నెగిటెవ్ రోల్స్‌లో మ‌ళ్లీ.. న‌టిస్తాను : షారూక్ ఖాన్‌ | Shah Rukh keen to play baddie, again | Sakshi
Sakshi News home page

నెగిటెవ్ రోల్స్‌లో మ‌ళ్లీ.. న‌టిస్తాను : షారూక్ ఖాన్‌

Dec 9 2013 5:17 PM | Updated on Sep 2 2017 1:25 AM

నెగిటెవ్ రోల్స్‌లో మ‌ళ్లీ.. న‌టిస్తాను : షారూక్ ఖాన్‌

నెగిటెవ్ రోల్స్‌లో మ‌ళ్లీ.. న‌టిస్తాను : షారూక్ ఖాన్‌

బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ కు మళ్లీ నెగిటీవ్ రోల్స్ పై చూపు మళ్లింది. తన సినీ కెరీయర్ ప్రారంభంలో ఢర్ర్, అంజమ్, బజ్జీగర్ వంటి సినిమాలు షారూక్ కు మంచి స్టార్ ఢమ్ ను తెచ్చాయి.

ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ కు మళ్లీ నెగిటీవ్ రోల్స్ పై చూపు మళ్లింది. తన సినీ కెరీయర్ ప్రారంభంలో డర్, అంజామ్, బాజీగర్ లాంటి సినిమాలు షారూక్ కు మంచి స్టార్ ఢమ్ ను తెచ్చిపెట్టాయి. ఏ పాత్రైన అవలీలగా చేయగల సత్తా ఉన్నా నటుడు. అంతేకాక  ఎంత ప్రతికూల పాత్రలోనైనా ఇట్టే లీనం కాగల నేర్పరి కూడా.  అలాంటి పాత్రలు పోషించిన షారూక్ మరల అదే తరహాలో పాత్రలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నాడు ఈ ఖాన్. గతంలో దాదాపు చాలా సినిమాల్లో నెగిటివ్ రోల్స్ లో చేసి తన నటనతో అభిమానులను మెప్పించాడు. ఇప్పటివరకూ అభిమానులందరినీ హీరోగా మెప్పించినా ఆయన మరోసారి విలన్ గా ప్రేక్షుకుల ముందుకు రానున్నాడు.

మళ్లీ నెగిటీవ్ రోల్స్ చేస్తున్నారా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు.. సమాధానంగా షారూక్ `` అవునూ...! నేను ప్రతిపాత్రలో ఒదిగిపోవాలన్నదే నా ఆకాంక్ష. చాలాసార్లు చేయకూడదని అనుకున్నా.. అయినప్పటికీ చేస్తున్నా... ఎందుకంటే నేనంటే పిల్లలకూ ఇష్టం అన్నాడు. అందుకే చేయాలనుకుంటున్నాను`` చెప్పాడు. ఆదివారం దిన్ని ఫాండేస్ ఫిట్ నేస్ బుక్ `షట్ ఆప్ అండ్ ట్రైన్` ప్రారంభోత్సవంలో షారూక్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తాను చేసే సినిమా 100 కోట్లు, 200 కోట్ల క్లబ్ లో చేరకపోవచ్చు. వ్యాపారపరంగా లాభాలు రాకపోవచ్చు. కాకపోతే ఒక నటుడిగా చిరకాలం కొనసాగాలనుకుంటున్నాను అని చెప్పాడు.

ఇప్పటికే షారూక్ ఖాన్ ప్రతికూల పాత్రలలో చేసినా డాన్, డాన్ -2 వంటి చిత్రాలు అదే తరహాకు చెందినవే. కాకపోతే ఆ పాత్రలు నెగిటీవ్ రూల్ పాత్రలకు సరికాకపోవచ్చుని తెలిపాడు. డాన్ మూవీ సరికొత్తగానూ, అందంగానూ తీర్చిదిద్దబడింది. భవిష్యత్తులో ఇంకా మరిన్ని సరైన ప్రతికూల పాత్రలు చేయాలనుకుంటున్నట్టు షారూక్ ఖాన్ చెప్పాడు. అంతేకాకుండా ఈ సంవత్సరంలో విడుదలైన చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రంలో ఆయన కామెడీని పండించాడు. ఈ చిత్రం విజయం సాధించడమేకాకుండా బాలీవుడ్ లో అన్ని రికార్డులను తిరిగరాసింది.  ప్రస్తుతం షారూక్ ఖాన్ ఫరా ఖాన్ హ్యాపీ న్యూ ఇయర్ షూటింగ్ లో బిజీగా ఉన్నట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement