వరపరుస్తున్నారు. ఈ ఆడియో వేడుకకు సచిన్ టెండూల్కర్ అతిథిగా హాజరవుతారు. 30 రోజుల్లో ఈ సినిమాని పూర్తి చేస్తాం’’ అని చెప్పారు -
2022 వరల్డ్‌కప్‌కు భారత్ అర్హత సాధిస్తుంది: సచిన్
-
హైదరాబాద్‌లో సీసీఎల్ ఫైనల్
-
భారతరత్నపై బీజేపీ, కాంగ్రెస్‌ల రాజకీయం!
-
రచ్చ రచ్చ అవుతున్న సచిన్‌కు భారతరత్న
-
క్రికెట్ గాడ్ సచిన్ పై చర్చ
-
‘సచిన్ అభిమానుల కల సాకారం’
ముంబై: అత్యున్నత పౌరపురస్కారం భారతరత్నకు ఎంపికైన క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు పలువురు రాష్ట్ర ప్రముఖులు శనివారం అభినందనలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో కోట్లాది మంది సచిన్ అభిమానుల కల సాకారమైందని గవర్నర్ కె.శంకరనారాయణన్ ఒక సందేశంలో పేర్కొన్నారు. ఇదే పురస్కారానికి ఎంపికైన ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావుకు సైతం ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సచిన్ దక్కిన ఈ అరుదైన గౌరవం మనదేశ యువతకు స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అభిప్రాయపడ్డారు. ఆయన గొప్పక్రీడాకారుడేగాక సహృదయుడని ప్రశంసిం చారు. భారతీయులను ఐక్యంగా ఉంచడంలోనూ సచిన్ సఫలమయ్యారని ఉప-ముఖ్యమంత్రి అజిత్ పవార్ పేర్కొన్నారు. శివసేన అధిపతి ఉద్ధవ్‌ఠాక్రే కూడా సచిన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. -
సచిన్ అభిమానుల కోరిక ఫలించిన వేళ!
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభిమానుల కోరిక ఫలించింది. క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులు సృష్టించిన సచిన్‌కు 'భారతరత్న' ఇవ్వాలని ఎంతో కాలంగా వారు డిమాండ్ చేస్తున్నారు. సచిన్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి కొన్ని గంటలు కూడా గడవలేదు. అభిమానులు ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. అంతలోనే సచిన్‌కు, అభిమానులకు ఓ శుభవార్త. వారి కళ్లలో ఆనందం. క్రికెట్లో భారతదేశ కీర్తిని అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లిన సచిన్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన రోజునే ప్రభుత్వం దేశ అత్యున్న పౌరపురస్కారం భారతరత్న ప్రకటించింది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఓ లేఖ విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి సచిన్ స్ఫూర్తిగా నిలిచాడని కొనియాడింది. ప్రపంచ క్రీడారంగంలో భారత బ్రాండ్ అంబాసిడర్ సచినే అని ఆ లేఖలో పేర్కొంది. క్రికెట్లో ఎన్నో రికార్డులను తన పేరిట రాసుకున్న లిటిల్ మాస్టర్ 'భారతరత్న' అందుకోవడంలో కూడా రికార్డు సృష్టించాడు. భారతరత్న అందుకోనున్న అతి చిన్న వయస్కుడు(40) సచిన్. ఈ అత్యున్నత పురస్కారం అందుకోనున్న తొలి క్రీడాకారుడిగా కూడా చరిత్ర సృష్టించాడు. భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే అధ్యాయం అతనిది. దేశ అత్యున్నత పురస్కారం తనకు ప్రకటించినందుకు కేంద్ర ప్రభుత్వానికి సచిన్ ధన్యవాదాలు తెలిపారు. భారతరత్న తనకు రావడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ అత్యున్నత అవార్డుకు అన్ని రంగాలవాళ్లూ అర్హులని ప్రభుత్వం ప్రకటించగానే క్రీడల నుంచి హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్‌తో పాటు సచిన్ టెండూల్కర్ పేరు కూడా తెరపైకి వచ్చింది. సాధారణ అభిమాని నుంచి క్రీడల మంత్రి వరకూ అంతా సచిన్‌కే ఓటేశారు. అయితే గత రెండేళ్లుగా ఈ అత్యున్నత అవార్డును ఎవరికీ ప్రకటించలేదు. సచిన్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన రోజే ప్రకటించిన ఈ అవార్డును తన తల్లి రజనీ టెండూల్కర్‌కు అంకితమిస్తున్నట్లు సచిన్ చెప్పాడు. రమేశ్ టెండూల్కర్, రజని దంపతులకు 1973 ఏప్రిల్ 24న ముంబైలో జన్మించిన సచిన్ భారత క్రికెట్‌కు 24 ఏళ్ల పాటు సేవలు అందించాడు. లెక్కకుమిక్కిలి రికార్డులు నెలకొల్పాడు. రెండు వందల టెస్టులు ఆడిన తొలి ఆటగాడిగా - అంతర్జాతీయ కెరీర్లో వంద సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా - టెస్టు, వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా లిటిల్ మాస్టర్ చరిత్ర సృష్టించాడు. . క్రికెట్లో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించిన సచిన్ ఎన్నో అవార్డులు అందుకున్నారు. 1999లో పద్మశ్రీ, 1998లో క్రీడల్లో అత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్‌ఖేల్‌రత్న, 1994లో అర్జున అవార్డు, 2008లో పద్మవిభూషణ్‌లను మాస్టర్ అందుకున్నాడు. ప్రభుత్వం రాజ్యసభ సభ్యుడిగా కూడా ఎంపిక చేసింది. దేశ అత్యున్నత పౌర పురస్కారం కూడా దక్కించుకొని క్రీడారంగంలో ఎవరికీ అందనంత ఎత్తులో సచిన్ నిలిచాడు. -
సిఎన్ఆర్ రావుకు దక్కిన దేశ అత్యున్నత గౌరవం
సైన్స్‌లో విశేష సేవలు చేసినందుకు ప్రధాని సాంకేతిక సలహాదారుడు, ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త సి.ఎన్.ఆర్.రావుకు భారత ప్రభుత్వం దేశ అత్యున్న పౌర పురస్కారం 'భారతరత్న' ప్రకటించింది. భారత క్రికెట్‌కు విశేష సేవలు అందించిన సచిన్ టెండూల్కర్‌తో కలిపి రావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. రావు పూర్తి పేరు చింతామణి నాగేశ రామచంద్ర రావు. బెంగళూరులో జూన్ 30, 1934న నాగేశ్వరరావు, నాగమ్మ దంపతులకు జన్మించిన రావు సాలిడ్ స్టేట్ కెమిస్ట్రీ, మెటీరియల్ సైన్స్ రంగాలలో ప్రముఖ శాస్త్రవేత్తగా ప్రసిద్ధుడయ్యారు. ట్రాన్సిషన్ మెటల్ ఆక్సైడ్ గురించిన ఆయన పరిశోధనలు చేశారు. ప్రస్తుతం ఆయన ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కు శాస్త్ర, సాంకేతిక సలహాదారులుగా ఉన్నారు. మైసూర్ విశ్వవిద్యాలయంలో 1951లో డిగ్రీ పూర్తి చేశారు. కాశీ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీపూర్తి చేశారు. 1958లో ఫుర్డ్యూ యూనివర్సిటీలో పిహెచ్డి అందుకున్నారు. కాన్పూరు ఐఐటిలో దాదాపు 13 ఏళ్లు రసాయశాస్త అధ్యాపడుకుడగా పని చేశారు. 84-94 మధ్య కాలంలో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌కు డైరెక్టర్‌గా ఉన్నారు. ఆక్స్ఫర్డ్, కేండ్రిడ్జి, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయాలలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పని చేశారు. జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రిసెర్చ్ సంస్థకు గౌరవాధ్యక్షుడుగా పని చేశారు. సి.ఎన్.ఆర్.రావు ప్రతిభను గుర్తించి దేశవిదేశాలలోని పలు సంస్థలు అనేక అవార్డులు ఇచ్చి గౌరవించాయి. ఆయనది 60 ఏళ్ల పరిశోధనా ప్రస్థానం. 45కి పైగా పుస్తకాలు రాశారు. 1500పైగా పరిశోధనా వ్యాసాలు రాశారు. భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ విభూషణ్ అవార్డులు అందజేసింది. దేశవిదేశాల నుంచి ఆయన 150కి పైగా పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50 విశ్వవిద్యాలయాలు ఆయనకు డాక్టరేట్ లు ఇచ్చాయి. సి.ఎన్.ఆర్.రావు అందుకున్న అవార్డులు: 2000- హ్యూస్ మెడల్ - రాయల్ సొసైటీ 2004 - భారత ప్రభుత్వం నుండి ఇండియా సైన్సు అవార్డు పొందిన మొదటి వ్యక్తి 2005 - డాన్ డేవిడ్ ప్రైజ్ (Tel Aviv University) 2005 - ఫ్రాన్సు ప్రభుత్వ అవార్డు 1968 - శాంతి స్వరూప్ భట్నాగర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డు ఇంకా నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్, అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ రాయల్ సొసైటీ (లండన్), ఫ్రెంచ్ అకాడమీ, జపాన్ అకాడమీ, పోంటిఫికల్ అకాడమీ అవార్డులు ఆయన అందుకున్నారు. -
అంజలి టెండూల్కర్ తొలి టీవి ఇంటర్వ్యూ
-
300 కోట్ల క్లబ్లో క్రిష్-3
కథలో పసలేదు..కథనం విసుగెత్తించింది... అని విమర్శకులు చేసిన వ్యాఖ్యలను తారుమారు చేస్తూ ‘క్రిష్3’ చిత్రం వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. నవంబర్ 1న విడుదలైన క్రిష్3 రికార్డులను తిరగరాస్తోంది. రెండవ వార ం చివర్లో గురువారం రోజున 4.75 కోట్ల రూపాయలు వసూలు చేసి ట్రేడ్ పండితుల్ని ఆశ్చర్యానికి గురిచేయడమే కాకుండా, 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ల (నికరంగా 225.85 కోట్లు)తో రికార్డు దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ చిత్రం నెలకొల్పిన 226.70 కోట్ల రూపాయల రికార్డుకు ఇంచ్ దూరంలోఉంది. ముంబైలో సచిన్ చివరి టెస్ట్ మ్యాచ్‌ను ఆడటంతో వసూళ్లు తగ్గాయని, లేకపోతే ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ రికార్డులను తుడిచిపెట్టే అవకాశం ఉండేదని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు -
విశాఖలో మాస్టర్ స్ట్రోక్స్!
=మాస్టర్ మధుర స్మృతులివి.. =నగరంలో ఆడినది నాలుగైదు సార్లే.. =ఒకే ఒక్క అర్ధ శతకం విశాఖపట్నం, న్యూస్‌లైన్ : అనితర సాధ్యమైన రికార్డులు అందుకుని.. అద్భుతాలను మళ్లీ మళ్లీ సృష్టించి.. రెండున్నర దశాబ్దాల పాటు క్రికెట్ ఆటనే బంతిగా మార్చి తన చుట్టూ తిప్పుకున్న క్రీడా దైవ స్వరూపుడు.. ఆటకు సంబంధించిన అవతారాన్ని ముగించే ఘట్టం ప్రారంభమవుతోంది. సచిన్ ఇక సెలవని చెప్పే ఘడియ ఆసన్నమవుతోంది. భారత క్రికెట్లో మేరు నగ ధీరుడిగా, అభిమానులకు ఆరాధ్యుడిగా, సంచలనాల సృష్టికర్తగా.. అంతకు మించి అత్యంత వినమ్ర స్వరూపుడిగా, అందరినీ అబ్బురపరిచిన నిరుపమాన ప్రతిభావంతుడిగా సచిన్ వ్యక్తిత్వం అందరి హృదయాల్లో ఓ మధుర స్మృతిగా మిగిలిపోతుంది. ఈ నేపథ్యంలో విశాఖ సైతం సచిన్ ఆత్మీయ స్మృతుల్లో తలమునకలవుతోంది. నూనూగు మీసాల వయస్సులో.. విశాఖలో అంతర్జాతీయ మ్యాచ్‌ల వరంపర మొదలైన తొలినాళ్ళలోనే విశాఖలో సచిన్ అడుగుపెట్టాడు. వస్తూనే కెప్టెన్సీని అందుకున్నాడు. అప్పటికి సచిన్‌కు 19 ఏళ్ళే. భారత్‌లో పర్యటించిన ఇంగ్లాండ్ లెవెన్‌తో ఫిబ్రవరి 1993లో తలపడిన బోర్డ్ ప్రెసిడెంట్స్ లెవెన్ జట్టుకు నాయకత్వం అప్పట్లో సచిన్ సారథ్యం వహించాడు. అతడు తొలిసారిగా నాయకత్వం వహించింది విశాఖలోనే కావడం విశేషం. చివరిసారిగా ఐపిఎల్ ఆడేందుకు విశాఖ వచ్చినా చేతిగాయంతో ఆడలేక పోవ డంతో విశాఖ క్రీడాభిమానులు నిరాశే మిగిలింది. అప్పట్లో సచిన్ నెట్స్‌లో మాత్రం చురుకుగా కదిలాడు. రోహిత్ శర్మకు నెట్స్‌లో సలహాలిచ్చాడు. దాంతో డెక్కన్ చార్జర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రో‘హిట్’ చెలరేగి, ముంబై ఇండియన్స్‌ను గెలిపించాడు. సచిన్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగిన రెండు వన్డేలలో, వైఎస్ఆర్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఓ వన్డేలోపాల్గొన్నాడు. 1994లో, 2001లో ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగిన రెండు వన్డేలలో సచిన్ ఆడాడు. 2005లో వైఎస్సార్ స్టేడియంలో సచిన్ చివరిసారిగా విశాఖలో మ్యాచ్ ఆడాడు. విశాఖలో ఓ అర్ధ సెంచరీ మాత్రం సాధించాడు. చివరి మ్యాచ్‌లో రెండు పరుగులకే రనౌట్ అయ్యాడు. 2012 ఏప్రిల్‌లో ఐపీఎల్ మ్యాచ్ ఆడడానికి సచిన్ చివరిసారిగా విశాఖ వచ్చాడు. -
సచిన్ ఖాతాలో మరో తిరుగులేని రికార్డు
-
199వ టెస్ట్‌లో బ్యాటింగ్‌కు దిగిన సచిన్
కోల్‌కతా : ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్న అభిమానుల కల సాకారం అయ్యింది. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో భారత్-విండీస్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ రెండో రోజు ఆటలో సచిన్ బ్యాటింగ్ ప్రారంభించాడు. జట్టు స్కోర్ 57 పరుగుల వద్ద మురళీ విజయ్ (26) అవుట్ అవటంతో సచిన్ బ్యాటింగ్‌కు దిగాడు. క్రికెట్ దేవుడి చివరి మ్యాచ్ చూసేందుకు అభిమానులు ఎక్కడలేని ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. మరోవైపు కోల్‌కతా అంతా మాస్టర్ ఫీవర్‌తో ఊగిపోతుంది. ఉద్యోగులు తమ విధులకు సెలవు పెట్టారు.. పాఠశాల, కాలేజీ విద్యార్థులు తరగతులకు డుమ్మా కొట్టారు.. అందరి దారీ ఈడెన్ గార్డెన్స్ వైపే.. దాంతో ఈడెన్ గార్డెన్స్ గ్యాలరీ అభిమానులతో కిక్కిరిసి పోయింది. స్టేడియానికి వచ్చిన ప్రేక్షకుల చేతుల్లో సచిన్ టెండూల్కర్ భారీ చిత్రపటాలు కనిపించాయి. అందులో ‘ఆటను ఆస్వాదించు.. కలలను ఛేదించు.. స్వప్నాలను సాకారం చేసుకో’ అనే సచిన్ కొటేషన్‌ను కూడా పొందుపరిచారు. కొందరైతే త్రివర్ణ రంగులతో సచిన్ అనే పేరును తమ ముఖాలపై రాయించుకున్నారు. -
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కరేబియన్లు
కోల్‌కతా : ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇండియా- వెస్టిండీస్ తొలి టెస్టు... మాస్టర్ బ్లాస్టర్ 199 మ్యాచ్ ప్రారంభమైంది. కరీబియన్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. క్రిస్‌గేల్, కీరన్ పావెల్‌లు వెస్టిండీస్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. ఈ మ్యాచ్ ద్వారా రోహిత్ శర్మ, బౌలర్ మహ్మద్ షమీలు టెస్ట్ అరంగేట్రం చేశారు. కాగా తొలిరోజే సచిన్ బ్యాటింగ్‌ను ఆస్వాదిద్దామనుకున్న అభిమానులకు వెస్టిండీస్ బ్యాటింగ్ కాస్త నిరాశనే కలిగించింది. మరోవైపు రెండు మ్యాచ్‌లు... నాలుగు ఇన్నింగ్స్... 24 ఏళ్ల కెరీర్‌కు ముగింపు పలికేందుకు క్రికెట్ ‘దేవుడు’ వేయనున్న ఈ రెండు అడుగుల కోసం ప్రపంచం యావత్తూ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఒకటా, రెండా, వందల కొద్ది మ్యాచ్‌లు ఆడినా... ఒంటిచేత్తో గెలిపించినా... ఎన్నడూ లేని ఉత్కంఠ ప్రస్తుతం రాజ్యమేలుతోంది. కోట్లాది మంది అభిమానులతో పాటు... ప్రపంచ క్రీడాలోకం మొత్తం ఓ దిగ్గజ ఆటగాడి ఆటలో చివరి అంకాన్ని తిలకించేందుకు సిద్ధమయింది. -
సచిన్ చివరి టెస్టులపై ద్రవిడ్ వ్యాఖ్య
సచిన్ చివరి టెస్టులపై ద్రవిడ్ వ్యాఖ్య ముంబై: పాతికేళ్ల అద్భుత కెరీర్ తర్వాత సచిన్ తన చివరి రెండు టెస్టుల్లో భారీ స్కోర్లు చేయకపోయినా అది పెద్ద విషయమే కాదని అతని మాజీ సహచరుడు రాహుల్ ద్రవిడ్ అభిప్రాయ పడ్డారు. అలాంటి దిగ్గజ ఆటగాడికి ప్రస్తుతం లభిస్తున్న స్థాయిలో వీడ్కోలు అవసరమేనని ద్రవిడ్ అన్నారు. ‘చివరి టెస్టుల్లో సచిన్ ఎన్ని పరుగులు చేస్తాడనే వాదనే అనవసరం. అతను కూడా దీని గురించి ఆలోచించకుండా సచిన్ తన ఆటను పూర్తిగా ఆస్వాదించాలని కోరుకుంటున్నాను. 24 ఏళ్ల పాటు అతను భారత క్రికెట్ కోసం చేసిన సేవలకు నా తరఫున కృతజ్ఞతలు చెబుతున్నాను. ఈ స్థాయిలో వీడ్కోలు పలికేందుకు మాస్టర్ అర్హుడు’ అని రాహుల్ చెప్పారు. అయితే 16 ఏళ్ల వయసునుంచి 40 ఏళ్ల వయసు వరకు అతని ఆట స్థాయి ఎక్కడా తగ్గలేదని, అదే తరహాలో మంచి స్కోర్లు సాధించి కెరీర్‌ను ముగించాలని కోరుకుంటున్నట్లు ఈ మాజీ బ్యాట్స్‌మన్ వెల్లడించారు. ప్రస్తుత తరంలో ఎక్కువ కాలం వార్తల్లో నిలిచిన వ్యక్తి సచిన్ అని, అతని ఘనతలను చేరుకోవడం దాదాపు అసాధ్యమని ద్రవిడ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘సచిన్ చిన్నతనం నుంచే నేను అతనితో కలిసి క్రికెట్ ఆడాను. సుదీర్ఘ కాలం పాటు భారత్‌కు ఆడిన మాస్టర్ గణాంకాలు ప్రపంచ వ్యాప్తంగా కూడా అతనెంత గొప్పవాడో చెబుతాయి. వాటిని పునరావృతం చేయడం చాలా కష్టం’ అని ఈ కర్ణాటక క్రికెటర్ కితాబిచ్చారు. సచిన్ రిటైర్ కాగానే అతని స్థానాన్ని భర్తీ చేయడం సాధ్యం కాదని, నిలకడగా రాణిస్తున్న కోహ్లితో పాటు అనేక మంది యువ ఆటగాళ్లు ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని ద్రవిడ్ చెప్పారు. సచిన్ రిటైర్మెంట్ ప్రకటన తనకు ఆశ్చర్యం కలిగించలేదన్న ద్రవిడ్...మాస్టర్ ఆడిన 150కు పైగా ఇన్నింగ్స్‌లు, 100 సెంచరీలనుంచి అత్యుత్తమ ఇన్నింగ్స్‌ను ఎంచుకోవడం తనకు సాధ్యం కాదన్నారు. -
ఇక చాలు... ఆపండి!
ఇది సచిన్‌ను ఎవరైనా అన్న మాట కాదు. సచిన్ తన రిటైర్మెంట్ ప్రకటన ద్వారా విమర్శకులకు చెప్పిన జవాబు. రెండేళ్లుగా సచిన్ విఫలమవుతున్న మాట వాస్తవం. గతంలోలా సంచలన ఇన్నింగ్స్ ఆడటం లేదన్నదీ నిజం. 16 ఏళ్ల వయసులో, 30 ఏళ్లకు పరిణతి సాధించిన సమయంలో ఆడే షాట్లు... 40 ఏళ్లు దాటాక ఆడటం ఎవరికైనా కష్టమే. సచిన్ రిటైర్మెంట్ గురించి దశాబ్ద కాలంగా అతను విఫలమైన ప్రతిసారీ చర్చ జరుగుతూనే ఉంది. ప్రతిసారీ మైదానంలో ప్రదర్శనతోనే దానికి సమాధానం చెబుతూ వచ్చాడు. వన్డే ప్రపంచకప్ గెలిచాక సచిన్ వైదొలుగుతాడంటూ ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత కూడా ఆడి వందో అంతర్జాతీయ సెంచరీ సాధించాడు. గత డిసెంబరులో వన్డేలకు వీడ్కోలు చెప్పాక... కనీసం ఓ రెండు మూడేళ్లు మళ్లీ ఆడతాడనే అంచనా ఏర్పడింది. కానీ... ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో వైఫల్యంతో మళ్లీ విమర్శలు మొదలయ్యాయి. కెరీర్లో ఎన్నడూ లేని విధంగా... పదేపదే క్లీన్ బౌల్డ్ కావడంతో కాస్త ఈ జోరు పెరిగింది. మరో 2 టెస్టులు ఆడితే 200 మ్యాచ్‌లు ఆడిన ఏకైక క్రికెటర్‌గా అరుదైన రికార్డును సొంతం చేసుకుంటాడు. కాబట్టి ఈ రికార్డు పూర్తి కాగానే వీడ్కోలు చెబుతాడు (చెప్పాలి) అంటూ విమర్శకులు గళమెత్తారు. ఈ లోగా బోర్డు స్వదేశంలో వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను ఏర్పాటు చేసింది. కాబట్టి ఇదే ఆఖరంటూ ప్రచారం జరిగింది. దీనిపై పత్రికలు పలు కథనాలు రాశాయి. కానీ బోర్డు ప్రతిసారీ వీటిని ఖండించింది. ‘ఎప్పుడు రిటైరవ్వాలో నిర్ణయించుకోవాల్సింది సచిన్’ అని బోర్డు స్పష్టం చేసింది. తన ఆటతీరుపై సచిన్‌కు పూర్తిగా అవగాహన ఉంది. తన ఫిట్‌నెస్‌పై అంచనా ఉంది. కాబట్టి ‘ఇక చాలు’ అనే నిర్ణయం సచిన్ తీసుకున్నాడు. నిజానికి చాంపియన్స్ లీగ్ సమయంలోనూ మాస్టర్ దీని గురించి ఆలోచించలేదు. లీగ్ ముగిసిన నాలుగు రోజులు కుటుంబ సభ్యులు, సన్నిహితులతో చర్చించిన మాస్టర్... వేరే ఎవరూ మాట్లాడే అవకాశం లేకుండా ప్రకటన చేశాడు. కోట్లాది మంది అభిమానులను బాధపెట్టాడు. చల్తే...చల్తే... ...మేరే యే ‘రన్’ యాద్ రఖ్నా! రాజ్‌సింగ్ దుంగార్పూర్, ఆకాశ్ లాల్, రమేశ్ సక్సేనా, గుండప్ప విశ్వనాథ్, నరేన్ తమ్హానే...వీరంతా ఎవరనుకుంటున్నారా! భారతదేశానికి ఈ ఐదుగురు మహోపకారం చేశారు. 16 ఏళ్ల సచిన్‌ను భారత జట్టులోకి ఎంపిక చేసిన సెలక్టర్లు వీరే. అంతకు ముందు ఏడాదే తాను ఆడిన తొలి రంజీ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లలో సచిన్ సెంచరీలతో చెలరేగడంతో వయసు గురించి పట్టించుకోకుండా సత్తా ముఖ్యమంటూ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అది మొదలు భారత క్రికెట్ ఒక కొత్త మలుపు తీసుకుంది. 24 ఏళ్ల కెరీర్లో ఎన్నో అద్భుత ఇన్నింగ్స్‌లు...ఒకటా, రెండా ఎన్నని లెక్కించగలం. జట్టును గెలిపించినవి కొన్నయితే, జట్టును కష్టాలనుంచి రక్షించినవి మరికొన్ని...ఇవేవీ కాదు ఫలితం ఎలా ఉన్నా అభిమానులను అలరించినవి మరికొన్ని. వాటిలోంచి ఏది గొప్ప అంటే చెప్పడం కష్టం. కానీ టెస్టు క్రికెట్లో కొన్ని మ్యాచ్‌లు ఎప్పటికీ అలా మదిలో నిలిచిపోయే ఉంటాయి. -
ఈడెన్‌లో సచిన్ 200వ టెస్టు!
న్యూఢిల్లీ: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 200వ టెస్టును చరిత్రాత్మక ఈడెన్‌గార్డెన్స్‌లో ఆడే అవకాశం ఉంది. ఆదివారం జరిగిన బీసీసీఐ ఏజీఎంలో ఈ అంశంపై చర్చించారని... ఈడెన్‌లోనే సచిన్ రికార్డు టెస్టు జరిగే అవకాశం ఉందని బోర్డు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. రాజీవ్ శుక్లా నేతృత్వంలోని టూర్స్ అండ్ ఫిక్చర్స్ కమిటీ అక్టోబరు 3న సమావేశం కానుంది. ఈ సమావేశం తర్వాత... సచిన్ 200వ టెస్టు ఎక్కడ ఆడేది అధికారికంగా ప్రకటిస్తారు. మాస్టర్ 199వ టెస్టును అహ్మదాబాద్‌లో నిర్వహించే అవకాశం ఉంది. మరోవైపు దక్షిణాఫ్రికాలో భారత పర్యటనపై ఇంకా అనిశ్చితి తొలగలేదు. ఏజీఎంలో ఈ అంశం గురించి చర్చే జరగలేదు. ‘సఫారీ పర్యటన నేటి సమావేశంలో చర్చకే రాలేదు. ఈ అంశంపై అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారని గతంలోనే దక్షిణాఫ్రికా బోర్డుకు సంజయ్ పటేల్ చెప్పారు. కాబట్టి ఇక అంతా శ్రీనివాసన్ ఇష్టమే’ అని బోర్డు వర్గాలు తెలిపాయి. -
200 నాట్ 'ఔట్'!?
