Chennai Express
-
ఆ పాత్ర నాకు నచ్చలేదు.. కానీ ఒప్పుకున్నా: సత్యరాజ్
Sathyaraj About His Role In Chennai Express Movie: దక్షిణాది ప్రముఖ నటుల్లో సత్యరాజ్ ఒకరు. దర్శక ధీరుడు జక్కన్న తెరకెక్కించిన బాహుబాలితో కట్టప్పగా వరల్డ్ వైడ్‌గా పాపులర్ అయ్యారు. కథ, పాత్ర నచ్చితే చాలు అందులో ఇమిడిపోతారు. ఎలాంటి సన్నివేశాలకైన వెనుకాడరు. అలాంటి ఆయన పాత్ర నచ్చకపోయిన ఓ మూవీ ఒప్పుకున్నారట. కేవలం అందులోని హీరో కోసమే ఆ పాత్ర చేశానని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు కట్టప్ప. 'చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో పాత్ర కోసం చిత్రబృందం నన్ను సంప్రదించింది. కానీ నాకు ఆ పాత్ర గొప్పదిగా అనిపించలేదు. ఇదే విషయాన్ని షారుక్, డైరెక్టర్ రోహిత్ శెట్టికి చెప్పాను. కానీ ఫైనల్‌గా షారుక్ ఖాన్‌పై అభిమానంతో ఆ మూవీ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే షారుక్ అంటే నాకెప్పటి నుంచో అభిమానం. ఆయన నటించిన దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే ఎన్నోసార్లు చూశా. అందులో షారుక్ నటన నాకెంతో నచ్చింది. అందుకే ఆయనతో నటించాలన్న ఉద్దేశంతో ఆ సినిమా ఒప్పుకున్నా.' అని సత్యరాజ్ తెలిపారు. కాగా యాక్షన్ డైరెక్టర్ రోహిత్ శెట్టి తెరకెక్కించిన 'చెన్నై ఎక్స్‌ప్రెస్' 2013లో విడుదలై మంచి విజయం సాధించింది. ఇందులో హీరోయిన్ దీపిక పదుకొణె తండ్రి పాత్రలో లోకల్ మాఫియా నాయకుడిగా సత్యరాజ్ నటించారు. -
అప్పట్లో షారుక్ ఇచ్చింది ఇంకా నా పర్సులోనే ఉంది: ప్రియమణి
‘చెన్నైఎక్స్ప్రెస్’లో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్‌తో కలిసి ప్రియమణితో చిందేసిన ఐటమ్‌సాంగ్ గుర్తుందా. అదేనండి అప్పట్లో వన్ టూ త్రీ ఫోర్.. గెట్ ఆన్ ది డ్యాన్స్ ఫ్లోర్..అంటూ స్టెప్పులేసిన ఈ పాట సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇది ఎందుకు అంటారా? ఇటీవల విడుదలై విశేష ప్రజాదరణ పొందుతున్న ఫ్యామిలీ మ్యాన్-2తో ఆకట్టుకున్న నటి ప్రియమణి ఓ ఇంటర్య్వూలో ఈ ఐటెం సాంగ్ చిత్రీకరణ షూటింగ్ సమయంలోని కబుర్లను గుర్తుచేసుకుంది. అది నా పర్సులో భద్రంగా దాచుకున్నా ఈ సందర్భంగా ఆమె.. ‘‘నాకు అది మరచిపోలేని అనుభవం. షూటింగ్ సమయంలో షారుఖ్ ఐప్యాడ్‌లో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ఆడుతుంటే రూ.300 ఇచ్చారు. అవి ఇప్పటికీ నా పర్సులో భద్రంగా దాచుకున్నా. షారుఖ్‌ని బాలీవుడ్ బాద్షా అని అనడానికి ప్రత్యేకించి ఒక్క కారణమంటూ లేదు. మనదేశంలో ఉన్న గొప్పనటుల్లో ఆయన ఒకరు. సక్సెస్‌ని ఎప్పుడూ తలకెక్కించుకోరు. షూటింగ్‌లోనూ చాలా సింపుల్‌గా ఉంటారు. షారుక్ వ్యక్తిత్వమే మనల్ని మరింతగా ఆయన్ని ఇష్టపడేలా చేస్తుంది. ఎప్పుడు మరుసటి రోజు సమయం వృథా కాకుండా జాగ్రత్త పడేవారు. అలా షూటింగ్ సమయాన్ని చక్కగా ప్లాన్ చేసుకునే వారు’’ అంటూ షారుఖ్‌తో తన అనుబంధాన్ని ఈ రకంగా చెప్పుకొచ్చింది. చదవండి: ఆ కామెంట్స్ చూసి తట్టుకోలేకపోయా: జరీన్ ఖాన్ -
రైల్లోనే షాపింగ్!
న్యూఢిల్లీ: రైల్లో గంటల తరబడి ప్రయాణించడం విసుగ్గా ఉంటోందా.. అయితే, హాయిగా షాపింగ్ చేసుకోండి అంటోంది రైల్వే శాఖ. రైళ్లలో ‘ఆన్‌బోర్డ్ సేల్స్’ను అందుబాటులోకి తెచ్చేందుకు పశ్చిమ, మధ్య రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట శతాబ్ది, కోణార్క్, చెన్నై ఎక్స్‌ప్రెస్, దురంతో రైళ్లలో ఈ షాపింగ్ సదుపాయం కల్పిస్తారు. ప్రయాణికుల ఆదరణ ఆధారంగా మిగలిన రైళ్లలోనూ ప్రవేశపెడతారు. ఈ ఆన్‌బోర్డ్ సేల్స్‌లో సెంట్లు, బ్యాగులు, వాచీలు వంటి అనేక రకాల సామాన్లు అమ్ముతారు. సెప్టెంబర్‌లో దీనికి టెండర్లు పిలుస్తామని, డిసెంబర్ నుంచి శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా అమ్మకాలు మొదలు పెడతామని పశ్చిమ రైల్వే అధికారులు వెల్లడించారు. అక్టోబర్ నుంచే కోణార్క్, దురంతో, చెన్నై ఎక్స్‌ప్రెస్‌లలో అమ్మకాలు ప్రారంభిస్తామని మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. దీనివల్ల ప్రయాణికులకు ప్రయోజనం కలగడంతో పాటు తమకు అదనపు ఆదాయం లభిస్తుందని అధికారులు తెలిపారు. టికెట్ల అమ్మకం కాకుండా ఇతర మార్గాల ద్వారా ఏడాదికి రూ.1200 కోట్ల ఆదాయం సమకూర్చుకునేలా ఆలోచించాలని రైల్వేశాఖ అన్ని జోన్లకు సూచించిన నేపథ్యంలో ఈ ప్రతిపాదన రూపుదిద్దుకుంది. ప్రధాన రైల్వే స్టేషన్లలో బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) కియోస్క్‌లు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా ఉందని, ప్రస్తుతం ఉన్న బరువు తూచే యంత్రాల స్థానంలో వీటిని పెట్టాలని భావిస్తున్నామని అధికారులు చెప్పారు. అలా గే, ఫుట్ మసాజ్ రోబోటిక్ చైర్లు, ఎగ్జిబిషన్లు కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అల్యూమినియం బోగీలు ప్రస్తుతం ఉన్న ఇనుప బోగీల స్థానంలో అల్యూమినియంతో తయారు చేసిన బోగీలను ఉపయోగించేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. రాయ్‌బరేలిలోని మోడరన్ కోచ్ ఫ్యాక్టరీలో వీటిని తయారు చేస్తారు. అయితే, ఈ పరిజ్ఞానం మనకు అందుబాటులో లేనందున జపాన్, ఐరోపా దేశాల సాయం తీసుకోనున్నారు. ఈ దేశాలు 15 ఏళ్లుగా అల్యూమినియం బోగీలనే వాడుతున్నాయి. ప్రస్తుతం వాడుతున్న ఇనుప బోగీలు బరువు ఎక్కువగా ఉండటంతో వేగంగా వెళ్లడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.అంతే కాకుండా ఈ బోగీలు తుప్పు పడతాయి. అల్యూమినియం బోగీలు తేలిగ్గా ఉంటాయి. తుప్పు పట్టవు. కాబట్టి వీటి వాడకం వల్ల రైళ్ల వేగం పెరుగుతుంది. నిర్వహణ వ్యయం తగ్గుతుంది. మొదటి దశలో ఏటా 250 అల్యూమినియం బోగీలు తయారు చేయాలని ప్రతిపాదించారు. ఒక్కో బోగీ తయారీకి 150 కోట్లు ఖర్చవుతుందని అంచనా. రైళ్లకూ స్వచ్ఛ గ్రేడ్లు! ఇప్పటి వరకు రైల్వే స్టేషన్ల శుభ్రతకోసం చర్యలు తీసుకున్న రైల్వే శాఖ ఇప్పుడు రైళ్లలో శుభ్రతపై దృష్టి పెట్టింది. టాయ్లెట్లు సహా రైలు బోగీలు, సీట్ల శుభ్రత, హౌస్ కీపింగ్ వంటి అంశాలను పరిశీలించి రైళ్లకు శుభ్రతా గ్రేడ్లు ఇస్తారు. ఇందుకోసం 50 ఆడిట్ బృందాలను ఏర్పాటు చేశారు. వచ్చే రెండు నెలల్లో దేశ వ్యాప్తంగా 200 రైళ్లను పరిశీలించి వాటికి గ్రేడ్లు ఇస్తుంది. శతాబ్ది, రాజధాని, దురం తో వంటి 72 ప్రీమియం రైళ్లు, కోణార్క్, జనశతాబ్ది, సంపర్క్ వంటి 128 రైళ్లలో తనిఖీలు చేపడతాయి. ఒక్కో ప్రీమియం రైలుకు సంబంధించి కనీసం 100 మంది, ఇతర రైళ్లకు సంబంధించి కనీసం 60 మం ది ప్రయాణికుల అభిప్రాయాలను సేకరించడంతో పాటు ఈ బృంద సభ్యులు స్వయంగా రైళ్లను పరిశీలిస్తారు. -
హాలీవుడ్లో లుంగీ డ్యాన్స్
‘ఆల్ ది రజనీ ఫ్యాన్స్...’ అంటూ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ మూవీలో షారుక్ ఖాన్ లుంగీ డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడీ లుంగీ డ్యాన్స్ హాలీవుడ్ సినిమాలోనూ రిపీట్ కానుంది. విన్ డీజిల్ ‘ట్రిపులెక్స్’ సినిమాలో లుంగీ డ్యాన్స్ పాటతో ఎండ్ చేయాలనుకుంటున్నారట దర్శకుడు డిజే కరుసో. ‘ట్రిపులెక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్’ సినిమాలో దీపికా పదుకోన్ యాక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన నాలుగో భాగంలో దీపికా పదుకోన్ భాగం కారట. అందుకే ఇండియన్ ఫ్యాన్స్ నిరాశ పడకుండా దర్శకుడు లుంగీ డ్యాన్స్ ప్లాన్ రెడీ చేశాడు. ‘‘ట్రిపులెక్స్ నాలుగో పార్ట్‌ను లుంగీ డ్యాన్స్‌తో ఎండ్ చేయాలనుకుంటున్నా. ఆ పాటను దీపికా లీడ్ చేస్తే ఎలా ఉంటుంది? కొత్తగా ఉంటుంది కదూ’’ అని పేర్కొన్నారు దర్శకుడు. చివర్లో దీపికా లుంగీ డ్యాన్స్‌తో అలరిస్తారన్న మాట. -
చెన్నై ఎక్స్‌ప్రెస్‌కు టైముందట!
ఆల్మోస్ట్ ఇంకో ఏడాది టైముందట.. అల్లు అర్జున్ చెన్నై ఎక్స్‌ప్రెస్ ఎక్కడానికి! నిజం చెప్పాలంటే... ఈ టైమ్‌కి అల్లు అర్జున్ ఎక్కేయాలి. ఒకానొక దశలో అసలు చెన్నై ఎక్స్‌ప్రెస్‌ను క్యాన్సిల్ చేశారనే మాటలూ వినిపించాయి. అయితే... అటువంటిదేం లేదట. చెన్నై ఎక్స్‌ప్రెస్ అంటే ట్రైన్ కాదు, తమిళ సినిమా. అల్లు అర్జున్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా తెలుగు–తమిళ సినిమా ఒకటి ప్రకటించిన సంగతి తెలిసిందే. చెన్నైలో అట్టహాసంగా ప్రారంభోత్సవమూ జరిగింది. నిజానికి, ‘దువ్వాడ జగన్నాథమ్’ తర్వాత బన్నీ–లింగుస్వామి సినిమా షూట్ మొదలవ్వాలి. కానీ, వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘నా పేరు సూర్య–నా ఇల్లు ఇండియా’ ప్రారంభించారు బన్నీ. మరోపక్క విశాల్ హీరోగా తమిళంలో ‘సండైకోళి–2’ ప్రారంభించారు లింగుస్వామి . తెలుగులో మంచి విజయం, విశాల్‌కు గుర్తింపు సాధించిన ‘పందెం కోడి’కి సీక్వెల్ ఇది. మరి, ముందుగా ప్రకటించిన బన్నీ సినిమా సంగతేంటి? అంటే... ‘‘తప్పకుండా ఆ సినిమా ఉంటుంది. ‘నా పేరు ఇండియా–నా ఇల్లు ఇండియా’ పూర్తయిన తర్వాత బన్నీ ఆ సినిమా స్టార్ట్ చేస్తారు. ఈలోపు లింగుస్వామి ‘సండైకోళి–2’ పూర్తి చేసి వస్తారు. ఆల్రెడీ బన్నీ–లింగుస్వామిలు ఎప్పుడో స్క్రిప్ట్‌ను లాక్ చేశారు’’ అని గీతా ఆర్ట్స్ సన్నిహిత వర్గాల సమాచారం. -
తమిళ స్టార్ డైరెక్టర్ మృతి
తమిళ, హిందీ భాషల్లో పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు కె.సుభాష్ బుధవారం తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఎస్ఆర్ఎమ్ హాస్పిటల్లో చికిత్సపొందుతూ మృతి చెందారు. 1987లో మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన నాయగన్( తెలుగులో నాయకుడు) సినిమాతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంబించిన సుభాష్, 1988లో ప్రభు హీరోగా తెరకెక్కిన కలియుగం సినిమాతో దర్శకుడిగా మారారు. 1990లో విజయ్‌కాంత్ హీరోగా తెరకెక్కిన శత్రియనా ఆయనకు స్టార్ ఇమేజ్ను తీసుకువచ్చింది.తన కెరీర్లో 20 సినిమాలకు దర్శకత్వం వహించిన సుభాష్, చివరగా బాలీవుడ్లో అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలతో ఇన్సాన్ సినిమాను తెరకెక్కించారు. దర్శకుడిగానే కాక సండే, ఎంటర్టైన్మెంట్, హౌస్‌ఫుల్ 3, చెన్నై ఎక్స్‌ప్రెస్ లాంటి చిత్రాలకు రచయితగా కూడా పనిచేశారు. -
చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో భారీ చోరీ
సికింద్రాబాద్: చెన్నై ఎక్స్‌ప్రెస్ రైలులో నగరానికి చేరిన ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు చెందిన 42 తులాల బంగారు ఆభరణాలు కలిగిన బ్యాగు మాయమైంది. రైలు నల్గొండ దాటిన తర్వాత గుర్తించిన భాధితుడు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకుని జీఆర్పీ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశాడు. తదుపరి విచారణ నిమిత్తం కేసును సికింద్రాబాద్ రైల్వే పోలీసులు నల్గొండకు బదిలీ చేశారు. పోలీసుల కథనం ప్రకారం...నగరంలోని హైటెక్‌సిటీలో నివాసం ఉంటూ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్న రమాకాంత్ తన భార్యతో కలిసి చేన్నై ఎక్స్‌ప్రెస్ రైలులో సికింద్రాబాద్‌కు బయలుదేరాడు. బుధవారం అర్థరాత్రి దాటాక భార్యాభర్తలు ఇరువురు గాఢ నిద్రలోకి జారుకున్నాక వారి వెంట ఉండాల్సిన లగేజీబ్యాగు మాయమైంది. అందులో 42 తులాల బంగారు ఉన్నాయి. తెల్లవారుజామున గుర్తించిన రమాకాంత్ సికింద్రాబాద్‌లో రైలుదిగి పోలీసులను ఆశ్రయించాడు. అయితే నల్గొండ ప్రాంతంలో బ్యాగును దొంగిలించిన ఆగంతకులు అందులోని ఆభరణాలను తీసుకుని బ్యాగును నల్గొండ రైల్వేస్టేషన్ ప్రాంతంలో పడేసి వెళ్లిపోయారు. బ్యాగును గుర్తించిన నల్గొండ జీఆర్పీ పోలీసులు అందులో లభించిన చిరునామా ఆధారంగా సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. బాధితుడి ఫిర్యాదు స్వీకరించిన సికింద్రాబాద్ పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం నల్గొండకు బదిలీ చేశారు. -
మత్తు మందు ఇచ్చి దోచేశారు..
రాజమండ్రి (తూర్పుగోదావరి) : హౌరా నుంచి చెన్నై వెళ్తున్న చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో ముగ్గురు ప్రయాణికులకు మత్తుమందు ఇచ్చి వారి వద్ద ఉన్న నగదు, విలువైన వస్తువులతో గుర్తుతెలియని వ్యక్తి పలాయనం చిత్తగించాడు. రైలు గురువారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో రాజమండ్రి స్టేషన్లో ఆగినా.. ముగ్గురు ప్రయాణికులు ఉలుకు పలుకు లేకుండా పడి ఉండటాన్ని గమనించిన తోటి ప్రయాణికులు వారిని నిద్ర లేపడానికి ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోవడంతో.. రైల్వే డాక్టర్‌ను సంప్రదించారు. వారిని పరిశీలించిన డాక్టర్ ఎవరో మత్తు మందు ఇచ్చారని తేల్చారు. ఇప్పటికీ ఆ ముగ్గురు ప్రయాణికులు స్పృహలోకి రాకపోవడంతో.. వారి వద్ద నుంచి ఎంత మొత్తం అపహరించకుపోయారనే విషయంలో స్పష్టత రాలేదు. -
చెన్నై ఎక్స్‌ప్రెస్ ఏసీ బోగీ మిస్..
విశాఖపట్నం సిటీ: విశాఖ నుంచి సోమవారం చెన్నైకు బయల్దేరాల్సిన వీక్లీ ఎక్స్‌ప్రెస్ (22869)లో ఒక థర్డ్ ఏసీ బోగీ కనిపించకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే అధికారులు సరిగా స్పందించకపోవడంతో వారిపై దాడికి దిగారు. దీంతో రైలు రెండు గంటల ఆలస్యంగా రాత్రి 9.15 గంటలకు బయల్దేరింది. -
ఇక్కడ హీరో... అక్కడ విలన్
‘ఆల్ ది రజనీ ఫ్యాన్స్... తలైవా...’ అంటూ హిందీ చిత్రం ‘చెన్నయ్ ఎక్స్‌ప్రెస్’లో ఆ చిత్రకథానాయకుడు షారుక్ ఖాన్ చేసిన డ్యాన్స్‌ను అంత సులభంగా మర్చిపోలేం. రజనీ మీద ఉన్న అభిమానాన్నంతా ఆ పాటలో చూపించేశారు షారుక్. ఈ హీరోగారంటే రజనీకి కూడా ఇష్టమే. అందుకే షారుక్ నటించిన ‘రా. వన్’లో ఒకే ఒక్క సన్నివేశంలో కనిపించడానికి అంగీకరించారు రజనీ. ఇప్పుడు ఈ ఇద్దరూ హీరో, విలన్లుగా తమిళ దర్శకుడు శంకర్ తాజా చిత్రం ‘రోబో-2’ లో నటించనున్నారని సమాచారం. తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుందట. తమిళ చిత్రంలో రజనీ నాయకునిగా, షారుక్ ప్రతినాయకునిగా కనిపిస్తారట. కానీ, హిందీ వెర్షన్‌కు వచ్చేసరికి ఒకరి పాత్రలు మరొకరు మార్చుకొని, షారుక్ నాయకునిగా, రజనీ ప్రతినాయకునిగా చేస్తారట. ఇది ఇలా ఉంటే, ఈ చిత్రాన్ని ఆమిర్ ఖాన్, విక్రమ్‌లతో శంకర్ ప్లాన్ చేశారనీ, ఆ తర్వాత సీన్లోకి రజనీ, షారుక్ వచ్చారనీ చెన్నై టాక్. -
డబ్బు కాదు ... ప్రేమ, ప్రశంసలే ముఖ్యం
ముంబై : ప్రేమ, ప్రశంసలకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనె స్పష్టం చేశారు. ఆ రెండు తన జీవితంలో ముఖ్యమైనవే కాదు విలువైనవి కూడా అని ఆమె తెలిపారు. విజయానికి కూడా అంత ప్రాధాన్యత ఇవ్వనిని ఆమె అన్నారు. డబ్బుకు అయితే చివరి ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. ఆ ప్రశంసల కోసమే సినిమాలలో నటిస్తున్నానంటే పొరపాటు పడినట్లేనని దీపికా పేర్కొన్నారు. ఇటీవల కాలంలో పలు వెరైటీ పాత్రలతో ప్రేక్షకుల మనసులు దోచుకుంటున్న దీపికా పదుకొనె శుక్రవారం ముంబైలో విలేకర్లతో మాట్లాడారు. హీరోయిన్ కావడం అంత ఈజీ కాదని.... హీరోయిన్ కావడం కోసం తాను ఎంత కష్టపడింది ఆమె వివరించింది. తాను హీరోయిన్గా కంఫర్ట్ జోన్ చేరానని భావిస్తున్నానన్నారు. హృదయానికి హత్తుకునేలా ఉండే కథలలో నటించేందుకు తాను ఎప్పుడూ సిద్ధమేనని తెలిపారు. అంతేకాని బాక్సాఫీసు వద్ద తాను నటించే సినిమా హిట్ అవుతుందా? లేక ఆ చిత్రం కోట్లాది రూపాయిల వ్యాపారం చేస్తుందా అని ఆలోచించనని తెలిపారు. దీపికా పదుకొనె తాజాగా నటించిన చిత్రం హ్యాపీ న్యూ ఇయర్. ఈ చిత్రం ఈ నెల 24వ తేదీన విడుదల కానుంది. ప్రస్తుతం బాలీవుడ్లో ఈ చిత్రం విడుదలపై అందరు దృష్టి సారించారు. ఓం శాంతి ఓం చిత్రంలో దీపికా నటనపనై విమర్శకులు విమర్శలు కురిపించారు. ఆ తర్వాత ఆమె నటించిన కాక్ టయిల్, యే జవానీ హై దివానీ, చెన్నై ఎక్స్‌ప్రెస్... చిత్రాలలో ఆమె నటనను విమర్శకులు సైతం ప్రశంసల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. -
'చెన్నై ఎక్స్ ప్రెస్' దొంగల ముఠా అరెస్టు!
సికింద్రాబాద్ : బీహార్‌కు చెందిన పేరుమోసిన రైల్వే దొంగల ముఠా...కరణ్థీర్ గ్యాంగ్‌ను రైల్వే పోలీసులు అరెస్ట్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ముఠానే ఈ ఏడాది ఏప్రిల్ 1, 2 తేదీల్లో చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో వరుస దోపిడీలకు పాల్పడిటన్లు ఆరోపణలు ఉన్నాయి. మూడు రోజుల క్రితమే ఈ గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకుని, రిమాండ్ కూడా తరలించినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు... సీఆర్పీఎఫ్ పోలీసులు మౌలాలి రైల్వే స్టేషన్లో రణధీర్‌ను మూడు రోజుల క్రితం అదుపులోకి తీసుకుని, జనరల్ రైల్వే పోలీసులకు అప్పగించారు. విచారణలో భాగంగా పోలీసులు రణధీర్పై థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతో అతనికి ఊపిరితిత్తుల సమస్య ఏర్పడింది. అతను ఇచ్చిన సమాచారంతో మరో నలుగురు ముఠా సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే రణధీర్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో విషయం బయటకు పొక్కకుండానే అయిదుగురిని రిమాండ్‌కు పంపినట్లు సమాచారం. వీరి వద్ద నుంచి పెద్ద మొత్తంలో నగదు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. -
పద్మావతి, చెన్నై ఎక్స్ప్రెస్ల్లో దొంగల బీభత్సం
అనంతపురం : తిరుపతి - సికింద్రాబాద్ మధ్య నడిచే పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. రైలు అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోకి రాగానే దుండగులు చైను లాగి దోపిడీ చేశారు. ఎస్-6,7,8,9 బోగీల్లో ప్రయాణికుల నుంచి నగదు, బంగారు ఆభరణాలు దోచుకున్నారు. ఇక చెన్నై-సికింద్రాబాద్ మధ్య నడిచే చెన్నై ఎక్స్‌ప్రెస్‌లోనూ దొంగలు మరోసారి దోపిడీ తెగబడ్డారు. గుంటూరు జిల్లా పొన్నూరు సమీపంలో ఓ మహిళ నుంచి దుండగులు బంగారం అపహరించి పరారయ్యారు. వారం వ్యవధిలో చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో దుండగులు మూడుసార్లు దోపీడీకి పాల్పడ్డారు. ప్రయాణికుల భద్రతలో వైఫల్యం చెందుతున్న రైల్వే సిబ్బందిపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ.. కలకలం
విజృంభించిన చైన్ స్నాచర్లు మహిళల నగలు లాక్కొని పరారీ సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు బాధితుల ఫిర్యాదు హైదరాబాద్, న్యూస్‌లైన్ : చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో చైన్ స్నాచర్స్ విరుచుకు పడి పలువురి మహిళల మెడల్లోంచి బంగారు ఆభరణాలు లాక్కొని పారిపోయారు. ఈ ఘటన నగరంలో తీవ్ర కలకలం సృష్టించింది. వివరాలివీ.. చెన్నై నుంచి నగరానికి వస్తున్న చెన్నై ఎక్స్‌ప్రెస్ గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పిడుగురాళ్ల స్టేషన్ దాటింది. అసలే ఆ ప్రాంతంలో రైలు మెల్లగా నడుస్తుండటంతో ఉక్కపోత భరించలేని ప్రయాణికులు విండోసైడ్ కిటికీలను తెరిచారు. ఇంతలో రైలులో ఉన్న కొందరు దుండగులు చైన్ లాగడంతో డ్రైవర్ రైలును నిలిపాడు. అంతే ఒక్కసారిగా చైన్‌స్నాచర్లు విరుచుకుపడ్డారు. 7, 10, 11, 12 బోగీల్లో కూర్చున్న మహిళలకు చెందిన బంగారు ఆభరణాలను లాక్కొని పరారయ్యారు. ఫలితంగా అరగంట ఆలుస్యంగా రైలు నగరానికి చేరుకుంది. బాధిత మహిళలు గురువారం ఉదయం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకుని ఘటనపై ఇక్కడి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సికింద్రాబాద్ రైల్వే పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం గుంటూరు రైల్వే పోలీసులకు బదలాయించారు. బాధిత మహిళలు వీరే! సనత్‌నగర్ సమీపంలోని ఫతేనగర్‌కు చెందిన సంగీతకు చెందిన 12 గ్రాముల బంగారు గొలుసు, సికింద్రాబాద్ బౌద్ధనగర్‌కు చెందిన పుష్పలత మెడలోని 17 గ్రాముల బంగారు గొలుసు, యూసుఫ్‌గూడకు చెందిన లక్ష్మి మెడలోని ఏడున్నర తులాల బంగారు గొలుసు, అదేప్రాంతంలోని నివేదన అనే మరో మహిళకు చెందిన 20 గ్రాముల బంగారు గొలుసును దుండగులు లాక్కొని పరారయ్యారు. కాగా ఘటన జరుగుతున్న సమయంలో రైలులో ఒక్క పోలీసూ కనిపించలేదని బాధితురాలు సంగీత ఆరోపించారు. -
చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ దొంగల బీభత్సం
గుంటూరు : రైల్వే ప్రయాణికులను దోపిడీ దొంగలు బెంబేలు ఎత్తిస్తున్నారు. రైలు ప్రయాణం అంటేనే ప్రయాణికులు భయపడేలా చేస్తున్నారు. తాజాగా దుండగులు మరోసారి విజృంభించారు. చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ దొంగలు ఈరోజు తెల్లవారుజామున బీభత్సం సృష్టించారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల వద్ద చైన్ లాగి ప్రయాణికులను దోచుకున్నారు. ఎస్-7, 9, 10 బోగిల్లోని ప్రయాణికులను కత్తులతో బెదిరించి ఈ దొంగతనానికి పాల్పడ్డారు. నిద్ర మత్తులో ఉన్న ప్రయాణికులు తేరుకునేలోపే వారి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకుని పరారయ్యారు. ప్రయాణికుల నుంచి సుమారు 30 తులాల బంగారు ఆభరణాలను దోచుకు వెళ్లారు. రైలు సికింద్రాబాద్ చేరుకోగానే ఈ ఘటనపై భాదితులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ మార్గంలో తరచు దొంగలు దోపిడీలకు పాల్పడటంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులకు భద్రత కల్పించటంలో రైల్వే పోలీసులు విఫలం అవుతున్నారంటూ ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ దొంగల బీభత్సం
-
ఐటమ్ సాంగులా...? నో!
త్రిష హవా తగ్గినా... నటిగా ఆమెను ఇప్పటికీ అందరూ ఇష్టపడుతూనే ఉంటారు. ఎందుకంటే... ఈ తరం కథానాయికల్లో నటన పరంగా త్రిష బెస్ట్. అందులో ఏ మాత్రం సందేహం లేదు. అందుకే... తనకున్న మంచి పేరును చెడగొట్టుకోలేనని ఇటీవల ఓ సందర్భంలో కరాఖండిగా చెప్పేసింది త్రిష. వివరాల్లోకి వెళితే -‘నేను దర్శకత్వం వహిస్తున్న ‘తారై తప్పటై ్ట’ సినిమాలో ఓ ఐటమ్‌సాంగ్ ఉంది. చేస్తారా’ అని త్రిషను దర్శకుడు బాల ఇటీవల అడిగారట. దానికి త్రిష ఆలోచించకుండా ‘నో’ చెప్పేసిందట. ‘‘నాకు పరిశ్రమలో మంచి పేరుంది. దాన్ని చెడగొట్టుకోలేను. పాత్ర మంచిదైతే... సెకండ్ హీరోయిన్గా చేయడానికి కూడా నేను సిద్ధమే కానీ, ఐటమ్సాంగుల స్థాయికి మాత్రం నన్ను నేను దిగజార్చుకోలేను’’ అని నిర్మొహమాటంగా త్రిష చెప్పేసిందని తెలిసింది. గతంలో షారుక్ ఖాన్ ‘చెన్నయ్ ఎక్స్‌ప్రెస్’, సూర్య ‘సింగమ్-2’ చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ చేయమని త్రిషకు ఆఫర్లు వచ్చినా, వాటికి ఆమె ‘నో’ చెప్పేసింది. ఇప్పుడు బాల సినిమా వంతు వచ్చిందన్నమాట. ఇదిలావుంటే... ప్రస్తుతం తమిళంలో ఓ చిత్రం, కన్నడంలో ఓ చిత్రం చేస్తున్న త్రిషకు... తెలుగులో ఓ బంపర్ ఆఫర్ తలుపుతట్టిందని సమాచారం. బాలకృష్ణ కథానాయకునిగా సత్యదేవ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా త్రిషను అడిగినట్లు తెలిసింది. త్రిష కూడా ఈ సినిమా విషయంలో సానుకూలంగానే స్పందించినట్లు సమాచారం. అంటే త్వరలో బాలయ్య, త్రిషల జోడీని ప్రేక్షకులు చూడనున్నారన్నమాట. -
పక్కా ప్లాన్‌తోనే రైలు దోపిడీ
-
రైలెక్కుతున్నారా... కొంచెం జాగ్రత్త !
-
గుండెల్లో.. రైళ్లు..!
సాక్షి, గుంటూరు :రైలు ప్రయాణం హాయిగా ఉంటుందనే ఉద్దేశంతో అధిక శాతం మంది ప్రయాణికులు రైళ్లను ఆశ్రయిస్తున్నారు. అయితే జిల్లాలో వరుసగా జరుగుతున్న రైలు దొంగతనాలతో రాత్రి పూట రైలు ఎక్కాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ దొంగతనాలు పల్నాడు ప్రాంతమైన పిడుగురాళ్ల, నడికుడి మధ్యే అధికంగా జరుగుతుండటం గమనార్హం. మంగళవారం తెల్లవారుజామున పిడుగురాళ్ల మండలం శ్రీనివాసపురం వద్ద చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో దొంగలు పథకం ప్రకా రం దోపిడీ(ప్రధాన వార్త మెయిన్‌లో) కి తెగబడడంతో జిల్లా ప్రజలు ఒక్కసారి గా ఉలిక్కిపడ్డారు. సుమారు 20 మంది దుండగులు రైలును ఆపి 45 నిమిషాల పాటు యథేచ్ఛగా దోపిడికి పాల్పడ్డారంటే రైళ్లలో రక్షణ ఎంత అధ్వానస్థితిలో వుందో అర్థమవుతోం ది. రైళ్లల్లో ప్రయాణమంటే ధన, మా న, ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుం దని, ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అవి బుట్టదాఖలు కావడం తప్ప రైల్వే పోలీసులు అప్రమత్తమైన సంఘటన లు లేవనే విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. గతంలో దొంగతనాలు జరిగిన సంఘటనలు ఈ ప్రాంతంలో ఉన్నప్పటికీ రైళ్ళల్లో రాత్రి వేళల్లో కనీసం ఒక్క రైల్వే పోలీసు అయినా లేకుండా దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు మండి పడుతున్నారు. రాత్రి వేళ కన్ను మూయాలంటే ఎక్కడా ఏ సంఘటన జరుగుతుందోనని భయంగా ఉందని ప్రయాణికులు వాపోతున్నారు. రైల్వే దొంగతనాలు ఎక్కువగా వేసవి కాలంలో జరుగుతాయని తెలిసి కూడా రైల్వే పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది కొరత వల్లే రక్షణ కల్పించలేకపోతున్నాం .. జిల్లాలో సుమారు 82 రైల్వే స్టేషన్లు ఉండగా కేవలం నాలుగు రైల్వే పోలీసు స్టేషన్లు మాత్రమే ఉన్నాయి. ఆ నాలుగు పోలీసు స్టేషన్లలో కూడా ఉండాల్సిన దాని కంటే 80 శాతం సిబ్బంది తక్కువగా ఉండటంతో కనీసం రైలులో ఒక్కరిద్దరు పోలీసులు మాత్రమే బందోబస్తు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. నరసరావుపేట రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో నల్లపాడు నుంచి ప్రకాశం జిల్లా గజ్జల కొండ వరకు 16 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటి మధ్యలో తిరిగే రైళ్ళకు ఇక్కడ పోలీసు స్టేషన్ల నుంచి సిబ్బంది రక్షణగా వెళ్ళాల్సి ఉంటుంది. ఈ రైల్వేస్టేషన్లో ఒక ఎస్సై, ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్ళు, 18 మంది కానిస్టేబుళ్ళు ఉండాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఎస్సైతోపాటు ఒక హెడ్‌కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్ళు మాత్రమే ఉన్నారు. అంటే ఉండాల్సిన దానికంటే 18 మంది సిబ్బంది తక్కువగా ఉన్నారు. ఇలా గుంటూరు, తెనాలి, నడికుడి రైల్వేస్టేషన్లలో కూడా సిబ్బంది కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైల్వే పోలీసులు వాపోతున్నారు. ప్రస్తుతం దోపిడి జరిగిన పిడుగురాళ్ళ మండలం శ్రీనివాసపురం నడికుడి రైల్వేస్టేషన్ పరిధిలో ఉంది. అక్కడ ఎస్సై ప్రస్తుతం సెలవులో ఉన్నారు. ఇప్పటికైనా సిబ్బందిని నియమించి దొంగతనాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. టీసీల కాసుల కక్కుర్తే దొంగతనాలకు కారణం... రైల్వే టీసీలు కాసులకు కక్కుర్తిపడి ఎవరిని బడితే వారిని రిజర్వేషన్ బోగీల్లో ఎక్కించి వారి వద్ద నుంచి భారీ మొత్తంలో డబ్బు దండుకుంటున్నారు. దీంతో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ రిజర్వేషన్లో ప్రయాణించింది ఎవరో తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని రైల్వే పోలీసులే చెబుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున జరిగిన రైలు దోపిడీలో కూడా గుర్తుతెలియని వ్యక్తులు రిజర్వేషన్ బోగీల్లో ప్రయాణించి అదను చూసి దోపిడీకి పాల్పడ్డారని తేలింది. డబ్బులు తీసుకుని రిజర్వేషన్ బోగీల్లోకి ఎక్కిస్తున్న టీసీలపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
రజినీకి ఫ్యాన్‌గా మారిపోయిన షారూఖ్
-
నాన్‌స్టాప్ వినోదం
2013లో ‘బ్లాక్ బస్టర్ ఆఫ్ ది బాలీవుడ్’ ఏదంటే తడుముకోకుండా వచ్చే సమాధానం ‘చెన్నైఎక్స్ప్రెస్’. షారుక్ ఖాన్, దీపికా పదుకొనే జంటగా రోహిత్‌శెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా వసూళ్లపరంగా సంచలనం సృష్టించింది. దక్షిణాది సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే కథాకథనాలతో రూపొందిన ఈ చిత్రం రేపు ఆదివారం జీ తెలుగు చానల్లో సాయంత్రం 5.30 గంటలకు ప్రసారం కానుంది. ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకులకు నాన్‌స్టాప్ వినోదాన్ని అందిస్తుందని జీ తెలుగు ప్రతినిధి తెలిపారు. -
చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో భారీగా వెండి స్వాధీనం
నెల్లూరు జిల్లా గూడూరు రైల్వే స్టేషన్లో చెన్నై - హౌరా ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి నుంచి 70 కిలోల వెండితోపాటు, 50 కిలోల రంగురాళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని, గూడూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అంత మొత్తంలో వెండి, రంగురాళ్లను అనధికారికంగా తరలింపుపై పోలీసులు అతడిని ప్రశ్నిస్తున్నారు. -
బాలీవుడ్ నటులకు అవార్డుల పంట
శృంగార, హాస్య పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉత్తమ నటన కనబరిచిన బాలీవుడ్ నటి దీపికా పదుకొనేకు మూడు బిగ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ అవార్డులు దక్కాయి. రిలయన్స్ బ్రాడ్కాస్ట్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నాలుగో ఎడిషన్ బిగ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ అవార్డుల ప్రధాన కార్యక్రమం జరిగింది. భారత సినిమాల్లో అత్యుత్తమ నటన కనబరిచిన నటులకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ ఏడాది నాలుగు సినిమాల్లో హిట్ కొట్టిన పదుకొనే ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ సినిమాకు మహిళా విభాగంలో మోస్ట్ ఎంటర్టైనింగ్ యాక్టర్ అవార్డును సొంతం చేసుకుంది. ఇదే కేటగిరీ పురుషుల విభాగంలో భాగ్ మిల్కా భాగ్ సినిమాకు ఫర్హన్ అక్తర్ అవార్డును దక్కించుకున్నాడు. క్రిష్ 3 సినిమా నిర్మించి ప్రేక్షకుల మదిని దోచుకున్న సినీ నిర్మాత రాకేశ్ రోషన్, మోస్ట్ ఎంటర్టైనింగ్ డెరైక్టర్ అవార్డును సొంతం చేసుకున్నాడు. భాగ్ మిల్కా భాగ్ ఈ ఏడాదికి ఎంటర్టైనింగ్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ అవార్డును దక్కించుకుంది. బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్‌కు స్టార్ ప్లస్ ఎంటర్టైనర్ ఆఫ్ ద ఇయర్, మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు ఎంటర్టైనర్ ఆఫ్ ద సెంచరీ అవార్డులు వచ్చాయి. లూటేరా, అశిక్వి 2 రొమాంటిక్ సినిమాల్లో మోస్ట్ ఎంటర్టైనింగ్ యాక్టర్ అవార్డులను సోనాక్షి సిన్హా, ఆదిత్య రాయ్ కపూర్ సొంతం చేసుకున్నారు. యే జవానీ హై దివానీ సినిమా బెస్ట్ రొమాంటిక్ ఫిల్మ్‌గా నిలిచింది. ఆశిక్వి 2 సినిమాలో నటించిన ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్ధా కపూర్లు, చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో నటించిన షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే జోడీలు బెస్ట్ రొమాంటిక్ కపుల్ అవార్డులను దక్కించుకున్నారు. చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన దీపికాకు, జాలీ ఎల్ఎల్బీలో హాస్యం పండించిన అర్హద్ వర్సీకి మోస్ట్ ఎంటర్టైనింగ్ యాక్టర్ ఇన్ ఏ కామెడీ ఫిల్మ్ అవార్డులను సొంతం చేసుకున్నారు. క్రిష్ 3లో యాక్షన్‌తో మెప్పించిన నటుడు హృతిక్ రోషన్‌కు మోస్ట్ ఎంటర్టైనింగ్ అవార్డు దక్కింది. బెస్ట్ యాక్షన్ ఫిల్మ్ అవార్డును రాంలీలా సినిమా గెలుచుకుంది. -
దుమ్ము రేపుతున్న దూమ్ 3
-
మళ్లీ విలన్‌గా నటిస్తా!
బాలీవుడ్లో ఆమిర్‌ఖాన్‌కి మిస్టర్ పర్ఫెక్ట్ అని బ్రాండ్ నేమ్ ఉంది. ఏ పాత్ర చేసినా దానికి పూర్తి న్యాయం చేస్తారాయన. నో బౌండరీస్... నో లిమిటేషన్స్. అంత పెద్ద సూపర్‌స్టార్ అయ్యుండి కూడా విలన్‌గా చేయడమంటే మాటలు కాదు. ‘ధూమ్-3’ కోసం భారతీయ సినీ ప్రేక్షకులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారంటే దానికి కారణం... అందులో ఆమిర్ విలన్‌గా నటించడమే. ఆమిర్ స్ఫూర్తితో షారుక్‌ఖాన్ కూడా విలన్‌గా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా షారుక్‌ఖాన్ మాట్లాడుతూ -‘‘ఆమిర్ గొప్ప నటుడు. ‘ధూమ్-3’లో పాత్ర కోసం తన దేహాన్ని మార్చుకున్న తీరు, కష్టపడిన విధానం నాకు స్ఫూర్తినిస్తోంది. విలన్ పాత్ర కోసం ఆమిర్ పడిన తపన అభినందనీయం. కేవలం శారీరక, మానసిక అంశాలే కాకుండా ఆమిర్ చిత్రాలను ఎంచుకునే తీరు, ప్రవర్తన నాకెంతో ఇష్టం’’ అని అన్నారు. ఆమిర్ అందించిన స్ఫూర్తితో మళ్లీ విలన్‌గా నటించాలనిపిస్తోందని షారుక్ తెలిపారు. ‘‘నా కెరీర్ ఆరంభంలో డర్, బాజీగర్, అంజామ్ చిత్రాల్లో విలన్‌గా నటించాను. చాలా కాలంగా అలాంటి పాత్రలు చేయలేదు. ఎవరైనా ఆఫర్ చేస్తే వంద కోట్లు వస్తాయా, రెండు వందల కోట్లు వసూలు చేస్తాయా అనే విషయాన్ని బేరీజు వేయకుండా మళ్లీ విలన్ పాత్రను పోషించాలనుకుంటున్నాను’’ అని షారుక్ తెలిపారు. -
నెగిటెవ్ రోల్స్‌లో మళ్లీ.. నటిస్తాను : షారూక్ ఖాన్
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ కు మళ్లీ నెగిటీవ్ రోల్స్ పై చూపు మళ్లింది. తన సినీ కెరీయర్ ప్రారంభంలో డర్, అంజామ్, బాజీగర్ లాంటి సినిమాలు షారూక్ కు మంచి స్టార్ ఢమ్ ను తెచ్చిపెట్టాయి. ఏ పాత్రైన అవలీలగా చేయగల సత్తా ఉన్నా నటుడు. అంతేకాక ఎంత ప్రతికూల పాత్రలోనైనా ఇట్టే లీనం కాగల నేర్పరి కూడా. అలాంటి పాత్రలు పోషించిన షారూక్ మరల అదే తరహాలో పాత్రలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నాడు ఈ ఖాన్. గతంలో దాదాపు చాలా సినిమాల్లో నెగిటివ్ రోల్స్ లో చేసి తన నటనతో అభిమానులను మెప్పించాడు. ఇప్పటివరకూ అభిమానులందరినీ హీరోగా మెప్పించినా ఆయన మరోసారి విలన్ గా ప్రేక్షుకుల ముందుకు రానున్నాడు. మళ్లీ నెగిటీవ్ రోల్స్ చేస్తున్నారా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు.. సమాధానంగా షారూక్ `` అవునూ...! నేను ప్రతిపాత్రలో ఒదిగిపోవాలన్నదే నా ఆకాంక్ష. చాలాసార్లు చేయకూడదని అనుకున్నా.. అయినప్పటికీ చేస్తున్నా... ఎందుకంటే నేనంటే పిల్లలకూ ఇష్టం అన్నాడు. అందుకే చేయాలనుకుంటున్నాను`` చెప్పాడు. ఆదివారం దిన్ని ఫాండేస్ ఫిట్ నేస్ బుక్ `షట్ ఆప్ అండ్ ట్రైన్` ప్రారంభోత్సవంలో షారూక్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తాను చేసే సినిమా 100 కోట్లు, 200 కోట్ల క్లబ్ లో చేరకపోవచ్చు. వ్యాపారపరంగా లాభాలు రాకపోవచ్చు. కాకపోతే ఒక నటుడిగా చిరకాలం కొనసాగాలనుకుంటున్నాను అని చెప్పాడు. ఇప్పటికే షారూక్ ఖాన్ ప్రతికూల పాత్రలలో చేసినా డాన్, డాన్ -2 వంటి చిత్రాలు అదే తరహాకు చెందినవే. కాకపోతే ఆ పాత్రలు నెగిటీవ్ రూల్ పాత్రలకు సరికాకపోవచ్చుని తెలిపాడు. డాన్ మూవీ సరికొత్తగానూ, అందంగానూ తీర్చిదిద్దబడింది. భవిష్యత్తులో ఇంకా మరిన్ని సరైన ప్రతికూల పాత్రలు చేయాలనుకుంటున్నట్టు షారూక్ ఖాన్ చెప్పాడు. అంతేకాకుండా ఈ సంవత్సరంలో విడుదలైన చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రంలో ఆయన కామెడీని పండించాడు. ఈ చిత్రం విజయం సాధించడమేకాకుండా బాలీవుడ్ లో అన్ని రికార్డులను తిరిగరాసింది. ప్రస్తుతం షారూక్ ఖాన్ ఫరా ఖాన్ హ్యాపీ న్యూ ఇయర్ షూటింగ్ లో బిజీగా ఉన్నట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. -
కాంగ్రెస్ ను ఊడ్చేసిన ఆప్
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి ‘డోంట్ అండర్ ఎస్టిమేట్ ది పవర్ ఆఫ్ కామన్ మేన్’ అని చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమాలో బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ చెప్పిన డైలాగ్ ఆమ్ ఆద్మీ పార్టీ అద్భుత విజయానికి అతికినట్టు సరిపోతుంది. సామాన్యుడికి అండగా ఉంటామంటూ వచ్చిన ఆప్‌కు సామాన్యులే అండగా నిలిచారు. 2012 నవంబర్‌లో పురుడు పోసుకున్న ఈ పార్టీ ఏడాది వ్యవధిలోనే కళ్లు చెదిరే ఫలితాలు సాధించింది. 15 ఏళ్ల షీలా దీక్షిత్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించింది. పార్టీ గుర్తు అయిన చీపురునే ఆయుధంగా మార్చి కాంగ్రెస్‌ను ఢిల్లీ నుంచి ‘ఊడ్చేసింది’. సమాజంలోని అన్ని వర్గాల ఆదరణ పొందడమే దాని విజయానికి మూల కారణమని చెప్పాలి. అవినీతి వ్యతిరేకోద్యమం నుంచి పుట్టుకొచ్చిన ఆ పార్టీ సామాన్యుల సమస్యల పరిష్కారానికి పోరాడుతూ ప్రజలకు చేరువైంది. రోజువారీ జీవనంలో తామంతా ఏదో ఒక దశలో అనివార్యంగా ఎదుర్కొంటున్న అవినీతి భూతం అంతం ఆప్‌తో సాధ్యమని ఢిల్లీ మధ్యతరగతి ప్రజలు విశ్వసించారు. వారి ఆగ్రహాన్ని పాలక పక్షంపైకి మళ్లించడంలో ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ పూర్తిగా సఫలీకృతుడయ్యారు. విద్యుత్, నీటి చార్జీల పెంపును తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆయన చేపట్టిన ఉద్యమంతో పార్టీ మరింతగా ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. ఢిల్లీలో విద్యుత్ సరఫరాను రిలయన్స్, టాటా సంస్థలకు అప్పగించడం తెలిసిందే. బిల్లు కట్టలేనివారి మీటర్లను అధికారులు తొలగిస్తే కేజ్రీవాల్ స్వయంగా ఎలక్ట్రీషియన్ అవతారమెత్తి మరీ వాటిని బిగించారు. వ్యవస్థలో ఉంటూనే దాని లోపాలపై పోరాడతానంటూ ఆకట్టుకున్నారు. సవాళ్లే పునాదిరాళ్లు జన లోక్‌పాల్, అవినీతి వ్యతిరేక ఉద్యమాల సమయంలో.. ‘‘దమ్ముంటే ఎన్నికల్లో గెలిచి చట్టసభల్లో మాట్లాడాలి’’ అంటూ పార్టీలన్నీ విసిరిన సవాళ్లను కేజ్రీవాల్ స్వీకరించారు. ఆప్‌ను స్థాపించారు. ఎన్నికలకు ఆరు నెలల ముందుగానే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను చేపట్టారు. మచ్చలేని వ్యక్తులు, సామాన్యులకే టికెట్లు ఇస్తామంటూ చేసిన ప్రకటనకు కట్టుబడ్డారు. వేరే పార్టీల నుంచి వచ్చిన ‘ఆయారాం.. గయారాం’లకు టికెట్లు నిరాకరించారు. విద్యావంతులను, సామాన్యులనే అభ్యర్థులుగా ఎంపిక చేయడం కూడా ప్రజాదరణకు కారణమైంది. వెంట నడిచిన యువత అవినీతి వ్యతిరేక ఉద్యమంలో కేజ్రీవాల్‌తో పాటు ఉన్న యువత.. పార్టీ వెంట కూడా నడిచింది. యువ ఓటర్లలో అధిక శాతం ఓట్లు ఆప్ దక్కించుకుంది. యువత అండతో ప్రచారాన్ని కూడా వినూత్నంగా నిర్వహించి ఓటర్లను ఆకట్టుకుంది. వేలాది మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వ్యాపారులు ఆప్‌కు మద్దతుగా విసృ్తతంగా ప్రచారం చేశారు. అంతెందుకు, ఢిల్లీ నట్టనడుమ ఆప్ ప్రధాన కార్యాలయమున్న భవనం కూడా ఎన్నారై అభిమాని ఒకరు నెలకు రూ.1 అద్దె లెక్కన అభిమానం కొద్దీ ఇచ్చిందే! ఆటోవాలాల అండ.. ఆటోల మీద ఏర్పాటు చేసే వ్యాపార ప్రకటనల మీద స్థానిక సంస్థలు పన్ను విధించడాన్ని వ్యతిరేకిస్తూ ఆటోవాలాల పక్షాన ఆప్ ఉద్యమించింది. దాంతో పన్నును ఉపసంహరిస్తూ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దాంతో ఆటోవాలాలంతా ఆప్‌కు అండగా నిలిచారు. సంచలనం సృష్టించిన ‘నిర్భయ’ ఘటనకు కేజ్రీవాల్, ఆయన బృందం తీవ్రంగా స్పందించింది. మహిళలకు భద్రత కల్పించడంలో విఫలమైందంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలనూ తూర్పారబడుతూ ఉద్యమించారు. మహిళల ఆదరణ లభించడానికి ఈ పోరాటం ఎంతగానో దోహదం చేసింది. ఆప్‌కు జాతీయ, స్థానిక మీడియా అధిక ప్రాధాన్యమివ్వడం కూడా ఆప్‌కు కలిసొచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ ఓటుకు భారీ గండి ‘‘ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే. ఆప్ అసలు పార్టీయే కాదు’’ అంటూ షీలా అవహేళన చేయడం అసలుకే ఎసరు తెచ్చిపెట్టింది. కాంగ్రెస్‌ను మూడోస్థానంలోకి నెట్టడమే గాక షీలాను కూడా ఆప్ ఇంటి దారి పట్టించింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటులో ఎక్కువ శాతాన్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌కు సంప్రదాయ ఓటు బ్యాంకున్న మురికివాడ(జుగ్గీ జోపిడీ)ల్లోకి చొచ్చుకెళ్లింది. విజయానికి ఆరు మెట్లు అవినీతిపై పోరాడుతుందన్న ట్యాగ్, ప్రజల్లో సానుభూతి తదితరాలన్నీ ఉన్నా, వాటిని ఓట్ల రూపంలోకి మార్చడానికి ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయానికి సహకరించిన ఆరంచెల వ్యూహాన్ని ఒకసారి పరిశీలిస్తే... 1. అవగాహన కార్యక్రమం: దీన్ని మార్చిలో చేపట్టారు. ఇందులో భాగంగా మూడు వారాల్లోపే ఒక్క పాలెం ప్రాంతంలోనే 1,100 మందిని కొత్తగా ఓటర్లుగా చేర్చారు. 2. గడప గడపకూ ప్రచారం: ఏప్రిల్ నుంచి రెండు నెలల పాటు చేపట్టారు. ఇందులో భాగంగా ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లోనే ఏకంగా 72,000 నకిలీ ఓట్లను గుర్తించి ఈసీకి ఫిర్యాదు చేశారు. 3. కాలింగ్: ఆప్‌ను మెరుగుపరిచేందుకు ఏం చేయాలో సలహాలు చెప్పాల్సిందిగా ప్రజలనే కోరారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా వీలైనంత మందికి, విదేశాల్లోని భారతీయులకు ఒక మొబైల్ నంబర్ పంపారు. సలహాలు, సూచనలతో మే-నవంబర్ మధ్య ఏకంగా 5 లక్షల పై చిలుకు ఫోన్లు వచ్చాయి! 4. మార్పు కోసం నాటకాల ప్రదర్శన: ఇది మరో ఆసక్తికర ప్రయోగం. పలువురు స్వచ్ఛంద కార్యకర్తలు దేశభక్తి గేయాలు ఆలపించడం, ప్రజా సమస్యలు తదితరాలపై నాటకాలాడటం వంటివి ఓటర్లను బాగా ఆకర్షించాయి. వాటిలో భాగంగానే పార్టీ లక్ష్యాలను కూడా వివరించేవారు. ఇందులో కాలేజీ విద్యార్థులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. 5. మెట్రో వేవ్: ప్రయాణికుల్లో అవినీతికి వ్యతిరేకంగా అవగాహన కల్పించేందుకు ఆఫ్ కార్యకర్తలు చేపట్టిన కార్యక్రమమిది. పార్టీ జెండా, టోపీలతో వారు మెట్రో ప్లాట్‌పారాలపై నడుస్తూ తమ లక్ష్యాల గురించి ప్రయాణికులకు వివరించేవారు. 6. బూత్ మేనేజ్మెంట్: ఆప్ తన ప్రచారాన్ని పోలింగ్ బూత్‌ల వారీగా పక్కాగా నిర్వహించింది. ప్రచార సరళి గురించిన వివరాలను కార్యకర్తలు ఎప్పటికప్పుడు పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరవేసేవారు. అప్పుడప్పుడు కేజ్రీవాల్ స్వయంగా వారితో మాట్లాడి సలహాలు, సూచనలు ఇచ్చేవారు. -
దీపికా నంబర్ వన్నా? కాదా?
‘ఫలానా వారు నంబర్‌వన్ అని మీరెలా డిక్లేర్ చేస్తారు. దేన్ని ప్రామాణికంగా తీసుకుని దీపికను నంబర్‌వన్ అంటున్నారు’’ అని ఓ హిందీ చానల్‌పై కొందరు బాలీవుడ్ తారలు యుద్ధం ప్రకటించారు. వివరాల్లోకెళ్తే... బాలీవుడ్లో లేటెస్ట్ నంబర్‌వన్ హీరోయిన్గా దీపికా పదుకొనేని డిక్లేర్ చేస్తూ ఓ ప్రముఖ చానల్ కథనాన్ని ప్రసారం చేసింది. ఈ ఏడాది దీపిక నటించిన రేస్-2, హే జవానీ హై దివానీ, చెన్నై ఎక్స్‌ప్రెస్, రామ్‌లీలా చిత్రాలు అఖండ విజయం సాధించాయి. ఇందులో ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ 200 కోట్ల రూపాయల పై చిలుకు వసూళ్లు రాబట్టగా, మిగిలిన మూడు సినిమాలు వందకోట్ల క్లబ్‌ని అధిగమించేశాయి. ఒకే ఏడాది మూడు వంద కోట్ల సినిమాలు, ఒక రెండొందల కోట్ల సినిమాలో నటించి దీపిక రికార్డ్ సృష్టించారనీ, బాలీవుడ్ చరిత్రలో ఈ క్రెడిట్ సాధించిన తొలి హీరోయిన్ దీపిక అని, ఈ విజయాలతో బాలీవుడ్లో దీపిక తిరుగులేని సూపర్‌స్టార్‌గా అవతరించారని ఆ కథనం సారాంశం. దాంతో సదరు చానల్ అభిప్రాయాన్ని ఖండిస్తూ... ఫేస్‌బుక్‌ల ద్వారా కొందరు బాలీవుడ్ కథానాయికలు యుద్ధం ప్రకటించేశారట. ‘‘ఈ ఏడాది దీపిక నటించిన నాలుగు సినిమాలూ హీరో ఓరియెంటెడ్ సినిమాలే. కాబట్టి ఆ విజయాల క్రెడిట్ మొత్తం ఆమెకే ఆపాదించడం కరెక్ట్ కాదు. లక్ కలిసి రావడంతో తగిలిన విజయాలివి. నిజానికి నంబర్‌వన్‌గా ప్రకటించాల్సి వస్తే.. ఆ అర్హత ఒక్క విద్యాబాలన్‌కి మాత్రమే ఉంది. ఆమె నటించిన డర్టీపిక్చర్, కహానీ చిత్రాలు నాలుగు నెలల తేడాతో విడుదలై వందకోట్ల పై చిలుకు వసూళ్లు రాబట్టాయి. పైగా అవి లేడీ ఓరియంటెడ్ సినిమాలు. ఈ క్రెడిట్ పూర్తిగా విద్యకే చెందుతుంది. సో... బాలీవుడ్ నంబర్‌వన్ అంటే విద్యాబాలన్ మాత్రమే. అర్హత లేనివారిని అందలం ఎక్కిస్తే... మేం ఒప్పుకోం’’ అంటూ చిన్నసైజు హెచ్చరికల్నే జారీ చేశారట. ఈ విధంగా ఫేస్‌బుక్కుల ద్వారా మీడియాపై యుద్ధం ప్రకటించిన వారిలో... సోనాక్షి సిన్హా, కంగనారనౌత్ లాంటి కథానాయికలు కూడా ఉన్నట్లు సమాచారం. -
ఆ కిక్కే వేరు...
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం తెలివైనవాళ్ల లక్షణం అంటారు పెద్దలు. బాలీవుడ్ చిన్నది దీపికా పదుకొనే పెద్దల మాటలను అక్షరాలా ఫాలో అయిపోతుందేమో. ప్రస్తుతం టైమ్‌ని క్యాష్ చేసుకునే పని మీద ఉందట. కాక్టైల్, రేస్ 2, ఏ జవానీ హై దివానీ, చెన్నయ్ ఎక్స్‌ప్రెస్, రామ్‌లీలా.. ఇలా వరుసగా ఐదు సూపర్‌హిట్ చిత్రాల్లో నటించిన ఈ భామకు అమాంతం క్రేజ్ పెరిగిపోయింది. ‘అందచందాల్లో మాత్రమే కాదు... అభినయంలోనూ దీపికా సూపర్’ అని బాలీవుడ్‌వారు తెగ కితాబులిచ్చేస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో భారీ నిర్మాతలు, దర్శకులకు దీపికా ‘మోస్ట్ వాంటెడ్’ హీరోయిన్ అయిపోయింది. తమ సినిమాలో దీపికా ఉంటే ఆ కిక్కే వేరని, తను చాలా లక్కీగాళ్ అని కూడా కొంతమంది బలంగా ఫిక్స్ అయ్యారట. ఫలితంగా దీపికా పారితోషికం అమాంతంగా పెరిగిందని సమాచారం. ప్రస్తుతం బాలీవుడ్లో అత్యధిక పారితోషికం ‘కోట్’ చేస్తున్న తార దీపికాయేనట. నిర్మాతలు కూడా ఆమె అడిగినంత ఇవ్వడానికి సిద్ధపడుతున్నారని వినికిడి. ఒక్కసారిగా లైఫ్ ఇంత మంచి టర్నింగ్ తీసుకున్నందుకు దీపికా తెగ ఆనందపడిపోతోంది. ‘యజమానికి గర్వం... పొరుగువారికి అసూయ’... అనే ఓ టీవీ కంపెనీ ప్రకటన తరహాలో... దీపికా వైభవానికి ఇతర నాయికలు కుళ్లుకుంటున్నారట. కానీ, ఇదేం పట్టించుకునే స్థితిలో లేని దీపికా.. ‘‘అవకాశాల గురించి ఆలోచించాల్సిన పని లేకుండాపోయింది. ఇప్పుడు నాక్కావల్సిందల్లా నా కుటుంబంతో గడపడానికి కొంత సమయం’’ అంటోంది. -
300 కోట్ల క్లబ్లో క్రిష్-3
కథలో పసలేదు..కథనం విసుగెత్తించింది... అని విమర్శకులు చేసిన వ్యాఖ్యలను తారుమారు చేస్తూ ‘క్రిష్3’ చిత్రం వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. నవంబర్ 1న విడుదలైన క్రిష్3 రికార్డులను తిరగరాస్తోంది. రెండవ వార ం చివర్లో గురువారం రోజున 4.75 కోట్ల రూపాయలు వసూలు చేసి ట్రేడ్ పండితుల్ని ఆశ్చర్యానికి గురిచేయడమే కాకుండా, 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ల (నికరంగా 225.85 కోట్లు)తో రికార్డు దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ చిత్రం నెలకొల్పిన 226.70 కోట్ల రూపాయల రికార్డుకు ఇంచ్ దూరంలోఉంది. ముంబైలో సచిన్ చివరి టెస్ట్ మ్యాచ్‌ను ఆడటంతో వసూళ్లు తగ్గాయని, లేకపోతే ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ రికార్డులను తుడిచిపెట్టే అవకాశం ఉండేదని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు -
ప్రశంసలకు పొంగిపోను:రోహిత్ శెట్టి
న్యూఢిల్లీ: గోల్మాల్ 1, 2, 3..., సింగం.. చెన్నై ఎక్స్‌ప్రెస్.. ఈ సినిమాల పేరు చెప్పగానే గుర్తుకొచ్చే పేరు రోహిత్ శెట్టి. వరుసగా సక్సెస్‌ల మీద సక్సెస్‌లు సాధిస్తూ దర్శకుడిగా బాలీవుడ్లో దూసుకుపోతున్నాడు. ప్రత్యేకించి ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ సినిమా తర్వాత ఈ దర్శకుడికి ఉన్న పాపులారిటీ అమాంతంగా పెరిగిపోయింది. ఇలా వరుసగా హిట్ చిత్రాలను ఎలా అందించగలుగుతున్నారు? సినిమాలను ఎలా ప్లాన్ చేస్తున్నారు? అని రోహిత్‌ను అడిగితే... ‘హిట్లు... ఫ్లాప్‌లు.. మన చేతుల్లో లేవు. అలా వస్తుంటాయంతే. ఓ సినిమాను హిట్ చేయాలని ఎన్నో ప్లాన్‌ను వేసుకొని తెరకెక్కించినా ఆశించిన ఫలితం దక్కకపోవచ్చు. ప్రేక్షకులు దానిని స్వీకరించడాన్నిబట్టి ఫలితం ఆధారపడి ఉంటుంది. అయితే హిట్లు సాధిస్తున్నానని, వందకోట్ల సినిమాల దర్శకుడినంటూ వినిపిస్తున్న ప్రశంసలతో పొంగిపోను. ఇదంతా నేను చేసిందేనని ఎప్పుడూ అనుకోను. ప్రేక్షకులు ఆదరించడం వల్లే సినిమాలు హిట్ అవుతున్నాయి. ప్రతి సినిమాకు వందశాతం కష్టపడడం మాత్రమే నాకు తెలిసింది. అదే నేను చేస్తుంటా. ప్రస్తుతం సింగం-2 ప్రాజెక్టులో బిజీగా ఉన్నాను. స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పని కొనసాగుతోంది. ప్రతి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశించడం కూడా సరికాదు. అందుకే ప్రతి చిన్న విషయంలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను అని రోహిత్ శెట్టి తెలిపారు. -
‘హ్యాపీ న్యూ ఇయర్’ పూర్తయ్యాక విశ్రాంతి తీసుకోవాలనుంది!
న్యూఢిల్లీ: ఈ ఏడాది ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’తో దూసుకొచ్చి బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టిన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఆ వెంటనే ‘హ్యాపీ న్యూ ఇయర్’ షూటింగ్లో మునిగిపోయాడు. సినిమా సినిమాకు మధ్య కాస్త విశ్రాంతి తీసుకునే కింగ్‌ఖాన్ ఈసారి మాత్రం గ్యాప్ లేకుండా షూటింగ్లో పాల్గొంటున్నాడు. అయితే ‘హ్యాపీ న్యూ ఇయర్’ షూటింగ్ పూర్తి కాగానే కొన్ని నెలలపాటు విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పాడు షారుఖ్. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ అనూహ్య విజయం సాధించడంతో నిర్మాతలు, దర్శకులు షారుఖ్ చుట్టూ తిరుగుతున్నారట. ‘శుద్ధ్ దేశీ రోమాన్స్’తో బాలీవుడ్‌కు హిట్టిచ్చిన మనీశ్ శర్మ.. షారుఖ్ కోసం ఓ మంచి కథను తయారు చేసుకున్నాడట. అంతేగాకుండా రాహుల్ ధోలాకియా, అనురాగ్ కశ్యప్, ఆర్ బల్కి, అశుతోష్ గోవారికర్ తదితర దర్శకులు షారుఖ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ విషయమై షారుఖ్ మాట్లాడుతూ... ‘నేనిప్పుడు ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాను. కొత్త సినిమా ఏదైనా అంగీకరిస్తే వెంటనే మీకు తెలియజేస్తాను. ఇప్పటివరకైతే కొత్తగా ఏ సినిమాకు అంగీకరించలేదు. మరో రెండు నెలల వరకు ‘హ్యాపీ న్యూ ఇయర్’ షూటింగ్ కొనసాగుతుంది. మరో నలుగురు దర్శకులు నా కోసం కథలు సిద్ధం చేసుకున్నారు. అయితే వీరిలో ఏ ఒక్కరి సినిమాలను ఇంకా అంగీకరించలేదని షారూఖ్ తెలిపాడు -
రండి...తాగండి...ముచ్చటించండి: షారుక్
తన జన్మదినాన్ని అభిమానులు జరుపుకోవడాన్ని అద్భుతంగా భావిస్తాను అని బాలీవుడ్ షారుక్ ఖాన్ అన్నారు. నా జన్మదినం సందర్భంగా మీడియాను ఆహ్వానిస్తున్నాను. బాంద్రాలోని బ్యాండ్ స్టాండ్ సమీపంలోని మన్నత్ నివాసానికి వచ్చి.. కూల్ డ్రింక్ లు తాగండి.. ఆతర్వాత నాతో ముచ్చటించండి అని లిస్టా జువెల్స్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో షారుక్ తెలిపారు. శనివారం రోజున షారుక్ తన జన్మదినం జరుపుకోనున్నారు. నవంబర్ 2న షారుక్ 48 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్నారు. ఇక షారుక్ ఖాన్, మాధురీ దీక్షిత్, కరిష్మా కపూర్ నటించిన దిల్ తో పాగల్ హై చిత్రం అక్టోబర్ 31 తేదికి 16 ఏళ్లు పూర్తి చేసుకుంది. 16 పూర్తి చేసుకుందనే విషయం గురించి ఆలోచించినపుడు తాను ఒక్కసారిగా ఆ జ్ఞాపకాల్లోకి వెళ్లానని షారుక్ ట్విటర్ లో పేర్కోన్నారు. బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించిన యష్ జీ(యష్ చోప్రా) టీమ్ కు, మాధురీ, కరిష్మా కపూర్ లకు నా కృతజ్క్షతలు అని ట్విటర్ లో తెలిపాడు. -
డైరెక్షన్ వదిలేసి..పాకిస్థాన్ కు వెళ్లిపోతా!
‘‘నేను ‘వార్’ అనే పాకిస్తానీ చిత్రాన్ని చూశాను. నన్ను నేను నమ్మలేనంతగా షాక్‌కి గురయ్యాను. ‘వార్’ చిత్రం చూసిన తర్వాత డెరైక్షన్ వదిలేసి.. పాకిస్తాన్ వెళ్లి.. ఆ చిత్ర దర్శకుడు బిలాల్ లషారీ వద్ద అసిస్టెంట్‌గా చేరాలనిపించింది. బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్‌కు పాకిస్తాన్లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. షారుక్ నటించిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ చిత్రం అక్కడ తొలిరోజు 9 మిలియన్ల రూపాయలు వసూలు చేస్తే.. ‘వార్’ చిత్రం 11.4 మిలియన్ల రూపాయలను వసూలు చేసింది. ఈ చిత్రం చూసిన తర్వాత నాకు అనిపించింది ఒక్కటే. భారతీయ దర్శకులు గొప్పవాళ్లమనే భావన నుంచి బయటపడాలి. అంతేకాకుండా పాకిస్తానీ చిత్రాలపై సీరియస్‌గా దృష్టి సారించాలి. ‘బిలాల్ లషారీ నువ్వు ఎక్కడున్నా.. నీకు నా సెల్యూట్. ఏదేమైనా సినిమా పరిశ్రమలో నేనొక విద్యార్థిని.. నీ చిత్రం చూసి థ్రిల్ అయ్యాను’. పాకిస్తాన్లో నాకు తెలిసినవారు ఎవరైనా బిలాల్‌కు పరిచయం ఉన్నట్లయితే.. నా తరఫున కంగ్రాట్స్ అందించాలి’’ అని పొగడ్తలతో ముంచెత్తారు రామ్‌గోపాల్‌వర్మ. భారతీయుల మనోభావాలకు వ్యతిరేకంగా ఆ చిత్రం ఉన్నప్పటికీ దర్శకుడు బిలాల్ పనితీరుకు ముగ్ధుడయ్యానని, ఈ చిత్రానికి షోమన్ మన్సూర్ అనే వ్యక్తి అసిస్టెంట్‌గా పనిచేశారని.. తాను సెకండ్ అసిస్టెంట్‌గా చేరడానికైనా సిద్ధమని ఈ సందర్భంగా వర్మ అన్నారు. ఆ చిత్రం గురించి గొప్పగా చెప్పుకుంటుంటే.. ఆపుకోలేక పైరేటెడ్ వెర్షన్ చూశానని, అందుకు క్షమించాలని వర్మ ట్విటర్లో పేర్కొన్నారు. అంతేకాక భారతీయ చిత్ర ప్రముఖులకు ‘వార్’ చిత్రం కాపీని పంపి.. పుణ్యం కట్టుకోవాలని వ్యాఖ్యలు చేశారు. వర్మ ఇలా వ్యాఖ్యలు చేయడం ఇబ్బంది పెట్టేలా ఉన్నాయని పలువురు అంటున్నారు. -
అనారోగ్యంతో బాధపడుతున్నా..కంటతడి పెట్టాను: షారుక్
అనారోగ్యంతో బాధపడుతున్న బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. జ్వరంతో అనారోగ్యంతో బాధపడుతున్న తాను టెలివిజన్ లో సినిమాలను చూస్తూ టైమ్ ను ఎంజాయ్ చేస్తున్నాను అని షారుక్ సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో సందేశాన్ని పోస్ట్ చేశారు. తన జీవితాన్ని వెనక్కి చూసుకోవాలంటే వయస్సుతో కాదు.. నేను నటించిన చిత్రాలతో చూసుకుంటాను అని అన్నాడు. ఇటీవల తాను నటించిన 'కల్ హో నా హో' చిత్రాన్ని నా కూతురితో కలిసి చాలా రోజుల తర్వాత టెలివిజన్ లో పూర్తిగా చూశాను. ఆ చిత్రాన్ని చూస్తూ నేను కంట తడి పెట్టాను. నా చిత్రాన్ని చూసి నేనే కన్నీరు పెట్టుకోవడం సిల్లీగా కూడా అనిపించింది. గత కొద్ది రోజులుగా తన జీవితంలో ఉత్తమ చిత్రాలుగా భావిస్తున్న 'డాన్', 'దిల్ వాలే దుల్షనియా లేజాయింగే', 'కల్ హో నా హో', చిత్రాలను చూశాను అని తెలిపాడు. అక్టోబర్ 20వ తేది ఆదివారం రాత్రి జీ టీవీలో ప్రసారమవుతున్న 'చెన్నై ఎక్స్ ప్రెస్' చిత్రాన్ని చూడటానికి సిద్దమయ్యాను అంటూ ట్వీట్ చేశారు. Watched kal ho na ho...with the full end first time with daughter. Uff...how much we cried...though its kinda silly to cry in ur own film!! — SHAH RUKH KHAN (@iamsrk) October 15, 2013Last few days seem like landmark for one or other film of mine. Don yest,DDlJ today,Chennai on Zee tv. My life is in films not years...WoW!— SHAH RUKH KHAN (@iamsrk) October 20, 2013 -
పవన్ కళ్యాణ్ వైపు బాలీవుడ్ చూపు!
తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్ర కలెక్షన్లు బాలీవుడ్ పరిశ్రమ ప్రముఖులను, విశ్లేషకులను దిమ్మతిరిగేలా చేశాయి. అత్తారింటికి దారేది చిత్రం బాలీవుడ్ చిత్రాలు రణబీర్ కపూర్ నటించిన 'యే జవానీ హై జిందగీ', షారుఖ్ ఖాన్ 'చెన్నై ఎక్స్ ప్రెస్' చిత్రాలకు ధీటుగా కలెక్షన్లను కురిపించింది. దాంతో ప్రస్తుతం బాలీవుడ్ లో తాజాగా పవన్ కళ్యాణ్ హాట్ హాట్ గా చర్చ జరుగుతున్నట్టు సమాచారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సమంత, ప్రణీత లతో పవన్ నటించిన అత్తారింటికి దారేది చిత్రం ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలన విజయాన్ని మూటగట్టుకుంది. ఓవర్సీస్ మార్కెట్ లో పవన్ చిత్రం సుమారు 16 కోట్ల రూపాయలను వసూలు చేసినట్టు ట్రేడ్ అనలిస్టుల సమాచారం. కేవలం ఆంధ్ర ప్రదేశ్ లోనే పది రోజుల్లోనే 40 కోట్ల రూపాయల షేర్ ను సాధించడం భారతీయ చిత్ర పరిశ్రమ దృష్టిని ఆకర్షించింది. పవన్ కళ్యాణ్ స్టామినాను అంచనా వేసిన బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలు ద్విభాషా చిత్రాల్లో నటింపచేయాలని ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తొంది. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ను సంప్రదించేందుకు తమ వంతు ప్రయత్నాల్ని ప్రారంభించారని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఓవర్సీస్, దక్షిణాది మార్కెట్ లో పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు బాలీవుడ్ కన్నేసిందని తెలుస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి ఇటీవలే బాలీవుడ్ లో జంజీర్ చిత్రం ద్వారా రాంచరణ్ ఎంట్రీ ఇచ్చి.. ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి పరిస్థితుల్లో బాలీవుడ్ పై పవన్ ఆసక్తిని ప్రదర్శిస్తాడా అనేది సందేహమే. దక్షిణాదిలో ఇప్పటికే ఓ రేంజ్ ను సొంతం చేసుకున్న పవన్.. హిందీ చిత్ర సీమలో ప్రవేశించడం ద్వారా తనకున్న క్రేజ్ ను మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తాడా అనేది వేచి చూడాల్సిందే. -
జైల్లో మున్నాభాయ్ స్టేజ్ షో
ముంబై బాంబు పేలుళ్ల కేసులో పుణెలోని ఎరవాడ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ హీరో సంజయ్ దత్ వచ్చే గురువారం డ్యాన్స్ చేయుబోతున్నారు. నాటకంలో నటించనున్నాడు. శనివారం జైలులో నాటకం రిహార్సల్స్ పనుల్లో సంజయ్ బిజీగా ఉన్నపుడు తీసిందే ఈ చిత్రం. ఖైదీల సంక్షేవూనికి కావాల్సిన నిధులు సవుకూర్చేందుకు ఏటా జైలు అధికారులు 50 వుంది ఖైదీలతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈసారి పుణెలో జరిగే పోగ్రామ్‌లో షారుక్‌ఖాన్ తాజా చిత్రం ‘ చెన్నై ఎక్స్‌ప్రెస్’లో పాపులర్ అయిన న లుంగీ డ్యాన్స్‌కు సంజయ్ స్టెప్పులేయునున్నాడు.1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో దోషిగా తేలిన బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ పుణె ఎరవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పటికే ఏడాదిన్నర కాలం జైలు జీవితం గడిపిన సంజయ్‌దత్ మరో మూడున్నరేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంది. -
సాంబార్ ఎక్స్‌ప్రెస్
పడాల్సినవన్నీ పడ్డాక... సాంబార్ తెర్లుతున్నప్పుడు వస్తుంది చూడండీ... ఘుమాయింపు! అప్పుడు నిజంగానే అనిపిస్తుంది... ‘గృహమే కదా స్వర్గసీమ’ అని! ఎక్కడి శరవణ భవన్! ఎక్కడి ఉడిపి క్విజిన్!! మనకేమిటి ఇంత జిహ్వాబంధన్! ఇడ్లీలోకి సాంబార్, వడల్లోకి సాంబార్... విందుల్లోకి సాంబార్! పంటికింద సాంబార్ ముక్కలు నలుగుతుంటే... సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ గాత్రమో... చెంబై వైద్యనాథన్ భాగవతార్ స్వరమో... పంచేంద్రియాలను కమ్మేసినట్లు ఉంటుంది! వింటారో, తింటారో మీ ఇష్టం. ఈవారం ‘రుచులు’ మాత్రం మిమ్మల్ని చెన్నై ఎక్స్‌ప్రెస్ ఎక్కించడం ఖాయం. లేదంటే... బెంగళూరు ఎక్స్‌ప్రెస్! గుమ్మడి సాంబార్ కావలసినవి: తీపిగుమ్మడికాయ ముక్కలు - ఒక కప్పు ఉల్లిపాయలు - మూడు; చింతపండు - నిమ్మకాయంత (నానబెట్టి రసం తీయాలి); పచ్చిమిర్చి - 6; పసుపు - చిటికెడు; ఉప్పు - తగినంత; కారం - అర టీ స్పూను; బియ్యప్పిండి - టీ స్పూను; మెంతులు - ఐదారు గింజలు; ఆవాలు - అర టీ స్పూను; నూనె - టీ స్పూను; కరివేపాకు - రెండు రెమ్మలు ఇంగువ - చిటికెడు తయారి: ఒక పాత్రలో గుమ్మడికాయ ముక్కలు, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి, మెంతులు, నీరు, ఉప్పు వేసి స్టౌ మీద ఉంచి, ముక్కలు మెత్తబడే వరకు ఉడికించాలి. పసుపు, కారం, చింతపండు రసం, రెండు కప్పుల నీరు జత చేసి, బాగా కలపాలి. ఒక చిన్న గిన్నెలో కొద్దిగా నీరు, బియ్యప్పిండి బాగా కలిపి, ఉడుకుతున్న సాంబార్లో వేసి పదినిముషాలు ఉంచాలి. బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించి, సాంబార్లో వేయాలి. చివరగా సాంబార్ పొడి, కొత్తిమీర వేసి ఒక్క పొంగు రానిచ్చి దించేయాలి. పచ్చిమామిడికాయ సాంబార్ కావలసినవి: మామిడికాయ ముక్కలు - కప్పు కందిపప్పు - పావుకప్పు శనగపప్పు - రెండు టేబుల్ స్పూన్లు పెసరపప్పు - రెండు టేబుల్ స్పూన్లు ఉల్లితరుగు - అర కప్పు సాంబార్ పొడి - 2 టీ స్పూన్లు చింతపండు - కొద్దిగా (నానబెట్టి రసం తీయాలి) బెల్లం తురుము - మూడు టేబుల్ స్పూన్లు కారం - కొద్దిగా ఉప్పు - తగినంత పసుపు - పావు టీ స్పూను ఆవాలు - అర టీ స్పూను మెంతులు - పావు టీ స్పూను జీలకర్ర - అర టీ స్పూను ఇంగువ - చిటికెడు ఎండుమిర్చి - 3 కరివేపాకు - రెండు రెమ్మలు నూనె - 2 టేబుల్ స్పూన్లు తయారి: అన్ని పప్పులను శుభ్రంగా కడిగి, తగినంత నీరు పోసి కుకర్‌లో ఉంచి ఐదు విజిల్స్ వచ్చాక దించేయాలి. చల్లారాక మెత్తగా మాష్ చేయాలి. బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లితరుగు జత చేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించాలి. టొమాటో తరుగు, కొద్దిగా నీరు వేసి మూత పెట్టి మూడు నిముషాలు ఉంచాలి. మెత్తగా చేసిన పప్పు, ఉప్పు, పసుపు, కారం, చింతపండురసం, మామిడికాయ ముక్కలు వేసి బాగా కలపాలి. మరుగుతుండగా సాంబార్ పొడి వేయాలి. వరుత్తరాచ సాంబార్ కావలసినవి: కందిపప్పు - పావు కప్పు పసుపు - పావు టీ స్పూను పచ్చిమిర్చి - 4 చిలగడదుంప ముక్కలు - అర కప్పు ఉల్లి తరుగు - అరకప్పు మునగకాడ - 1 (పెద్ద సైజు ముక్కలుగా కట్ చేయాలి) క్యారట్ - 1 బెండకాయ ముక్కలు - అర కప్పు టొమాటో ముక్కలు - అర కప్పు వంకాయ - 1 చింతపండు - నిమ్మకాయ సైజు పరిమాణంలో సాంబారు ఉల్లిపాయలు - 10 కరివేపాకు - నాలుగు రెమ్మలు కొబ్బరితురుము - అర కప్పు మెంతుల పొడి - పావు టీ స్పూను ఇంగువ - పావు టీ స్పూను ధనియాల పొడి - 2 టేబుల్‌స్పూన్లు కారం - టీ స్పూను పోపుకోసం ఆవాలు - టీ స్పూను కొబ్బరినూనె - టేబుల్ స్పూను మినప్పప్పు - టీ స్పూను ఎండుమిర్చి - 2 కరివేపాకు - రెండు రెమ్మలు తయారి: ఒక గిన్నెలో తగినంత నీరు, ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చిలగడదుంప, క్యారట్, కీర, బెండ, వంగ, టొమాటో... ముక్కలు వేసి ఉడికించాలి. కొద్దిగా ఉడికిన తరవాత మునగకాడలు, చింతపండు రసం వేయాలి. కందిపప్పుకి తగినంత నీరు జత చేసి కుకర్‌లో ఉంచి, ఆరు విజిల్స్ వచ్చాక దించేయాలి. బాణలిలో మెంతులపొడి వేసి కొద్దిగా వేయించి, తీసేయాలి. అదే బాణలిలో కొబ్బరి తురుము, కరివేపాకు వేసి గోధుమరంగు వచ్చే వరకు వేయించాలి. ధనియాలపొడి, కారం, ఇంగువ, మెంతులపొడి, పసుపు వేసి బాగా కలపాలి. చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఉడుకుతున్న కూరముక్కలలో ఈ పేస్ట్ వేసి కలిపి, బాగా మరిగాక దించేయాలి. బాణలిలో నూనె కాగాక ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించి సాంబార్లో వేసి కలపాలి. ఉడిపి సాంబార్ కావలసినవి: కందిపప్పు - 50 గ్రా.; బంగాళదుంప ముక్కలు - అర కప్పు; క్యారట్ తరుగు - అర కప్పు; ఉల్లితరుగు - పావు కప్పు; ఉప్పు - తగినంత; చింతపండు - చిన్న నిమ్మకాయంత (నానబెట్టి రసం తీయాలి); బెల్లం తురుము - రెండు టీ; స్పూన్లు; నూనె - 2 టేబుల్ స్పూన్లు పేస్ట్ కోసం: జీలకర్ర - అర టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; ఎండుమిర్చి - 4; పచ్చి శనగపప్పు - రెండు టీ స్పూన్లు; ధనియాలు - టేబుల్ స్పూను, మిరియాలు - 6 గింజలు; కొబ్బరితురుము - అర కప్పు పోపు కోసం: ఆవాలు - అర టీ స్పూను; మినప్పప్పు - పావు టీ స్పూను; కరివేపాకు - రెండు రెమ్మలు; ఇంగువ - చిటికెడు; పచ్చిమిర్చి - 3; కొత్తిమీర - చిన్న కట్ట. తయారి: కందిపప్పును శుభ్రంగా కడిగి, తగినంత నీరు పోసి కుకర్‌లో ఉంచి ఐదు విజిల్స్ వచ్చాక దించే యాలి ఒక గిన్నెలో బంగాళదుంప, క్యారట్, ఉల్లిపాయ... ముక్కలు, ఉప్పు, తగినంత నీరు పోసి ఉడికించాలి బాణలిలో టేబుల్ స్పూను నూనె వేసి కాగాక జీలకర్ర, మినప్పప్పు, పచ్చి శనగపప్పు, ఎండుమిర్చి, ధనియాలు, కొబ్బరి తురుము ఒక దాని తరవాత ఒకటి వేసి వేయించి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి చింతపండు రసం, ఉప్పు వేసి ఐదు నిముషాలు మరిగించాలి. ఉడికించి మెత్తగా చేసుకున్న కందిపప్పు, కూరముక్కలు, మసాలా పేస్ట్, బెల్లం తురుము వేసి కలపాలి తగినంత నీరు జత చేసి, మంట తగ్గించి 15 నిముషాలు ఉంచి దించేయాలి. పాన్‌లో టేబుల్ స్పూను నూనె వేసి కాగాక- ఆవాలు, మినప్పప్పు, ఇంగువ, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేసి వేయించి, సాంబార్లో వేయాలి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. చె న్నై సాంబార్ కావలసినవి: ఎర్ర కందిపప్పు - కప్పు; మునగకాడ - 1 (ముక్కలుగా కట్ చేయాలి) చిన్న వంకాయలు - 10 (పొడవుగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి); టొమాటో తరుగు - పావు కప్పు; పచ్చిమిర్చి - 4 (నిలువుగా కట్ చేసుకోవాలి); కొత్తిమీర తరుగు - రెండు టీ స్పూన్లు ఉప్పు - తగినంత; చింతపండు - కొద్దిగా (నానబెట్టి రసం తీయాలి) పేస్ట్ కోసం: పుట్నాలపప్పు - 2 టేబుల్ స్పూన్లు టొమాటో - 1 (పెద్దది); కొబ్బరితురుము - టేబుల్ స్పూను; సాంబారు పొడి - 4 టీ స్పూన్లు ఇంగువ - పావు టీ స్పూను; ఆవాలు - పావు టీ స్పూను; జీలకర్ర - టీ స్పూనుఛ మినప్పప్పు - టీ స్పూను; ఎండుమిర్చి - 1; కరివేపాకు - రెండు రెమ్మలు తయారి: ఎర్ర కందిపప్పును శుభ్రంగా కడిగి తగినంత నీరు పోసి కుకర్‌లో ఉంచి ఏడు విజిల్స్ వచ్చాక దించి, చల్లారాక, మెత్తగా మెదపాలి. మిక్సీలో పుట్నాలపప్పు, టొమాటో, కొబ్బరితురుము, సాంబారు పొడి, ఇంగువ వేసి మెత్తగా పేస్ట్ చేస్తే సాంబార్ మసాలా రెడీ అవుతుంది. ఒక గిన్నెలో మెదిపి ఉంచుకున్న పప్పు, నాలుగు కప్పుల నీరు, కూరముక్కలు, టొమాటో, పచ్చిమిర్చి వేసి ఉడికించాలి. చింతపండు పులుసు వే సి మరిగించాలి. బాగా మరిగాక, మెత్తగా చేసి ఉంచుకున్న సాంబార్ మసాలా వేసి బాగా కలిపి ఐదునిముషాలు ఉంచాలి. వేరొక బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. మధ్యలోకి నాలుగు ముక్కలుగా తరిగి ఉంచుకున్న వంకాయలను జత చేసి వేయించాలి. ఉడుకుతున్న సాంబారులో వేసి, బాగా మరిగిన తరవాత దించేయాలి. సాంబారు పొడి కందిపప్పు - 100 గ్రా. ఎండుమిర్చి - 50 గ్రా. ధనియాలు - 50 గ్రా. శనగపప్పు - 25 గ్రా. మినప్పప్పు - 25 గ్రా. బియ్యం - 10 గ్రా. జీలకర్ర - 2 టీ స్పూన్లు మిరియాలు - టీ స్పూను ఎండుకొబ్బరి - రెండు టీ స్పూన్లు మెంతులు - టీ స్పూను పసుపు - చిటికెడు నూనె - టీ స్పూను ఉప్పు - కొద్దిగా తయారి: బాణలిలో టీ స్పూను నూనె వేసి కాగాక, పైన చెప్పిన పదార్థాలను విడివిడిగా వేయించి పక్కన ఉంచాలి. చల్లారాక కొద్దిగా ఉప్పు జత చేసి అన్నిటినీ మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. - సేకరణ: డా.వైజయంతి -
షారుక్ 'లుంగీ డ్యాన్స్'కు సంజయ్ దత్ తీన్ మార్!
'చెన్నె ఎక్స్ ప్రెస్' చిత్రంలో షారుక్ ఖాన్ చేసిన లుంగీ డ్యాన్స్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అయితే ప్రస్తుతం పూణెలోని ఎర్రవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ షారుక్ లుంగీ డ్యాన్స్ కు స్టెప్పులు వేయనున్నాడు. జైలు సిబ్బంది సంక్షేమం కోసం నిధులను సేకరించడానికి ఏర్పాటు చేసిన ఓ ప్రదర్శనలో సంజయ్ దత్ కూడా పాల్గొననున్నాడు. రెండున్నర గంటలపాటు జరిగే ఈ కార్యక్రమం సెప్టెంబర్ 26 తేదిన జరుగనుంది. ఈ నిధులను ఖైదీల సౌకర్యానికి కూడా వినియోగించనున్నట్టు జైలు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది ఖైదీలు పాల్గొంటారని అధికారులు వెల్లడించారు. సంజయ్ దత్ చేసే డ్యాన్స్ ఈ కార్యక్రమంలో హైలెట్ గా నిలుస్తుంది అని తెలిపారు. ప్రదర్శనలో మహారాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించే కార్యక్రమాలు కూడా ఉంటాయన్నారు. ఇటీవల 'చెన్నై ఎక్స్ ప్రెస్' సాధించిన విజయంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సంజయ్ దత్ ఆ చిత్ర దర్శకుడు రోహిత్ శెట్టిని లేఖ ద్వారా ప్రశసించారట! -
ఆమీర్ ఖాన్ కు షాకిచ్చిన షారుక్ ఖాన్ అభిమాని!
ముంబై: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ అభిమాని ఇచ్చిన షాక్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ ఇబ్బందికి గురి చేసింది. షారుక్ నటించిన 'చెన్నై ఎక్స్ ప్రెస్' చిత్ర పోస్టర్ ముద్రించిన టీషర్ట్ ను అమీర్ ధరించి ఉన్న ఫోటో ఒకటి హల్ ఇటీవల సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో చేసింది. అయితే ఆ వార్తను బాలీవుడ్ మసాలా అనే వీడియో మ్యాగజైన్ రిపోర్ట్ చేసింది. దాంతో షారుక్ అభిమాని పోస్ట్ చేసిన ఫోటోని ట్విటర్ లో చూసి.. అమీర్ ఖాన్ షాక్ గురైనాడట. అయితే అసలు విషయమేమిటంటే.. అమీర్ ఫోటోను ఫోటో షాప్ లో మార్ఫింగ్ చేసి ట్విటర్ లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. అసలు విషయం బయటపడటంతో ఆతర్వాత ఆమీర్ ఫోటోను ట్విటర్ నుంచి తొలగించినట్టు సమాచారం. రంజాన్ సందర్భంగా విడుదలైన చెన్నై ఎక్స్ ప్రెస్ బాలీవుడ్ రికార్డులను తుడిచిపెట్టి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. -
'త్వరలో షారుక్ ను మట్టి కరిపిస్తా'
ఇటీవల ఇఫ్తార్ విందులో కౌగిలింతలతో వ్యక్తిగత వివాదాలకు స్వస్తి చెప్పినా.. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తమ ఫైట్ కు రాజీలేదని కింగ్ ఖాన్ షారుఖ్ కు కండలవీరుడు సల్మాన్ ఖాన్ హెచ్చరికల్ని పంపాడు. తన తదుపరి చిత్రంతో షారుఖ్ రికార్డులను మట్టి కరిపిస్తానని సల్మాన్ ఖాన్ సవాల్ విసిరాడు. బాక్సాఫీస్ వద్ద 'చెన్నై ఎక్స్ ప్రెస్' సృష్టిస్తున్న రికార్డుల గురించి తనకు చింత లేదని సల్మాన్ ధీమా వ్యక్తం చేశాడు. 'రంజాన్ వేడుకల సందర్భంగా తాను షారుఖ్ ను కౌగిలించుకున్నా. అదొక పవిత్ర మాసం. ఎదుటి వ్యక్తిపై మరో వ్యక్తి చూపించాల్సిన భావనను నేను చూపించాను. అది మానవీయ కోణంలో చూపించిన ఓ ఫీలింగ్ మాత్రమే' అని సల్మాన్ అన్నాడు. షారుఖ్ తో శతృత్వం ఏమి లేదని.. గతంలో నా పేరిట ఉన్న రికార్డులను ఆయన అధిగమించాడు. నాకేమైనా ఇబ్బంది ఉంటే తాను తన సామర్ధ్యంతో అధిగమిస్తాను అని సల్మాన్ తెలిపాడు. అమీర్ ఖాన్ ధూమ్-3 చిత్రం కాని..రణబీర్ మరో చిత్రం కాని.. మరేవ్వరి చిత్రమైనా కాని.. బాక్సాఫీస్ వద్ద తన తదుపరి చిత్రంతోనే సమాధానమిస్తానని అన్నాడు. రంజాన్ రోజున విడుదలైన చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రం 225.7 కోట్ల వసూళ్లతో గతంలో సల్మాన్ పేరున ఉన్న రికార్డులను తుడిచిపెట్టిన సంగతి తెలిసిందే. -
దీపికా పదుకోనేకు ఆరు.. కత్రినా కైఫ్ కు నాలుగు!
ప్రస్తుతం బాలీవుడ్ లో దీపికా పదుకోనే హవా బ్రహ్మండంగా కొనసాగుతోదని చెప్పడానికి తాజా సంఘటన ఓ ఉదాహరణ మాత్రమే. దీపికా నటించిన 'కాక్ టెయిల్', 'యే జవానీ హై దివానీ', 'చెన్నై ఎక్స్ ప్రెస్' లాంటి భారీ హిట్లతో బాలీవుడ్ లో అగ్రస్థానాన్ని చేజిక్కించుకుంది. తాజాగా దీపికా నటించిన 'చెన్నై ఎక్స్ ప్రెస్' అన్ని రికార్డులను తుడిచిపెట్టి రికార్టులను బ్రేక్ చేస్తోంది. 'చెన్నై ఎక్స్ ప్రెస్' చిత్రం దీపికా పదుకోనేకు మంచి పేరు తెచ్చి పెట్టడంతోపాటు యాడ్ రంగంలో కూడా కత్రీనా కైఫ్ ను సైతం వెనక్కి నెట్టేందుకు దోహదపడింది. ఇక వరస హిట్లతో జోరుమీదున్న దీపికాకు అడ్వర్టైజింగ్ రంగంలో కూడా అఫర్లు భారీగానే వస్తున్నాయట. దీపికా తన స్టార్ డమ్ ను దృష్టిలో ఉంచుకుని ఓ బ్యూటి సోప్ కంపెనీ 6 కోట్ల రూపాయలు ముట్టచెప్పిందట. అయితే ఇటీవల కత్రినా కైఫ్ కు 4 కోట్లకే సోప్ కంపెనీ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. ఇంకా ఆసక్తికరమైన విషయమేమిటంటే రాంఝ్నా చిత్రంతో హిట్ సాధించిన సోనమ్ కపూర్ తో రెండు కోట్ల రూపాయలతో అదే సోప్ కంపెనీ యాడ్ ను షూటింగ్ చేసింది. అదే మరి హిట్లకు, ఫ్లాప్ లకు ఉన్నా తేడా.. అంటున్నారు బాలీవుడ్ పరిశ్రమ పెద్దలు. -
200 కోట్ల మార్కును దాటిన 'చెన్నై ఎక్స్ ప్రెస్'
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ కలెక్షన్ల సునామీ ఇంకా కొనసాగుతూనే ఉంది. రెండవ వారం పూర్తయ్యే సరికి చెన్నై ఎక్స్ ప్రెస్ 200 కోట్ల మార్కును దాటేసింది. మూడవ వారంలో కూడా కలెక్షన్లు భారీగానే ఉన్నట్టు తెలుస్తోంది. రోహిత్ శెట్టి దర్శకత్వంలో 75 కోట్ల వ్యయంతో యాక్షన్, కామెడి చిత్రంగా రూపొందింది. విదేశాల్లో కూడా ఈ చిత్ర కలెక్షన్లు భారీగానే ఉన్నయని ట్రేడ్ అనలిస్టులు వెల్లడించారు. తొలివారంలోనే ఏకంగా 100 కోట్ల రూపాయల వసూళ్లు చేసింది. ఇప్పటి వరకు ఇంత భారీ వసూళ్లు ఏ సినిమాకీ లేవు. అది అద్భుతమైన వారాంతమని ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ చెప్పారు. రంజాన్ సందర్భంగా ఆగస్టు తొమ్మిదో తేదీ శుక్రవారం నాడు విడుదలైన చెన్నై ఎక్స్‌ప్రెస్ కేవలం మూడు రోజుల్లోనే వంద కోట్లు సంపాదించింది. -
షారుక్ రికార్డును అమీర్, హృతిక్ బ్రేక్ చేస్తారా!
బాలీవుడ్ లో ప్రస్తుతం చర్చంతా 'బాద్ షా' షారుక్ ఖాన్ పైనే జరుగుతోంది. తాజాగా దీపికా పదుకొనేతో కలిసి షారుక్ నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రం అందరి అంచనాలను మించి ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బాలీవుడ్ లో అతివేగంగా 100 కోట్లను వసూలు చేసిన చిత్రంగా చెన్నై ఎక్స్ ప్రెస్ రికార్డును సొంతం చేసుకుంది. స్వదేశంలోనే కాకుండా పాకిస్థాన్, యూఎస్, బ్రిటన్, కెనడాతోపాటు మరికొన్ని దేశాల్లో చెన్నై ఎక్స్ ప్రెస్ రికార్డులను తిరగ రాస్తోంది. వంద కోట్లను కొల్లగొట్టిన షారుక్ చిత్రం 200 కోట్ల కలెక్షన్లపై కన్నేసింది. అయితే షారుక్ రికార్డులను అధిగమించే సత్తా ఎవరికుంది అని బాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. రానున్న రోజుల్లో అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగన్, కరీనా కపూర్ లాంటి అగ్రతారలు నటించిన 'సత్యగ్రహ' చిత్రం ఆగస్టు 30 తేదిన విడుదలకు సిద్దమవుతోంది. రణ్ బీర్ కపూర్ బేషరమ్ అక్డోబర్ 2 తేదిన, హృతిక్ రోషన్ 'క్రిష్ 3' నవంబర్ 4, ఆమీర్ ఖాన్ 'ధూమ్ 3' క్రిస్మస్ కు విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రం 75 కోట్ల వ్యయంతో తెరకెక్కగా, సత్యగ్రహ 40 కోట్లు, బేషరమ్ 50 కోట్లు, క్రిష్-3 90 కోట్ల, ధూమ్ 3 చిత్రం వంద కోట్లకు పైగా వ్యయంతో తెరకెక్కినట్టు తెలుస్తోంది. తొలుత అక్షయ్ కుమార్, ఇమ్రాన్ ఖాన్ లు నటించిన వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై చిత్రం చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రానికి ధీటుగా నిలుస్తుందని సినీ విమర్శకులు అంచనా వేశారు. అయితే అందర్ని అంచనాలను తలకిందులు చేసి.. ఆ చిత్రం చెన్నై ఎక్స్ ప్రెస్ ముందు తేలిపోయింది. ఇక చెన్నై ఎక్ప్ ప్రెస్ చిత్ర రికార్డులను ఏ చిత్రం తడిచిపెడుతుందా ఆసక్తి బాలీవుడ్ వర్గాల్లో పెరిగింది. అన్నా హజారే స్పూర్తితో నిర్మించిన సత్యగ్రహ చిత్రంపై పెద్దగా అంచనాలు లేకపోయినా.. చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్ర రికార్డులను తిరగరాసే సత్తా క్రిష్-3, ధూమ్-3 చిత్రాలకే ఉందని బాలీవుడ్ బలంగా నమ్ముతోంది. ఎందుకంటే ధూమ్, క్రిష్ చిత్రానలు అన్ని రకాల, అన్ని వయస్సుల వారు ఆదరించడానికి అవకాశముందని ట్రేడ్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా పెద్దగా అంచనాలు లేకుండా ఈద్ సందర్భంగా విడుదలైన షారుక్ 'చెన్నై ఎక్ప్ ప్రెస్' బాలీవుడ్ కు పెద్ద సవాలే విసిరింది. ఇక షారుక్ విసిరిన సవాల్ ను అమితాబ్, రణబీర్, హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ లలో ఎవరు అధిగమిస్తారో వేచి చూడాల్సిందే! -
‘బక్వాస్ హిట్’పై షారుక్ ఆశ్చర్యం!
తాను నటించిన చిత్రం వందకోట్ల మార్కును అతితక్కువకాలంలో అధిగమించిందంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. ఇక వరుస వైఫల్యాలతో కొట్టుమిట్టాడుతున్న హీరో పరిస్థితి అయితే ఇక చెప్పనక్కర్లేదు. ఇదంతా షారుక్‌ఖాన్ గురించే. తాజాగా విడుదలైన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ వందకోట్ల మార్కును దాటేసి... 181 కోట్ల రూపాయల వసూళ్ల సునామీని కురిపించడంతో షారుక్ఖాన్కే చాలా ఆశ్చర్యమేస్తుందంట! ఆగస్టు 15 నాటికే విదేశాల్లో 53 కోట్ల రూపాయలను వసూలు చేసినట్టు బాక్సాఫీస్ సమాచారం. యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల్లో కలెక్షన్ల రికార్డులను జెట్ స్పీడ్‌తో తుడిచిపెట్టుకుపోతుంటే, షారుక్‌కి ఏమి అర్ధం కావడం లేదట. ఇదిలా ఉండగా షారుక్, దీపికా పదుకొనేలు నటించిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ చిత్రంపై బక్వాస్ (చెత్త) హిట్ అంటూ పాల ఉత్తత్పుల సంస్థ అముల్ వ్యంగ్యంగా కార్టూన్ వేసింది. ఇటీవల కాలంలో ‘యే జవానీ హై దీవానీ’ సక్సెస్ కావడంతో ‘బత్తమీజ్ దిల్’ అంటూ అముల్ దీపికా పదుకునే చిత్రంతో అడ్వర్టైజింగ్ వేసింది. అతి తక్కువ కాలంలో ఓ యాక్టర్ బొమ్మను రెండు సార్లు విని యోగించుకోవడం అమూల్ చరిత్రలో ఇదే ప్రథమం. -
పాక్‌లో దూసుకెళ్తున్న 'చెన్నై ఎక్స్‌ప్రెస్'
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే జంటగా నటించిన చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమా పాకిస్థాన్‌లో విడుదలై విజయఢంకా మోగిస్తుందని స్థానిక పత్రిక డాన్ గురువారం వెల్లడించింది. ఇద్ పండగ సందర్భంగా విడుదలైన ఆ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షిస్తుందని పేర్కొంది. చెన్నై ఎక్స్‌ప్రెస్ విడుదలైన మొదటి రోజు మొదటి సినిమాకే పాక్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారని తెలిపింది. బాక్స్ ఆఫిస్ వద్ద ఆ కనకవర్షం కరుస్తుందని విశ్లేషకులు అంచనాలను నిలబెట్టిందని చెప్పింది. రోహిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ఈద్ పండగ రోజును విడుదలైంది. అయితే అదే రోజున విడుదలైన ఇష్క్ కుదా సినిమా ప్రజలను అంతగా ఆకట్టుకోలేదని కాప్రి సినిమా జనరల్ మేనేజర్ అజీజ్ ఖాన్ తెలిపారని డాన్ పేర్కొంది. అలాగే దేశంలో ఇటీవల విడుదలైన ఇతర చిత్రాలను కూడా వెనక్కి నెట్టి 'చెన్నై ఎక్స్‌ప్రెస్' పాక్‌లో దూసుకెళ్తుందని డాన్ తెలిపింది. -
దూసుకుపోతున్న చెన్నై ఎక్స్‌ప్రెస్
న్యూఢిల్లీ: వసూళ్ల రేసులో వెనుకబడిన బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్‌కు ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ సినిమాతో మంచిరోజులే వచ్చినట్లున్నాయి. దీపికా పదుకొణెతో కలిసి నటించిన ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపిస్తోంది. బాలీవుడ్ సినిమా అయినప్పటికీ టాలీవుడ్, కోలీవుడ్ సంప్రదాయాలను అనుసరించి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని దక్షిణాది ప్రాంతాల్లోనివారు కూడా ఎగబడి చూస్తున్నారు. దీంతో బాక్సాఫీసు రికార్డులను తిరగరాస్తు దూసుకుపోతోంది ఈ చెన్నై ఎక్స్‌ప్రెస్. తొలివారంలోనే రూ.100 కోట్ల మార్కును దాటి సరికొత్త రికార్డును నమోదు చేసిందని చెబుతున్నాడు ప్రముఖ విశ్లేషకుడు తరన్ ఆదర్శ్. ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా విడుదలైన ఈ చిత్రం శుక్రవారం రూ.33.12 కోట్లు, శనివారం 28.05 కోట్లు, ఆదివారం 32.50 కోట్లు, విడుదలకు ముందే ప్రివ్యూ షో ద్వారా గురువారం 6.75 కోట్లు వసూలు చేయడంతో కేవలం నాలుగు రోజుల్లో వందకోట్ల రూపాయలు వసూలు చేసిందన్నారు. కేవలం రూ. 70 కోట్లు వెచ్చించి తెరకెక్కించిన ఈ చిత్రంలో యాక్షన్, కామెడీ, మాస్ మసాలా ఇలా అన్నీ కలగలిపి ఉండడంతో అన్నిరకాల ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన వస్తోందని చెబుతోంది చిత్ర బృందం. సినిమా విడుదలకు ముందే తాము ఈ పరిస్థితిని ఊహించామని, అయితే ఇంత భారీగా వసూలు చేస్తుందనుకోలేదన్నారు. సినిమా ప్రచారం కోసం షారుఖ్, దీపికా పడిన శ్రమ వృధా పోలేదని, ఈ సినిమా హిట్ కావడంతో షారుఖ్‌కు వసూళ్ల దాహం తీరినట్లేనంటున్నారు. -
చిన్మయ శ్రీపాదపై షారుఖ్ ప్రశంసల జల్లు!
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, దీపికా పదుకోనేలు నటించిన తాజా చిత్రం చెన్నై ఎక్స్ ప్రెస్ రికార్డుల పట్టాలపై పరుగులు పెడుతోంది. అంతే వేగంతో ఆ చిత్రంలోని పాటలు కూడా ప్రేక్షకుల మదిలోకి దూసుకెళ్లుతున్నాయి. చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రంలో 'తిత్లీ' పాటను పాడిన చిన్మయ శ్రీపాదను అభిమానులే కాకుండా బాలీవుడ్ ప్రముఖులు కూడా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తాజాగా చిన్మయను షారుఖ్ ఖాన్ ప్రశంసలతో ముంచెత్తాడట. జూలై జరిగిన ఆడియో ప్రారంభ కార్యక్రమంలో షారుఖ్ ఖాన్ 'తిత్లీ' పాటను మెచ్చుకుంటూ ట్విట్ చేశారని చిన్మయ తెలిపింది. తన జీవితంలో షారుక్ ప్రశంసలు మరిచిపోలేనని చిన్మయ వెల్లడించింది. ఆడియో కార్యక్రమంలో షారుక్ ని సంగీత దర్శకుడు శేఖర్ పరిచయం చేశాడు. షారుక్ ఖాన్ ఓ సూపర్ స్టార్.. కాని ఆయన మాటతీరు, మాటల్లో మాటతీరు తనను ఆకట్టుకున్నాయని తెలిపింది. -
వంద కోట్లు దాటిన చెన్నై ఎక్స్‌ప్రెస్ వసూళ్లు
దీపికా పదుకొనే అచ్చమైన తమిళ పొణ్నులా చీరకట్టు కట్టి నటించి, రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమా బాక్సాఫీసు వద్ద రికార్డులు బద్దలుకొట్టుకుంటూ సాగిపోతోంది. తొలివారంలోనే ఏకంగా 100 కోట్ల రూపాయల వసూళ్లు చేసింది. ఇప్పటి వరకు ఇంత భారీ వసూళ్లు ఏ సినిమాకీ లేవు. అది అద్భుతమైన వారాంతమని ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ చెప్పారు. రంజాన్ సందర్భంగా ఆగస్టు తొమ్మిదో తేదీ శుక్రవారం నాడు విడుదలైన చెన్నై ఎక్స్‌ప్రెస్ కేవలం మూడు రోజుల్లోనే వంద కోట్లు సంపాదించింది. గురువారం నాటి ప్రివ్యూల నుంచి 6.75 కోట్లు, శుక్రవారం విడుదల రోజున 33.12 కోట్లు, శనివారం రెండో రోజు 28.05 కోట్లు, ఆదివారం 32.50 కోట్లు వసూలు చేసింది. మొత్తం 100.42 కోట్ల నెట్ వసూళ్లు జరిగాయి. ఈ సినిమా నిర్మాణ వ్యయం 70 కోట్ల రూపాయలు. మూడు రోజుల్లోనే దాన్ని దాటి ఎక్కడికో వెళ్లిపోవడంతో ఇక కాసుల వర్షమే కురవనుంది. మొదటి వారాంతంలో రికార్డులు బద్దలవుతాయని విడుదలైన రోజే సినీ పండితులు అంచనా వేశారు. తమిళనాడుకు చెందిన ఓ డాన్ కుమార్తెతో ప్రేమలో పడే ఉత్తరాది కుర్రాడి కథతో రూపొందిన ఈ సినిమా అన్ని వర్గాలనూ ఆకట్టుకుంటోంది. కేవలం మన దేశంలోనే కాక, విదేశాల్లో కూడా దాని వసూళ్లు బాగున్నాయి. ఆదివారం నాడు షారుక్ ఖాన్ స్వయంగా ముంబైలో ఓ థియేటర్‌కు వెళ్లి, ప్రేక్షకుల స్పందనను స్వయంగా చూశాడు. యూటీవీ మోషన్ పిక్చర్స్‌తో కలిసి షారుక్ ఖాన్‌కు చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై తీసిన ఈ సినిమా ఇంత విజయం సాధించినా, ఇంకా దాని ప్రమోషన్ మాత్రం ఆగలేదు. మిస్ ఏషియా పసిఫిక్ 2012 హిమాంగిని సింగ్, ఫెమినా మిస్ ఇండియా 2013 ఫైనలిస్టు అఖితా అగ్నిహోత్రి కలిసి ఖట్మాండులో ఈ చిత్రానికి సంబంధించిన ఓ చారిటీ షోలో పాల్గొంటున్నారు. దీని ద్వారా వచ్చే సొమ్మును ముంబైకి చెందిన ప్రాజెక్ట్ క్రేయాన్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా నేపాల్ వరద బాధితులకు అందిస్తారు. -
చిలిపిగా ‘లుంగీ డ్యాన్స్’ షారుక్ కు రజనీ ప్రశంస
రజనీకాంత్ యూనివర్సల్ అప్పీల్ ఉన్న నటుడు. అందుకే రజనీ దక్షిణాదికే పరిమితం కాలేదు. రజనీ అభిమానుల జాబితాలో సగటు ప్రేక్షకులే కాకుండా, సినీ నటులు కూడా చేరిపోయారు. తాజా రజనీ అభిమానుల జాబితాలో బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ కూడా చేరిపోయాడు. తమిళ నేపథ్యంతో తెరకెక్కించిన చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రంలో ‘మూచోంఖో రౌండ్ గుమాకే, అన్నా కే జైసా చష్మా లగాకే, కోకోనట్ మే లస్సీ మిలాకే, ఆ జావో మూడ్ బనాకే.. ఆల్ ద రజనీ ఫ్యాన్స్, డోంట్ మిస్ ద చాన్స్.. లుంగీ డ్యాన్స్ లుంగీ డ్యాన్స్’ అంటూ రజనీపై అభిమానాన్ని షారుక్ చాటుకున్నాడు. రజనీపై చేసిన లుంగీ డ్యాన్స్ పాటను యూట్యూబ్‌లో కుటుంబ సభ్యులతోపాటు రజనీ చూశాడట. వెంటనే ఫోన్ చేసి ’పాట చిత్రీకరణ బాగుంది. చిలిపిగా ఉంది. చాలా స్వీట్‌గా ఉంది’ అంటూ ప్రశంసించారని షారుక్ వెల్లడించాడు. ఈ పాట చిత్రీకరణకు ముందు రజనీ, ఆయన కూతురు సౌందర్యల అనుమతి తీసుకున్న తర్వాతే హానీ సింగ్‌తో పాడించామని షారుక్ తెలిపాడు. అయితే ‘బాలీవుడ్లో మీరు గొప్పస్టార్’, ’నాపై పాటను ఎందుకు చేస్తున్నారు’ అడిగిన తీరు ఆయన గొప్ప తనానికి నిదర్శనమని షారుక్ తెలిపారు. అయితే చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమా ద్వారా రజనీ సార్ గొప్ప తనాన్ని ప్రస్తావించడానికి సరియైన సమయం లభించిందనిపించిందని, తలైవా గురించి ప్రస్తావించకపోతే ఈ సినిమాకు అర్ధం ఉండదు అని షారుక్ అన్నాడు. -
చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమా రివ్యూ!
బాద్షా, డూప్లికేట్, ఫిర్‌బీ దిల్ హై హిందుస్థానీ చిత్రాల తర్వాత కామెడీ, యాక్షన్ చిత్రాల్లో తరహా చిత్రాల్లో షారుక్‌ను చూడక బాలీవుడ్ అభిమానులు చాలా రోజులైంది. తొలినాళ్లలో షారుక్ యాక్షన్, కామెడి నేపథ్యం ఉన్న చిత్రాలకే ప్రాధాన్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. కెరీర్ మధ్యలో దిల్ తో పాగల్ హై, కుచ్ కుచ్ హోతా హై, దిల్ వాలే దుల్హనియా లేజాయింగే లాంటి ప్రేమ చిత్రాలతో ప్రేక్షకుల హృదయాల్లో కింగ్ ఆఫ్ రొమాన్స్‌గా ముద్ర వేసుకున్నాడు షారుక్. లవ్, రొమాన్స్ కథాంశాలతో మొన్నటి ‘జబ్ తక్ హై జాన్’ ఘోర పరాజయం వరకు అదే పంథాను కొనసాగించాడు. ‘జబ్ తక్ హై జాన్’ చిత్రం ఫ్లాప్ తర్వాత యాక్షన్, కామెడి అంశాల మేలవింపుతో ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ ద్వారా షారుక్ ముందుకు వచ్చాడు. తొమ్మిది నెలల గ్యాప్ తర్వాత దీపికా పదుకోనె,దర్శకుడు రోహిత్ శెట్టి, షారుక్ కాంబినేషనలో వచ్చిన చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ కథ.. గొప్పగా చెప్పుకునేంత సీన్ ఉన్న కథ కాదు. ఉత్తర భారత దేశానికి చెందిన యువకుడు, దక్షిణాది అమ్మాయితో ప్రేమలో పడటం సింగిల్ లైన్ స్టోరి. రాహుల్ అనే యువకుడు తన తాత అస్థికలను రామేశ్వరంలో కలిపేందుకు బయలుదేరుతాడు. తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం నిరాకరించి ఇంటి నుంచి పారిపోయిన మీనా చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో రాహుల్‌ని కలుస్తుంది. అనుకోని పరిస్థితుల్లో మీనా స్వంత గ్రామానికి రాహుల్ వెళ్లాల్సి వస్తుంది. అయితే మీనా స్వంత గ్రామంలో ఏమి జరిగింది. రాహుల్, మీనాల మధ్య ఎలా ప్రేమ చిగురించింది. రాహుల్, మీనాలు పెద్దవారిని ఎలా ఒప్పించారనే అంశాలతో తెరకెక్కిన సాదాసీదా ప్రేమకథ చెన్నై ఎక్స్‌ప్రెస్. అయితే దక్షిణాది కామెడీ ట్రాక్‌కు షారుక్ రొమాంటిక్ ఇమేజిని కలిపి దర్శకుడు రోహిత్ శెట్టి, యూనస్ సజావాల్ అందించిన స్క్రీన్ ప్లే, కేరళ అందాలు, అద్బుతమైన దూద్లే ఫోటోగ్రఫీలు సినిమాపై ప్రేక్షకుడు పట్టు సాధించేలా చేశాయి. మున్నార్, దేవికులమ్ లేక్, మీసాపులిమాలా, వాగవారా, కన్నిమాలా ప్రాంతాలు, దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ అందాలను అద్బుతంగా తెరకెక్కిచడంలో కెమెరామెన్ దూద్దే సఫలీకృతమయ్యాడు. విశాల్, శేఖర్లు తమ సత్తాకు తగినంతగా సంగీతాన్ని అందించలేదనే చెప్పవచ్చు. అయితే తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నేపథ్యంగా తైలవర్ (లుంగీ డ్యాన్స్) పాట, కాశ్మీర్ మే తూ కన్యాకుమారి, ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ టైటిల్ సాంగ్ ఆకట్టుకునేలా ఉన్నాయి. షారుక్ ఖాన్‌కు రాహుల్ లాంటి క్యారెక్టరైజేషన్ ఉన్న పాత్రలో నటించడం కొట్టిన పిండే. రొమాంటిక్ టచ్‌తో యాక్షన్ హీరోగా షారుక్ చార్మింగ్‌గా కనిపించాడు. రొమాంటిక్ లవర్ బాయ్ పాత్రలో షారుక్ తప్ప మరొకర్ని ఊహించుకోవడం కష్టమనే రీతిలో చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రంలో నటనను ప్రదర్శించాడు. క్లైమాక్స్‌లో షారుక్ అదరగొట్టేశాడు. షారుక్ తన మార్క్ కామెడీ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇక మీనా(మీనమ్మ)పాత్రలో దీపిక పదుకొనే అమాయకత్వంతోపాటు, చెలాకీతనంతో అద్బుతంగా ప్రదర్శించింది. తమిళ సాంప్రదాయ నేపథ్యం ఎక్కువగా ఉన్న ఈ చిత్రంలో దీపికా కట్టు,బొట్టు, క్యాస్టూమ్స్ ఓహో అనిపించేలా ఉన్నాయి. గ్లామర్‌గా కనిపించాలంటే అర్ధనగ్నంగా కనిపించాల్సిందే అనే ఫీలింగ్ ఉన్న ఈ రోజుల్లో.. కంచిపట్టు చీరలో మీనమ్మాగా దీపికా గతంలో ఎన్నడూ లేనంత అందంగా తెరమీద మెరిసింది. మీనా తండ్రిగా దుగేశ్వర పాత్రలో సత్యరాజ్ గంభీరంగా కనిపించాడు. ఇక విలన్ పాత్ర తంగబలీ పాత్రలో నికితిన్ ధీర్ పర్వాలేదనిపించాడు. అయితే కామెడీయే ప్రధాన నేపథ్యంగా రూపొందిన ఈ చిత్రం ఆ రేంజ్ లో లేకపోవడం ప్రేక్షకుడిని నిరాశపరిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా షారుక్, దీపికా కెమిస్ట్రీని ఎంజాయ్ చేయాలనే టేస్ట్ ఉన్న అభిమానులకు, రిలాక్స్ కోసం ధియేటర్‌కు వెళ్లాలనుకునే ఫ్యామిలీ కేటగిరి ప్రేక్షకులకు చెన్నై ఎక్స్‌ప్రెస్ నచ్చడం ఖాయం. ఇక ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తే ఆ ఘనత షారుక్, దీపికాలకే దక్కుతుంది. షారుక్, దీపికలకు తగ్గట్టుగా కథను సిద్ధం చేసుకోకపోవడం దర్శకుడి వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. కథను పక్కన పెట్టి కథనంతోనే ప్రయోగం చేసేందుకు దర్శకుడు రోహిత్ శెట్టి సిద్ధమైనట్టు స్పష్టంగా కనిపించింది. విశేషాలు: దేశవ్యాప్తంగా 3500, విదేశాల్లో 700 థియేటర్లలో విడుదలైంది. భారతీయ సినిమాలకు పెద్దగా మార్కెట్‌లేని పెరూ, ఇజ్రాయిల్ దేశాతొలిసారి విడుదలైన బాలీవుడ్ చిత్రంగా చెన్నై ఎక్స్‌ప్రెస్ రికార్డుల్లోకెక్కింది. అంతేకాకుండా నార్త్ అమెరికాలో 195 స్క్రీన్లలో, బ్రిటన్ 175 స్క్రీన్లతోపాటు మొరాకో, జర్మనీ, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, ఫ్రాన్స్ దేశాల్లో ప్రద ర్శనకు సిద్ధమవుతోంది. -
‘అబ్రామ్’ మీడియాకు దూరంగా ఉండటమే మంచిది : షారుక్
‘ఈ రంజాన్ పండగ చాలా ప్రత్యేకమైనది’ అని ముంబైలోని తన నివాసం 'మన్నత్' లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ అన్నాడు. రంజాన్ పండగ రోజు తాను నటించిన చెన్నై ఎక్స్‌ప్రెస్ విడుదలతోపాటు..ఓ అద్బుతమైన చిన్నారి అబ్రామ్ తమ కుటుంబంలోకి రావడం చాలా ఆనందంగా ఉంది అని అన్నాడు. ఇలాంటి ఆనందక్షణాలు తనకు మరింత ఉత్సాహాన్ని అందిస్తున్నాయని, గత తొమ్మిది రోజులుగా చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్ర ప్రమోషన్లో బిజీగా ఉండటం కారణంగా తాను సరిగా నిద్ర కూడా పోలేదని, అయినా తాను చాలా ఎనర్జిటిక్ ఉన్నానని అన్నారు. మే 27 తేదిన సర్రోగసి ద్వారా షారుఖ్ ఓ బిడ్డకు తండ్రి అయిన విషయం తెలిసిందే. సర్రోగసి వివాదం షారుక్‌ను ఇంకా వెంటాడుతున్నట్టే కనిపిస్తోంది. తన కుమారుడు అబ్రామ్ను మీడియా ప్రపంచానికి దూరంగా ఉంచాలని అనుకుంటున్నానని.. అంతకంటే ఎక్కువగా మాట్లాడదలచుకోలేదని అని అన్నాడు. ఇప్పటికే అబ్రామ్పై చాలామంది ఎక్కువగానే మాట్లాడారని, అయితే ఆ సమయంలో అసత్యాలు మాట్లాడుకోవడం కాస్తా బాధేసింది అని అన్నాడు. తన జీవితంలోకి ప్రవేశించిన చిన్నారిపై అవాస్తవాలు మాట్లాడటంతో మానసిక క్షోభ అనుభవించానన్నారు. తన కుమారుడు అబ్రామ్ గురించి కాని, ఆరోగ్యం గురించి కాని మాట్లాడటానికి నిరాకరించాడు. -
కత్రినా ‘బికినీ’ వ్యవహారంపై దీపికా స్పందన!
తన బాయ్‌ఫ్రెండ్ రణ్‌బీర్ కపూర్‌తో కలిసి స్పెయిన్‌లో ప్రైవేట్ విహారయాత్ర చేసిన సందర్భంగా బికినీ దుస్తుల్లో బాలీవుడ్ తార కత్రినాకైఫ్ కెమెరాకు చిక్కిన ఫోటోలు మీడియాలో పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కత్రినాకైఫ్ మీడియాకు లేఖ రాసి వివరణ ఇచ్చుకోవడంతో ఆ దుమారం సద్దుమణిగింది. అయితే కత్రినా వ్యవహారంపై దీపికా పదుకొనే స్పందిస్తూ ‘నేను ఇప్పటి వరకు అలా ఎవరికంటా పడలేదు’ అని తెలిపింది. సెలబ్రీటిలకు, సమాజంలో ప్రముఖ వ్యక్తులకు అలాంటి సంఘటనలు ఎదురవ్వడం సహజమే అని ప్రస్తుతం రణ్ వీర్ సింగ్ తో అఫైర్ నడుపుతున్న దీపికా అన్నారు. అందుకు మరొకరిని నిందించడం, ఆరోపణలు చేయడంలో ప్రయోజనం శూన్యం వెల్లడించింది. ఒకవేళ అలాంటి పరిస్థితులు తనకు ఎదురైతే.. కాస్తా జాగ్రత్తగా ఉండాలని అనుకుంటాను అని చెప్పింది. చెన్నై ఎక్స్‌ప్రెస్ తర్వాత షారుక్‌తో, యే జవానీ హై దివానీ చిత్రం తర్వాత రణబీర్ కపూర్‌తో జోడి క డుతున్నారని వచ్చిన వార్తలు నిజమేనా అనే ప్రశ్నకు జవాబు దాటవేస్తూ.. ప్రతి చిత్రానికి ఓ గమ్యం ఉంటుందని.. తాను చిత్రాలను ఎంపిక చేసుకోను. సినిమాలోని పాత్రలే తనను వెదుకుంటూ వస్తాయని.. నటించడం అలా అలా జరిగిపోతుంటాయని దీపికా వేదాంతం ఒలకబోసింది. షారుఖ్ తో హ్యప్పీ న్యూ ఇయర్ అనే చిత్రంలో నటించడానికి ఓకే చెప్పినట్టు బాలీవుడ్ సమాచారం. -
అలా ఎందుకు ఫిక్స్ అవుతారో అర్థం కావడం లేదు - దీపికా పదుకొనే
‘‘ఎందుకు జనం అంత తొందరగా ఓ నిర్ణయానికి వచ్చేస్తారో నాకు అర్ధం కావడం లేదు’’ అంటున్నారు బాలీవుడ్ భామ దీపికా పదుకొనె. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ చిత్రంలో తమిళ భాషను కించపరిచేలా సన్నివేశాలున్నాయని వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ దీపిక పై విధంగా స్పందించారు. ‘‘మన సంస్కృతిని మనం ఎందుకు కించపరుచుకుంటాం. నేను, దర్శకుడు రోహిత్ శెట్టి దక్షిణాది ప్రాంతానికి చెందిన వాళ్లమే. అంతెందుకు...‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ చిత్రంలో షారుక్ ఖాన్ తప్ప మిగతా నటులంతా దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందినవారే’’ అని స్పష్టం చేశారు దీపిక. గతంలో పంజాబ్ ఆధారంగా చేసుకుని చిత్రాలు రూపొందాయి. ప్రస్తుతం దక్షిణాది పరిశ్రమపైనే ఆధారపడి బాలీవుడ్ చిత్రాలు రూపొందుతోన్న తరుణంలో దక్షిణాదికి చెందిన తాము దక్షిణాది భాషను కించపరుస్తామని ఎలా భావిస్తారన్నారు? అని దీపిక ప్రశ్నించారు. తమిళ భాషను హాస్యం కోసమే వాడుకున్నామని, ఆ భాషను అపహాస్యం చేసే విధంగా ఎక్కడ ప్రయత్నించలేదని దీపిక తెలిపారు. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లో ఉత్తర భారతీయుడ్ని ప్రేమించిన తమిళ అమ్మాయిగా నటిస్తున్నానని ఈ సందర్భంగా దీపిక పదుకొనె చెప్పారు. -
'చెన్నై ఎక్స్‌ప్రెస్' తో 'మై హు షాహిద్ ఆఫ్రిద్ లేట్
ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ నటించిన 'చెన్నై ఎక్స్‌ప్రెస్' చిత్రం పాకిస్థాన్‌లో విడుదల కానుంది. ఆ నేపథ్యంలో మై హు షాహిద్ ఆఫ్రిద్ (ఎంహెచ్ఎస్హెచ్) చిత్రం రంజాన్ పండగ తర్వాత విడుదల చేయాలని నిర్ణయించినట్లు ఆ చిత్ర నిర్మాతలు మంగళవారం పాకిస్థాన్‌లో వెల్లడించారు. అయితే ముందుగా నిర్ణయించిన తేదీ ప్రకారమే ఆ చిత్రాన్నివిడుదల చేయాలనుకున్నామని, కానీ ఆఖరి నిముషంలో అవాంతరాలు ఎదురైయ్యాయని ఆ చిత్ర రచయిత వ్యాస చౌదరి ద ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యున్ ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అలాగే దేశ చలన చిత్ర రంగంలో పేరు ప్రఖ్యాతలు పొందిన ఫిల్మ్ ఎడిటర్ అజాంఖాన్ మరణం కూడా ఆ చిత్ర విడుదలకు ఏర్పడిన అవాంతరాల్లో ఒకటన్నారు. చిత్ర పూర్తి కావచ్చున చివరి నిముషంలో ఆయన మరణించారన్నారు. అలాగే చిత్రంనికి సంబంధించి పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ అంతా విదేశాల్లో జరగడం కూడా ఇంకో కారణమన్నారు. అయితే ఇద్ పండగ నేపథ్యంలో భారత్‌కు చెందిన ఏ చిత్రాన్ని పాక్‌లో విడుదల చేయమని అంతకుమందు డిస్టిబ్యూటర్లు, సినీ నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారు. అయితే ఆఖరి నిముషంలో ఆ ఒప్పందాన్ని అతిక్రమంచి చెన్నై ఎక్స్‌ప్రెస్‌ను విడుదల చేస్తున్నారని వ్యాస చౌదరి పేర్కొన్నరు. -
మనీష్ మల్హోత్రా ర్యాంప్ షోలో షారుక్, దీపికా
-
అలా ఎందుకు ఫిక్స్ అవుతారో - దీపికా పదుకోనె
ఎందుకు జనం అంత తొందరగా ఓ నిర్ణయానికి ఫిక్స్ అవుతారో నాకు అర్ధం కావడం లేదు అని అంటోంది దక్షిణాదికి చెందిన బాలీవుడ్ తార దీపికా పదుకోనె. మన సంస్కృతిని మనం ఎందుకు కించ పరుచుకుంటాం. నేను, దర్శకుడు రోహిత్ శెట్టి దక్షిణాది ప్రాంతానికి చెందిన వాళ్లమే. చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రంలో షారుక్ ఖాన్ తప్ప మిగితా నటులంతా దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందినవారేనని స్పష్టం చేసింది. చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రంలో తమిళ భాషను కించపరిచేలా చిత్రీకరించారని వస్తున్న ఆరోపణలను దీపిక ఖండించింది. గతంలో పంజాబ్ ఆధారంగా చేసుకుని చిత్రాలు రూపొందాయని.. ప్రస్తుతం దక్షిణాది పరిశ్రమపైనే ఆధారపడి చిత్రాలు నిర్మిస్తున్న తరుణంలో తాము దక్షిణాది భాషను కించపరుస్తామని ఎలా భావిస్తారన్నారు. తమిళ భాషను హాస్యం కోసమే వాడుకున్నామని.. ఆ భాషను అపహాస్యం చేసే విధంగా ఎక్కడ ప్రయత్నించలేదని దీపిక తెలిపింది. చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రంలో ఉత్తర భారతీయుడ్ని ప్రేమించిన తమిళ అమ్మాయిగా దీపిక పదుకోనె నటిస్తోంది. -
చెన్నై ఎక్స్ ప్రెస్ ప్రమోషన్ స్టిల్స్
చెన్నై ఎక్స్ ప్రెస్ ఇంటిల్లిపాది కలిసి చూసే చిత్రం అని బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తెలిపాడు. ప్రస్తుతం షారుఖ్ ఆరోగ్య పరిస్థితి సహకరించకున్నా.. చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో బిజిబిజీగా ఉన్నారు. ఓం శాంతి ఓం చిత్రం తర్వాత దీపికా పదుకోనే, షారుఖ్ లను కలిపి దర్శకుడు రోహిత్ శెట్టి రూపొందించిన చిత్రం ఆగస్టు 9 తేదిన విడుదలయ్యేందుకు సిద్ధమైంది. దీవానా, డర్, బాజీగర్, దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే చిత్రాల్లాగే అటు ఫ్యామిలీ, ఇటు మాస్ అభిమానులను చెన్నై ఎక్స్ ప్రెస్ ఆకట్టుకుంటుందని షారుఖ్ ధీమా వ్యక్తం చేశాడు. -
'ఫ్యామిలీ, మాస్ ఆడియెన్స్ కోసమే చెన్నై ఎక్స్ ప్రెస్'
'చెన్నై ఎక్స్ ప్రెస్' ఇంటిల్లిపాది కలిసి చూసే చిత్రం అని బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తెలిపాడు. ప్రస్తుతం షారుఖ్ ఆరోగ్య పరిస్థితి సహకరించకున్నా.. చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో బిజిబిజీగా ఉన్నారు. ఓం శాంతి ఓం చిత్రం తర్వాత దీపికా పదుకోనే, షారుఖ్ లను కలిపి దర్శకుడు రోహిత్ శెట్టి రూపొందించిన చిత్రం ఆగస్టు 9 తేదిన విడుదలయ్యేందుకు సిద్ధమైంది. దీవానా, డర్, బాజీగర్, దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే చిత్రాల్లాగే అటు ఫ్యామిలీ, ఇటు మాస్ అభిమానులను చెన్నై ఎక్స్ ప్రెస్ ఆకట్టుకుంటుందని షారుఖ్ ధీమా వ్యక్తం చేశాడు. గత పదేళ్లుగా రోహిత్ శెట్టి చిత్రాలను నిర్మించడంతోపాటు గోల్ మాల్ చిత్రంతో విజయాన్ని సాధించాడని.. ఇక చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రం తర్వాత సూపర్ హిట్ అందించిన దర్శకుల జాబితాలో ఆయన చేరడం ఖాయమన్నారు. చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రంలో కామెడీ, డ్రామా, రొమాన్స్ , యాక్షన్ తోపాటు అన్ని రకాల వెరైటీలతో రోహిత్ చక్కటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రాన్ని అందించాడని షారుఖ్ అభినందించాడు. ఇటీవల భుజానికి గాయం కారణంగా చేయించుకున్న సర్జరీని లెక్క చేయకుండా షారుఖ్... శెట్టి, దీపికా పదుకోనెలతో కలిసి ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.