300 కోట్ల క్లబ్‌లో క్రిష్-3 | krish -3 enters into 300 crores club | Sakshi
Sakshi News home page

300 కోట్ల క్లబ్‌లో క్రిష్-3

Published Fri, Nov 15 2013 11:37 PM | Last Updated on Sat, Sep 2 2017 12:38 AM

krish -3 enters into 300 crores club

 కథలో పసలేదు..కథనం విసుగెత్తించింది... అని విమర్శకులు చేసిన వ్యాఖ్యలను తారుమారు చేస్తూ ‘క్రిష్3’ చిత్రం వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. నవంబర్ 1న విడుదలైన క్రిష్3 రికార్డులను తిరగరాస్తోంది. రెండవ వార ం చివర్లో గురువారం రోజున 4.75 కోట్ల రూపాయలు వసూలు చేసి ట్రేడ్ పండితుల్ని ఆశ్చర్యానికి గురిచేయడమే కాకుండా, 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ల (నికరంగా 225.85 కోట్లు)తో రికార్డు దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ చిత్రం నెలకొల్పిన 226.70 కోట్ల రూపాయల రికార్డుకు ఇంచ్ దూరంలోఉంది.
 
 ముంబైలో సచిన్ చివరి టెస్ట్ మ్యాచ్‌ను ఆడటంతో వసూళ్లు తగ్గాయని, లేకపోతే ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ రికార్డులను తుడిచిపెట్టే అవకాశం ఉండేదని ట్రేడ్ పండితులు  అభిప్రాయపడుతున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement