అబ్ రామ్ తో కలిసి దీపికకు నటించాలని ఉందట: షారుక్
అబ్ రామ్ తో కలిసి దీపికకు నటించాలని ఉందట: షారుక్
Published Tue, Oct 28 2014 2:43 PM | Last Updated on Sat, Sep 2 2017 3:30 PM
ముంబై: బాలీవుడ్ తెరపై హ్యాపీ న్యూఇయర్ చిత్రం ద్వారా షారుక్ ఖాన్ చిన్న కుమారుడు అబ్ రామ్ ఎంట్రీ అందర్ని ఆకట్టుకుంటోంది. హ్యపీ న్యూ ఇయర్ చిత్ర ముగింపులో వచ్చే టైటిల్స్ లో అబ్ రామ్ కనిపించి.. ప్రేక్షకులను ఆలరించారు. అబ్ రామ్ ఎంట్రీపై చాలా మంది నుంచి ప్రశంసలు వచ్చాయి. అయితే దీపికా పదుకొనే ప్రశంస మాత్రమే ది బెస్ట్ అని షారుక్ అన్నారు.
ఈ చిత్రంలో అబ్ రామ్ చూడ ముచ్చటగా ఉన్నాడని, తదుపరి చిత్రంలో అబ్ రామ్ తో కలిసి నటించాలని ఉందని దీపికా చెప్పిందని హ్యపీ న్యూఇయర్ చిత్ర సక్సెస్ మీట్ లో మీడియాకు షారుక్ తెలిపారు. తనకు పిల్లలతో కలిసి ఆడుకోవడం ఇష్టమని, తాను, ఆర్యన్ కలిసి వీడియో గేమ్స్ తోపాటు ఫుట్ బాల్, క్రికెట్ ఆడుకుంటామని షారుక్ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా 6 వేల థియేటర్లలో విడుదలైన హ్యపీ న్యూ ఇయర్ చిత్రం వారాంతంలో 108 కోట్లు రూపాయలు వసూలు చేసి రికార్డులను తిరగరాస్తోంది.
Follow @sakshinewsAdvertisement
Advertisement