300 కోట్ల క్లబ్ లో హ్యాపీ న్యూ ఇయర్!
'హ్యాపీ న్యూ ఇయర్' చిత్రం కలెక్షన్లు కొంచెం తగ్గినప్పటికి.. వసూళ్ల దూకుడు మాత్రం తగ్గుముఖం పట్లలేదు. గత ఎనిమిది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించింది.
స్వదేశంలో 237 కోట్ల, విదేశాల్లో 63 కోట్ల రూపాయలను వసూళ్లను రాబట్టింది. షారుఖ్ ఖాన్ నటించిన రెండవ చిత్రం 300 కోట్ల క్లబ్ లో చేరింది. గతంలో చెన్నై ఎక్స్ ప్రెస్ 300 కోట్లకు పైగా కలెక్షన్లను నమోదు చేసుకుంది.