‘అబ్‌రామ్’ మీడియాకు దూరంగా ఉండటమే మంచిది : షారుక్
‘అబ్‌రామ్’ మీడియాకు దూరంగా ఉండటమే మంచిది : షారుక్
Published Wed, Aug 7 2013 10:11 PM | Last Updated on Thu, Jul 11 2019 6:18 PM
‘ఈ రంజాన్ పండగ చాలా ప్రత్యేకమైనది’ అని ముంబైలోని తన నివాసం 'మన్నత్' లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ అన్నాడు. రంజాన్ పండగ రోజు తాను నటించిన చెన్నై ఎక్స్‌ప్రెస్ విడుదలతోపాటు..ఓ అద్బుతమైన చిన్నారి అబ్‌రామ్ తమ కుటుంబంలోకి రావడం చాలా ఆనందంగా ఉంది అని అన్నాడు.
ఇలాంటి ఆనందక్షణాలు తనకు మరింత ఉత్సాహాన్ని అందిస్తున్నాయని, గత తొమ్మిది రోజులుగా చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్ర ప్రమోషన్‌లో బిజీగా ఉండటం కారణంగా తాను సరిగా నిద్ర కూడా పోలేదని, అయినా తాను చాలా ఎనర్జిటిక్ ఉన్నానని అన్నారు. మే 27 తేదిన సర్రోగసి ద్వారా షారుఖ్ ఓ బిడ్డకు తండ్రి అయిన విషయం తెలిసిందే. సర్రోగసి వివాదం షారుక్‌ను ఇంకా వెంటాడుతున్నట్టే కనిపిస్తోంది.
తన కుమారుడు అబ్‌రామ్‌ను మీడియా ప్రపంచానికి దూరంగా ఉంచాలని అనుకుంటున్నానని.. అంతకంటే ఎక్కువగా మాట్లాడదలచుకోలేదని అని అన్నాడు. ఇప్పటికే అబ్‌రామ్‌పై చాలామంది ఎక్కువగానే మాట్లాడారని, అయితే ఆ సమయంలో అసత్యాలు మాట్లాడుకోవడం కాస్తా బాధేసింది అని అన్నాడు. తన జీవితంలోకి ప్రవేశించిన చిన్నారిపై అవాస్తవాలు మాట్లాడటంతో మానసిక క్షోభ అనుభవించానన్నారు. తన కుమారుడు అబ్‌రామ్ గురించి కాని, ఆరోగ్యం గురించి కాని మాట్లాడటానికి నిరాకరించాడు.
Advertisement
Advertisement