పాకిస్తాన్ ఫాస్ట్ బౌలింగ్ సెన్సేషన్ ఇహసానుల్లా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 22 ఏళ్లకే పాకిస్తాన్ క్రికెట్ లీగ్‌కు (PSL) గుడ్‌బై చెప్పాడు. నిన్న జరిగిన పీఎస్‌ఎల్-10 డ్రాఫ్ట్‌లో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఫ్రాంచైజీలు పట్టించుకోకపోవడంతో చిర్రెత్తిపోయిన ఇహసానుల్లా ఇకపై పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడనని శపథం చేశాడు.
వాస్తవానికి ఇహసానుల్లా తరుచూ గాయాల బారిన పడుతుండటంతో అతన్ని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. దేశవాలీ క్రికెట్‌లో రాణిస్తున్నా ఇహసానుల్లాపై ఫ్రాంచైజీలు ఆనాసక్తిని ప్రదర్శించాయి. ఇహసానుల్లా గంటకు 150 కిమీకు పైగా వేగంతో బౌలింగ్ చేస్తాడు. ఇహసానుల్లాకు పేస్ కింగ్‌గా పేరుంది.
పీఎస్‌ఎల్ డ్రాఫ్ట్ అనంతరం ఇహసానుల్లా ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. తాను కోపంలో ఈ నిర్ణయం తీసుకోలేదని చెబుతూనే పీఎస్‌ఎల్ ఫ్రాంచైజీలపై అసహనం వ్యక్తిం చేశాడు. నెలన్నర రోజుల్లో పీఎస్‌ఎల్ ఫ్రాంచైజీలకు తానేంటో తెలిసొచ్చేలా చేస్తానని అన్నాడు. దేశవాలీ క్రికెట్ ఆడి సత్తా చాటుతానని తెలిపాడు. పీఎస్‌ఎల్‌లో కాకుండా దేశవాలీ క్రికెట్‌లో బాగా పెర్ఫార్మ్ చేసి పాకిస్తాన్ జట్టుకు ఎంపికవుతానని అన్నాడు.
కాగా, నిన్న జరిగిన పీఎస్‌ఎల్ డ్రాఫ్ట్‌లో అన్ని ఫ్రాంచైజీలు స్టార్ ఆటగాళ్లను ఎంపిక చేసుకుని తమ జట్లను పటిష్టం చేసుకున్నాయి. డ్రాఫ్ట్‌లో డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, రస్సీ వాన్ డర్ డస్సెన్ లాంటి అంతర్జాతీయ ఆటగాళ్లను ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్నాయి.
పీఎస్‌ఎల్ 2025లో డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ ఒకే ఫ్రాంచైజీకి ఆడనున్నారు. వీరిద్దరిని కరాచీ కింగ్స్ కొనుగోలు చేసింది. వార్నర్, కేన్ ద్వయం గతంలో ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడింది.
పాకిస్తాన్ సూపర్ లీగ్ డ్రాఫ్ట్‌లో ఆయా ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్న విదేశీ ఆటగాళ్లు..
కరాచీ కింగ్స్- డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, జేమ్స్ విన్స్, టిమ్ సీఫర్ట్, ఆడమ్ మిల్నే, మొహమ్మద్ నబీ, లిటన్ దాస్
లాహోర్ ఖలందర్స్- కుసాల్ పెరీరా, డారిల్ మిచెల్, సికందర రజా, సామ్ కర్రన్, రిషద్ హొసేన్, డేవిడ్ వీస్, సామ్ బిల్లింగ్స్
ముల్తాన్ సుల్తాన్స్- మైఖేల్ బ్రేస్‌వెల్, డేవిడ్ విల్లే, గుడకేశ్ మోటీ, జాన్సన్ ఛార్లెస్, షాయ్ హోప్, జాషువ లిటిల్, క్రిస్ జోర్డన్
ఇస్లామాబాద్ యునైటెడ్- మాథ్యూ షార్ట్, ఆండ్రియస్ గౌస్, బెన్ డ్వార్షుయిష్, రిలే మెరిడిత్, జేసన్ హోల్డర్, రస్సీ వాన్ డర్ డస్సెన్, కొలిన్ మున్రో
క్వాట్టా గ్లాడియేటర్స్- ఫిన్ అలెన్, కైల్ జేమీసన్, అకీల్ హొసేన్, రిలీ రొస్సో, మార్క్ చాప్‌మన్, సీన్ అబాట్, కుసాల్ మెండిస్
పెషావర్ జల్మీ- బ్రైయాంట్, కొర్బిన్ బాష్, అల్జరీ జోసఫ్, ఇబ్రహీం జద్రాన్, నహిద్ రాణా, టామ్ కొహ్లెర్ కాడ్‌మోర్
Comments
Please login to add a commentAdd a comment