దీపికాకు మనమందరం మద్దతుగా నిలువాలి: షారుక్ | We have to stand for Deepika Padukone: Shah Rukh Khan | Sakshi
Sakshi News home page

దీపికాకు మనమందరం మద్దతుగా నిలువాలి: షారుక్

Published Mon, Sep 15 2014 9:17 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

దీపికాకు మనమందరం మద్దతుగా నిలువాలి: షారుక్ - Sakshi

దీపికాకు మనమందరం మద్దతుగా నిలువాలి: షారుక్

ముంబై: వివాదస్సద కథనంపై ఓ ఆంగ్ల దినపత్రికకు ధీటైన సమాధానమిచ్చిన బాలీవుడ్ తార దీపికా పదుకొనెను షారుక్ ఖాన్ ప్రశంసించారు. పబ్లిక్ గా తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా, ధైర్యంగా చెప్పటం అందరికి సాధ్యం కాదని  షారుక్ అన్నారు. దీపికా చేసిన ట్వీట్ కు తాను సమర్ధిస్తున్నానని, అలాగే 'హ్యాపీ న్యూఇయర్' చిత్ర యూనిట్ మద్దతు కూడా ఉందని ఆయన అన్నారు. 
 
దీపికా చూపిన ధైర్యం మనలో అందరికి ఉండదని, కావున మనమందరం ఆమెకు మద్దతివ్వాలన్నారు. ఓ ఆంగ్ల దినపత్రిక కథనంపై స్పందిస్తూ.. నేను మహిళను, నాకు వక్షోజాలున్నాయి. అయితే మీకు వచ్చిన సమస్యేమిటి? అంటూ ఘాటుగా ట్విటర్ లో పోస్ట్ చేశారు.  దీపికా స్పందించిన విధానంపై దేశవ్యాప్తంగా మద్దతు లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement