
కొన్నేళ్ల ముందు వరకు సినీ తారలు తమ అనారోగ్య సమస్యల గురించి పెద్దగా బయటపెట్టేవారు కాదు. కానీ ఈ మధ్య కాలంలో ట్రెండ్ మారింది. మానసిక ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నారు. తమ అనుభవాల్ని కూడా చెబుతున్నారు. 'కల్కి' ఫేమ్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కూడా తన మానసిక కుంగుబాటు గురించి మరోసారి ఓపెన్ అయింది.
'2014లో కెరీర్ పరంగా మంచి ఫామ్ లో ఉన్నా. సినిమాలు చేస్తూ నచ్చినట్లు బతుకున్నా. ఓరోజు ఎందుకో బాగా అలసట అనిపించింది. పనివల్ల ఇలా జరుగుంటుంది అనుకున్నా కానీ ఓ రోజు కళ్లుతిరిగి పడిపోయాను. అనవసరమైన వాటికి విపరీతంగా ఏడ్చేదాన్ని. నేను నాలా ఉండలేకపోయాను. అమ్మతో కలిసి థెరపిస్ట్ దగ్గరికే వెళ్తే నాకు డిప్రెషన్ ఉన్నట్లు అర్థమైంది'
(ఇదీ చదవండి: కూతురి ఫోటోల్ని డిలీట్ చేసిన ఆలియా భట్! ఆ కారణం వల్లే!)
'అయితే థెరపిస్ట్ దగ్గరకు వెళ్లినా దాని గురించి ఎవరికీ చెప్పాలనుకోలేదు. అందుకే సీక్రెట్ గా థెరపీ చేయించుకున్నా. కోలుకుంటున్నప్పుడు మాత్రం మానసిక ఆరోగ్యం గురించి అందరికీ చెప్పాలనుకున్నాను. అలా నా సమస్య గురించి బయటపెట్టాను' అని దీపిక పదుకొణె చెప్పింది.
రీసెంట్ గా ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని 'పరీక్షా పే చర్చ' కార్యక్రమంలో పాల్గొన్న దీపికా.. మానసిక ఆరోగ్యం గురించి విద్యార్థులకు చెప్పుకొచ్చింది. ఇక సినిమాల విషయానికొస్తే.. గతేడాది కల్కి, సింగం ఎగైన్ మూవీస్ చేసింది. కూతురు పుట్టడంతో ఆమె ఆలనాపాలనా చూసుకుంటోంది.
(ఇదీ చదవండి: రెండు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్న 'బాపు')
Comments
Please login to add a commentAdd a comment