Happy New Year
-
న్యూ ఇయర్ వేకేషన్లో లావణ్య- వరుణ్ తేజ్.. లండన్‌లో రకుల్ ప్రీత్ సింగ్ సెలబ్రేషన్స్
లండన్‌లో రకుల్ ప్రీత్ సింగ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్...న్యూ ఇయర్ వేకేషన్లో లావణ్య త్రిపాఠి- వరుణ్ తేజ్..2024 జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న రహస్య గోరఖ్..చిల్ అవుదామంటోన్న అనికా సురేంద్రన్...న్యూ ఇయర్ విషెస్ చెప్పిన నేషనల్ క్రష్ రష్మిక..కొత్త ఏడాది ఆలయంలో రాశీ ఖన్నా పూజలు.. View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Rahasya Kiran (@rahasya_kiran) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Lavanyaa konidela tripathhi (@itsmelavanya) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) -
కడియం నర్సరీలో వెరైటీగా.. హ్యాపీ న్యూ ఇయర్
2024కి వీడ్కోలు చెబుతూ.. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ తూర్పు గోదావరి జిల్లా కడియంలోని పల్లా వెంకన్న నర్సరీలో వేలాది మొక్కలతో ‘హ్యాపీ న్యూ ఇయర్ 2025’ అంటూ అక్షరాకృతులను మొక్కలతో అలంకరించారు.పల్లా వెంకన్న నర్సరీ రైతు పల్లా సత్యనారాయణమూర్తి (సత్తిబాబు) కుమారులు, నర్సరీ యువ రైతులు వెంకటేశ్, వినయ్ తీర్చిదిద్దిన ఈ ఆకృతుల మధ్య ఫొటోలు తీయించుకోవడానికి సందర్శకులు పోటీపడుతున్నారు. 50 మంది కార్మికులు 4 రోజుల పాటు శ్రమించి వేల మొక్కలతో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ మొక్కల కూర్పును సందర్శకుల కోసం జనవరి 18 వరకు నర్సరీలో ఉంచనున్నారు. వైజాగ్‌లో న్యూ ఇయర్ జోష్నూతన సంవత్సర వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ సంబరాలు చేసుకున్నారు. విశాఖపట్నం బీచ్‌లో నృత్యకారిణులు విభిన్నంగా కొత్త ఏడాది ఆగమనాన్ని స్వాగతించారు. వైజాగ్ నగరంలో చాలా ప్రాంతాల్లో న్యూ ఇయర్ జోష్ కనిపించింది. సెల్ఫీలు, ఫొటోలతో వైజాగ్ వాసులు సందడి చేశారు. ఆటపాటలతో హ్యపీ న్యూ ఇయర్ జరుపుకున్నారు. ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో గోదారి ‘కళ’కళలుకొత్తపేట: ఈ ఏడాది ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవంలో గోదారి ‘కళ’కళలు కనువిందు చేయనున్నాయి. అక్కడ జరిగే ‘జై మా భారతి నృత్యోత్సవం’లో పాల్గొనే అవకాశం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన 100 మంది గరగ నృత్యం కళాకారులకు లభించింది. గణతంత్ర వేడుకలకు దేశవ్యాప్తంగా 29 జానపద, 22 గిరిజన కళారూపాల ప్రదర్శనలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ ప్రదర్శనల్లో ప్రముఖ జానపద సంప్రదాయ ప్రదర్శనలుగా ఖ్యాతి పొందిన గరగ నృత్యం, వీరనాట్యం కళారూపాలకు కేంద్ర సాంస్కృతిక శాఖ అవకాశం కల్పించింది. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పలివెల గ్రామానికి చెందిన గరగ నృత్యం, వీరనాట్యం కళాకారుడు కొమారిపాటి ఏసు వెంకట ప్రసాద్ ఆధ్వర్యాన శివపార్వతి గరగ నృత్యం కళాకారులు 100 మంది డిసెంబర్ 28న ఢిల్లీ పయనమయ్యారు. చదవండి: బాబు నూతన సంవత్సర కానుక 'రూ.1.19 లక్షల కోట్ల అప్పు' -
ఇలా చేస్తే.. ఏడాదంతా సంతోషమే..!
కొత్త సంవత్సరం అనంగానే.. తొలి రోజున మిత్రులకు, పడనివారికి కూడా శుభాకాంక్షలు తెలిపి సంతోషంగా ఉంటాం. ఇలా విషెస్ చెప్పడమే కాదు ఈ ఏడాదంతా తిరుగలేని విజయం పొందేలా ఏ చేయాలో న్యూ ఇయర్(New Year) తొలిరోజే చక్కటి ప్లాన్ లేదా తీర్మానం(Resolutions) చేసుకుంటే సక్సెస్, సంతోషం రెండూ మీ సొంతం అవుతాయని చెబుతున్నారు నిపుణులు. ఆ ఒక్కే రోజుకే సంతోషం పరిమితం కాకుండా ఏడాదంతా సంతోషభరితంగా జీవతం సాగిపోవాలంటే.. ముఖ్యంగా వర్క్‌లైఫ్ బ్యాలెన్స్(Work life Balance) విషయంలో సరైన విధంగా బ్యాలెన్స్ చేయలేక తిప్పలు పడుతుంటారు. అలాంటివాళ్లు ఇంట బయట గెలవాలంటే..కొత్త ఏడాది తొలిరోజు నుంచే చక్కటి తీర్మానాలు సెట్‌చేసుకుని కనీసం పాటించే యత్నం చేస్తే విజయం తధ్యం అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఏం చేయాలంటే..వర్క్‌లైఫ్‌లో పై అధికారి ఇచ్చిన పనులు చేయండి. వర్క్‌లో లోపాలు ఎత్తిచూపిన సానుకూలంగా స్పందించండి. రిపీట్ కాకుండా చూసుకోండి. లేదు అవమానించేలా తప్పులను ఎత్తి చూపితే..సీరియస్‌గా తీసుకోండి. వాళ్లు మన తప్పులను పట్టుకునే అవకాశం ఎందుకిచ్చానా.. అని ఆలోచించండి. ఆ ఛాన్స్ ఇచ్చేదే లే..అన్నట్లు పట్టుదలగా వర్క్‌ని మెరుగుపరుచునే యత్నం చేయండి. అలాగే సహోద్యోగులు మీ గురించి బ్యాడ్‌గా మాట్లాడటం లేదా పై అధికారులకు ఫిర్యాదులు చేయడం వంటివి చేస్తే..టెన్షన్ పడొద్దు. మీ వద్దకు ఆ ఇష్యూ తీసుకొచ్చి పై అధికారి మాట్లాడేంత వరకు కూడా సంయమనం పాటించండి. ఒకవేళ ఆ ప్రస్తావన గురించి ప్రశ్నిస్తే..నిజాయితీగా సూటిగా మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఎక్కడ అహానికి తావివ్వద్దు. మీ నిజాయితీ వారు గుర్తించేలా మసులుకోండి. మరో విషయం మిమ్మల్ని రెచ్చగొట్టేలా పరిస్థితులు ఎదురైన సహనంతో వ్యవహరించండి అదే మీకు శ్రీరామ రక్ష. అలాగే ఇతరులు మీ కంటే మంచి విజయాలను అందుకుంటే..ఆనందంగా అభినందించండి. సంకుచిత భావంతో ముభావంగా ఉండకండి.ఇలా చేయడం వల్ల మన కంటే తెలివైన వ్యక్తులతో సాన్నిత్యం ఏర్పడటమేగాక మీరుకూడా విజయం పొందేలా సలహాలు సూచనలు తెలుసుకునే వీలు ఉంటుంది. అలాగే వర్క్‌లో ఒత్తిడి(Stress) ఎదురైనా లేదా పై అధికారుల నుంచి వచ్చినా..పరిస్థితిని సామరస్యంగా వివరించండి. సాధ్యసాధ్యాలు గురించి కూడా మాట్లాడండి. అయినా ప్రయోజనం లేదు వాళ్లు వినరు అంటే..మేనేజ్మెంట్కి దృష్టికి వచ్చేలా ప్రయత్నం చేయండి. ఎక్కడ నొచ్చుకునేలా మౌనంగా ఒత్తిడిని భరించకండిటీం వర్క్‌గా పనిచేస్తున్నప్పుడూ ఎవరో ఒకరి నుంచి సమస్యలు వస్తూనే ఉంటాయి. దాన్ని తేలిగ్గా తీసుకోండి. మొదట మారెలా మెత్తగా చెప్పండి. పరిస్థితిని బట్టి కాస్త గట్టిగా మాట్లాడండి. అప్పుడూ వారే మారొచ్చు. లేదా ఒకవేళ మీపైనా ఫిర్యాదు చేసినా..భయపడాల్సిన పనిలేదు. యజమాన్యానికి వాస్తవాలెంటో కచ్చితంగా తెలుస్తుందనేది గుర్తించుకోండి. దీంతోపాటు మానసిక ఆనందానికి కూడా ప్రాధాన్యత ఇవ్వండి. నచ్చిన సంగీతం లేదా గేమ్‌లు వంటివి ఆడే సమయం కుదుర్చుకోండి. జీవితంలో అన్ని ఉండాలి. అప్పుడే జీవితం కొత్తగా..ఆనందంగా ఆస్వాదించగలుగుతాం. సాధించిన చిన్న చిన్న విజయాలను కూడా గుర్తు తెచ్చుకుని సంతోషంగా ఉండే యత్నం చేయండి. అలాగే వ్యక్తిగత జీవితానికి కూడా ప్రాధాన్యత ఇవ్వండి. కుటుంబం కోసమే కదా ఇంతలా కష్టపడి సంపాదించేది. అప్పడుప్పుడూ తగిన బడ్జెట్లో వెకేషన్లకి తీసుకువెళ్లేలా ప్లాన్ చేసి కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంచే ప్రయత్నం చేయండి. నిజానికి ఇంట్లో వాళ్ల కోరికలన్నంటిని నెరవేర్చడం అందరికీ సాధ్యం కాదు. మనం వాళ్లకి ఇవ్వాల్సింది కేవలం మనం ఉన్నామనే భరోసా అని గుర్తుపెట్టుకోండి. కుంటుబమే లేకపోతే మనం లేమనే విషయం గుర్తెరిగా బంధాలను బలోపేతం చేసుకునేలా ప్రవర్తించండి. అవసరమైతే ఓ మెట్టు దిగండి తప్పులేదు. ఇలాంటి మార్పులను జీవితంలో చేసుకుంటే..సులభంగా ఇంట బయట నెగ్గుకురాగలం అంటున్నారు మానసిక నిపుణులు.(చదవండి: న్యూ ఇయర్ పార్టీ జోష్: ఫస్ట్ డే తలెత్తే హ్యాంగోవర్‌ని హ్యాండిల్ చేయండిలా..!) -
కొంచెం కొత్తగా ఉందాం
క్యాలెండర్ మారితే సంతోషపడటం కాదు. మనం ఏం మారామనేది ముఖ్యం. అవే పాత అలవాట్లు.. పాత తలపోతలు పాత బలహీనతలు.. పాత అనవసర భారాలు... వాటిని మోస్తూనే కొత్త సంవత్సరంలో అడుగు పెడితే మీరు అదే పాత మనిషి అవుతారు. కొత్తగా ఉండటం చాలా ముఖ్యం. మీ చుట్టూ మిమ్మల్ని మబ్బులో పెట్టి పబ్బం గడిపే వారుంటారు. మబ్బు వీడండి.. కొత్త మనిషిగా ముందుకు అడుగు వేయండి. హ్యాపీ న్యూ ఇయర్.రొటీన్లో ఉండే పెద్ద ప్రమాదం ఏమిటంటే... మనం సత్యాన్ని కనుగొనలేము. అవే రక్తసంబంధాలు, బంధువులు, స్నేహితులు... మన చుట్టూ ఉంటారు. రొటీన్లో ఉంచుతారు. వారు చేసే మంచి, చెడు... మనం క్షమించుకుంటూ, బాధపడుతూ ముందుకెళ్లిపోతూ ఉంటాం. కాని ఆగాలి. దూరంగా జరగాలి. కొన్నాళ్లు కలవకుండా ఉండి, స్థిమితంగా ఆలోచించి, వీరిలో నిజంగా మీకు సంతోష ఆనందాలు ఇస్తున్నది ఎవరు, మీ అభిమానాన్ని ప్రేమని దుర్వినియోగం చేయకుండా ఉన్నది ఎవరు, మీకు అపకారం లేదా అవమానం చేస్తున్నది ఎవరు... అనేది మీరు గమనించి చూసుకుంటే, కాస్త కఠినంగా మారి, వీరితో ఎడంగా ఉండాలని ఈ సంవత్సరం మీరు నిశ్చయించుకుంటే మీరు కొత్త మనిషిగా కొత్త సంవత్సరంలో అడుగు పెడతారు.⇒ మంచి ఆలవాట్లు చేసుకోవడం తర్వాత. కొన్ని చెడు అలవాట్లు ఉంటాయి. అవి మనకు తెలుసు. వాటి వల్ల ప్రమాదమూ తెలుసు. గిల్ట్ అనిపించడమూ తెలుసు. వాటిని వదిలించుకోవాలి. మీ ఎంపికే మీ ఫలితం. మీరు చెడు అలవాటు ఎంచుకుంటే చెడు ఫలితం వస్తుంది. దానిని వదిలించుకుంటే చెడు వదిలిపోతుంది. గట్టిగా నిశ్చయించుకుంటే మీరు కొత్త మనిషిగా మారతారు.⇒ వాయిదా వేయడం వల్లే మనిషి జీవితంలో మంచి వాయిదా పడుతూ ఉంటుంది. రేపు చేద్దాం, తొందరేముందిలే, ఇవాళ బద్దకం అంటూ మీరు పోస్ట్‌పోన్ చేసిన ప్రతిదీ మీకు సరైన సమయంలో సరైన రైలు అందకుండా చేస్తుంది. రైలు మిస్సయ్యాక మరో రైలు కోసం స్టేషన్లో పడి ఉండే ధోరణి మీలో ఉన్నంత కాలం మీరు కొత్త మనిషిగా మారలేరు... ఎన్ని కొత్త సంవత్సరాలు వచ్చినా. రోజూ ఉదయం ఇవాళ చేయాల్సిన పనులు అని రాసుకోవడం... చేశాకే నిద్రపోవడం మీకో కొత్త జీవితాన్ని తప్పక ఇస్తుంది.⇒ మీ భౌతిక, మానసిక ఎదుగుదల గత సంవత్సరం ఎలా సాగింది? ప్రశ్నించుకోండి. మీ మేధస్సు, మానసిక ప్రశాంతత, ఆరోగ్యం వీటిని ఎంతమేరకు పెంచుకున్నారో చూసుకోండి. చిల్లర విషయాలకు నెలలు నెలలు ఎలా తగలెట్టారో మీకే తెలుసు. మంచి పుస్తకాలు, సంగీతం, మంచి సినిమాలు, ఆధ్యాతికత, విహారం, కొత్త ప్రాంతాల... మనుషుల సాంగత్యం... ఇవి మిమ్మల్ని నిత్యనూతనంగా ఉంచుతాయి. డిసెంబర్ 31 పార్టీ చేసుకుని మళ్లీ డిసెంబర్ 31 పార్టీ మధ్యలో గతంలోలా ఉంటే న్యూ ఇయర్ రావడం ఎందుకు? పార్టీ చేసుకోవడం ఎందుకు?⇒ కుటుంబ సభ్యులను చూసుకోవడం వేరు. వారిని ‘తెలుసుకోవడం’ వేరు. వారి మనసుల్లో ఏముంది, ఆకాంక్షలు ఏమిటి, ఒకరితో మరొకరికి ఉన్న అభ్యంతరాలు ఏమిటి, ప్రేమాభిమానాల కొలమానం ఎలా ఉంది... సరిగ్గా సమయం గడిపితే తెలుస్తుంది. షేర్లు, బంగారం పెరుగుదల తెలుసుకోవడం కంటే కూడా ఒక కుటుంబ సభ్యుడి మనసు తెలుసుకోవడం కుటుంబ వికాసానికి ముఖ్యం.⇒ చట్టాన్ని, నియమ నిబంధలను, ΄ûర బాధ్యతను, కాలుష్యం పట్ల చైతన్యాన్ని కలిగి ఉంటే రుతువులు గతి తప్పవు. ఎండా వానల వెర్రి ఇంట్లో జొరబడదు.కొత్త అంటే పాతను, పాతలోని చెడును తొలగించుకోవడమే.వ్యక్తిగత జీవితం నుంచి వృత్తిజీవితం వరకు గుర్తుంచుకోదగిన జ్ఞాపకాలు, నేర్చుకున్న పాఠాలు, కొత్త సంవత్సర లక్ష్యాలు మన వెండి తెర వెలుగుల మాటల్లో...జ్ఞాపకాల పునాదిపై స్వప్నాల మేడగతం అనేది జ్ఞాపకం. అలాగే భవిష్యత్ అనేది స్వప్నం. జీవితం ఎప్పుడూ జ్ఞాపకాలకు, స్వప్నాలకు మధ్యలో ఉంటుంది. ప్రతి పనిని శ్రద్ధతో, నిజాయితీతో చేయాలి. గతానికీ, భవిష్యత్‌కు మధ్యలో ఉండేదే మన జీవితం. అయితే గతాల పునాదిపై భవిష్యత్ భవనాన్ని కట్టుకోవాలి. జ్ఞాపకాల పునాదిపైన స్వప్నాల మేడ నిర్మించుకోవాలి. జ్ఞాపకాలను కేవలం పునాదిలాగా మాత్రమే వాడుకోవాలి. పునాది ఎప్పుడూ మేడ కాదు.. పునాది ఎప్పుడూ భవనం కాదు. కాకపోతే ఆ భవనం పటిష్టంగా ఉండాలనే పునాది మాత్ర గట్టిగా ఉండాలి. అంటే గతమనేది గట్టిగా ఉండాలి. గతంలోని మంచి విషయాలు, మంచి ఆలోచనలు, మంచి భావాలన్నింటిని కూడా పోగుచేస్తేనే భవిష్యత్ భవనం పటిష్టంగా ఉంటుంది. చాలా కాలం నిలిచి ఉంటుంది.మనల్ని నిలబెడుతుంది. అయితే ఒక్క విషయం ఏంటంటే.. ఆత్రేయగారు ఒకమాట చె΄్పారు. ‘వచ్చునప్పుడు కొత్తవే వచ్చరాలు.. పాతబడిపోవు మన పాత పనుల వలన’ అన్నారు. అంటే కొత్త సంవత్సరం వచ్చినప్పుడు కొత్తగానే ఉంటుంది. కానీ, మనం చేసే పాత పనుల వల్ల ఆ కొత్త సంవత్సరం కాస్తా పాతబడిపోతుంది. మనం కొత్త పనులు చేయాలి.. కొత్త ఆలోచనలు చేసుకోవాలి. కొత్త లక్ష్యాలు, కొత్త గమ్యాలు, కొత్త ధ్యేయాలను మనం పెట్టుకొని ముందుకెళ్లాలి. ముఖ్యంగా ఆ రోజుల్లోనే మంచిది, మా చిన్నప్పుడు బాగుండేది అంటూ గతంతో ఎప్పుడూ కాలయాపన చేయకూడదు.కొత్త విషయాలు ఏంటి? కొత్త పరిజ్ఞానం ఏంటి? కొత్త సాంకేతికత ఏంటి... వంటి వాటిని ఆమోదించాలి, ఆహ్వానించాలి, అర్థం చేసుకోవాలి, ఆచరించాలి. దాని ద్వారా మనం సంపూర్ణ ప్రయోజనాన్ని పొందే ప్రయత్నం చేయాలి. అంతేకానీ కేవలం మనం గతాన్ని పొగుడుతూ.. ఈ తరాన్ని, ఈ కాలాన్ని నిందించకూడదు, నిరసన తెలియచేయకూడదు. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో, కొత్త ఆలోచనలతో, కొత్త తరాన్ని అర్థం చేసుకుంటేనే మనం ఎప్పుడూ విజేతలం కాగలం. ముందు ఆ విషయాన్ని మనం ఆమోదించాలి. అప్పుడే దానిద్వారా మనం ముందుకెళ్లేలా నిచ్చెనలాగా, వారధిలాగా పనికొస్తుంది. అప్పుడే జీవితం కొత్తగా ఉంటుంది. కొత్త నిర్ణయాలు తీసుకోవచ్చు.. కొత్త లక్ష్యాలు ఏర్పరచుకోవచ్చు. కొత్తగా మనం జీవితాన్ని మలచుకొనే అవకాశం ఉంటుంది. కొత్త తరాన్ని, కొత్త భావజాలాన్ని మనం అర్థం చేసుకుని ఆమోదిస్తే గనక ఏ గొడవా ఉండదు, ఏ పేచీ ఉండదు.. చక్కగా ముందుకు వెళ్లొచ్చు.⇒ ప్రతి పనిని చిత్తశుద్ధితో, శ్రద్ధతో, నిజాయితీతో చేయాలి. అట్లాగే... ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించే కోణంలో నాదొక సూచన ఏంటంటే... నేడు పొందే ఆనందం.. రేపటి ఆనందాన్ని హరించకూడదు. ఈ రోజు ఎంత ఆనందాన్నైతే అనుభవిస్తున్నామో... ఈ ఆనందం వల్ల..రేపటి ఆ ఆనందానికి అది హాని కలుగ చేయకూడదు. రేపటి ఆనందానికి ఏ రకంగానూ ప్రభావం చూపకూడదు. రేపటి ఆనందాన్ని అనుభవించగలిగేలాగే ఉండాలి ఈ రోజుటి ఆనందం. అంటే ఓ హద్దులో.. పరిమితిలో.. ప్రతిరోజూ మనం పని చేస్తూ, ఆనందాన్ని అనుభవిస్తుంటే గనక రేపటి ని మరింత ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది. సంపాదన కోసం కొంత సమయం, సమాజం కోసం కొంత సమయం, నీ శరీరం కోసం కొంత సమయం, నీ సొంత కుటుంబం కోసం కొంత సమయం... ఇంతే..! – చంద్రబోస్హెల్త్... హార్డ్వర్క్మనం ప్రతి ఒక్కరం కెరీర్ కోసం చాలా కష్టపడతాం. హార్డ్‌వర్క్ చేస్తాం. ఆ కష్టం వృథా కాదు. మన కష్టమే మనల్ని ఓ స్థాయికి చేర్చుతుంది. అందుకే కొత్త సంవత్సరంలో ఇంకా కష్టపడి పని చేద్దాం... అయితే కెరీర్ గ్రోత్ మాత్రమే కాదు... మన వ్యక్తిగత ఆనందానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. హార్డ్ వర్క్... హెల్త్... హ్యాపీనెస్... ఈ మూడూ ముఖ్యం. వీటికి అనుగుణంగా లైఫ్‌ని ప్లాన్ చేసుకుని పాజిటివ్‌గా ముందుకెళ్లడమే. కెరీర్ కోసం హ్యాపీగా కష్టపడదాం... మంచి అలవాట్లతో ఆరోగ్యంగా ఉండి... హ్యాపీగా ఉందాం.2024 గురించి చెప్పుకోవాలంటే... నేను ఎంత గ్రాండ్ సక్సెస్ సాధించానన్నది పక్కనపెడితే, నాకు తెలియనివి అన్నీ నేర్చుకునేందుకు సహకరించిన సంవత్సరంగా అనిపించింది. సినిమా ఇండస్ట్రీలో సహనమే కీలకం అనే విషయాన్ని నాకు నేర్పించింది. అంతేకాదు నేను గమనించిన మరో ముఖ్య విషయం ఏమిటంటే... ఎన్ని సినిమాలు చేశాం, నా తరువాత సినిమా ఏంటి, ఎప్పుడు అని ఎదురు చూడటం కన్నా, సెట్స్‌లో ఎంత క్రమశిక్షణగా ఉన్నాం, షూటింగ్లో ఎంత సక్సెస్‌పుల్‌గా .. ఎంత టీమ్ స్పిరిట్‌తో.. ఎంత ఎఫర్ట్ఫుల్గా పనిచేశామన్నది ముఖ్యం.రేటింగ్ విషయానికొస్తే... 1 నుంచి పది పాయింట్లలో నేను 2024కు 6 పాయింట్లు ఇస్తాను. ఎందుకంటే, 2024 నాకెంతో నేర్పించింది. దాంతోపాటు అనేక సవాళ్లను కూడా ఇచ్చింది మరి!2024లో నాకు సంతోషం కలిగించిన విషయాలు... మొదటిసారిగా నేను నా ఫ్యామిలీతో యూఎస్ ట్రిప్‌కు వెళ్లడం, ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోగలగడం.2025 మీద నా అంచనాలు: షూటింగ్‌లతో బిజీగా ఉండటం, చాలా ఎగై్జటింగ్ స్టోరీస్, అద్భుతమైన టీమ్ నా చేతిలో ఉన్నాయి. వాటితో కనీసం రెండు మూవీస్ అయినా 2025లో రిలీజ్ కావాలి. ఇంకా కష్టపడటం, పూర్తి స్థాయిలో శక్తి వంచన లేకుండా పనిచేయడం, నా గోల్స్. – ఆనంద్ దేవరకొండస్ట్రాంగ్గా... పాజిటివ్‌గా...మన ఎదుగుదలకు ఓ కారణం ‘సెల్ఫ్ లవ్’. ముందు మనల్ని మనం ఇష్టపడాలి... గౌరవించుకోవాలి. 2025 సౌండింగ్ చాలా బాగుంది. ఏదో పాజిటివిటీ కనబడుతోంది. ఓ పాజటివ్ ఫీలింగ్‌తో ఈ ఇయర్లో మనం హ్యాపీగా, హెల్దీగా, పాజిటివ్‌గా ముందుకు సాగుదాం. మన ఆరోగ్యం బాగుంటేనే మనం ఏమైనా చేయగలం. అందుకని ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. యోగా చేయాలి... రోజూ కొంచెం సేపు ధ్యానానికి కేటాయించాలి. ఆరోగ్యంగా ఉండాలి... కష్టపడి పని చేయాలి. ఆత్యవిశాస్వంతో బతకాలి.నాకు డైరీ రాసే అలవాటు ఉంది. 2024లో పుషప్స్, ఫులప్స్, హ్యాండ్స్ట్రెంగ్త్పై దృష్టి పెట్టాలనుకున్నాను. కాని అది అవ్వలేదు. ఒక లవ్‌స్టోరీలో నటించాలనుకున్నాను. అఫ్కోర్స్ అది మన చేతుల్లో లేదనుకోండి. ఈ కొత్త సంవత్సరంలో నేను అనుకున్నవి ఫలించాలని కోరుకుంటున్నాను.ప్రొఫెషన్ విషయానికి వస్తే... ఈ సంవత్సరం నాలుగు సినిమాల్లో నటించాను. హిందీ సినిమాలు చేయబోతున్నాను. ఇక పర్సనల్ విషయానికి వస్తే టఫ్ పరిస్తితులను ఎదుర్కొన్నాను. వాటి నుంచి బయటపడగలిగాను. టఫ్ పరిస్థితులు ఎదురైనప్పుడు ఎమోషనల్‌గా ఇతరుల మీద ఆధారపడకుండా వాటి నుంచి ఎలా బయటపడాలి అనేది నేర్చుకున్నాను. ఒంటరితనంగా అనిపించే పరిస్థితులు కూడా వస్తుంటాయి. వాటి నుంచి ఎలా బయటపడాలో తెలుసుకున్నాను.కొత్త సంవత్సరం తీర్మానాల విషయానికి వస్తే... కొత్త స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను. యోగాను మరింత ప్రాక్ట్రిస్ చేయాలనుకుంటున్నాను. జిమ్నాస్టిక్స్ చేయాలనుకుంటున్నాను. 2023 చివరిలో కూడా కొత్త సంవత్సరం రిజల్యూషన్స్ తీసుకున్నాను. వాటిలో చాలా వరకు ఈ సంవత్సరం పూర్తి చేశాను.ఆడియెన్స్ సినిమాను ఎలా చూస్తున్నారు, సినిమాల రిజల్ట్ నుంచి సినిమా మేకింగ్ ప్రాసెస్ వరకు ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. ప్రతి సంవత్సరం మెంటల్‌గా, ఎమోషనల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలనుకుంటాను. – అనన్య నాగళ్లప్రశాంతతకు ప్రాధాన్యంరోజు రోజుకీ నెగటివిటీ పెరిగిపోతోంది. అందుకే కొంచెం పాజిటివిటీ పెంచుకోవాలి. కెరీర్ కోసం పరుగులు... డబ్బు కోసం పరుగులు... ఈ పరుగులో ప్రశాంతత ఉందా? అని ఆగి ఆలోచించుకోవాలి. లేనట్లు అనిపిస్తే పరుగు కాస్త తగ్గించి ప్రశాంతతకి ప్రాధాన్యం ఇవ్వాలి. ఏం చేసినా కుటుంబం కోసమే కాబట్టి... కుటుంబంతో గడపడానికి వీలు లేనంత బిజీ అయిపోవడం సరి కాదు. అందుకే ఫ్యామిలీకి తగిన సమయం వెచ్చించండి... పాజిటివిటీకి ప్రాధాన్యం ఇవ్వండి... ప్రశాంతంగా ఉండండి.ప్రొఫెషన్‌గా, కెరీర్‌పరంగా కూడా 2024 నాకు చాలా మంచి సంవత్సరం అనే చెబుతాను నేను. అందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి నా పెళ్లి, రెండు నా సినిమా గ్రాండ్ సక్సెస్ కావడం. ఐదు సంవత్సరాలుగా రిలేషన్లో ఉన్న మా ప్రేమ కాస్తా పెళ్లి పట్టాలెక్కింది 2024లోనే. సంవత్సరమున్నరపాటు నేను, మా టీమ్ అంతా ఎంతో హార్డ్‌వర్క్ చేసిన నా సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలవడం నా కెరీర్లో మెమరబుల్ మూమెంట్‌గా చెప్పుకుంటాను.1 నుంచి 10 పాయింట్లలో2024 కు నేను 9 పాయింట్లు ఇస్తాను. నా పెళ్లి చాలా గ్రాండ్‌గా జరగటం, ఆ పెళ్లికి పిలవడం కోసం చాలాకాలం నుంచి దూరంగా ఉన్న మా బంధువులందరినీ కలవడం, వారితో సంబం«ధాలు కలుపుకోవడం, అందరూ పెళ్లికి రావటం, అందరితో హ్యాపీగా టైమ్ స్పెండ్ చేయగలగటం చాలా సంతోషాన్నిచ్చింది. ఇంకో విశేషం ఏంటంటే, మా పెళ్లి తర్వాత మా ఊళ్లో మేము ఆంజనేయస్వామి తిరునాళ్ల చేసుకున్నాం. అది మాకు చాలా ప్రత్యేకం. మా చిన్నప్పుడెప్పుడో చేశాం అది. దాదాపు పాతికేళ్ల తర్వాత ఇప్పుడు చేశాం. ఇంక న్యూ ఇయర్ రెజల్యూషన్ అంటారా.. బీ గుడ్ టు అదర్స్. అంటే అందరితో ఇంకా మంచిగా ఉండటం. దాంతోపాటు 2024లో నేను రెండు సినిమాలు హిట్ కొట్టాలనుకున్నాను. అయితే అది చేయలేకపోయాను. 2025లో కచ్చితంగా రెండు మంచి సినిమాలు అందించాలి. ఎంటర్టైన్ చేయాలి అనుకుంటున్నాను. అదే నా గోల్. ఇంకా.. పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. మ్యారేజ్ తర్వాత ఇది మా ఫస్ట్ న్యూ ఇయర్. మేము ఐదేళ్లుగా ఒకరికొకరం తెలుసు. ఇప్పుడు కొత్తగా ఏం చేయలేకపోయినా, కనీసం అదే రిలేషన్షిప్ మెయిన్‌టెయిన్ చేయాలనుకుంటున్నాం. – కిరణ్ అబ్బవరంప్రతి టైమ్ మంచిదేజీవితంలో మనకు దక్కిన ‘మంచి’ని గ్రహించాలి. ఆ మంచికి కృతజ్ఞతగా ఉండాలి. మన ఉరుకు పరుగుల జీవితంలో మనకు జరిగే మంచిని పట్టించుకునే స్థితిలో కూడా కొందరం ఉండము. జరిగే చెడు విషయాల గురించి అదే పనిగా ఆలోచించుకుని బాధపడుతుంటాం. అయితే మంచిని గ్రహించి, పాజిటివ్‌గా ముందుకెళ్లాలి. అప్పుడు జీవితం బాగుంటుంది. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా ఒక్కసారి మనకు దక్కిన మంచి విషయాలను గుర్తు చేసుకుని, ఆనందంగా ముందుకెళదాం.2024లో మొత్తం చూస్తే నేను చాలా హార్డ్ వర్క్ చేశాను. వాటి ఫలితాలు 2025 అందుకోబోతున్నాను. 2024లో వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్‌గా ఏ అంచనాలు పెట్టుకోకుండా సహనంతో వర్క్ చేశాను. నా వరకు బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ని ఇచ్చాను. ప్రతి టైమ్ మంచిదే. ప్రతి సందర్భం నాకు విలువైన బెస్ట్ మూమెంట్‌ని ఇచ్చింది. ఏడాది మొత్తంలో చాలా గుడ్ మూమెంట్స్ ఉన్నాయి. నా బెస్ట్ మూమెంట్ ఏంటంటే నా మూవీస్‌కు డబుల్ షిఫ్ట్స్‌లో వర్క్ చేశాను. హార్డ్ వర్క్ ఉన్న ఆ రోజులన్నీ చాలా గొప్పవి. 2025లో కూడా బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ చేయదగిన వర్క్స్ వస్తాయని ఆశిస్తున్నాను. ఈ కొత్త సంవత్సరంలోనూ ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా వర్క్ చేయాలనుకుంటున్నాను. – నిధీ అగర్వాల్ -
అప్పటి వరకు మాత్రమే హ్యాపీ న్యూ ఇయర్: రాం గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్
న్యూ ఇయర్ సందర్భంగా రాం గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్ చేశారు. కొత్త ఏడాది అనేది కేవలం అప్పటి వరకు మాత్రమే ఉంటుందని పోస్ట్ చేశారు. ఈ రోజు 31 రాత్రి నుంచి జనవరి 1 మధ్యాహ్నాం వరకు మాత్రమేనని రాసుకొచ్చారు. మీరు మీ హ్యాంగ్ ఓవర్ నుంచి బయటికి వచ్చాక అసలు విషయం అర్థమవుతుందన్నారు. గతేడాదిలో వెంటాడిన సమస్యలు కొత్త ఏడాదిలోనూ కొనసాగుతాయని.. హ్యాపీ ఓల్డ్ ఇయర్ అంటూ ట్విటర్లో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.కాగా.. రాంగోపాల్ వర్మ టాలీవుడ్లో సంచలన డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. నాగార్జున నటించిన శివ మూవీతో తెలుగులో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించారు. ఆ తర్వాత ఆర్జీవీ డైరెక్షన్లో వచ్చిన పలు చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఆర్జీవీ డెన్ పేరుతో సినిమాలు తెరకెక్కిస్తున్నారు.శారీ మూవీ..తాజాగా ఆర్జీవీ ఆయన తెరకెక్కిస్తున్న సినిమా 'శారీ'. ఇప్పటికే ఈ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. నిజ జీవిత ఘటనల మేళవింపుతో రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్‌గా శారీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీలో సత్య యాదు, ఆరాధ్య దేవి లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో ఆర్జీవీ ఆర్వీప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌గోపాల్‌వర్మ, రవి వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నవంబర్‌లో విడుదల చేయనున్నారు.శారీ కథేంటంటే..ఉత్తరప్రదేశ్‌లో ఎంతోమంది అమాయకమైన మహిళలను హత్యాచారం చేసిన ఓ శారీ కిల్లర్ ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. చీరలో ఉన్న అమ్మాయిని చూసి, ఆమెతో ప్రేమలో పడిన తర్వాత ఓ అబ్బాయి జీవితం ఎలా భయానకంగా మారింది అన్నదే ఈ చిత్రకథాంశమని గతంలోనే చిత్ర యూనిట్ పేర్కొంది.HAPPY NEW YEAR will last only from 31st night till 1st afternoon , when u wake up from ur hangover and realise that all the OLD YEAR’S problems are still there in the NEW YEAR 😎 #HappyOldYear— Ram Gopal Varma (@RGVzoomin) December 31, 2024 -
Happy New Year 2025: ఎందుకు? ఏమిటి? ఎలా?..
ఇవాళ్టి నుంచి.. ఎలాగైనా ఉదయమే లేచి చదువుకోవాలి. .. జిమ్‌కు వెళ్లి బాడీని పెంచాలి.. సరైన డైట్‌ను మెయింటెన్ చేస్తూ ఆరోగ్యంగా ఉండాలి. .. ఎలాగైనా డబ్బులను పొదుపు చేసి ఫలానాది కొనాలి. .. ఆఫీస్‌కు టైంకు వెళ్లాలి. ఇలా అన్నీ కూడా ఏడాదిలో తొలిరోజు నుంచే చేస్తూ ఫ్రెష్ జీవితం ప్రారంభించాలి. చేస్తారో.. చేయరో.. తెలియదు!. కానీ, కొత్త ఏడాది వచ్చిందంటే.. రెజల్యూషన్స్ పేరుతో ఇలాంటి వాటిని తెరపైకి తెచ్చి హడావిడి చేసేవాళ్లు ఎందరో ఉంటారు. ఇందులోనూ హాస్యకోణం వెతుకుతూ.. ఇంటర్నెట్లో మీమ్స్(Resolutions Memes) వైరల్ అవుతున్న పరిస్థితుల్ని ఇప్పుడు చూస్తున్నాం. ఆ లక్ష్యాలను అందుకోవడం మన వల్ల కాదా?..కొత్త ఏడాది కొత్త తీర్మానాలు మనకు కొత్తేం కాదు. ‘‘జీవితంలో ఓ ఏడాది దొర్లిపోయింది. ఇన్ని రోజులు ఏలాగోలా గడిచాయి.కనీసం ఈ కొత్త ఏడాదిలోనైనా మార్పుతో పని చేద్దాం!’.. అని పదిలో తొమ్మిది మంది అనుకుంటారని పలు అధ్యయనాలు తేల్చాయి. ఇది ఏ విద్యార్థులకో, యువతకో మాత్రమే కాదు.. రెజల్యూషన్స్ తీసుకోవడానికి వయసుతో సంబంధం లేదు. దీర్ఘకాలికంగా ప్రయత్నిస్తున్నవాళ్లు లేకపోలేదు. అంటే.. ప్రతీ ఒక్కరికీ ఇది వర్తిస్తుందన్నమాట. అయితే..ప్రతి కొత్త ప్రారంభం ఎంతో గొప్ప శక్తి, సానుకూల భావనలతో వస్తుందని అందరి నమ్మకం. మన భాషలో మంచి పాజిటివ్ వైబ్ అన్నమాట. చాలా మంది చాలా రకాల లక్ష్యాలను ఈ కొత్త ఏడాదిలో నిర్దేశించుకుంటారు. వాటిలో కొన్నింటిని ఎలాగైనా చేయాలని ప్రయత్నిస్తుంటారు. అవి మాములువి కాదు.. పెద్ద పెద్ద టార్గెట్లే ఉండొచ్చు!. అలాంటి వాటిని ఒంటరిగా నెరవేర్చుకోవడం కొంచెం కష్టమే!. అందుకోసమైనా సరే ఈ లక్ష్యాలను నలుగురితో పంచుకుని సాధించుకునే ప్రయత్నం చేయాలి.కొత్త ఏడాది రెజల్యూషన్స్ చేసుకోవడంలో.. విద్యార్థులు, యువత ముందుంటారు. ఇక్కడ విద్యార్థులతో పాటు వారు తల్లిదండ్రులు/సంరక్షకులు కూడా ఈ లక్ష్యాల కోసం వారితో కలిసి పనిచేస్తేనే ఫలితం ఉండేది. ఉదయాన్నే లేచి చదువుకోవాలనో, లేదంటే టైంకు హోంవర్క్ పూర్తి చేయాలనో, అదికాకుంటే మార్కులు బాగా తెచ్చుకోవాలనో, యూనివర్సిటీలో ర్యాంకు రావాలనో.. ఇలా తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి మాట్లాడుకోవాలి. భవిష్యత్‌లో పిల్లలు మంచి స్థాయిలో స్థిరపడాలంటే చదువు తప్పనిసరని చెబుతూనే వారికి కొన్ని లక్ష్యాలను నిర్దేశించాలి. అయితే ఇది వాళ్లను ఒత్తిడి, ఆందోళనలకు గురి చేసేదిలా మాత్రం అస్సలు ఉండకూడదు. అలాగే ప్రొగ్రెస్‌ను రివ్యూ చేస్తూ.. వాళ్లకు అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వాలే తప్ప!.. ఇతరులతో పోల్చి నిందించడం.. ఆశించిన ఫలితం రాలేదని కోప్పడడం, కొట్టడం లాంటివి అస్సలు చేయకూడదు. మానసిక ఆరోగ్యమే వాళ్ల విజయానికి తొలి మెట్టు అనేది గుర్తించి ముందుకు వెళ్లాలి.లక్ష్యాలను ఎక్కువగా నిర్దేశించుకునే వర్గం యువతే. అలాగే.. రెజల్యూషన్స్‌ను బ్రేక్ చేసేది కూడా ఈ వర్గమే. కెరీర్‌పరంగా స్థిరపడే క్రమంలో.. వీళ్లకు కుటుంబ సభ్యులు, స్నేహితుల తోడ్పాడు కచ్చితంగా అవసరం ఉంటుంది. ఉన్నత చదువులు, ఉద్యోగాల అన్వేషణ.. ఇలా లక్ష్యాలను నిర్దేశించుకునేలా వాళ్లను సమాయత్తం చేయాలి. అందుకు అవసరమైన సాధన, నైపుణ్యాలు, సామర్థ్యాలను పెంచుకునేలా వాళ్లను ప్రొత్సహించాలి. ఆ దశలో అన్ని రకాలుగా విశ్లేషణ అనేది అవసరం. అందుకు అవసరమైన సాయమూ అందించినప్పుడే వాళ్లు తమ లక్ష్యాలను చేరుకోగలరని గుర్తించాలి.జీవితంలో ఎదుగుదల పొదుపు(Savings)తోనే ప్రారంభమవుతుంది. అందుకే కొత్త ఏడాదిలో అడుగుపెట్టే ముందైనా.. ఆర్థికంగా పరిపుష్టి సాధించాలకుని ఎన్నో ప్రణాళికలు వేసుకుంటారు. కొత్తగా ఉద్యోగం సాధించిన వారైతేనేమి, కొత్తగా ఆర్థికంగా నిలదొక్కుకోవాలని అనుకునేవారైతేనేమి.. దీన్నొక భవిష్యత్ ఆశాకిరణంగా భావిస్తారు కూడా. అలాగే తూచా తప్పకుండా పాటించాల్సిన నియమాలు కూడా ఎక్కువ అవసరం పడేది ఈ లక్ష్య సాధనలోనే!. కాబట్టి.. స్వీయ నియంత్రణతో పాటు కుటుంబ సభ్యుల సహకారం అవసరం. మరీ ముఖ్యంగా భాగస్వామి పాత్ర ఇంకాస్త ఎక్కువే!. నెలావారీ ఖర్చులతో పాటు ఏ నెలలో ఎంత మొత్తం అవసరం అవుతుందనే ప్రణాళిక ముందుగానే వేసుకోవడం, ఎమర్జెన్సీ కోసం కొంత డబ్బును పక్కన పెట్టుకోవడం లాంటివి చేయాలి.కొత్త సంవత్సరం తొలిరోజు మాత్రమే కాదు.. వచ్చే ఏడాదిలో ప్రతీ పండుగను సంతోషంగా జరుపుకోవాలని అనుకుంటున్నారా?.. అయితే ఆరోగ్యంగా ఉండడం అవసరం. న్యూఇయర్ రెజల్యూషన్స్(NewYear's Resolutions)లో.. వయసుతో సంబంధం లేకుండా మంచి ఆరోగ్య ప్రణాళికను చాలామంది నిర్దేశించుకుంటారు. అయితే ఇంత ముఖ్యమైన తీర్మానాన్ని.. ఉల్లంఘించేవాళ్లు కూడా ఎక్కువ స్థాయిలోనే ఉంటారు. ఇందుకు బద్ధకం సహా రకరకరాల కారణాలు ఉండొచ్చు. కానీ, ఈ తీర్మానాన్ని సమిష్టిదిగా ఆ కుటుంబం భావించాలి. తద్వారా మానసిక, శారీరక సమస్యలనూ దూరంగా ఉంచుకోవాలి. అప్పుడే కదా మనం అనుకున్న లక్ష్యాలు కానీ బాధ్యతలు కానీ నేరవేర్చడానికి వీలవుతుంది.న్యూ ఇయర్ రిజల్యూషన్లు ఎవరైనా తీసుకోవచ్చు. కానీ, పక్కాగా అమలు కావాలంటే మాత్రం మనకు గట్టి సపోర్ట్ అవసరం అంటారు నిపుణులు. ఇది ఒంటరి ప్రయాణం ఎంతమాత్రం కాదు. ఒకరకంగా ఇది ఆఫీసుల్లో టీం వర్క్ లాంటిదన్నమాట. అందుకే తీసుకునే నిర్ణయాన్ని నలుగురికి చెప్పాలి.. వాళ్ల సపోర్ట్ తీసుకోవాలి. ఎందుకు? ఏమిటి? ఎలా? అనే చర్చ జరగాలి. ఆ ప్రభావం చాలా మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది. అప్పుడే ఏడాది పొడవునా.. అనుకున్న మేర ఫలితాలు అందుకోగలరు. -
దేశ ప్రజలకు రాష్ట్రపతి కొత్త ఏడాది శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సమసమాజ స్థాపనకు, దేశం సర్వతోముఖాభివృద్ధిని సాధించేందుకు పౌరులంతా ప్రతిజ్ఞచేయాలని ఆమె పిలుపునిచ్చారు. కొత్త ఆశలు, ఆకాంక్షల సాధన కోసం సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని ముందడుగువేయాలని ఆమె అభిలషించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఆదివారం ఒక ప్రకటన విడుదలచేసింది. ‘‘ కొత్త ఏడాదిలో దేశ పౌరులందరికీ సంతోషం, శాంతి, సౌభ్రాతృత్వాలు దక్కాలి. దేశ పురోగతికి మనందరం పాటుపడదాం. అభివృద్ధి భారత్ కోసం కొత్త తీర్మానాలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. నూతన సంవత్సరం సందర్భంగా దేశ, విదేశాల్లో నివసిస్తున్న భారతీయులందరికీ నా శుభాకాంక్షలు’’ అని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. -
గవర్నర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్ / సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శ్రేయస్సును తీసుకురావాలని, వారి ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చాలని కోరుకున్నారు. 2024లో సైతం అన్ని రకాల సామాజిక రుగ్మతలపై పోరాటాన్ని విజయవంతంగా కొనసాగించడంతో పాటు, సమానత్వం, శాంతియుత, సుస్థిర, ఆరోగ్యకర సమాజం కోసం కొత్త సంవత్సరం సందర్భంగా అందరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. -
మాజీ లవర్‌తో న్యూ ఇయర్ వేడుకల్లో స్టార్ హీరో.. సోషల్ మీడియాలో వైరల్
బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ ఇటీవల భూల్ భూలయ్యా సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ప్యార్ కా పంచ్‌నామా చిత్రంలో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం న్యూ ఇయర్ సందర్భంగా పారిస్‌లో సందడి చేశారు. ఈ వేడుకల్లో మాజీ ప్రియురాలు సారా అలీ ఖాన్‌తో కలిసి పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. 2023కి స్వాగతం పలుకుతూ ఆదివారం ఓకే ప్రదేశంలో ఉన్న ఫోటోలను షేర్ చేసింది ఈ జంట. గతంలో సారా అలీ ఖాన్ సోదరుడు ఇబ్రహీం అలీ ఖాన్‌తో ఉన్న చిత్రాలను పోస్ట్ చేశారు కార్తీక్ ఆర్యన్. అయితే ఈ జంట బ్రేకప్ విషయాన్ని గురించి ఇంతవరకు పెదవి విప్పలేదు. ఒకసారి కరణ్ జోహార్ మాత్రమే తన చాట్ షోలో వీరిద్దరి రిలేషన్‌ను ప్రస్తావించారు. గతంలో ఈ జంట 'లవ్ ఆజ్ కల్' చిత్రంలో నటిస్తున్నప్పుడు ఏడాది పాటు డేటింగ్లో ఉన్నారు. సినిమాల విషయాకొనిస్తే కార్తిక్ ఆర్యన్ చేతిలో 'షెహజాదా', 'సత్యప్రేమ్ కీ కథ', 'ఆషికి 3' 'కెప్టెన్ ఇండియా' ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగే సారా అలీ ఖాన్ 'మెట్రో ఇన్ డినో అనౌన్స్', 'గ్యాస్‌లైట్', 'నఖ్రేవాలి', విక్కీ కౌశల్‌తో లక్ష్మణ్ ఉటేకర్ అనే చిత్రంలో కనిపించనుంది. View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) -
బన్నీ అభిమానులకు న్యూ ఇయర్ విషెష్.. సోషల్ మీడియాలో వైరల్..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త ఏడాదిని ఆస్వాదిస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా తన భార్య స్నేహరెడ్డితో కలిసి వ్యాకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఈ ఫోటోలను స్నేహ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ పోస్ట్ చేసింది. ఆ ఫోటో కాస్తా సోషల్ మీడియాతో వైరల్ కావడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల కుటుంబంతో కలిసి వెకేషన్‌కు వెళ్లిన చిత్రాలను తరచుగా పోస్ట్ చేస్తూ యాక్టివ్‌గా ఉంటున్నారు స్నేహారెడ్డి. కాగా.. అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం పుష్ప: ది రూల్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రష్మిక మందన్నా అతనికి మరోసారి జోడీగా కనిపించనుంది. వీరిద్దరి కాంబినేషన్లో పుష్ప-పార్ట్ 1 బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం.. ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
సీఎం జగన్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన అధికారులు, ప్రజాప్రతినిధులు
-
ప్రతి కుటుంబం వర్థిల్లు గాక!
కాలం చల్లటి నీడనిచ్చే చెట్టు కావాలి. వడగాడ్పు నుంచి, ఊపి కొట్టే వాన నుంచి, గడ్డ కట్టే చలి నుంచి అది మనుషులను కాయాలి. పంటలు సమృద్ధిగా పండాలి. తియ్యటి మామిడిపండ్లు బండ్ల కొద్దీ మండీలకు చేరాలి. పూలు సలీసుగా దొరకాలి. కొలనుల్లో చేపల వీపులను తామరతూడులు తడమాలి. నదులు ఒండ్రుమట్టిని ఒడ్డుకు తోస్తూ ప్రవహించాలి. సముద్రాలు శాంత వచనాలు పలకాలి. మహమ్మారులు తోకలు ముడవాలి. ఒకటీ అరా మాత్రలతో తగ్గియే రోగాలే చలామణిలో ఉండాలి. నాలుగు గోడలు లేపినవాడు పైకప్పు వేసుకోగలగాలి. గూడే లేని వాడు ఇంత జాగా సంపాదించుకోవాలి. ఉద్యోగాలు ఇబ్బడి ముబ్బడిగా చేతికందాలి. కాయకష్టం చేసేవాడు బువ్వకు లోటెరగక ఉండాలి. పాలకులు పెద్ద మనసు చేసుకోవాలి. కట్నాలు, లాంఛనాల జంజాటాలు లేక అప్పుల బెంగ ఎరగని పెళ్ళిళ్లు జరగాలి. ఆడపిల్లలు సగౌరవంగా, సురక్షితంగా ఉండాలి. స్త్రీల గెలుపు గాథలు వినిపించాలి. యువతీ యువకుల సబబైన ఇష్టాలు చెల్లుబాటు కావాలి. రహదారులు క్షేమమార్గాలుగా విలసిల్లాలి. సమాజం శాంతితో నిండాలి. అశాంతి కొరకు ప్రయత్నించే ప్రతి చర్యా చతికిలపడాలి. హేతువుకు చోటు దక్కాలి. ప్రతి ఇల్లు పాలు తేనెల సమృద్ధితో నిండాలి. తాతయ్య, నానమ్మలు కులాసాగా ఉండాలి. అమ్మ చెప్పినట్టు అందరూ వినాలి. నాన్న జేబు ఎప్పుడూ నిండుగా ఉండాలి. పిల్లలు సదా పకపకలాడాలి. చదువులెన్నో బుద్ధిగా చదవాలి. బంధువులందరూ బలగంగా ఉండాలి. స్నేహితులందరూ శక్తిగా మారాలి. కొత్త సంవత్సరం అందరికీ శుభాలు తేవాలి. ప్రతి కుటుంబం వర్థిల్లాలి. మంచిని తలుద్దాం. విశ్వం వింటుంది. గట్టిగా అనుకుందాం. తప్పక నెరవేరుతుంది. హ్యాపీ న్యూ ఇయర్. -
నీకు దమ్ముంటే ఈరోజే కుమ్మేయ్.. రేపటి కోసం నాటకాలొద్దు: పూరి జగన్నాధ్
ప్రతి ఒక్కరూ భవిష్యత్ కోసం బతుకుతూ వర్తమానం ఎంజాయ్ చేయడాన్ని మర్చిపోతున్నారని దర్శకుడు పూరి జగన్నాధ్ అన్నారు. మనం ప్రజెంట్ సంతోషంగా ఉన్నామన్నదే ముఖ్యమన్నారు. ఇప్పటి ప్రతి క్షణాన్ని ఆనందంగా ఆస్వాదించాలని కోరారు. అంతేకానీ రేపటి పేరు చెప్పి ఇప్పుడు ఎంజాయ్ చేయడం కరెక్ట్ కాదన్నారు. పూరి మ్యూజింగ్స్ పేరుతో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. హ్యాహీ నౌ హియర్ అంటూ వీడియో విడుదల చేశారు. (ఇది చదవండి: ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో..!) పూరి మాట్లాడుతూ.. 'మనందరి కోరిక ఒకటే. హ్యాపీగా ఉండటం. దీని కోసం ముందు కష్టపడాలి. ఎందుకంటే అది మనకు తెలుసు. కానీ మనమేం చేస్తున్నాం. అలా కాకుండా హమ్మయ్య రేపటి నుంచి మన కష్టాలు తీరిపోతాయనుకుంటున్నాం. మనం నెక్ట్స్ ఇయర్ కుమ్మేద్దాం అనుకుంటాం. నీకు దమ్ముంటే ఈరోజే కుమ్మేయ్. రేపటికి వాయిదా వేయడం ఎందుకు? నీకు దమ్ముంటే ఈ రోజు తాగకుండా ఉండగలవా? రాత్రంతా తాగడం మానేయ్. చక్కగా భోంచేసి పడుకో. కానీ అలా చేయవు. తాగి తందనాలు ఆడతావు. రేపటి ఆనందం కోసం ఈరోజు నాశనం చేస్తున్నాం. వర్తమానాన్ని మంటగలుపుతూ.. భవిష్యత్తు కోసం బతుకుతున్నాం.' అని అన్నారు. 'ఇప్పుడు నువ్వు ఆనందంగా లేకపోతే న్యూ ఇయర్ ఎప్పుడు బాగుండదు. ఆలాగే రేపటి కోసం బతుకుతున్నావంటే నీకు ఆనందం గురించి తెలియదు. నీ కష్టాలు తీరిపోయే రోజు ఎప్పుడు రాదు. ఈ రోజు డిసెంబర్ 31 ప్రపంచం మొత్తం సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎందుకు ఎంజాయ్ చేస్తున్నారన్నది మనకు అనవసరం. వారితో కలిసి ఎంజాయ్ చేయ్ తప్ప.. రేపటి న్యూ ఇయర్ కోసం తాగకు. ఈ క్షణం నా లైఫ్ బాగుందనుకుని తాగు. దయచేసి న్యూ ఇయర్ రిజల్యూషన్స్ పెట్టుకోవద్దు. నేను మారిపోవాలి అనుకుంటే ఈ రోజే మారిపో. రేపు పేరు చెప్పి నాటకాలాడొద్దు. హ్యాపీనెస్ ఎప్పుడు ఫ్యూచర్లో ఉండదు.. ప్రజెంట్‌లోనే ఉంటుంది. హ్యూపీ నౌ హియర్.' అంటూ సందేశమిచ్చారు. (ఇది చదవండి: ఆ హీరోయిన్ చేస్తే 'యశోద' ఇంకా బాగుండేది: పరుచూరి) -
కరోనాకు వాటిని తట్టుకునే ఇమ్యూనిటీ ఇవ్వాలి: ఆర్జీవీ ట్వీట్ వైరల్
రాంగోపాల్ వర్మ అటు బాలీవుడ్.. ఇటూ టాలీవుడ్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటే ఆయన చేసే పనులతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇండస్ట్రీలో వివాదస్పద దర్శకుడిగా ముద్ర వేసుకున్నారు ఆర్జీవీ. తాజాగా మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. అందరు ఒకలా చేస్తే తాను మాత్రం డిఫరెంట్ అని మరోసారి రుజువు చేశారు. ఈ ఏడాది చివరి రోజు కావడంతో తనదైన శైలిలో అడ్వాన్స్ విష్ చేశారు ఆర్జీవీ. తాజాగా ఆర్జీవీ చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఆర్జీవీ తన ట్వీట్లో ప్రస్తావిస్తూ.. '31 డిసెంబర్ 2022 వరకు ఉన్న సమస్యలన్నీ మీరు 1 జనవరి 2023న నిద్రలేచిన తర్వాత కూడా కొనసాగుతాయి. ఎందుకంటే అదే భార్య, అదే భర్తనే ఉంటారు కావున. అలాగే.. ఈ ఏడాది నేరస్తులంతా పోలీసులకు పట్టుబడకూడదని, అన్ని వ్యాక్సిన్ తట్టుకునే ఇమ్యూనిటీని కరోనా వైరస్‌కు ఇవ్వాలని, కొత్త సంవత్సరంలో మరిన్ని వైరస్లు విజృంభించాలని, కష్టాల్లో ఉన్న నటీనటులందరూ షారుక్ ఖాన్, సల్మాన్, అమీర్ల కంటే పెద్ద స్టార్లు అవ్వాలని కోరుకుంటున్నా. ఈ కొత్త సంవత్సరంలో భార్యలందరూ తమ భర్తలను అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నా' అంటూ పోస్ట్ చేశారు. ఇలా అందరికీ వినూత్నంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ వరుస ట్వీట్స్ చేశారు దర్శకుడు ఆర్జీవీ. On the occasion of this new year, I wish the Coronavirus to develop immunity from the dangerous vaccines 💐💐#HappyCoronaYear — Ram Gopal Varma (@RGVzoomin) December 31, 2022 On the occasion of this new year I wish all pharmaceutical companies , that there will be multiple disease breakouts #HappyMedicineYear — Ram Gopal Varma (@RGVzoomin) December 31, 2022 On the occasion of this new year , i wish all wives will become more understanding towards their husbands 🙏#HappyHusbandYear — Ram Gopal Varma (@RGVzoomin) December 31, 2022 -
ఫ్లిప్‌కార్ట్ లో బంపర్ ఆఫర్లు..!
-
సీఎస్ సమీర్ శర్మకు అధికారుల శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: నూతన సంవత్సరం సందర్భంగా శనివారం విజయవాడలో తిరుమల తిరుపతి దేవస్థానం వేదపండితులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మకు వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం శ్రీవారి శేషవస్త్రం, ప్రసాదాలతో పాటు టీటీడీ క్యాలెండర్, డైరీలను సీఎస్‌కు అందించారు. అంతకుముందు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధ్యక్షుడు కె.ఫరీడ, రాష్ట్ర ప్రధానఎన్నికల అధికారి విజయానంద్, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ టు సీఎస్ పి.ప్రశాంతి, స్పెషల్ ఆఫీసర్ ఎంఐజీ బసంత్ కుమార్, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ సత్యనారాయణ, సీఎం అదనపు కార్యదర్శి ఆర్.ముత్యాలరాజు, రాష్ట్ర కార్మిక శాఖ విశ్రాంత ముఖ్య కార్యదర్శి బి.ఉదయలక్ష్మి, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ శారదతో పాటు దివ్యాంగ విద్యార్థులు సీఎస్ సమీర్ శర్మకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. -
కులం, మతం, పార్టీలు చూడలేదు
ఏ సమాజమైనా చీకటి నుంచి వెలుగులోకి రావాలని, వెనుకబాటు నుంచి అభివృద్ధి వైపు అడుగులు పడాలని ఆరాట పడుతుంది. అసమానతల నుంచి సమానత్వం అందాలని, తద్వారా ఆత్మాభిమానంతో బతకాలని, అరాచకం నుంచి చట్టబద్ధ పాలన వైపు పాలకులు ప్రయాణం చేయాలని తాపత్రయ పడుతుంది. అలాగే ఏ మనిషైనా, ఏ కుటుంబమైనా.. నిన్నటి కంటే నేడు బాగుండాలని, నేటి కంటే రేపు ఇంకా బాగుండాలని, రేపటి కంటే తమ భవిష్యత్ ఇంకెంతో బాగుండాలని కోరుకుంటారు. అటువంటి పాలన దిశగా ఈ రోజు మీ బిడ్ద అడుగులు వేస్తూ.. అభివృద్ధి బాటలో నడిపించ గలుగుతున్నాడని గర్వంగా చెబుతున్నాను. ప్రతి ఒక్కరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ రోజు జనవరి ఒకటి.. రాష్ట్రంలో ఉన్న ప్రతి అవ్వకూ, ప్రతి తాతకూ, ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ, ప్రతి సోదరుడికీ, ప్రతి స్నేహితుడికీ, ప్రతి ఒక్కరికీ గుండెల నిండా ప్రేమతో మీ బిడ్డ హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేస్తున్నాడు. – ముఖ్యమంత్రి జగన్ సాక్షి ప్రతినిధి, గుంటూరు: ‘రాష్ట్రంలో ఈ రోజు పెన్షన్లకు కోటాల్లేవు. కోతల్లేవు. లంచాలు లేవు. జన్మభూమి కమిటీల అడ్డంకులు లేవు. ఎంత ఎక్కువ మందికి ఎగ్గొట్టాలి.. అన్న కుతంత్రాలు లేవు. అందుకే కులం, మతం, వర్గం చూడలేదు. ఆఖరుకు మనకు ఓటు వేసినా వేయకపోయినా సరే ఇవ్వాలని చెప్పి ఏకంగా రూల్ తీసుకొచ్చాం. అర్హత ఉంటే చాలు.. పెన్షన్ వాళ్ల గడప వద్దకే వచ్చేట్టు చేస్తున్నాం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. శనివారం గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో పెంచిన పెన్షన్లను లబ్ధిదారులకు అందించే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ.. ప్రతినెలా ఒకటో తేదీన ఆ రోజు ఆదివారమైనా, సెలవు దినమైనా సరే సూర్యోదయానికి ముందే వలంటీర్ మీ గడప ముందుకు వచ్చి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ పింఛన్ డబ్బులు అందజేస్తున్నారని తెలిపారు. ఈసారైతే హ్యాపీ న్యూ ఇయర్ అని విష్ చేస్తూ.. పెన్షన్లు ఇస్తున్నారని చెప్పారు. ఇంకా ఏమన్నారంటే.. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో పింఛన్ లబ్ధిదారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆస్పత్రిలో ఉంటే అక్కడికే వెళ్లి ఇస్తున్నారు ► అవ్వాతాతలు అనారోగ్యం వల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే నా వలంటీర్ అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు స్వయంగా అక్కడికి వెళ్లి పెన్షన్ అందజేస్తున్న గొప్ప వ్యవస్థ మన రాష్ట్రంలో ఉంది. దాదాపు 2.70 లక్షల మంది గ్రామ, వార్డు వలంటీర్లు ఇవాళ పెన్షన్ల పంపిణీ అనే యజ్ఞంలో పని చేస్తున్నారు. ► ఈ రోజు పెన్షన్ అందుకోవడంలో ఎవరికైనా ఇబ్బందులు ఉంటే ఆ గ్రామ, వార్డు సచివాలయాన్ని, లేక మీ వలంటీర్‌ను సంప్రదించండి. వారే దగ్గరుండి మీకు పెన్షన్ అందేలా సాయం చేస్తారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సుచరిత, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెరుకువాడ శ్రీ రంగనాథరాజు పాల్గొన్నారు. -
ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు ఫొటోలు
-
కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ !
-
Happy New Year Whatsapp Status : అందరూ మెచ్చే వాట్సాప్ స్టేటస్ కోరుకుంటున్నారా? ఇది మీకోసమే..
కాలగమనంలో ఒక ఏడాది దొర్లిపోయింది. కొందరికి చేదు జ్ఞాపకాలు, మరికొందరికి మధురానుభూతుల్ని పంచింది 2021. ఇక ఎప్పటిలాగే కొత్త ఏడాదిలోకి గంపెడు ఆశలతో అడుగుపెడతాం. ఆ ఆశించడాన్ని నలుగురితో కలిసి పంచుకోవాలనుకుంటాం. అయినవాళ్లకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటాం. అది మాటల్లోనే ఉండాలన్న గ్యారెంటీ లేదు కదా!. స్మార్ట్ లైఫ్‌లో విష్ చేసుకోవడానికి కూడా ఓ తరిఖా ఉంటోంది. సింపుల్‌గా ఒక్క ఫొటో చాలు. ఒకేసారి ఎంతో మందికి శుభాకాంక్షలు చెప్పినట్లే లెక్క! అందుకు వాట్సాప్ స్టేటస్ ఒక ప్లాట్‌ఫామ్‌గా ఉంటోంది. మరి మీరూ మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవాళ్లకి న్యూఇయర్ విషెస్ చెప్పాలనుకుంటున్నారా? అందుకోసం సాక్షి డాట్ కామ్ ప్రత్యేకంగా కొన్నింటిని మీకు అందిస్తోంది. Best WhatsApp Status For Happy New Year Wishes అందరూ మెచ్చే ఈ గ్రీటింగ్ ఫొటోలతో.. మీ వాట్సాప్ కాంటాక్ట్‌లోని వాళ్లందరికీ విషెస్ చెప్పేయండి. ఈ ఏడాది మొదటిరోజును సమ్‌థింగ్ స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకోండి. ఈ కొత్త సంవత్సరం మీకు మీ కుటుంబ సభ్యులకు సూర్యకాంతుల వంటి విజయాలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. కొత్త సంవత్సర శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో సరికొత్త నిర్ణయాలు తీస్కోని విజయం సాధించాలని కోరుకుంటూ... విష్ యూ ఎ హ్యపీ న్యూ ఇయర్ 2022 మధురమైన ప్రతి క్షణం నిలుస్తుంది జీవితాంతం రాబోతున్న కొత్త సంవత్సరం అలాంటి క్షణాలనెన్నో అందించాలని ఆశిస్తున్నా నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రకృతిలో అందాన్ని..సున్నితమైన భావాన్ని..అందమైన మనస్సుని రాబోయె కొత్త సంవత్సరం లోనే కాకుండా, జీవితాంతం ఆస్వాదిస్తూ ఉండాలని కోరుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు -
న్యూ ఇయర్ వేడుకలకు బ్రేక్..
-
హైదరాబాద్ : న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఫోటోలు
-
భయపెడతా
వచ్చే ఏడాది 12 గంట కొట్టగానే హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఫుల్ జోష్‌లో ఉంటారందరూ. కానీ ఆ కేరింతల్ని భయంతో, ఊహించని థ్రిల్‌తో వచ్చే అరుపులుగా మార్చబోతున్నాం అంటున్నారు జాన్వీ కపూర్. వచ్చే ఏడాదిని ‘ఘోస్ట్ స్టోరీస్’తో ప్రారంభించబోతున్నారు జాన్వీ కపూర్. నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన ‘లస్ట్‌స్టోరీస్’ యాంథాలజీ తరహాలోనే ‘ఘోస్ట్ స్టోరీస్’ రూపొందించబడింది. ‘లస్ట్‌స్టోరీస్’ను తెరకెక్కించిన కరణ్ జోహార్, అనురాగ్ కశ్యప్, దిబాకర్ బెనర్జీ, జోయా అక్తర్ ఈ యాంథాలజీను డైరెక్ట్ చేశారు. ఇది జనవరి 1వ తారీఖున రాత్రి 12గంటలకు నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. కాగా కరణ్ జోహార్ డైరెక్ట్ చేసిన కథలో జాన్వీ నటించారు. -
నూతన ఉత్సాహం
-
ఏఐ, రోబోటిక్స్ నిపుణులకు ఈ ఏడాది హ్యాపీ
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్‌కు ఈ ఏడాది హ్యాపీ న్యూఇయర్ కాబోతుంది. ఈ ఏడాదిలో రోబోటిక్స్ నిపుణులకు 50-60 శాతం ఎక్కువ డిమాండ్ ఉండబోతుందని హ్యుమన్ రిసోర్స్, సెర్చ్ ఎక్స్‌పర్ట్‌లు అంచనావేస్తున్నారు. వ్యాపార వ్యూహాలపై మిషన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ప్రభావం చూపనున్నట్టు పేర్కొన్నారు. పునరావృత పనులను మిషన్లు తగ్గిస్తాయని, రోబోటిక్స్, ఏఐ, బిగ్ డేటా, అనాలిటిక్స్‌కు ఎక్కువగా డిమాండ్ ఉంటుందని ఓరాకిల్ ఆసియా-పసిఫిక్ రీజన్ సీనియర్ డైరెక్టర్ షఖున్ ఖన్నా చెప్పారు. ఐఓటీ ఎకోసిస్టమ్‌లో ఉద్యోగాలు గత మూడేళ్లలో నాలిగింతలు పెరిగాయని బిలాంగ్ అంచనావేసింది. గత కొన్నేళ్లలో ఏఐలో డేటా అనాలిసిస్, డేటా సైంటిస్ట్ నిపుణులకు డిమాండ్ 76 శాతం పెంచినట్టు పేర్కొంది. వ్యాపారం, ఆర్థిక సర్వీసులు, ఇన్సూరెన్స్, ఈకామర్స్, స్టార్టప్‌లు, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్, హెల్త్‌కేర్, రిటైల్ వంటి రంగాల్లో ఎంట్రీ నుంచి మధ్య స్థాయి, సీనియర్ స్థాయి వరకు డిమాండ్ ఉందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ప్రక్రియ ఆధారిత కంపెనీలకు మంచి కస్టమర్ అనుభవాన్ని అందించడానికి రోబోటిక్స్ అవసరం ఉందని, ఇది వ్యయాలను తగ్గించి, సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని కెల్లీ సర్వీసెస్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ చెప్పారు. భారత్‌లో సుమారు 7వేల నుంచి 10వేల డేటా సైంటిస్ట్‌లు ఉన్నారని, 4 నుంచి 5 ఏళ్ల అనుభవమున్న వారికి రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షల వేతనాన్ని కంపెనీ ఆఫర్ చేస్తున్నట్టు తెలిసింది. డేటా అనాలిటిక్స్‌కు ప్రారంభ వేతనమే రూ.4 లక్షల నుంచి రూ.8లక్షలుంటుందని, 10 కంటే ఎక్కువ అనుభవమున్న ఏఐ నిపుణులకు రూ.60 లక్షల నుంచి రూ.1.5 కోట్లు సంపాదిస్తున్నారని రిపోర్టులు తెలిపాయి. -
2018లో చారిత్రక ఉద్యమాలు: గట్టు శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ శ్రేణులకు నిరంతరం పోరాటాలు చేసే విధంగా శక్తి నివ్వాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. 2018లో చారిత్రక ఉద్యమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. -
‘కొత్త’ ఆశయాలతో ముందుకెళ్దాం: హరీశ్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలకు ఇరిగేషన్, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదివారం ఒక ప్రకటనలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ఎన్నో కొత్త ఆశయాలతో, సరికొత్త ఆలోచనలతో, లక్ష్యాలను సాధించి ముందుకు పోవాలని ఆకాంక్షించారు. గతేడాదిలో విద్యా, వైద్యం, వ్యవసాయం, విద్యుత్ రంగాల్లో పెనుమార్పులు తెచ్చామన్నారు. కొత్త సంవత్సరం నుంచి రైతుల కళ్లల్లో వెలుగులు నింపాలనీ వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇవ్వబోతున్నట్టు తెలిపారు. కొత్త సంవత్సర వేడుకలను ప్రజలందరూ సుఖసంతోషాలతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. -
ప్రతి ఇంటా సుఖ సంతోషాలు వెల్లివిరియాలి
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2018 అభివృద్ధి, ఆనందాల సంవత్సరం కావాలని, ప్రతి ఇంటా సుఖ సంతోషాలు వెల్లివిరియాలని, తెలుగు రాష్ట్రాల ప్రజల జీవితాల్లో మంచి మార్పులు కలగాలని జగన్ ఆకాంక్షించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. -
ప్రజలంతా సుఖ సంతోషాలతో గడపాలి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో ప్రజలంతా సుఖ సంతోషాలతో గడపాలని భగవంతుడిని ప్రార్థించారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం చేపట్టే కార్యక్రమాలన్నీ 2018లో కూడా విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. -
హ్యాపీ న్యూ ఇయర్
-
హ్యాపీ న్యూ ఇయర్
-
ఆదరాభిమానాల్లో ‘లక్ష్మీపుత్రుడు’
దివ్యాంగుడికి శుభాకాంక్షలు తెలిపిన ఐటీడీఏ పీఓ డా.లక్ష్మీ షా పార్వతీపురం: ఆయన ఓ ఐఏఎస్ అధికారి. ఆయన చుట్టూ ఎప్పుడూ అధికారులు, సిబ్బంది, రాజకీయ నాయకులు తిరుగుతుంటారు. ప్రత్యేక సందర్భాలు, పండగలు వచ్చాయంటే క్షణం తీరిక లేకుండా ఆయనకు అందరూ శుభాకాంక్షలు చెప్పేందుకు పోటీ పడతారు. ‘ఇతరులలోని లోపాలను వెతికే వారు ఎవ్వరినీ ప్రేమించలేరు’. అన్న సూక్తిని స్ఫూర్తిగా తీసుకున్న ఆ ఐఏఎస్ అధికారి దివ్యాంగుడైన ఓ వ్యక్తిపై ప్రేమాభిమానాలు చూపించి దగ్గరికి వెళ్లి పూలు, పళ్లు ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివారం నూతన సంవత్సరం సందర్భంగా పార్వతీపురం ఐటీడీఏ పీఓ డాక్టర్ లక్ష్మీషాకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు అందరూ పళ్లు, పుష్పగుచ్ఛాలు, డైరీలతో వచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే అందరితో పాటు వచ్చిన (ఉపాధి కార్యాలయ ఉద్యోగి) దివ్యాంగుడైన భాస్కరరావు అధికారికి శుభాకాంక్షలు చెప్పే అవకాశం తనకు వస్తుందో రాదోనని బితుకుబితుకుమంటూ దూరంగా నిల్చున్నాడు. ఈ విషయాన్ని గమనించిన పీఓ లక్ష్మీషా తానే స్వయంగా పుష్పగుచ్ఛం, పళ్లు పట్టుకుని దివ్యాంగుడైన భాస్కరరావు దగ్గరకు వెళ్లి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యాలయంలో అందరూ శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం పీఓ లక్ష్మీషా స్థానిక ‘జట్టు’ ఆశ్రమానికి వెళ్లి అక్కడి పిల్లలకు పళ్లు, పువ్వులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అక్కడి పిల్లలతో పీఓ మాట్లాడుతూ ఏ అవసరమొచ్చినా తాను అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. -
అంబరాన్నంటిన ‘నూతన’ సంబరాలు
► నోరూరించే వంటలు..వెరైటీ కేక్‌లు ►అర్ధరాత్రి దాటే వరకూ సంబరాలు ► వేడుకలు ఘనంగా జరుపుకున్న ప్రజానీకం నూతన సంవత్సర వేడుకలను జిల్లా ప్రజానీకం ఘనంగా జరుపుకుంది. అంబరాన్నంటేలా సంబరాలు నిర్వహించారు. కొత్త సంవత్సరానికి నోరూరించే రుచులు..వెరైటీ కేక్‌లు స్వాగతం పలికాయి. జిల్లా యావత్ ప్రజలు సంబరాల్లో మునిగితేలారు. 2016కు వీడ్కోలు చెబుతూ 2017కు స్వాగతం పలికారు. నిర్మల్‌రూరల్ : ‘హ్యాపీ న్యూ ఇయర్...’ అంటూ జిల్లావాసులు జోష్‌గా 2017కు స్వాగతం పలికారు. జిల్లా కేంద్రంలో శనివారం సాయంత్రం నుంచే మొదలయిన న్యూఇయర్ వేడుకలు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కొనసాగాయి. కేక్‌లు కట్ చేస్తూ ఒకరికొకరు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మార్కెట్లో సందడి నెలకొంది. బేకరీలు కిటకిటలాడాయి. నోరూరించే నాన్ వెజ్ వంటకాలను తీసుకెళ్లేందుకు జనం ఎగబడ్డారు. జిల్లా కేంద్రంలోని శాస్రీ్తనగర్, దివ్యనగర్‌లో గల వాసవి ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్‌లు తినిపించుకుంటూ విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. పాఠశాలల ప్రిన్సిపాల్లు సుహాసిని, రాందాస్, డైరెక్టర్ జగదీశ్‌రెడ్డి, కరస్పాండెంట్ పోతారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. దీక్ష డిగ్రీ కళాశాలలో నిర్వహించిన వేడుకల్లో ప్రిన్సిపాల్ మెంగ శ్రీధర్ కేక్ కట్ చేశారు. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఖానాపూర్ : నూతన సంవత్సర వేడుకలను పట్టణ ప్రజానీకం స్వాగతం పలికింది. బేకరీ దుకాణాలు కేక్‌ల కొనుగోలుదార్లతో సందడిగా మారాయి. ఇదే అదనుగా నిర్వహకులు వివిధ రకాల ఆఫర్లు పెట్టి వ్యాపారం చేసుకున్నారు. యువత అర్ధరాత్రి దాటే వరకూ సంబరాల్లో మునిగితేలారు. -
అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలి
-
అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం ప్రతి పౌరుడి జీవితంలో ఆనందం, ఆరోగ్యం, శ్రేయస్సును తీసుకురావాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరం పురస్కరించుకొని ఆదివారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు గవర్నర్ రాజ్‌భవన్ దర్బార్ హాల్లో సాధారణ ప్రజలు, రాజకీయ నాయకులు, అధికారులకు అందుబాటులో ఉండనున్నారని గవర్నర్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. -
ప్రజల ఆకాంక్షలన్నీ నెరవేరాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజల ఆకాంక్షలన్నీ నెరవేరాలని కోరుకున్నారు. ప్రజలంతా ఆనందం, ఉత్సాహంతో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా 2016లో బలమైన పునాదులు పడ్డాయని సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే ఒరవడిలో 2017 సంవత్సరం సాగేలా చూడాలని సీఎం కేసీఆర్ భగవంతుడిని వేడుకున్నారు. -
నా ప్రతిష్టను దెబ్బతీసేందుకు యత్నాలు
న్యూఢిల్లీ: నిరాధార ఆరోపణలతో తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వక ప్రయత్నాలు జరిగాయని టాటా గ్రూప్ తాత్కాలిక చైర్మన్ రతన్ టాటా వ్యాఖ్యానించారు. చెప్పే నీతులను ఆచరించే అలవాటు లేని కొందరు వ్యక్తులు.. తమ గ్రూప్ విలువలను, నైతికతను సవాల్ చేస్తున్నారని పేర్కొన్నారు. గ్రూప్ సంస్థల ఉద్యోగులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ రాసిన లేఖలో .. ఆయన ఎవరి పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించకుండా, పరోక్ష విమర్శలు చేశారు. గడిచిన మూడు నెలలుగా సంక్షోభ సమయంగా గడించింద ని, టాటా గ్రూప్‌తో పాటు కొందరి వ్యక్తిగత ప్రతిష్టను మసకబార్చేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు జరిగాయని టాటా తెలిపారు. టాటా గ్రూప్ 150వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో గడచిన పరిణామాలన్నింటినీ పక్కన పెట్టి.. వివిధ రంగాల్లో టాటా గ్రూప్ ఆధిపత్యం కొనసాగించేందుకు ఉద్యోగులు కృషి చేయాలని టాటా సూచించారు. -
'హ్యాపీ న్యూ ఇయర్' లో జియోకు తిప్పలు
ముంబై: టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ తాజా ఫ్రీ ఆఫర్లపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరింది. జియో 90 రోజుల ఉచిత డేటా మరియు వాయిస్ ఆఫర్ పొడిగింపు తాజా నిబంధనల ఉల్లంఘన కిందకు ఎలా రాదో తెలపాలని అడిగింది. ఈమేరకు జియోకు వారం క్రితం లేక పంపించామని, త్వరలోనే జవాబును ఊహిస్తున్నామని ట్రాయ్ సీనియర్అధికారి వెల్లడించారు. ఈ విషయాలను తాము పరిశీలిస్తున్నామని చెప్పారు. ముకేష్ అంబానీ నేతృత్వంలో జియోను ప్రమోషన్ ఆఫర్ పై వివరాలు తెలియజేయాల్సిందిగా డిసెంబర్20న లెటర్ పంపించామని అయిదురోజుల్లో వారి స్పందన రావాల్సి ఉందని చెప్పారు. డాటా ఆఫర్ లో స్వల్ప మార్పు తప్ప పాత ఆఫర్ కు పొడిగింపుగానే జియో కొత్త ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని ఆ అధికారి తెలిపారు. మరోవైపు రిలయన్స్ జియోకు తాజా ఆఫర్ కు వ్యతిరేకంగా భారతీ ఎయిర్ టెల్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. ‘వెల్ కమ్ ఆఫర్’ ముగిసిన తర్వాత కూడా ‘ఉచిత ఆఫర్’ కొనసాగింపునకు ఎలా అనుమతి ఇచ్చారంటూ ట్రాయ్ ను నిలదీసింది. ఈ మేరకు టెలికం వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ ను ఆశ్రయించింది. నిబంధనలు ఉల్లంఘిస్తున్న రిలయన్స్ జియోకు ట్రాయ్ వంతపాడుతోందని ఆరోపించింది. కాగా ఈ ఏడాది సెప్టెంబర్ నుండి మూడు నెలల పాటు అందుబాటులోకి తెచ్చిన ఉచిత డేటా మరియు వాయిస్ కాల్స్ సేవలు డిసెంబర్ 3 న ముగియనుండగా డిసెంబర్ 1 న 'హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్' ప్రకటించింది జియో. మార్చి 2017 వరకు పొడిగించిన ఈ ఆఫర్ ను పొడిగించింది. గతంలో రిలయన్స్ జియో 90 రోజుల ఉచిత సర్వీసులపై కూడా ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా, ఇతర టెలికాం కంపెనీలఆరోపణలను తోసిపుచ్చిన ట్రాయ్ జియోకు క్లీన్ చిట్ ఇస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా..
-
న్యూ ఇయర్ వేడుకలకు డబ్బులివ్వలేదని..
జామాబాద్ క్రైమ్: కొత్త సంవత్సరం వేడుకలకు తండ్రి డబ్బులు ఇవ్వలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ నగరంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన మెండు సాగర్ (20) తన మిత్రులతో కలిసి కొత్త సంవత్సరం వేడుకలు చేసుకునేందుకు తండ్రి గంగాధర్‌ను డబ్బులు అడిగాడు. తండ్రి డబ్బులు ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందిన సాగర్ గురువారం అర్ధరాత్రి మేడ మీద ఉన్న తన గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మూడో టౌన్ ఎస్సై శ్రీహరి తెలిపారు. -
నూతన సంవత్సర శుభాకాంక్షలు: మోదీ
న్యూఢిల్లీ: దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరికి మంచి జరగాలని, 2016 సంతోషంగా గడిచిపోవాలని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 2016 ఏడాది శాంతి, సంతోషం, ఆరోగ్యం అందరికీ కలగాలని మోదీ కోరుకున్నారు. ప్రధాని శుక్రవారం ఉదయం దేశప్రజలందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలపడంతో పాటు ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో ఉండాలని, ముందుగు సాగిపోవాలన్నారు. As the year 2016 begins, my greetings & good wishes to everyone. May 2016 bring joy, peace, prosperity & good health in everyone's lives. — Narendra Modi (@narendramodi) January 1, 2016 -
పక్షులతో హ్యాపీ న్యూయర్
న్యూఢిల్లీ: ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ విభిన్న 'డూడుల్'తో వీక్షకులకు ముందుగానే నూతన శుభాకాంక్షలు తెలిపింది. యానిమేటెడ్ డూడుల్ తో హ్యాపీ న్యూయర్ చెప్పింది. కొమ్మపై కూర్చున్న ఐదు పక్షులు 2016 పేరుతో ఉన్న గుడ్డును పొదిగేందుకు రాత్రి 12 గంటలు ఎప్పుడమవుతుందా అని చూస్తున్నట్టుగా డూడుల్ తయారు చేసింది. గూగుల్ వెబ్ సైట్ ఓపెన్ చేయగానే ఈ డూడుల్ వీక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రముఖ వ్యక్తులు, ముఖ్య సంఘటనలకు సంబంధించిన వాటితో డూడుల్ రూపొందించి గూగుల్ తన వెబ్ సైట్ లో పెడుతున్న సంగతి నెట్ వీక్షకులకు సుపరిచితం. -
11:59:59
సందర్భం చెట్టు క్యాలెండర్ చూసుకొని చిగురేస్తుందా? పిట్ట అలారం పెట్టుకొని లేస్తుందా? జంతువులు జనవరి ఫస్ట్ విషెస్ చెప్పుకుంటాయా? పాపం... వాటి మానాన అవి పని చేస్తుంటాయి. తిథులూ, వారాలూ, వర్జ్యాలూ చూసుకోవు. రాహుకాలం, యమ గండం తెలియదు. అందుకే వాటికి దినదిన గండం. అయితే తనకు నూరేళ్లాయుష్షు అని నమ్మే మనిషి పరిస్థితి వేరు. కాలం కీళ్లు విరిచేసి... తేదీలనీ, నెలలనీ, సంవత్సరాలనీ విడ గొట్టాడు. మంచిరోజులూ, అమృత ఘడియలూ నిర్ణయించాడు. వాడెంత తెలివైనవాడంటే... కాలాన్ని ఫిస్టులో పట్టుకోగలనన్నాడు. సెకన్లు, నిమిషాలు, గంటలను మణికట్టుకు తిరిగాడు. కళ్లకు ముళ్లు గుచ్చుకుంటా యేమోనని గడియారంలో నలు చదరమైన డిజిటల్ అంకెలను పేర్చాడు. అలాగే క్యాలెండర్లో మంచిరోజులూ చెడ్డరోజులూ కూర్చాడు. తేదీలు, నెలలు, సంవత్సరాల్ని కాగితం మీద పేర్చాడు. క్యాలెండర్ అనే పేరిచ్చి, వాటితో గోడ కుర్చీ వేయించాడు. అయిపోయిన నెలలను మొదట శీర్షాసనం వేయించి, ఆ తర్వాత వెనక్కు మడిచేసి, చక్రాసన, ధనురాసన ఇత్యాది యోగాసన ప్రక్రియలు చేయి స్తుంటాడు. టేబుల్ క్యాలెండర్ పేరిట కొన్నింటితో బస్కీలు తీయిస్తుంటాడు. ఎర్ర రంగులో ఉన్న తేదీ వచ్చినప్పుడల్లా బడికి సెలవొస్తుందని చిన్నప్పట్నుంచే నేర్పడం మొదలు పెడతాడు. అది నిజమవుతుంది. క్యాలెండరేతర అంశాలపైనా దృష్టి సారిస్తుంటాడు. ఆ నమ్మకాన్ని సొమ్ము చేసుకోడానికి కొందరు బయల్దేరతారు. మోసపోయే విద్యను పనిగట్టుకు నేర్చుకుంటారు. పాపం... చెట్టూ, పుట్టా, పిట్టా, సమస్త జంతుజాలాలకు ఈ విషయాలు తెలియవు కాబట్టి అవి క్యాలెండర్ చూసుకోవు. చెట్లు పైపైకి పెరుగుతాయి. పిట్టలు ముందుకెళ్లడానికి రెక్కల కష్టం చేస్తాయి. జంతుజాల సమస్తమూ ముందుకే నడుస్తాయి. కానీ మనిషి ఎంత తెలివైనవాడంటే... కాలం వెనక్కు నడవదని తెలిసినా, క్రీస్తు పుట్టక ముందు కాలాన్ని వెనక్కు నడిపిస్తాడు. చరిత్ర తెలి యనివాడు క్రీస్తుపూర్వానికి ముందు డేట్స్ చదువుతుంటే అది ప్రింటింగ్ మిస్టేకా అని పించేలా చేస్తాడు. ముందు కెళ్తున్న రైల్లోని సగం సీట్లు వెనక్కు తిప్పి పెట్టడం అవసరమనీ, ఆ సౌలభ్యం వల్లనే సగం మందిని కూర్చోబెట్టగలుగుతున్నా మని నమ్మబలుకుతాడు. అలా కొందరిని వెనక్కి నడి పించడానికి పూను కుంటాడు. తమకు చాలా తెలుసు అనే కొందరు మనషులకు నిజంగా ఏమీ తెలి యదు. ముఖ్య దినాలనీ, ముహార్తాలనీ కొన్ని రోజులకు సుగంధ పరిమళాలు అద్దితే... ఆ సువాసనలు పీలుస్తున్నట్లు ఊహిస్తారు. మరికొన్ని దినాలను దుర్దినాలుగా ముద్రవేస్తే అవి క్షుద్రమైనవని విశ్వసిస్తుంటారు. వాళ్లు తమకన్నీ తెలుసనే భ్రాంతిలో ఉంటారు. ఇలాంటి వాళ్లను నమ్మించడం చాలా సులువు. కొందరు మహానుభావులు ఏం చెప్పినా వీళ్లు విశ్వసిస్తుంటారు. వీళ్ల కోతలెలా ఉంటాయంటే... మొద్దు నిద్దర పోతుండే కోడికి అలారం పెట్టి పొద్దున్నే లేపడం నేర్పింది తామేనని కూస్తారు. తాము ట్రబుల్ షూటర్లమంటారు. గాలి మోటర్లలో తిరుగుతారు. అల స్వర్గపురాన్ని ఇలాతలంలో నిర్మిస్తున్నామని అరచేయి చూపుతారు. మొక్కా, గిక్కా, పంటా, పసరూ పీకేస్తారు. చెట్లూ గట్రా కొట్టేస్తారు. చదునుగా చేసేస్తారు. ‘‘చూశావా... అడ్డంగా నరికి చూస్తే మొద్దులాంటి చెట్టు లోనూ రింగులు రింగులు కనిపిస్తున్నాయి. ఏడాదికేడాదీ పెరిగే వీటినే యాన్యువల్ రింగ్స్ అంటారు. ఎంత పెద్ద వయసు చెట్టుకు అన్ని రింగులు. కాబట్టి చెట్టూ ఉంగరాలు తొడుగుతుంది’’ అని చెబుతారు. ప్రజల బంగారాన్ని కొల్లగొట్టి చేతి వేళ్లకు తొడుక్కుంటారు. వేళ్లు పదే ఉండబట్టి గానీ... మరిన్ని ఉంటే వీళ్లకు రింగులు సరిపోవు. ఊడ్చేస్తారు, ఊళ్లేలతారు. ‘ఉంగరాలు మేం తొడిగాం, నడుం మీరు కట్టండంటూ మొండేనికి మొలదారం మాత్రమే మిగులుస్తారు. ఇదేంట్రా బాబూ అంటే ‘చెట్టు మొద్దుకూ, నీ మొలకూ ఇదే అందం’ అంటూ మారేడుకు మసిపూస్తారు. నేరేడులోనిది నీలి సిరా అన్ని నమ్మిస్తారు. ఆ సిరాతో విధి రాతలోని హంస పాదులను సరిచేస్తామంటారు. అన్నీ చెప్పాక... సామాన్యులకు అన్నీ దూరం చేసి, గోచీ మాత్రం మిగుల్చుతారు. అదేమిటని అడిగితే తేలికగా ఉండటంలో హాయిని అనుభవించమని సలహా ఇస్తారు. ఏతా వాతా క్యాలెండర్ మారినప్పుడల్లా ఏదో అద్భుతం జరుగుతుందని ఎందరో అనుకుంటారు. ఇంకేదో ఒరుగుతుందని ఆశపడతారు. ఆకాశాన్ని అంబరమనే అంటారంటూ... అనగా అర్థం వస్త్రమేనంటూ వ్యాఖ్యానం చెప్పి, దాని ముక్కను చింపి ఇస్తామంటారు. దానితో కొత్త బట్టలు కుట్టిస్తామంటారు. చమ్మీ ధమ్మీలతో అధికారాలు చెలాయిస్తుంటారు. కాలాన్ని వెళ్లదీస్తుంటారు. క్యాలెండర్ పుట మారితే సరిపోతుందా... కొత్త సంవత్సరాన్ని తిరగస్తే అది ‘త్తకొంరత్సవంస’ అవుతుందేమో గానీ... చేతి గీత ఎన్నడూ మారదు కదా! విధి రాత మారాలంటే కనీసం ఇది ఎన్నికల ఏడాది... 2019 అయినా కాదు కదా! - యాసీన్ -
నువ్వు నీ కుటుంబం మనం
కొత్త కొత్తగా ఇంకో మూడు రోజుల తరువాత వచ్చే నాలుగో రోజు సాయంత్రం నుంచి మన హడావిడి మొదలవుతుంది. మన సంతోషాల వేడికి చలికి చిరు చెమటలు పడతాయి. కేకులు తెగుతాయి. ‘హ్యాపీ న్యూ ఇయర్’ కేకలు ఎగిసిపడతాయి. ‘హ్యాపీ న్యూ ఇయర్’లో లెఫ్ట్ అండ్ రైట్ను పట్టించుకుంటున్నాంగానీ మధ్యలో ఉన్న విలువైన నిధి జోలికి మాత్రం చాలామంది వెళ్లడం లేదు. ‘న్యూ’ అంటే మూడు అక్షరాల పదం కాదు... మనల్ని, మనతో పాటు కుటుంబాన్ని, కుటుంబంతో పాటు సమాజాన్ని మార్చేసే శక్తిమంతమైన బ్రహ్మాస్త్రం. అందుకే ఈ అస్త్రం ఎప్పుడూ చెట్టెక్కకూడదు. ‘నేను’తోనే ఆ ఆయుధం పదును తేరుతుంది. జపాన్ ఆర్టిస్ట్, పీస్ యాక్టివిస్ట్, సింగర్ యోకో తరుచుగా ఒక మాట చెబుతుంటారు... ‘నువ్వు మారితే నీ కుటుంబం మారుతుంది. అది మారితే ప్రపంచమే మారుతుంది’ అని! మార్పు, కొత్తదనం నుంచి వచ్చే ఫలితాలు ముందస్తుగా కనిపించవు. అమెరికన్-రష్యన్ సైన్స్ ఫిక్షన్ రచయిత్రి వెరా నజరీయన్ మాటల్లో చెప్పాలంటే ‘కొత్తదనం’ లేదా ‘మార్పు’ అనేది తొలి వేకువ లాంటిది. పుట్టడం పుట్టడంతోనే వేకువ బ్రహ్మాండమైన వెలుగైపోదు. వెలుగు చుట్టూ చీకటి ఉంటుంది. ఆ చీకటిని చీల్చుకుంటూ మెల్లగా అరుణోదయం అవుతుంది. మార్పు కూడా అంతే. మనం మారాలనుకున్నప్పుడు, కొత్తగా బతకాలనుకున్నప్పుడు ప్రతికూలత అనే చీకటి ఆవరించి ఉంటుంది. అయితే అది కొద్దిసేపు మాత్రమే. పట్టుదల అనే వేడికి ఆ చీకటి కరిగిపోతుంది. వెలుగుబాటకు దారి చూపుతుంది. ఇప్పుడు మళ్లీ మనం యోకో దగ్గరికి వద్దాం. ‘రోజూ పొద్దుటే అద్దంలో నిన్ను నువ్వు చూసుకొని పలకరించుకో. కొద్ది కాలం తరువాత నీ జీవితంలో వచ్చే పెద్ద మార్పేమిటో గమనించుకో’ అంటారామె. అద్దం అంటే మ్యాజిక్ మిర్రర్ కాదు. అందరింట్లో ఉండే మామూలు అద్దమే. అది అద్దమే కాదు, అంతరాత్మ కూడా. అందుకే ఉదయమే అద్దాన్ని పలకరించండి. ఎందుకు? ఏమిటి? ఎలా? ఈ మూడు ప్రశ్నలూ వేయండి. అద్దమే సమాధానం చెబుతుంది. ‘నేను ఇలా ఎందుకు ఉన్నాను?’ ‘దీనికి కారణం ఏమిటి?’ ‘దీని నుంచి బయటపడడమెలా?’ అన్ని సమస్యలకూ ఈ మూడు ప్రశ్నలే సమాధానం చెబుతాయి. మనల్ని కొత్త మనిషిగా సమాజం ముందు నిలుపుతాయి. శేషేంద్ర కవిత్వాన్ని ఒక్కసారి గుర్తుతెచ్చుకుందాం. ‘బయట ఉన్నది నేనే/లోపల ఉన్నది నేనే/బయటి బాధలకు నేను ఎప్పుడు కరిగి నీరై పోయానో/అప్పుడే నేను నా లోపలి బాధల్ని పోల్చుకోలిగాను.’ నిజానికి పోల్చుకోగలిగింది ‘బాధ’ మాత్రమే కాదు... జీవనోత్సాహం, జీవనవైవిధ్యం... ఇలా ఎన్నెన్నో! మన కుటుంబానికి ఏం చేయవచ్చు? కుటుంబం పట్ల మన బాధ్యత మనకు సరికొత్త శక్తినిస్తుంది. ‘నా తల్లిదండ్రులు గర్వపడే పని చేస్తాను’ అను కున్నప్పుడు... ఆ బాధ్యత మనలో శక్తిని నింపుతుంది. కుటుంబం ఇవ్వడంతో పాటు తీసుకోవడమూ నేర్పుతుంది. ‘నైతిక మద్దతు’ అనేదాన్ని కుటుంబం మనకిస్తే , విజయానందం అనేదాన్ని మనం కుటుంబానికి ఇస్తాం. ఈ గజిబిజి బిజీ బతుకుల కాలంలో ఎవరికి వారు ఒంటరీ ద్వీపాలమైపోతున్నాం. వెలుగు లేని చీకటి దీపాలవుతున్నాం. అందుకే మనం ఏ స్థాయిలో ఉన్నా... కుటుంబంతో గడపాలి. అమ్మ సలహా, నాన్న కోపం, అన్న తిట్టు, అక్క అలక, తమ్ముడి అల్లరి... ఏదీ వృథా పోదు. అన్నీ జీవితాన్ని వర్ణమయం చేస్తాయి. టైమ్ ఉన్నప్పుడు కుటుంబంతో గడపడం కాదు... టైమ్ తీసుకొని కుటుంబంతో గడపడమే మనం వారికిచ్చే విలువైన కానుక. కుటుంబంతో గడపడమంటే కుటుంబాన్ని గౌరవించడం, కుటుంబాన్ని గౌరవించడమంటే మనల్ని మనం గౌరవించుకోవడం, సమాజాన్ని గౌరవించడం కూడా! ‘రక్తం బంధాన్ని మాత్రమే ఇస్తుంది. ప్రేమ మాత్రమే కుటుంబాన్ని ఇస్తుంది.’ సమాజానికి ఏంచేయాలి? సమాజంలో భాగంగా బతుకుతున్న మనం సమాజం కోసం పాటుబడాలి. దీనికి ఒకే ఒక మంత్రం, మార్గం... పీయస్ఆర్! అంటే పర్సనల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ! ఒక్కమాటలో చెప్పాలంటే ‘మనకు ఇతరులు ఏం చేయాలనుకుంటామో... మనం ఇతరులకు అది చేయడం!’ ట్రాఫిక్స్ రూల్స్ సరిగ్గా పాటించడం నుంచి పర్యావరణ స్పృహతో చేసే మంచి పని వరకు, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టించడం నుంచి నెలజీతంలో ఎంతో కొంత సేవకు వెచ్చించే దయాగుణం వరకు... ఏది చేసినా సమాజం కోసం చేసినట్లే. ‘వందమందికి సహాయం చేసే శక్తి లేకపోతే కనీసం ఒక్కరికైనా సహాయం చెయ్’ అనే మాట గుర్తుంచుకుంటే చాలు. కొత్త సంవత్సరం అంటే పాత గోడ మీద కొత్త క్యాలెండర్ కనిపించడం కాదు. కొత్త జీవితానికి తాజాగా ఒక ద్వారం తెరుచుకోవడం. ‘పాత ఆలోచనల నుంచి బయటికి వచ్చినప్పుడే, కొత్తదనాన్ని చూడగలం. సంతోషంగా ఉండగలం’ అంటారు జిడ్డు కృష్ణమూర్తి. కొత్త ద్వారంలోకి ప్రవేశించే ముందు ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన వాక్యం ఇది! -
డబ్బులు లేక... డ్యాన్సులు చేశా!
షారుఖ్ ఖాన్... బాలీవుడ్ బాద్షానే కాదు... ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ధనిక సినీ ప్రముఖుల్లో ఒకరు కూడా. 2013 సంవత్సరానికి ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ధనవంతుల జాబితా తీస్తే టాప్ టెన్‌లో రెండో స్థానంలో షారుఖ్ నిలిచారు. ఈ విషయంపై షారుఖ్‌ను ఆకాశానికెత్తేసింది మీడియా. షారుఖ్ ఖాన్ మాత్రం తనదైన శైలిలో ఈ వార్త పై స్పందించారు. ‘‘డబ్బు విషయంలో కాదు.. అభిమానంలో నేను అత్యంత ధనికుణ్ణి. ప్రపంచవ్యాప్తంగా ప్రేమను పంచే అభిమానులు కొన్ని కోట్ల మంది ఉన్నారు. అదే నాకు సంపద’’ అని చెప్పారు. ‘‘‘హ్యాపీ న్యూ ఇయర్ ’ షూటింగ్ సమయంలో ఆ సినిమా నిర్మాతలు ఫోన్ చేసి మా దగ్గర డబ్బులు అయిపోయాయి. ఏం చేద్దాం అని అడిగారు. నేను వెంటనే పెళ్లిళ్లు, శుభకార్యాలకు నృత్యం చేసి డబ్బు సమకూరుస్తానని చెప్పా. అలానే డబ్బులు సంపాదించాను కూడా. దీంతో ఆ సినిమా చివరి షెడ్యూల్‌ను ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేయగలిగాం. ఆ ఫోన్ మాట్లాడి పెట్టేసిన వెంటనే ట్విటర్లో ఓ వార్త చదివా. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ధనికుల్లో నాది రెండో స్థానం అని. ఆ సమయంలో నాకు నవ్వాలో, ఏడవాలో అర్థం కాలేదు’’ అని షారుఖ్ ఖాన్ చెప్పారు. -
స్మార్ట్‌గా అడుగులు
కోటి ఆశలతో కొత్త ఏడాదికి స్వాగతం హుద్‌హుద్ వంటి విషాదాలకు వీడ్కోలు విశాఖ నగరంలో నింగినంటిన వేడుకలు సాక్షి, విశాఖపట్నం: ఎన్నో కష్టాలు.. మరెన్నో కన్నీళ్లు.. ఆటుపోట్ల నడుమ 2014లో నలిగిపోయిన నగరవాసులు.. కోటి ఆశలతో 2015కి స్వాగతం పలికారు.. పగబట్టిన ప్రకృతిని ఎదిరించి, పాలకుల వంచనను భరించి గతించిన కాలాన్ని చేదు జ్ఞాపకంలా, రానున్న రోజులను అందంగా భావించి వేడుకలు జరుపుకున్నారు. నగరం నడిబొడ్డు నుంచి శివారు గ్రామాల వరకూ నూతన సంవత్సర సంబరాలు హోరెత్తించారు. ప్రశాంత విశాఖలో భారీ సంచలనాలు, పెను సవాళ్లు కొత్త కాదు. గడిచిన ఏడాదిలోనూ అలాంటివి ఎన్నో ఎదురయ్యాయి. వాటిని అధిగమించి నవ్యాంధ్రప్రదేశ్‌కు ఆర్ధిక రాజధానిగా విరాజిల్లడంతోపాటు రానున్న రోజుల్లో స్మార్ట్ సిటీగా నగరం మారబోతోందనే సంతోషం నగరవాసుల్లో తొణికిసలాడింది. 2014లో భారీ విషాదం హుద్‌హుద్ రూపంలో వచ్చింది. ప్రాణాలు తీసింది. ఆస్తులను ధ్వంసం చేసింది. ప్రకృతి విపత్తు ఎంత భయంకరంగా ఉంటుందో రుచి చూపించింది. అయినా నగరం వణికిపోలేదు. నిలువెల్లా గాయాలైనా బెదిరిపోలేదు. జనం మనోధైర్యం ముందు విపత్తు చిన్నబోయింది. తలలు తెగిపడ్డ వృక్షాలు కొత్త చిగుళ్లు తొడిగాయి. అదే స్ఫూర్తి నూతన సంవత్సర వేడుకల్లో ఆవిష్కృతమైంది. కెవ్వు కేక నూతనోత్సాహంతో నగరవాసులు 2015కు స్వాగతం పలికారు. హ్యాపీ న్యూ ఇయర్ నివాదాలతో నగరం మారుమోగింది. చలిని లెక్క చేయక, ముసురును పట్టించుకోక, చిరుజల్లుల్లో తడుస్తూనే జనం సంబరాల్లో మునిగితేలారు. ప్రముఖ హోటళ్లు, రిసార్ట్స్‌లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆటలు, పాటలకు విదేశీ స్వదేశీ కళాకారులను రప్పించారు. సినీ, టీవీ రంగాలకు చెందిన నటీనటులు, యాంకర్లు నూతన సంవత్సర వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నగర శివారులోని ఓ రిసార్ట్‌లో దర్శకుడు కె.రాఘవేంద్రంరావు, సంగీత దర్శకుడు కోటి ఆధ్వర్యంలో ‘సాగర సంగమం’ అనే పేరుతో నిర్వహించిన సంగీవ విభావరి యువతను ఉర్రూతలూగించింది. పాత కొత్త పాటల మేలు కలయికతో నిర్వహించిన ఈ కార్యక్రమం న్యూ ఇయర్ వేడుకల్లో ప్రత్యేకంగా నిలిచింది. బీచ్ రోడ్డులో అర్ధరాత్రి 12 గంటలకు వేడుకలు మిన్నంటాయి. కేకులు కట్ చేసి బాణసంచా కాల్చి న్యూ ఇయర్‌కి స్వాగతం పలికారు. పోలీసు శాఖ ముందుగానే ఆంక్షలు విధించడంతో ఆకతాయిలకు కళ్లెం పడింది. వాహనాలు అనుమతించిన మార్గాల్లోనే నడవాలని చెప్పినప్పటికీ అదుపు చేయడం పోలీసులకు కష్టమైంది. దేవాలయాల్లోనూ కొత్త సంవత్సరం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజనలు, భక్తి గీతాలతో భక్తులు పండుగ జరుపుకున్నారు. ఇక ఫుడ్ కోర్టులకు, రెస్టారెంట్లు భారీ అమ్మకాలు జరిపాయి. ఆఫర్లతో ఆకర్షించి బిర్యానీ, ఫాస్ట్ఫుడ్లను నగరవాసులకు అందించాయి. బేకరీల్లో కేకులకు కొరత ఏర్పడింది. చేదును మర్చిపోయి, తీపిని ఆస్వాదిస్తూ చిన్నా, పెద్ద తేడా లేకుండా నూతన సంవత్సర సంబరాలు జరుపుకున్నారు. అధిక శాతం జనం వీధుల్లోకి వచ్చి వేడుకలు జరుపుకున్నారు. కొందరు ఇళ్లల్లోనే బంధుమిత్రులతో కేకులు కోసి సంతోషాలు పంచుకున్నారు. యువతరం చిందులతో కొత్త ఏడాది సంబరాలకు కళ తెచ్చారు. -
ఫాలోస్..!
నిన్నమొన్నటి దాకా ‘ఢీ అంటే ఢీ’ అనుకున్న సల్మాన్, షారూక్ఖాన్లు... చూస్తుంటే ఇప్పుడు ఒకరికొకరుగా మారినట్టున్నారు. సల్లూ భాయ్ చెల్లి అర్పితా పెళ్లిలో చాన్నాళ్ల తరువాత ఒక్కటైన ఈ ఇద్దరూ... ఒకరినొకరు ఫాలో కూడా అవుతున్నట్టున్నారు. ప్రస్తుతం సల్మాన్ వంతు. షారూఖ్ తరహాలో... తన చిత్రం ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ ప్రమోషన్ కోసం ప్రపంచ టూర్ ప్లాన్ చేశాడు కండల వీరుడు. ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమాకు షారూఖ్ ప్రపంచమంతా చుట్టొచ్చాడు. ఆ స్ఫూర్తితో ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ను కూడా ఇలాగే ప్రమోట్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందట. -
జయ బచ్చన్ వ్యాఖ్యలపై స్పందించిన అభిషేక్
ముంబై: హ్యపీ న్యూ ఇయర్ చిత్రంపై తన తల్లి జయబచ్చన్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తొలిసారి పెదవి విప్పారు. తన తల్లి జయబచ్చన్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని అభిషేక్ తెలిపారు. షారుక్ నిర్మించిన ఈ చిత్రంపై చెత్త చిత్రమంటూ జయబచ్చన్ వ్యాఖ్యలు చేసినట్టు ఓ కథనం మీడియాలో వచ్చింది. ఆతర్వాత అమితాబ్ బచ్చన్, షారుక్ లు వార్తను ఖండించారు. జయబచ్చన్ మాట్లాడిన సమయంలో ఉన్న వారికి వాస్తవం తెలుసు. ఆ వ్యాఖ్యల్లో వాస్తవం లేదని రుజువైంది. ఆ వార్తను ప్రచురించిన వాళ్లే తెల్ల ముఖం వేయాల్సిన పరిస్థితి ఎదురైంది. మీడియా సెన్సేషనల్ వార్తల కోసం ప్రయత్నించడం చాలా ప్రమాదకరం. సంచలన వార్తల కోసం ప్రయత్నించకుండా వాస్తవాలు రాయాల్సిన బాధ్యత మీడియాపై ఉందని అభిషేక్ అన్నారు. వివాదస్పద వ్యాఖ్యలు మీడియాలో రావడం చాలా దురదృష్టకరమైన సంఘటన అని అభిషేక్ అన్నారు. హ్యాపీ న్యూఇయర్ చిత్రంలో ఓ ప్రధాన పాత్రను అభిషేక్ బచ్చన్ పోషించిన సంగతి తెలిసిందే. -
జయా బచ్చన్ కు షారుక్ కౌంటర్
‘‘ఇలాంటి చిత్రాల్లో నటించాల్సి వస్తుందనే భయంతోనే నేనీ మధ్య సినిమాలకు దూరంగా ఉంటున్నా. ఈ మధ్యకాలంలో వచ్చిన అర్థరహితమైన చిత్రమంటే ఇదే. ఈ విషయాన్ని ఆ చిత్రబృందానికి చెందిన ఒకరిద్దరితో నేరుగానే చెప్పాను’’ అని నటి, అమితాబ్ బచ్చన్ భార్య జయా బచ్చన్ అన్నారు. ‘హ్యాపీ న్యూ ఇయర్’ చిత్రం గురించి ఇటీవల ఆమె అలా ఘాటుగా స్పందించారు. షారుక్ ఖాన్, అభిషేక్ బచ్చన్, దీపికా పదుకొనె తదితర భారీ తారాగణంతో ఫరా ఖాన్ దర్శకత్వంలో ‘హ్యాపీ న్యూ ఇయర్’ ఇటీవల వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, కుమారుడు అభిషేక్ నటించాడన్న పక్షపాతం చూపించకుండా జయా బచ్చన్ ఈ చిత్రంపై విమర్శల వర్షం కురిపించడం ఆమె ముక్కుసూటితనానికి నిదర్శనమని హిందీ రంగంలో చాలామంది ఆమెను అభినందిస్తున్నారు. కానీ, ఈ మాటలు అమితాబ్ బచ్చన్, అభిషేక్, ఐశ్వర్యారాయ్లను షాక్‌కి గురి చేశాయి. షారుక్ ఏమైనా అనుకుంటారేమోనని అమితాబ్ స్వయంగా ‘సారీ’ అంటూ మెసేజ్ పెట్టారట. ఇక... అభి, ఐష్ క్షమాపణలు చెప్పడానికి ఏకంగా షారుక్ ఇంటికే వెళ్లిపోయారట. కానీ, ఆ సమయంలో ఆయన ఇంట్లో లేరని భోగట్టా. ఒకపక్క జయ చేసిన వ్యాఖ్యల గురించి బాలీవుడ్లో వాడిగా వేడిగా చర్చ జరుగుతుంటే, మరోపక్క షారుక్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చేశారట. ‘‘మీ భర్త నటించిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రం కూడా అర్థరహితంగా ఉండేదని అప్పట్లో వ్యాఖ్యలు వినిపించాయి. కానీ, అదే చిత్రాన్ని ఇప్పుడు క్లాసిక్ అంటున్నారు’’ అని జయాబచ్చన్ తోనే ఆయన కూల్‌గా అన్నారట. ఏది ఏమైనా జయ ముక్కుసూటితనంఅమితాబ్ బచ్చన్, ఖాన్ కుటుంబాల మధ్య మనస్పర్థలకు కారణమైందనీ, షారుక్ అంత సులువుగా జయ వ్యాఖ్యలను జీర్ణించుకోలేకపోతున్నారనీ సమాచారం. -
'అంత పనికిమాలిన సినిమా చూడలేదు'
హ్యాపీ న్యూ ఇయర్.. షారుక్ ఖాన్, దీపికా పదుకొనే, అభిషేక్ బచ్చన్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా. ఇది బాలీవుడ్ బాక్సాఫీసులను బద్దలుకొట్టి.. ఏకంగా 300 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమా ఘన విజయం సాధించిందని అభిషేక్ తండ్రి, బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ సైతం ప్రశంసించారు. కానీ.. అభిషేక్ తల్లి, అలనాటి హీరోయిన్ జయాబచ్చన్‌కు మాత్రం ఈ సినిమా ఎందుకో అస్సలు నచ్చలేదు. ఇటీవలి కాలంలో తాను చూసిన అత్యంత పనికిమాలిన (నాన్సెన్సికల్) సినిమా ఇదేనని ఆమె చెప్పారు. ''కేవలం అభిషేక్ అందులో ఉన్నాడు కాబట్టే ఆ సినిమా చూశాను. కెమెరా ఎదురుగా అంత చెత్తగా కూడా నటించావంటే నువ్వు చాలా గొప్ప నటుడివని కూడా వాడికి చెప్పాను'' అని జయాబచ్చన్ మండిపడ్డారు. ఇలాంటి సినిమాలు వస్తున్నాయి కాబట్టే తాను నటించడం కూడా మానుకున్నట్లు ఆమె చెప్పారు. ఇదివరకు సినిమా అంటే కాస్త కళాదృష్టి కూడా ఉండేదని, ఇప్పుడు దాన్ని కేవలం వ్యాపారంగానే భావిస్తుండటం వల్లే ఇలాంటి సినిమాలు వస్తున్నాయని చెప్పారు. -
ధూమ్ సిరీస్ లో నటించాలని ఉంది: షారుక్
అవకాశం లభిస్తే ధూమ్ సిరీస్ చిత్రంలో నటించాలని ఉందని బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తెలిపారు. ఈ సిరీస్‌లో మోటర్ బైక్స్ ఉపయోగించే తీరు తనను ఆకట్టుకుందని షారుక్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం యష్ రాజ్ చిత్రం ఫ్యాన్ లో నటిస్తున్నానని, తన మిత్రుడు ఆదిత్య చోప్రా ఇంకా తనకు పాత్ర ఆఫర్ చేయలేదని షారుక్ చెప్పారు. సంజయ్ ఘాడ్వీ కూడా తనకు తెలుసునని, అందువల్ల అవకాశం లభిస్తుందనే అనుకుంటున్నానని తెలిపారు. 'హ్యపీ న్యూ ఇయర్' తర్వాత మళ్లీ దోపిడీ నేపథ్యంలో ఏదైనా చిత్రాన్ని చేస్తున్నారా అనే ప్రశ్నకు షారుక్ ఆ విధంగా స్పందించారు. ఇప్పటి వరకైతే ధూమ్ సిరీస్‌లో నటించాలన్న ఆఫర్ తనకు రాలేదని షారుక్ అన్నారు. రేపట్నుంచి ఫ్యాన్ చిత్ర షూటింగుకు హాజరవుతున్నానని తెలిపారు. వయస్సు గురించి పట్టించుకోనని, శారీరకంగా చాలా ఉత్సాహంతో ఉన్నానని.. వయసు పెరిగినా.. తనలో ఉత్సాహం తగ్గలేదని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. -
సక్సెస్... ఫెయిల్యూర్... జీవితంలో ఏదీ అంతిమం కాదు!
పీక్కుపోయిన చెంపలు... పాలిపోయిన శరీరం... చొక్కా లేనప్పుడు చూస్తేనేమో గ్రీకు శిల్పం! నిర్లక్ష్యపు చూపులు... నిర్విరామంగా చేతుల్ని వెలిగించే సిగరెట్... అందుకున్న విజయాల రికార్డు చూస్తేనేమో అద్భుతం! పాతికేళ్ల క్రితం ముంబయిలో అడుగుపెట్టిన ఒక సాధారణ వ్యక్తి పవరాఫ్ బాలీవుడ్‌కి ప్రతిరూపంలా మారడం ఓ సంచలన చరిత్ర! ఎందరినో ఇన్స్పైర్ చేసే సక్సెస్ స్టోరీ! అయితే సక్సెస్ అంటే ఇంతేనా? ... ఇంకేదో ఉందంటున్నారు బాలీవుడ్ బాద్షా! రెండున్నరగంటల ఎంటర్టైన్మెంట్ పీస్‌లా తాను మిగిలిపోదలచుకోలేదంటున్నారాయన. స్వయంగా నిర్మించి, నటించిన తాజా చిత్రం ‘హ్యాపీ న్యూ ఇయర్’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూ షారుఖ్ ఖాన్ ‘సాక్షి’కి ముంబయ్‌లో ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలోని విశేషాలు... నేడు తన బర్త్‌డే సందర్భంగా... హాయ్ సర్... మీ మాతృభూమి నుంచి వస్తున్నాం ఎలా ఉన్నారు? షారుఖ్: హాయ్... వెరీ ఫైన్. అవును హైదరాబాద్ మా ‘మదర్’ ల్యాండ్. అక్కడ టోలీచౌకీలో మా అమ్మగారి ఇల్లు ఇప్పటికీ ఉంది. ఐలైక్ ద సిటీ వెరీ మచ్. అటు ప్రొడక్షన్... ఇటు యాక్షన్... బాగా హెవీ వర్క్. ఏమైతేనేం ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమా సక్సెస్. ఇప్పుడు హ్యాపీగా రిలాక్సవుతున్నారా? షారుఖ్: జస్ట్ వన్ వీక్ గ్యాప్. అంతే! మళ్లీ వర్క్ స్టార్ట్ అయిపోతుంది. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మీరు ఆల్రెడీ సూపర్‌స్టార్. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నారు. అయినా అటు క్రికెట్ టీమ్, ఇటు ప్రొడక్షన్, యాక్షన్... ఇలా కష్టపడుతూనే ఉన్నారు. ఇక కొంత విశ్రాంతి తీసుకోవాలని అనిపించడం లేదా? ఈ ప్రశ్నకు షారుఖ్ ఒక్కక్షణం ఆగారు... ఆలోచించారు. ఎదురుగా ఉన్న సిగరెట్ ప్యాకెట్లో నుంచి తన చిరకాల నేస్తాన్ని తీసి వెలిగించి, గట్టిగా ఒక దమ్ము లాగారు. అనంతరం ట్రాన్స్‌లోకి వెళ్లినట్టు మాట్లాడడం మొదలుపెట్టారు. మధ్య మధ్యలో అడుగుతున్న ప్రశ్నలకు, ఆయన ఇచ్చిన సమాధానాల సమాహారం ఆయన మాటల్లోనే... ఎవరికి నిరూపించుకోవాలి? షారుఖ్: నిజమే! జీవితం అందించిన వాటి గురించి చాలా హ్యాపీగా ఉన్నా... అయితే నేను పనిచేస్తోంది ఎగ్జయిట్మెంట్ కోసం! కొత్త విషయాలతోనే ఆ ఎగ్జయిట్మెంట్ వస్తుంది! ప్రొడ్యూసర్ని అయినా, కొత్త కొత్త రంగాల్లోకి ప్రవేశిస్తున్నా... ఇదంతా అందుకే! ఈ ప్రస్థానంలో... ఐ స్టార్టెడ్ ఫీల్ ఇంపార్టెంట్. అంతే తప్ప ఎవరికో ప్రూవ్ చేయడం కోసం కాదు. కాలం ఎప్పుడూ కొత్త కొత్త విషయాలు మోసుకొస్తోంది. వాటిని అందుకోవాలి. పొద్దున్నే ఎగ్జయిట్‌మెంట్‌తో లేవాలి. నేనెప్పుడూ నన్ను నేను నిరూపించుకోవడానికి పని చేయలేదు. అసలు నేను ఎవరికి ప్రూవ్ చేసుకోవాలి? దాదాపు పదిహేనేళ్లుగా పొద్దున్న లేచిన దగ్గర నుంచి నా జీవితం ఒకలాగే ఉంది. లోయర్ మిడిల్‌క్లాస్ ఫ్యామిలీ మాది. ఢిల్లీ నుంచి ముంబయికి వచ్చేటప్పటికి హిందీ సినిమా అంటేనే తెలీదు. కొన్ని సంవత్సరాల కెరీర్ తర్వాత...నేనొక స్టార్‌ని అనే విషయం నాకు అర్థమైంది. ముంబయిలో జాలర్లు నివసించే చిన్న కాలనీలో ఉన్న నేనే ఇప్పుడు అత్యంత ఖరీదైన ఇండియన్ మూవీని రూపొందించాను. ఒక్కోసారి నా భార్య, పిల్లలూ కూడా అంటుంటారు... ‘ఎందుకు ఇదంతా? అవసరమా?’ అని! కాని నేనేం చేయను? విశ్రాంతినీ, పని లేకపోవడాన్నీ ఊహించలేను. విచిత్రమేమిటంటే... కొన్ని రోజుల పాటు పని లేకపోతే... మా అమ్మాయే నన్ను అడుగుతుంది - ‘నువ్వు పనిచేయడం లేదేంటి’ అని! పని లేకపోతే ఏం చేయాలో నాకు తెలీదు. అవును. నేను పనికి ఎడిక్ట్ అయిపోయాను. పనిలోని ఒత్తిడిని బాగా ఎంజాయ్ చేస్తాను. నాకు స్పైన్ ప్రాబ్లమ్ ఉంది. ఈ మధ్యే షోల్డర్ విరిగింది. షూస్ వేసుకోవడానికి కూడా చేయి సహకరించట్లేదు. అయినా పనిచేయడానికే ఇష్టపడతాను. తప్పక రెస్ట్ అంటూ తీసుకోవలసిన సందర్భం వస్తే... పుస్తకాలు బాగా చదువుతాను. బాత్రూమ్లో, కారులో కూడా చదువుతాను. ఐయామ్ ది బెస్ట్... షారుఖ్: ముంబయిలో 24 సంవత్సరాల క్రితం నేను నా కెరీర్ ప్రారంభించినప్పుడే ‘ఐయామ్ ది బెస్ట్’ అనుకుంటూ ఉండేవాణ్ణి. ఇప్పటికీ అంతే! ఎప్పుడైనా మనల్ని మనం నమ్ముతూ నిద్ర లేస్తేనే పని చేయగలం. లేకపోతే లేదు. అప్పుడే హ్యాపీగా ఉంటుంది. ఆ ఫిలాసఫీని అనుసరించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి పనిని ఎంజాయ్ చేయగలుగుతున్నా. అక్కడ నుంచి ఇక ఒత్తిడి లేదు. ఐ ఫీల్ హ్యాపీ మీటింగ్ పీపుల్... ఐ ఫీల్ హ్యాపీ షేరింగ్ దిస్ వండర్ ఫుల్ లైఫ్ విత్ పీపుల్! దటీజ్ వై.. దేరీజ్ నో ప్రెషర్! ఇష్టపడి మాత్రమే చేశా..! షారుఖ్: అటు సినిమాలు, ఇటు కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) విజయం, ఇంటర్నేషనల్ అవార్డ్స్... ఇవన్నీ ఈ ఏడాది నన్ను సక్సెస్ఫుల్ చేశాయి. అంత మాత్రాన అన్నీ బావున్నాయనీ, నేనిప్పుడు పని మానేయాలనీ అనుకోను. నేనేది చేసినా దాన్ని ఇష్టపడి చేశా. ఏది చేసినా నాకు ఇష్టమైన ప్రయత్నం అయితేనే చేశా. డబ్బు కోసం ఏదీ చేయలేదు. నిజానికి ఒక బిజినెస్ వెంచర్‌గా చూసినట్టయితే కెకెఆర్ సక్సెస్ అయ్యేది కాదు. ఈ వెంచర్లో సక్సెస్ చూడడానికి ఐదేళ్లు పట్టింది. రెండుసార్లు చాంపియన్‌షిప్‌లు గెలిచాక... ఎండార్స్మెంట్స్ వచ్చాయి. బిజినెస్పర్సన్గా అయితే ఈ వెయిటింగ్ చేసుండేవాణ్ణి కాను. నేను డబ్బు సంపాదించాలని క్రికెట్‌తో అనుబంధం పెట్టుకోలేదు. ప్రారంభంలో దెబ్బతిన్నా. తరువాత గెలిచా. ఆలస్యమైనా... విజయం అనేది ఒక స్వీటెస్ట్ థింగ్! విజయానికి గ్యారెంటీ ఇవ్వలేం! షారుఖ్: సక్సెస్ఫుల్ పర్సన్స్‌ను అడిగితే... చాలా మంది క్రాఫ్ట్ చెప్పగలరు. టెక్నిక్ చెప్పగలరు. అయితే అందులోని సారం మాత్రం చెప్పలేరు. నా సక్సెస్ విషయంలో ఐ రియల్లీ హ్యావ్ నో ఐడియా. కొన్నేళ్లు వెనక్కివెళ్లి, ‘నేను అలా చేశా కాబట్టి ఇలా అయింది. ఆ టైమ్‌లో ఇలా చేయకపోయుంటే...’ వంటి సూత్రాల్ని చెప్పలేను. నేను చేసిందే చెయ్యమంటూ నా పిల్లలకు కూడా చెప్పలేను. ఎందుకంటే సక్సెస్‌కు అస్యూరెన్స్ ఇవ్వలేం. ఏ మార్గాన్ని అనుసరిస్తే సక్సెస్ వస్తుందో కచ్చితంగా చెప్పలేం. చాలామంది తిరస్కరించిన ప్రాజెక్ట్స్ నేను ఓకె చేస్తే సూపర్‌హిట్ అయ్యాయి. కెకెఆర్ విషయంలోనూ చాలామంది అది నాకు అనవసరం అన్నారు. చేయలేను అన్నారు. అయితే నాకో మార్పు కావాలి. అంతే నేను యాక్సెప్ట్ చేశా. సరైన టైమ్‌కి అక్కడ ఉండడం ఇంపార్టెంట్. రైట్ ఫిల్మ్, రైట్ డెరైక్టర్, రైట్ టీమ్, ఐ వజ్ ఎ రైట్ గై ఫర్ రైట్ ప్లేస్! అంతే! నా స్టోరీ ఇతరులకు ఏం నేర్పుతుందో గానీ, దాని నుంచి నేను నేర్చుకున్నదేమిటంటే జీవితంలో ఏదీ అంతిమం కాదు! ఫెయిల్యూర్, సక్సెస్ - రెండూ అంతే! ప్రజలకు కావాల్సినదేదో చేయాలి! షారుఖ్: నాకో మంచి ఇల్లు, ఫ్యామిలీ, గ్రేట్ ఆఫీస్, సరిపడినంత డబ్బు... దేవుడు ఇచ్చాడు. అదృష్టం ఇచ్చింది. జనం ఇచ్చారు. అయితే ఇవి చాలని నేను అనుకోను. నేను ఇది మాత్రమే సక్సెస్ అనుకోను. ఇంకా ఎంతో చేయాలి. తీసుకున్నదానికి ప్రతిఫలంగా వెనక్కి ఇవ్వాలి. ఇక్కడ గొప్ప టెక్నాలజీ సృష్టించాలి. ఒక గొప్ప స్టూడియో కట్టాలి. సక్సెస్ అంటే నేనేదైనా కొత్తది కనుగొన్నప్పుడే! నా తర్వాత కూడా అది బతికుండాలి! సేఫ్టీ పిన్ని కనిపెట్టిన జంటిల్మన్ సక్సెస్ఫుల్ అని నేననుకుంటాను. జస్ట్... కేవలం రెండున్నరగంటల ఎంటర్టైన్మెంట్ పీస్‌లా మాత్రమే నేను ఉండదలచుకోలేదు. ప్రజలకు కావాల్సిందేదో నేను చేయగలగాలి. అదేమిటో నాకు స్పష్టత లేదు. అయితే చేయగలను అని నమ్మకం ఉంది. అలాగని రాజకీయాలంటే అంటే... నో! దానికి మరీ మంచితనం కావాలి. అది నా వల్ల కాదు (నవ్వులు). ఒక 20 సంవత్సరాల తర్వాత నా నటన గురించి కొత్తగా మీరు చెప్పుకునేందుకు ఏమీ ఉండదు. అదే నేను రంగుల సినిమాను కొత్తగా సృష్టించాననుకోండి... ‘అదిగో షారుఖ్స్ క్రియేషన్’ అంటారు. నా రంగంలో నేను మీకో కొత్త అనుభూతిని ఇవ్వాలనుకుంటున్నాను. క్రీడల విషయంలో కూడా నా వంతుగా ఏమైనా చేయాలనుకుంటున్నాను. కమర్షియలైజ్... అయితే తప్పేంటి? షారుఖ్: మనందరికీ మనం ఏం చేయగలమో తెలుసు. వరల్డ్ ఈజ్ బెస్ట్ ప్లేస్ టు లివ్. మంచి ఉద్దేశంతో కమర్షియలైజ్ చేయడంలో తప్పు లేదంటాను. మంచి ఫిల్మ్‌మేకర్ ఆర్థికంగా మంచి స్థాయిలో ఉండాలి. కొందరు వారి వర్క్ చూడాలి. కొందరు కొనాలి. కొందరు వర్క్ ఇవ్వాలి. ఇవన్నీ కమర్షియల్ యాక్టివిటీలు. కాబట్టి, తప్పదు. కంఫర్టబుల్ ఎర్నింగ్ ఉంటేనే ఇదంతా చేయగలం. ముందు మీరు కంఫర్టబుల్‌గా ఉంటేనే అప్పుడు మీరు ఎవరికైనా సహాయం చేయగలరు. మీరనుకున్న మంచి పనులు చేయగలరు. సినిమాలైనా, స్పోర్ట్స్ అయినా అంతే! కమర్షియలైజ్ కాకపోతే వర్ధమాన క్రీడాకారులకు కెరీర్ ఎలా ఇస్తాం? నా మటుకు నేను ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్‌ను అవ్వాలనుకున్నా. కానీ, అవలేకపోయా. అందుకే, ఇలాంటివన్నీ చేస్తుంటా! అయినా, స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా క్రీడలకు సరైన ప్రొఫెషనల్ స్కూల్స్ లేవంటే.. అర్థం ఏమిటి? కాబట్టి, మంచి చేయాలంటే కమర్షియలైజ్ చేయాల్సిందే! అయితే ఇదంతా క్యాపిటలిస్ట్‌గా నేను మాట్లాడడడం లేదు. ఆ సంగతి గ్రహించండి. గౌరి బెస్ట్ పార్ట్నర్! షారుఖ్: నా భార్య గౌరి మంచి పార్ట్నర్. ఆమె చాలా స్పష్టంగా ఉంటుంది. ఇప్పుడామె ఇంటీరియర్ డిజైనర్‌గా మారి, స్టోర్ స్టార్ట్ చేసింది. బిజినెస్‌పరంగా తనకేమైనా టిప్స్ ఇస్తారా అంటే... ఇంట్లో ఇద్దరం ఉన్నప్పుడు నో బిజినెస్. చెప్పాను కదా... మాది చాలా మిడిల్‌క్లాస్ మెంటాలిటీ! చేతి నిండా పని వల్ల ఇంట్లో నేనెక్కువ సమయం గడపలేను. ఒంటరిగా, విసుగుపుడుతూ ఉండకుండా ఓ హాబీలా ఈ స్టోర్‌ను ప్రారంభించింది. అయితే అదేదో పెద్ద స్టోర్ కావాలనో, మరొకటో అనుకోవడం లేదు. షారుఖ్ కూడా ఇందులో భాగం కావాలనుకోవడం లేదు. ‘కోట్ల’ ఆటలో వాస్తవం లేదు! షారుఖ్: నిజంగా సినిమాలకు వందల కోట్ల వసూళ్ళ గురించి, 500 కోట్ల క్లబ్ గురించి మనలో ఎవరం ఆలోచించగలం? పత్రికల వాళ్ళు ఏదో రాస్తుంటారు. నిజానికి అందరూ మాట్లాడే ఈ వందల కోట్లు అనేది గ్రాస్ కలెక్షన్ గురించి! అందులో నుంచి 52 శాతం థియేటర్ ఛార్జీలు, 12 శాతం పన్నులు, అవికాక డిస్ట్రిబ్యూటర్ కమిషన్లు - ఇవన్నీ తీసేసి వాస్తవంగా లెక్కిస్తే... ఈ కోట్ల మూటలంతా డొల్లేనని తెలుస్తుంది. నా వరకూ నా లక్ష్యం ఏమిటంటే... అత్యధిక సంఖ్యాకులు వచ్చి, నా సినిమా చూస్తే చాలు. అంతే! ఈ నంబర్లు కాదు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కంట్రోల్ మాత్రమే నేను చూసుకోవాలి. దీన్ని చూడడానికి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో 240 మంది పనిచేస్తున్నారు. మహిళలకు మర్యాద ఇవ్వాలి... షారుఖ్: ఐ ప్రిఫర్ టు వర్క్ విత్ ఉమెన్... ఎందుకంటే వాళ్లు బాగా హార్డ్ వర్కింగ్! బాగా డిటైల్డ్. ఒక గుమ్మం ముందు మహిళ నుంచుంటే వెంటనే తలుపు తీసి రమ్మంటాం. అదేదో వాళ్లు బలహీనమనో, సానుభూతితోనో కాదు. మన మనసుల్లో మహిళకు ఎప్పుడూ గౌరవం ఉంది. ఇవ్వాలి కూడా. నా తల్లి, సిస్టర్... వీళ్లందరితో నేనలాగే పెరిగాను. నా సినిమాల్లో హీరోతో పాటు తగినంత పాత్ర హీరోయిన్కీఉండాలనుకుంటాను. అలాగే నా ఆఫీస్‌లో, నాతో పనిచేసేవాళ్లలో చాలా మంది మహిళలున్నారు. మహిళలకు గౌరవం ఇవ్వడం అత్యవసరం. బయట జరిగే చాలా సంఘటనలు చూస్తున్నాం. ప్రపంచం మొత్తాన్నీ మార్చలేకపోయినా... మన వంతుగా వాళ్లకు గౌరవం ఇవ్వడాన్ని బాధ్యతగా భావించాలి. ప్యాక్... లుక్స్ వరకే! షారుఖ్: నిజంగా చెప్పాలంటే ఏ సినిమాకీ సిక్స్ ప్యాక్ అవసరం లేదు. ‘ఓం శాంతి ఓం’లో హీరో ముతకభాష మాట్లాడతాడు. బస్తీల్లో ఉంటాడు. హీరో అవ్వాలనుకుంటాడు. కరకుగా కనిపించాలి అని వర్కవుట్ చేశాను. అంతేకాకుండా నాకు స్పైన్ ప్రాబ్లమ్ ఉంది. దాని కోసం వర్కవుట్ చేస్తుంటే వెరీ స్ట్రాంగ్ యాబ్స్ వచ్చాయి. వర్కవుట్ టైమ్‌లో కొందరికి బైసప్స్, కొందరికి చెస్ట్ ఇలా... ఒక్కొక్కరికీ ఒక్కోటి బాగా స్పందిస్తాయి. అలాగే నాకు యాబ్స్ రిఫ్లెక్ట్ అయ్యాయి. దాంతో ప్యాక్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. ‘హ్యాపీ న్యూ ఇయర్’లో కూడా పాత్రకు తగ్గట్టుగా రఫ్‌గా కనపడే ప్రయత్నంలో ప్యాక్‌ను ప్రదర్శించా. పిల్లల కోసమే ప్రార్థిస్తుంటా..! షారుఖ్: ఫేమస్ అయిన పబ్లిక్ ఫిగర్ అంటే... అడ్వాంటేజ్‌లతో పాటు డిజెట్వాంటేజ్లూ ఉంటాయి. నాకు 14 మంది కాప్స్, ముగ్గురు సెక్యూరిటీ గార్డ్లు ఉన్నారు. నిజానికి నేను జనాన్ని ఇష్టపడతాను. వారిని ప్రేమిస్తాను. వారికి దూరంగా ఉండడం నచ్చదు. కానీ తప్పదు. ఒక్కోసారి గుంపును కంట్రోల్ చేయలేం కదా! నా పిల్లలు ఈ పరిస్థితుల మధ్య ఇబ్బంది పడతారు. వాళ్లు కూడా నా లాగా టీనేజ్‌లో ఒక సాధారణ జీవితాన్ని స్వేచ్ఛగా గడపాలి. యుక్తవయసులో ఎలాగైతే సాధారణ జీవితాన్ని నేను అనుభవించానో వాళ్లు కూడా అదే అనుభవించాలి. బస్సుల్లో, రోడ్ల మీద స్వేచ్ఛగా నడవాలి. అందుకే దూరంగా విదేశాల్లో ఉంచి చదివిస్తున్నాను. దేవుడికి చేసే ప్రార్థన ఏదైనా ఉంటే, అది నా కోసం కాదు - నా పిల్లల కోసం మాత్రమే ప్రార్థిస్తాను. వాళ్లు బాగుంటే, వాళ్లు సంతోషంగా ఉంటే మనకు అన్నీ బాగున్నట్టే! ‘హ్యాపీ న్యూ ఇయర్’ చివరలో టైటిల్స్ వేస్తున్నప్పుడు వచ్చే చివరి పాటలో మొత్తం కాస్టింగ్ అంతా ఉంటుంది. పిల్లలూ ఉంటారు. అదే సమయానికి అక్కడ ఉండడంతో మా అబ్బాయి అబ్రామ్ (సరోగసీ ద్వారా కన్న బిడ్డ)ని కూడా పెడదామని (దర్శకురాలు) ఫరా (ఖాన్) అంటే ఓకె అన్నాను. ఇప్పుడా సీన్‌కు ఎక్కడ లేని క్రేజ్ వచ్చేసింది. సిగరె ట్... బ్యాడ్ హ్యాబిట్... షారుఖ్: స్మోకింగ్ రియల్లీ... బ్యాడ్ హ్యాబిట్! నేను మానాలనుకున్నా మానలేకుండా పిల్లల దగ్గర సైతం రెగ్యులర్‌గా చేసే పని - స్మోకింగ్! పబ్లిక్ స్పేస్‌లలో కూడా నేను కంట్రోల్ తప్పుతున్నా. దీన్ని వదలకుండా నేనేం చెప్పినా లాభం ఏముంది? ఎప్పుడైతే నేను దీన్ని వదిలేస్తానో, అప్పుడు తప్పకుండా ‘సారీ’ చెబుతాను. ఇక ఆహారం విషయానికొస్తే, వేళ కాని వేళల్లో తింటాను. బాగా బ్లాక్ కాఫీ తాగుతాను. నా పనివేళలు కూడా కరెక్ట్ కాదు. అయినా ఇప్పటికీ, నేను రోజుకు తక్కువ గంటలు మాత్రమే నిద్రపోతూ హ్యాపీగా వర్క్ చేయగలుగుతున్నాను. చాలా యంగ్‌గా ఉన్నప్పుడే రాత్రిపూట నిద్రపోకుండా చదవడానికి వీలుగా బ్లాక్ కాఫీ తాగడం మొదలుపెట్టాను. అది ఇప్పటికీ వదలడం లేదు. చెయిన్స్మోకర్స్కు భిన్నంగా... చాలా ఆలస్యంగా, 26 ఏళ్ళ వయసులో తొలి సిగరెట్ తాగా! చిన్నప్పటి నుంచి ఆటలు బాగా ఆడేవాణ్ణి. ఆరోగ్యంగా ఉండాలనుకునేవాణ్ణి. అందుకే తొలిరోజుల్లో సిగరెట్ ఆలోచన రాలేదేమో! ముంబయికి వచ్చాక, రంగస్థలంలో కాలుమోపాక... అప్పుడు స్మోకింగ్ స్టార్ట్ చేశా. సినిమాల విడుదలకు ముందు టెన్షన్ వల్ల స్మోకింగ్ మరీ తీవ్రంగా మారుతుందా అని అడిగితే, అప్పుడే కాదు... ఎప్పుడూ తీవ్రంగానే ఉంటుందని చెప్పగలను! (నవ్వులు) అవకాశం ఎప్పుడూ ఉంటుంది... షారుఖ్: ప్రేక్షకులకు చిన్న సందేశమైనా లేకుండా నేనే సినిమా చేయలేదు. కొన్నిసార్లు ఎంటర్టైన్మెంట్ హోరులో మన సందేశం హైలెట్ కాక పోవచ్చు. జీవితంలో నువ్వు కొన్ని కోల్పోతూనే ఉన్నా... మరెన్నో అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఓర్పు ఉంటే జీవితం నీకు అవకాశం తప్పక ఇస్తుంది. నా తాజా చిత్రం, జీవితం చెప్పే సందేశం అదే! - ఎస్. సత్యబాబు ఇంటికెళితే స్విచ్చాఫ్... పిల్లలు చిన్నవాళ్లుగా ఉన్నప్పుడు కరణ్ (జోహార్), సుస్మిత (సేన్) - ఇలా అందరూ సినిమా వాళ్లే వచ్చేవారు ఇంటికి. దాంతో మనుషులంతా సినిమావాళ్లే అనుకునేవారు నా పిల్లలు. నా కారు ఎక్కడ ఆగినా జనం వచ్చి గుమిగూడేవారు. దాంతో భయపడేవారు. స్కూల్ దగ్గర వదిలిపెట్టడానికి వెళ్ళే సమయంలో మా అమ్మాయి ఒక మాట అడిగింది... ‘‘మా క్లాస్మేట్స్ వాళ్ళ ఫాదర్స్‌ను అంతా ‘రాహుల్స్ ఫాదర్, రాధికాస్ పాపా’ అని అంటారు. కానీ, నన్ను మాత్రం ‘షారుఖ్స్ డాటర్’ అంటారేమిటి? అని!’’ పిల్లలపై తల్లితండ్రుల సూపర్‌స్టార్ షాడో ఉండదా - అంటే ఉంటుంది. తప్పదు. ఆ ప్రభావంతో సహా బతకడం వాళ్లు నేర్చుకోవాల్సిందే! ఇలాంటి సమస్యకు పరిష్కారంగా ఇంటికి వెళ్లాక సినిమాకు దూరమవడం అలవాటు చేసుకున్నా. ఇంటి నుంచి పనిచేయను. సినిమాల గురించి, నా షూటింగ్ గురించి ఇంట్లో మాట్లాడను. నేనీ రోజు ఒక గొప్ప ఇంటర్వ్యూ ఇచ్చాననో, ఇంకేదో ఎక్స్పీరియన్స్ అంటూ వారితో పంచుకోను. ఎప్పుడైతే నేను నా కుటుంబంతో ఉంటానో అప్పుడు వారి మనిషిని. అంతే! ఇంక ఏమీ మనసులోకి రానీయను. నేనో స్టార్‌ని అనే భావనే రానీయను. -
300 కోట్ల క్లబ్ లో హ్యాపీ న్యూ ఇయర్!
'హ్యాపీ న్యూ ఇయర్' చిత్రం కలెక్షన్లు కొంచెం తగ్గినప్పటికి.. వసూళ్ల దూకుడు మాత్రం తగ్గుముఖం పట్లలేదు. గత ఎనిమిది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. స్వదేశంలో 237 కోట్ల, విదేశాల్లో 63 కోట్ల రూపాయలను వసూళ్లను రాబట్టింది. షారుఖ్ ఖాన్ నటించిన రెండవ చిత్రం 300 కోట్ల క్లబ్ లో చేరింది. గతంలో చెన్నై ఎక్స్ ప్రెస్ 300 కోట్లకు పైగా కలెక్షన్లను నమోదు చేసుకుంది. -
మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు: షారుక్
కోల్ కతా: బిగ్ బాస్ రియాల్టీ షోలో హ్యాపీ న్యూ ఇయర్ చిత్రాన్ని ప్రమోట్ చేసినందుకు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు షారుక్ ఖాన్ కృతజ్క్షతలు తెలిపారు. తన చిత్రాన్ని ప్రమోట్ చేయడంతో మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని మరోసారి స్పష్టమయ్యాయని షారుక్ అన్నారు. మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు అని షారుక్ అన్నారు. సల్మాన్ చేసిన సహాయానికి హృదయ పూర్వకంగా కృతజ్క్షతలు తెలుపుతున్నానని షారుక్ అన్నారు. మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పడానికి వీలు చిక్కనపుడల్లా ప్రయత్నిస్తుంటాను అని ఆయన తెలిపారు. సల్మాన్ నాకు మంచి మిత్రుడు. సినిమాలంటే ఆయనకు పిచ్చి అని దర్శకురాలు ఫరా ఖాన్ అన్నారు. -
వందల కోట్ల రాణి... దీపికా!
హిట్ల మీద హిట్లిస్తూ బాలీవుడ్ లో దీపిక పదుకొనే హవా కొనసాగిస్తోంది. గత రెండు సంవత్సరాలు అత్యధిక హిట్ చిత్రాల్లో నటించిన బాలీవుడ్ తారగా దీపికా పదుకొనే పేరు మారుమోగుతోంది.. బాలీవుడ్ బాక్సాఫీస్ కు చిరునామాగా మారిన వంద కోట్ల క్లబ్ వైపు దీపికా నటించిన చిత్రాలన్ని చకచకా పరుగు పెడుతున్నాయి. ఓం శాంతి ఓంతో ప్రారంభమైన దీపిక విజయ పరంపర తాజా హ్యాపీ న్యూ ఇయర్ వరకు కొనసాగుతూనే ఉంది. ఇటీవల కాలంలో బాలీవుడ్ లో వంద కోట్ల క్లబ్ అత్యధిక చిత్రాలను చేర్చిన తారగా దీపిక పదుకొనే ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. 'కాక్ టెయిల్' చిత్రంలో సైఫ్ ఆలీ ఖాన్ తో దీపికా పదుకొనే పండించిన కెమిస్ట్రీ అభిమానులను మెప్పించడమే కాకుండా వంద కోట్ల క్లబ్ లో తొలిసారి చేరేలా చేసింది. ఆతర్వాత మళ్లీ సైఫ్ తో జతకట్టి దీపికా నటించిన రేస్ 2 చిత్రం కేవలం 14 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరింది. అప్పట్లో ఇది బాలీవుడ్ లో ఓ రికార్డుగా చెప్పుకుంటారు. ఇక 2013 లో బాలీవుడ్ లో దీపికా జోరు ఊపందుకుంది. రణబీర్ కపూర్ తో నటించిన యే జవానీ హై దీవానీ, షారుక్ తో చెన్నై ఎక్స్ ప్రెస్, రణ్ వీర్ తో గోలియోంకి రాస్ లీలా.. రామ్ లీలా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడమే కాకుండా తక్కువ కాలంలోనే వంద కోట్ల క్లబ్ లో చేరాయి. కేవలం కలెక్షన్ల పరంగానే కాకుండా చిత్రాల ఎంపికలోనూ దీపిక తీరు విమర్శకుల్ని సైతం ఆశ్చర్య పడేలా చేసింది. కేవలం గ్లామర్ కే పరిమితం కాకుండా యే జవానీ హై దీవానీ, చెన్నై ఎక్స్ ప్రెస్, రామ్ లీలా చిత్రాల్లో అభినయంతోనూ అభిమానులను, ప్రేక్షకులను, విమర్శకులను మెప్పించింది. తాజాగా షారుక్, అభిషేక్, సోనుసూద్ బృందంతో కలిసి నటించిన 'హ్యపీ న్యూ ఇయర్' రికార్డులను తిరగరాస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే హ్యాపీ న్యూ ఇయర్ వంద కోట్ల క్లబ్ మార్కును అధిగమించింది. లెటెస్ట్ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 230 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. హిట్ చిత్రాలతో బాలీవుడ్ హీరోలకు 'లక్కీ మస్కట్' గా మారిన దీపిక పదుకొనే మరిన్ని విజయాలను అందుకోవాలని ఆశిద్దాం! -
కండ బలం కష్టం కాదు...
ఫిట్నెస్కి సింబల్‌గా కనిపించే ప్యాక్ అంటే క్రేజ్ పెరుగుతూనే ఉంది. హ్యాపీ న్యూ ఇయర్ సినిమాలో షారూఖ్ మరోసారి తన ఫిజిక్‌తో ఫ్యాన్స్‌ని ప్యాక్ చేసేశాడు. దీంతో ‘సిటీయూత్లో ‘సిక్స్’ ఫీవర్ ఒక్కసారిగా రెండింతలైంది. అయితే ఆరుపలకల అపు‘రూపం’సినిమా, సెలబ్రిటీలకు మాత్రమే కాదు కామన్ పీపుల్ కూడా సిక్సర్ కొడుతున్నారు. అది చాలా సులభమని కొందరు అనుకుంటుంటే.. ఇప్పటికీ అత్యంత కఠినమైన ప్రయాసని మరికొందరు భావిస్తున్నారు. నగరానికి చెందిన ఫిట్నెస్ ట్రైనర్ వెంకట్ ఏమంటున్నారంటే... ఆరు పలకలు అందరికీ... సిక్స్‌ప్యాక్ అంటే కొత్తగా ఎక్కడి నుంచో పుట్టుకురావు. ప్రతి మనిషి శరీరంలో సహజంగానే ఉండే మజిల్స్. అయితే వంశపారంపర్య ఆహారపు అలవాట్ల కారణంగా నరాలు, బోన్స్ వగైరాల లాగానే ఫ్యాట్‌తో అవి కూడా కవర్ అయిపోతాయి. అలా అట్టడుగున్న ఉన్న వాటిని హార్డ్ వర్క్‌వుట్స్, ఎక్సర్సైజ్ల ద్వారా వెలుగులోకి తీసుకురావడ ం జరుగుతుంది. ఇవి కొందరికే సాధ్యం మరికొందరికి అసాధ్యం అనేది అపోహ మాత్రమే. వ్యక్తి శరీరపు తీరుతెన్నులపై ఆధారపడి 4 నుంచి 8(ఎయిట్ప్యాక్) దాకా పలకలను బిల్డప్ చేయవచ్చు. వ్యక్తి దేహం తీరుని బట్టి ఈ కండరాలు వెల్లడవడానికి 6 నెలల నుంచి 3 సంవత్సరాల దాకా సమయం తీసుకుంటాయి. ఆత్రపడి సప్లిమెంట్స్, స్టెరాయిడ్స్ వాడడం ప్రమాదకరం. డైట్ ఇంపార్టెంట్.. ఈ సిక్స్‌ప్యాక్‌కి గంటల కొద్దీ వర్కవుట్స్ చేస్తే చాలని చాలా మంది అనుకుంటారు. అయితే అంతకన్నా ముఖ్యమైనది స్ట్రిక్ట్ డైట్. ఫ్యాట్ స్టమక్‌ని సాధించే క్రమంలో ట్రైనర్ సూచించిన డైట్‌ని తప్పనిసరిగా టైమ్ ప్రకారం ఫాలో అవ్వాలి. వీటిని సాధించడం మాత్రమే కాదు కాపాడుకోవడం కూడా కష్టమే. కొన్ని రోజులపాటు ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ఆహారం తింటే చాలు మాయమైపోతాయి. ఎగ్‌వైట్స్, ఫ్రూట్స్, గ్రిల్డ్ చికెన్... ఇలా ప్రొటీన్‌ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. ఫుడ్ ద్వారా సరిపోకపోతే అవసరాన్ని బట్టి ప్రొటీన్షేక్స్, ఎనర్జీడ్రింక్స్ వినియోగించవచ్చు. సిస్టమాటిక్... వర్కవుట్... క్రమబద్ధమైన వ్యాయామం చేయాలి. లక్ష్యం సిక్స్‌ప్యాక్ అయినప్పటికీ ఫిజిక్‌ని ఓవరాల్‌గా బిల్డప్ చేయడం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. దీనిలో భాగంగా రన్నింగ్, స్కిప్పింగ్, స్విమ్మింగ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్... వంటివి తప్పనిసరిగా భాగం కావాలి. ఒకేసారి కాకుండా వ్యాయామ సమయాన్ని విడతలవారీగా పెంచుకుంటూ రోజుకు కనీసం 2 నుంచి 3 గంటల పాటు చేయాల్సి ఉంటుంది. పొట్టకండరాలైన యాబ్స్‌కి ఎక్కువ శ్రమ ఉంటుంది కాబట్టి... అబ్డామినల్ ఎక్సర్సైజ్లు శిక్షకుల పర్యవేక్షణలో చేయాలి ఎందుకంటే చేసేవిధానంలో లోపాలుంటే మరిన్ని రకాల శారీరకసమస్యలకది కారణం కావచ్చు. - ఎస్.సత్యబాబు -
అబ్ రామ్ తో కలిసి దీపికకు నటించాలని ఉందట: షారుక్
ముంబై: బాలీవుడ్ తెరపై హ్యాపీ న్యూఇయర్ చిత్రం ద్వారా షారుక్ ఖాన్ చిన్న కుమారుడు అబ్ రామ్ ఎంట్రీ అందర్ని ఆకట్టుకుంటోంది. హ్యపీ న్యూ ఇయర్ చిత్ర ముగింపులో వచ్చే టైటిల్స్ లో అబ్ రామ్ కనిపించి.. ప్రేక్షకులను ఆలరించారు. అబ్ రామ్ ఎంట్రీపై చాలా మంది నుంచి ప్రశంసలు వచ్చాయి. అయితే దీపికా పదుకొనే ప్రశంస మాత్రమే ది బెస్ట్ అని షారుక్ అన్నారు. ఈ చిత్రంలో అబ్ రామ్ చూడ ముచ్చటగా ఉన్నాడని, తదుపరి చిత్రంలో అబ్ రామ్ తో కలిసి నటించాలని ఉందని దీపికా చెప్పిందని హ్యపీ న్యూఇయర్ చిత్ర సక్సెస్ మీట్ లో మీడియాకు షారుక్ తెలిపారు. తనకు పిల్లలతో కలిసి ఆడుకోవడం ఇష్టమని, తాను, ఆర్యన్ కలిసి వీడియో గేమ్స్ తోపాటు ఫుట్ బాల్, క్రికెట్ ఆడుకుంటామని షారుక్ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా 6 వేల థియేటర్లలో విడుదలైన హ్యపీ న్యూ ఇయర్ చిత్రం వారాంతంలో 108 కోట్లు రూపాయలు వసూలు చేసి రికార్డులను తిరగరాస్తోంది. Follow @sakshinews -
బాలీవుడ్ లోకి అబ్ రామ్ ఎంట్రీ అలా జరిగింది: షారుక్
న్యూఢిల్లీ: బాలీవుడ్ లో అబ్ రామ్ ఎంట్రీపై షారుక్ ఖాన్ సంతోషం వ్యక్తం చేశారు. హ్యాపీ న్యూఇయర్ విజయం కంటే తన చిన్న కుమారుడు అబ్ రామ్ తెరమీద కనిపించడమే తనకు అత్యంత సంతోషాన్ని కలిగిస్తోందని షారుక్ అన్నారు. అబ్ రామ్ తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నించిన దర్శకురాలు ఫరాఖాన్ కే ఆ క్రెడిట్ దక్కుంతుందని షారుక్ తెలిపారు. షూటింగ్ లో బిజీగా ఉండటం ద్వారా తాను ఎక్కువగా అబ్ రామ్ తో గడపలేకపోయాను. అయితే ఓ రోజు అబ్ రామ్ స్టూడియోకు వచ్చాడు. డాన్స్ స్టేజ్ పై కూర్చుని వాడితో డాన్స్ చేశాను. అబ్ రామ్ తో డాన్స్ చేయడం చూసిన ఫరా.. షూటింగ్ చేయాలా అని తనను అడిగింది. వెంటనే నేను ఓకే అని చెప్పడంతో ఆ సన్నివేశాన్ని ఫరా షూట్ చేసింది. అలా అబ్ రామ్ అనుకోకుండా బాలీవుడ్ తెరమీద ఎంట్రీ ఇచ్చాడు అని షారుక్ ఐఏఎన్ఎస్ కిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. హ్యపీ న్యూ ఇయర్ చిత్రంలో ఎండ్ టైటిల్స్ లో షారుక్ తో కలిసి అబ్ రామ్ కనిపిస్తాడు. సర్రోగసి ద్వారా ఇటీవల షారుక్ దంపతులు అబ్ రామ్ కు జన్మనిచ్చారు. అబ్ రామ్ జననానికి లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారనే అంశం వివాదస్పదమైన సంగతి తెలిసిందే. -
'హ్యాపీ' న్యూఇయర్.. మూడు రోజుల్లో 100 కోట్లు!
షారుక్ ఖాన్ హీరోగా వచ్చిన 'హ్యాపీ న్యూ ఇయర్' చిత్రం బాక్సాఫీసు రికార్డులను భారీగా కొల్లగొట్టింది. తొలిరోజే రికార్డు కలెక్షన్లు సాధించిన ఈ సినిమా.. తొలిరోజునే దాదాపు 45 కోట్లు వసూలుచేసింది. అతి తక్కువ కాలంలో వంద కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా రికార్డులు బద్దలుకొట్టింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా తొలి వారాంతంలోనే.. అంటే మూడు రోజుల్లోనే 108.86 కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా వసూలుచేసినట్లు రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ తెలిపింది. తొలి మూడు రోజుల్లో హిందీ వెర్షన్‌కు దేశవ్యాప్తంగా రూ. 104.10 కోట్లు రాగా, తెలుగు డబ్బింగ్ వెర్షన్‌కు రూ. 2.92 కోట్లు, తమిళ డబ్బింగ్ వెర్షన్‌కు రూ. 1.84 కోట్లు వచ్చాయి. షారుక్ ఖాన్‌కు చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సంస్థే ఈ సినిమాను నిర్మించగా ఫరాఖాన్ దర్శకత్వం వహించారు. 2013లో చెన్నై ఎక్స్‌ప్రెస్ మంచి వసూళ్లు సాధించిందని, ఇప్పుడు హేపీ న్యూ ఇయర్ మరో కొత్త రికార్డు కొట్టిందని రెడ్ చిల్లీస్ సంస్థ సీఈవో వెంకీ మైసూర్ తెలిపారు. ఈ సినిమాలో దీపికా పదుకొనే, అభిషేక్ బచ్చన్, బొమ్మన్ ఇరానీ, జాకీ ష్రాఫ్, సోనూ సూద్, వివాన్ షా తదితరులున్నారు. -
హ్యాపీ హ్యాపీగా..
హీరోలతో స్టెప్పులేయించిన ఈ లేడీ.. మెగాఫోన్‌తో కూడా సక్సెస్‌లు కొడుతోంది. ఫస్ట్ మూవీ ఓం శాంతి ఓం హిట్‌తో డెరైక్టర్‌గా బాలీవుడ్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ఫరాఖాన్.. హ్యాపీ న్యూ ఇయర్ సక్సెస్‌ను హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది. తన కెరీర్ ముచ్చట్లను, మూవీ జర్నీని సిటీప్లస్‌తో పంచుకుంది. డెరైక్టర్ డ్రీమ్ కోసం.. జీవితంలో అన్నీ అనుకున్నట్టు జరగవు కదా. మన ప్లాన్లు మనకుంటే జీవితం తన పని తను చేస్తుంది. నేను కూడా.డెరైక్టర్ అవ్వాలని కలలు కన్నా. ఫస్ట్ కొరియోగ్రాఫర్ అయ్యా. పదేళ్ల తర్వాత నా కల తీరింది. నేనిప్పుడు కొరియోగ్రఫీ నుంచి పూర్తిగా రిటైర్ అయినట్టే. హ్యాపీ న్యూ ఇయర్లో నా ఒక్క సాంగ్ మాత్రం చేశాను. బేసిగ్గా నాకు పేషెన్సీ చాలా తక్కువ. బహుశా అప్పట్లో డెరైక్టర్ కావాలనే డ్రీమ్ కోసమే ఓర్పుగా పని చేసి ఉంటాను. నన్ను హ్యాపీగా ఉంచేవాళ్లతోనే ఉండటం అంటే ఇష్టం. సెన్సాఫ్ హ్యూమర్ ఉందనే శిరీష్ (హజ్బెండ్)ను పెళ్లి చేసుకున్నా. షారూఖ్.. దీపికల గురించి.. సినీరంగంలో చాలా మందితో కలసి వర్క్ చేశా కాని షారూఖ్‌లాంటి స్టార్‌ని మాత్రం చూడలేదు. అతని స్టార్డమ్ మాత్రమే కాదు గొప్ప హ్యూమన్ బీయింగ్ కూడా. షారూఖ్‌ఖాన్ ఎవరికైనా లక్కీస్టార్. దర్శకుల నటుడు. అతనితో పనిచేయడం అద్భుతమైన విషయం. హ్యాపీ న్యూ ఇయర్ హీరోయిన్ ఎంపిక విషయంలో మీడియాలో రకరకాల ఊహాగానాలు వచ్చాయి. అదే సమయంలో దీపిక కాల్ చేసి నన్నెందుకు అడగడం లేదు అని క్వశ్చన్ చేసింది. వెంటనే తనని ఎంచుకున్నాం. తన ఫస్ట్ మూవీ (ఓం శాంతి ఓం) నాతో చేసింది. మంచి మూవీస్ చేస్తోంది. చక్కగా నటిస్తోంది. ప్రేక్షకులే పాఠం... హిట్స్ తీయాలనే ఎవరైనా కోరుకుంటారు. ప్రేక్షకుల అంచనాలను రీచ్ కాకపోవడం వల్లే తీస్మార్ఖాన్ యావరేజ్‌గా పోయింది. ప్రేక్షకులు ఓం శాంతి ఓం మించిన సినిమాని నా నుంచి ఆశించారు. ఓన్లీ కామెడీ, ఓన్లీ రొమాన్స్ కాదు.. వాళ్లకి కంప్లీట్ ఎంటర్టైనర్ కావాలని అప్పుడర్థమైంది. దాని రిజల్టే హ్యాపీ న్యూ ఇయర్. ఇది ఎంటర్టైనర్ మూవీ అయినా ఇందులోనూ మెసేజ్ ఉంది. ‘99 శాతం అన్నీ పోయినా ఇంకో శాతం అవకాశం మిగిలే ఉంటుంది. ఆ సమయాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి’ అనేది ఈ సినిమా అందించే సందేశం. తెలుగు సినిమాకు డెరైక్షన్... దర్శకుడికి సినిమాపై పూర్తిగా పట్టుండాలంటే భాష తప్పకుండా తెలిసుండాలి. ఏ భాషలోనైతే కంఫర్టబుల్‌గా ఉన్నానో అదే భాషలో సినిమాలు చేస్తాను. హిందీ సినిమాలు తీస్తున్న తమిళ్, తెలుగు దర్శకుల్ని చూస్తే నాకు అడ్మైరింగ్‌గా అనిపిస్తుంది. అలాగే ఇండియాలో ఇంగ్లిష్ సినిమా అంటే ఎందుకు తీయాలో నాకు అర్థం కాదు. ఆర్ట్ మూవీ మాఫియా ఉందేమో... బయటకు లుక్ ఎలా ఉన్నా... ఐయామ్ ఫుల్లీ యంగ్ ఇన్సైడ్. లైవ్లీ, హ్యాపీ పర్సనాలిటీ నాది. మనం తీసే సినిమా మనల్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అలాగే నా సినిమాలు నన్ను రిఫ్లెక్ట్ చేస్తాయి. నిజానికి వెరీ ఈజీ టూ మేక్ ఎ ఆర్ట్ ఫిలిమ్. ఓ గదిలో నలుగురు కూచుని కూడా తీసేయవచ్చు. అయితే పెద్ద బడ్జెట్‌తో చేసే మల్టీస్టారర్, ఎక్కువ మంది చూసే,ఎంతో బిజినెస్ చేసే పెద్ద బడ్జెట్ సినిమా తీయడం చాలా కష్టం. ఆర్ట్ ఫిలిమ్స్ తీయడం తప్పనో మరొకటో చెప్పడం లేదు. అయితే కమర్షియల్ సినిమాలను తక్కువ చేసి చూడవద్దని మాత్రమే చెబుతున్నాను. -
షారుక్ ఖాన్ కు అనారోగ్యం!
ముంబై: బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ అనారోగ్యానికి గురయ్యాడు. తాను జలుబు, జ్వరంతో బాధపడుతున్నట్టు అభిమానులకు సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. జలుబు, జ్వరంతో బాధపడుతున్నాను. జలుబు కారణంగా వాసన తెలియడం లేదు. హ్యాపీ న్యూఇయర్ చిత్ర విజయాన్ని ఎంజాయ్.. ఆ చిత్రం గురించి వార్తలను కనీసం చదువలేక పోతున్నాను. హ్యాపీ న్యూఇయర్ చిత్రాన్ని అందరించిన ప్రేక్షకులకు, అభిమానులకు ధన్యవాదాలు అంటూ షారుక్ ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. హ్యాపీ న్యూఇయర్ ప్రమోషన్ సందర్బంగా షారుక్ మోకాలి నొప్పితో బాధపడ్డారు. ప్రస్తుతం యశ్ రాజ్ ప్రోడక్షన్ రూపొందించే 'ఫ్యాన్' చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన హ్యాపీ న్యూఇయర్ చిత్రం రికార్డులను తిరగరాస్తోంది. Down with cold & fever. Can’t smell a thing….not even the success. Can see it…feel it…read it…waiting to smell it!! Thanx all for loving HNY— Shah Rukh Khan (@iamsrk) October 26, 2014 -
హ్యాపీ న్యూయర్ భారీ వసూళ్లు
-
'నాకు మల్టీ స్టారర్ చిత్రాల వల్ల ఇబ్బంది లేదు'
న్యూఢిల్లీ:బాలీవుడ్ లో తాను నటించే మల్టీ స్టారర్ సినిమాలతో పెద్దగా ఇబ్బందేమీ లేదంటున్నాడు ప్రముఖ నటుడు అభిషేక బచ్చన్. 'ధూమ్-3'లో అమీర్ ఖాన్ తో కలిసి మల్టీ స్టారర్ చిత్రంలో చివరిసారిగా నటించిన ఆ హీరో.. తాను నటుడిగా సురక్షిత స్థానంలో ఉన్నట్లు తెలిపాడు. 'నేను సినిమాలు ఎంపిక చేసుకునేటప్పుడు పాత్రకే ప్రాధాన్యత ఇస్తా. అది సోలోనా, మల్టీ స్టారర్ సినిమానా అనే విషయానికి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వను. ప్రస్తుతం నాకు నటుడిగా ఎటువంటి ఇబ్బంది లేదు'అని తెలిపాడు. సోలో చిత్రాలు ఏ ఒక్కరి క్రెడిట్ తోనూ విజయవంతం కావని స్పష్టం చేశాడు. అసలు సినిమా అనేది టీమ్ ఎఫర్ట్. అది ఏమీ ఒక నటుని ఘనత కాదంటూ తన హుందతనాన్ని చాటుకున్నాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న 'హ్యాపీ న్యూ ఇయర్'చిత్రంలో అభిషేక్ పాత్రకు సంబంధించి పై విధంగా స్పందించాడు. -
సొంతింటికొచ్చినట్టుంది
ఫరాఖాన్, షారుఖ్ ఖాన్ సంయుక్త ప్రాజెక్టు ‘ఓం శాంతి ఓం’ సినిమాతో తన కెరీర్‌ను ప్రారంభించిన బాలీవుడ్ నటి దీపికా పదుకొణే ... తిరిగి ఏడేళ్ల తర్వాత దీపావళి పండుగకు విడుదల కానున్న ‘హ్యేపీ న్యూఇయర్’ సినిమాతో సొంతించినట్టుగ ఉందంది. ఈ సినిమాకు ఫరాఖాన్ దర్శకత ్వం వహించగా షారుఖ్ ఖానే కథానాయకుడు. ‘హ్యేపీ న్యూఇయర్ సినిమాతో నాకు సొంతింటికి వచ్చినట్టనిపిస్తోంది. ఈ సినిమాతో ‘ఓం శాంతి ఓం’ జ్ఞాపకాలు మదిలో మెదులుతున్నాయి. ఫరా.. నన్ను బేబీ అని పిలిచేది. నేను ఫరాను అమ్మా అని పిలిచేదాన్ని. ఫరా నాతో ఎంతో స్వేచ్ఛగా ఉండేది. వాస్తవానికి మాఇద్దరి సంబంధం అత్యంత ప్రత్యేకం. చాలాసేపు గడిపేవాళ్లం. కలిసి మాట్లాడుకునేవాళ్లం. సమయమే తెలిసేది కాదు. ఇక షారుఖ్, ఫరాలు కూడా కుటుంబసభ్యుల మాదిరిగా ఉండేవాళ్లు’ అని అంది. ఈ సినిమాకు ఫరాఖాన్ దర్శకత్వం వహించగా షారుఖ్‌తోపాటు అభిషేక్ బచ్చన్, సోనూసూద్, బొమన్ ఇరానీ, వియాన్షా తదితరులు నటించారు. ‘నిర్మాత/ కొరియోగ్రాఫర్, షారుఖ్‌ఖాన్‌ల చేతిలో నా కెరీర్ అత్యంత భద్రంగానే ఉందనిపిస్తోంది. ఇద్దరి వయసూ 49 సంవత్సరాలే. బాలీవుడ్లో అడుగుపెడుతూనే వారు నాకు మంచి అవకాశం కల్పించారు. నా బాధ్యతను వారు తమ నెత్తిపై పెట్టుకున్నారు. చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమా పూర్తికాగానే ఫరాఖాన్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. హ్యాపీ న్యూ ఇయర్ సినిమా చేయమని అడిగింది. నా డేట్స్ ఖాళీగా ఉన్న సమయంలోనే ఈ సినిమా షూటింగ్ జరిగింది’ అని ముగించింది ఈ 29 ఏళ్ల సుందరి. -
స్టార్ కథానాయిక అవసరం లేదు
ముంబై: యశ్‌రాజ్ ఫిలిమ్స్ సంస్థ సారథ్యంలో త్వరలో రూపొందనున్న ‘ఫ్యాన్’ సినిమాలో కథానాయిక ఎవరనేది ఇంకా తెలియకపోయినప్పటికీ ఈ సినిమాకి స్టార్ కథానాయిక అవసరం లేదని నటుడు షారుఖ్‌ఖాన్ చెప్పాడు. 48 ఏళ్ల ఖాన్... ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కారణంగా క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ‘బ్యాండ్ బాజా బారాత్’ దర్శకుడు మనీష్ శర ్మ తీస్తున్న ఈ సినిమాలో ఖాన్ రకరకాల అవతారాల్లో కనిపించనున్నాడు. ‘యశ్‌రాజ్ ఫిలిమ్స్ సంస, మనీష్ శర్మలంటే నాకు ఎంతో ఇష్టం. ఈ సినిమాలో ఇద్దరు యువతులు ఉం టారు. ఈ సినిమాకి స్టార్ కథానాయిక అవసరమే లేదు. ఇది అత్యంత ఆసక్తికరమైనదే కాకుండా విభిన్నమైన సినిమాకూడా. గత 20 సంవత్సరాల కాలంలో నేను నటించిన సినిమాల్లోకెల్లా ఇది అత్యంత సవాళ్లతో కూడినది. సినిమా నటుల అభిమానుల గురించి తీస్తున్న సినిమా ఇది’ అని అన్నాడు. కాగా ఖాన్.. రాహుల్ ధొలాకియా తీయనున్న ‘రయీస్’తోపాటు రోహిత్‌శెట్టి దర్శకత్వం వహించనున్న తాజా సినిమాలకు సంతకాలు చేసేశాడు. మరో సినిమాకు సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే అది ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ‘రయీస్’ ఓ విభిన్నమైన సినిమా. దీని గురించి రాహుల్ ధొలాకియా నాకు పూర్తిగా వివరించాడు. నాకు ఎంతోబాగా నచ్చింది’ అని అన్నాడు. ఇదిలాఉంచితే దీపావళి పండుగకు విడుదల కానున్న ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమాకు ఖాన్ అన్నివిధాలుగా సన్నద్ధమవుతున్నాడు. ఈ సినిమాకు ఫరాఖాన్ దర్శకత్వం వహించింది. -
షారుక్ ఖాన్ కు చెన్నైలో చుక్కెదురు
చెన్నై : బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌కు చెన్నైలో చుక్కెదురైంది.'హ్యాపీ న్యూ ఇయర్' సినిమా ప్రమోషన్‌కు వచ్చిన షారుక్‌కు.. చెన్నై మీడియాకు మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో షారుక్ ప్రెస్‌మీట్‌ను మీడియా బహిష్కరించింది. చెన్నైలోని ఓ స్టార్ హోటల్లో సాయంత్రం 4.30 గంటలకు 'హ్యాపీ న్యూఇయర్' సినిమా ప్రమోషన్ జరుగుతుందని సమాచారమిచ్చి.. రాత్రి 8గంటలు దాటుతున్నా షారుక్ మీడియా సమావేశానికి రాలేదు. దీనిపై అక్కడున్నవారు కూడా జర్నలిస్టులకు సరైన సమాధానం ఇవ్వలేదు. దీంతో ఆగ్రహించిన మీడియా ప్రతినిధులు రూమ్‌లో ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తున్న షారుక్ వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే వారిని షారుక్ సిబ్బంది అడ్డుకోవటంతో మీడియా ప్రతినిధులు.... షారుఖ్ బయటకు రావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అప్పుడు తీరిగ్గా బయటకు వచ్చిన షారుక్ ఆలస్యానికి క్షమించాలని కోరాడు. తనకు మీడియా సమావేశంపై స్పష్టత లేదని చెప్పాడు. సరైన అవగాహన లేకుండా తమను ఎందుకు నాలుగు గంటల పాటు వేచి ఉంచేలా చేశారని షారుక్ తో వాగ్వాదానికి దిగారు. అనంతరం మీడియా సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. దీంతో 'హ్యాపీ న్యూఇయర్' ప్రమోషన్ కాస్తా రసాభాసగా మారింది. -
దీపావళి కానుకగా హ్యపీ న్యూ ఇయర్
-
నేను చేసిన ప్రతిదీ పెద్ద సినిమాయే
తాను నటించిన ఏ సినిమా అయినా చివరకు భారీ సినిమాగా మారిపోతోందని సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ వ్యాఖ్యానించాడు. రొమాంటిక్ హీరోగా యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఖాన్ నటించిన కొన్ని సందేశాత్మక సినిమాలు సైతం సూపర్ హిట్ అయ్యాయి. తాను కొంత రిస్క్ చేసి నటించిన సినిమాలు సైతం ప్రేక్షకులను అలరించడం తనకు ఆనందాన్నిచ్చిందని ఖాన్తెలిపాడు. ‘నేను ఒక సందేశాత్మక చిత్రంలో నటించినా అది చివరకు మంచి మార్కెట్‌ను సాధించింది. ‘నేను ‘మాయా మేమ్సాబ్’,‘ఓ డార్లింగ్ యే హై ఇండియా’, ‘డర్’, ‘బాజీగర్’, ‘స్వదేశ్’, ‘చక్ దే ఇండియా’ వంటి కొన్ని సినిమాలు చేసినప్పుడు అవి ఆఫ్- బీట్ సినిమాలు అనుకొన్నా.. కాని అవి ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో మంచి వసూళ్లు కూడా సాధించాయి..’అని చెప్పాడు. ‘ఎవరో ఏదో చెప్పారనో.. అడిగారనో మొహమాటానికి నేను ఏ సినిమా చేయను.. నా మనసుకు నచ్చిన సినివ ూలే చేస్తున్నా. ప్రస్తుతం నా దగ్గర కావాల్సినంత డబ్బుంది.. నేను చాలా పెద్ద స్టార్నిు. పేరు ప్రతిష్టలున్నాయి.. చాలా అవార్డులు గెలుచుకోగలిగాను. ఇప్పుడు నేను నా మనసుకు నచ్చిన, నా పిల్లలు మెచ్చిన సినిమాలు చేస్తా.. రా.వన్ సినిమా నా పిల్లల కోసం చేశా. నా తండ్రి హాకీ ఆటగాడు. అందుకే హాకీ నేపథ్యంలో చక్‌దే ఇండియాలో నటించా. ఇలా మనం నటిస్తున్న పాత్రపై మమకారం ఉండాలనేది నా సిద్ధాంతం..’ అని షారూఖ్ వ్యాఖ్యానించాడు. తాను నటించిన ఆఫ్-బీట్ సినిమాలు ‘ఫ్యాన్’, ‘రాయీస్’ సినిమాలు త్వరలో విడుదల కాబోతున్నాయని ఖాన్ వివరించాడు. తన రెండు దశాబ్దాల సినీ ప్రస్థానంలో ఎన్నడూ వెనుదిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడలేదన్నాడు. అలాగే నటుడిగా ఉన్నందుకు ఎన్నడూ బాధపడాల్సిన ఘటనలు ఎదురుపడలేదని చెప్పాడు. ఖాన్ హీరోగా నిర్మితమైన మల్టీస్టారర్ సినిమా ‘హ్యాపీ న్యూ ఇయర్’ వచ్చే దీపావళికి ప్రపంచవ్యాప్తంగా సందడి చేయనుంది. ఈ సినిమాకు డెరైక్టర్ ఫరా ఖాన్. ఆమె ఇంతకు ముందు షారూఖ్‌తో తీసిన ‘మై హూ నా’, ‘ఓం శాంతి ఓం’ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. -
‘ప్రవాసం’.. పెద్ద మార్కెట్!
న్యూఢిల్లీ: బాలీవుడ్ సినిమాలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంటోందని విలక్షణ నటుడు బొమన్ ఇరానీ వ్యాఖ్యానించా డు. ఇంతవరకు భారత్ మార్కెట్‌నే నమ్ముకుని సినిమాలు తీస్తున్నామని, నిజం చెప్పాలంటే ప్రవాస భారతంలోనే బాలీ వుడ్ సినిమాలకు మంచి గిరాకీ ఉందనే విషయం ఇటీవలనే పరిశ్రమ గుర్తించిందన్నాడు. త్వరలోనే విడుదల కానున్న షారూఖ్ నటించిన ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమాలో బొమన్...కనిపించనున్నాడు. వారు (ప్రవాస భారతీయులు) ఎక్కువ మంది ఉండకపోవచ్చు కాని మన సినిమాలు చూసే వారిలో వారి వాటా ఎక్కువేనని ఆయన అభిప్రాయపడ్డాడు. అమెరికాలో భారతీయుల సంఖ్య సుమారు 28 లక్షలకు పైగానే ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని దీపావళి పండుగకు విడుదల కానున్న తమ సినిమాకు అక్కడ ప్రచారం కల్పిం చేందుకు ‘హ్యాపీ న్యూ ఇయర్’ టీం ఆ దేశం లో విస్తృతంగా పర్యటించాలని నిర్ణయిం చిం ది. అందులో భాగంగా శుక్రవా రం హోస్టన్‌లోని టొయోటా సెంటర్లో కార్యక్రమాన్ని నిర్వహించింది. కాగా ఈ ప్రచార కార్యక్రమా ల్లో హీరో షారూఖ్ ఖాన్, హీరోయిన్ దీపికా పదుకొణే, ఇతర ప్రధాన పాత్రధారులైన అభిషేక్ బచ్చన్, సోనూసూద్, వివాన్‌షా తదితరులు తళుక్కుమననున్నారు. అలాగే గత 25 ఏళ్లలో ఎన్నడూ స్టేజ్ షోలో కనిపిం చని డెరైక్టర్ ఫరాఖాన్ సైతం ఇక్కడ జరిగే స్టేజ్ షోలలో కనిపించనున్నారు. ఈ టీం న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, చికాగోతోపాటు కెనడాలోని వాం కోవర్లో సైతం తమ సినిమా ప్రచార కార్యక్రమాలను నిర్వహించనుంది. ‘ఈ సినిమాలో పాత్రధారులందరూ వివిధ ప్రాంతాలకు చెందిన వారు.. సోనూసూద్ పంజాబ్‌నుంచి వస్తే, అభిషేక్ ముం బైలో ఉంటాడు. కానీ అతడి కుటుంబ నేపథ్యం పూర్తిగా వైవిధ్యం.. అలాగే నేను పార్సీ కుటుంబానికి చెందినవాడిని.. ఇలా అన్ని రకాల సంస్కృతులు ఈ సినిమాలో కనిపించి ప్రేక్షకులకు కనువిం దు చేయనున్నాయి. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుం దని నాకు నమ్మకముంది. ఇది ప్రేక్షకులను రంజింపజేస్తుం దనే నమ్ముతున్నా..’ అని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, బొమ్మన్ ఇంతకుముందు మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగేరహో మున్నాభాయ్, ఖోస్లా కా ఘోస్లా తదితర హిట్ సిని మాల్లో నటించిన విషయం తెలిసిందే. -
అమెరికాలో బాలీవుడ్ సినిమాలకు మంచి డిమాండ్
బాలీవుడ్ సినిమాలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంటోందని విలక్షణ నటుడు బొమన్ ఇరానీ వ్యాఖ్యానించాడు. ఇంతవరకు భారత్ మార్కెట్‌నే నమ్ముకుని సినిమాలు తీస్తున్నామని, నిజం చెప్పాలంటే ప్రవాస భారతంలోనే బాలీవుడ్ సినిమాలకు మంచి గిరాకీ ఉందనే విషయం ఇటీవలనే పరిశ్రమ గుర్తించిందన్నాడు. త్వరలోనే విడుదల కానున్న షారూఖ్ నటించిన ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమాలో బొమన్...కనిపించనున్నాడు. వారు (ప్రవాస భారతీయులు) ఎక్కువ మంది ఉండకపోవచ్చు కాని మన సినిమాలు చూసే వారిలో వారి వాటా ఎక్కువేనని ఆయన అభిప్రాయపడ్డాడు. అమెరికాలో భారతీయుల సంఖ్య సుమారు 28 లక్షలకు పైగానే ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని దీపావళి పండుగకు విడుదల కానున్న తమ సినిమాకు అక్కడ ప్రచారం కల్పించేందుకు ‘హ్యాపీ న్యూ ఇయర్’ టీం ఆ దేశంలో విస్తృతంగా పర్యటించాలని నిర్ణయించింది. అందులో భాగంగా శుక్రవారం హోస్టన్‌లోని టొయోటా సెంటర్లో కార్యక్రమాన్ని నిర్వహించింది. కాగా ఈ ప్రచార కార్యక్రమాల్లో హీరో షారూఖ్ ఖాన్, హీరోయిన్ దీపికా పదుకొణే, ఇతర ప్రధాన పాత్రధారులైన అభిషేక్ బచ్చన్, సోనూసూద్, వివాన్‌షా తదితరులు తళుక్కుమననున్నారు. అలాగే గత 25 ఏళ్లలో ఎన్నడూ స్టేజ్ షోలో కనిపించని డెరైక్టర్ ఫరాఖాన్ సైతం ఇక్కడ జరిగే స్టేజ్ షోలలో కనిపించనున్నారు. ఈ టీం న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, చికాగోతోపాటు కెనడాలోని వాంకోవర్‌లో సైతం తమ సినిమా ప్రచార కార్యక్రమాలను నిర్వహించనుంది. ‘ఈ సినిమాలో పాత్రధారులందరూ వివిధ ప్రాంతాలకు చెందిన వారు.. సోనూసూద్ పంజాబ్‌నుంచి వస్తే, అభిషేక్ ముం బైలో ఉంటాడు. కానీ అతడి కుటుంబ నేపథ్యం పూర్తిగా వైవిధ్యం.. అలాగే నేను పార్సీ కుటుంబానికి చెందినవాడిని.. ఇలా అన్ని రకాల సంస్కృతులు ఈ సినిమాలో కనిపించి ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాయి. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని నాకు నమ్మకముంది. ఇది ప్రేక్షకులను రంజింపజేస్తుందనే నమ్ముతున్నా..’ అని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, బొమ్మన్ ఇంతకుముందు మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగేరహో మున్నాభాయ్, ఖోస్లా కా ఘోస్లా, డాన్-ది ఛేజ్ బిగిన్స్ ఎగైన్ వంటి హిట్ సినిమాల్లో నటి ంచిన విషయం తెలిసిందే. -
విదేశాల్లో బాలీవుడ్ సినిమాల శక్తిని గుర్తించాం!
న్యూఢిల్లీ: విదేశాల్లో బాలీవుడ్ సినిమాల శక్తిని గుర్తించామని విలక్షణ నటుడు బొమన్ ఇరానీ తెలిపారు. బాలీవుడ్ సినిమాలకు విదేశాల్లో మంచి మార్కెట్ ఉంటోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇంతవరకూ భారత్ మార్కెట్‌నే నమ్ముకుని సినిమాలు తీస్తున్నామని, ఇటీవలే ప్రవాస భారతంలో కూడా బాలీవుడ్ సినిమాలకు మంచి గిరాకీ ఉందనే విషయాన్ని పరిశ్రమ గుర్తించిందని ఆయన అన్నారు. అమెరికాలో చైనీయులు తరువాత భారతీయుల సంఖ్య సుమారు 28 లక్షలకు పైగానే ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని దీపావళి పండుగకు విడుదల కానున్న తమ సినిమాకు అక్కడ ప్రచారం కల్పించేందుకు ‘హ్యాపీ న్యూ ఇయర్’ టీం ఆ దేశంలో విస్తృతంగా పర్యటించాలని నిర్ణయించింది. అందులో భాగంగా శుక్రవారం హోస్టన్‌లోని టొయోటా సెంటర్లో కార్యక్రమాన్ని ఆరంభిందన్నాడు. ఈ ప్రచార కార్యక్రమాల్లో హీరో షారూఖ్ ఖాన్, హీరోయిన్ దీపికా పదుకొణే తో పాటు ఇతర ప్రధాన పాత్రధారులైన అభిషేక్ బచ్చన్, సోనూసూద్, వివాన్‌షా స్టేజ్ షోల్లో అలరించడానికి సిద్ధమవుతున్నారని ఇరానీ స్పష్టం చేశాడు. త్వరలోనే విడుదల కానున్న షారూఖ్ నటించిన ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమాలో ఇరానీ కనిపించనున్నారు. -
మంచి సినిమాలే తీస్తా
దర్శకురాలు ఫరాఖాన్ న్యూఢిల్లీ: ఆమె సినిమాలు నృత్యాలు, పాటలు, మెలోడ్రామా, శృంగారం, అనేక రకాల ఎమోషన్లు, రంగులు, స్టార్ పవర్ సమ్మిళితం. అందువల్ల ఏ సినిమా అయినా ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్ర వేస్తుంది. అవి మాస్ నుంచి క్లాస్‌ను కూడా అలరిస్తుంది. సొంత గడ్డపైతోపాటు విదేశాల్లోనూ మంచిపేరు తెచ్చిపెడుతుంది. ఆ ప్రతిభాశాలి మరెవరో కాదు... ఫరాఖాన్. అసాధ్యాన్ని సుసాధ్యంచేయగలిగిన సత్తా ఉన్నప్పటికీ విజయానికి పొంగిపోయి, అపజయానికి కుంగిపోయే స్వభావం ఫరాఖాన్‌కు లేదు. సినిమా నిర్మాతగా మారకముందు కొరియోగ్రఫర్‌గా ఎన్నో అద్భుతమైన పాటలకు ప్రేక్షకులు మైమరిచిపోయేవిధంగా నృత్యాన్ని సమకూర్చింది. ఈ విషయమై ఫరాఖాన్ తన అనుభవాలను మీడియాతో పంచుకుంటూ తాను పనికిమాలిన సినిమాలను తీయనని, అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే చిత్రాలనే తెరపెకైక్కిస్తానని అంది. ప్రేక్షకులకు ఏ సినిమా నచ్చుతుందనే విషయాన్ని అంత తేలిగ్గా ఎవరూ అంచనా వేయలేరంది. ముఖ్యంగా బీక్లాస్ ఆడియన్స్‌తోపాటు లండన్, అమెరికా దేశాలకు చెందిన ప్రేక్షకులను ను మెప్పించడం అంత సులువేమీ కాదంది. కొంతమంది పెద్ద పెద్ద నటులతో కలిసి మంచి కళాతమకమైన సినిమాలే తీస్తానని, పనికిమాలిన సినిమాలు అసలు తీయనని‘తీస్ మార్ ఖాన్’ దర్శకురాలైన ఈ 49 ఏళ్ల ఈ కొరియోగ్రాఫర్ తెలిపింది. షారుఖ్‌ఖాన్ కథానాయకుడిగా ఇటీవల ‘హేపీ న్యూ ఇయర్’ సినిమా తీసింది. ఇందులో షారుఖ్‌ఖాన్ కథానాయకుడు కాగా ఇంకా దీపికా పదుకొణే, అభిషేక్ బచ్చన్, బొమన్ ఇరానీ, సోనూసూద్, వివన్షా తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాలో జాకీ ష్రాఫ్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. -
అనాహ్లాదకర చిత్రాలను తెరకెక్కించను!
న్యూఢిల్లీ: 'హ్యాపీ న్యూ ఇయర్' చిత్రాన్ని తన డ్రీమ్ ప్రాజెక్టుగా వర్ణించిన దర్శకురాలు ఫరాఖాన్.. ఆ చిత్రం మరో కొత్త ట్రెండ్ ను సృష్టింస్తుందని అభిప్రాయపడ్డారు. తన సినిమాల్లో డ్యాన్స్ లు, పాటలు, మెలోడ్రామా, రొమాన్స్, ఎమోషన్స్, కలర్, స్టార్ పవర్ అన్ని కలగలసి ఉంటాయని తాజాగా ఐఎన్ఎస్ కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. తాను ఎప్పుడూ అనాహ్లాదకర చిత్రాలపై మక్కువ చూపనని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తాను ఫిల్మ్ మేకింగ్ కు రాకముందు కొరియోగ్రఫీలో అనుభవం ఉన్నందున ప్రధానమైన పాటల్లో డ్యాన్స్ సీక్వెన్స్ ల్లో పాలుపంచుకుంటానని ఫరాఖాన్ తెలిపారు. అన్ని రకాల ప్రేక్షకులను వినోదాన్ని అందించడమే తన లక్ష్యమన్నారు. కొన్ని సమయాల్లో కథ బాగున్నా.. భారతీయ ప్రేక్షకుల్ని ఆకర్షించడం చాలా కష్టంతో కూడుకున్న పని అని ఫరాఖాన్ తెలిపారు. గతంలో తీస్ మార్ ఖాన్ ను తెరకెక్కించిన 49 ఏళ్ల ఫరాఖాన్ హ్యాపీ న్యూ ఇయర్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా తాను ఎల్లప్పుడూ వినోద భరితమైన చిత్రాలపైనే దృష్టి పెడుతుంటానని.. అనాహ్లాదకర చిత్రాలను ఎప్పుడూ తెరకెక్కించనన్నారు. -
'హ్యాపీ న్యూ ఇయర్' ఆడియో ఆవిష్కరణ
-
దీపికాకు మనమందరం మద్దతుగా నిలువాలి: షారుక్
ముంబై: వివాదస్సద కథనంపై ఓ ఆంగ్ల దినపత్రికకు ధీటైన సమాధానమిచ్చిన బాలీవుడ్ తార దీపికా పదుకొనెను షారుక్ ఖాన్ ప్రశంసించారు. పబ్లిక్ గా తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా, ధైర్యంగా చెప్పటం అందరికి సాధ్యం కాదని షారుక్ అన్నారు. దీపికా చేసిన ట్వీట్ కు తాను సమర్ధిస్తున్నానని, అలాగే 'హ్యాపీ న్యూఇయర్' చిత్ర యూనిట్ మద్దతు కూడా ఉందని ఆయన అన్నారు. దీపికా చూపిన ధైర్యం మనలో అందరికి ఉండదని, కావున మనమందరం ఆమెకు మద్దతివ్వాలన్నారు. ఓ ఆంగ్ల దినపత్రిక కథనంపై స్పందిస్తూ.. నేను మహిళను, నాకు వక్షోజాలున్నాయి. అయితే మీకు వచ్చిన సమస్యేమిటి? అంటూ ఘాటుగా ట్విటర్ లో పోస్ట్ చేశారు. దీపికా స్పందించిన విధానంపై దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. -
ఖాన్ పర్యటనపై ఉత్సుకత
వాషింగ్టన్: తన తాజా చిత్రం ‘హేపీ న్యూ ఇయర్’ ప్రచారం కోసం బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్‌ఖాన్ చేపట్టనున్న అమెరికా పర్యటన భారతీయులతోపాటు అమెరికన్లు, దక్షిణాసియాకు చెందిన అభిమానుల్లో ఎనలేని ఉత్సుకత కలిగిస్తోంది. దశాబ్దకాలం తర్వాత ఈ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్ స్టార్’ అమెరికాలో పర్యటించనున్నా డు. అక్కడ లైవ్ ప్రదర్శనలు ఇవ్వనున్నాడు. ఈ పర్యటన కు శ్లామ్ (ఎస్ఎల్ఏఎం) అని ఖాన్ నామకరణం చేశాడు. ఎస్ అంటే సౌండ్, ఎల్ అంటే లైట్, ఏ అంటే యాక్షన్, ఎం అంటే మూవీ. ఖాన్ ప్రచార కార్యక్రమంలో దీపికా పదుకొణే, అభిషేక్ బచ్చన్, బొమన్ ఇరానీ, మాధురీదీక్షిత్, మలైకా అరోరా తదితరులు పాల్గొననున్నారు. ఖాన్ ప్రచార కార్యక్రమం విషయమై వాషింగ్టన్ డీసీ శివారులో నివసిస్తున్న అతని అభిమాని రిచర్డ్ వైట్ మాట్లాడుతూ ఇందుకోసం ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్నామన్నాడు. నా స్నేహితుడు బలవంతం చేయడంతో ఖాన్ నటించిన ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ సినిమా చూశా. అతడొక గొప్ప నటుడు’అని అన్నాడు. వర్జీనియాలో త్వరలో జరగనున్న ప్రదర్శనను తిలకించేందుకు రిచర్డ్‌తోపాటు అతని స్నేహితులు ఇప్పటికే టికెట్లను కొనుగోలు చేశారు. ఖాన్ ప్రచార కార్యక్రమాలు ఈ నెల 19వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఖాన్‌తోపాటు ‘హేపీ న్యూ ఇయర్’ సినిమాలోని సహనటులంతా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. 19వ తేదీన హోస్టన్, 20న న్యూజెర్సీ, 26న చికాగో, 28న కాలిఫోర్నియాలో ప్రచార కార ్యక్రమాలు జరగనున్నాయి. ఆ తర్వాత ఈ నెల 27వ తేదీన ఈ బృందం కెనాడాలోని వాంకోవర్ నగరం వెళ్లి అక్కడ నిర్వహించే ప్రచార కార్యక్రమంలో పాల్గొననుంది. -
అయిదు పదుల వయసులో ఎనిమిది పలకలు!
అయిదు పదుల వయసులో సిక్స్ ప్యాక్ చేయడం అంటేనే రిస్క్. ఆ వయసులో ఉన్న షారుక్ ఖాన్ ఇంకో అడుగు వేసి ఏకంగా ఎయిట్ ప్యాక్ చేసేసి, బాలీవుడ్ మొత్తాన్ని నివ్వెరపోయేట్లు చేశారు. ప్రస్తుతం ఫరా ఖాన్ దర్శకత్వంలో ‘హ్యాపీ న్యూ ఇయర్’ చిత్రంలో షారుక్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసమే ఎనిమిది పలకల దేహంతో దృఢకాయుడిగా మారారు షారుక్. ప్రశాంత్ సావార్ అనే శిక్షకుని నేతృత్వంలో ఆయన ఈ ఫీట్ చేశారు. ‘ఓం శాంతి ఓం’ సినిమా కోసం గతంలో షారుక్ సిక్స్ ప్యాక్ చేశారు. ఆ సినిమాకు కూడా ఫరాఖానే దర్శకురాలు కావడం విశేషం. ఏదో ఆడంబరం కోసం కాకుండా కథకు అవసరం కాబట్టే షారుక్ ఎయిట్ ప్యాక్ చేసినట్లు యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ సినిమాలో షారుక్‌తో పాటు అభిషేక్ బచ్చన్, దీపికా పదుకొనే, సోనూసూద్ కూడా ముఖ్య భూమికలు పోషిస్తున్న విషయం తెలిసిందే. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై షారుక్ భార్య గౌరీఖాన్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరిన్ని చిత్రాలకు క్లిక్ చేయండి -
బొమన్ ఇరానీకి బెదిరింపులు
సాక్షి, ముంబై: ప్రముఖ హిందీ నటుడు బోమన్ ఇరానీని హతమారుస్తామని రవిపూజారి ముఠా నుంచి బెదిరింపు ఫోన్ వచ్చింది. దీంతో ఆయనకు తగిన భద్రత కల్పించినట్లు నగర పోలీసు వర్గాలు తెలిపాయి. ఇరానీ రూపొందించిన ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమా దీపావళికి విడుదల అవుతుందని ప్రకటించిన నాటి నుంచి ఆయనకు బెదిరింపులు వస్తున్నాయి. దీంతో భద్రత కల్పించారు. ఇందులో షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణే ప్రధాన తారాగణం. అయితే ఈ సినిమా అంతర్జాతీయ హక్కుల కోసం రవి పూజారి.. షారుఖ్, ఇరానీని బెదిరించినట్టు తెలి సింది. ఇదే ముఠా సభ్యులు ఆగస్టు 23న జుహూలో ఉండే నిర్మాత అలీ మొరానీ ఇంటి బయట ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు. అం దులో రెండు బుల్లెట్లు పూల మొక్కల కుండీలకు, మరో రెండు కిటికీ అద్దాలకు, ఒకటి కాం పౌండ్లో పార్క్ చేసిన బీఎండబ్ల్యూ కారు బానెట్‌కు తగిలాయి. మొరానీ ఇంటి ముందు కాల్పు లు జరిపిన రెండు రోజుల తరువాత షారుఖ్ ఖాన్‌కు చెందిన రెడ్ చిల్లీస్ చిత్ర నిర్మాణ సంస్థ కు పూజారి ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో షారుఖ్‌తోపాటు మొరానీ, ఇరానీకి భద్రత కల్పిస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. ఇరానీ విదేశీ నంబర్ల నుంచి బెదిరింపు ఫోన్లు వచ్చినట్టు విచారణలో తేలింది. రవి పూజారి దుబాయ్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. -
నా పిల్లల కోసమే...
త్వరలో విడుదల కానున్న ‘హ్యేపీ న్యూ ఇయర్’ సినిమాలో స్టంట్లు, సాహస విన్యాసాలు కేవలం తన పిల్లలు సుహానా, ఆర్యన్ కోసమే చేశానని బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్‌ఖాన్ చెప్పాడు. ‘నాకు ఇద్దరు పిల్లలు. స్టంట్లు చేయాలని వారు చెప్పారు. భార్య గౌరి కంటే కూడా ఎక్కువగా వారి మాటే వింటాను. సవాలు లాంటి వాటిని కనుక చేయలేకపోతే వాటి గాయాలకు భయపడిపోృనట్టు నాకు అనిపిస్తుంది’ అని అన్నాడు. 48 ఏళ్ల షారుఖ్ ‘హ్యేపీ న్యూ ఇయర్’ సినిమా షూటింగ్ సమయంలో గాయపడ్డాడు. భుజం తదితర చోట్ల ఏర్పడిన గాయాలవల్ల ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు మరింత బలీ య ంగా తయారయ్యా. ఎటువంటి ఇబ్బ ందులు ఎదురైనా ఓ నటుడిగా శారీరకంగా, మానసికంగా బలంగా ఉండగలగాలి. నేను చేయగలిగినమేరకు చేస్తా. భవనంపై నుంచి కిందికి దూకా. ఎంతో భయమనిపించింది. ఓ తాడు పట్టుకుని దూకాల్సి ఉంటు ంది. అందువల్ల సురక్షితమే. ఓ సూపర్‌స్టార్ కెమెరా ముందు ఏవిధంగా నటిస్తాడనే విషయం తెలుసుకోవాలనేది అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. అయితే వారి పిల్లలు మాత్రం అటువంటివి చేయాలని కోరుకోరు షూటింగ్‌లు చూసిచూసి వారు విసిగిపోతారు. అందువల్ల వారు అంత ఎక్కువగా షూటింగ్ స్పాట్‌కు రావడానికి ఇష్టపడరు. ముంబైలో షూటింగ్ జరుగుతుంటే మాత్రం మా పిల్లలు రారు. షూటింగ్‌ను వారు ద్వేషిస్తారు. ఇక విదేశాల్లో షూటింగ్ ఉంటే రావాలని వారికి అనిపించినా విద్యాభ్యాసం కారణంగా అప్పుడప్పుడూ వస్తుంటారు’ అని అన్నాడు. కాగా వృత్తిపరంగా నిరంతరం తీరిక లేకుండా గడిపే షారుఖ్‌ఖాన్ ఆ కారణంగా ఎక్కువ రోజులు కుటుంబానికి దూరంగానే ఉండాల్సి వస్తుంది. అయితే షూటింగ్ విరామ సమయంలో అంతా కుటుంబమంతా కలిసి బయటికి వెళతారు. -
నా పిల్లల కోసమే...షారుఖ్
ముంబై: త్వరలో విడుదల కానున్న ‘హ్యేపీ న్యూ ఇయర్’ సినిమాలో స్టంట్లు, సాహస విన్యాసాలు కేవలం తన పిల్లలు సుహానా, ఆర్యన్ కోసమే చేశానని బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్‌ఖాన్ చెప్పాడు. ‘నాకు ఇద్దరు పిల్లలు. స్టంట్లు చేయాలని వారు చెప్పారు. భార్య గౌరి కంటే కూడా ఎక్కువగా వారి మాటే వింటాను. సవాలు లాంటి వాటిని కనుక చేయలేకపోతే వాటి గాయాలకు భయపడిపోృుునట్టు నాకు అనిపిస్తుంది’ అని అన్నాడు. 48 ఏళ్ల షారుఖ్ ‘హ్యేపీ న్యూ ఇయర్’ సినిమా షూటింగ్ సమయంలో గాయపడ్డాడు. భుజం తదితర చోట్ల ఏర్పడిన గాయాలవల్ల ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు మరింత బలీయంగా తయారయ్యా. ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ఓ నటుడిగా శారీరకంగా, మానసికంగా బలంగా ఉండగలగాలి. నేను చేయగలిగినమేరకు చేస్తా. భవనంపై నుంచి కిందికి దూకా. ఎంతో భయమనిపించింది. ఓ తాడు పట్టుకుని దూకాల్సి ఉంటుంది. అందువల్ల సురక్షితమే. ఓ సూపర్‌స్టార్ కెమెరా ముందు ఏవిధంగా నటిస్తాడనే విషయం తెలుసుకోవాలనేది అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. అయితే వారి పిల్లలు మాత్రం అటువంటివి చేయాలని కోరుకోరు షూటింగ్‌లు చూసిచూసి వారు విసిగిపోతారు. అందువల్ల వారు అంత ఎక్కువగా షూటింగ్ స్పాట్‌కు రావడానికి ఇష్టపడరు. ముంబైలో షూటింగ్ జరుగుతుంటే మాత్రం మా పిల్లలు రారు. షూటింగ్‌ను వారు ద్వేషిస్తారు. ఇక విదేశాల్లో షూటింగ్ ఉంటే రావాలని వారికి అనిపించినా విద్యాభ్యాసం కారణంగా అప్పుడప్పుడూ వస్తుంటారు’ అని అన్నాడు. కాగా వృత్తిపరంగా నిరంతరం తీరిక లేకుండా గడిపే షారుఖ్‌ఖాన్ ఆ కారణంగా ఎక్కువ రోజులు కుటుంబానికి దూరంగానే ఉండాల్సి వస్తుంది. అయితే షూటింగ్ విరామ సమయంలో అంతా కుటుంబమంతా కలిసి బయటికి వెళతారు.