AbRam
-
షారుఖ్ పాట.. ఆపమన్న బేటా
కరోనా పోరాటంలో మేము సైతం అంటూ ఫేస్బుక్ వేదికగా "ఐ ఫర్ ఇండియా" వర్చువల్ కన్సర్ట్‌లో పాల్గొంటున్నారు పలువురు సెలబ్రిటీలు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్, దర్శకురాలు జోయా అక్తర్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. దీని ద్వారా వచ్చే డబ్బును కోవిడ్ రెస్పాన్స్ ఫండ్ కోసం విరాళంగా ఇవ్వనున్నట్లు గివ్ ఇండియా సంస్థ పేర్కొంది. ఈ కార్యక్రమంలో హాలీవుడ్‌తోపాటు బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఈ లిస్టులో స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కూడా ఉన్నారు. అయితే షారుఖ్ లైవ్ కన్సర్ట్‌లో పాల్గొంటున్న సమయంలో ఓ గమ్మత్తైన విషయం చోటు చేసుకుంది. షారుక్ పాట అందుకున్న కాసేపటికే కొడుకు అబ్రామ్ ఖాన్ చేరాడు. ఇంకేముందీ.. తండ్రీకొడుకులిద్దరూ కలిసి ఆనందంగా స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేశారు. (కరోనాకి అంత సీన్ లేదు!) ఈ పాట మొత్తం కూడా లాక్డౌన్లో ఏం జరుగుతుందో వివరిస్తూ సాగుతుంది. ఇక సాంగ్ పూర్తవగానే అబ్రామ్ను గట్టిగా హత్తుకుని లాలనగా ముద్దు పెట్టుకుంటాడు. అనంతరం మరో పాట పాడతానని రెడీ అవుతుండగా ఆ బుడ్డోడు వచ్చి పప్పా, ఇక చాలు ఆపుతావా.. అని చెప్పాడు. దీంతో ఎందుకొచ్చిన తంటాలే అని హీరో సైతం తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. దీనికి సంబంధించిన క్లిప్పింగ్‌ను షారుఖ్ ట్విటర్లో షేర్ చేశాడు. ఈ వీడియోలో హీరో "అంతా బాగవుతుంది.." అని చెప్పిన వ్యాఖ్యలు నిజమవుతాయంటూ ఆయన అభిమానులు ఆశాభావంతో కామెంట్లు చేస్తున్నారు. నిజానికైతే సైనీ రాజ్ రచించిన ఈ పాటను మనీ హేస్ట్ అద్భుతంగా ఆలపించాడు. దీనికి ర్యాపర్ బాద్షా సంగీతం రూపొందించాడు. "ఐ ఫర్ ఇండియా" లైవ్ కన్సర్ట్‌లో టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా పాల్గొన్నాడు. ఈ కార్యక్రమం ద్వారా మూడున్నర కోట్లకు పైగా విరాళాలను సేకరించారు. (అడ్డు తప్పుకోండి: అబ్రామ్ అసహనం!) -
‘ఓటింగ్‌కి.. బోటింగ్‌కి తేడా తెలీడం కోసం తీసుకొచ్చా’
వాణిజ్య రాజధాని ముంబైతో సహా దేశవ్యాప్తంగా 71 నియోజకవర్గాల్లో సోమవారం నాలుగో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలో సినీ, వ్యాపార ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో బాద్షా షారుక్ ఖాన్ దంపతులు కూడా ఉన్నారు. అయితే ఓటు వేయడానికి వచ్చేటప్పుడు తమతో పాటు ఐదేళ్ల తన కుమారుడు అబ్రాంను కూడా పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చారు షారుక్. ఈ విషయంపై స్పందిస్తూ ‘మా చిన్నారికి ఓటింగ్‌కు.. బోటింగ్‌కు తేడా తెలీక ఇబ్బంది పడుతున్నాడు. ఈ విషయం గురించి తనకు పూర్తిగా అర్థం కావడం కోసమే ఇలా తీసుకొచ్చాం’ అంటూ ట్వీట్ చేశారు షారుక్. దాంతో పాటు భార్య, కొడుకు అబ్రాంతో కలిసి ఉన్న ఫోటోను కూడా షేర్ చేశారు. షారుక్ ఖాన్ తన కుటుంబంతో కలిసి ముంబైలోని బాంద్రాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. Little one was a bit confused between ‘Boating’ and Voting, so took him along to experience the difference. pic.twitter.com/8X6DsTP8bc — Shah Rukh Khan (@iamsrk) April 29, 2019 -
మగ బాస్
తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమాల్లో ఎప్పటికీ నిలిచిపోయే సినిమాల జాబితాలో ఉండే ఓ సూపర్‌హిట్ సినిమాలోని సన్నివేశాలివి. ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం... ఆఫీస్‌లో కొత్తమ్మాయి చేరింది. హారిక. అందరూ పరిచయం చేసుకున్నారు. అభిరామ్ రాగానే హారిక అతనితో మాట కలుపుతూ పరిచయం చేసుకోబోయింది. అభిరామ్ కోపంగా చూశాడు. తాను కొత్తగా జాయిన్ అయిన అసిస్టెంట్ మేనేజర్ని అని చెప్పుకుంది. అభిరామ్ ఆ ఆఫీస్‌లో మేనేజర్. ఆ పదవి విషయం అలా ఉంచితే, నిజానికి అతనిదే ఆ సంస్థ. రావడమే ఆమెతో మాట్లాడటం ఏమాత్రం ఇష్టం లేని వాడిలా తన క్యాబిన్‌కు వెళ్లిపోయాడు. అసిస్టెంట్ మేనేజర్‌గా ఒకమ్మాయి తన ఆఫీసులో పనిచేయడం అభికి ఇష్టం లేదు. ఈ విషయమ్మీద ఇంట్లో తన బాబాయ్‌తో గొడవ పడ్డాడు కూడా. ఆ పదవికి అనే కాదు, తన ఆఫీసులో ఏ పనీ అమ్మాయిలు చెయ్యడం అతనికి నచ్చదు. ఆఫీసు నుంచి బయటికెళ్లినా అమ్మాయిలను చూస్తే విసుక్కుంటాడు. వాళ్లతో మాట్లాడాలంటేనే చిరాకు. అదొక వింత జబ్బు అని అందరూ తిట్టుకుంటూ ఉంటారు. అలా తిట్టుకుంటున్నా బాస్ అన్న కారణంతో సుబ్బారావు తన పెళ్లికి అభిని పిలవడానికి వచ్చాడు – ‘‘మీ ఆశీర్వాదం కావాలి సార్!’’ అన్నాడు. ‘‘పుట్టినరోజా?’’‘‘రేపు నా పెళ్లి సార్!’’‘‘పెళ్లా.. ఎందుకు?’’ అరిచినట్టు అడిగాడు అభి. ‘‘ఎవరైనా పెళ్లంటే ఎప్పుడు అని అడుగుతారు. మీరేంటి సార్ ఎందుకు అని అడుగుతున్నారు?’’ ‘‘అందుకే అడుగుతున్నాను. ఎందుకు?’’‘‘భోజనానికి కష్టమైపోతోంది సార్!’’‘‘కుక్‌ని పెట్టుకో..’’ ‘‘ఇల్లు చూస్కోవడానికి కూడా ఎవ్వరు లేరు సార్..’’‘‘కుక్కని పెంచుకో..’’‘‘ఇప్పటికిప్పుడు కట్నమిచ్చే కుక్క ఎక్కడ దొరుకుతుంది సార్?’’‘‘సెటైరా?’’‘‘మీతో సెటైరేస్తే రిటైరైపోతానని తెలుసు సార్’’ ‘‘ఎన్నైనా చెప్పు సుబ్బారావు.. నువ్వు పెళ్లి చేస్కోవడం నాకిష్టం లేదయ్యా!’’ అభి మాట్లాడుతూ పోతున్నాడు. అతనికి పెళ్లెందుకు ఇష్టం లేదంటే మళ్లీ కారణం ఒక్కటే, అమ్మాయిలంటే అతనికి కోపం. అతనికి ఆ కోపం రోజురోజుకీ ఎక్కువైపోతూనే ఉంది. హారిక అంటే ప్రత్యేకంగా కోపం లేకపోయినా ఆమెపై కూడా విసుక్కుంటున్నాడు, ఒక్కోరోజు ఒక్కో కారణంతో. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు హారిక తన పెళ్లి కుదిరిందంటూ ఆఫీస్‌లో అందరికీ స్వీట్లు పంచుతోంది. ‘‘బాస్‌కి ఈ విషయం చెప్పారా?’’ హారికను అడిగింది ఒక కలీగ్. ‘‘ఆయనకా? పెళ్లిళ్లు కుదరడం, ఇండియా క్రికెట్ మ్యాచ్ గెలవడం.. ఇలాంటి శుభవార్తలు అలాంటి వాళ్లకు చెప్పకూడదు..’’ ‘‘చెప్తే ఏడుస్తాడు.’’‘‘అహా! వాడు ఏడ్చే టైప్ కాదు.. ఏడిపించే టైపు..’’ హారిక గట్టిగా నవ్వుతూ ఈ మాటన్నప్పుడు అక్కడికి వచ్చాడు అభి. ‘‘నా గురించి అంత కరెక్ట్‌గా ఎలా చెప్పగలిగావు?’’ హారిక మౌనంగా నిలబడింది. అభి మాట్లాడుతూ పోతున్నాడు – ‘‘ఇది ఆఫీసా పుల్లారెడ్డి స్వీట్షాపా.. నీకు నెలకు ముప్ఫై వేలు జీతం. రోజుకి వెయ్యి రూపాయలు. ఇలా రోజూ గంటసేపు స్వీట్లు పంచిపెడుతూ, ఇంకో గంట దాని టేస్టుగురించి మాట్లాడుతూ టైమ్ వేస్ట్ చేస్తే.. నీ జీతం నీకు వచ్చేస్తుంది. కానీ మాకు బోలెడంత లాస్ వస్తుంది. ఆ లాస్‌తో పాటు మా మీద జోకులు, సెటైర్లు... అసలు నిన్ను కాదులే.. నీలాంటివాళ్లను వెతికి మరీ తీసుకొచ్చాడే, అందుకు మా బాబాయ్‌ని అనాలి. ఇన్నాళ్లూ నీకు పని రాదనుకున్నాను. కానీ ఇప్పుడర్థమైంది.. అసలు నువ్వు పనికిరావు’’.ఆఫీస్‌లో అందరిముందూ డస్ట్‌బిన్‌తో హారికను పోల్చాడు అభి. హారిక అక్కడే, ఆ అందరిముందే ఏడ్చేసింది. ఆ తర్వాత పదో నిమిషం.. ‘‘నా రిసిగ్నేషన్ లెటర్ సార్’’ అంటూ చైర్మన్ క్యాబిన్లో నిలబడింది. ‘‘ఏమైందమ్మా? ఏంటి ప్రాబ్లమ్?’’ ‘‘మీ అబ్బాయి సార్! మొదట్లో ఆయన నన్ను తిడుతుంటే నా పని నచ్చలేదేమో అనుకున్నా సార్. కానీ నేనే నచ్చలేదు. నెలకోసారి జీతమిస్తున్నారు కదాని, గంటకోసారి తిడితే పడే ఓపిక నాకు లేదు సార్..’’‘‘వాడి ప్రవర్తన నచ్చక రిజైన్ చేస్తున్నానని చెప్పావు. కానీ వాడెందుకలా బిహేవ్ చేస్తున్నాడో చెప్పలేదు.’’ ‘‘నాకు తెలీదు సార్!’’ ‘‘నాకు తెలుసు. నీకు వాడు రెణ్నెల్ల నుంచి మాత్రమే తెలుసమ్మా! కానీ నాకు వాడు రెండేళ్ల వయసప్పటి నుంచి తెలుసు. ఇప్పుడు మీరు చూస్తున్న అభి అభి కాదమ్మా! వాడు వేరు. వాడి కోపం ప్రళయం. వాడి ప్రేమ సముద్రం. వాడి జాలి వర్షం..’’ అభిరామ్ గతాన్ని చెబుతూ వచ్చాడు బాబాయ్. అభిరామ్ గతాన్నంతా తెలుసుకున్నాక హారిక ఒక్క మాట మాట్లాడకుండా అభిరామ్ బాబాయ్‌నే చూస్తూ కూర్చుంది. ఆమె కళ్లలో నీళ్లు. ‘‘నేను నీకు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. నువ్వు వాడ్ని గౌరవించకపోయినా ఫర్వాలేదు. అసహ్యించుకుంటే మాత్రం నేను తట్టుకోలేను.’’ చివరగా ఈ మాట చెప్పి ముగించాడు బాబాయ్. చైర్మన్ క్యాబిన్లోంచి హారిక బయటకు రావడం కోసం ఎదురుచూస్తున్నాడు అభి. కచ్చితంగా ఆమెను ఉద్యోగం నుంచి తప్పించి ఉంటారన్న నమ్మకంతో సుబ్బారావుతో కబుర్లు చెబుతూ ఎదురుచూస్తున్నాడు. హారిక వచ్చింది. ‘‘నాకు ప్రమోషన్ ఇచ్చారు’’ అంటూ అభి చేతిలో ఒక లెటర్ పెట్టింది. ‘‘ప్రమోషనా? బాబాయ్ నిన్ను సస్పెండ్ చెయ్యలేదా?’’ అమాయకంగా అడిగాడు అభి.‘‘మేనేజర్‌గా ప్రమోట్ చేశారు.’’‘‘మేనేజర్గానా? మరి నేను?’’‘‘మిమ్మల్ని సస్పెండ్ చేశారు.’’ ‘‘నన్నా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు?’’ ‘‘ఎక్కువ షాకవ్వద్దు. ఆ లెటర్ చదువుకోండి’’ అంది హారిక. తాను సస్పెండ్ అయినట్టు ఆ లెటర్ చదువుకొని ఎగిరిపడ్డాడు అభిరామ్. ఇంట్లో బాబాయ్‌తో గొడవపడితే హారిక వదిలేసిన అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ఒక్కటే మిగిలింది అతనికి. బాబాయ్‌తో హారిక ఏం మాట్లాడిందో తెలియని, హారికకు తన గతం తెలిసిందని తెలియని అభిరామ్, ఇప్పుడామె కింద పనిచెయ్యాలి. -
విమానంలో పిల్లోడి పుట్టిన రోజు
రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు.. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తన చిన్న కొడుకు అబ్రామ్ మూడో పుట్టినరోజు వేడుకలను విమానంలో చేశాడు. తన పిల్లలు సుహానా, అబ్రాంలతో కలిసి విదేశాలకు వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు వాళ్లిద్దరి ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. పిల్లలను 'మినియన్స్' అని సరదాగా పిలుచుకుంటాడు కింగ్ ఖాన్. ''నా ఇద్దరు మినియన్లతో కలిసి ఇండియాకు తిరిగొస్తూ విమానంలోనే బర్త్‌డే వేడుకలు చేసుకుంటున్నాం. మాకు ఎవరైనా కేక్ తెచ్చిస్తే బాగుండు.. లేకపోతే కిండర్ ఎగ్స్ చేయాల్సి ఉంటుంది'' అని ట్వీట్ చేశాడు. సరొగసీ పద్ధతి ద్వారా 2013 మే 27న అబ్రామ్ పుట్టిన సంగతి తెలిసిందే. షారుక్‌కు అంతకుముందే ఆర్యన్, సుహానా అనే ఇద్దరు పిల్లలున్నారు. Birthday celebrations on the plane to India with 2 of my Minions. Hope we get a cake…otherwise Kinder eggs will have to do. — Shah Rukh Khan (@iamsrk) 26 May 2016 -
గోవా బీచ్‌లో కొడుకుతో హీరో షికార్లు
ఆ కుర్రాడి వయసు రెండున్నరేళ్లు. కానీ అప్పుడే గోవా బీచ్‌లలో షికార్లు కొడుతున్నాడు. మీడియాలో హల్చల్ చేస్తున్నాడు. అతడెవరో కాదు.. అబ్రామ్. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ చిన్న కొడుకు. నిన్న కాక మొన్న గుజరాత్లో కొడుకుతో సరదాగా కింద కూర్చుని సందడి చేసిన షారుక్.. ఇప్పుడు అతగాడిని గోవా బీచ్‌కి తీసుకెళ్లి అక్కడ క్వాడ్ బైక్ ఎక్కించి తిప్పుతూ కావల్సినంత వినోదాన్ని అందించాడు. అబ్రాం కూడా ఆ రైడ్‌ను ఎంతో ఆస్వాదించాడు. చక్కగా నల్లటి టోపీ పెట్టుకుని ఆ బైక్ మీద కూర్చుని కనిపించాడు. పనిలో పనిగా మీడియా ఫొటోగ్రాఫర్లు కూడా వాళ్లిద్దరినీ వెంటనే తమ కెమెరాలలో బంధించారు. కొంతమంది షారుక్ అభిమానులు ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కాగా, ఇంతకుముందు అబ్రాంతో ఐశ్వర్యారాయ్ కూతురు ఆరాధ్య కలిసి నటిస్తే బాగుంటుందని కూడా కామెంట్లు వచ్చాయి. వాటికి ఆరాధ్య తాత అమితాబ్ బచ్చన్ ఎంతగానో పొంగిపోయారు. భవిష్యత్తులో వాళ్లిద్దరూ కలిసి నటిస్తామంటే.. తాను సపోర్ట్ చేస్తానని చెప్పారు. -
షారుక్ కొడుకు, ఐశ్వర్య కూతురు కలిసి నటిస్తే!
అందాల తార ఐశ్వర్యారాయ్ నోట్లోంచి ఊడి పడినట్లుండే ఆరాధ్యా బచ్చన్ ఇప్పటికే పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. గట్టిగా నాలుగేళ్లు ఉన్నాయో లేవో.. అప్పుడే ఆమె వెండితెర ప్రవేశం గురించిన చర్చలు మొదలైపోయాయి. అలాగే.. షారుక్ ఖాన్ కొడుకు అబ్రామ్ గురించి కూడా వినిపిస్తున్నాయి. నిజానికి బాలీవుడ్లో బాగా సెలబ్రిటీలుగా మారిపోయిన పిల్లలు ఎవరంటే వీళ్లిద్దరే. భవిష్యత్తులో వీళ్లిద్దరూ ఆన్‌స్క్రీన్ మీద మంచి జంట అవుతారని షారుక్ ఇప్పటినుంచే కలలు గంటున్నాడు. సీనియర్ బచ్చన్ అమితాబ్ కూడా దానికి సై అంటున్నారు. ఇటీవల దిల్వాలే సినిమా ప్రమోషన్ సందర్భంగా షారుక్ మాట్లాడుతూ, స్క్రీన్ మీద తాను- కాజోల్ మంచి జంట అని, భవిష్యత్తులో అబ్రామ్ - ఆరాధ్య మంచి జంట అవుతారని అన్నాడు. ఈ మాట విని ఆరాధ్య తాత అమితాబ్ బచ్చన్ ఉప్పొంగిపోయారట. నిజంగా షారుక్ ఆ మాట అని ఉంటే ఆయన నోట్లో నెయ్యి, చక్కెర, పాల మీగడ అన్నీ వెయ్యాలని అన్నారు. అంటే, పెద్దాయన కూడా పచ్చజెండా ఊపేశారన్న మాట. వజీర్ సినిమా గురించి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కొసమెరుపు: ఐశ్వర్యా రాయ్ కూతురు ఆరాధ్యా బచ్చన్ (4) కంటే.. షారుక్ ఖాన్ కొడుకు అబ్రామ్ (2) రెండేళ్లు చిన్నవాడు. -
షారుక్ కుమారున్ని కలిసిన 'ఛోటా భీమ్'
ముంబై: బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు అబ్రామ్ కోరిక నెరవేరింది. అబ్ రామ్‌కి ఎంతగానో ఇష్టమైన 'ఛోటాభీమ్' క్యారెక్టర్ సృష్టికర్త గ్రీన్ గోల్డ్ యానిమేషన్ సీఈఓ రాజీవ్ చిలకను తన నివాసంలో కలుసుకున్నాడు. రాజీవ్, షారుక్ కుమారుడి కోసం ఒక బొమ్మను గిఫ్ట్ గా తీసుకువచ్చాడు. పిల్లలు ఛోటా భీమ్ కార్యక్రమాన్ని ఎంతగానో ఇష్టపడుతున్నారని షారుక్ తెలిపారు. మరోవైపు ఛోటా భీమ్ కార్యక్రమం పిల్లలు చూడవలసిన ఒక మంచి కార్యక్రమమని నటి కాజల్ కూడా ప్రశంసించారు. రాజీవ్ తదుపరి కార్టూన్ ప్రోగ్రామ్ 'చోటాభీమ్-హిమాలయన్ ఆడ్వెంచర్' జనవరి 8న విడుదల కానుంది. సరోగసి ద్వారా షారుఖ్ అబ్‌రామ్‌కు తండ్రి అయిన విషయం తెలిసిందే. చోటాభీమ్, మోగ్లీ కార్యక్రమాలంటే అబ్రామ్ కు ఎంతో ఇష్టమని ఇది వరకే షారుఖ్ తెలిపిన విషయం విధితమే. -
'ఆమెతో నటించడం వాడికి ఇష్టం లేదు'
ముంబై: షారూఖ్ ఖాన్- కాజోల్ జోడికి సినీ అభిమానులంతా నీరాజనాలు పడుతుంటే ఓ బుడతడికి మాత్రం ఈ జంట నచ్చలేదట. ఈ చిన్నారి ఎవరో కాదు షారూఖ్ ముద్దులకొడుకు అబ్ రామ్. కాజోల్ తో తాను కలిసి నటించడం తన చిన్న కొడుకు ఇష్టపడడం లేదని స్వయంగా షారూఖ్ వెల్లడించాడు. తమ జోడి అతడికి నచ్చలేదని తెలిపాడు. ఐదేళ్ల తర్వాత 'దిల్ వాలే' కోసం షారూఖ్, కాజోల్ కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా షారూఖ్ మాట్లాడుతూ.. కొన్ని సీన్లు అబ్ రామ్ కు నచ్చలేదని తెలిపాడు. ముఖ్యంగా కాజోల్ కారణంగా తాను గాయపడే సీన్ అసలు నచ్చలేదని చెప్పాడు. ఈ కారణంగానే కాజోల్ తో తాను నటించడాన్ని ఒప్పుకోవడం లేదని, తమ జోడి రెండేళ్ల తన కొడుక్కి నచ్చలేదని వివరించారు. అబ్ రామ్ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయబోనని చెప్పారు. తన కంటే అబ్ రామస్ ఫేమస్ అయిపోతున్నాడని, అందుకే అతడి ఫొటోలో ట్విటర్ లో పెట్టడడం లేదని సరదాగా అన్నారు. బాలీవుడ్ లో షారూఖ్- కాజోల్ జోడి మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫెయిర్ గా పేరుగాంచింది. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు వియవంతమయ్యాయి. వీరిద్దరూ చివరిసారిగా 2010లో 'మై నేమ్ ఈజ్ ఖాన్' సినిమాలో నటించారు. -
అబ్ రామ్ తో కలిసి దీపికకు నటించాలని ఉందట: షారుక్
ముంబై: బాలీవుడ్ తెరపై హ్యాపీ న్యూఇయర్ చిత్రం ద్వారా షారుక్ ఖాన్ చిన్న కుమారుడు అబ్ రామ్ ఎంట్రీ అందర్ని ఆకట్టుకుంటోంది. హ్యపీ న్యూ ఇయర్ చిత్ర ముగింపులో వచ్చే టైటిల్స్ లో అబ్ రామ్ కనిపించి.. ప్రేక్షకులను ఆలరించారు. అబ్ రామ్ ఎంట్రీపై చాలా మంది నుంచి ప్రశంసలు వచ్చాయి. అయితే దీపికా పదుకొనే ప్రశంస మాత్రమే ది బెస్ట్ అని షారుక్ అన్నారు. ఈ చిత్రంలో అబ్ రామ్ చూడ ముచ్చటగా ఉన్నాడని, తదుపరి చిత్రంలో అబ్ రామ్ తో కలిసి నటించాలని ఉందని దీపికా చెప్పిందని హ్యపీ న్యూఇయర్ చిత్ర సక్సెస్ మీట్ లో మీడియాకు షారుక్ తెలిపారు. తనకు పిల్లలతో కలిసి ఆడుకోవడం ఇష్టమని, తాను, ఆర్యన్ కలిసి వీడియో గేమ్స్ తోపాటు ఫుట్ బాల్, క్రికెట్ ఆడుకుంటామని షారుక్ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా 6 వేల థియేటర్లలో విడుదలైన హ్యపీ న్యూ ఇయర్ చిత్రం వారాంతంలో 108 కోట్లు రూపాయలు వసూలు చేసి రికార్డులను తిరగరాస్తోంది. Follow @sakshinews -
బాలీవుడ్ లోకి అబ్ రామ్ ఎంట్రీ అలా జరిగింది: షారుక్
న్యూఢిల్లీ: బాలీవుడ్ లో అబ్ రామ్ ఎంట్రీపై షారుక్ ఖాన్ సంతోషం వ్యక్తం చేశారు. హ్యాపీ న్యూఇయర్ విజయం కంటే తన చిన్న కుమారుడు అబ్ రామ్ తెరమీద కనిపించడమే తనకు అత్యంత సంతోషాన్ని కలిగిస్తోందని షారుక్ అన్నారు. అబ్ రామ్ తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నించిన దర్శకురాలు ఫరాఖాన్ కే ఆ క్రెడిట్ దక్కుంతుందని షారుక్ తెలిపారు. షూటింగ్ లో బిజీగా ఉండటం ద్వారా తాను ఎక్కువగా అబ్ రామ్ తో గడపలేకపోయాను. అయితే ఓ రోజు అబ్ రామ్ స్టూడియోకు వచ్చాడు. డాన్స్ స్టేజ్ పై కూర్చుని వాడితో డాన్స్ చేశాను. అబ్ రామ్ తో డాన్స్ చేయడం చూసిన ఫరా.. షూటింగ్ చేయాలా అని తనను అడిగింది. వెంటనే నేను ఓకే అని చెప్పడంతో ఆ సన్నివేశాన్ని ఫరా షూట్ చేసింది. అలా అబ్ రామ్ అనుకోకుండా బాలీవుడ్ తెరమీద ఎంట్రీ ఇచ్చాడు అని షారుక్ ఐఏఎన్ఎస్ కిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. హ్యపీ న్యూ ఇయర్ చిత్రంలో ఎండ్ టైటిల్స్ లో షారుక్ తో కలిసి అబ్ రామ్ కనిపిస్తాడు. సర్రోగసి ద్వారా ఇటీవల షారుక్ దంపతులు అబ్ రామ్ కు జన్మనిచ్చారు. అబ్ రామ్ జననానికి లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారనే అంశం వివాదస్పదమైన సంగతి తెలిసిందే. -
కొడుకు ఫొటో ట్వీట్ చేసిన బాద్షా
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తన కొడుకు అబ్రం ఫొటోను ఎట్టకేలకు ప్రజలకు చూపించాడు. ట్విటర్ ద్వారా అందరికీ ఆ ఫొటోను షేర్ చేశాడు. ఈద్ ముబారక్ అంటూ.. పండుగ శుభాకాంక్షలు తెలిపాడు. ఈ ఫొటోలో 48 ఏళ్ల షారుక్ ఖాన్ తన కొడుకును ఎత్తుకుని ముద్దాడుతున్నట్లు ఈ ఫొటోలో ఉంది. అందులో సారుక్ నల్ల టీషర్టు వేసుకుంటే పిల్లాడు మాత్రం తెల్ల దుస్తులు వేసుకుని తన బొమ్మల వైపు దూకుతుంటాడు. 'అందరికీ ఈద్ అల్ అదా ముబారక్. జీవితంలో అందరికీ సంతోషం కలుగు గాక. ఈ చిన్న పిల్లాడు కూడా మీకు శుభాకాంక్షలు అందజేస్తున్నాడు' అని తన ట్విటర్, ఫేస్బుక్ పేజీలలో షారుక్ పోస్ట్ చేశాడు. గత సంవత్సరం మే నెలలో సరొగసీ పద్ధతి ద్వారా షారుక్, గౌరీ దంపతులు అబ్రాంను తమ జీవితంలోకి తెచ్చుకున్నారు. ఇంతకుముందు వాళ్లకు ఆర్యన్ (17) అనే కొడుకు, సుహానా (14) అనే కూతురు ఉన్నారు. Eid Al Adha Mubarak to everyone. May all have the happiness that life has to offer.The littlest one wishes you too. pic.twitter.com/GzaumkwSE3 — Shah Rukh Khan (@iamsrk) October 6, 2014 -
చిన్న పిల్లాడు.. వదిలేయండి
తన చిన్న కుమారుడు అబ్రామ్ గురించి కూడా సినీపత్రికల్లో రావడంపై సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ అసంతృప్తితో ఉన్నాడు. వాడు చిన్నవాడని, అప్పుడే సినీ మాయాప్రపంచంలోకి రావడం ఇష్టం లేదని కుండబద్దలు కొట్టాడు. సరోగసి (అద్దెగర్భం) విధానం ద్వారా షారుఖ్ దంపతులకు గత మేలో అబ్రామ్ జన్మించడం తెలిసిందే. ‘వాడి గురించి అప్పుడే చర్చలు మొదలవడం నాకు కొంచెం కూడా ఇష్టం లేదు. మీకు (మీడియా) అనుమతి దొరికితే మా ఇంటికి వచ్చి వాడిని చూడండి. అంతేతప్ప కెమెరా ఫ్లాష్‌లతో మాత్రం ఇబ్బందిపెట్టవద్దు. నేను ఇది వరకే సినిమా సర్కస్‌లో ఉన్నాను. అతణ్ని కూడా ఇందులోకి లాగొద్దు’ అని షారుఖ్ విజ్ఞప్తి చేశాడు. గర్భం దాల్చిన మహిళ ఏడో నెలలోనే అబ్‌రామ్‌కు జన్మనివ్వడంతో మొదట అతడు అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో చాలా కాలంపాటు ఆస్పత్రిలోనే ఉన్నాడు. అప్పుడు కూడా అతని ఆరోగ్యం, పుట్టుక గురించి కూడా పత్రికల్లో వార్తలు రావడంపై ఎంతో కలత చెందానని ఎస్ఆర్కే అన్నాడు. ‘నేను సినీనటుణ్ని. ఏదైనా కోపముంటే నాపై చూపండి. నా పిల్లల జోలికి రాకండి’ అని స్పష్టం చేశాడు. పిల్లవాడిని ఎందుకు బయటికి తీసుకురావడం లేదంటూ ఎవరైనా ప్రశ్నిస్తే తనకు బాధగా అనిపిస్తుందన్నాడు. అబ్రామ్ పుట్టకముందే తల్లికి లింగనిర్ధారణ పరీక్షలు చేసినట్టు వార్తలు రావడం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నిపుణుల బృందం షారుఖ్ ఇంటికి వచ్చి విచారణ జరిపింది. అయితే తాము ఎలాంటి పరీక్షలూ నిర్వహించలేదని షారుఖ్ చాలాసార్లు వివరణ ఇచ్చాడు. ‘నేనూ చదువుకుణ్ని వాడినే. ఇలాంటివి ఎందుకు చేస్తాను ? అబ్రామ్ షారుఖ్ కొడుకు కాబట్టే ఇన్ని వివాదాలు సృష్టించారు’ అంటూ బాధపడ్డాడు. అయితే అబ్రామ్ ఎంతో అందంగా ముద్దుగా ఉంటాడని, అతడి రాకతో తమ కుటుంబం మరింత సంతోషంగా ఉందన్నాడు. -
పబ్లిక్ లైఫ్ ఓ సర్కస్..మీడియాపై షారుక్ మండిపాటు
ముంబై: సర్కస్ లాంటి ప్రజా జీవితంలో తన కుమారుడు అబ్ రామ్ భాగం కానివ్వనని బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ వ్యాఖ్యలు చేశారు. గత సంవత్సరం సర్రోగసి పద్దతి ద్వారా షారుక్ దంపతులకు అబ్ రామ్ జన్మించిన సంగతి తెలిసిందే. అబ్ రామ్ ను బయటకు తీసుకు వెళ్లడానికి తనకు ఇష్టం ఉండదు. ఓకవేళ తాను ఇంట్లోకి రావడానికి అనుమతిస్తే వచ్చి చూడండి అంటూ తీవ్రంగా స్పందించారు. ఫ్లాష్ లైట్ల కోసమే అబ్ రామ్ లేడని.. సర్కస్ లాంటి పబ్లిక్ జీవితంలో భాగస్వామిని చేయబోనని ఓ వార్తా ఏజెన్సికిచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. 34 వారాలకే పట్టిన తన కుమారుడు అనారోగ్యానికి గురై ఎక్కువ కాలం ఆస్పత్రిలోనే ఉన్నాడు. ఆసమయంలో కేరీర్ లో ఎప్పుడూ ఎదర్కోనంతగా అత్యంత క్లిష్టమైన పరిస్థితి, క్షణాల్ని ఎదుర్కొన్నాను. అనారోగ్యానికి గురైన పసిపిల్లాడి జీవితంతో మీడియా ఓ సమస్యగా చిత్రీకిరించింది. ఆ సంఘటనలు అసౌకర్యాన్ని కలిగించడమే కాకుండా.. అగౌరవపరిచాయని షారుక్ ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఓ సినీ నటుడ్ని కావాలంటే నాతో అమర్యాదగా ప్రవర్తించండి.. నాపిల్లలతో కాదు అంటూ షారుక్ ఘాటుగా స్పందించారు. ఒకవేళ నా కుమారుడు అబ్ రామ్ తో బయటకు రావాలనిపించినపుడు తప్పకుండా ప్రజా జీవితంలోకి తీసుకువస్తాను అని అన్నారు. -
షారుక్ ఖాన్ కేసులో జోక్యం చేసుకోం: బాంబే హైకోర్టు
బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ పై నమోదైన కేసులో తాము జోక్యం కలిగించుకోబోమని బాంబే హైకోర్టు సోమవారం స్సష్టం చేసింది. అద్దె గర్బం ద్వారా జన్మించిన తమ కుమారుడు అబ్ రామ్ కు లింగ నిర్ధారణ పరీక్షలు చేశారనే ఆరోపణలపై షారుక్, ఆయన భార్య గౌరీ ఖాన్ లపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముందస్తు విచారణ చేపట్టాలని సామాజిక కార్యకర్త వర్ష దేశ్ పాండే దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ సాధన జాదవ్ విచారించారు. ఈ కేసులో ఆగస్టు 8 తేదిన ప్రతివాదులకు ఆగస్టు 8 తేదిన నోటీసులు జారీ చేసి సెప్టెంబర్ 12న విచారణకు హాజరుకావాలని తెలిపారు. అయితే సెప్టెంబర్ 12 కంటే ముందే విచారణ చేపట్టాలని దేశ్ పాండే బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రి కన్సెప్షన్ అండ్ ప్రీ నటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ (పీసీపీఎన్ డీటీ) యాక్ట్ కింద కేసులను ఆరు నెలలోపే విచారణ ముగించాలని ఇచ్చిన సుప్రీం కోర్టు ఆదేశాలను దేశ్ పాండే మీడియాకు వివరించారు. -
‘అబ్రామ్’ మీడియాకు దూరంగా ఉండటమే మంచిది : షారుక్
‘ఈ రంజాన్ పండగ చాలా ప్రత్యేకమైనది’ అని ముంబైలోని తన నివాసం 'మన్నత్' లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ అన్నాడు. రంజాన్ పండగ రోజు తాను నటించిన చెన్నై ఎక్స్‌ప్రెస్ విడుదలతోపాటు..ఓ అద్బుతమైన చిన్నారి అబ్రామ్ తమ కుటుంబంలోకి రావడం చాలా ఆనందంగా ఉంది అని అన్నాడు. ఇలాంటి ఆనందక్షణాలు తనకు మరింత ఉత్సాహాన్ని అందిస్తున్నాయని, గత తొమ్మిది రోజులుగా చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్ర ప్రమోషన్లో బిజీగా ఉండటం కారణంగా తాను సరిగా నిద్ర కూడా పోలేదని, అయినా తాను చాలా ఎనర్జిటిక్ ఉన్నానని అన్నారు. మే 27 తేదిన సర్రోగసి ద్వారా షారుఖ్ ఓ బిడ్డకు తండ్రి అయిన విషయం తెలిసిందే. సర్రోగసి వివాదం షారుక్‌ను ఇంకా వెంటాడుతున్నట్టే కనిపిస్తోంది. తన కుమారుడు అబ్రామ్ను మీడియా ప్రపంచానికి దూరంగా ఉంచాలని అనుకుంటున్నానని.. అంతకంటే ఎక్కువగా మాట్లాడదలచుకోలేదని అని అన్నాడు. ఇప్పటికే అబ్రామ్పై చాలామంది ఎక్కువగానే మాట్లాడారని, అయితే ఆ సమయంలో అసత్యాలు మాట్లాడుకోవడం కాస్తా బాధేసింది అని అన్నాడు. తన జీవితంలోకి ప్రవేశించిన చిన్నారిపై అవాస్తవాలు మాట్లాడటంతో మానసిక క్షోభ అనుభవించానన్నారు. తన కుమారుడు అబ్రామ్ గురించి కాని, ఆరోగ్యం గురించి కాని మాట్లాడటానికి నిరాకరించాడు.