ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి మొదట్లో బ్యాడ్మింటన్ ప్లేయర్. జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొంది. కానీ సడన్‌గా బ్యాడ్మింటన్ వదిలేసి మోడల్‌గా మారిపోయింది. వెంటనే సినీ అవకాశాలూ తలుపుతట్టాయి. అలా 2006లో వెండితెరపై రంగప్రవేశం చేసింది. ఇప్పుడు ఇండియాలోనే స్టార్ హీరోయిన్‌గా చెలామణీ అవుతోంది. ఇంతకీ ఇప్పుడైనా ఆ పాపాయిని గుర్తుపట్టారా? తనే దీపికా పదుకొణె.
అప్పట్లో బ్మాడ్మింటన్ ప్లేయర్
1986 జనవరి 5న డెన్మార్క్‌లో భారత సంతతికి చెందిన ప్రకాశ్ పదుకొణె దంపతులకు దీపిక (Deepika Padukone) జన్మించింది. ప్రకాశ్ ఒకప్పుడు పేరు మోసిన బ్యాడ్మింటన్ ప్లేయర్. ఆమె తాతయ్య రమేశ్ మైసూర్ బ్యాడ్మింటన్ అసోసియేషన్‌కు సెక్రటరీగా సేవలందించాడు. దీపికకు ఏడాది వయసున్నప్పుడే ఫ్యామిలీ అంతా బెంగళూరులో సెటిలైంది. బ్యాడ్మింటన్ ఆటకే ఎక్కువ సమయం కేటాయించే దీపిక చిన్న వయసులోనే మోడల్‌గా పలు యాడ్స్ చేసింది.
మోడలింగ్ నుంచి సినిమాల్లోకి
నెమ్మదిగా తనకు గుర్తింపు, అవకాశాలు పెరుగుతూ ఉండటంతో బ్యాడ్మింటన్ మానేసి మోడలింగ్‌పైనే ఫుల్ ఫోకస్ పెట్టింది. తర్వాత సినీ ఛాన్సులూ రావడం మొదలైంది. దీంతో ఆమె ముంబైకి షిఫ్ట్ అయింది. 2006లో ఐశ్వర్య అనే కన్నడ చిత్రంతో వెండితెరకు హీరోయిన్‌గా పరిచయమైంది. ఇది తెలుగులో వచ్చిన మన్మథుడు మూవీకి రీమేక్! ఆ మరుసటి ఏడాది ఓం శాంతి ఓం చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఇది బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్టయింది. ఉత్తమ నటిగా మొదటి ఫిలిం ఫేర్ అవార్డు అందుకుంది.
(చదవండి: క్లీంకారను అప్పుడే అందరికీ చూపిస్తా!: రామ్‌చరణ్)
గతేడాది తల్లిగా ప్రమోషన్
ఓం శాంతి ఓం చిత్రంతో దీపికా దశ తిరిగిపోయింది. బచ్నా ఏ హసీనో, లవ్ ఆజ్ కల్, హౌస్‌ఫుల్, కాక్‌టైల్, రేస్ 2, యే జవానీ హై దీవాని, చెన్నై ఎక్స్‌ప్రెస్, రామ్ లీలా, హ్యాపీ న్యూ ఇయర్, పీకు, బాజీరావు మస్తానీ, పద్మావత్, పఠాన్ ఇలా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. కల్కి 2898 ఏడీ మూవీతో తెలుగువారికీ పరిచయమైంది. ఈ బ్యూటీ ఒక్క సినిమాకు రూ.20 కోట్ల మేర పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్‌ను 2018లో పెళ్లి చేసుకున్న ఈమె గతేడాది పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
అది కూడా ముఖ్యమేనంటూ..
మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమే అంటూ ద లైవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్‌ను స్థాపించింది. దీని ద్వారా భారత్‌లో మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ ఫౌండేషన్ అందించిన సేవలకుగానూ వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్ 2018లో క్రిస్టల్ అవార్డు ప్రకటించింది. 82°E అనే బ్యూటీ బ్రాండ్ కూడా స్థాపించింది.
చదవండి: సంక్రాంతి రేసులో మూడు సినిమాలు.. ఏపీలో టికెట్ ధరలు పెంపు
Comments
Please login to add a commentAdd a comment