Dhoom
-
సందీప్ వంగాతో చెర్రీ మూవీ అప్పుడే..! ధూమ్ 4 లో రామ్ చరణ్..!
-
‘ధూమ్ 4’లో విలన్‌గా సూర్య.!
-
ఇండస్ట్రీలో విషాదం.. సూపర్ హిట్ మూవీ డైరెక్టర్ మృతి!
చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ గాధ్వి (56) కన్నుమూశారు. ముంబయిలోని నివాసంలో ఉదయం సంజయ్ తుదిశ్వాస విడిచారని ఆయన పెద్దకుమార్తె సంజినా తెలిపారు. ఆయన మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. 2000లో విడుదలైన తేరే లియే చిత్రంతో సంజయ్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. 2004లో విడుదలైన ధూమ్ సినిమాతో ఆయన తొలి హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ఏడాదే ధూమ్ -2తో అలరించారు. 2020లో విడుదలైన ఆపరేషన్ పరిందే ఆయన దర్శకత్వంలో తెరకెక్కించిన చివరి చిత్రంగా నిలిచింది. -
స్కూల్లో కంప్యూటర్లు చోరీ.. బ్లాక్‌బోర్డ్‌పై దొంగ రాసింది చూసి కంగుతున్న టీచర్లు
భువనేశ్వర్: సినిమాలు ప్రజలపై ప్రభావాన్ని చూపుతాయి అంటుంటారు. ముఖ్యంగా యువత, పిల్లల మీద. అందీ మంచిగానూ అయి ఉండొచ్చు లేదా చెడు ప్రభావం అయినా కావొచ్చు. మొదట్లో ఏదో కాలక్షేపం కోసం చూసే సినిమాలు రానురానూ మనుషులపై భారీ ఎఫెక్ట్‌ను చూపుతున్నాయి. సినిమాల్లో హీరోలాగా రెడీ అవ్వడం, అతని అలవాట్లను మన అలవాట్లుగా మార్చుకోవడం, హీరోయిజం చూపించడం వంటి వాటిని ఎక్కువగా అనుకరిస్తుంటారు. సినిమాలు చూసి ఇంకా రెచ్చిపోయి కొత్త కొత్త పద్దతుల్లో దొంగతనాలు చేయడం నేర్చుకుంటారు. తాజాగా ఇలాంటి ఓ సంఘటనే ఒడిశాలో చోటుచేసుకుంది. ఓ బాలీవుడ్ సినిమా నిజ జీవితంలో నేరం చేసేలా ప్రేరేపించింది. ఓడిశాలోని ఓ పాఠశాలలో ధూమ్ సినిమా స్పూర్తితో చోరి జరిగింది. బరంగ్‌పూర్‌లోని ఉన్నత పాఠశాలలో శుక్రవారం రాత్రి కంప్యూటర్లతోపాటు మరికొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులను ఓ అంగతకుడు దొంగిలించాడు. అంతటితో ఆగకుండా క్లాస్‌లోని బ్లాక్ బోర్డుపై ఇది నేను, ధూమ్4 అని రాసి వెళ్లాడు. శనివారం ఉదయం స్కూల్‌కు వచ్చిన అటెండర్.. మెయిన్ గేట్ తాళం పగలకొట్టి ఉండటంతో విషయాన్ని ప్రిన్సిపల్‌కు సమాచారాన్ని అందించాడు. హుటాహుటిన పాఠశాల లోపలికి వెళ్లి చూడగా.. కంప్యూటర్లు, ప్రింటర్, ఫోటోకాపియర్, సౌండ్ బాక్స్ తప్పిపోయినట్లు గుర్తించారు. బ్లాక్‌బోర్డ్‌పై రాసి ఉన్న ధూమ్ 4 మేము త్వరలోనే తిరిగి వస్తామని రాసి ఉండటాన్ని చూసి కంగుతున్నారు. అలాగే ‘మీకు వీలైతే మమ్మల్ని పట్టుకోండి’ అని కూడా సవాలు విసిరాడు. చోరీపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఖాతిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: 'గోట గో హోమ్' అంటూ పార్లమెంట్లో నినాదాలు... వీడియో వైరల్ -
‘ధూమ్-4’లో విలన్‌గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్
హిందీలో వచ్చిన ‘ధూమ్’ సిరీస్‌కి మంచి క్రేజ్ ఉంది. ఈ ఫ్రాంచైజీలో వచ్చిన ‘ధూమ్, ధూమ్ 2, ధూమ్ 3’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబట్టాయి. మొదటి మూడు భాగాల్లో జాన్ అబ్రహాం, హృతిక్ రోషన్, ఆమిర్ ఖాన్ విలన్ పాత్రల్లో భారీ దొంగతనాలు చేసి, తెలివిగా తప్పించుకొని ప్రేక్షకులను అలరించారు. తాజాగా ఈ ప్రాజెక్టు గురించి ఓ ఆసక్తికర వార్త బాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ‘ధూమ్ 4’ సినిమా రూపొందించే ప్లాన్‌లో ఉంది యశ్ రాజ్ సంస్థ. గత చిత్రాలకు భిన్నంగా సినీ అభిమానులకు కొత్త అనుభూతి పంచేందుకు ‘ధూమ్ 4’లో ప్రతినాయకురాలి పాత్ర ఉండబోతుందట. ఆ పాత్ర చాలా ప్రత్యేకమైందని, అలాంటి వైవిధ్యభరిత పాత్రకు స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె అయితే బావుంటుందని చిత్రబృందం భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే దీపికతో చర్చలు జరిపారని, ఆమె స్క్రిప్టుపై ఇష్టంగా ఉందని తెలుస్తోంది. ఈ విషయంతోపాటు, కథానాయకుడు, దర్శకుల వివరాలకు సంబంధించి మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుంది. ముందు భాగాలకు మించిన యాక్షన్, స్టంట్స్, రేసులు అన్నీ ఇందులో రెండింతలు ఉంటాయని బాలీవుడ్ టాక్. షారుక్‌తో ‘పఠాన్ ’, హృతిక్‌తో ‘ఫైటర్’, ప్రభాస్–నాగ్ అశ్విన్ చిత్రం, శకున్ బాత్రా దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్... ప్రస్తుతం దీపిక చేతిలో ఉన్న సినిమాలు. చదవండి: అసభ్య వ్యాఖ్యలు.. ట్రోలర్స్‌కు దీపిక చురకలు -
ధూమ్ సిరీస్ లో నటించాలని ఉంది: షారుక్
అవకాశం లభిస్తే ధూమ్ సిరీస్ చిత్రంలో నటించాలని ఉందని బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తెలిపారు. ఈ సిరీస్‌లో మోటర్ బైక్స్ ఉపయోగించే తీరు తనను ఆకట్టుకుందని షారుక్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం యష్ రాజ్ చిత్రం ఫ్యాన్ లో నటిస్తున్నానని, తన మిత్రుడు ఆదిత్య చోప్రా ఇంకా తనకు పాత్ర ఆఫర్ చేయలేదని షారుక్ చెప్పారు. సంజయ్ ఘాడ్వీ కూడా తనకు తెలుసునని, అందువల్ల అవకాశం లభిస్తుందనే అనుకుంటున్నానని తెలిపారు. 'హ్యపీ న్యూ ఇయర్' తర్వాత మళ్లీ దోపిడీ నేపథ్యంలో ఏదైనా చిత్రాన్ని చేస్తున్నారా అనే ప్రశ్నకు షారుక్ ఆ విధంగా స్పందించారు. ఇప్పటి వరకైతే ధూమ్ సిరీస్‌లో నటించాలన్న ఆఫర్ తనకు రాలేదని షారుక్ అన్నారు. రేపట్నుంచి ఫ్యాన్ చిత్ర షూటింగుకు హాజరవుతున్నానని తెలిపారు. వయస్సు గురించి పట్టించుకోనని, శారీరకంగా చాలా ఉత్సాహంతో ఉన్నానని.. వయసు పెరిగినా.. తనలో ఉత్సాహం తగ్గలేదని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. -
భాలీవుడ్ హీరోలను విలన్స్‌గా మార్చిన ధూమ్
-
ధూమ్3 టీమ్‌తో చిట్ చాట్