శిఖర్‌ ధావన్‌ సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై | Shikhar Dhawan Announces Retirement From International Cricket | Sakshi
Sakshi News home page

#ShikharDhawan: శిఖర్‌ ధావన్‌ సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై

Published Sat, Aug 24 2024 8:01 AM | Last Updated on Sat, Aug 24 2024 9:54 AM

Shikhar Dhawan Announces Retirement From International Cricket

టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌, ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు ధావన్‌ రిటైర్మెంట్‌ ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో కూడా పోస్ట్ చేశారు. ఈ సందర్బంగా ఇంటర్నేషనల్ అలాగే డొమెస్టిక్ క్రికెట్‌లో తన ప్రయాణాన్ని ముగిస్తున్నట్లు తెలిపాడు.

 

 

ఇక, ఈ వీడియోలో శిఖర్‌ ధావన్‌.. దేశం తరఫున ఆడినందుకు చాలా గర్వంగా ఉందన్నాడు. ఇక తన ప్రయాణంలో తనకు ఎంతో మంది.. సహాయం చేశారని, వారి వల్ల ఈ స్థాయికి వచ్చానని కూడా తెలిపారు. ఈ సందర్భంగా బీసీసీఐ, డీడీసీఏ, తన అభిమానులకు కృతజ్ఞతలు చెప్పాడు. కాగా, టీమిండియా తరఫున శిఖర్‌ ధావన్‌.. 167 వన్డే మ్యాచ్‌లు, 34 టెస్టులు, 68 టీ20లు ఆడాడు. టీమిండియాకు ఓపెనర్‌గా ఎన్నో రికార్డులు క్రియేట్‌ చేశాడు. ఇక, వన్డేల్లో శిఖర్‌ ధావన్‌ 17 సెంచరీలతో 6793 పరుగులు సాధించాడు. టెస్టుల్లో ఏడు సెంచరీలతో 2315 పరుగులు చేశాడు. టీ20ల్లో 1759 పరుగులు సాధించాడు. అయితే, ధావన్‌ ప్రస్తుతం ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement