Dhoom 4 Update: Is Bollywood Actress Deepika Padukone To Play Villain Role In Dhoom 4 - Sakshi
Sakshi News home page

ధూమ్‌-4 సీక్వెల్‌లో విలన్‌గా బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌

Published Tue, Feb 16 2021 9:18 AM | Last Updated on Tue, Feb 16 2021 8:02 PM

Will Deepika Padukone Play The Villain In Dhoom 4 - Sakshi

హిందీలో వచ్చిన ‘ధూమ్‌’ సిరీస్‌కి మంచి క్రేజ్‌ ఉంది. ఈ ఫ్రాంచైజీలో వచ్చిన ‘ధూమ్, ధూమ్‌ 2, ధూమ్‌ 3’ సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర మంచి వసూళ్లు రాబట్టాయి. మొదటి మూడు భాగాల్లో జాన్‌  అబ్రహాం, హృతిక్‌ రోషన్‌, ఆమిర్‌ ఖాన్‌ విలన్‌ పాత్రల్లో భారీ దొంగతనాలు చేసి, తెలివిగా తప్పించుకొని ప్రేక్షకులను అలరించారు. తాజాగా ఈ ప్రాజెక్టు గురించి ఓ ఆసక్తికర వార్త బాలీవుడ్‌ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ‘ధూమ్‌ 4’ సినిమా రూపొందించే ప్లాన్‌లో ఉంది యశ్‌ రాజ్‌ సంస్థ. గత చిత్రాలకు భిన్నంగా సినీ అభిమానులకు కొత్త అనుభూతి పంచేందుకు ‘ధూమ్‌ 4’లో ప్రతినాయకురాలి పాత్ర ఉండబోతుందట. ఆ పాత్ర చాలా ప్రత్యేకమైందని, అలాంటి వైవిధ్యభరిత పాత్రకు స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనె అయితే బావుంటుందని చిత్రబృందం భావిస్తున్నట్టు సమాచారం.

ఇప్పటికే దీపికతో చర్చలు జరిపారని, ఆమె స్క్రిప్టుపై ఇష్టంగా ఉందని తెలుస్తోంది. ఈ విషయంతోపాటు, కథానాయకుడు, దర్శకుల వివరాలకు సంబంధించి మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుంది. ముందు భాగాలకు మించిన యాక్షన్, స్టంట్స్, రేసులు అన్నీ ఇందులో రెండింతలు ఉంటాయని బాలీవుడ్‌ టాక్‌. షారుక్‌తో ‘పఠాన్‌ ’, హృతిక్‌తో ‘ఫైటర్‌’, ప్రభాస్‌–నాగ్‌ అశ్విన్‌  చిత్రం, శకున్‌  బాత్రా దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌... ప్రస్తుతం దీపిక చేతిలో ఉన్న సినిమాలు.
చదవండి: అసభ్య వ్యాఖ్యలు.. ట్రోలర్స్‌కు దీపిక చురకలు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement