ధూమ్ సిరీస్ లో నటించాలని ఉంది: షారుక్ | I would love to do 'Dhoom', says Shah Rukh Khan | Sakshi
Sakshi News home page

ధూమ్ సిరీస్ లో నటించాలని ఉంది: షారుక్

Published Mon, Nov 3 2014 5:29 PM | Last Updated on Sat, Sep 2 2017 3:49 PM

ధూమ్ సిరీస్ లో నటించాలని ఉంది: షారుక్

ధూమ్ సిరీస్ లో నటించాలని ఉంది: షారుక్

అవకాశం లభిస్తే ధూమ్ సిరీస్ చిత్రంలో నటించాలని ఉందని బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తెలిపారు. ఈ సిరీస్లో మోటర్ బైక్స్ ఉపయోగించే తీరు తనను ఆకట్టుకుందని షారుక్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం యష్ రాజ్ చిత్రం ఫ్యాన్ లో నటిస్తున్నానని,  తన మిత్రుడు ఆదిత్య చోప్రా ఇంకా తనకు పాత్ర ఆఫర్ చేయలేదని షారుక్ చెప్పారు. సంజయ్ ఘాడ్వీ కూడా తనకు తెలుసునని, అందువల్ల అవకాశం లభిస్తుందనే అనుకుంటున్నానని తెలిపారు.

'హ్యపీ న్యూ ఇయర్' తర్వాత మళ్లీ దోపిడీ నేపథ్యంలో ఏదైనా చిత్రాన్ని చేస్తున్నారా అనే ప్రశ్నకు షారుక్ ఆ విధంగా స్పందించారు. ఇప్పటి వరకైతే ధూమ్ సిరీస్లో నటించాలన్న ఆఫర్ తనకు రాలేదని షారుక్ అన్నారు. రేపట్నుంచి ఫ్యాన్ చిత్ర షూటింగుకు హాజరవుతున్నానని తెలిపారు. వయస్సు గురించి పట్టించుకోనని, శారీరకంగా చాలా ఉత్సాహంతో ఉన్నానని.. వయసు పెరిగినా.. తనలో ఉత్సాహం తగ్గలేదని ఆయన  ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement