
మరో ఏడాది ఆడాలనుకున్నా..!
న్యూఢిల్లీ: అన్ని తొలుత అనుకున్నట్లు జరిగితే మరో ఏడాది ఆడి 2014లోనే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేవాడినని సచిన్ చెప్పాడు. ‘రిటైర్మెంట్ గురించి ఎప్పుడూ పెద్దగా ఆలోచించలేదు.
రిటైర్మెంట్‌పై సచిన్
న్యూఢిల్లీ: అన్ని తొలుత అనుకున్నట్లు జరిగితే మరో ఏడాది ఆడి 2014లోనే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేవాడినని సచిన్ చెప్పాడు. ‘రిటైర్మెంట్ గురించి ఎప్పుడూ పెద్దగా ఆలోచించలేదు. డిసెంబర్ 2013లో దక్షిణాఫ్రికా, 2014లో న్యూజిలాండ్ పర్యటనలు ఉండటంతో వీటిపైనే ఎక్కువగా దృష్టిపెట్టా. అయితే స్వదేశంలో విండీస్ సిరీస్ రావడంతో పునరాలోచన మొదలైంది. ఈ సిరీస్ తర్వాత వీడ్కోలు చెబితే ఎలా ఉంటుందని అంజలి, అజిత్‌తో చర్చించా.
విండీస్‌తో రెండో టెస్టు నా కెరీర్‌లో 200ల టెస్టు మ్యాచ్. స్వదేశంలో రిటైర్మెంట్ చెప్పడానికి ఇంతకంటే మంచి అవకాశం రాదని భావించా. 2014 చివరి దాకా గాయాలు కావన్న హామీ లేదు. కాబట్టి పరిస్థితులను సాగదీయడం కంటే నిర్ణయం తీసుకోవడమే మేలనిపించింది’ అని మాస్టర్ వెల్లడించాడు.
పిల్లలపై ఒత్తిడి: నాకున్న పేరు ప్రఖ్యాతల వల్ల అర్జున్, సారా కూడా ఇబ్బందులకు గురయ్యారు. 2007లో అర్జున్‌కు ఏడేళ్లు. మేం ప్రపంచకప్ తొలి రౌండ్‌లోనే ఓడటంపై కామెంట్స్ చేస్తే పట్టించుకోవద్దని చెప్పా. అయినప్పటికీ... మీ నాన్న సున్నాకు అవుటైనందుకే భారత్ ఓడిందని ఎవరో స్నేహితుడు కామెంట్ చేశాడంట. దీనికి అర్జున్ కూడా ఘాటుగానే సమాధానమిచ్చాడంట.
క్రానే ఇబ్బందిపెట్టాడు: కెరీర్‌లో ఓ 30 మంది దిగ్గజ బౌలర్లను ఎదుర్కొన్నాను. ఎవరి బౌలింగ్‌లోనూ ఇబ్బందిపడలేదు. కానీ హాన్సీ క్రానే (దక్షిణాఫ్రికా) బౌలింగ్‌లో ఆడాలంటే అసౌకర్యంగా ఉండేది. స్ట్రయిక్ బౌలర్లకు రెస్ట్ ఇచ్చేందుకు అతను ఓ 2,3 ఓవర్లు వేసేవాడు. దీంతో క్రానేపై ఒత్తిడిని పెంచాలనే ప్రయత్నంలో సరిగా ఆడలేకపోయేవాణ్ని.
పాలకూరతో గోడ కట్టా: కౌంటీల్లో యార్క్‌షైర్‌కు ఆడేటప్పుడు డబ్బులు చాలకపోయేవి. నేను, కొంతమంది స్నేహితులం కలిసి పిజ్జా తినడానికి వెళ్లేవాళ్లం. బఫెట్ ఆర్డర్ చేస్తే కావాల్సినంత తినొచ్చు. కానీ సలాడ్ ఒక్క బౌల్ మాత్రమే ఇచ్చేవారు. దీంతో మేం కొత్తగా ఆలోచించి బౌల్‌లో పాలకూరతో గోడ మాదిరిగా కట్టి దాని నిండా సలాడ్ నింపేవాళ్లం. ఈ టెక్నిక్ బాగా పని చేసింది.