ఈ సంక్రాంతికి మోత మోగిపోద్ది అంటూ ముగ్గురు హీరోలు ముందుకు వచ్చేస్తున్నారు. రామ్‌చరణ్ 'గేమ్ ఛేంజర్'తో జనవరి 10న, నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్'తో జనవరి 12న, వెంకటేశ్ 'సంక్రాంతికి వచ్చేస్తున్నాం'తో జనవరి 14న థియేటర్లలో సందడి చేయనున్నారు. రెండు రోజుల గ్యాప్‌తో వరుసగా మూడు చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలో ముగ్గురూ ప్రమోషన్ల స్పీడు పెంచారు.
అన్‌స్టాపబుల్ షోలో గేమ్ ఛేంజర్ టీమ్
ఇటీవలే డాకు మహారాజ్ టీమ్ అన్‌స్టాపబుల్ షోకి విచ్చేసింది. దర్శకుడు బాబీ, నిర్మాత నాగవంశీ, సంగీత దర్శకుడు తమన్ ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ జనవరి 3న రిలీజైంది. ఇప్పుడు అన్‌స్టాపబుల్ షోలోకి గేమ్ ఛేంజర్ టీమ్ రానుంది. రామ్‌చరణ్‌తో పాటు, నిర్మాత దిల్ రాజు షోలో సందడి చేశారు. ఈ మేరకు ప్రోమో రిలీజైంది.
(చదవండి: ఈ విషయం తెలిసుంటే 'బేబీ జాన్'లో నటించేదానినే కాదు: కీర్తి సురేష్)
మనవడు కావాలి!
వచ్చీరావడంతోనే చరణ్‌ను చిక్కుల్లో పడేశారు. ఈ ఏడాది మాకొక మనవడు కావాలంటూ తల్లి సురేఖ, నానమ్మ అంజనమ్మ కోరిక కోరారు. దానికి చెర్రీ చిరునవ్వుతోనే సమాధానం దాటవేశాడు. చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు.. ఈ ముగ్గురిలో ఎవరితో పార్టీకి వెళ్తావని బాలకృష్ణ అడగ్గా.. వీళ్లెవరితోనూ కాదు, అరవింద్‌తో పార్టీకి వెళ్తానని సమాధానమిచ్చాడు. అనంతరం క్లీంకార పుట్టిన సమయంలోని ఆనందకర క్షణాలను వీడియో వేసి చూపించడంతో చరణ్ భావోద్వేగానికి లోనయ్యాడు.
(చదవండి: సంక్రాంతి రేసులో మూడు సినిమాలు.. ఏపీలో టికెట్ ధరలు పెంపు)
కూతురికి చరణ్ గోరుముద్దలు
క్లీంకారకు చరణే అన్నం తినిపిస్తాడని, అతడు తినిపిస్తే కానీ పాప తినదని అంజనమ్మ చెప్పింది. పొద్దున రెండు గంటలు పాపకే సమయం కేటాయిస్తాను. తను ఎప్పుడైతే నన్ను నాన్న అని పిలుస్తుందో అప్పుడే అందరికీ క్లీంకారను చూపిస్తాను అని చెప్పుకొచ్చాడు. ఉపాసన అంటే భయమా? అన్న ప్రశ్నకు చరణ్.. నన్ను వదిలేయండంటూ చేతులెత్తి వేడుకున్నాడు. ఫుల్ ఎపిసోడ్ జనవరి 8న ఆహాలో విడుదల కానుంది.
సినిమా
గేమ్ ఛేంజర్ సినిమా విషయానికి వస్తే శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వాణీ కథానాయిక. అంజలి, శ్రీకాంత్, ఎస్‌జే సూర్య ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీలోని ఐదు పాటల కోసం ఏకంగా రూ.75 కోట్లు ఖర్చు చేశానని నిర్మాత దిల్ రాజు స్వయంగా వెల్లడించాడు. రెండు గంటల 45 నిమిషాల నిడివితో ఈ మూవీ రానుంది. వినయ విధేయ రామ తర్వాత చరణ్- కియారా జంటగా నటిస్తున్న రెండో చిత్రమిది.
చదవండి: 'డాకు మహారాజ్'కు తారక్ ఫ్యాన్స్ అన్ స్టాపబుల్ వార్నింగ్
Comments
Please login to add a commentAdd a comment