-
ఇప్పుడే చెప్పలేను! రిటైర్మెంట్పై సచిన్ స్పందన
ముంబై: దక్షిణాఫ్రికా పర్యటనకు ముందే సొంత గడ్డపై వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ ఖరారు కావడంతో మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్పై మరో సారి చర్చ ప్రారంభమైంది. ఈ సిరీస్ తర్వాతే సచిన్ వీడ్కోలు చెప్పవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై సచిన్ ఏకవాక్యంలో తన మనసులో మాట వెల్లడించాడు. ‘ప్రస్తుతానికి నేను ఈ అంశంపై స్పందించను. ఒక టెస్టు మ్యాచ్ తర్వాతే మరో టెస్టు గురించి ఆలోచిస్తా’ అని స్పష్టం చేశాడు. ఈ వాక్యంలో వేర్వేరు అర్థాలు ధ్వనిస్తున్నాయి. ముంబైలో ఆఖరి టెస్టులో భారీ సెంచరీతో వీడ్కోలు పలకాలన్న కోరిక కావచ్చు...లేదా దక్షిణాఫ్రికా బౌన్సీ వికెట్లపై ఆడగల సత్తా తనలో ఇంకా ఉందనీ కావచ్చు. ఈ దిశగా ఒక్కో టెస్టును ఎంచుకుంటూ కెరీర్‌ను పెంచుకునే ఆలోచనతో కూడా మాస్టర్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే 2011 జనవరిలో కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాపై సెంచరీ చేసిన తర్వాత సచిన్ గత 38 టెస్టు ఇన్నింగ్స్‌లలో ఒక్క శతకం కూడా చేయలేదు. -
మహిళ హత్య కేసులో దిగ్విజయ్, సచిన్ అరెస్టు
దేశ రాజధాని ఢిల్లీలో ఒక మహిళను హత్యచేసి, ఆమె మూడేళ్ల కుమారుడిని అపహరించిన నేరానికి గాను ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. దిగ్విజయ్ (23), సచిన్ (20) అనే వీరిద్దరూ మోహి (29) అనే మహిళను హత్య చేసి, ఆమె కుమారుడు ఇషును అపమరించడమే కాక, వాళ్ల ఇంటిని దోచుకున్నారని పోలీసులు తెలిపారు. ఢిల్లీ, ఉత్తరాఖండ్ పోలీసులు సంయుక్తంగా చేసిన ఆపరేషన్ పుణ్యమాని హరిద్వార్‌లో ఉన్న బాలుడిని సురక్షితంగా కాపాడినట్లు ఢిల్లీ జాయింట్ పోలీసు కమిషనర్ సంజయ్ బేణీవాల్ తెలిపారు. అయితే, బాలుడిని కాపాడే ప్రయత్నంలో ఉన్నపోలీసులపై నిందితులు కత్తితో దాడి చేయడంతో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. నిందితులిద్దరిలో దిగ్విజయ్ గతంలో పిల్లవాడి తండ్రి ఇనాముల్లా నడిపే మొబైల్ దుకాణంలో పనిచేసేవాడు. బాగా డబ్బు అవసరం కావడంతో సచిన్, కేశవ్ అనే ఇద్దరితో కలిసి ఈ కుట్ర పన్నాడు. శనివారం ఉదయం ఇంట్లో పనిమనిషి బీనా ఉండగానే ఆమెను తుపాకి చూపించి బెదిరించి, మోహిని పొడిచి చంపి, ఆమె కుమారుడిని ఎత్తుకుపోయారు. సంఘటన జరిగిన వెంటనే ఢిల్లీ వదిలిపెట్టి ఉత్తరాఖండ్ పారిపోయారు. బాలుడిని అడ్డం పెట్టుకుని డబ్బు కోసం అతడి తండ్రి ఇనాముల్లాకు పలుమార్లు ఫోన్లు చేశారు. వీళ్ల గురించి విశ్వసనీయంగా సమాచారం అందడంతో పోలీసులు వాళ్లెక్కడున్నదీ కనిపెట్టారు. ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన ఎస్ఐ అరుణ్, ఉత్తరాఖండ్ పోలీసు కానిస్టేబుల్ వివేక్ బాలుడిని కాపాడుతుండగా వారి చేతులపైన, నడుంపైన కత్తి గాయాలయ్యాయి. వారి పేర్లను రివార్డుల కోసం ప్రతిపాదిస్తామని బేణీవాల్ చెప్పారు. మూడో నిందితుడు కేశవ్ కోసం గాలింపు కొనసాగుతోంది.